మాజీ మంత్రి మల్లారెడ్డికి ఈడీ నోటీసులు

  మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది.  పీజీ మెడికల్ సీట్ల అక్రమాలపై ఈడీ అధికారులు ఈ నోటీసులు జారీ చేశారు. మల్లారెడ్డి విద్యాసంస్థలపై  పలు ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. పూలమ్మినా, పాలమ్మినా అంటూ తన ట్రేడ్ మార్క్ డైలాగ్ తో బాగా పాపులర్ అయిన మల్లారెడ్డి నివాసాలు, కార్యాలయాలపై గత ఏడాది జూన్ నెలలో ఈడీ సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆయన విద్యాసంస్థల నిర్వహణలో ఆర్థిక అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతోసోదాలు నిర్వహించిన   ఈడీ  ఆ సందర్భంగా కీలక ఫైళ్లు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. కీలక డాక్యుమెంట్లతో పాటు హార్డ్ డిస్క్ లు, పెన్ డ్రైవ్ లనూ కూడా అప్పట్లో ఈడీ స్వాధీనం చేసుకుంది. ఇప్పుడు తాజాగా గురువారం (నవంబర్ 7)న నోటీసులు జారీ చేసింది. అప్పట్లో పీజీ మెడికల్ సీట్లను అక్రమంగా బ్లాక్ చేశారన్న అభియోగాలపై ఈడీ మబల్లారెడ్డి వివరణ కో రింది. తాజాగా నోటీసులు జారీ చేసింది. 

నాడు చంద్ర‌బాబు.. నేడు లోకేశ్‌.. అడుగులు ప్రగతి దారులు

ఏపీ అన్ని రంగాల్లో ముందుండాలి.. దేశంలోనే కాదు.. ప్ర‌పంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన దేశాల‌తో పోటీప‌డాలి.. ప్ర‌పంచంలోని ప్ర‌ముఖ కంపెనీలు  ఏపీలో పెట్టుబ‌డులు పెట్టాలి.  ఆంధ్రప్రదేశ్ యువ‌త‌కు మెరుగైన ఉద్యోగ అవ‌కాశాలు ద‌క్కాలి.. ప్రతి కుటుంబంలో ఒక ఎంట్రపెన్యూర్ ఉండాలి. మొత్తంగా ఆంధ్రప్రదేశ్  ఆర్థికంగా బ‌లోపేతం అవ్వాలి. పేదరికం లేని రాష్ట్రంలో నిలవాలి.  అందుకోసం నేను ఎంతైనా  క‌ష్ట‌ప‌డ‌తా.. ఇదీ సీఎం చంద్రబాబు నాయుడు మైండ్ సెట్. ఆయ‌న కేవ‌లం మాట‌ల‌కే ప‌రిమితం కాలేదు.. హైద‌రాబాద్ న‌గ‌రాన్ని ఐటీకి కేంద్రంగా మార్చిన ఘ‌న‌త చంద్ర‌బాబుది. దేశంలోనే ప్ర‌ముఖ న‌గ‌రాల్లో హైద‌రాబాద్ ఒక‌ట‌ని ఈనాడు చెప్పుకుంటున్నామంటే అది చంద్ర‌బాబు వ‌ల్ల‌నే సాధ్య‌మైంది. ఈ విషయాన్ని ఆయన ప్రత్యర్థులు సైతం అంగీకరిస్తారు.  జనం కూడా అదే చెబుతారు. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం విడిపోయిన త‌రువాత.. ఏపీలో చంద్ర‌బాబు సీఎం అయ్యారు. అమ‌రావ‌తిని రాజ‌ధానిగా ప్ర‌క‌టించి.. ప్ర‌పంచంలోనే బెస్ట్ సిటీగా అమ‌రావ‌తిని తీర్చిదిద్దేందుకు ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టారు. ఈ క్ర‌మంలో అమ‌రావ‌తి కేంద్రంగా ప్ర‌ముఖ ఐటీ కంపెనీలు పెట్టుబ‌డులు పెట్టేలా ప్ర‌య‌త్నాలు చేశారు.  అమెరికా వెళ్లి అక్క‌డి వీధుల్లో తిరుగుతూ ప్ర‌పంచంలో పేరుపొందిన ప్ర‌తీ కంపెనీ గ‌డ‌పా తొక్కారు. ఏపీలో పెట్టుబ‌డులు పెట్టేలా వారిని ఒప్పించారు. అయితే, 2019 త‌రువాత వైసీపీ అధికారంలోకి రావ‌డంతో సీన్ మొత్తం మారిపోయింది. జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత అమ‌రావ‌తి రాజ‌ధానిని నిర్వీర్యం చేసే ప్ర‌య‌త్నం చేశారు. ఆ ప్రాంతాన్ని స్మ‌శానం అంటూ వైసీపీ నేత‌లు వ్యాఖ్య‌లు చేశారు. చంద్ర‌బాబు  హ‌యాంలో ప‌లు ప్ర‌ముఖ కంపెనీల‌తో చేసుకున్న ఒప్పందాల‌ను ర‌ద్దు చేశారు. రాష్ట్రంలో పెట్టుబ‌డులు పెట్టిన ప‌లు కంపెనీలు ఏపీని వ‌దిలి వెళ్లిపోయేలా జ‌గ‌న్ స‌ర్కార్ వ్య‌వ‌హ‌రించింది. మ‌రోవైపు అమ‌రావ‌తి కాదు.. ఏపీకి మూడు రాజ‌ధానులు అంటూ ప్ర‌క‌టించిన జ‌గ‌న్ తన ఐదేళ్ల హయాంలో ఆ దిశగా ఒక్క అడుగు కూడా వేయలేదు. కానీ ఆ పేరు చెప్పి రాష్ట్రంలోని మూడు ప్రాంతాలలోనూ అభివృద్ధి ఆనవాలు లేకుండా చేశారు.  దీంతో జనం జగన్ పాలనను ఛీకొట్టి 2024లో మ‌ళ్లీ తెలుగుదేశం  కూట‌మికి పట్టం గట్టారు. వైసీపీని ఛీ కొట్టారు. జగన్ పాలన పట్ల ప్రజలలో ఎంతగా వ్యతిరేకత వ్యక్తం అయ్యిందనడానికి ఆ పార్టీ కేవలం 11 స్థానాలకే పరిమితం కావడమే తార్కానం. రాష్ట్రంలో చంద్రబాబు  ప్ర‌భుత్వం పగ్గాలు చేపట్టడంతోనే  ఏపీ  మ‌ళ్లీ పూర్వ‌వైభ‌వం దిశగా పరుగులు పెడుతోంది. ఐదేళ్లు ముళ్ల కంప‌తో నిండిపోయిన అమ‌రావ‌తి ప్రాంతంలో  ప‌నులు జోరందుకున్నాయి.  కేంద్రం కూడా ఇతోధికంగా  స‌హ‌కారం అందిస్తుండ‌టంతో రాబోయే కాలంలో అమ‌రావ‌తి రాజ‌ధానిని అద్భుతంగా త‌యారు చేసేలా చంద్ర‌బాబు నాయుడు ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టారు.  అయితే అప్ప‌ట్లో ప్ర‌ముఖ కంపెనీలు ఏపీలో పెట్టుబుడులు పెట్టేలా అమెరికా వెళ్లి ప్ర‌య‌త్నాలు చేసిన చంద్ర‌బాబు,  ఇప్పుడు ఆ బాధ్య‌త‌ను ఐటీ మంత్రి లోకేశ్ కు అప్ప‌గించారు.   ఆ బాధ్యతను చిత్తశుద్ధితో చేపట్టిన మంత్రి నారా లోకేశ్ ఇటీవ‌ల అమెరికా ప‌ర్య‌ట‌న‌కు వెళ్లారు. ఏపీలో పెట్టుబడులే లక్ష్యంగా వారంరోజుల పాటు లోకేశ్‌ అమెరికాలో పర్యటించారు. ఈ క్రమంలోనే అక్క‌డ జ‌రిగిన ఐటీ సమ్మిట్-2024 లో పాల్గొన్న లోకేశ్‌.. పలు దిగ్గజ సంస్థల సీఈవోలతో భేటీ  అయ్యారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. ఓవరాల్ గా అమెరికా పర్యటనలో 100కు పైగా దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో లోకేశ్‌ భేటీ అయ్యి ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం పలికారు. ఏపీలో ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ ప్రభుత్వం ఉందని పెట్టుబడిదారుల్లో నమ్మకం కలిగించడంలో లోకేశ్‌ వంద శాతం సక్సెస్ అయ్యారు. దీంతోపాటు చంద్రబాబు విజన్ ను కంపెనీల సీఈవోల‌కు వివ‌రించి వారు ఇప్ర‌స్ అయ్యేలా చేశారు. బ్రాండ్ ఏపీ లక్ష్యంగా సాగిన ఆయ‌న టూర్ గ్రాండ్ సక్సెస్ అయింది. లోకేశ్‌ ప్రతిపాదనలపై పలు దిగ్గజ కంపెనీలు సానుకూలంగా స్పందించాయి. లోకేశ్‌ పర్యటన విజయవంతం కావడంపై ఏపీ పారిశ్రామిక వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఐదు సంవత్సరాల అరాచక పాలనలో శిథిలావస్థకు చేరిన ఏపీ పారిశ్రామిక రంగానికి లోకేశ్ ఊపిరిపోశారని అంటున్నాయి. ప్ర‌పంచంలో పేరున్న కంపెనీలు ఏపీలో పెట్టుబ‌డులు పెట్టేలా నాడు చంద్ర‌బాబు అమెరికా వీధుల్లో న‌డిస్తే.. నేడు లోకేశ్  అమెరికా ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన స‌మ‌యంలో కాలిన‌డ‌క‌న న‌డుకుంటూ వెళ్లి ప్ర‌ముఖ కంపెనీల ప్ర‌తినిధుల‌తో భేటీ అయ్యారు. దీంతో తండ్రికి త‌గ్గ త‌న‌యుడు.. ఏపీ అభివృద్ధే వారి ల‌క్ష్యం అంటూ ఏపీ ప్ర‌జ‌లు హ‌ర్షాతిరేకాలు వ్య‌క్తం చేస్తున్నారు.  వైసీపీ హ‌యాంలో ఏపీ అన్నిరంగాల్లో వెనుక‌బ‌డి పోయింది. కొత్త‌గా ఏపీలో పెట్టుబ‌డులు పెట్టేందుకు ఎవ‌రూ మొగ్గుచూప‌క పోగా.. చంద్ర‌బాబు హ‌యాంలో ఏపీలో ఏర్పాటైన కంపెనీలు వెన‌క్కు వెళ్లిపోయేలా జ‌గ‌న్ ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రించింది. దీంతో నిరుద్యోగుల‌కు ఉద్యోగావ‌కాశాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉద్యోగంకోసం హైద‌రాబాద్‌, బెంగ‌ళూరు ప్రాంతాల‌కు త‌ర‌లివెళ్లిపోయారు. జ‌గ‌న్ ఐదేళ్ల అరాచ‌క పాల‌న‌లో తీవ్రంగా న‌ష్ట‌పోయిన ఏపీని.. మ‌ళ్లీ గాడిలో పెట్టేందుకు చంద్ర‌బాబు ఆధ్వ‌ర్యంలోని కూట‌మి ప్ర‌భుత్వం ప‌ని చేస్తుంది. త‌ద్వారా రాబోయేకాలంలో అమ‌రావ‌తి కేంద్రంగా పెద్ద మొత్తంలో ప్ర‌ముఖ కంపెనీలు పె్ట్టుబ‌డులు పెట్టేందుకు సిద్ధ‌మ‌వుతుండ‌గా.. కంపెనీల‌కు కావాల్సిన వ‌స‌తి సౌక‌ర్యాలు, ఇత‌ర బెనిఫిట్స్  క‌ల్పించేందుకు ప్ర‌భుత్వం చ‌ర్య‌లు చేప‌డుతోంది. మొత్తానికి మ‌రికొద్దిరోజుల్లో ఏపీ రూపురేఖ‌లు మారిపోతాయ‌న‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తి లేదు.

