మున్సిపోల్స్..104 స్థానాల ఫలితాల్లో 96 స్థానాల్లో టీఆర్ఎస్ ఘనవిజయం!

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఒక్కటొక్కటిగా వెలువడుతున్నాయి. కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి టీఆర్ఎస్ పార్టీ చాలా మునిసిపాలిటీల్లో ముందంజలో దూసుకుపోతోంది. ఇప్పటికీ 104 స్థానాల్లో ఫలితాలు వెలువడ్డాయి. 104 స్థానాల్లో టిఆర్ఎస్ సింహ భాగంగా దాదాపు 95 నుంచి 98 శాతం ఆక్రమించినట్లు స్పష్టంగా ఫలితాలు వెల్లడిస్తున్నాయి. ఆధిక్యం గెలుపు సొంతం చేసుకుంటూ టీఆర్ఎస్ లో 96 స్థానాల్లో ముందంజలో ఉంటే కాంగ్రెస్ కేవలం 4 స్థానాలు బీజేపీ కేవలం 1 స్థానంలో ఉండగా 3 చోట్ల ఇతరులు ముందంజలో ఉన్నారు. బోడుప్పల్ లో టీఆర్ఎస్ తనదైన సత్తా చాటుతూ ముందుకు సాగిపోయింది. కొన్ని చోట్ల కాంగ్రెస్,బీజేపీ,రెబల్స్ కూడా గట్టి పోటీనే ఇస్తున్నారు.తమ పార్టీలు గెలుపొందాలని, గెలుపొందిన నేతలను ఇరు పార్టీలు వారి వైపుకు లాక్కునే ప్రయత్నాలు కూడా చేపడుతున్నారు.మొత్తం మీద కారు జోరు ఎవరికి చిక్కకుండా తనదైన శైలిలో దూసుకుపోతొంది.

అట్టర్ ప్లాప్.. జగన్ కాపీ కొట్టిన మూడు రాజధానుల ఫార్ములా ఫెయిల్!

సౌతాఫ్రికా మోడల్ కాపీకొట్టి ఏపీ లో మూడు రాజధానులు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్న జగన్ సర్కారు పై ఎన్నారైలు మండిపడుతున్నారు. ప్రజలని మభ్యపెట్టవద్దని హెచ్చరిస్తున్నారు. సౌతాఫ్రికాలో స్థిరపడ్డ తెలుగు వారంతా ఓ చోట పోగై అక్కడ అమలవుతున్న మూడు రాజధానులతో అటు ప్రజలు ఇటు ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పడుతుందో చెప్పుకొచ్చారు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లుగా ఏపీని మార్చొద్దని సూచించారు. జగన్ సర్కార్ నిర్ణయాన్ని తప్పుబడుతూ సౌతాఫ్రికాలో ఈ రకంగా నిరసన వ్యక్తం చేశారు. సౌతాఫ్రికాలో ప్రిటోరియా, కెప్టెన్, బ్లూంఫౌంటేన్ నగరాలు క్యాప్టల్ గా ఉన్నట్లే ఏపికి కూడా మూడు రాజధానులు చేస్తామని ప్రకటించారు సీఎం జగన్. అడ్మినిస్ర్టేటివ్ క్యాపిటల్ గా ఉన్న ప్రిటోరియాలో ప్రభుత్వ శాఖలు, ఉద్యోగుల కార్యాలయాలు ఉండగా లెజిస్లేటివ్ క్యాపిటల్ గా ఉన్న కెప్ టౌన్ లో చట్ట సభలు మాత్రమే ఉన్నాయి. ఇక జుడీషియల్ క్యాపిటల్ గా బ్లోమ్ ఫౌంటెన్ లో సుప్రీంకోర్టు ఉంది. సేమ్ మక్కీ టూ మక్కీ ఇదే ఫార్ములాను సీఎం జగన్ కాపీ కొట్టింది. విశాఖ కేంద్రంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అమరావతి కేంద్రంగా లెజిస్టేటివ్ క్యాప్టిల్, కర్నూల్ కేంద్రంగా జుడిషియల్ క్యాప్టిల్ మార్చేలా బిల్లు తీసుకొచ్చారు. ఈ చెత్త ఫార్ములాతో సౌతాఫ్రికా చాలా నష్టపోయిందని ఖర్చులు తడిసి మోపడవడంతో ప్రగతి మందగించిందని ఆదేశా నాయకులే నెత్తీ నోరూ బాదుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయాన్ని ఇప్పుడు సౌతాఫ్రికాలో స్థిరపడ్డ తెలుగువాళ్లు కూడా గుర్తు చేస్తున్నారు. త్రీ క్యాప్టల్స్ ఫార్ములా అట్టర్ ఫ్లాప్ అయిన దేశం నుంచే తమ గొంతుక వినిపిస్తున్నారు. సౌతాఫ్రికాలో స్థిరపడ్డ తెలుగు వాళ్లంతా ఓ చోట పోగై సెమినార్ నిర్వహించారు. జగన్ సర్కార్ కు కనువిప్పు కావాలని నినాదించారు. అమరావతి నిర్మాణానికి డిజైన్ ఇచ్చిన సింగపూర్ కన్సాల్టియం ఇచ్చిన డిజైన్ తోనే చైనాలో ఓ సిటీ కడితే ఏకంగా 20,000 మందికి ఉద్యోగాలు వచ్చాయని చెప్పుకొచ్చారు. అమరావతి నిర్మాణం పూర్తయితే లక్షల మందికి ఉపాధి దొరుకుతుందని చెప్పారు.

ధర్మపురిలో ఒక్క స్థానం తేడాతో మునిసిపల్ చైర్మన్ కైవసం చేసుకున్న టీఆర్ఎస్!!

