వైసీపీ అధ్యక్ష రేసులో రఘురామకృష్ణ రాజు! 

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డే ముఖ్యమంత్రిగా ఉన్నారు. వైసీపీ ప్రెసిడెంట్ గా కూడా ఈయన కొనసాగుతున్నారు. అన్ని పార్టీల్లోనూ రెండు, మూడేండ్లకొకసారి అధ్యక్ష ఎన్నికలు జరుగుతుంటాయి. ప్రస్తుతం తెలంగాణలో అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితీ పార్టీ అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. గత 20 ఏండ్లుగా టీఆర్ఎస్ చీఫ్ గా ఉన్న కేసీఆరే.. మరోసారి ప్రెసిడెంట్ కాబోతున్నారు.  ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీకి సంబంధించి తాజాగా ఆసక్తికర అంశం తెరపైకి వచ్చింది. వైసీపీ నుంచి నర్సాపురం ఎంపీగా గెలిచిన రఘురామకృష్ణం రాజు.. ఆ పార్టీ అధ్యక్ష ఎన్నికపై సంచలన కామెంట్లు చేశారు. సీఎం జగన్ కు పోటీగా.. వైసీపీ అధ్యక్ష పదవికి తాను పోటీ పడతానని ప్రకటించారు. పార్టీలో సంస్థాగత ఎన్నికలను నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. పార్టీ అధ్యక్ష పదవికి ఎవరైనా పోటీ చేయవచ్చన్నారు ఎంపీ రఘురామ రాజు. తాను క్రమశిక్షణ గల కార్యకర్తనని... అందుకే తనను ఇంతవరకు పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదని చెప్పారు. తనపై వైసీపీ నేతలు అనవసరంగా దుష్ప్రచారం చేస్తున్నారని మండిప్డడారు. లోక్ సభ స్పీకర్ ఓంబిర్లాకు రఘురాజు లేఖ రాశారు. తనపై వైసీపీ ఎంపీలు ఇచ్చిన అనర్హత పిటిషన్ ను కొట్టివేయాలని లేఖలో కోరారు.  వైసీపీ ఎంపీగా గెలిచిన రఘురామ రాజు.. కొన్ని నెలలుగా ఆ పార్టీలో రెబెల్ గా ఉన్నారు. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాలపై కోర్టుల్లో కేసులు వేస్తున్నారు. అంతేకాదు ఏకంగా సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ కోర్టులో పిటిషన్ వేసి వైసీపీలో కలకలం రేపారు. తాజాగా వైసీపీ అధ్యక్ష ఎన్నికపై ఆయన చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి. రఘురామ రాజు వైసీపీకి దూరంగా ఉంటున్నా.. లోక్ సభ రికార్డుల ప్రకారం ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీనే.  వైసీపీ ఆయన్ను అధికారికంగా సస్పెండ్ చేయలేదు. దీంతో ఆయన వైసీపీ కిందే లెక్క. సో.. వైసీపీ కార్యకర్తగా తాను పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేస్తానని రఘురామ రాజు చెప్పడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. దీనిపై వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తిగా మారింది. 

అమ్మ పార్టీలో  మరో చీలిక తప్పదా? చరిత్ర పునరావృతం అవుతుందా? 

అన్నాడీఎంకే అమ్మను కోల్పోయింది. అధికారం కోల్పోయింది .. మరో వంక అదే సమయంలో స్వర్ణోత్సవాలు జరుపుకుంటోంది ... ఒక విధంగా చూస్తే పార్టీ పరిస్థితే అంతా అగమ్యగోచరంగా ఉంది.ఇలాంటి సమయంలో, ఒకప్పుడు అమ్మ జయలలిత సన్నిహితురాలిగా మేలిగిన్ చిన్నమ్మ శశికళ మరో చిక్కు తెచ్చి పెట్టారు. చిక్కు తెచ్చి పెట్టడం కాదు, ఏకంగా పార్టీకే ఎసరు పెట్టారు.  కాంగ్రెస్ పార్టీకి, నేనే ప్రెసిడెంట్’ అని సోనియా గాంధీ ప్రకటించుకున్న విధంగా నేనే అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శిని అంటూ ఏకంగా శిలాఫలకమే చెక్కించుకున్నారు. సోనియా గాంధీ అన్నారంటే, అందుకు ఎంతోకొంత అర్థముంది. ఆమె చేసింది ఏకపక్ష నిర్ణయమే అయినా పార్టీ ఆ నిర్ణయాన్ని స్వాగతించింది. శశికళ పరిస్థితి అది కాదు, ఆమెను పార్టీ ప్రధాన కార్యదర్శిగా అంగీకరించేందుకు పార్టీలోని ఏ వర్గం కూడా సిద్ధంగా లేదు. అందుకే ఆమె, జెండాలు, శిలాఫలకాలు పట్టుకుని, నేనే నేనే అంటూ సొంతంగా చక్రం తిప్పే ప్రయత్నం చేస్తున్నారు. అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్‌ స్మారక మందిరం వద్ద ఆమె ఆ పార్టీకి పోటీగా స్వర్ణోత్సవ వేడుకలను నిర్వహించారు. పార్టీ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా అన్నాడీఎంకే ‘ప్రధాన కార్యదర్శి వీకే శశికళ’ అని ఉన్న శిలాఫలకాన్ని ఆమెకు ఆమె ఆవిష్కరించుకున్నారు. ఇప్పుడా శిలాఫలకం వివాదంగా మారింది.  శిలా ఫలకంలో  పేరేసుకుంటే ప్రధాన కార్యదర్శి కాలేరని మాజీ మంత్రి డి. జయకుమార్‌ శశికళకు  చురకలు అంటించారు అంతే కాదు, కోర్టులే తీర్పులు ఇచ్చిన తర్వాత శశికళ శిలాఫలకంలో ప్రధాన కార్య దర్శిగా తమ పేరేసుకోవడం కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘన కిందకే వస్తుందన్నారు. అలాగే మీసమున్న వారంతా కట్టబ్రహ్మన్నలు కాలేరని సైటైర్లు కూడా విసిరారు. పచ్చని అన్నా డిఎంకే కుటుంబంలో శశికళ చిచ్చుపెట్టారని, అర్థం వచ్చేలా జయకుమార్ చాలా వ్యాఖ్యలు చేశారు. అన్నాడీఎంకే శాశ్వత ప్రధాన కార్యదర్శి జయలలిత మాత్రమేనని, ఈ విషయమై పార్టీ సర్వసభ్య మండలి సమావేశం సుస్పష్టమైన తీర్మానం కూడా చేసిందని ఆయన గుర్తు చేశారు.  అయితే,  ఒక్క సారి గతాన్ని గుర్తు చేసుకుంటే, చాలా వరకు ప్రాంతీయ పార్టీలలో ఇలాంటి కలహాలు సహజమే అనిపిస్తుంది. 1987లో ముఖ్యమంత్రి ఎమ్జీఆర్ చనిపోయిన సమయంలో, అన్నా డిఎంకేకు  ఇంతకంటే పెద్ద సంక్షోభమే  ఎదురైంది. ఎంజీఆర్ పార్టీలోని జయలలిత వ్యతిరేక వర్గం వత్తిడి తెచ్చి ఎంజీఆర్ సతీమణి జానకిని ముఖ్యమంత్రిని చేశారు. ఆ సమయంలో జయలలిత వైపు ఉన్నది 30 మంది ఎమ్మెల్యేలే. జానకి వర్గంలో 101 మంది ఎమ్మెల్యేలున్నారు. అయినా జానకి ప్రభుత్వం 24 రోజులకే కూలి పోయింది. ముఖ్యమంత్రి జానకి అసెంబ్లీ విశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టిన సమయంలో చివరకు సభ లోపలకు పోలీసులు, పోలీసు ముసుగులో ఉన్న గూండాలు వచ్చి నానా రచ్చ చేశారు. ఆ విధంగా  పార్టీ రెండుగా చీలి పోయింది. ఆ సమయంలో శశికళ, జయ వ్యతిరేక జానకి వర్గంలో ఉన్నారు..ఆ తర్వాత జయలలిత పార్టీ మీద పట్టు సాధించిన తర్వాతనే, శశికళ ఆమె పంచన చేరారు. ఆ తర్వాత కూడా జయలలిత, శశికళ మధ్య విభేదాలు రావడం శశికళ దూరంగా ఉండడం అదంతా చరిత్ర...ఇప్పుడు మళ్ళీ చరిత్ర పునరావృతం అవుతుందా? మళ్ళీ పార్టీ ముక్కలవుతుందా? అంటే ..కాదనడం కష్టమే. ఎందుకంటే, శశికళ సామాన్యురాలు కాదు.