నవంబర్ 9 నుంచి కోటి దీపోత్సవం..డోంట్ మిస్!

కార్తీక మాసాన్ని హిందువులందరూ అత్యంత పవిత్రమైన మాసంగా భావిస్తూ ఉంటారు. శివ కేశవులకు   అత్యంత ప్రీతిపాత్రమైన మాసంగా కార్తీక మాసం గురించి ఎంతో విశిష్టంగా చెబుతూ ఉంటారు. ఇక హైదరాబాదులో కార్తీకమాసం అనగానే హిందువులందరికీ  కోటి దీపోత్సవం కార్యక్రమం జ్ఞప్తికి రాకుండా ఉండదు. హైదరాబాదులో ఏటా అత్యంత వైభవంగా, ఆధ్యాత్మికత ఉట్టిపడేటట్టుగా జరిగే కోటి దీపోత్సవం ఈ ఏడాది కూడా జరగనుంది.   నవంబర్ 9వ తేదీ నుంచి  25వ తేదీ వరకు అత్యంత వైభవంగా కన్నుల పండుగగా కార్తీక కోటి దీపోత్సవాన్ని నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది..  2012లో శృంగేరి పీఠాధిపతి జగద్గురు భారతీ తీర్థ మహాస్వాముల వారి అమృత హస్తాల మీదుగా ప్రారంభమైన కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్విరామంగా నిర్వహిస్తూ వస్తున్నారు.  ఈ ఏడాది కూడా భక్త జనం ఒళ్ళు పులకరించేలా హైదరాబాదులోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా కార్యక్రమాన్ని నిర్వహించడానికి సర్వం సిద్ధమైంది. ఈ ఏడాది 17 రోజులపాటు అనేక కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళికల సిద్ధం చేశారు. శివకేశవులని ఒకే వేదికపై కోటీదీపాల మధ్య దర్శించుకునే యోగమే ఈ కోటి దీపోత్సవం. జనం గుండె లోతుల్లో దాగిన భక్తిభావాలను వెలికి తీసే పవిత్ర కార్యంగా ఈ కోటిదీపోత్సవంను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి దేశం నలుమూలల నుంచి పీఠాధిపతులు, మహాయోగులు, ఆధ్యాత్మికవేత్తలు తరలి వస్తుండగా వారి ప్రవచనామృతంతో మొదలై,  ప్రత్యేక అర్చనలతో పవిత్రత సంతరించుకుని, దేవదేవుల కళ్యాణ మహోత్సవాలు, లింగోద్భవం, నీరాజనాలతో భక్తులకు నిండైన ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచే ఈ మహోత్సవాన్ని కనులారా వీక్షించడం ఒక గొప్ప అదృష్టం. ప్రతిరోజు కళ్యాణ మహోత్సవం అనంతరం ఉత్సవ విగ్రహాల ఊరేగింపు చూసి తరలించాల్సిందే తప్ప వర్ణించడానికి మాటలు లేవు. రావు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల దేవతామూర్తులను చూసి భక్తకోటి పులకించిపోయే అద్భుత దృశ్యం ఈ కోటిదీపోత్సవంలో ప్రతిరోజూ సాక్షాత్కారమవుతుంది. కోటి దీపాల మహోత్సవాన్ని చూసేందుకు రెండు కళ్ళు చాలవనడంలో ఎలాంటి సందేహం లేదు. నవంబర్ 9 నుంచి ప్రారంభం కాబోతున్న ఈ వేడుకను నవంబర్ 25వ తేదీ వరకు హైదరాబాదులోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నారు.