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో టిఆర్ఎస్ దూసుకుపోతోంది. పలుచోట్ల టీఆర్ఎస్ అభ్యర్ధులు విజయాలు సాధించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మునిసిపాల్టీల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ హోరాహోరీ తలపడ్డాయి. చివరికి ఒక్క వార్డు తేడాతో టిఆర్ఎస్ ధర్మపురిలో గట్టెక్కింది. సాక్షాత్తూ మంత్రి కొప్పుల ఈశ్వర్ అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ధర్మపురి మునిసిపాలిటీలో మొత్తం 15 వార్డులు ఉన్నాయి. అక్కడ ఎనిమిది వార్డుల్లో టీఆర్ఎస్ గెలిచింది. ఏడు వార్డుల్లో కాంగ్రెస్ గెలిచింది. ఒక్క వార్డు తేడాతో టీఆర్ఎస్ మునిసిపల్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకున్నట్లు స్పష్టంగా మనకు తెలుస్తుంది. అయితే ముందు నుంచి కొంత కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు కాంగ్రెస్ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మన్ ధర్మపురి ఇంచార్జిగా ఉన్నారు. మెజారిటీ స్థానాల్లో గెలిచింది ఒక్క వార్డు తేడాతో మాత్రమే గనుక టీఆర్ఎస్ మునిసిపల్ చైర్మన్ కైవసం చేసుకుంది. ఏడు వార్డుల్లో గెలవడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. అక్కడ మంత్రి కూడా ఉన్నారు. ఇక ప్రధానంగా ఈ మున్సిపాలిటీలో ఉన్న పలువురు అభ్యర్థుల ఫోన్లు స్విచ్ఛాఫ్ వస్తున్నాయి. మరి వాళ్లు ఏ పార్టీకి సంబంధించిన క్యాంపు రాజకీయంలోకి వెళ్లారు అనేది ఇప్పటి వరకు తెలియడం లేదు. ఒకరిని లేదా ఇద్దరిని లాగేసుకుంటే లేదా తమ వైపు తిప్పుకుంటే చైర్మన్ కాంగ్రెస్ అయ్యే అవకాశముంది. దీంతో ఈ రెండు రోజులు అంటే మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక అయ్యే వరకు ధర్మపురిలో హైడ్రామా కొనసాగుతూనే ఉంటుంది.

హోరాహోరీ పోరు.. జనగామలో అత్యధిక స్థానాల్లో టీఆర్ఎస్ గెలుపు!

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇప్పటి వరకు తొమ్మిది మునిసిపాలిటీల కౌంటింగ్ దాదాపు పూర్తయ్యింది. మరి కొన్ని ఫలితాలు మాత్రమే వెలువడాల్సిన అవసరాలు ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా ఈ తొమ్మిది లో మాత్రం టీఆర్ఎస్ హవా మాత్రం జోరుగా కొనసాగుతోంది. జనగామలో దాదాపు 13 స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. వర్దన్నపేట 8 స్థానాలను కైవసం చేసుకుంది. నర్సంపేట 16 స్థానాలను కైవసం చేసుకుంది. అలాగే పరకాల దాదాపు క్లీన్ స్వీవ్ అంటే 22 స్థానాలకు 17 స్థానాలు టిఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్న పరిస్థితి.  మహబూబాబాద్ లో కూడా మొత్తం 36 స్థానాలకు 18  స్థానాలు టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. అలాగే తొర్రూరులో 15 స్థానాలకు మొత్తం 11 స్థానాలను కైవసం చేసుకుంది. ఈ లెక్కన చూస్తే దాదాపు పూర్తిగా టీఆర్ఎస్ పార్టీ మాత్రమే ఒక విధంగా అన్ని చైర్ పర్సన్ అభ్యర్ధులను గెల్చుకునే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. జనగామలో కూడా ఇప్పటి వరకు కొంత హోరాహోరిగా సాగింది. కానీ టీఆర్ఎస్ మాత్రం ముందంజలో ఉంది. జనగామలో మాత్రం టీఆర్ఎస్ 13 స్థానాలు గెలుచుకుంది. కాంగ్రెస్ 10 స్థానాలను గెలుచుకుంది.. బిజెపి 4 స్థానాలు గెలుచుకోగా.. ఇండిపెండెంట్ అభ్యర్ధులు మాత్రం మూడు స్థానాలను గెలుచుకున్నారు.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో కారు జోరు!!

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న 9 మునిసిపాలిటీల పరిధిలో కౌంటింగ్ ప్రక్రియ వేగవంతమైంది. ఉమ్మడి జిల్లాలో ఉన్న మూడు మునిసిపాలిటీల్లో గులాబీ జెండా రెపరెపలాడుతుంది. ప్రధానంగా డోర్నకల్  మంత్రి సత్యవతి రాథోడ్ ప్రాతినిధ్యం వహిస్తున్న డోర్నకల్ నియోజకవర్గంలో ఉన్న మరిపెడలో 15 కి 15 వార్డులను టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసి టీఆర్ఎస్ ఖాతాలో జమచేసుకుంది. అదే విధంగా వరంగల్ రూరల్ జిల్లాలో ఉన్న వర్దన్నపేట మునిసిపాలిటీలో ఇప్పటికే టీఆర్ఎస్ ఎనిమిది వార్డులను గెలుచుకుని అక్కడ మొత్తంగా చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంది. పరకాలలో ఉన్న 22 వార్డుల్లో 13 వార్డులతో టీఆర్ఎస్ కైవసం చేసుకోగా మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న పది మున్సిపాలిటీల్లో మూడు మునిసిపాలిటీలను టిఆర్ఎస్ తన ఖాతాలో వేసుకోవడంతో ఉమ్మడి వరంగల్ జిల్లా వాప్తంగా సంబరాలు అంబరాన్ని అంటుకుంటున్నాయి. ప్రతి చోట టీఆర్ఎస్ అభ్యర్ధులు అప్రతిహతంగా ముందుకు పోతున్న వాతావరణం ఉంది.  జనగామలో సగానికి పైగా ఇప్పటికే టీఆర్ఎస్ అభ్యర్ధులు ముందంజలో ఉన్నారు. అక్కడ మూడు వార్డుల్లో బిజెపి, మూడు వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్ధులు ముందంజలో ఉన్నారు. ఇక భూపాలపల్లి మునిసిపాలిటీలో మొత్తం టీఆర్ఎస్ అభ్యర్ధులు ఏకపక్ష విజయాన్ని నమోదు చేసే దిశగా పయనిస్తున్న పరిస్థితి ఉంది. ఇక ప్రతిష్టాత్మక వరంగల్ రూరల్ జిల్లాలో మరో మునిసిపాలిటీ ఉంది. నర్సంపేట మున్సిపాల్టీలో మాత్రం కౌంటింగ్ ప్రక్రియ చురుగ్గా కొనసాగుతోంది. మొత్తంగా మొదటి రౌండ్ కు సంబంధించిన ఫలితాలు చేరేసరికి కాంగ్రెస్ అభ్యర్థులు కొన్ని వార్డుల్లో గట్టి పోటీని ఇస్తున్నట్లు  చాలా స్పష్టంగా ఉంది.