వైసీపీ పందికొక్కుల బ్యాచ్! సొంత పార్టీ నేతల బండారం బయటపెట్టిన మంత్రి..

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం వచ్చాకా అవినీతి, అక్రమాలు, అరాచకాలు పెరిగిపోయాయనే ఆరోపణలు వస్తున్నాయి. వరుసగా జరుగుతున్న ఘటనలు ఇందుకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. విపక్ష పార్టీ నేతలే కాదు కొందరు అధికార పార్టీ నేతలు కూడా ఈ విషయాన్ని అంగీకరించారు. వైసీపీ నేతలు, కార్యకర్తలు లంచగొండులుగా మారి ప్రజలను వేధిస్తున్నారని కొందరు ఎమ్మెల్యేలు బహిరంగంగానే వ్యాఖ్యానించారు. కొంతమంది వైసీపీ నేతలు ప్రజల నుంచి రూ.5 వేల నుంచి లక్ష వరకు వసూలు చేస్తున్నారని నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చెప్పడం సంచలనంగా మారింది. ఒక షాపు పెట్టుకోవాలన్నా, బిల్డింగ్ అప్రూవల్, లే అవుట్‌‌లు ఏర్పాటు చేయాలన్నా డబ్బులు అడుగుతున్నారని.. వాళ్ల తాట తీస్తానని హెచ్చరించారు. తాజాగా ఏకంగా జగన్ కేబినెట్ మంత్రి కూడా ఇలాంటి కామెంట్లే చేశారు.  అనంతపురం జిల్లా పెనుగొండ వైసీపీలో పందికొక్కుల బ్యాచ్ ఎక్కువైందని మంత్రి శంకర్ నారాయణ వ్యాఖ్యానించారు. అడ్డదారుల్లో డబ్బులు సంపాదన కోసం ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వైసీపీలోని పందికొక్కుల బ్యాచ్ రెచ్చిపోతోందని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే మంత్రి వ్యాఖ్యలకు గోరంట్ల మండలానికి చెందిన వైసీపీ నేత రమణారెడ్డి కౌంటరిచ్చారు. ఎవరు పందికొక్కులో అందరికీ తెలుసునన్నారు. దేవుడిపై ప్రమాణం చేయడానికి ముందుకు రావాలని ఆయన సవాల్ విసిరారు. మంత్రే పందికొక్కనే విధంగా వైసీపీ నేత కౌంటరివ్వడం మరింత కాక రేపుతోంది. 

ప్రజలకు అప్పులు.. బినామీలకు ఆస్తులు! హెటిరో బ్లాక్ మనీ ఎవరిది జగన్? 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సీఎం జగన్మోహన్ రెడ్డిపై మరోసారి తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. జగన్ అజ్ఞానంతో ఆంధ్రప్రదేశ్ లో కోలుకోలేని విధంగా నష్టపోతుందని ఆరోపించారు. సాగునీటి రంగాన్ని జగన్  నిర్వీర్యం చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. పోలవరం, నదుల అనుసంధానాన్ని కమీషన్లకు కక్కుర్తిపడి అస్తవ్యస్తం చేస్తున్నారని మండిపడ్డారు. కమీషన్లకు ఆశపడి పోలవరం లోపల మరో ఎత్తిపోతల పథకం అంటున్నారని ఆరోపించారు.  పార్టీ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు చంద్రబాబు. ఈ సందర్భంగా జగన్ రెడ్డి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అవీనితి, అరాచకాలకు ఆంధ్రప్రదేశ్ అడ్డాగా మారిపోయిందని మండిపడ్డారు. వైసీపీ పాలనలో ప్రజలకు అప్పులు, జగన్ బినామీలకు ఆస్తులు అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాంకీ, హెటెరో సహా అనేక బినామీ కంపెనీల్లో వేలకోట్ల మేర నల్లధనం ఉందని అన్నారు. డ్రగ్స్, కల్తీ మద్యంతో జాతి నిర్వీర్యం అవుతోందని చంద్రబాబు అన్నారు. గంజాయి, హెరాయిన్ స్మగ్లర్లే రాష్ట్రంలో మద్యం వ్యాపారాన్ని శాసిస్తున్నారని తెలిపారు. పాడేరు ఏజెన్సీలో గంజాయితో డ్రింకులు, ఐస్ క్రీములు, చాక్లెట్లు తయారుచేస్తున్నారని ఆరోపించారు. ఏపీలో నెలకొన్ని విద్యుత్ కోతలు, కరెంట్ కొరతపైనా చంద్రబాబు స్పందించారు. జగన్ విధానాల వల్లే మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఉన్న ఏపీ.. ఇప్పుడు అంధకారంగా మారిపోతుందన్నారు. రెండున్నరేళ్లలో విద్యుత్ వినియోగదారులపై రూ.36,802 కోట్ల భారం పడిందని ఆరోపించారు. ప్రజారక్షక పోలీస్ వ్యవస్థ కాస్తా ప్రజా భక్షక వ్యవస్థగా మారిందని విమర్శించారు. ఇంద్రకీలాద్రి, తిరుమలలో అన్యమత ప్రచారం దుర్మార్గం అని మండిపడ్డారు చంద్రబాబు. విమానాల్లో వాడే ఇంధనం కంటే పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్నాయని వెల్లడించారు. ఆరు దశల్లో పరిశీలన పేరుతో రాష్ట్రంలో పెన్షన్, రేషన్ కార్డుల్లో కోత విధిస్తున్నారని ఆరోపించారు.

