రేవంత్ రెడ్డికి కెసీఆర్ మాస్ వార్నింగ్ 

ప్రజలు ఏం కోల్పోయారో తెలుసుకున్నారు. బిఆర్ఎస్ నేతలు హైరానా పడాల్సిన పని లేదు. మళ్లీ మన ప్రభుత్వమే వస్తుంది అని మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ ప్రెసిడెంట్ కెసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఎర్రవెల్లి ఫాం హౌజ్ లో ఆయన పాలకుర్తి  నియోజకవర్గ నేతలతో సమావేశమయ్యారు. చాలా రోజుల తర్వాత కెసీఆర్ పార్టీ నేతలతో సమావేశమయ్యారు.  ఈ సమావేశంలోనే కెసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కుంభకోణంలో దర్యాప్తు తుది దశకు వచ్చిన  నేపథ్యంలో కెసీఆర్ అరెస్ట్ ఖాయం అని ప్రచారం జరుగుతుంది. ఫార్ములా ఈ రేస్ కుంభకోణంలో కొడుకు కెటీఆర్ అరెస్ట్ అవుతారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. తన గారాల పట్టి కవిత ఇటీవల బెయిల్ పై విడుదలైనప్పటికీ కెటీఆర్ అరెస్ట్ వార్తలు కెసీఆర్ కి  తీవ్ర ఆవేదనకు గురి చేస్తున్నాయి. ఈ కారణంగానే ఫ్రస్టేషన్ లో రేవంత్ రెడ్డికి మాస్ వార్నింగ్ ఇస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలో వచ్చి 11 నెలలు అయ్యింది.  అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పింది.  ఈ పిచ్చి మాటలు మాకు రావా? ఈ రోజు మాట్లాడటం ప్రారంభిస్తే రేపటివరకు ఆగకుండా మాట్లాడగలం.  ప్రజలను కాపాడాల్సిన ప్రభుత్వం భయపెడుతుందని ఘాటుగా వ్యాఖ్యానించారు. 

ఏపీ శిల్పారామం ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ సొసైటీ చైర్ పర్సన్ మంజుల రెడ్డి

తెలుగుదేశం పార్టీ అంటేనే కార్యకర్తల పార్టీ. ఆ పార్టీలో పని చేసే కార్యకర్తలకు సముచిత గుర్తింపు లభిస్తుంది. కార్యకర్తలకు బీమా సౌకర్యం కల్పించిన తొలి పార్టీ దేశంలో తెలుగుదేశమే. అలాగే మరణించిన తెలుగుదేశం కార్యకర్తల పిల్లల బాధ్యత పార్టీయే తీసుకుని వారికి నాణ్యమైన విద్యను అందిస్తున్న పార్టీ కూడా తెలుగుదేశమే. తెలుగుదేశం పార్టీ కోసం, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం పోరాడే క్షేత్రస్థాయి కార్యకర్తలను  గుండెల్లో పెట్టుకుంటుంది. ఇందుకు తాజా ఉదాహరణే మంజులా రెడ్డికి నామినేటెడ్ పోస్టు దక్కడం. గత ఎన్నికల్లో మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ విచ్చలవిడిగా ఎన్నికల అక్రమాలకు, దౌర్జన్యాలకు పాల్పడింది. ఆ సమయంలో వైసీపీ  అక్రమాలను ప్రశ్నించిన మంజులా రెడ్డి పై వైసీపీ గూండాలు కత్తులతో దాడి చేసారు. అయినా వెన్ను చూపకుండా, భయపడకుండా ఆమె నిలబడిన తీరు, తెగువను తెలుగుదేశం అధినేత చంద్రబాబు అభినందించారు. కేవలం అభినందించి ఊరుకోలేదు. పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత  ఆమెకు నామినేటెడ్ పోస్టు ఇచ్చారు. శనివారం విడుదల చేసిన నామినేటెడ్ పోస్టుల జాబితాలో ఆమె పేరు ఉంది. మంజులారెడ్డికి ఏపీ శిల్పారామం ఆర్ట్స్, క్రాఫ్ట్స్ అండ్ కల్చరల్ సొసైటీ ఛైర్ పర్సన్ పదవి ఇచ్చి ఆమె పార్టీకి చేసిన సేవలకు సముచిత గుర్తింపు ఇచ్చారు. వైఎస్సార్‌సీపీ దౌర్జన్యాల దీటుగా ఎదుర్కొని, దాడులకు వెరవకుండా ప్రాణాలకు తెగించి పార్టీ కోసం పని చేసిన తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులకు పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుంది, వారికి సముచిత గౌరవం, స్థానం దక్కుతుందని ముంజులారెడ్డికి పదవి ఇవ్వడం ద్వారా చంద్రబాబు మరోసారి చాటారు.    

విజయవాడ టు శ్రీశైలం.. సీప్లేన్ టికెట్ ధర ఎంతుండొచ్చంటే?

ఏపీలో సీఎం చంద్రబాబు సీ ప్లేన్లో విజయవాడ లోని పున్నమి ఘాట్ నుంచి శ్రీశైలం వెళ్లారు. అసలీ సీ ప్లేన్ అంటే ఏమిటన్న ఆసక్తి రాష్ట్ర ప్రజలలో ఉంది. తీరా చంద్రబాబు ఈ సీప్లేన్ సర్వీసులను లాంఛనంగా ప్రారంభించి.. ఆ సీప్లేన్ లో ప్రయాణించిన తరువాత.. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా సీప్లేన్ పై చర్చ మొదలైంది. దీని ప్రత్యేకతలు ఏమిటి?  విజయవాడ నుంచి శ్రీశైలానికి అరగంటలో వెళ్లిపోవచ్చా. ఈ సీప్లేన్ టికెట్ ధర ఎంత ఉంటుంది అన్న చర్చ మొదలైంది.  అలాగే ఇది ఎంత ఎత్తులో వెడుతుంది?  నీటిపై విమానం టేకాఫ్ తీసుకోవడానికి ముందు ఎంత దూరం ప్రయాణిస్తుంది వంటి ఆసక్తి వ్యక్తం అవుతోంది. ఇక వివరాల్లోకి వెడితే  ప్లేన్ లో ప్రయాణించే వారు   ప్రకృతి అందాలు ఆస్వాదించేందుకు వీలుగా ఇది  1,500 అడుగుల ఎత్తులో వెళ్తుంది. టేకాఫ్, ల్యాండింగ్ రెండూ నీటి పైనే జరుగుతాయి. ఇందులో 14 మంది ప్రయాణించవచ్చు. ఇక టికెట్ ధర అయితే  దాదాపు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు ఉండొచ్చు. రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుంది. ఇక భవిష్యత్ లో  సీప్లేన్ విమానాశ్రయాల అవసరాన్ని చాలా వరకూ తగ్గించే అవకాశాలు ఉన్నాయి. గగన విహారంతో పాటు.. నీటిపై విమానంలో ప్రయాణం అన్నది పర్యటకులకు ఒక కొత్త అనుభూతిని ఇస్తుందనడంలో సందేహం లేదు. 

వైసీపీకి మాజీ మంత్రి కురసాల కన్నబాబు గుడ్ బై?

వైసీపీకి మరో కీలక  నేత గుడ్ బై చెప్పనున్నారా? అంటే అవుననే వినిపిస్తోంది. జగన్ తొలి కేబినెట్ లో మంత్రిగా పని చేసిన కురసాల కన్నబాబు వైపీపీని వీడనున్నరని గట్టిగా వినిపిస్తోంది. ప్రస్తుతం కాకినాడ జిల్లా వైసీపీ అద్యక్షుడిగా ఉన్న కురసాల కన్నబాబు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండటమే కాకుండా పార్టీ క్యాడర్ కు కూడా అందుబాటులోకి రావడం లేదు. ఇటీవలి ఎన్నికలలో ఓటమి తరువాత కురసాల కన్నబాబు పార్టీలో ఏ మాత్రం క్రియాశీలంగా లేరు. పార్టీ అధినేత జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించినప్పటికీ కురసాల కన్నబాబు పార్టీ వ్యవహారాలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలోనే ఆయన నేడో రేపో పార్టీని వీడి కమలం కండువా కప్పుకునే అవకాశాలు ఉన్నాయని వైసీపీ శ్రేణులే అంటున్నాయి. ఇప్పటికే కురసాల కన్నబాబు బీజేపీలో చేరేందుకు ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేశారనీ,   ఆయన వైసీపీని వీడి కమలం గూటికి చేరడం లాంఛనం మాత్రమేనని పార్టీ వర్గాలే అంటున్నాయి.  