పవన్ కళ్యాణ్ ను కలవడానికే  ఎపిలో అఘోరీ

అఘోరీలు  సాధారణంగా జనబాహుళ్యంలో ఉండరు.సికింద్రాబాద్ ముత్యాలమ్మ దేవాలయంలో జరిగిన ఘటన నేపథ్యంలో నగరవాసులకు అఘోరీ పరిచయమయ్యారు. తాను ఏడేళ్ల ప్రాయం నుంచే కాశీలోనే ఉంటున్నానని చెప్పుకున్న మంచిర్యాలకు చెందిన  వివాదాస్పద అఘోరీ తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారారు. తెలం గాణ పోలీసులు తరిమి వేయడంతో అఘోరీ కొత్త మార్గాన్ని వెతుకున్నారు. ట్రాన్స్ జెండర్ నుంచి అఘోరీగా మారిన శ్రీనివాస్ అలియాస్ పింకి ఇప్పుడు  ఎపిలో ఎంటర్ అయ్యారు.  సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడిలో  అమ్మవారిని ధ్వంసం చేసినందున జనారణ్యంలో అడుగు పెట్టానని చెప్పుకున్న  అఘోరీ  కొద్ది రోజుల్లోనే సనాతన ధర్మం స్టాండ్ ను తీసుకుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సనాతన ధర్మం పరిరక్షించడం లేదని అఘోరీ ఆరోపిస్తుంది.ముఖ్యమంత్రి పదవి ఊడగొడతానని ఢాంబికాలు చెప్పుకున్న అఘోరీ ఎపిలో ప్రవేశించడం చర్చనీయాంశమైంది. తెలంగాణలో అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకునే  బోనాల పండుగ సందర్బంగా రంగం కార్యక్రమం ఉంటుంది. రంగం చెప్పే వారిని అత్యత భక్తి శ్రద్దలతో పూజిస్తారు. రంగంలో రాజకీయాలు, ఆర్థికపర విషయాలను జోస్యం చెబుతారు. కానీ అఘోరీ విషయంలో తెలంగాణ ప్రజలు పెద్దగా ఓన్ చేసుకోలేదని తెలుస్తోంది. ముత్యాలమ్మ గుడి వివాదం పెద్ద ఎత్తున ప్రచారం చేసినప్పటికీ  అఘోరీని తెలంగాణ ప్రజలు పట్టించుకోలేదు. హిందువులను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసినప్పటికీ హిందుత్వ వాదులు ఆమెను పట్టించుకోలేదు.   ఏ రాజకీయ పార్టీ కూడా పెద్దగా స్పందించలేదు. దీంతో అఘోరీ గత నెలలో కేదార్ నాథ్  బయలు దేరి వెళ్లారు. నవంబర్ ఒకటో తేదీన  సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడి వద్ద ఆత్మార్పణం చేసుకుంటానని చెప్పిన అఘోరీ  తెలంగాణ పోలీసులను ముచ్చెమటలు పట్టించారు. తన కారులో పెట్రోల్ క్యాన్ లతో అఘోరీ  కనిపించడంతో  అరెస్ట్ చేసి మహరాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన వాంకిడిలో వదిలేసారు. అఘోరీ నాగ్ పూర్ హైవే మీదుగా కేదార్ నాథ్ వెళతారని  పలువురు ఊహించారు. కానీ ఆమె అనూహ్యంగా ఎపి బాట పట్టారు. ఎపిలోని అనేక శై వ క్షేత్రాలను దర్శించుకుంటున్నారు. అఘోరీ రోజు రోజుకు తన అటైర్ మార్చేసుకుంటున్నారు. తెలంగాణలో నగ్నంగా విభూతితో కనిపించిన అఘోరీ ఎపిలో  మాత్రం అర్ధనగ్నంగా కనిపిస్తున్నారు. చేతిలో త్రిశూలం, కమండలంతో కనిపిస్తున్నారు. అఘెరీని చూడటానికి  వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతోంది.సనాతన ధర్మం కాపాడుకుందాం అని నినదిస్తున్నారు. గోమాతను రక్షించుకుందాం అని ఆమె పదే పదే అంటున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో సనాతన ధర్మ ప్రచారం చేయాలని అఘోరీ ఆలోచిస్తున్నట్టు కనబడుతోంది. సనాతన ధర్మ పరిరక్షణకు ఉద్యమిస్తున్న  డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్ కు కలవడానికి ఆమె ఎపికి వచ్చినట్లు తెలుస్తోంది. తెలంగాణలో అఘోరీకి ట్రాన్స్ జెండర్లు తీవ్రంగా  వ్యతిరేకించారు. అనేక ప్రజా సంఘాలు అఘోరీ ని వ్యతిరేకించాయి.  కొన్ని యూట్యూబ్ చానెల్స్ అఘోరీకి హైప్ తీసుకొచ్చాయి. వ్యూస్ కోసమే అఘోరీ వెంట పడ్డారన్న అపవాదు సోషల్ మీడియా మూఠ గట్టుకుంది. తెలంగాణ నుంచి తరిమివేయబడ్డ అఘోరీ మహరాష్ట్ర నుంచి సరాసరి ఆంధ్ర ప్రదేశ్ లో ప్రవేశించారు. సనాతన ధర్మ పరిరక్షణకు కమిటీ వేయాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు.  తిరుమలలో కల్తీ లడ్డు వెలుగులోకి వచ్చిన తర్వాత  పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షచేపట్టిన సంగతి తెలిసిందే. సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్  గత కొన్ని రోజులుగా తరచూ మాట్లాడుతున్నారు. కానీ పవన్ కళ్యాణ్ ఈ అఘోరీని ఎంటర్ టైన్  చేయకపోవచ్చని  పరిశీలకులు అంటున్నారు. అఘోరీ  వెనక కొందరు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వ్యాపార ప్రయోజనాల కోసమే  తెరమీదరకు వచ్చినట్లు వార్తలు వెలువడుతున్నాయి. అఘోరీ మెయిన్ టైన్ చేసే  విలువైన ఐ ఫోన్లు, ఐ 20 కారు  అంతా వారే చూసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. 

నవ్వుల పాలౌతున్నా ఆగని వైసీపీ ఫేక్ ప్రచారాలు!

నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్లుగా ఉంది వైసీపీ ధోరణి. ఆ పార్టీ సోషల్ మీడిాయా వేదికగా అసత్యాలు, అభూతకల్పనలతో జనాలను మభ్యపెట్టాలని చేస్తున్న ప్రయత్నాలు నవ్వులపాలై, పార్టీ పరువును నిలువునా ముంచేస్తున్నది. అయినా వైసీపీ తీరు మార్చుకోవడానికి ప్రయత్నించడం లేదు. తాజాగా సచివాలయంలో సిఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన బుధవారం కేబినెట్ భేటీ జరిగింది. ఓ వైపు మంత్రివర్గ సమావేశం జరుగుతుండగానే, వైసీపీ సరికొత్త ఫేక్ ప్రచారం మొదలెట్టింది. అత్యంత కీలకమైన కేబినెట్ భేటీకి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ డుమ్మా కొట్టారంటూ తన సోషల్ మీడియాలో పోస్టులు గుప్పించింది. ఒక వైపు కబినెట్ భేటీ జరుగుతుండగా పవన్ కల్యాణ్ హస్తిన వెళ్లడమేంటి? కేంద్ర మంత్రితో భేటీ కావడమేంటి? అంటూ ప్రశ్నలు గుప్పించింది.   చంద్రబాబు హస్తిన పర్యటనపై చంద్రబాబు తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారనీ, పవన్ కల్యాణ్ హస్తిన పర్యటనపై, ఆయన కదలికలపై నిఘా పెట్టారనీ, ఆరాలు తీస్తున్నారంటూ తన కల్పనా చాతుర్యాన్ని ప్రదర్శించింది. వాస్తవానికి  కేబినెట్ భేటీలో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఆ  భేటీలో తాను రాష్ట్రంలో పోలీసుల తీరుపై చేసిన వ్యాఖ్యలకు కారణాలేమిటో సవిరంగా చెప్పారు.   జిల్లా ఎస్పీలకు మంత్రులు ఫోన్‌ చేస్తే కనీసం స్పందించడం లేదని, ఒకవేళ స్పందించినా ఏదైనా సమస్య గురించి అడిగితే సీఐ, ఎస్ఐలే అందుకు బాధ్యులంటూ బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారనీ  సీఎం దృష్టికి తీసుకువచ్చారు.  ఆ  కారణంగానే తాను  మాట్లాడాల్సి వచ్చిందని ఇచ్చారు.  సోషల్ మీడియాలో వైసీపి తమపైనా, ప్రభుత్వంపైనా, చివరికి ఇళ్ళలో ఉండే తమ ఆడవాళ్ళపైనా కూడా  అసభ్యకరంగా పోస్టులు పెడుతుంటే సంబంధిత పోలీస్ అధికారులు పిర్యాదులు చేస్తున్నా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పవన్‌ కళ్యాణ్‌ ఫిర్యాదు చేశారు. కేబినెట్ భేటీలో ఓ వైపు పవన్‌ కళ్యాణ్‌  వైసీపి దుష్ప్రచారం గురించి, వారికి అండగా నిలుస్తున్న పోలీస్ అధికారుల గురించే మాట్లాడుతుంటే, వైసీపీ సోషల్ మీడియా మాత్రం పవన్ కల్యాణ్ కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టి హస్తినలో చంద్రబాబుపై అమిత్ షాకు ఫిర్యాదు చేయడానికి వెళ్లారంటూ  దుష్ప్రచారం చేసింది.    వైసీపీ సోషల్ మీడియా వింగ్ లో చేస్తున్న ఫేక్ ప్రచారంపై జనం నవ్వుకుంటున్నారు. ఆ పార్టీ తీరే అంత.. ఇక మారదు అంటూ పట్టించుకోవడం మానేశారు. అయినా వైసీపీలో మార్పు రావడం లేదు. ఇప్పటికే ఇక దిగజారడానికి ఏం మిగలలేదన్నట్లుగా దిగజారిపోయిన ఆ పార్టీ ఇంకెన్ని పతనాలను చూడాల్సి వస్తుందోనన్న చర్చ రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది. 