హుజురాబాద్ లో కారుకు షాకేనా? ఈటలకు కలిసివస్తోంది ఏంటీ? 

తెలంగాణ రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారిన కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. మరో 10 రోజుల్లో గడువు ముగియనుండటంతో అన్ని పార్టీలు స్పీడ్ పెంచాయి. అయితే హుజురాబాద్ ఓటర్ నాడి మాత్రం బయటపడటం లేదు. ఎన్నికల సర్వేలు నిర్వహిస్తున్న సంస్థలు కూడా హుజురాబాద్ ఓటర్ నాడి పట్టడంలో సక్సెస్ కాలేకపోతున్నాయి. అయితే క్షేత్రస్థాయి నుంచి వస్తున్న సమాచారం ప్రకారం ప్రస్తుతానికి మాజీ మంత్రి , బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కే మొగ్గు ఉందని తెలుస్తోంది. సైలెంటుగా ఉన్న ఓటర్లంతా ఈటలకు మద్దతుగా నిలిచే అవకాశం ఉందంటున్నారు.  ఎక్కడైనా అధికార పార్టీకి మద్దతుగా ఉండే ఓటర్లు బహిరంగంగానే బయటపడుతుంటారు. ప్రభుత్వ పథకాలు అందాలి కాబట్టి ఓపెన్ గానే తమ సపోర్టు చెబుతుంటారు. సైలెంటుగా ఉన్నారంటే వాళ్లు అధికార పార్టీపై గుర్రుగా ఉన్నారనే సంకేతం వచ్చినట్లే. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో అదే జరిగింది. నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో అన్ని సర్వేలు మొదటి నుంచి క్లియర్ గా కారు గెలుస్తుందని చెప్పాయి. ఫలితం కూడా అలానే వచ్చింది. మెదక్ జిల్లా దుబ్బాకలో మాత్రం ఓటర్ల నాడి చివరి వరకు అంతుపట్టలేదు. అందుకే సర్వే సంస్థలు భిన్న అంచనాలు ఇచ్చాయి. ఫలితం మాత్రం అధికార పార్టీకి వ్యతిరేకంగా వచ్చింది. ఇప్పుడు హుజురాబాద్ లోనూ దుబ్బాక లాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయని అంటున్నారు.  బీజేపీ అభ్యర్థికి విజయావకాశాలు ఉండటానికి పలు కారణాలు కనిపిస్తున్నాయి. గత 20 ఏండ్లుగా ఎమ్మెల్యేగా, ఏడేండ్లు మంత్రిగా ఉండటంతో నియోజకవర్గ ప్రజలతో ఈటల రాజేందర్ కు మంచి సంబంధాలు ఉన్నాయి. నియోజకవర్గంలోని గల్లీ లీడర్లను కూడా పేరు పెట్టి పిలిచేంత సాన్నిహిత్యం ఈటలకు ఉంది. అంతేకాదు హుజురాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి ఈటల చాలా శ్రమించారని చెబుతారు. అందుకే టీఆర్ఎస్ లో ఉన్న ప్రజా ప్రతినిధులు కూడా అంతర్గతంగా ఈటలకు మద్దతు ఇస్తున్నారనే చర్చ సాగుతోంది. పదవిలో ఉన్నారు కాబట్టి అధికార పార్టీలో కొనసాగుతున్నారని.. పోలింగ్ రోజున సీన్ మరోలా ఉంటుందని చెబుతున్నారు.  ఈటలకు సానుకూలంగా చాలా అంశాలు కనిపిస్తున్నాయి. ఉద్యమంలో కీలకంగా ఉండటం ఆయనకు ప్లస్ పాయింట్. ఉద్యమ సమయంలో ఎంతో మందిపై కేసులు నమోదు కాగా.. వాళ్లందరికి అండగా నిలిచారు ఈటల రాజేందర్. ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు సాయం చేశారు. అంతేకాదు పేద కుటుంబాలకు సొంత నిధులతో సాయం చేస్తూ వచ్చారు ఈటల రాజేందర్. ఇవన్ని ఆయనకు ప్లస్ కావచ్చని భావిస్తున్నారు. మంత్రివర్గం నుంచి రాజేందర్ ను భర్తరఫ్ చేయడాన్ని హుజురాబాద్ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని అంటున్నారు. ఎంతో మంది నేతలపై అవినీతి ఆరోపణలు ఉన్నా.. ఈటలను టార్గెట్ చేయడం ఎందుకనే ప్రశ్న వస్తోంది. మంత్రివర్గం నుంచి అగౌరవంగా తొలగించారనే సెంటిమెంట్ కూడా ఈటల రాజేందర్ పై ప్రజల్లో కనిపిస్తోంది. ఉద్యోగులు, విద్యావంతులంతా ఈటల వైపే ఉన్నారని తెలుస్తోంది.  అయితే ఈటలకు ప్రతికూలంగా కూడా కొన్ని అంశాలు ఉన్నాయి. అందులో ప్రధానమైంది ఆయన అధికార పార్టీ కాకపోవడమే. కేసీఆర్ ప్రభుత్వం మరో రెండేళ్లు ఉంటున్నందున అధికార పార్టీ గెలిస్తే.. అభివృద్ధి పనులు బాగా జరుగుతాయనే అంశం ఈటలకు ఇబ్బందిగా మారింది. కొన్ని వర్గాల ప్రజలు ఈ దిశగా కూడా ఆలోచన చేసే అవకాశం ఉంది. దాంతో పాటు దళిత బంధు పథకంతో ఆ వర్గం దూరం కావచ్చని భావిస్తున్నారు. అయితే దళిత బంధు పథకంతో ఇతర వర్గాలు అధికార పార్టీపై ఆగ్రహంగా ఉన్నాయని.. అది తమకు కలిసి వస్తుందని ఈటల టీమ్ లెక్కలు వేసుకుంటోంది. ఇక టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కి కూడా ఉద్యమ నేపథ్యం ఉన్నా.. ఈటలకు ఆయన సరితూగడనే అభిప్రాయం జనాల నుంచి వినిపిస్తోంది. అయితే గెల్ల్లుకు మంత్రి హరీష్ రావు ప్రధాన బలంగా మారిపోయారు. నియోజకవర్గమంతా హరీష్ సుడిగాలిలా పర్యటిస్తుండటంతో లాభిస్తోందని అంటున్నారు. అధికార పార్టీ కావడంతో విచ్చలవిడిగా వరాలు కురిపిస్తున్నారు హరీష్ రావు. కులాల వారీగా తాయిలాలు ప్రకటిస్తున్నారు. ఇవన్ని తమకు కలిసి వస్తాయని ఆశలో కారు పార్టీ నేతలు ఉన్నారు. దళిత బంధు పథకంతో ఆ వర్గ ఓట్లన్ని తమకే గంప గుత్తగా పడతాయని లెక్కలు వేసుకుంటున్నారు గులాబీ లీడర్లు. అయితే ఈటలతో పోల్చినపుడు గెల్లు చాలా చిన్న నాయకుడని, అతన్ని కేసీఆర్ బలి పశువు చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. మొత్తంగా హుజురాబాద్ ఓటర్లలో కనిపిస్తున్న సైలెంట్ మూడ్.. ఖచ్చితంగా బీజేపీ అభ్య్రర్థి ఈటల రాజేందర్ కే అనుకూలంగా ఉంటుందనే భావనే రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతోంది. 