సీప్లేన్ లో అరగంటలోనే విజయవాడ నుంచి శ్రీశైలానికి చంద్రబాబు

ఏపీలో పర్యాటక అభివృద్ధి లక్ష్యంగా తెలుగుదేశం కూటమి సీప్లేన్ సర్వీస్ కు శ్రీకారం చుట్టింది. ఈ సర్వీస్ ను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం (నవంబర్ 9)న ప్రారంభించారు. ఆ సందర్భంగా  విజయవాడలోని పున్నమిఘాట్‌ నుంచి సీప్లేన్‌ను ప్రారంభించి అందులో ప్రయాణించి శ్రీశైలం చేరుకున్నారు. ఆయనతో పాటు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు కూడా ప్రయాణించారు.  విజయవాడ పున్నమిఘాట్ నుంచి సీప్లేన్ లో శ్రీశైలం చేరడానికి కేవలం అరగంట సమయం పట్టింది. శ్రీశైలంలో భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం చంద్రబాబు తిరిగి సీ ప్లేన్ లో విజయవాడ తిరిగి వచ్చారు.  రాష్ట్రంలో   సీ ప్లేన్ సర్వీసులు వచ్చే ఏడాది మార్చి నుంచి ప్రారంభం కానున్నాయి. కాగా సీప్లేన్ సర్వీ సు ప్రారంభించిన చంద్రబాబు మాట్లాడుతూ  భవిష్యత్ లో ఎయిర్ పోర్టులకు ప్రత్యామ్నాయంగా సీ ప్లేన్లను అందుబాటులోకి తీసుకొచ్చే అంశంపై యోచన చేస్తున్నట్లు తెలిపారు. 

పార్టీ కోసం పని చేసిన వారికి పెద్ద పీట.. చాగంటికి సలహాదారు పదవి

ఏపీలో 59 మందితో నామినేటెడ్ పోస్టుల రెండో జాబితా విడుదలైంది. ఈ సారి బీజేపీకి చెందిన ఇద్దరికి ఈ జాబితాలో చోటు దక్కింది. అలాగే 10 మంది జనసేన నేతలకు అవకాశం లభించింది. గత ఎన్నికలలో  సీట్లు త్యాగం చేసిన నేతలు, మీడియాలో తెలుగుదేశం భావజాలాన్ని బలంగా వ్యక్తం చేసిన వారికి, అలాగే  విపక్షంలో ఉండగా అప్పటి అధికార వైసీపీ దాడులను ఎదుర్కొన్న వారికి  ఈ సారి జాబితాలో స్థానం కల్పించారు. నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో చంద్రబాబు భారీ కసర్తత్తు చేసి సాధ్యమైనంత వరకూ ఎవరూ అసంతృప్తి చెందకుండా జాబితాను తయారు చేసి విడుదల చేశారు.  తొలి జాబితాలో స్థానం దక్కని తెలుగుదేశం అధికార ప్రతినిథులు కొమ్మారెడ్డి పట్టాభి, జీవీరెడ్డి, ఆనం వెంకటరమణారెడ్డిలకు ప్రాధాన్యత ఉన్న నామినేటెడ్ పోస్టులు ఇచ్చారు. అలాగే తాడికొండ మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవీ. జనసేన నుంచి మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడులతో పాటు సుజయ్ కృష్ణ రంగారావు, రావి వెంకటేశ్వరరావు, కావలి గ్రీష్మ వంటి వారికి అవకాశం ఇచ్చారు.   అలాగే పొడపాటి తేజస్వినికి, ఎన్నికల సమయంలో వైసీపీ దాడులకు గురైన  మంజులా రెడ్డికి కూడా నామినేటెడ్ పోస్టులు ఇచ్చారు. మొత్తంగా ఈ జాబితాలో తెలుగుదేశం ప్రతిపక్షంగా ఉన్నప్పుడు కేసులకు భయపడకుండా పార్టీ కోసం పోరాడిన వారికి ప్రాధాన్యత ఇచ్చారు. ఇక ప్రముఖ ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ హోదాతో కూడిన సలహాదారు పదవి ఇచ్చారు.   అదే విధంగా  మండలి మాజీ చైర్మన్ షరీఫ్‌కు కూడా కేబినెట్ ర్యాంక్ తో సలహాదారు పదవి ఇచ్చారు.

పాణ్యం రోడ్డుపై అఘోరీ హల్ చల్ 

ఎపిలో శ్రీకాళహస్తిలో హల్ చల్ చేసిన అఘోరీ తాజాగా   నంద్యాలజిల్లా పాణ్యం మండలం బలపనూరులో  కనిపించారు. ఎపిలో వరుసగా శైవక్షేత్రాలను దర్శించుకుంటున్న అఘోరీ శనివారం నంద్యాల రోడ్డుపై బైఠాయించారు. శ్రీకాళ హస్తి నుంచి తిరుగు ప్రయాణంలో ఆమె కారు ప్రమాదానికి గురైంది. పోలీసులు బలవంతంగా పంపించడం వల్లే కారు యాక్సిడెంట్ అయ్యిందని చెబుతూ అఘోరీ వీడియో కూడా చేసింది. నంద్యాలలో రోడ్డుపై బైఠాయించడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. కారు షెడ్ లో ఉండటంతో అఘోరీ కాలినడకన శ్రీశైలం బయలు దేరినట్టు తెలుస్తోంది. అఘోరీ రాకతో స్థానికులు అక్కడికి చేరుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా  అఘోరీ హల్ చల్ చేస్తున్నారు. విఖాఖ నక్కపల్లి టోల్ గేట్ ద్వారా ఎపిలో కనిపించిన అఘోరీ వరుసగా శైవ క్షేత్రాలను దర్శించుకుంటున్నారు. 

ఎపిలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ...59 మందితో రెండో జాబితా  విడుదల 