కేటీఆర్ ధీమా.. టీఆర్ఎస్ కైవసం చేసుకున్న మునిసిపాలిటీలు ఇవే!

రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ విజయ దుందుభీ కొనసాగుతోంది. మరిపెడ, ధర్మపురి, కొత్తపల్లి, చెన్నూరు, పరకాల, బాన్సువాడ అలాగే పెద్దపల్లి మున్సిపాల్టీలను టిఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. మరిపెడలో మొత్తం అన్ని వార్డుల్లో క్లీన్ స్వీప్ చేసి మరిపెడ మున్సిపాలిటీ పై గులాబీ జెండా ఎగురవేసింది. ధర్మపురి మున్సిపాల్టీ , కొత్తపల్లి మున్సిపాల్టీ, చెన్నూరు, పరకాల, బాన్సువాడ మరియు పెద్దపల్లి ఈ అన్ని మున్సిపాల్టీలను టిఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. ఐడీఏ బొల్లారం పై కూడా టిఆర్ఎస్ పార్టీ తన జెండా ఎగురవేసింది.   మొదటి నుంచి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మంత్రి కేటీఆర్ ఎటువంటి ధీమా వ్యక్తం చేస్తున్నారో ఆ ధీమా నూటికి నూరు శాతం నిజమైంది. తమ వ్యూహానికి తిరుగులేదంటూ మరోసారి పట్టణ ప్రజలు కేటీఆర్ వ్యూహానికి సపోర్ట్ చేస్తూ వారికి అండగా నిలిచారు. తెలంగాణ భవన్ లో ఫలితాల సరళిని పార్టీ నాయకులతో కలిసి వీక్షిస్తున్నారు కేటీఆర్. ఇదిలా ఉంటే కేటీఆర్‌ సొంత నియోజకవర్గం సిరిసిల్లలో స్వతంత్ర అభ్యర్థుల హవా కూడా కొనసాగింది. స్వతంత్రులు ఏకంగా 10 మంది గెలిచారు. మొత్తం 39 వార్డులకు ఓట్ల లెక్కింపు ముగియగా టీఆర్‌ఎస్‌ 24 వార్డుల్లో గెలిచింది. బీజేపీ 3, కాంగ్రెస్‌ 2 స్థానాలు దక్కించుకోగా, స్వతంత్రులు 10 స్థానాల్లో గెలుపొందారు. సిరిసిల్లలో మొత్తం వార్డులన్నీ టీఆర్ఎస్సే కైవసం చేసుకుంటుందని ఆ పార్టీ నేతలు భావించారు. కానీ అనూహ్యంగా స్వతంత్రులు 10 మంది గెలుపొందారు. ఈ 10 మంది కూడా టీఆర్ఎస్ రెబల్స్ కావడం విశేషం.

బొమ్మ బొరుసయ్యింది.. నారాయణఖేడ్ లో కాంగ్రెస్ జెండా రెపరెపలు!!

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను టీఆర్ఎస్ గెలుచుకుంటుంది. అయితే కొన్ని చోట్ల అధికార పార్టీకి కాంగ్రెస్ షాక్ ఇస్తోంది. నారాయణఖేడ్ లో కాంగ్రెస్ విజయం సాధించింది. మొత్తం 15 వార్డుల్లో 8 స్థానాల్లో కాంగ్రెస్, 7 స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీలు స్థానాలను గెలుచుకున్నాయి. 6వ వార్డులో కాంగ్రెస్ కు 7 ఓట్ల ఆధిక్యం వచ్చింది. దీంతో టీఆర్ఎస్ రీకౌంటింగ్ కు డిమాండ్ చేసింది. 7వ వార్డు లో టిఆర్ఎస్ కు 2 ఓట్ల ఆధిక్యం రాగా కాంగ్రెస్ రీకౌంటింగ్ కోరింది.  మొత్తం మీద కాంగ్రెస్ నేతలు అందరూ కలిసి కట్టుగా పనిచేయటం హస్తం పార్టీకి కలిసొచ్చింది. ఇదే సమయంలో టీఆర్ఎస్ లోని వర్గ విభేదాలు నారాయణఖేడ్ లో అధికార పార్టీకి షాక్ ఇచ్చాయి. స్థానిక ప్రజలకు ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అందుబాటులో ఉన్నప్పటికీ మిగిలిన నేతలందరూ కలిసి రాకపోవడంతో టీఆర్ఎస్ కు అనూహ్య ఫలితాలు ఎదురయ్యాయి. నారాయణఖేడ్ లో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. మొత్తం మీద వెలువడిన ఫలితాల ప్రకారం టీఆర్ఎస్ పార్టీ కన్నా కాంగ్రెస్ ముందంజలో ఉంది. ఎట్టకేలకు నారాయణఖేడ్ మున్సిపాలిటీ పై కాంగ్రెస్ జెండా ఎగరవేయబోతున్నట్లు సమాచారం.

కారు జోరు.. మునిసిపల్ ఫలితాల్లో టీఆర్ఎస్ ఏకపక్ష విజయాలు!

మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ హవా  కొనసాగుతుంది. టీఆర్ఎస్ ఖాతాలో ఇప్పటికే పరకాల, చెన్నూరు, సిరిసిల్ల అలాగే బొల్లారం, హుజూర్ నగర్, జవహర్ నగర్ టీఆర్ఎస్ ఖాతాలో చేరాయి. ఇక హుజూర్ నగర్ మున్సిపాలిటీ అయితే టీఆర్ఎస్ కైవసం చేసుకోగలిగింది. ఆదిభట్లలో రెండు వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అందులో రెండవ వార్డుల్లో టీఆర్ఎస్ ముందజలో ఉంది. శంషాబాద్ లో మూడు వార్డుల్లో టీఆర్ఎస్ ముందజలో ఉంది. ధర్మపురిలో రెండవ వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించగలిగింది. బొల్లారంలో 16,17,18 వార్డులో టిఆర్ఎస్ విజయం సాధించింది. మీర్ పేట్ లోని రెండు వార్డుల్లో కూడా టీఆర్ఎస్ , మీర్ పేటలోని ఒక వార్డులో బిజెపి గెలిచినట్టుగా ప్రకటించడంతో ఇప్పటి వరకు అధికారికంగా బిజెపి ఖాతాలో విజయం చేరినట్లుగా తెలుస్తుంది. అలాగే తుక్కుగూడలో 6వ వార్డులో కూడా బీజేపీ గెలుపొందింది. ఇక వైరాలోని 7 వ వార్డులో టిఆర్ఎస్ విజయం సాధించింది. రామాయంపేటలో ఉన్న 7వ వార్డు కూడా టీఆర్ఎస్ ఖాతాలో చేరింది.   సీపిఎస్ ఇచ్చిన ఒక సర్వేలో చాలా స్పష్టంగా టీఆర్ఎస్ కే పూర్తి ఫలితం అనుకూలంగా ఉండబోతోందనే విషయాన్ని స్పష్టంగా చెప్పింది. సీపిఎస్ సర్వే అంచనా ప్రకారం మొత్తం 120 మున్సిపాలిటీల్లో.. 104 నుంచి 109 స్థానాల్లో టిఆర్ఎస్ గెలిచే ఆస్కారం ఉందని చెప్పి సీపిఎస్ తన అంచనాలని ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ సున్నా నుంచి నాలుగు స్థానాలకు మాత్రమే పరిమితం కావచ్చని ఆ సర్వేలో వెల్లడించారు. ఇక బీజేపీ రెండు స్థానాలు గెలిచే ఆస్కారం ఉంది. అలాగే ఎంఐఎం ఒకటి నుంచి రెండు చోట్ల విజయం సాధించవచ్చని సీపిఎస్ సర్వే వెల్లడించింది.  

సీన్ రివర్స్.. ఓన్లీ రెబల్స్... కొల్లాపూర్ లో జూపల్లి వర్గం హవా!!

కొల్లాపూర్ లో టీఆర్ఎస్ పార్టీకి రెబల్స్ గుండెల్లో గుబులు రేపారు. టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా బరిలో దిగిన జూపల్లి వర్గం కొల్లాపూర్లో సత్తా చాటుతోంది. తమ అనుచరులకు టికెట్లు ఇవ్వకపోవడంతో జూపల్లి వ్యూహాత్మకంగా వారిని రెబల్స్ గా బరిలోకి దింపారు. కేటీఆర్ చెప్పినా జూపల్లి వెనక్కి తగ్గలేదు. తన అనుచరులను సింహం గుర్తుతో పోటీ చేయించారు జూపల్లి. ఇప్పుడు కొల్లాపూర్ లో జూపల్లి వర్గం నేతలే సత్తా చాటుతున్నారు. మొదటి నుంచి ఈ ప్రాంతం లో జూపల్లికి పట్టుంది కానీ జూపల్లిని కాదని పార్టీలో చేరిన హర్షవర్ధన్ రెడ్డి వర్గానికి టిక్కెట్ ఇవ్వగా.. తమ అనుచరులను కూడా జూపల్లి బరిలోకి దింపారు. ప్రస్తుతం చూస్తున్న ఫలితాల ప్రకారం టీఆర్ఎస్ అభ్యర్థులు కంటే రెబల్ అభ్యర్ధులే కొల్లాపూర్ లో అధిక స్థానాలను గెలుస్తున్నారు.  ధర్మపురి మున్సిపాలిటీ టీఆర్ఎస్ కైవసం చేసుకున్నప్పటికీ అక్కడ 8 స్థానాల్లో టీఆర్ఎస్ గెలుపొందితే 7 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ  విజయం సాధించింది. వీరి మధ్య గట్టి పోటీ ఏర్పడిన వాతావరణం కనిపిస్తుంది.సిటీ శివారు ప్రాంతాల్లో కూడా టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్ధుల మధ్య నువ్వా నేనా అని గట్టి పోటీ నడుస్తొంది.కొన్ని చోట్ల టీఆర్ఎస్ అభ్యర్ధులు  గెలిస్తే మరో పలుచోట్ల బీజేపీ అభ్యర్థులు కూడా గెలుస్తున్నారు. మరికొన్నిచోట్ల ఇండిపెండెంట్లు కూడా విజయాన్ని కైవసం చేసుకుంటున్నారు.మొత్తం మీద ఎన్నికల ఫలితాలు పార్టీ నేతల మధ్య గట్టి పోటీ వాతావరణం ఏర్పడింది.

కరెంట్ కట్... రైతులకు ఇకపై 9 గంటలు కరెంట్ ఇవ్వమని కేంద్రం ఆదేశం

వ్యవసాయ రంగానికి ఆరు నుంచి ఎనిమిది గంటలు మాత్రమే విద్యుత్ ఇవ్వాలని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ అన్ని రాష్ర్టాలకు స్పష్టం చేసింది. భూగర్భ జలాలను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం అమలు చెయ్యాలని పేర్కొంది. తెలంగాణలో 24 గంటల పాటు నిరంతరాయంగా వ్యవసాయ రంగానికి ఉచితంగా విద్యుత్ ను అందిస్తూ ఉండగా.. పలు రాష్ట్రాల్లో తొమ్మిది గంటల్లోపు ఇస్తున్నారు. భూగర్భ జలాలు కలుషితం కాకుండా ఉండాలని.. వాటిని పరిరక్షించాలని ఎనిమిది గంటలకు మించి కరెంటు ఇవ్వరాదని కేంద్రం తరచుగా చెప్తూ వస్తుంది.  ఇటీవల గుజరాత్ లో నిర్వహించిన విద్యుత్ మంత్రుల సదస్సులో ఇదే అంశాన్ని చెప్పింది. తెలంగాణలో 2017 జనవరి 1వ తేదీ నుంచి వ్యవసాయ పంపుసెట్లకు 24 గంటల కరెంటును అందిస్తున్నారు. వాస్తవానికి రోజంతా కరెంటు కావాలని ఏ రైతు కూడా ప్రభుత్వాన్ని కోరలేదు. అందుకు కొందరు మంత్రులు కూడా వ్యతిరేకించారు. పలు జిల్లా పరిషత్ లో 24 గంటల కరెంటుకు వ్యతిరేకంగా తీర్మానాలు చేశాయి. వీటిని పరిగణలోకి తీసుకుంటామని ప్రభుత్వం ఒక దశలో చెప్పినా ఆచరణలోకి మాత్రం రాలేదు. వ్యవసాయానికి తొమ్మిది గంటల పాటు కరెంటు ఇచ్చేటప్పుడు 143.20 మిలియన్ యూనిట్ల వినియోగం ఉండగా.. 24 గంటల సరఫరా మొదలు పెట్టిన ఆరు రోజుల్లోనే అది 154.711 మిలియన్ యూనిట్లకు చేరింది. అదనంగా 15 గంటల కరెంటు ఇస్తున్నందున ప్రతి రోజూ దాదాపు 21 మిలియన్ యూనిట్ల వరకు అదనంగా వ్యవసాయరంగం ఖాతాలో చేరుతోందని డిస్కామ్ ల లెక్కలు చెప్తున్నాయి. అయితే నిర్దిష్టంగా ఎంత వ్యవసాయ వినియోగం ఉంటుందో డిస్కాంల వద్ద లెక్కలు లేవు. మీటర్ రీడింగ్ నమోదు కాని కరెంట్ అంతా సాగు ఖాతాలోనే చేరుతుందని పలువురు అంటున్నారు. దాంతో డిస్కాంలు ఇచ్చే ప్రతి యూనిట్ ను లెక్కించాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది. తెలంగాణ లో అధికారిగా 23 లక్షల వ్యవసాయ పంపుసెట్లు ఉండగా అనధికారికంగా మరో నాలుగు లక్షల వరకు ఉన్నాయి. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్ మీటరలు తొలగించారు. ఆ తరవాత మీటర్లు పెట్టాలనే ఆలోచన చేసిన అమలుకాలేదు. ఇప్పుడు కేంద్రం సూచనలతో మీటర్లు ఏర్పాటు చేయడం అనివార్యంగా మారింది. మూడేళ్ళలో వ్యవసాయ పంపుసెట్లను సోలార్ పంపుసెట్లుగా మార్చాలని కూడా కేంద్రం నిర్దేశించింది. రైతులకు పీఎం కుసుమ్ పథకంలో పంపుసెట్లు మంజూరు చేస్తే వినియోగం తగ్గటంతో పాటుగా రైతులు ఉత్పత్తి చేసే సోలార్ కరెంట్ కు ఆదాయం వారికే చేరుతుందని కేంద్రం చెబుతోంది.