టీఆర్ఎస్‌లో వ‌రంగ‌ల్ స‌భ టెన్ష‌న్‌.. కేటీఆర్‌కు బిగ్ టాస్క్‌..

న‌వంబ‌ర్ 15న ‘తెలంగాణ విజయగర్జన’ స‌భ‌. 10 ల‌క్ష‌ల మందితో వ‌రంగ‌ల్‌లో భారీ బ‌హిరంగ స‌భ‌. విప‌క్షాల‌కు దిమ్మ‌తిరిగేలా స‌భ‌ను స‌క్సెస్ చేయాల‌ని అధికార పార్టీ ప‌ట్టుద‌ల‌తో ఉంది. రేవంత్‌రెడ్డి స‌భ‌ల‌కు ధీటుగా జ‌న స‌మీక‌ర‌ణ చేయాల‌ని ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తోంది. ఊరికో బ‌స్సు ఏర్పాటు చేసి.. ల‌క్ష‌ల్లో ప్ర‌జ‌ల‌ను వ‌రంగ‌ల్ స‌భ‌కు తీసుకురావాల‌ని భావిస్తోంది. ఆ మేర‌కు స‌భను విజ‌య‌వంతంగా నిర్వ‌హించేలా పార్టీ శ్రేణుల‌తో క‌స‌రత్తు చేస్తున్నారు టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌.  సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం మేరకు తెలంగాణ భవన్‌లో కేటీఆర్ పార్టీ ముఖ్య నేతలతో సభ సన్నాహాలపై చర్చించారు. ఉదయం నుంచి నియోజకవర్గాల వారీగా నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.  సభ విజయవంతానికి పార్టీ శ్రేణులన్నీ కదలాలని కేటీఆర్ పిలుపు ఇచ్చారు.  పది లక్షల మందితో సభ నిర్వహించేందుకు అన్ని నియోజకవర్గాల్లో నేతలు క్రియాశీలక పాత్ర పోషించాలని కేటీఆర్ కోరారు. స్థానికంగా సమన్వయ లోపాలు ఉంటే వాటిని పక్కన పెట్టి పనిచేయాలని స్పష్టం చేశారు. మెదక్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లోని పలు నియోజకవర్గ నేతలతో కేటీఆర్ ఇప్పటికే చర్చించారు. ఇవాళ్టి నుంచి రోజూ 20 నియోజక వర్గాల ముఖ్య నేతలతో కేటీఆర్ సమావేశం కానున్నారు. స‌భ నిర్వ‌హ‌ణ‌పై నిర్విరామంగా స‌మీక్ష‌లు, స‌మావేశాలు జ‌ర‌ప‌నున్నారు. ఎందుకంటే.. రేవంత్‌రెడ్డి దూకుడుకు ధీటుగా సమాధానం చెప్పాలంటే.. వ‌రంగ‌ల్‌లో త‌ల‌పెట్టిన తెలంగాణ విజ‌య‌గ‌ర్జ‌న స‌భ విజ‌య‌వంతం అవ‌డం త‌ప్ప‌నిస‌రి. 10 ల‌క్ష‌ల మందికి ఏ ఒక్క‌రు త‌గ్గినా.. టీఆర్ఎస్‌ను తిప‌క్షాలు చెడుగుడు ఆడుకుంటాయి మ‌రి. అందుకే, అధికార పార్టీలో స‌భ టెన్ష‌న్ సుస్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. బిగ్‌బాస్‌ కేసీఆర్ పెద్ద టాస్కే ఇచ్చినా.. చిన‌బాస్ కేటీఆర్ ఆ టాస్క్‌లో స‌క్సెస్ అవుతారో లేదో చూడాలి..  

కేసీఆర్‌ మౌనం- కూలీలుగా మార్చే ప్ర‌య‌త్నం.. గఢీల పాలన నుంచి విముక్తి స‌మ‌యం!

ఓ వ‌ర్గం త‌ర‌ఫున పోరాడాతున్నారాయ‌న‌. దొర‌ల పాల‌న నుంచి విముక్తి కోరుతున్నారు. పిడికిలి బిగించి.. రాజ్యాధికారం సాధించుకుంటామంటున్నారు. ఏనుగెక్కి ప్ర‌గ‌తిభ‌వ‌న్‌ను ఏలుతామంటున్నారు. ఆయ‌నే బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్ర‌వీణ్‌కుమార్‌. ప్ర‌భుత్వ విధానాల‌ను, ఓ వ‌ర్గానికి జ‌రుగుతున్న అన్యాయాల‌ను నిల‌దిసి.. నిప్పుల‌తో క‌డిగేసే.. ఆశాకిర‌ణం అత‌ను. తాజాగా, గురుకుల పాఠ‌శాల పునఃప్రారంభంపై కేసీఆర్ స‌ర్కారును ట్విట్ట‌ర్‌లో నిగ్గ‌దీసి అడిగారు. ఇంత‌కీ ఆయ‌న ఏం ట్వీట్ చేశారంటే.. "లక్షలాది పేద విద్యార్థులు చదువుతున్న గురుకులాలు & హాస్టళ్లను పునఃప్రారంభించడం పై KCR ప్రభుత్వం యొక్క మౌనం మళ్లీ ఒక తరాన్ని భూస్వాముల భూముల్లో కూలీలుగా-ఇళ్లలో పనిచేసే పనిపిల్లలుగా మార్చే కుట్ర తప్ప మరొకటికాదు.  గఢీల పాలననుండి తల్లి తెలంగాణను  విముక్తి చేయవలసిన సమయం ఆసన్నమైంది."

కేసీఆర్, కేటీఆర్ కు మంత్రి దిమ్మతిరిగే షాక్.. రేవంత్ రెడ్డి, ఈటెల ఎఫెక్ట్ ప‌ని చేస్తోందా? 