ఎపిలో  కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత నామినేటెడ్ పోస్టుల భర్తీ వేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఒక దఫా జాబితా వచ్చిన సంగతి తెలిసిందే. రెండో జాబితాను 59  మందితో ఎపి ప్రభుత్వం విడుదల చేసింది. వీరిలో ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు కూడా ఉన్నారు.  ఆయనకు కేబినేట్ ర్యాంకు  దక్కింది.  1. అడ్వైజర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ( మైనార్టీ ) కేబినెట్ ర్యాంక్ - మహమ్మద్ షరీఫ్ ( నర్సాపురం-టీడీపీ ) 2. అడ్వైజర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ( స్టూడెంట్స్ ఎథిక్స్ అండ్ వాల్యూస్ ) కేబినెట్ ర్యాంక్ - చాగంటి కోటేశ్వర్ రావు) 3. ఏపీ శెట్టి బలిజ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ - కూడిపూడి సత్తిబాబు ( రాజమండ్రి - టీడీపీ) 4. ఏపీ గవర వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ - మాల సురేంద్ర ( అనకాపల్లి - టీడీపీ ) 5. ఏపీ కళింగ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ - రోనంకి కృష్ణం నాయుడు ( నరసన్నపేట - టీడీపీ ) 6. ఏపీ కొప్పుల వెలమ వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్- పీవీజీ కుమార్ ( మాడుగుల - టీడీపీ) 7. ఏపీ కురుబ - కురుమ వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ - దేవేంద్రప్ప ( ఆదోని - టీడీపీ) 8. ఏపీ నాయి బ్రాహ్మణ వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ - ఆర్ సదాశివ ( తిరుపతి - టీడీపీ ) 9. ఏపీ రజక వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ - సావిత్రి ( అడ్వొకేట్ - బీజేపీ ) 10. ఏపీ తూర్పు కాపు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ - పాలవలస యశస్వి ( శ్రీకాకుళం - జనసేన ) 11. ఏపీ వాల్మీకి - బోయ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ - కపట్రాల సుశీలమ్మ ( బోజమ్మ ) ( ఆలూరు - టీడీపీ ) 12. ఏపీ వన్యకుల క్షత్రియ ( వనేరెడ్డి, వన్నికాపు, పల్లి కాపు, పల్లి రెడ్డి) కోపరేటివ్ ఫైనాన్స్ కొర్పొరేషన్ లిమిటెడ్ - సి ఆర్ రాజన్ ( చంద్రగిరి -టీడీపీ) 13. ఏపీ యాదవ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ - నరసింహ యాదవ్ ( తిరుపతి - టీడీపీ ) 14. ఏపీ అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ - చిలకలపూడి పాపారావు ( రేపల్లె - జనసేన) 15. ఏపీ గౌడ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ - వీరంకి వెంకట గురుమూర్తి ( పామర్రు - టీడీపీ ) 16. ఏపీ కోపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ లిమిటెడ్ - గండి బాబ్జి ( పెందుర్తి - టీడీపీ) 17. ఏపీ శిల్పారామం ఆర్ట్స్, క్రాఫ్ట్స్ అండ్ కల్చరల్ సొసైటీ విజయవాడ - మంజులా రెడ్డి రెంటిచింతల - ( మాచర్ల - టీడీపీ) 18. ఏపీ స్టేట్ బయో - డైవర్సిటీ బోర్డు - నీలాయపాలెం విజయకుమార్ (తిరుపతి - టీడీపీ ) 19. ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ - జీవి రెడ్డి ( మార్కాపురం - టీడీపీ ) 20 . ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ - మన్నవ మోహన్ కృష్ణ ( గుంటూరు వెస్ట్ టీడీపీ ) 21. ఏపీ కల్చరల్ కమిషన్ - తేజ్జస్వి పొడపాటి ( ఒంగోలు - టీడీపీ) 22. ఏపీ ఎన్విరాన్మెంట్ మ్యానేజ్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ - పొలంరెడ్డి దినేష్ రెడ్డి ( కోవూరు - టీడీపీ) 23. ఏపీ ఫారెస్ట్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ - సుజయ్ కృష్ణ రంగారావు ( బొబ్బిలి - టీడీపీ) 24. ఏపీ గ్రంధాలయ పరిషద్ - గోనుగుంట్ల కోటేశ్వర రావు ( నరసరావుపేట - టీడీపీ) 25. ఏపీ ఇండస్ట్రియల్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ - డేగల ప్రభాకర్ ( గుంటూరు ఈస్ట్ - టీడీపీ ) 26. ఏపీ ఖాదీ అండ్ ఇండస్ట్రీస్ బోర్డు ( కేకే చౌదరి - కోడూరు - టీడీపీ ) 27. ఏపీ మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ - చిల్లపల్లి శ్రీనివాస రావు ( జనసేన ) 28. ఏపీ రోడ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ - ప్రగడ నాగేశ్వర రావు ( యలమంచిలి - టీడీపీ) 29. ఏపీ స్టేట్ అగ్రికల్చర్ మిషన్ - మరెడ్డి శ్రీనివాస రెడ్డి ( ఒంగోలు - టీడీపీ) 30. ఏపీ స్టేట్ ఆక్వా కల్చర్ డవెలప్మెంట్ అధారిటీ - ఆనం వెంకట రమణా రెడ్డి ( నెల్లూరు రూరల్ - టీడీపీ) 31. ఏపీ స్టేట్ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ అడ్వైజరీ కమిటీ - రఘురామ రాజు గొట్టిముక్కల ( విజయవాడ సెంట్రల్ - టీడీపీ) 32. ఏపీ స్టేట్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ సర్టిఫికేషన్ అధారిటీ - సావల దేవదత్ (తిరువూరు - టీడీపీ ) 33. ఏపీ స్టేట్ వేర్ హోసింగ్ కార్పొరేషన్ - రావి వెంకటేశ్వర రావు ( గుడివాడ - టీడీపీ) 34. ఏపీ ఉమెన్స్ కోపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ - కావాలి గ్రీష్మ ( రాజాం - టీడీపీ) 35. ఏపీఎస్ఆర్టిసి రీజనల్ బోర్డు ఛైర్మెన్ ( దోన్ను దొర - టీడీపీ ( విజయనగరం జోన్ ) , రెడ్డి అప్పల నాయుడు - జనసేన( విజయవాడ జోన్ ), సురేష్ రెడ్డి - బీజేపీ( నెల్లూరు జోన్ ) , పోలా నాగరాజు - టీడీపీ ( కడప జోన్ ) 36. ఏపీ హ్యాండ్ లూమ్ కోపరేటివ్ సొసైటీ - సజ్జా హేమలతా ( చీరాల - టీడీపీ ) 37 . ఏపీ నాటక అకాడమీ - గుమ్మడి గోపాల కృష్ణ ( పామర్రు - టీడీపీ ) 38. ఎన్టీఆర్ వైద్య సేవ - సీతారామ సుధాకర్ ( విశాఖపట్నం సౌత్ - టీడీపీ ) 39. స్వచ్ఛ్ ఆంధ్రప్రదేశ్ మిషన్ - కొమ్మారెడ్డి పట్టాభి రామ్ ( విజయవాడ వెస్ట్ - టీడీపీ ) 40 . అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ - స్వామినాయుడు ఆలాడ ( అమలాపురం - టీడీపీ ) 41. అనంతపూర్ - హిందూపూర్ అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ - టిసి . వరుణ్ - అనంతపూర్ - జనసేన ) 42. అన్నమయ్య అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ - రూపానంద రెడ్డి ( కోడూరు - టీడీపీ ) 43. బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ - సలగల రాజశేఖర్ బాబు ( బాపట్ల - టీడీపీ ) 44. బొబ్బిలి అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ - తెంటు లక్ష్మి నాయుడు ( బొబ్బిలి - టీడీపీ) 45. చిత్తూరు అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ - కే. హేమలత ( చిత్తూరు - టీడీపీ ) 46. కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ - తుమ్మల రామస్వామి ( కాకినాడ - జనసేన) 47. కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ - సోమిశెట్టి వెంకటేశ్వర్లు ( కర్నూలు - టీడీపీ) 48. మచిలీపట్టణం అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ - మట్టా ప్రసాద్ ( మచిలీపట్నం - బీజేపీ) 49. నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ - కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ( నెల్లూరు రూరల్ - టీడీపీ) 50. రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ - బోడ్డు వెంకటరమణ చౌదరి ( రాజానగరం - టిడిపి ) 51. శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ - కోరికన రవికుమార్ ( శ్రీకాకుళం - జనసేన ) 52. విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవెలప్మెంట్ అధారిటీ - ప్రణవ్ గోపాల్ ( విశాఖపట్నం ఈస్ట్ ) 53. ఏపీ స్టేట్ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ - ముస్తాక్ అహ్మద్ ( నంద్యాల టీడీపీ ) 54. ఏపీ ఆర్య వైశ్య వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ - డి. రాకేష్ ( విజయవాడ వెస్ట్ - టీడీపీ) 55 . ఏపీ క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ - వి. సూర్యనారాయణ రాజు ( కనకరాజు సూరి ) ( భీమవరం - జనసేన ) 56. ఏపీ స్టేట్ కాపు వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ - కొత్తపల్లి సుబ్బారాయుడు ( నరసాపురం - జనసేన) 57. ఏపీ మాదిగ వెల్ఫేర్ కోపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ - ఉండవల్లి శ్రీదేవి ( తాడికొండ - టీడీపీ  58. ఏపీ మాల వెల్ఫేర్ కోపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ - డాక్టర్ పెదపూడి విజయ్ కుమార్ ( ఒంగోలు - జనసేన ) 59. ఏపీ గిరిజన కోపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్ - కిడారి శ్రావణ్ ( అరకు వ్యాలీ - టీడీపీ )