కరోనా కల్లోలం... చైనా అతలాకుతలం...

కరోనా వైరస్... చైనాను కుదిపేస్తోంది. సుడిగాలిలా దేశమంతటా విస్తరిస్తూ అల్లకల్లోలం సృష్టిస్తోంది. వందల మంది కాదు... వేల మంది కాదు... కోట్లాది మంది చైనీయులు కరోనా భయంతో వణికిపోతున్నారు. కరోనా వైరస్ కారణంగా మరణిస్తున్నవారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. బాధితులకు చికిత్స అందిస్తున్న వైద్య సిబ్బంది కూడా ఈ వైరస్ బారినపడుతున్నారు. దాంతో, కరోనా రోగులకు చికిత్స అందించాలంటేనే వైద్యులు జంకుతున్నారు. ఇక, కరోనా బాధితులను ప్లాస్టిక్‌ ట్యూబుల్లో పెట్టి తరలిస్తున్నారు. మరోవైపు, వైరస్ విస్తరించకుండా చైనా జాగ్రత్తలు తీసుకుంటోంది. దాదాపు చైనా అంతటా ట్రావెల్ బ్యాన్ విధించింది. ముఖ్యంగా వైరస్ బయటపడిన ఉహన్ నగరంలో ప్రజారవాణాను పూర్తిగా నిలిపివేశారు. అలాగే, చైనా అంతటా అన్ని రకాల ఉత్సవాలను రద్దు చేశారు. కరోనా భయంతో చైనాకు అంతర్జాతీయ విమాన సర్వీసులు కూడా నిలిచిపోతున్నాయి. మరోవైపు వరల్డ్ వైడ్ గా కరోనా వైరస్ విస్తరిస్తోంది. కరోనా దెబ్బకు ప్రపంచ దేశాలన్నీ వణికిపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 800మంది కరోనా బారినపడగా... 25మంది ప్రాణాలు కోల్పోయారు. చైనా అంతటా కరోనా వైరస్ వ్యాపించగా... జపాన్, థాయ్ లాండ్, అమెరికాలో కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా భయంతో పలు దేశాలు చైనా వెళ్లొద్దని తమ పౌరులకు హెచ్చరికలు జారీ చేశాయి. కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తుండటంతో భారత్ కూడా అప్రమత్తమైంది. అన్ని విమానాశ్రయాల్లో విదేశీ ప్రయాణికులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులోనూ అధికారులు ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు. చైనా, హంకాంగ్ నుంచి వచ్చే ప్రయాణికులను పరీక్షించేందుకు ప్రత్యేక మెడికల్ స్కానర్లు ఏర్పాటు చేశారు. అలాగే, కరోనా వైరస్ బాధితులను గుర్తించేందుకు వైద్య బృందాలను నియమించారు. అలాగే, నల్లకుంట ఫీవర్ ఆస్పత్రిలో ప్రత్యేక ల్యాబ్ ను ఏర్పాటు చేశారు. అయితే, కేరళలో ఓ నర్సు కరోనా బారినపడినట్లు వస్తున్న వార్తలు భారత్ లో కలకలం రేపుతున్నాయి.

మార్నింగ్ మీటింగ్... మధ్యాహ్నం తీర్మానం... మండలి రద్దు ఖాయమే..!