సీఎం కేసీఆర్‌ను ముక్కోపి అంటారు. ఆయ‌న‌కు ముక్కు మీదే కోపం ఉంటుందట‌. ప్ర‌తీ చిన్న దానికీ కోపం న‌శాలానికి ఎక్కుతుంద‌ట‌. అందుకే ఆయ‌న‌తో మాట్లాడాలంటేనే భ‌య‌ప‌డిపోతుంటారు నేత‌లు. ఆఖ‌రికి కేటీఆర్ సైతం తండ్రి అంటే వ‌ణికిపోతార‌ట‌. క‌విత ఒక్క‌రికే కాస్త చ‌నువు ఉంటుంద‌ట‌. ఇంట్లో వాళ్ల ప‌రిస్థితే ఇలా ఉంటే.. ఇక పార్టీ నాయ‌కులు, ప్ర‌భుత్వ అధికారుల గురించి ప్ర‌త్యేకించి చెప్పేదేముంటుంది. కేసీఆర్ నుంచి పిలుపు వ‌చ్చిందంటే చాలు ఎవ‌రికైనా ముచ్చెమ‌ట‌లు ప‌ట్టాల్సిందే అంటారు.  ఆయ‌న ఏం అడుగుతారో తెలీదు.. ఎందుకు అడుగుతారో తెలీదు.. ఒక‌వేళ‌ తెలీద‌ని చెబితే అస్స‌లు ఊరుకోరు.. కోపంతో ఊగిపోతార‌ట‌.. సీఎం ఛాంబ‌ర్‌లోకి వెళితే ఆయ‌న చెప్పింది విని, త‌ల ఊపి రావ‌డ‌మే కానీ,ఎదురు మాట్లాడ‌టానికి ఉండ‌ద‌ట‌. పొర‌బాటునా ఎవ‌రైనా ఆయ‌న మాట‌ల మ‌ధ్య‌లో జోక్యం చేసుకుంటే.. ఇక అంతే సంగ‌తుల‌ని అంటుంటారు. అలాంటి కోపిస్టి కేసీఆర్‌కు ఎదురు స‌మాధానం చెప్ప‌డ‌మంటే మాట‌లా? ఆయ‌న ప్ర‌శ్న‌కు తిరిగి కౌంట‌ర్ వేయ‌డ‌మంటే మామూలు విష‌య‌మా?  కానీ, ఓ మంత్రి వేసేశారు.. నేరుగా కేసీఆర్ స‌మ‌క్షంలోనే రివ‌ర్స్ కౌంట‌ర్ ఇచ్చేశారు.  వ‌రంగ‌ల్‌లో నిర్వ‌హించ త‌ల‌పెట్టిన తెలంగాణ విజయ గర్జన సభ ఏర్పాట్లపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. సభ కోసం జ‌నాల‌ను త‌ర‌లించేందుకు ఊరికో ఆర్టీసీ బ‌స్సు ఏర్పాటు చేయాల‌ని ముఖ్య‌మంత్రి భావించారు. అందుకే, రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు అస‌లు ఎన్నిన్నాయంటూ మంత్రి పువ్వాడ అజయ్‌ని కేసీఆర్ ప్ర‌శ్నించారు. సీఎం స‌డెన్‌గా అడిగే స‌రికి బస్సుల సంఖ్య చెప్ప‌లేక మంత్రి అజ‌య్ తిక‌మ‌క అయ్యార‌ట‌. ఆర్టీసీ అధికారుల‌కు ఫోన్ చేసి స‌మాచారం తెలుసుకునే ప్ర‌య‌త్నం చేశార‌ట‌. అయితే, మ‌ధ్య‌లో మంత్రి కేటీఆర్ జోక్యం చేసుకొని.. బస్సుల లెక్క కూడా చెప్పలేవా అంటూ మంత్రి పువ్వాడను ఉద్దేశించి చీప్‌గా మాట్లాడార‌ట‌. పువ్వాడ‌కు చిర్రెత్తుకొచ్చి.. తాను ఆర్టీసీ మంత్రిని కాదని, తాను రవాణా శాఖ మంత్రిని అంటూ సీఎం కేసీఆర్ స‌మ‌క్షంలోనే కేటీఆర్‌కు కౌంట‌ర్ వేశార‌ట. ఆర్టీసీ నిర్వహణ బాధ్యత ఆర్టీసీ చైర్మన్‌ చూసుకోవాలని.. తాను కాద‌నే అర్థం వ‌చ్చేలా ముఖం మీదే చెప్పేశార‌ని తెలుస్తోంది.  కేసీఆర్ పువ్వాడ‌ను ప్రశ్నిస్తే.. మ‌ధ్య‌లో కేటీఆర్ సెటైర్ వేయ‌డం.. మంత్రి పువ్వాడ‌ ఖ‌త‌ర్నాక్ కౌంట‌ర్‌ ఇవ్వ‌డం.. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో జ‌రిగిన ఈ ప‌రిణామం బ‌య‌ట‌కి రావ‌డంతో రాజ‌కీయంగా ఆస‌క్తిక‌రంగా మారింది. సీఎం స‌మ‌క్షంలోనే మంత్రి ఇలా తండ్రీకొడుకుల‌కు ధీటుగా జ‌వాబివ్వ‌డం సంచ‌ల‌నంగా మారింది. అక్క‌డ మంత్రి పువ్వాడ కేటీఆర్‌ను ఉద్దేశించే అన్నా.. ప్ర‌శ్నించింది కేసీఆర్ కాబ‌ట్టి ప‌రోక్షంగా సీఎంకూ కౌంట‌ర్ ప‌డిన‌ట్టే అంటున్నారు. పార్టీలో అయినా.. ప్ర‌భుత్వంలో అయినా.. కేసీఆర్‌-కేటీఆర్ చెప్పిందే వేదం. తిరిగి మాట్లాడే ప్ర‌జాస్వామ్య క‌ల్చ‌ర్ అస్స‌లు క‌నిపించ‌దు. అలాంటిది కీల‌క‌మైన స‌భ విష‌యంలో.. మంత్రి పువ్వాడ అజ‌య్ ఇలా ఖ‌రాఖండిగా జ‌వాబివ్వ‌డం వారి అధికారాన్ని ధిక్క‌రించ‌డ‌మేనంటున్నారు.  ముఖ్య‌మంత్రి ప‌ర‌ప‌తి, పార్టీ ప్రాభ‌వం త‌గ్గిపోతుంటే.. రేవంత్‌రెడ్డి లాంటి బ‌ల‌మైన లీడ‌ర్ ఎమ‌ర్జ్ అవుతుంటే.. ప‌రిస్థితి ఇలానే ఉంటుందని విశ్లేషిస్తున్నారు. బాంచెన్ దొర అంటూ చేతులు క‌ట్టుకొని, నోరు మూసుకొని, త‌లూపే రోజులు ఎప్ప‌టికీ ఉండ‌వ‌ని చెబుతున్నారు. ఈట‌ల రాజేంద‌ర్ ఎపిసోడ్‌తో టీఆర్ఎస్ ప్ర‌భుత్వంలో ప్ర‌జాస్వామ్య భావాజాలం పెరిగింద‌ని.. నేత‌ల‌కు ఈట‌ల ఆత్మాభిమానం గుర్తు చేశార‌ని.. అందుకే బానిస భ‌వ‌న్‌గా మారిన ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో ప్ర‌శ్నించే నైజం క‌న‌బ‌డుతోంద‌ని అంటున్నారు. ప్ర‌శ్నిస్తే పోయేదేముంది బానిస సంకెళ్లు త‌ప్ప అనే ధోర‌ణి నేత‌ల్లో వ్య‌క్త‌మ‌వుతోంద‌ని విశ్లేషిస్తున్నారు.