పిల్లలను టార్చర్ చేస్తే నేరస్తులౌతారు

జాఫర్ బాయ్ కొడుకు ఫజల్ బాబా డ్రగ్స్ కు అలవాటయ్యాడు. ఆందోళన చెందిన జాఫర్ భాయ్ కొడుకును ప్రతీరోజు చితకబాదేవాడు. ఫజల్ బాబా తల్లి జాఫర్ భాయ్ ను వెంటపెట్టుకుని ఒక రోజు మౌలానా దగ్గరికి వచ్చింది. డ్రగ్స్ కు అలవాటుపడ్డ  నా  కొడుకును సన్మార్గంలో ఎలా పెట్టాలి అని మౌలానాను అడుగుతుంది ఫజల్ బాబా తల్లి: సలాం వాలేకూం మౌలానా సాబ్. మేరా బేటా డ్రగ్స్ కా షికార్ బన్ గయా, హర్ దిన్  బాప్ సే మేరా బేటాకా పిటాయ్ హోరా   మౌలానా: వాలేకుం సలాం... తల్లిదండ్రులు పిల్లలను సన్మార్గంలో పెట్టే ప్రయత్నంలో హింసించకూడదు. ప్రేమతో నచ్చజెప్పాలి. ఫజల్ బాబా ప్రెండ్స్ అనేక సార్లు  డ్రగ్స్ రాకెట్ లో పట్టు బడ్డారు. మీరు అప్పుడే కంట్రోల్ చేస్తే ఈ సమస్య వచ్చేది కాదు.పిల్లలను చులకన చేసే అధికారం తల్లిదండ్రులకు  కూడా లేదు.  సరిగ్గా  చదవడం లేదని తల్లిదండ్రులు  పిల్లల మీద ఒత్తిడి చేస్తున్నారు. ఇది మంచిది కాదు.  చెడు వ్యసనాలకు అలవాటుపడిన పిల్లలను ప్రేమతో నచ్చజెప్పాలి. పిల్లలను అవమానపరచడం సరికాదు. ఇంట్లో కుటుంబ సభ్యులందరూ మౌనంగా ఉండాలి. ఎక్కువగా వాదులాడుకోవద్దు. అప్పుడే పిల్లలు అరవడం చేయరు. సంస్కారం అతి ముఖ్యం. పిల్లలు చెడిపోవడానికి తల్లిదండ్రులే ముఖ్యభూమిక వహిస్తారు. నోరు మంచిదైతే ఊరు మంచిదౌతుంది. ప్రతీ ఒక్కరితో సంస్కారవంతంగా మాట్లాడాలి.ఈ విషయాలను పిల్లలకు చిన్నప్పటి నుంచే నేర్పించాలి.  నా కొడుకు ఈ తప్పు చేశాడు. ఆ తప్పు చేశాడు అని ఫిర్యాదులు చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల పిల్లలు నొచ్చుకుంటారు. తండ్రి మీద పిల్లలకు ఎక్స్ పెక్టేషన్ ఎక్కువ ఉంటుంది. పిల్లల మీద ఫిర్యాదులు చేయడం వల్ల నిరాశావాదం వచ్చేస్తుంది. పిల్లలకు గౌరవం ఇవ్వాలి. పిల్లలను అమితంగా ప్రేమించాలి. పిల్లలకోసం టైం కేటాయించాలి.  పిల్లలను పెంచడంలో తల్లిదండ్రులకు బాధ్యత ఉన్నప్పటికీ కూతురు పెళ్లి చేసే బాధ్యత పూర్తిగా తండ్రికే ఉంటుంది. పిల్లలకు రెండేళ్ల వరకు పాలివ్వడం తల్లి పూర్తి బాధ్యత. ఖురాన్  ప్రకారం రెండేళ్లవరకు పిల్లలకు పాలు పట్టడం  తల్లి బాధ్యత.  పిల్లల విషయంలో తండ్రి స్నేహితుడి మాదిరిగా ఉండాలి గౌరవం ఏ మాత్రం తగ్గకూడదు. అదే తల్లి ప్రేమను ఎక్కువ పంచుతుంది. నవమాసాలు మోస్తుంది అంతే కాదు ప్రసవం సమయంలో అనేక నొప్పులు భరిస్తుంది. రెండేళ్లవరకు పిల్లలకు పాలివ్వడం అన్నీ కలిపి 30 నెలలు తల్లి బాధ్యత తీసుకుంటుంది. తండ్రి మాత్రం పిల్లలను ప్రయోజకులను చేసే వరకు పోషణ బాధ్యతలు తీసుకుంటాడు. కూతుళ్ల పెళ్లిళ్లు చేసే వరకు తండ్రి బాధ్యత ఎక్కువగా ఉంటుంది. పిల్లలను టార్చర్ చేసే తల్లిదండ్రులు కూడా ఉన్నారు. కానీ పర్సెంటేజ్ తక్కువ అని చెప్పాలి. పిల్లలను మార్చే ప్రయత్నంలో తల్లిదండ్రులు వేధింపులకు  గురి చేస్తున్నారు. స్నేహితుల వల్ల ఎక్కువగా చెడిపోయే అవకాశం ఉంది. కాబట్టి వారిపై నిఘా పెట్టాలి.  డబ్బు సంపాదించిన తండ్రి  కంటే ఇస్లాంను అమలు చేస్తున్న వ్యక్తులే మహనీయులు అని చెప్పాలి.                                                                                 బదనపల్లి శ్రీనివాసాచారి

వైసీపీ ఖేల్ ఖ‌తం.. బెంగ‌ళూరులోనే ఇక జ‌గ‌న్‌ మకాం!?

అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌ల‌ చేతిలో  చావు దెబ్బ‌తిన్న వైసీపీ ఖేల్ ఇక ఖ‌తం కాబోతోందా?  ఏపీలో ఐదేళ్లు అరాచ‌క పాల‌న సాగించిన జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.. త్వ‌ర‌లో త‌న దుకాణం మూసేయనున్నారా?  అంటే ఔనన్న సమాధానమే వస్తోంది. సీఎం చంద్ర‌బాబు నేతృత్వంలోని తెలుగుదేశం కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు అడుగులు వేగంగా వేస్తున్నది.  అయితే, అధికారం కోల్పోయినా వైసీపీ నేత‌ల్లో మార్పు రాలేదు. ప్ర‌భుత్వ అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌పై అస‌త్య ప్ర‌చారం చేస్తుండ‌టంతో పాటు.. సోష‌ల్ మీడియా వేదిక‌గా తెలుగుదేశం కూట‌మి పార్టీల్లోని నేత‌ల‌పై అస‌భ్య‌క‌ర పోస్టులు పెడుతున్నారు. మార్ఫింగ్ ఫొటోల‌ను పెడుతూ మాన‌సికంగా వేధింపుల‌కు గురిచేస్తున్నారు. తాజాగా ఈ విష‌యంపై చంద్ర‌బాబు సీరియ‌స్ అయ్యారు. వైసీపీ సోష‌ల్ మీడియా బ్యాచ్ కు గ‌ట్టి వార్నింగ్ ఇచ్చారు. వార్నింగ్ తోనే చంద్ర‌బాబు స‌రిపెట్ట‌లేదు. సోష‌ల్ మీడియాలో అస‌భ్య‌క‌ర పోస్టులు పెట్టిన వైసీపీ నేత‌ల‌పై కేసులు న‌మోదు చేస్తూ, అరెస్టులు చేస్తున్నారు. దీంతో ఇన్నాళ్లూ  సోష‌ల్ మీడియా వేదిక‌గా తెలుగుదేశం, జ‌న‌సేన నేత‌ల‌పై అస‌భ్య‌క‌ర పోస్టుల‌తో రెచ్చిపోయి వైసీపీ సోష‌ల మీడియా బ్యాచ్ వ‌ణికిపోతోంది. ఒక్కొక్క‌రుగా బ‌య‌ట‌కు వ‌చ్చి క్ష‌మాప‌ణ‌లు చెబుతున్నారు. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని న‌మ్ముకొని దెబ్బ‌తిన్నామ‌ని, మాపై కేసులు పెట్టొద్ద‌ని వేడుకుంటున్నారు. మ‌రోవైపు వైసీపీని వీడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో వైసీపీ క్యాడ‌ర్ చెల్లాచెదురౌతోంది. ఓట‌మి భ‌యంతో ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో  పోటీకి జ‌గ‌న్ వెనుక‌డుగు వేశారు. మ‌రోవైపు అసెంబ్లీకి వ‌చ్చి ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై గ‌ళ‌మెత్తేందుకు కూడా జగన్ భయపడుతున్నారు. అసెంబ్లీకి హాజరు కాను కానీ మీడియా సమావేశాల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానంటూ కుంటి సాకులు చెబుతున్నారు. అయితే ఆయన ఇక రాష్ట్రంలో ఉండటం కంటే మకాం మార్చేయడమే సేఫ్ అన్న నిర్ణయానికి వచ్చినట్లు కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ఏపీలో వైసీపీ హ‌యాంలో అరాచ‌కాలు అన్నీఇన్నీ కావు. ప్ర‌తిప‌క్ష నేత‌లు, కార్య‌క‌ర్త‌ల నుంచి సామాన్య ప్ర‌జ‌ల వ‌ర‌కు అధికార పార్టీ నేత‌ల నుంచి వేధింపులు ఎదుర్కొన్నారు. ప్ర‌భుత్వ తీరును ప్ర‌శ్నించిన వారిపై దాడులు చేయ‌డం, అక్ర‌మ కేసులు పెట్టి జైల్లో వేయ‌డం.. సోష‌ల్ మీడియాలో అస‌భ్య‌క‌ర పోస్టులు పెట్టి మాన‌సికంగా వేధించ‌డం. ఇదేళ్ల జగన్ పాలన అంతా ఇదే తీరు.  అధికారాన్ని అడ్డుపెట్టుకొని ప్ర‌తిప‌క్ష‌పార్టీల నేత‌ల‌పై రెచ్చిపోయిన వారిని పార్టీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  ప‌ద‌వులు ఇస్తూ  ప్రోత్స‌హించ‌డంతో వారి ఆగ‌డాల‌కు అడ్డూఅదుపు లేకుండా పోయింది. ఐదేళ్లు రాష్ట్రంలో అభివృద్ధి లేక‌పోవడం, అధికార పార్టీ నేత‌ల ఆగ‌డాలు మితిమీరిపోవడంతో  ప్ర‌జ‌ల్లో ఆగ్ర‌హం క‌ట్ట‌లు తెంచుకుంది. దీంతో ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వైసీపీకి ప్ర‌జ‌లు గ‌ట్టి గుణ‌పాఠం చెప్పారు.  క‌నీసం ప్ర‌తిప‌క్ష పార్టీ హోదా కూడా ఇవ్వ‌కుండా మీ పార్టీ ఏపీలో అవ‌స‌రం లేద‌ని జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి జనం విస్పష్టంగా చెప్పేశారు. అయితే వైసీపీ ఘోర పరాజయం, తెలుగుదేశం కూట‌మి ఘన విజయం తరువాతైనా వైసీపీ నేత‌ల వేధింపులు, సోష‌ల్ మీడియాలో అస‌భ్య‌క‌ర పోస్టుల గొడ‌వ త‌గ్గుతుంద‌ని అంద‌రూ భావించారు. కానీ, కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చి ఐదు నెల‌లు అవుతున్నా వైసీపీ నేత‌ల్లో మార్పు క‌నిపించ‌డం లేదు. సోష‌ల్ మీడియా వేదిక‌గా అస‌భ్య‌క‌ర పోస్టులు, మార్ఫింగ్ ఫొటోల‌ను పోస్టులు చేస్తూ  ఇష్టారీతిలో వ్య‌వ‌హ‌రిస్తున్నారు. దీంతో చంద్ర‌బాబు ఈ విషయాన్ని సీరియ‌స్ గా నిర్ణ‌యం తీసుకున్నారు. ఎ వ‌ర్నీ వ‌దిలిపెట్ట‌కుండా సోష‌ల్ మీడియాలో అస‌భ్య‌క‌ర పోస్టులు పెట్టిన‌, పెడుతున్న వారిపై కొర‌డా ఝుళిపిస్తున్నారు. ఈ క్ర‌మంలో వైసీపీ సోష‌ల్ మీడియా వేదిక‌గా రెచ్చిపోయిన వారినిపై కేసులు న‌మోదు చేసి అరెస్టులు చేస్తుండ‌టంతో వారు వ‌ణికిపోతున్నారు. ఏపీలో ఉమ్మ‌డి తూర్పుగోదావరి - పశ్చిమ గోదావరి, ఉమ్మ‌డి కృష్ణా - గుంటూరు నియోజ‌క‌వ‌ర్గాల‌కు టీచ‌ర్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు ఇటీవ‌ల నోటిఫికేష‌న్ విడుద‌లైన విష‌యం తెలిసిందే. అయితే, ఆ ఎన్నిక‌ల్లో చివ‌రి నిమిషంలో పోటీ నుంచి వైసీపీ త‌ప్పుకుంది. దీనికి ప్ర‌ధాన కార‌ణం ప‌ట్ట‌భ‌ద్రుల ఓట‌ర్ల‌లో వైసీపీపై తీవ్ర వ్య‌తిరేక‌త ఉండ‌ట‌మేన‌ట‌. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో అభ్య‌ర్థుల‌ను బ‌రిలోకి దింపితే చిత్తుచిత్తుగా ఓడిపోవ‌టం ఖాయ‌మ‌ని వైసీపీ అధిష్టానానికి క్లారిటీ రావ‌డంతో పోటీ నుంచి వైసీపీ త‌ప్పుకుంది. అయితే జగన్ తాము పోటీ నుంచి త‌ప్పుకోవ‌టానికి అధికార పార్టీ నేత‌ల అరాచ‌కాలే కార‌ణ‌మ‌ని ప్ర‌జ‌ల‌ను న‌మ్మించే ప్ర‌య‌త్నం చేశారు. ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం హ‌యాంలో ప్ర‌జ‌లు సంతోషంగా ఉన్నారు. వైసీపీ నేత‌లు మాత్రం కూట‌మి ప్ర‌భుత్వం అరాచ‌క‌పాల‌న సాగిస్తోందంటూ త‌ప్పుడు ప్ర‌చారం చేస్తుండ‌టంతో ప్ర‌జ‌లలో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై అసెంబ్లీకి వెళ్లి ప్ర‌భుత్వాన్ని నిల‌దీయాల్సిన జ‌గ‌న్.. భ‌య‌ప‌డిముఖం చాటే స్తున్నారు. దీంతో  వైసీపీ నేతలలో సైతం జగన్ తీరు పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఇంకా జ‌గ‌న్ వెంట ఉంటే  రాజ‌కీయ భ‌విష్య‌త్ ఉండదని పార్టీకి గుడ్ బై కోట్టేయాలని పలువురు నేతలు భావిస్తున్నారని ఆ పార్టీ శ్రేణులే అంటున్నాయి.   అధికారం కోల్పోయిన త‌రువాత అన్ని వైపుల నుంచి ఇబ్బందులు ఎదుర‌వుతుండ‌టంతో పాటు త్వ‌ర‌లో త‌న‌ను కూడా అరెస్టు చేసే అవ‌కాశం ఉంద‌న్న భయంతో జగన్  తాడేపల్లి నుంచి బిచాణా ఎత్తేని బెంగళూరు చెక్కేయాలన్న ప్లాన్ లో ఉన్నట్లు ఆ పార్టీ వర్గాల నుంచే వినిపిస్తోంది. ఇప్పటికే అధికారం కోల్పోయిన నాటి నుంచీ ఎక్కువగా బెంగ‌ళూరులోనే  జగన్ ఉంటున్నారు. ఇప్పుడిక మొత్తంగా ఏపీని వదిలేసి బెంగళూరుకు మకాం మార్చేయాలని భావిస్తున్నారనీ, అక్కడ నుంచే రాష్ట్రంలో పార్టీ ప‌రిస్థితిని మానిట‌ర్ చేస్తారనీ  వైసీపీ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. అయితే బెంగళూరు మకాం మార్చేసిన తరువాత ఆయన పార్టీని పట్టించుకునే అవకాశాలు దాదాపు మృగ్యమేననీ, పూర్తిగా తన సొంత బిజినెస్ ప‌నుల్లో నిమ‌గ్నం అయ్యే అవ‌కాశాలే మెండుగా ఉన్నాయనీ ఆయనను దగ్గరగా తెలిసిన వారు చెబుతున్నారు. దీంతో ఇక ఏపీలో వైసీపీ సీన్ సితార అయిపోయినట్లేనని పరిశీలకులు అంటున్నారు. 