ఏపీ శాసనమండలి కొనసాగుతుందో లేక రద్దు చేస్తారో మరో రెండ్రోజుల్లో తేలిపోనుంది. మండలి ఉండాలో వద్దో సోమవారం శాసనసభలో చర్చించి నిర్ణయం తీసుకుంటామంటూ ప్రకటించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి... అదే రోజు ఉదయం మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. సీఎం జగన్‌ అధ్యక్షతన సమావేశంకానున్న ఏపీ కేబినెట్‌... కౌన్సిల్‌ వివాదంపై విస్తృతంగా చర్చించనుంది. అయితే, కేబినెట్‌లో తీసుకునే నిర్ణయం మేరకే మండలిపై శాసనసభలో ముందుకెళ్లే అవకాశం కనిపిస్తోంది. రాజధాని వికేంద్రీకరణ... అలాగే సీఆర్డీఏ బిల్లులు మండలిలో ఆమోదం పొందే పరిస్థితులు లేకపోతే కనుక.... కౌన్సిల్ రద్దు వైపే మొగ్గుచూపే అవకాశముందని భావిస్తున్నారు. ఎందుకీ మండలి అంటూ శాసనసభ వేదికగా సీఎం జగన్ ఘాటు వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కౌన్సిల్ రద్దు దాదాపు ఖాయమనే చర్చ జరుగుతోంది. అయితే, సోమవారంలోపు పరిస్థితులేమైనా ప్రభుత్వానికి అనుకూలంగా మారితే మాత్రం మండలి రద్దుపై వెనక్కి తగ్గే అవకాశముందని విశ్లేషిస్తున్నారు. ఒకవేళ సానుకూల వాతావరణం లేకపోతే మాత్రం కౌన్సిల్ రద్దు తప్పదేమోనంటున్నారు. నిజానికి, శాసనసభ శీతాకాల సమావేశాల్లో ఇంగ్లీషు మీడియం, ఎస్సీ ఎస్టీలకు వేర్వేరు కమిషన్ల బిల్లులను మండలి తిరస్కరించినప్పుడే... మండలి రద్దు ఆలోచన చేశారని, ఇక, ఇప్పుడు మూడు రాజధానుల బిల్లు విషయంలోనూ చుక్కెదురు కావడంతో కౌన్సిల్ రద్దు చేయాలన్న నిర్ణయానికి వచ్చేశారని అంటున్నారు. మొత్తానికి, జగన్ ప్రభుత్వానికి కంట్లో నలుసులా మారిన మండలి రద్దుపై ఊహాగానాలు జోరందుకున్నాయి. అయితే, మండలి పరిస్థితులు ప్రభుత్వానికి అనుకూలంగా మారకపోతే మాత్రం... కౌన్సిల్‌ను రద్దు చేస్తూ తీర్మానాన్ని ఆమోదించే అవకాశముంది. ఆ తర్వాత ఉభయ సభలను ప్రోరోగ్ చేసి మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దుపై ఆర్డినెన్సులు జారీచేసి తన పంతం నెగ్గించుకోవాలన్నది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది.

జోరుగా మొదలైన మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తెలంగాణ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. తెలంగాణ మునిసిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది.  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లోని కొత్తగూడెం ఇల్లందు మున్సిపల్ కౌంటింగ్ కొనసాగుతోంది. కొత్తగూడెం మున్సిపాలిటీలోని కొత్తగూడెం సింగరేణి మహిళా కళాశాల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది.కొత్తగూడెం మున్సిపాలిటీలోని మొత్తం 36 డివిజన్ లకు సంబంధించి కౌంటింగ్ పద్దతిలో భాగంగా 36 టేబుల్స్ లను సిద్ధం చేశారు అధికారులు.ప్రతి టేబుల్స్ వద్ద 20 బ్యాలెట్ పత్రాలను ఒక బండిల్ గా కట్టకట్టి ప్రతి రౌండ్ లో 1000  ఓట్లను లెక్కిస్తారు. దాదాపు నలభై బండిల్స్ లెక్కించనున్నట్లు సమాచారం. 36 డివిజన్ లల్లో దాదాపు 35 డివిజన్లల్లో ఉన్న వార్డుల్లో 1000కి పైగా ఓట్లు ఉండడంతో ప్రతీ వార్డుకు సంబంధించి రెండు రౌండ్లలో ఫలితం వెలువడనున్నాయి.ఇల్లెందులో 24 వార్డులు ఉండగా 24 టేబుల్స్ లను ఏర్పాటు చేశారు. కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి ప్రతి రౌండ్ లో 1000 ఓట్లకు పైగా లెక్కించనున్నట్లు సమాచారం.మొత్తం మీద 2 గంటలలో ఫలితం వెలువడనున్నట్లు సమాచారం.మహబూబ్ నగర్ ఇలా పలు ప్రాంతాలల్లో ఇప్పటికే కౌంటింగ్ ప్రక్రియ మొదలైన కారణంగా నేతలు ఏ పార్టీ విజయం సాధిస్తుందా అని ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.కాసేపట్లో వెలువడే ఫలితాలల్లో ఏ పార్టీ ఝండా ఎగురవేయనున్నందో వేచి చూడాలి.

మున్సిపల్ ఎన్నికల ఫలితాల తరువాత తదుపరి చర్యలకు సర్వం సిద్ధం...

తెలంగాణ అంతటా మున్సిపల్ ఎన్నికల కారణంగా గత కొద్ది రోజులుగా హడావిడి వాతావరణం నెలకొన్నది.మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత అంకం పై  ముందు గానే క్లారిటీ ఇచ్చారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి. ఈ నెల 27న నగర మేయర్ లు మున్సిపాలిటీ చైర్మన్ ల ఎన్నిక జరుగుతుందని ఆయన తెలియజేశారు. కరీంనగర్ మేయర్ ఎన్నికలు 29న జరుగనున్నదని ప్రతి మునిసిపాలిటీ కి బాధ్యుడిగా ఒక ప్రెసిడింగ్ అధికారిని కలెక్టర్ నియమించనున్నట్లు  తన ఆధ్వర్యం లోనే మేయర్ లు చైర్మన్ ల ఎన్నిక జరుగుతుందన్నారు. మేయర్ చైర్మన్ ల ఎన్నిక కోసం రాజకీయ పార్టీలు తమ విప్ లను నియమించుకోవచ్చునని,ఆ విప్ ఎవరన్నది రేపు ఉదయం 11 గంటలకు ఈసీకి తెలియ ఉంటుందని వెల్లడించారు. ఆ రోజు మధ్యాహ్నం 12:30 నుంచి మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ ల ఎన్నిక మొదలవనున్నట్లు ఎవరైనా ముందు గానే మేం ఫలానా పార్టీ గానీ అభ్యర్థి గానీ ఓటేస్తామని చెబితే ఆ ఓటు చెల్లదని తెలియజేశారు.మేయర్ లు, చైర్ పర్సన్ ల ఎన్నికల్లో ఎక్స్ అఫిషియో సభ్యుల కూడా ఓటు హక్కు ఉంటుంది. ఎమ్మెల్యే పరిధి లో ఒక మున్సిపాలిటీ ఉంటే అక్కడ అతని ఎక్స్ అఫిషియోగా ఉంటారు. ఒకటి కంటే ఎక్కువ మున్సిపాలిటీలు ఉంటే ముందు గానే ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. పరోక్ష ఎన్నికల్లో ఓట్లు సమానంగా వస్తే లాటరీ పద్ధతి ద్వారా విజేతను ఎంపిక చేయనున్నది ఈసీ.మొత్తం మీద ఎన్నికల ఫలితాలు తరువాత ప్రణలికను కూడా ముందుగానే సిద్ధం చేశారు అధికారులు. 