జేడీ వాన్స్ దంపతులకు చంద్రబాబు ఆహ్వానం

అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో రిప‌బ్లిక‌న్ పార్టీ విజ‌య‌ఢంకా మోగించింది. దీంతో డొనాల్డ్ ట్రంప్ రెండోసారి యూఎస్ అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌కు వివిధ దేశాధినేత‌ల‌తో పాటు రాజ‌కీయ నాయ‌కులు, ప్రముఖులు అభినందనలు తెలియజేస్తున్నారు.   అలాగే ఏపీ ముఖ్యమంత్రి చంద్ర‌బాబు కూడా ట్రంప్‌కు అభినంద‌నలు తెలిపారు.  అదే విధంగా అమెరికా ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న జేడీ వాన్స్ కు కూడా చంద్రబాబు ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ మూలాలున్న ఉషా వాన్స్ ఆయన భార్య కావడం తమకు గర్వకారణమని పేర్కొన్నారు. ఉషా వాన్స్ విజయం చారిత్రాత్మకం ఆంధ్రప్రదేశ్‌లో మూలాలున్న ఉషా వాన్స్, అమెరికా రెండవ మహిళగా సేవలందించ‌బోతుండటం తెలుగువారందరికీ గర్వకారణం అని చంద్రబాబు మేర్కొన్నారు.  అమెరికా ఉపాధ్యక్షుడు జేడీవాన్స్ దంపతులను ఏపీకి ఆహ్వానించే అవకాశం కోసం ఎదురు చూస్తున్నానంటూ చంద్రబాబు తన అభినందన సందేహంలో పేర్కొన్నారు.  

బోరుగడ్డకు రాచమర్యాదలు.. ఏడుగురు పోలీసులపై సస్పెన్షన్ వేటు

ఓ వైపు రాష్ట్రంలో పోలీసుల పనితీరుపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. వైసీపీ హయాంలో దారుణాలకు పాల్పడ్డ వారి పట్ల మరీ మెతకగా వ్యవహరిస్తున్నారని ఆరోపించడమే కాకుండా, ఇప్పటికీ రాష్ట్రంలో పోలీసు అధికారులు కొందరు వైైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తుంటే.. మరో వైపు రాష్ట్రంలో కొందరు పోలీసు అధికారులు, పోలీసుల తీరు ఆ ఆరోపణలకు బలం చేకూర్చేలా ఉంది.  వైసీపీ సోషల్ మీడిాయా యాక్టివిస్ట్ వర్రా రవీంద్ర రెడ్డిని కడప జిల్లా పులివెందలలో  అదుపులోనికి తీసుకున్న పోలీసులు కడపకు తీసుకువచ్చి 41ఏ నోటీసులు ఇచ్చి వదిలివేయడం, ఆ నోటీసులు అందుకు బయటకు వచ్చిన వర్రా రవీద్రరెడ్డి ఆచూకీ లేకుండా పరారైపోవడంపై ప్రభుత్వం సీరియస్ అయిన సంగతి తెలిసిందే. కడప ఎస్పీపై బదిలీ వేటు కూడా వేసింది.  అలాగే రిమాండ్ ఖైదీగా ఉన్న బోరుగడ్డ అనీల్ కు పోలీసులు రాచమర్యాదలు చేసిన సంఘటన కూడా సంచలనం రేపింది. అలా బోరుగడ్డ అనీల్ కు రాచమర్యాదలు చేసి రెస్టారెంట్లో విందు భోజనం తినిపించిన పోలీసు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు పడింది. ఓ కేసులో విచారణకు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న బోరుగడ్డ అనీల్ ను పోలీసులు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి బుధవారం తీసుకువచ్చి మంగళగిరి కోర్టులో హాజరు పరిచారు. విచారణ పూర్తై తిరిగి జైలుకు తరలిస్తుండగా మార్గ మధ్యంలో గన్నవరంలోని ఓ రెస్టారెంట్ లో భోజనాలు చేశారు. ఈ దృశ్యాలను సెల్ ఫోన్ లో  రికార్డు చేస్తున్న తెలుగుదేశం కార్యకర్తల నుంచి ఫోన్ లాక్కున్న పోలీసులు ఆ వీడియో డిలీట్ చేశారు. అయితే ఆ రెస్టారెంట్ లో ఉన్న సీసీ కెమేరా ఫుటేజీలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నిందితుడు బోరుగడ్డ అనీల్ కు పోలీసుల విందు భోజనం అంటూ నెటిజనులు తెగ ట్రోల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసు అధికారులు స్పందించి విధినిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ఏడుగురు పోలీసులపై సస్పెన్షన్ వేటు వేశారు. బోరుగడ్డ అనిల్ కు రెస్టారెంట్ లో భోజనం పెట్టించిన సమయంలో విధినిర్వహణలో ఉన్న ఏడుగురు పోలీసులను సస్పెండ్ చేస్తూ గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. 

ఏపీ సీఐడీ మాజీ చీఫ్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. కర్మఫలం అనుభవించక తప్పదుగా?