విశాఖ గంజాయి రాకెట్ ను చేధించండి: అమిత్ షాకు పవన్ ట్వీట్ 

గత వైసీపీ ప్రభుత్వ హాయంలో మాదకద్రవ్యాలకు ఎపి హబ్ గా మారిందని డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. విశాఖ సీ పోర్ట్ లో 25 కిలోల  గంజాయి కంటైనర్ సిబిఐ స్వాధీనం చేసుకున్నప్పటికే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇంతవరకు ఏ ఒక్కరిని అరెస్ట్ చేయలేదని పవన్ కళ్యాణ్ కేంద్ర హోమంత్రి అమిత్ షాకు ట్వీట్ చేశారు. రెండు రోజుల క్రితం ఆయన అమిత్ షాను కలిసిన నేపథ్యంలో తాజా ట్వీట్ ఎపి రాజకీయాల్లో సంచలనమైంది. ఇంటర్ పోల్ ఇచ్చిన సమాచారం మేరకు సిబిఐ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆపరేషన్ గరుడ పేరుతో సిబిఐ ఈ డ్రగ్స్ రాకెట్ బయటపెట్టింది.   వైసీపీ హాయంలో ఎపిలో గంజాయి సాగు వేల ఎకరాల్లో సాగిందని విజయవాడ కేంద్రంగా ఈ వ్యాపారం మూడు పూవులు, ఆరు కాయలుగా వర్దిల్లిందని పవన్ ఆరోపించారు. జగన్ అవినీతి నేర సామ్రాజ్యాన్ని అంతం చేయడానికి కేంద్రం సహకరించాలని పవన్ ఆ ట్వీట్ లో కోరారు. 

ప్రధాని నరేంద్ర మోదీని కలిసి మై హోమ్ గ్రూప్ అధినేత

చిన్న స్థాయి నుంచి కన్స్ట్రక్షన్ రంగంలో అగ్రగామిగా ఎదిగిన మై హోమ్ గ్రూప్ అధినేత డాక్టర్ జూపల్లి రామేశ్వర్ రావు, ఆయన కుమారుడు, సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్ జూపల్లి రామురావు ప్రధాని నరేంద్రమోడీతో భేటీ అయ్యారు. గురువారం (నవంబర్ 7) వీరు ప్రధానిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి సత్కరించారు. ఆ సందర్భంగా కలియుగ దైవం వేంకటేశ్వరస్వామి విగ్రహాన్ని వీరు ప్రధానికి బహూకరించారు.  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని స్నేహ పూర్వకంగా, మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ప్రధాని మోదీకి శాలువా కప్పి సత్కరించారు. కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి విగ్రహాన్ని బహుమతిగా అందించారు. 

వల్లభనేని వంశీ మెడకు నకిలీ ఇళ్ల పట్టాల కేసు ఉచ్చు!

భూమి గుండ్రంగా ఉందని ఎక్కడ మొదలయ్యామో అక్కడికే రాక తప్పదని ఇప్పటికి గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి అర్ధమై ఉంటుంది. 2019 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పరాజయం పాలై.. వైసీపీ అధికారంలోకి రాగానే వంశీకి కేసుల భయం పట్టుకుంది. అధికారంలో ఉన్న వైసీపీ పంచన చేరితే ఇక ఆ కేసుల భయం ఉండదని పార్టీ మారిపోయారు. ఇక్కడే ఆయన భూమి గుండ్రంగా కాదు బల్ల పరుపుగా ఉంటుందని భావించారు. మరెన్నడూ తెలుగుదేశం పార్టీకి అధికారంలోకి వచ్చే అవకాశం ఉండదు.. జగనే శాశ్వత సీఎం, కనుక తనపై నకిలీ ఇళ్ల పట్టాల కేసు ఎప్పటికీ తేలదని నమ్మారు. అందుకే వంశీ తనకు రాజకీయ భిక్ష పెట్టిన పార్టీని వదిలేసి జగన్ పంచన చేరి వైసీపీ కండువా కప్పు కున్నారు. అంతేనా.. ఇన్నాళ్లూ ఆశ్రయం ఇచ్చిన పార్టీపై ఇష్టారీతిన ప్రేలాపనలు పేలారు. తెలుగు దేశం అధినేత సతీమణి భువనేశ్వరిపైనా అనుచిత వ్యాఖ్యలు చేశారు. తనకు అండగా నిలబడిన గన్నవరం తెలుగుదేశం క్యాడర్ ను వేధించారు. ఐదేళ్లు తిరిగే సరికి సీన్ మారిపోయింది. జగన్ పార్టీ ఎన్నికలలో చిత్తుచిత్తుగా ఓడిపోయింది అని భావించారు. జగన్ సీఎం పదవి పోయింది. ఓటమి అనేదే లేకుండా తాను గెలుస్తూ వస్తున్న గన్నవరం అసెంబ్లీ స్థానంలో వల్లభనేని వంశీ కూడా ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు. భూమి గుండ్రంగానే ఉందని, ఉంటుందని ఇప్పుడు వంశీకి బోధపడి ఉంటుంది. ఎందుకంటే ఏ కేసు భయంతో అయితే  వంశీ తనకు రాజకీయ భిక్ష పెట్టిన పార్టీని వీడాడో.. అదే కేసు ఇప్పుడు ఆయనకు కటకటాల భయాన్ని చూపెడుతోంది. బాపులపాడులో నకిలీ ఇల్ల పట్టాలు తయారు చేయించి పంచిన   కేసులో వల్లభనేని వంశీ ముద్దాయి.  2019 ఎన్నికలలో  వైసీపీ అధికారంలోకి రావడంతో ఆ కేసులో తనకు జైలు తప్పదన్న భయంతో ఆయన పార్టీ మారిపోయారు. వైసీపీ కండువా కప్పుకున్నారు. ఆయన భావించినట్లే వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లూ నకిలీ ఇళ్ల పట్టాల కేసు పట్టాలెక్కలేదు. ఆ కృతజ్ణతో లేక వైసీపీ అధినాయకత్వం ఒత్తిడో తెలియదు కానీ వంశీ వైసీపీ పంచన చేరి తెలుగుదేశం నేతలపై ఇష్టాను సారం వ్యాఖ్యలు చేశారు. సొంత నియోజకవర్గంలోని తెలుగుదేశం క్యాడర్ ను వేధించారు. ఇప్పుడు కర్మఫలం అనుభవించక తప్పని పరిస్థితిలో ఉన్నారు. నకిలీ ఇళ్ల పట్టాల వ్యవహారంలో కోర్టు ఆదేశాల మేరకు ఇప్పుడు వంశీపై కేసు నమోదు అవ్వనుంది. వైసీపీ నుంచి అండ లభించే అవకాశాలు లేశమాత్రంగానైనా కనిపించడం లేదు. దీంతో వంశీ పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడగా మారిపోయింది. కటకటాలు లెక్కిండానికి రోజులు లెక్కపెట్టుకోవడమే మిగిలింది.