బోగస్ ఓట్లకు చక్ పెట్టనున్న ఎన్నికల కమిషన్....

బోగస్ ఓట్లను నియంత్రించేందుకు ఎన్నికల్ కమీషన్ కొత్త పద్ధతిని తెర పైకి తీసుకు వచ్చింది .ఆధార్ ఓటర్ ఐడీ అనుసంధానికి అనుమతి కోరుతూ ఎన్నికల కమిషన్ చేసిన విజ్ఞప్తికి కేంద్ర న్యాయ శాఖ ఆమోదం తెలిపింది. ఈ మేరకు కొత్త చట్టాన్ని తయారు చేసేందుకు వీలుగా క్యాబినెట్ నోట్ ను రూపొందిస్తోంది. దీన్ని బడ్జెట్ సమావేశాల సమయంలో ప్రధాని మోదీ నేతృత్వం లోని కేంద్ర మంత్రి మండలి ముందు ప్రవేశ పెట్టే అవకాశం ఉందని న్యాయ శాఖ అధికారి తెలియజేశారు.దీనికి సంబంధిత బిల్లును కూడా ఈ బడ్జెట్ సమావేశాల్లో పెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఆధార్ డేటా ఆధారంగా ఓటరు జాబితాను ప్రక్షాళన చేసేందుకు వీలుగా ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950 ఆధార్ యాక్ట్ 2016 కు సవరణలు ప్రతిపాదిస్తూ ఎన్నికల కమిషన్ గత ఏడాది ఆగస్టులో కేంద్ర న్యాయ శాఖ కార్యదర్శికి ఒక లేఖ రాసింది. ఈసీ ప్రతిపాదించిన సవరణల ప్రకారం ఇప్పటికే ఓటర్ ఐడీ కలిగిన వారిని ఆధార్ నెంబర్ సమర్పించాలని కోరేందుకు కొత్తగా ఓటర్ ఐడీ కోసం దరఖాస్తు చేసే వారి నుంచి ఆధార్ నెంబర్ అడిగేందుకు ఎలక్టోరల్ రిజిస్ర్టేషన్ ఆఫీసర్ కు అధికారం ఉండేలా ఏర్పాట్లు చేశారు. ఆధార్, ఓటర్ ఐడీ అనుసంధానం వల్ల ఒకే వ్యక్తి పలుచోట ఓటు హక్కు పొందటాన్ని బోగస్ ఓటర్లను అడ్డుకోవచ్చునని ఈసీ వెల్లడిస్తొంది. ఈసీ ప్రతిపాదనలకు సానుకూలంగా స్పందించిన న్యాయశాఖ డేటా గోప్యత విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు జారీ చేసింది.తాము తీసుకున్న జాగ్రత్తల గురించి వివరిస్తూ గత ఏడాది డిసెంబర్ లో న్యాయశాఖకు ఈసీ తెలియజేసిన నేపధ్యంలో న్యాయశాఖ తదుపరి చర్యలు చేపట్టింది. మరోవైపు పాన్ ఆధార్ ఇవ్వని ఉద్యోగులకు 20 శాతం లేదా వారి ఆదాయాన్ని బట్టి అంతకు మించి మూలం వద్దనే పన్ను కోత పెట్టాలని ఆదాయ పన్ను శాఖ కంపెనీలు సంస్థల యాజమాన్యాలకు గుర్తు చేసింది. 20 శాతంకు మించి ఆదాయం ఉంటే సగటు రేటును ప్రామాణికంగా తీసుకొని మూలం వద్ద పన్ను కోత విధించాలని, ఈ మేరకు ఒక సర్క్యులర్ ను కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు గత వారమే అన్ని సంస్థలకు జారీ చేసినట్లు సమాచారం.ఆధార్,ఓటర్ అనుసంధానం లాంటి చర్యలు, కొత్త పద్ధతులతో అయినా కొంత మేరా బోగస్ ఓట్లను కట్టిపెట్టాలని ఎన్నికల కమిషన్ భావిస్తొంది.ఎంత మేరా ఈ చర్యలు సత్ఫలితాలను ఇవ్వనున్నాయో వేచి చూడాలి.

తెలంగాణలో క్యాంపు రాజకీయాలు... అభ్యర్ధులను కాపాడుకునేందుకు తిప్పలు...

తెలంగాణలో మున్సిపల్ క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి. ఎవరు ఎప్పుడు చేజారతారోనని భయంతో వణికిపోతున్న ప్రధాన పార్టీలు ముందుజాగ్రత్తలు తీసుకుంటున్నాయి. తమతమ అభ్యర్ధులను కాపాడుకునేందుకు క్యాంపులు నిర్వహిస్తున్నాయి. అధికార టీఆర్‌ఎస్‌తోపాటు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీలు తమతమ అభ్యర్ధులను క్యాంపులకు తరలిస్తున్నారు. ఏ ఒక్కరూ చేజారకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. లక్షల్లో ఆఫర్లు వస్తుండటంతో అభ్యర్ధులను కాపాడుకోవడానికి ప్రధాన పార్టీలు ఖర్చుకు సైతం వెనుకాడటం లేదనే ప్రచారం జరుగుతోంది. సొంతంగా మెజారిటీ రాని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలపై ప్రత్యేక ఫోకస్ పెట్టిన టీఆర్ఎస్‌.... ఆయా ప్రాంతాల్లో మేయర్ అండ్ ఛైర్మన్ పీఠాలను దక్కించుకునేందుకు పావులు కదుపుతోంది. ఇక, హైకమాండ్ ఆదేశాలతో అభ్యర్ధులను ఇప్పటికే క్యాంపులకు తరలించిన టీఆర్ఎస్‌ ముఖ్యనేతలు.... రెబల్స్‌, ఇండిపెండెంట్స్‌ను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏదిఏమైనాసరే మొత్తం కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగురువేయాలన్న కృతనిశ్చయంతో ముందుకెళ్తోన్న టీఆర్ఎస్ అధిష్టానం... పార్టీ లీడర్లకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇక, కాంగ్రెస్ కూడా మున్సిపోల్స్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేయడంతో మంచి ఫలితాలు వస్తాయని భావిస్తోంది. పలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో నువ్వానేనా అన్నంతగా హోరాహోరీగా పోటీ జరగడంతో... అభ్యర్ధులు చేజారిపోకుండా... ఎక్కడికక్కడ క్యాంపులను నిర్వహిస్తూ అభ్యర్ధులను తరలిస్తున్నారు. అలాగే, బీజేపీ కూడా, తమ అభ్యర్ధులు జారిపోకుండా...జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రధాన పార్టీలన్నీ మున్సిపోల్స్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో తమతమ అభ్యర్ధులు చేజారిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటూ క్యాంపు రాజకీయాలు నడుపుతున్నాయి. మేయర్, ఛైర్మన్ ఎన్నిక రోజు క్యాంపుల నుంచి నేరుగా ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు.