రేపు యాదాద్రికి సీఎం కేసీఆర్.. ఆల‌య పునఃప్రారంభ ముహూర్తం ఖ‌రారు!

అదిగ‌దిగో యాదాద్రి. శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆల‌య పున‌ర్‌నిర్మాణ ప‌నులు అత్యంత వేగంగా జ‌రుగుతున్నాయి. ఆ ప‌నులు దాదాపు కొలిక్కి వ‌చ్చాయి. అతి త్వ‌ర‌లో యాదాద్రి ఆల‌యం పునఃప్రారంభించాల‌ని సీఎం కేసీఆర్ ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. అందుకే, ప‌దే ప‌దే ఆల‌య ప‌నుల‌ను స్వ‌యంగా ప‌రిశీలిస్తున్నారు.  తాజాగా, ముఖ్య‌మంత్రి కేసీఆర్ మంగ‌ళ‌వారం యాదాద్రికి వెళ్లనున్నారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం పునర్నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. రేప‌టి ప‌ర్య‌ట‌న‌లో ఆలయ పునఃప్రారంభ తేదీలను సీఎం కేసీఆర్‌ ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఆల‌య పున‌ర్ ప్రారంభం సంద‌ర్భంగా నిర్వ‌హించ త‌ల‌పెట్టిన‌ మహా సుదర్శన యాగం వివరాలు కూడా ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ వెల్లడించనున్నట్టు స‌మాచారం. 

మ‌నిషిగా పుట్టాక‌.. సీఎం జ‌గ‌న్ ను బండ‌బూతులు తిట్టిన వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి..

సీఎం జ‌గ‌న్‌రెడ్డిపై  వైసీపీ ఫైర్‌బ్రాండ్‌ ఎమ్మెల్యే మామూలుగా తిట్ట‌లేదు. ఓ రేంజ్‌లో తిట్టేశారు. జ‌గ‌న్ ఇచ్చిన హామీలు, చెప్పిన మాట‌లు, చేస్తున్న ప‌నులు.. అన్నిటినీ గుర్తు చేస్తూ.. నోటికొచ్చిన‌ట్టు కుమ్మేశారు. ఆ ఎమ్మెల్యే చేసిన కామెంట్లు ఏపీలో తీవ్ర క‌ల‌క‌లం రేపుతున్నాయి. ఇంత‌కీ జ‌గ‌న్‌రెడ్డిని తిట్ల‌తో చెడామడా వాయించేసింది మ‌రెవ‌రో కాదు.. తాడిప‌త్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి.  పెద్దారెడ్డి గురించి తెలుసుగా. తాడిప‌త్రి తోపునంటూ నిత్యం జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డిపై విరుచుకుప‌డే ఫైర్‌బ్రాండ్ లీడ‌ర్‌. వైసీపీ ఎమ్మెల్యే కావ‌డంతో.. అధికార బ‌లంతో.. ప్ర‌త్య‌ర్థులను క‌వ్విస్తూ.. ఇంటికొచ్చి తొడ‌గొడుతూ.. అగ్గికుంప‌టి రాజేస్తుంటారు. త‌న స్థాయికి జేసీ స‌రిపోర‌నుకున్నారో ఏమో.. తాజాగా నేరుగా సీఎం జ‌గ‌న్‌రెడ్డిపైనే నోరు పారేసుకున్నారు. త‌న‌దైన స్టైల్‌లో సొంత‌పార్టీ అధినేత‌నే ఏకిపారేశారు.. ఇంత‌కీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఏమ‌న్నారంటే... ‘జగనన్న లాంటి నాయకుడు ఇన్ని అబద్దాలు చెప్పుకుంటూ.. ప్రజలను మోసపుచ్చుకుంటూ బతకడం మంచిది కాదన్నారు. మనిషిగా పుట్టాక అంతో, ఇంతో సహాయం చేయాలని, అలాంటి గుణం లేనప్పుడు ఎవరి పరిధిలో వారుండాలంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాజకీయ లబ్ధికోసం ఏం మాట్లాడతారో తెలియని పరిస్థితిలో జగన్ ఉన్నారంటూ కేతిరెడ్డి ఘాటైన కామెంట్లు చేశారు. ముఖ్యమంత్రిపై ఎమ్మెల్యే చేసిన ఈ వ్యాఖ్యలు అనంతపురం జిల్లాలో తీవ్ర క‌ల‌క‌లం రేపుతున్నాయి.  తాడిపత్రి నియోజక వర్గంలో వైఎస్సార్ ఆసరా కార్యక్రమంలో మహిళలకు చెక్కుల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే కేతిరెడ్డి.. ప్రతిపక్షాలను విమర్శిస్తూ.. సీఎం జగన్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే ఎమ్మెల్యే నోరుజారి జ‌గ‌న్‌పై ఇలాంటి వ్యాఖ్యలు చేశారని కేతిరెడ్డి వర్గీయులు క‌వ‌ర్ చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఎమ్మెల్యే పెద్దారెడ్డి మాట‌లు రికార్డ్ అవ‌డం.. అవి వైర‌ల్‌గా మార‌డంతో.. పెద్దారెడ్డి తీరు వైసీపీలో, ఏపీలో సంచ‌ల‌నంగా మారింది. జ‌గ‌న్ తీరును త‌ప్పుబ‌డుతూ సొంత‌పార్టీ ఎమ్మెల్యేలు తిడుతుండ‌టం ప్ర‌కంప‌ణ‌లు రేపుతోంది.   

జ‌గోనామిక్స్‌.. జ‌గ‌న్ పాల‌న‌లో అర్థశాస్త్రం ఆగ‌మాగం..