జగన్ హయాంలో కొందరు ఐపీఎస్ అధికారులు రాజును మించిన రాజభక్తి ప్రదర్శించారు. స్వార్థ ప్రయోజనాల కోసం తమ విధులను విస్మరించి ఏలిన వారి సేవలో తరించడమే పరమార్ధంగా భావించారు. జగన్ అధికారం శాశ్వతమన్న భ్రమల్లో ఆయన మెప్పు కోసం నానా గడ్డీ కరిచారు. పనిలో పనిగా సొంత లబ్ధి కోసం అడ్డదారులు తొక్కి అక్రమ సంపాదనకు తెరతీశారు.  ఇప్పుడు జగన్ సర్కార్ పతనమై తెలుగుదేశం కూటమి కొలువుదీరింది. దీంతో వైసీపీ కార్యర్తల్లా వ్యవహరించిన అధికారులు జగన్ అండ చూసుకుని చేసిన అరాచకాలకు మూల్యం చెల్లించుకోవలసిన పరిస్థతి ఏర్పడింది. ఇప్పటికే పలువురు అధికారులకు పోస్టింగులు ఇవ్వలేదు. వారి పాపాలు, అకృత్యాలకు చట్టం ముందు దోషిగా నిలబడక తప్పని పరిస్థితి ఎదురైంది. అలాంటి వారిలో ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సంజయ్ ఒకరు. ఇప్పటికే లూప్ లైన్ లో ఉన్న సంజయ్ ఇప్పుడు కేసులు, విచారణలు ఎదుర్కొని కటకటాలు లెక్కించక తప్పని పరిస్థితిలో ఉన్నారు.   తాము అఖిల భారత సర్వీసు అధికారులమని మరిచి.. అప్పటి ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లల్లా నడుచుకుని, వాళ్లు చూసి రమ్మంటే కాల్చి వచ్చిన చందంగా రెచ్చిపోయిన అధికారులంతా ఇప్పుడు ఎప్పుడు ఏ కేసులో అరెస్టు అవుతామా అన్న భయంతో వణికి పోతున్నారు. అలాంటి వారిలో ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సంజయ్ ఒకరు.   కూటమి సర్కారు అధికార పగ్గాలు చేపట్టిన తరువాత సంజయ్‌కి పోస్టింగ్ ఇవ్వలేదు.  అంతే కాదు.. పలు అక్రమాల్లో అడ్డంగా దొరికిన ఆయనపై చర్యలకు ఇప్పుడు రంగం సిద్ధం అయ్యింది.  సంజయ్‌ అక్రమాల చిట్టా మామూలుగా లేదు. వివిధ శాఖల అధిపతిగా ఉన్నప్పుడు ఆయన వ్యవహరించిన తీరు..చేసిన అవినీతి, అక్రమాలు అన్నీ ఒక్కటొక్కటిగా బయటికి వస్తున్నాయి.  సంజయ్‌ ఫైర్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌గా పని చేసినప్పుడు..అధికార హోదాను అడ్డుపెట్టుకొని కోటి రూపాయలు దుర్వినియోగం చేశారు. ఆ విషయాన్ని  విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం తేల్చింది. సౌత్రిక టెక్నాలజీస్‌ అండ్‌ ఇన్‌ఫ్రా ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే సంస్థతో కుమ్మకై ఆ సంస్థకు అప్పనంగా చెల్లింపులు చేసినట్లు తేలింది.  బిడ్డింగ్‌లో రిగ్గింగ్‌ చేయడంతో పాటు టెండర్లు కట్టబెట్టడంలో  నిబంధనలను బేఖాతరు చేసినట్లు  గుర్తించిన విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫో ర్స్‌మెంట్‌ విభాగం ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. సంజయ్‌పై కేంద్ర సివిల్‌ సర్వీస్‌ రూల్స్‌ ప్రకారం చర్యలు తీసుకోవాలని  సిఫార్సు చేసింది.   ఫైర్ సేఫ్టీ డైరెక్టర్ జనరల్ గా ఉన్న సమయంలో సంజయ్ ఆ శాఖలో ఐపాడ్‌లు, ల్యాప్‌టాప్‌ల కొనుగోళ్లలోనూ అక్రమాలకు పాల్పడ్డారు. టెండర్లు, కాంపిటీటివ్‌ బిడ్లు లేకుండానే  తన ఇష్టారీతిగా ఆర్డర్లు ఇచ్చేశారు.  బిల్లులూ సబ్‌మిట్‌ చేయలేదు.  వెబ్‌సైట్, మొబైల్‌ యాప్‌ డెవలప్‌మెంట్, ట్యాబ్‌ల సరఫరా కోసం భారీగా బిల్లులు చెల్లించేశారు. అంతే కాదు ఎస్సీ, ఎస్టీలకు చట్టాలపై అవగాహన కల్పిస్తానంటూ తనకు తానుగా ఓ భారీ బాధ్యతను తీసుకున్న సంజయ్ అప్పటి జగన్ సర్కార్ నుంచి ఏకంగా కోటి రూపాయలు దండుకున్నారు.  ఆ సొమ్ములో ఆయన ఎస్సీఎస్టీలకు చట్టాలపై అవగాహనా కార్యక్రమాలంటూ ఖర్చు చేసింది కేవలం మూడు లక్షల ర ూపాయలు మాత్రమే.  ఈ విషయాలన్నీ విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ నివేదిక తేల్చిన విషయాలే.   ఇక తనను ఏరి కోరి సంజయ్ ను సీఐడీ చీఫ్‌ పిలిచి పీఠం ఎక్కించిన జగన్ మెప్పు కోసం ఆయన స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్టు విషయంలో అత్యుత్సాహం చూపిన సంగతి విదితమే.  సరే అడ్డగోలుగా, కనీసం నోటీసు ఇవ్వకుండా, కారణం కూడా చెప్పకుండా చంద్రబాబును అరెస్టు చేసిన తరువాత సంజయ్ వ్యవహరించిన తీరు మరింత దారుణంగా ఉంది. చంద్రబాబు అక్రమ అరెస్టు సక్రమమే అని చెప్పేందుకు నానా రకాలుగా ప్రయత్నించారు. అప్పటి అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలుతో కలిసి హస్తినలో ఏకంగా మీడియా సమావేశం పెట్టి మరీ చంద్రబాబు అరెస్టును సమర్థించుకునేందుకు ప్రయత్నించారు. ఈ విషయంలో ప్రభుత్వోద్యోగిగా తన పరిమితులను కూడా ఆయన అధిగమించేశారు.  ఇప్పుడు నాటి పాపాలకు శిక్ష అనుభవించడానికి ఎదురు చూస్తున్నారు. విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ నివేదిక ప్రకారం ఐపీఎస్ సంజయ్ పై చర్యలకు రంగం సిద్ధమైందంటున్నారు. 

ఏపీలో వాడిపోతున్న కమలం.. బీజేపీ హైకమాండ్ ఏం చేస్తోంది?