మూసీ ప్రక్షాళన చేసి తీరుతాం.. రేవంత్ రెడ్డి శ‌పథం.. బీఆర్ఎస్ కింకర్తవ్యం!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  అధికారపగ్గాలు చేపట్టిన నాటి నుంచి ప్రతిపక్ష బీఆర్ఎస్ పై దూకుడుగానే ముందుకెళ్తున్నారు. ప్ర‌తిప‌క్షంలో ఉన్న స‌మ‌యంలో అధికార బీఆర్ఎస్ పార్టీపై విమ‌ర్శ‌ల దాడి చేసిన రేవంత్‌.. అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత కూడా అదే ఫార్ములాను అమ‌లు చేస్తున్నారు. త‌ద్వారా రేవంత్ దూకుడుతో  బీఆర్ఎస్ తేలిపోతున్న ప‌రిస్థితి. తెలంగాణ రాజ‌కీయాల్లో ప‌దేళ్లుగా పెద్ద‌దిక్కుగా ఉంటూ వ‌చ్చిన మాజీ సీఎం కేసీఆర్‌ అధికారం కోల్పోయిన త‌రువాత కేవ‌లం త‌న ఇంటికే ప‌రిమిత‌మ‌య్యారు. ఒక ప‌క్క అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు కేటీఆర్ ఆధ్వ‌ర్యంలో బీఆర్ఎస్ నేత‌లు ప్ర‌య‌త్నాలు చేస్తున్నా.. కేసీఆర్  మాత్రం నోరు మెద‌ప‌డం లేదు. దీంతో అధికార కాంగ్రెస్ ను ఎదుర్కోవ‌టంలో బీఆర్ఎస్ ఆశించిన స్థాయిలో స‌ఫ‌లం కావ‌డం లేదు. దీనికి తోడు బీఆర్ఎస్ పార్టీని వీడుతున్న నేత‌ల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్ర‌త్యామ్నాయం మేమే అని చెప్పుకుంటున్న బీజేపీ నేత‌లు సైతం ప్ర‌జాస‌మ‌స్య‌లపై గ‌ళ‌మెత్త‌డంలో విఫ‌ల‌మ‌వుతున్నారు.  బీజేపీలో ఒక‌రిద్ద‌రు నేత‌లు మిన‌హా మిగిలిన నేత‌లు రేవంత్ స‌ర్కార్ వైఫ‌ల్యాల‌ను ఎత్తిచూపేందుకు అసలు ప్రయత్నమే చేయడం లేదు. తాజాగా హైడ్రా, మూసీ ప్ర‌క్షాళ‌న విష‌యంలోనూ బీఆర్ఎస్ నేతల నేత‌ల మ‌ధ్య స‌మ‌న్వ‌యలోపం  కొట్టొచ్చిన‌ట్లు క‌నిపిస్తోంది. అలాగే బీజీపీ కూడా మూసీ ప్రక్షాళన, హైడ్రా విషయంలో  ఉదాశీనంగానే ఉంటోందని రాజకీయవర్గాలలో గట్టిగా వినిపిస్తోంది.  మూసీ నది పరివాహక ప్రాంత అభివృద్ధి  (మూసీ నది ప్రక్షాళన) ప్రాజెక్టు తెలంగాణ రాజకీయాల్లో కేంద్ర బిందువుగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి మూసీ ప్ర‌క్షాళ‌న‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు. హైదరాబాద్‌ను వరదల నుంచి రక్షించేందుకు, ఆక్రమణకు గురైన మూసీ నది పరివాహక ప్రాంతాలను పునరుద్ధరించి, కాలుష్య కోరల నుంచి మూసీని కాపాడేందుకు   మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టారు. అధికారులు ముందుగా మూసీ నది ఎఫ్‌టీఎల్‌ పరిధిని సర్వే చేశారు. ఈ సర్వేలో దాదాపు 16 వేల నివాసాలు ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఉన్నట్లు తేలింది. అందులో పేద, మధ్యతరగతి వారు నివసిస్తున్నారు. దీంతో ప్రభుత్వం  మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్‌లో భాగంగా ఎఫ్‌టీఎల్‌ పరిధిలో నివాసాలు ఏర్పాటు చేసుకొని జీవిస్తున్న పేదలకు ఉచితంగా డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు ఇవ్వాలని   నిర్ణయించింది. అందుకోసం ఇప్పటికే జీఓ కూడా జారీ చేసింది. పోలీసు భద్రత మధ్య కూల్చి వేయాల్సిన ఇళ్లకు అధికారులు మార్క్ వేశారు. ప‌లు ప్రాంతాల్లో ఇళ్ల‌ను   కూల్చివేశారు. దీంతో స్థానికంగా మెజార్టీ ప్ర‌జ‌ల నుంచి తెలంగాణ ప్ర‌భుత్వ నిర్ణ‌యంపై వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌య్యింది. త‌మ ఇళ్ల‌ను కూల్చొద్దంటూ మూసీ బాధితులు ఆందోళ‌న‌కు దిగారు. వారికి అండ‌గా ఉంటామ‌ని బీఆర్ఎస్‌, బీజేపీ నేత‌లు హామీలిచ్చారు. కొంద‌రు నేతలు బుల్డోజ‌ర్లు బాధితుల‌ ఇళ్ల‌పైకి వెళ్లాలంటే మ‌మ్మ‌ల్ని దాటుకొని వెళ్లాలంటూ రేవంత్ స‌ర్కార్ కు హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. కానీ, రేవంత్ స‌ర్కార్ మాత్రం మూసీ సుంద‌రీక‌ర‌ణ విష‌యంలో ఏమాత్రం వెన‌క్కు త‌గ్గేలా క‌నిపించ‌డం లేదు.  తాజాగా సీఎం రేవంత్ రెడ్డి త‌న పుట్టిన‌రోజు సంద‌ర్భంగా మూసీ పున‌రుజ్జీవ‌న పాద‌యాత్ర చేప‌ట్టారు. సంగెంలోని మూసీ న‌ది ఒడ్డున ఉన్న శివ‌లింగానికి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించి యాత్ర‌ను మొద‌లు పెట్టారు. యాదాద్రి జిల్లా వ‌లిగొండ మండ‌లం సంగెం నుంచి భీమ‌లింగం వ‌ర‌కు సుమారు మూడు కిలో మీట‌ర్ల మేర రేవంత్ పాద‌యాత్ర కొన‌సాగింది. అనంత‌రం జ‌రిగిన స‌భ‌లో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మూసీ ప్ర‌క్షాళ‌న చేసి తీరుతామ‌ని, వెన‌క్కు త‌గ్గేది లేద‌ని స్ప‌ష్టం చేశారు. చారిత్రాత్మ‌క‌మైన ఈ ప్రాజెక్టును అడ్డుకోవాల‌ని చూస్తే కేసీఆర్ కుక్క‌చావు చ‌స్తార‌ని, కేటీఆర్, హ‌రీశ్ రావుల‌పై బుల్డోజ‌ర్ల‌తో తొక్కుకుంటూ ముందుకు వెళ్తామ‌ని ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. ఈ పాద‌యాత్ర కేవ‌లం ట్రైల‌ర్ మాత్ర‌మే.. అస‌లు సినిమా ముందుందని రేవంత్ పేర్కొన్నారు. 2025 జనవరి మొదటి వారంలో వాడపల్లి నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర మొదలు పెడతానని, ముఫ్పై రోజుల్లో మూసి ప్రక్షాళన ప్రాజెక్టు డిజైన్లు ఖరారు అవుతాయన్నారు. ఒక విధంగా చెప్పాలంటే సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌ల‌కు సీరియ‌స్ వార్నింగ్ ఇచ్చారు. ఈ క్ర‌మంలో వారు ఎలా రియాక్ట్ అవుతార‌నే విష‌యం ఆస‌క్తిక‌రంగా మారింది.  మూసీ న‌ది ప్ర‌క్షాళ‌న అనేది హైద‌రాబాద్ వాసుల‌కు సంతోషించే విష‌య‌మ‌నే చెప్పాలి. గ‌తంలో బీఆర్ఎస్ ప్ర‌భుత్వం ఆ మేర‌కు ప్ర‌య‌త్నాలు చేసిన‌ప్ప‌టికీ అడుగులు ముందుకు ప‌డ‌లేదు. కానీ, సీఎం రేవంత్ రెడ్డి  మాత్రం ప‌ట్టుద‌ల‌తో ముందుకెళ్తున్నారు. మూసీ ప‌రివాహ‌క ప్రాంతాల్లోని నివాస‌దారుల‌ను ఒప్పించి, వారికి డ‌బుల్ బెడ్ రూం ఇళ్లు క‌ట్టిస్తామనీ,  మూసీ ప్ర‌క్షాళ‌న విషయంలో మాత్రం వెనకడుగు లేదనీ విస్ఫష్టంగా చెబుతున్నారు.  అయితే, స్థానికంగా ప్ర‌జ‌ల నుంచి ప్ర‌భుత్వం తీరుపై తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మవుతున్నది. మ‌రో ఏడాదిన్న‌ర‌లో గ్రేట‌ర్ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో  మూసీ న‌ది ప్ర‌క్షాళ‌నతో పార్టీకి న‌ష్టం వాటిళ్లుతుంద‌ని కొంద‌రు కాంగ్రెస్ నేత‌ల్లో ఆందోళ‌న నెల‌కొంది. అయినా సీఎం రేవంత్ ఎక్క‌డా వెన‌క‌డుగు వేసేందుకు ఇష్ట‌ప‌డటం లేదు. మ‌రోవైపు మూసీ బాధితుల త‌ర‌పున పోరాటం చేసేందుకు ప్ర‌తిప‌క్షాలు ముందుకొచ్చిన‌ప్ప‌టికీ.. ప్ర‌భుత్వం దూకుడు ముందు నిల‌వ‌లేక పోతున్నాయి. తాజాగా సీఎం రేవంత్ వ్యాఖ్యల‌తో మూసీ న‌ది ప్ర‌క్షాళ‌న ప‌నులువేగం పుంజుకోనుంది. అయితే, విపక్ష పార్టీలైన బీజేపీ, బీఆర్ఎస్ రేవంత్ దూకుడుకు ఏ మేర‌కు అడ్డుక‌ట్ట వేస్తాయి, మూసీ బాధితుల‌కు ఏ మేర‌కు అండ‌గా నిలుస్తాయ‌నేది వేచి చూడాల్సిందే.