లంకా దిన‌క‌ర్‌. బీజేపీ నేత‌. స్వ‌త‌హాగా చార్టెర్డ్ అకౌంటెంట్ కావ‌డంతో ఆర్థిక వ్య‌వ‌హారాల్లో మంచి ప‌ట్టుంది. అందుకే వైసీపీ పాల‌న‌పై ఆయ‌న చేసే విమ‌ర్శ‌లు సుత్తి లేకుండా సూటిగా తాకుతుంటాయి. తిమ్మిని బ‌మ్మి చేస్తూ.. లెక్క‌ల గార‌డీ చూపిస్తూ.. రాష్ట్రాన్ని అప్పుల కుప్ప‌గా మారుస్తూ..  ఏపీ ఆర్థిక స్థితిని అథోగ‌తి పాలు చేస్తున్న జ‌గ‌న్‌రెడ్డి పాల‌న‌ను ఎప్ప‌టిక‌ప్పుడు త‌న‌దైన స్టైల్‌లో తూట్లు పొడుస్తుంటారు. తాజాగా, లంక దిన‌క‌ర్ చేసిన కామెంట్లు మ‌రింత ఆస‌క్తిక‌రంగా మారాయి.  సీఎం జగన్మోహన్‌రెడ్డి పాలనలో అర్థశాస్త్రం నిర్ఘాంతపోతోందని, ఎక‌నామిక్స్ కాస్తా జగోనామిక్స్‌లా తయారైందంటూ బీజేపీ నేత లంకా దినకర్ విమర్శించారు. ఈ ఆర్థిక ఏడాది మొత్తానికి రూ. 5 వేల కోట్ల రెవెన్యూ లోటు అంచనా కాస్త మొదటి 5 నెలల కాలానికి 31,188 కోట్లు అయిందని లంకా దినకర్ అన్నారు. ఆదాయం పెరిగినా రెవెన్యూలోటు కొండంత అయ్యిందన్నారు. మూలధన వ్యయం మొదటి 5 నెలల కాలానికి గతేడాది రూ. 8,604 కోట్లు అయితే, ఈ ఏడాది అది కేవలం 5,482 కోట్లు మాత్రమేనన్నారు. ఆదాయం, అప్పులు పెరిగినప్పుడు.. భవిష్యత్తు ఆదాయం సముపార్జించే మూలధన వ్యయం పెరగాలి.. కానీ దూరదృష్టవశాత్తు పప్పు బెల్లల మయం అయ్యిందని లంకా దినకర్ మండిప‌డ్డారు.  గత 5 నెలల్లో అంతకుముందు ఏడాది ఇదే కాలానికి పోలిస్తే ఏపీలో ఆదాయం, అప్పులు రెండు పెరిగినా మూలధన వ్యయంలో పెరుగుదల మాత్రం ప్రతికూలమన్నారు. రూ. 15 వేల కోట్లకుపైగా అదనపు ఆదాయం ఆర్జించినా జీతాలు సకాలంలో ఇవ్వలేని పరిస్థితి నెల‌కొంద‌న్నారు. ఈ ఏడాది మొదటి 5 నెలల కాలంలో రూ. 15,686 కోట్ల అదనపు ఆదాయం వస్తే, అదే కాలానికి ఏడాది మొత్తం చేయాల్సిన అప్పులో 98 శాతం చేశారని లంక దిన‌క‌ర్ ఆరోపించారు.

ఈ నీళ్ల‌లో ఇల్లు ఎలా క‌ట్టుకోవాలి జ‌గ‌న‌న్న‌?

ఈ ఫోటో చూస్తున్నారుగా.. మొత్తం నీళ్లే. ఇదేమీ చెరువు కాదు.. చెరువులాంటి స్థ‌లం. ఈ స్థ‌లంలో ఇల్లు క‌ట్టుకోమంటూ పేద‌ల‌కు ఉదారంగా ఇచ్చేశారు మ‌హాప్ర‌భు. జ‌గ‌న‌న్న కాల‌నీల పేరుతో ఇలాంటి ప‌నికిరాని స్థ‌లాలు కేటాయించారు. జ‌గ‌న‌న్న కాల‌నీల భూముల‌పై ఎప్ప‌టి నుంచో విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు ఉన్నా.. ఇది లేటెస్ట్‌ది. ఈ ఫోటోలో క‌నిపిస్తున్న‌దేమీ గోదావ‌రి జిల్లాల్లోని ఆవ భూములు కావు. అక్క‌డైతే మ‌రీ ఘోరం. ఏకంగా స‌ముద్రంలో క‌లిసి ఉన్న భూముల‌ను జ‌గ‌న‌న్న కాల‌నీల పేరుతో పంచేసి.. ఇక మీ చావు మీరు చావండి అన్న‌ట్టు చేతులు దులిపేసుకున్నారు పాల‌కులు. ఆవ భూముల కొనుగోలులో గోల్‌మాల్‌పై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌చ్చినా ప‌ట్టించుకోలేదు. ఆవ భూమిలో ఇల్లు ఎలా క‌ట్టుకోవాలో.. ప్ర‌భుత్వ‌మే ఓ మోడ‌ల్ హౌజ్ నిర్మించి చూపిస్తే బాగుండేది.  ఇక‌, ఆవ భూముల‌ను త‌ల‌పించేలా ఉన్న‌ అనేక లోత‌ట్టు ప్రాంతాల‌ను జ‌గ‌న‌న్న కాల‌నీలకు కేటాయించారు. ఏపీలో వ‌ర్షం కురిసిన ప్ర‌తీసారీ.. ఒక్కో కాల‌నీ గొప్ప‌త‌నం వెలుగులోకి వ‌స్తోంది. ఇక్క‌డ మీరు చూస్తున్న ఫోటోలో ఉన్న‌ది ఏ చెరువో కాదు. లోత‌ట్టు ప్రాంతంలో ఉన్న జ‌గ‌న‌న్న కాల‌నీ. ఇక్క‌డ ఇల్లు క‌ట్టుకోవాలంటూ పేద‌ల‌కు స్థ‌లాలు కేటాయించింది ప్ర‌భుత్వం. మ‌రి, ఈ నీళ్ల‌లో ఇల్లు క‌ట్టుకోవ‌డం పేద‌లకు సాధ్య‌మా? ఈ స్థ‌లంలో నీళ్లు నిల‌వ‌కుండా మ‌ట్టి పోయించి చ‌దును చేసేందుకే ల‌క్ష‌ల రూపాయ‌లు ఖ‌ర్చు అవుతాయి. ఆ డ‌బ్బే ఉంటే వారు పేద‌లెందుకు అవుతారు? ఇలాంటి చెరువులో ఎందుకు ఇల్లు కట్టుకుంటారు?  ఈ ఫోటో జి.కొండూరు స‌మీపంలో విజ‌య‌వాడ వాసులు, వెల‌గ‌లేరు గ్రామాల పేద‌ల‌కు జ‌గ‌న‌న్న కాల‌నీల పేరుతో ఇచ్చిన ఇళ్ల స్థ‌లాలు. ఇటీవ‌ల కురిసిన చిన్న‌పాటి వాన‌కు నీరు నిల‌చి ఇలా చెరువును త‌ల‌పిస్తోంది. ఇక్క‌డ ఇల్లు క‌ట్టుకోవ‌డం ఎలా అంటూ ల‌బ్దిదారులు ల‌బోదిబో మొత్తుకుంటున్నారు. జ‌గ‌న‌న్న ఇల్లు పేరుతో త‌మ‌ను మోసం చేశాడ‌ని శాప‌నార్థాలు పెడుతున్నారు. మ‌రి, వారి గోడు పాల‌కుల చెవికి ఎక్కేనా?