దేశ‌వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో భార‌తీయ జ‌న‌తా పార్టీ బ‌లోపేతానికి ఆ పార్టీ పెద్ద‌లు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. రాష్ట్రాల వారిగా పార్టీని అధికారంలోకి తీసుకొస్తూ ఒక్కో రాష్ట్రాన్ని త‌మ ఖాతాలో వేసుకుంటున్నారు. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వ‌చ్చిన బీజేపీ.. ద‌క్షిణాది రాష్ట్రాల్లోనూ పాగా వేసేందుకు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ముఖ్యంగా త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క‌, తెలంగాణ రాష్ట్రాల్లో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు బీజేపీ పెద్ద‌లు వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారు. తెలంగాణలో రోజురోజుకు బీజేపీ బ‌లోపేతం అవుతోంది. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యం నాటికి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేలా ప్ర‌ణాళిక‌తో ఆ పార్టీ నేత‌లు ముందుకెళ్తున్నారు. త‌మిళ‌నాడులోనూ బీజేపీ బ‌లోపేతానికి వేగంగా అడుగులు ప‌డుతున్నాయి. మ‌రోవైపు క‌ర్ణాట‌క‌లో మ‌రోసారి అధికారంలోకి వ‌చ్చేలా బీజేపీ ఇప్ప‌టి నుంచే వ్యూహాల‌కు ప‌దును పెడుతోంది. అయితే, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో పార్టీ బ‌లోపేతంపై మాత్రం బీజేపీ పెద్ద‌లు దృష్టి సారించ‌డం లేదు. ఏపీలో ఎన్డీయే కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలో ఉంది. టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ లు క‌లిసి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన విష‌యం విదిత‌మే. అయితే, ఎన్నిక‌ల త‌రువాత తెలుగుదేశం, జ‌న‌సేన  అధిష్టానాలు త‌మత‌మ‌ పార్టీల బ‌లోపేతం చేయడంపై దృష్టి సారించాయి. బీజేపీ నేత‌లు మాత్రం ఆ  దిశగా ప్ర‌య‌త్నాలు చేయ‌డం లేదు. మ‌రోవైపు బీజేపీ అధిష్ఠానం కూడా రాష్ట్రంలో పార్టీ గురించి పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌టం లేదు.  ఏపీలో తెలుగుదేశం కూట‌మి ప్ర‌భుత్వం పాల‌న సాగుతోంది. ముఖ్యమంత్రి చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌, మంత్రి నారా లోకేశ్ లు రాష్ట్ర అభివృద్ధిపై ప్ర‌త్యేక దృష్టిసారించారు. గ‌డిచిన ఐదేళ్ల కాలంలో వైసీపీ అరాచ‌క పాల‌న‌తో రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా కుంటుప‌డిపోయింది. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సీఎం హోదాలో రాష్ట్రాన్ని అప్పుల కుప్ప‌గా మార్చ‌డంతోపాటు.. అభివృద్ధిని పూర్తిగా ప‌క్క‌న‌ ప‌డేశారు. ఫ‌లితంగా ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం చంద్ర‌బాబు ఆధ్వ‌ర్యంలోని కూట‌మి ప్ర‌భుత్వం రాష్ట్రాన్ని గాడిలో పెట్టే ప్ర‌య‌త్నం చేస్తోంది. ఒక ప‌క్క అమ‌రావ‌తి రాజ‌ధానిలో భ‌వ‌న నిర్మాణ ప‌నుల‌పై దృష్టిసారించ‌డంతోపాటు.. పోలవ‌రం ప్రాజెక్టు నిర్మాణం, రాష్ట్రంలో ర‌హ‌దారుల నిర్మాణం, మరమ్మతులు ఇలా అన్నిరకాలుగా అభివృద్ధిపై చంద్ర‌బాబు దృష్టిసారించారు. ఇద‌లా ఉంటే చంద్ర‌బాబు, లోకేశ్ పార్టీ బ‌లోపేతంపైనా దృష్టిసారించారు. మ‌రోవైపు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ సైతం క్షేత్ర‌స్థాయిలో పార్టీని బ‌లోపేతం చేసేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో వైసీపీ నుంచి ప‌లువురిని త‌మత‌మ పార్టీల్లో చేర్చుకుంటున్నారు. ఇప్ప‌టికే వైసీపీ సీనియ‌ర్ నేతలు టీడీపీ, జ‌న‌సేనలలో చేరారు. మ‌రికొంద‌రు ఆయా పార్టీల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆ విష‌యంలో కూట‌మిలో భాగ‌స్వామిగా ఉన్న బీజేపీ మాత్రం వెనుక‌బ‌డిపోయింది. బీజేపీ  పెద్ద‌లు రాష్ట్రంలో పార్టీ ఉందన్న సోయ లేనట్లుగా వ్యవహరిస్తున్నారన్న విమ‌ర్శ‌లు ఉన్నాయి.  కూట‌మి ప్ర‌భుత్వంలో బీజేపీ నేత‌ల‌కు అన్యాయం జ‌రుగుతున్నద‌ని బీజేపీ రాష్ట్ర పార్టీ నేత‌లు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. రాష్ట్ర క్యాబినెట్ లో బీజేపీ ఎమ్మెల్యేకు మంత్రిగా అవ‌కాశం క‌ల్పించి స‌ముచిత న్యాయం చేసిన‌ప్ప‌టికీ.. నామినేటెడ్ ప‌ద‌వుల భ‌ర్తీ విష‌యంలో.. ఇటీవ‌ల టీటీడీ పాల‌క వ‌ర్గం ఎంపిక విష‌యంలో బీజేపీకి ఇసుమంతైనా ప్రాధాన్య‌త ఇవ్వ‌లేద‌ని ఆ పార్టీ నేత‌లు అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబ‌ర్ నెల‌లో ఏపీ ప్ర‌భుత్వం పెద్ద సంఖ్యలో నామినేటెడ్‌ పదవులను భర్తీ చేసింది. 20 కార్పొరేషన్లకు ఛైర్మన్లు, ఒక వైస్‌ఛైర్మన్‌ను నియమించింది. 7 కార్పొరేషన్లలో 64 మందికి సభ్యులుగా అవకాశం కల్పించింది. ఇందులో బీజేపీ నేత‌ల‌కు పెద్ద‌గా ప్రాధాన్య‌త ఇవ్వ‌లేద‌ని ఆ పార్టీ నేత‌లు భావిస్తున్నారు. 20 కార్పొరేష‌న్ చైర్మ‌న్ల‌లో కేవ‌లం ఒక్క కార్పొరేష‌న్ (20 సూత్రాల అమ‌లు క‌మిటీ – లంకా దిన‌క‌ర్) ను మాత్ర‌మే బీజేపీకి కేటాయించారు. ఐదుగురు బీజేపీ నేత‌ల‌ను స‌భ్యులుగా నియ‌మించారు. దీనికితోడు ఇటీవ‌ల టీటీడీ పాల‌క వ‌ర్గం నియామ‌కంలోనూ బీజేపీకి అన్యాయం జ‌రిగింద‌ని ఆపార్టీ నేత‌లు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. తిరుపతికి చెందిన సీనియర్‌ బీజేపీ నేత భానుప్రకాష్‌రెడ్డికి పాలక మండలిలో చోటు ద‌క్కించింది. మ‌రొక బీజేపీ నేత‌కు టీటీడీ పాల‌క‌వ‌ర్గంలో అవ‌కాశం క‌ల్పిస్తే బాగుండేద‌న్నభావన బీజేపీ రాష్ట్ర నాయకుల్లో వ్యక్తం అవుతోంది. అయితే, ఎన్టీయే కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్  రాష్ట్ర బీజేపీ నేత‌ల‌ను పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డం లేద‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి.  బీజేపీ కేంద్ర పెద్ద‌లుసైతం ఏపీలో పార్టీ బ‌లోపేతంపై పెద్ద‌గా దృష్టిసారించ‌డం లేదు. దీంతో పార్టీలోని ఓ వ‌ర్గం నేత‌లు తీవ్ర అసంతృప్తిని వ్య‌క్తం చేస్తున్నారు. ఇటీవ‌ల తెలుగుదేశం, జ‌న‌సేన పార్టీల్లోకి ప‌లువురు వైసీపీ నేత‌లు చేరారు. బీజేపీ రాష్ట్ర అధిష్టానం, కేంద్ర అధిష్టానం పెద్ద‌లు మాత్రం పార్టీలో చేరిక‌ల విష‌యంపై అస‌లు ప‌ట్టించుకోవ‌టం లేద‌ని, త‌ద్వారా క్షేత్ర‌ స్థాయిలో పార్టీ క్యాడ‌ర్ లో నిస్తేజం నెల‌కొంటుంద‌ని  పార్టీ రాష్ట్ర నేతలు బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే విష‌యాన్ని కేంద్రం పార్టీ పెద్ద‌ల దృష్టికి తీసుకెళ్లిన‌ప్ప‌టికీ వారు పట్టించుకోలేదు. కేంద్ర పార్టీ పెద్ద‌లు జోక్యం చేసుకొని ప్ర‌భుత్వ నామినేటెడ్ ప‌దవుల్లో రాష్ట్ర‌ బీజేపీ నేత‌ల‌కు వీలైన‌న్ని ఎక్కువ ప‌ద‌వులు ద‌క్కేలా చూడాల్సింది పోయి.. రాష్ట్రంలో పార్టీ ప‌రిస్థితిని సైతం ప‌ట్టించుకోక‌పోవ‌టంతో కొంద‌రు నేత‌లు ఏకంగా పార్టీ మారే ఆలోచ‌న సైతం చేస్తున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. అయితే, త్వ‌ర‌లో మ‌రో విడ‌త నామినేటెడ్ ప‌ద‌వుల‌ను భ‌ర్తీ చేసేందుకు సీఎం చంద్ర‌బాబు నాయుడు సిద్ధ‌మ‌య్యారు. వ‌చ్చే వారం రోజుల్లోనే నామినేటెడ్ ప‌ద‌వుల‌ను భ‌ర్తీ చేసే అవ‌కాశం ఉంది. ఈ క్ర‌మంలో కేంద్రంలోని బీజేపీ పెద్ద‌లు జోక్యం చేసుకొని.. రాష్ట్రంలోని బీజేపీ నేత‌ల‌కు ఏమేర‌కు ఎక్కువ నామినేటెడ్ ప‌ద‌వులు ద‌క్కేలా చూస్తార‌నే విష‌యంపై ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతుంది.

ఎల్లికల్లులో నాలుగు శతాబ్దాల నాటి సూక్ష్మ ఆంజనేయ విగ్రహం

పురావస్తు పరిశోధకుడు ఈమని శివనాగిరెడ్డి కల్వకుర్తికి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎల్లికలు గ్రామంలోని శివాలయంలో 400 ఏళ్ల నాటి అరుదైన అతి చిన్న ఆంజనేయ స్వామి విగ్రహం ఉందని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా సీఈవో  డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు ఎనుముల జగదీశ్వర్ రెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు ఆయన బుధవారం(నవంబర్ 6) గ్రామ శివారులోని శిథిల శివాలయాన్ని, అందులో ఉన్న భిన్నమైన మూడు నంది విగ్రహాలను, కప్పు రాలి పగిలిపోయిన మండపం, నిధుల వేటగాళ్ల గడ్డపారులకు బలైన గర్భాలయాన్ని పరిశీలించారు. చుట్టూ ప్రాకారంతో ఉన్న శిధిల శివాలయాలను పదిలపరిచి, నంది శిల్పాలను గ్రామంలో పీఠాలపై నిలబెట్టి కాపాడుకోవాలని శివ నాగిరెడ్డి గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు.  అనంతరం గ్రామంలోని శివాలయం ధ్వజస్తంభం పీఠం పైన 6 అంగుళాల ఎత్తు నాలుగు అంగుళాల వెడల్పు రెండు అంగుళాల మందంగల సున్నపురాతితో చెక్కిన సూక్ష్మ ఆంజనేయ విగ్రహం, అదే కొలతలతో గణేష్ విగ్రహం ఉన్నాయని, విజయనగర కాలానికి చెందిన 400 ఏళ్ల నాటి చారిత్రక ప్రాధాన్యత గల ఈ అరుదైన చిన్న శిల్పాలను కాపాడుకొని, భావితరాలకు అందించాలని శివనాగిరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మామిడాల ముత్యాల రెడ్డి, బడే సాయికిరణ్ రెడ్డి పాల్గొన్నారు అని ఆయన చెప్పారు.

ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ మరోసారి వాయిదా 

ఎమ్మెల్యేల అనర్హతపై  పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో వాదనలు జరిగాయి.  పార్టీ ఫిరాయించిన పార్టీ  ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని దాఖలైన పిటిషన్ పై విచారణ మరోసారి వాయిదాపడింది.  ఈ కేసు విచారణ రేపటికి వాయిదా వేస్తూ డివిజన్ బెంచ్    నిర్ణయం తీసుకుంది.  సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్ ను అసెంబ్లీ కార్యదర్శి ఆశ్రయించారు. రేపు కూడా వాదనలు జరుగనున్నాయి. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటువేసేలా బిఆర్ఎస్ ఎమ్మెల్యేల తరపున  లాయర్ కోర్టులో పిటిషన్ దాఖ లు చేసిన సంగతి తెలిసిందే. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు వేసే అధికారం స్పీకర్ కు  ఉంటుందని లాయర్ కోర్టులో వాదించారు. ఎమ్మెల్యేల తరపున లాయర్ వేసిన పిటిషన్ కొట్టివేయాలని అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి కోరారు

భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ నివాసంపై ఐటీ సోదాలు

రాష్ట్రంలో అధికారం కోల్పోయిన నాటి నుంచి వైసీపీ నేతలు ఒకరి తరువాత ఒకరు చిక్కుల్లో పడుతున్నారు. వైసీపీ ఇటీవలి సార్వత్రిక ఎన్నికలలో ఘోర పరాజయం మూటగట్టుకున్న తరువాత ఈ ఐదు నెలల కాలంలో పలువురు నేతలు కేసులను ఎదుర్కొంటున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని సాగించిన అరాచకం, దోపిడీ, దాడులు, దౌర్జన్యాల కారణంగా న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు తాజాగా ఆ జాబితాలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ చేరారు. గ్రంథి శ్రీనివాస్ 2019 ఎన్నికలలో భీమవరం నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. అప్పట్లో ఆయన జేనసేనాని పవన్ కల్యాణ్ పై  8300 ఓట్ల మెజారిటీతో  విజయం సాధించి సంచలనం సృష్టించారు. అయితే 2024 ఎన్నికలలో ఆయన అదే నియోజకవర్గం నుంచి తెలుగుదేశం కూటమి అభ్యర్థి పులపర్తి రామాంజనేయులుపై 13,726 ఓట్ల తేడాతో  పరాజయాన్ని మూటగట్టుకున్నారు. ఆ తరువాత నుంచి ఆయన వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. త్వరలో ఆయన వైసీపీకి గుడ్ బై చెబుతారన్న వార్తలు కూడా గట్టిగా వినిపిస్తున్నారు. ఈ తరుణంగా గ్రంథా నివాసాలు, కార్యాలయాలపై ఐటీ అధికారులు దాడులు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.   సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ఆధ్వర్యంలో గ్రాంధి నివాసం, కార్యాలయం, రొయ్యల ఫ్యాక్టరీ, కృష్ణా జిల్లా నాగాయలంకలోని ఆయన కార్యాలయలపై ఏకకాలంలో దాడులు జరుగుతున్నాయి.   

తెలంగాణలో ఇంటింటి కుటుంబసర్వే షురూ

తెలంగాణలో ఇంటింటి కుటుంబ సర్వే బుధవారం( నవంబర్ 6) ప్రారంభమైంది.  సర్వే ఈ నెలాఖరు వరకు కొనసాగనుంది. ఇంటింటికి స్టిక్కర్లను అంటించిన అధికారులు వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.  ప్రతీ రోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి  ఎన్యూమరేటర్లు సర్వే నిర్వహిస్తారు. ఎక్కువగా టీచర్లే ఎన్యుమరేటర్లుగా ఉండటం విశేషం. సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకయ, కుల సమగ్ర సర్వే  చేయాలని తెలంగాణ ప్రభుత్వం  వీరిని నియమించింది.  కుటుంబసర్వేలో కుటుంబ సభ్యుల వ్యక్తిగత వివరాలు ఉంటాయి.  ఫామ్ 1లో మొత్తం 58 ప్రశ్నలకు సమాధానాలు రాబట్టుతారు. ఫామ్ 2లో 17 ప్రశ్నలుంటాయి. తప్పుడు సమాచారం ఇవ్వకూడదని ప్రభుత్వం ఇప్పటికే ప్రజలను కోరింది. 

ట్రంప్ జయభేరి.. సంబరాలలో మద్దతుదారులు

అమెరికా అధ్యక్ష ఎన్నికలలో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. హోరాహోరీ తప్పదన్న అంచనాలను తల్లకిందులు చేస్తూ ఆయన సునాయాసంగా విజయం సాధించారు. అధ్యక్ష పగ్గాలు అందుకోవడానికి అవసరమై 274 ఎలక్టోరల్ ఓట్లను ఆయన దాటేశారు. గట్టి పోటీ ఇస్తారనుకున్న డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ తేలిపోయారు.  ఫ్లోరిడా, మిసిసిపి, ఓక్లహోమా, ఇండియానా, కెంటకీ, ఒహాయో, వెస్ట్ వర్జీనియా, సౌత్ కరోలినా, నార్త్ కరోలినా, సౌత్ డకోటా, నార్త్ డకోటా, యూటా, వయోమింగ్, నెబ్రాస్కా, మోంటానా, టెన్నిసీ, అలబామా, ఐడహో రాష్ట్రాలలో  ట్రంప్ విజయదుందుభి మోగించారు. అలాగే స్వింగ్ స్టేట్స్ అయిన జార్జియా, నార్త్ కరోలినాలలో డొనాల్డ్ ట్రంప్‌ విజయం సాధించి పెన్సిల్వేనియా, ఆరిజోనా, మిచిగాన్, నెవడా, విస్కాన్సిన్ రాష్ట్రాలలో  కూడా ట్రంప్ సంపూర్ణ ఆధిక్యత కనబరిచారు. దీంతో  అమెరికా 47వ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు.  ఇలా ఉండగా.. అమెరికా ఉపాధ్యక్షుడిగా ఆంధ్రా అల్లుడు జేడీవాన్స్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన ఆయ‌న‌ భార్య ఉష చిలుకూరి తెలుగు సంతతికి చెందిన వారు.   గత ఏడాది వరకూ ఆంధ్ర యూనివర్సిటీలో  ప్రొఫెసర్‌గా ప‌నిచేసిన‌ శాంతమ్మ మనుమరాలు ఉషా చిలుకూరి. దీంతో ఆంధ్ర అల్లుడు అమెరికా ఉపాధ్య‌క్షుడు కానున్నారు. ఉష చిలుకూరి  పేరెంట్స్‌ ఎప్పుడో అమెరికాలో స్థిరపడ్డారు. దీంతో ఉష  అక్కడే పుట్టి పెరిగారు.    

పరారీలో వర్రా రవీందర్ రెడ్డి... కడప పోలీసులపై చంద్రబాబు సీరియస్!