వర్రా రవీందర్ రెడ్డి అరెస్టు.. మహబూబ్ నగర్ సమీపంలో పట్టుకున్న పోలీసులు

వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీందర్ రెడ్డిని పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. రెండు రోజుల కిందల కడప జిల్లా పోలీసుల నుంచి తప్పించుకుని పరారైన వర్రా రవీందర్ రెడ్డిని పోలీసులు తెలంగాణ రాష్ట్రం మహబూబ్నగర్ సమీపంలో అదుపులోనికి తీసుకున్నారు.  వైసీపీ అధికారంలో ఉన్న కాలంలో  ఆ పార్టీ అండతో వర్రా రవీందర్ రెడ్డి చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్, వంగలపూడి అనిత సహా జగన్ సోదరి షర్మిల, తల్లి విజయమ్మలపై సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడుతూ చెలరేగిపోయాడు.  ఆయన పై పలు ఫిర్యాదులు ఉన్నాయి. అయితే వైసీపీ అధికారంలో ఉన్నంత వరకూ వర్రారవీందర్రెడ్డిపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు.    అలాంటి వర్రా రారవీందర్ రెడ్డిని  రోజుల కిందట  పులివెందులతో పోలీసులు అదుపులోనికి తీసుకుని కడప తరలించారు. అక్కడ పోలీసుల నిర్లక్ష్యంతో వర్రా రవీందర్ రెడ్డి తప్పించుకుని పారిపోయాయడు. కడప ఎంపీ, వైసీపీ నాయకుడు అవినాష్ రెడ్డికి ప్రధాన అనుచరుడైన వర్రా రవీందర్ రెడ్డిపై కడప, రాజంపేట, మంగళగిరి పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. అటువంటి వర్రా తప్పించుకు పారిపోవడంపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. కడప ఎస్పీపై బదిలీ వేటు వేసింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు వర్రా రవీందర్ రెడ్డి కోసం తీవ్ర స్థాయిలో గాలింపు చర్యలు చేపట్టారు. నాలుగు బృందాలుగా ఏర్పడి కడప, పులివెందుల, బెంగళూరు, హైదరాబాద్ లలో గాలింపు చర్యలు చేపట్టారు.  ఈ నేపథ్యంలో వర్రా తెలంగాణా రాష్ట్రానికి పారిపోతుండగా పోలీసులు మహబూబ్ నగర్ సమీపంలో అరెస్టు చేశారు. వర్రాను అక్కడ నుంచి కడపకు తరలిస్తున్నట్లు సమాచారం 

ఫార్ములా- ఇ రేస్ స్కాం.. బాబు జపం దేనికి కేటీఆర్?

ఫార్ములా -ఇ కార్ లో భారీ స్కామ్ జరిగిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ కుంభకోణంలో ఆయన అరెస్టయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే  కేటీఆర్ కూడా తన అరెస్టు అనివార్యం అని భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. అరెస్టు భయం లేదు, ఒక వేళ అరెస్టు చేస్తే జైల్లో యోగా చేసి మరింత ఫిట్ గా తయారౌతానంటూ చెప్పుకొస్తున్నారు. ఒక విధంగా అరెస్టుకు కేటీఆర్ మానసికంగా రెడీ అయిపోయినట్లు కనిపిస్తోందని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు.   ఈ నేపథ్యంలోనే  ఇటీవల తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ తన హయాంలో అంటే తాను మంత్రిగా ఉన్న సమయంలో హైదరాబాద్ ఇన్వెస్టర్లకు ఎలా ప్రధాన గమ్యంగా మారిదో వివరించారు. తాను ఐటీ మంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడానికి చేసిన ప్రయత్రాలను, సాధించిన ఫలితాలను వివరించిన కేటీఆర్ పనిలో పనిగా ఫార్ములా - ఇ కార్ వ్యవహారాన్ని కూడా ప్రస్తావించారు. అలా ప్రస్తావించి ఊరుకోకుండా చంద్రబాబు హయాంలో హైదరాబాద్ లో ఫార్ములా -1 రేస్ నిర్వహణ కోసం జరిగిన ప్రయత్నాలను ప్రస్తావించారు. తద్వారా  తాను చేసింది రైట్ అని చెప్పుకోవడానికి ప్రయత్నించారు. చంద్రబాబు ప్రయత్నానికి తాను చేసింది కొనసాగింపు మాత్రమేనని చెప్పుకోవడానికి ప్రయత్నించారు. ఫార్ములా -ఇ కార్  ను అడ్డుకోవడం ద్వారా రేవంత్ హైదరాబాద్ ప్రతిష్టను దిగజార్చారని ఎదురుదాడికి దిగారు. చంద్రబాబు పేరు ప్రస్తావించడం ద్వారా రేవంత్ రెడ్డిని డిఫెన్స్ లో  పడేయాలన్నదే కేటీఆర్ ప్రయత్నంగా కనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు. అదే సమయంలో కామన్ వెల్త్ క్రీడల నిర్వహణ సందర్భంగా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంపై వచ్చిన విమర్శలను ప్రస్తావించారు. మొత్తం మీద కేటీఆర్ తనపై ఆరోపణలను పక్కదారి పట్టించేందుకు చంద్రబాబు పేరును వాడేసు కుంటు న్నారు. ఫార్ముల వన్ రేస్ ల కోసం చంద్రబాబు ప్రయత్నాలకు ఇప్పడు కేటీఆర్ ఎదుర్కొంటున్న ఆరోపణలకూ ఏ మాత్రం సంబంధం లేదని, చంద్రబాబును అడ్డుపెట్టుకుని బయటపడడానికి ప్రయత్నించడం సరికాదనీ, ఫార్ములా -ఇ రేస్ కుంభకోణంలో తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని నెటిజన్లు పేర్కొంటున్నారు.  

యాదాద్రిలో రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు 

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం యాదాద్రి లక్మి నరసింహాస్వామిని దర్శించుకున్నారు. హైద్రాబాద్ లోని తన నివాసం నుంచి హెలికాప్టర్ ద్వారా ముఖ్యమంత్రి యాదాద్రి చేరుకున్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత యాదాద్రికి చేరుకోవడం ఇది రెండోసారి. మంత్రులు కోమటి రెడ్డి వెంకట రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు  ఆలయ ప్రధాన అర్చకులు ఆలయ మర్యాదలతో  ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. రేవంత్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో ప్రతేక పూజలు చేశారు. ఆలయ అభివృద్ది పనులపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. యాదాద్రి నుంచి వలిగొండకు రోడ్డు మార్గంలో వలిగొండకు చేరుకున్నారు. సంగెం నుంచి మూసీ పునరుజ్జీవ సంకల్పయాత్రను రేవంత్ రెడ్డి   ప్రారంభించారు.