సెలెక్ట్ కమిటీకి వెళ్లలేదా? మధ్యలోనే ఆగిపోయాయా? మండలి ఛైర్మన్ సంచలన ప్రకటన

శాసన మండలిని రద్దు చేస్తారంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కౌన్సిల్ ఛైర్మన్ ఎంఏ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని వికేంద్రీకరణ... సీఆర్డీఏ రద్దు బిల్లులు ఇంకా సెలెక్ట్ కమిటీకి వెళ్లలేదంటూ క్లారిటీ ఇచ్చారు. మూడు రాజధానుల బిల్లు... అలాగే సీఆర్డీఏ రద్దు బిల్లు... మధ్యలోనే నిలిచిపోయాయని అన్నారు. ఈ రెండూ బిల్లులూ... సాంకేతిక కారణాలతో మండలిలోనే ఆగిపోయాయని... అవి ఎక్కడికీ వెళ్లలేదంటూ స్పష్టతనిచ్చారు. మొత్తం ప్రాసెస్‌ పూర్తయితేనే గానీ... బిల్లులు సెలెక్ట్ కమిటీకి వెళ్లవని అన్నారు. అలాగే, తననెవరూ ప్రలోభపెట్టలేదని... ప్రభావితమూ చేయలేదని మండలి ఛైర్మన్‌ ఎంఏ షరీఫ్ స్పష్టతనిచ్చారు. కౌన్సిల్ ఛైర్మన్ ఎంఏ షరీఫ్ మాటలనుబట్టి సాంకేతిక కారణాలతో రాజధాని వికేంద్రీకరణ... సీఆర్డీఏ రద్దు బిల్లులు మండలిలోనే ఆగిపోయినట్లు భావిస్తున్నారు. తన విచక్షణాధికారంతో సెలెక్ట్ కమిటీకి పంపాలని ఛైర్మన్‌ నిర్ణయం తీసుకున్నప్పటికీ... సభ్యుల అభిప్రాయాలు తీసుకోవాల్సి ఉంటుందని... అలాగే డివిజన్ నిర్వహించి.... చివరిగా ఓటింగ్ చేపట్టిన తర్వాతే.... మొత్తం ప్రక్రియ పూర్తవుతుందని అంటున్నారు. కానీ, ఇవేమీ జరగకుండానే.... మండలి ఛైర్మన్ మధ్యలోనే వెళ్లిపోయినందున... ప్రాసెస్ నిలిచిపోయి... బిల్లులు కౌన్సిల్ లోనే ఆగిపోయాయని అంటున్నారు. మొత్తానికి, రాజధాని వికేంద్రీకరణ... సీఆర్డీఏ రద్దు ల్లులు మండలిలోనే ఆగిపోయాయన్న కౌన్సిల్ ఛైర్మన్ ఎంఏ షరీఫ్ ప్రకటనతో వివాదం కొత్త మలుపు తిరిగినట్లయ్యింది. అయితే, బిల్లులు నిజంగానే మండలిలో ఆగిపోయాయా? లేక కౌన్సిల్ ఛైర్మన్ మాటలను అర్ధంచేసుకోవడంలో ఏమైనా పొరపాటు జరిగిందో తెలియాలంటే... మరింత క్లారిటీ రావాల్సిన అవసరం కనిపిస్తోంది. ఏదిఏమైనా, మండలిని రద్దు చేస్తారంటూ ప్రచారం జరుగుతున్నవేళ మండలి ఛైర్మన్ ఎంఏ షరీఫ్ వ్యాఖ్యలు కీలకంగా మారాయి.

గవర్నర్ జోక్యం చేసుకోవాలి... జగన్ తీరుపై చంద్రబాబు నిప్పులు...

రాజధాని వివాదం, మండలి పరిణామాలపై తెలుగుదేశం నేతలు మరోసారి గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. చంద్రబాబు ఆధ్వర్యంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలిసిన టీడీపీ లీడర్లు... మండలిలో జరిగిన పరిణామాలను వివరించారు. అసెంబ్లీలో వైసీపీ సభ్యులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారంటూ ఆధారాలు అందజేశారు. మండలిలో మంత్రులు వ్యవహరించిన తీరును గవర్నర్ కు వివరించిన చంద్రబాబు.... ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం జోక్యం చేసుకోవాలంటూ బిశ్వభూషణ్ కు విజ్ఞప్తి చేశారు. వైసీపీ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోందంటూ చంద్రబాబు మండిపడ్డారు. మంత్రులు... ఛైర్మన్ పోడియంను ముట్టడించి అనుచితంగా ప్రవర్తించారని, బూతులు తిట్టారని ఆరోపించారు. మండలి ఛైర్మన్‌కు విచక్షణాధికారాలు ఉంటాయనే సంగతి కూడా తెలియకుండా.... వైసీపీ లీడర్లు నీచ రాజకీయాలు చేస్తూ దాడులకు దిగుతున్నారంటూ మండిపడ్డారు. రాజధాని అనే పదం రాజ్యాంగంలో లేకపోతే... మరీ మూడు రాజధానుల బిల్లు ఎందుకు పెట్టారంటూ సీఎం జగన్‌ను చంద్రబాబు ప్రశ్నించారు. ఇక, మండలిని రద్దు చేస్తారంటూ జరుగుతున్న ప్రచారంపైనా టీడీపీ నేతలు ఘాటుగా రియాక్టవుతున్నారు. ఒకవేళ కౌన్సిల్‌ రద్దుకు తీర్మానం చేసినా అది కార్యరూపం దాల్చడానికి కనీసం ఏడాది సమయం పడుతుందని, అప్పటివరకు మండలి... అలాగే సెలెక్ట్‌ కమిటీ ఉనికిలోనే ఉంటాయని యనమల చెప్పుకొచ్చారు.