పోలీసులు ఇప్పటికీ వైసీపీకి అనుకూలంగానే వ్యవహరిస్తున్నారంటూ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు అక్షర సత్యాలే అనిపిస్తున్నది. సామాజిక మాధ్యమంలో  ప్రత్యర్థి పార్టీల నాయకులపై ఇష్టారీతిగా, అడ్డగోలుగా అసభ్య పోస్టులు పెట్టిన వర్రా రవీందర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసినట్లు చేసి విడిచి పెట్టేశారు. 41ఎ నోటీసులు ఇచ్చి పిలిచినప్పుడు విచారణకు రావలని చెప్పి గౌరవంగా సాగనంపారు. అలా సాగనంపడంపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. అయితే అప్పటికే జరగాల్సింది జరిగిపోయింది. ప్రభుత్వ ఆగ్రహంతో వర్రాను అదుపులోనికి తీసుకోవడానికి వెళ్లిన పోలీసులకు అతడి ఆచూకీ చిక్కడం లేదు. పోలీసులు ఇలా వదిలిపెట్టగానే  వర్రా రవీంద్రారెడ్డి అలా పరారైపోయారు.  వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ అయిన వర్రా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడూ, కూటమి అధికారం లోకి వచ్చిన తరువాతా కూడా ఆయన సోషల్ మీడియా వేదికగా తెలుగుదేశం, జనసేన నేతలు, మహిళా నాయకురాళ్లపై అసభ్య పోస్టులు పెట్టారు. పలు ఫిర్యాదుల మేరకు పోలీసులు వర్రా రవీందర్ రెడ్డిని మంగళవారం రాత్రి అరెస్టు చేసి కడపకు తరలించి విచారించారు. అయితే బుధవారం తెల్లవారు జామున ఆయనకు 41ఏ నోటీసులు ఇచ్చి వదిలేయడం చూస్తుంటూ వారింకా వైసీపీ అనుకూల మోడ్ లోనే ఉన్నారని అనిపించక మానదు.  వైసీపీ అధికారంలో ఉండగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కల్యాణ్, వంగలపూడి అనిత, వైఎస్ షర్మిల సహా పలువురు అప్పటి విపక్ష నేతలపై వర్రా అసభ్యకరమైన పోస్టులు పెట్టారు.  అటువంటి  వర్రా రవీందర్ రెడ్డిని అదుపులోనికి తీసుకున్న పోలీసులు 41ఎ నోటీసులు ఇచ్చి వదిలేయడం  ఎవరి ఆదేశాల మేరకు, ఎవరికి అనుకూలంగా  పోలీసులు పని చేస్తున్నారన్న అనుమానాలూ వ్యక్తం అవుతున్నాయి. వర్రా రవీందర్ రెడ్డిని వదిలేయడంపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.  వర్రా రవీందర్ రెడ్డిని అలా ఎలా వదిలేశారంటూ డీజీపీ ద్వారకా తిరుమలరావు సైతం కడప పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో  కడప పోలీసులు అలర్టై వర్రా రవీందర్ రెడ్డి కోసం గాలింపు ప్రారంభించారు. అయితే పోలీసుల విడిచి పెట్టిన మరుక్షణమే వర్రా రవీందర్ రెడ్డి పరారీ అయ్యారు. ఆయన ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.  వర్రా రవీందర్ రెడ్డి పరారీ విషయం తెలుసుకున్న వెంటనే కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ కడప ఎస్పీ కార్యాలయాలని చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.   ఇలా ఉండగా వర్రా రవీందర్ రెడ్డికి 41ఎ కింద నోటీసులు ఇచ్చిన కడప పోలీసులు విచారణకు పిలిచినప్పుడు రావాలని ఆదేశించారు. ఆ వెంటనే మరో కేసులో విచారణ కోసం అదుపులోనికి తీసుకో వాలని భావించినప్పటికీ అప్పటికే వర్రా పరారయ్యాడు.  వర్రా ఆచూకీ కోసం ఆతని భార్య, సోదరుడు, మరదలును పోలీసులు ప్రశ్నిస్తున్నారు.  వర్రా రవీందర్‌ రెడ్డిపై మంగళగిరి, పులివెందుల, హైదరా బాద్‌లలో పలు కేసులు ఉన్నాయి. ఇన్ని కేసులు ఉన్నప్పటికీ పోలీసులు నిర్లక్ష్యంగా అతడిని విడిచిపెట్టడం పట్ల పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  

నందిగం సురేష్ బెయిల్ పిటిషన్ కొట్టివేత 

తూళ్లూరు మండలం వెలగపూడి గ్రామానికి చెందిన మరియమ్మ హత్య కేసులో నిందితుడైన వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ కు హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన పెట్టుకున్న బెయిల్ దరఖాస్తును హైకోర్టు కొట్టి వేసింది. ఈ కేసులో నందిగం సురేష్ కు రెండు పర్యాయాలు రిమాండ్ విధిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. 2020లో రెండు సామాజిక వర్గాల మధ్య జరిగిన గొడవలో మరియమ్మ హత్యకు గురయ్యారు. ఈ హత్య చేసింది వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ అని ఎస్టాబ్లిష్ అయ్యింది. ఈ కారణంగా మంగళగిరి కోర్టు రెండు పర్యాయాలు బెయిల్ తిరస్కరించింది. తాజాగా ఆయన హైకోర్టును ఆశ్రయించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. 

హైద్రాబాద్ మేయర్ విజయలక్ష్మి ఆకస్మిక తనిఖీలు 

హైద్రాబాద్ మేయర్ విజయ లక్ష్మి ట్యాంక్ బండ్ వద్ద గల  జిహెచ్ ఎంసి  ప్రధాన కార్యాలయంలో మంగళవారం ఆకస్మిక తనిఖీలు చేశారు. ప్రజావాణిలో వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో గద్వాల విజయలక్మి తనిఖీలు చేశారు. టౌన్ ప్లానింగ్ అధికారులపై ప్రజా వాణిలో ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి. మధ్యాహ్నం 12 వరకు ఏ ఒక్క అధికారి కూడా కార్యాలయానికి చేరుకోవడం లేదు. ఆలస్యంగా వచ్చిన వారిపై చర్యలు తప్పవని మేయర్ హెచ్చరించారు. అధికారుల అటెండెన్స్ చూసి ఆమె సీరియస్ అయ్యారు. అడిషనల్ కమిషనల్ నళినీ పద్మావతికి  అటెండెన్స్ పై రిపోర్ట్ చేయాలని  ఆదేశంచారు. గత మూడు నెలల క్రితం కూడా మేయర్ ఆకస్మక తనిఖీలు చేసిన సంగతి తెలిసిందే. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను వెంట వెంటనే పరిష్కరించాలని ఆమె ఆదేశించారు. ప్రధాన కార్యాలయంలోని  ఏడు ప్లోర్ లలో ప్రతీ డిపార్ట్ మెంట్ ఆమె కలియ తిరిగారు. 

కుప్పంలో వైసీపీ బుడగ పేలిపోయింది!

వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో కుప్పం విషయంలో  ఆ పార్టీ నేతలు పెచ్చులు మాట్లాడారు. చంద్రబాబును ఆయన సొంత నియోజకవర్గంలోనే ఓడిస్తామంటూ ప్రగల్భాలు పలికారు. 2024 ఎన్నికలలో కుప్పం నియోజకవర్గం వైసీపీ ఖాతాలో పడటం ఖాయమంటూ గప్పాలు కొట్టారు.  ముఖ్యంగా  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయితే తన స్థాయిని మించి వ్యవహరించారు. కుప్పం స్థానిక సంస్థలను అధికార బలంతోనూ, సొమ్ములు గుమ్మరించడం ద్వారా లాక్కొని ఇంకే ముంది కుప్పంలో చంద్రబాబు పని అయిపోయిందంటూ విర్రవీగారు.   2019-2024 మధ్య కాలంలో వైసీపీ ఇంకేముంది కుప్పంలో చంద్రబాబు ఘోర పరాజయం ఖాయమంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. నిజంగానే కుప్పంలో వైసీపీ బలపడిందా అన్న భ్రాంతి కలిగేలా వారి తీరు అప్పట్లో ఉంది. అయితే అదంతా కేవలం గాలి బుడగ వాటమని 2024 ఎన్నికలు నిర్ద్వంద్వంగా తేల్చేశాయి.  అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ గెలిచిన మరుక్షణం ఐదేళ్ల పాటు కుప్పంలో అరాచకాలు చేసి చంద్రబాబు పర్యటనను అడ్డుకున్న వారు కూడా కనిపించకుండా వెళ్లిపోయారు. పోటీ చేసి ఓడిపోయిన భరత్ అసలు అడ్రస్ లేరు. అక్కడే ఉన్న వాళ్లు టీడీపీలో చేరిపోతామని బతిమాలుకుని ఆ పని పూర్తి చేశారు. ఇప్పుడు కుప్పంలో వైసీపీ జెండా పట్టుకునేవారు కరువయ్యారు. చంద్రబాబును ఓడించేస్తానని హడావుడి చేసిన పెద్దిరెడ్డి కూడా అటు వైపు చూడటం లేదు. 2024 ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత కుప్పంలో వైసీపీ బుడగ పేలిపోయింది. చంద్రబాబు సునాయాసంగా కుప్పం నుంచి వరుసగా ఎనిమిదో సారి భారీ మెజారిటీతో విజయం సాధించారు. అప్పటిదాకా కుప్పం మాదే నంటూ విర్రవీగిన వైసీపీయులు ఓటమి తరువాత నియోజకవర్గంలో కలికానిక్కూడా కనిపించకుండా పోయారు. కుప్పం వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన  కె.ఆర్‌.జె.భరత్‌ హైదరాబాద్‌కు మకాం మార్చేశారు. ఇక ఇప్పుడు స్థానిక సంస్థలు కూడా తెలుగుదేశం వశమౌతున్నాయి. కుప్పం మునిసిపల్ చైర్మర్ సుధీర్ చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం గూటికి చేరారు.  మొత్తానికి కుప్పంలో వైసీపీ ఖాళీ అయిపోయిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.