ఆక‌స్మిక త‌నిఖీల‌తో బాల‌య్య హ‌ల్‌చ‌ల్‌.. హిందూపురంలో ద‌బిడి దిబిడే..

వ‌న్స్ హి స్టెప్ ఇన్‌.. ద‌బిడి దిబిడే. బాల‌య్య బాబునా మ‌జాకా. హిందూపురం ఎమ్మెల్యే బాల‌కృష్ణ రాక రాక నియోజ‌క‌వ‌ర్గానికి వ‌చ్చారు. వ‌చ్చిన‌ప్ప‌టి నుంచీ బిజీ బిజీగా గ‌డుపుతున్నారు. తొలిరోజు తొడగొట్టి త‌ఢాకా చూపించారు. రాయ‌ల‌సీమ‌కు నీళ్లు, ప్రాజెక్టుల కోసం హ‌ర్యానా త‌ర‌హా ఉద్య‌మానికి సిద్ధ‌మ‌ని హెచ్చ‌రించారు.  ఇక హిందూపురంలో ఎమ్మెల్యే బాల‌కృష్ణ‌ రెండోరోజూ ప‌ర్య‌ట‌న మ‌రింత హ‌ల్‌చ‌ల్‌గా సాగుతోంది. క‌రోనా క‌ట్ట‌డిలో జ‌గ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వం పూర్తిగా విఫ‌ల‌మైన విష‌యం తెలిసిందే. కొవిడ్ స‌మ‌యంలో ప్ర‌భుత్వాసుప‌త్రులు చేతులెత్తేశాయి. స‌రైన వైద్యం, చికిత్స‌, మందులు అంద‌క‌.. అనంత వాసులు బెంగ‌ళూరు, హైద‌రాబాద్‌లోని ఆసుప‌త్రుల‌కు ప‌రుగులు పెట్టాల్సిన దుస్థితి వ‌చ్చింది. అందుకే, త‌న నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌భుత్వాసుప‌త్రి ప‌ని తీరు ప‌రిశీలించ‌డానికి ఎమ్మెల్యే బాల‌కృష్ణ ఆక‌స్మిక త‌నిఖీలు చేశారు.   హిందూపురం ప్రభుత్వాసుపత్రిలో అందుతున్న సేవలు, సౌకర్యాల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. రోగుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావ‌డంతో.. వైద్యసేవలపై బాల‌కృష్ణ తీవ్ర‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. సరైన వైద్యం అందట్లేదని రోగుల నుంచి చాలా ఫిర్యాదులు వచ్చాయన్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో పరిస్థితులు చాలా అధ్వానంగా ఉన్నాయని తెలిపారు. ఆస్పత్రి పరిస్థితులపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తానన్నారు ఎమ్మెల్యే బాలకృష్ణ.   

టీడీపీ లోకి సీనియర్ నేతలు..  జగన్ రెడ్డికి ముందుంది  క్రొకోడైల్ ఫెస్టివలేనా?

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వానికి ఇప్పటికిప్పుడు వచ్చిన ముప్పేమీ లేదు. ముఖ్యమంత్రి  వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుర్చీకి వచ్చిన ప్రమాదమూ లేదు. అయితే ముందుంది ‘క్రొకోడైల్ ఫెస్టివల్’ ముసళ్ళ పండగే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.  దేశ, రాష్ట్ర రాజకీయాలను అనేక  కోణాల్లో విశ్లేషించే, కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్  ఇంతవరకు, వైఎస్ పట్ల ఉన్న కృతజ్ఞతాభావం చేతనో,  ఇంకెందుకో కానీ, జగన్ రెడ్డి తప్పుల విషయంలో ఇంకకాలం కొంత మౌనంగా ఉంటూ వచ్చారు. అప్పుడప్పుడు ఒకటి రెండు విషయాలు ప్రస్తావించినా,లోతైన అధ్యయనం, ఘాటైన విమర్శలు చేసియన్ సందర్భాలు అంతగా లేవు. అలాంటి వైఎస్ ఫ్యామిలీ ఫ్రెండ్ ఉండవల్లి జగన్ సర్కార్’పై దండయాత్ర మొదలు పెట్టారు.  రాష్ట్రం అప్పుల చిట్టా విప్పి, జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రం దివాలా తీయడమే కాదు, జగన్ రెడ్డి దివాలా దరిద్రం రాష్ట్రాన్ని, దశాబ్దాల తరబడి వెంటాడుతూనే ఉంటుందని సవివరంగా వివరించారు. భవిష్యత్’లో ఈయన పోయి ఇంకెవరు అధికారంలోకి వచ్చినా కూడా, అప్పుల ఊబిలోంచి రాష్ట్రం ఇప్పట్లో బయటకు రాలేదని గణాంకాలతో సహా వివరించారు.నిజానికి ఉండవల్లి చెప్పిన విషయాలు ఇప్పుడే వింటున్న మాటలు కాదు, మీడియాలో ఇతరత్రా ఎప్పటినుంచో వినవస్తున్న నిజాలే. తెలుగు దేశం పార్టీ ఎప్పటి నుంచో అప్పుల విషయంలో జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూనే ఉంది. సంక్షేమం గీతదాటితే సంక్షోభం తప్పదని హెచ్చరిస్తూనే వచ్చింది. అయినా, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ ఆర్థిక మంత్రి యనమల రామక్రిష్ణుడు ఇతర నాయకులు అనుభవంతో చేసిన సూచనలను జగన్ రెడ్డి ప్రభుత్వం పెడ చెవిన పెట్టింది. ఉండవల్లి ఏ ఉద్దేశంతో, ఎందుకోసం జగన్ రెడ్డి ప్రభుత్వం తప్పులను ఎత్తి చూపినా, అదిప్పుడు శంఖంలో పోసిన తీర్థంలాగా పనిచేస్తోంది. సామాన్య ప్రజల్లో కూడా, ఒక్క ఛాన్స్ ఇచ్చి తప్పు చేశామనే భావన బయటకు వస్తోంది. దీనికి తోడు అమ్మ ఒడి’తో మొదలు పెట్టి ఒక్కొక్క సంక్షేమ పథకానికి ప్రభుత్వం గండి పెడుతోంది, దీంతో ప్రజలు ఆలోచనలో పడ్డారు, సంక్షేమ పథకాలకు ఆశ పడితే, చివరకు, చిప్పే గతవుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. అందుకే, ‘బాబే రావాలి.. (చంద్ర)బాబే కావాలి’ అనే ఆకాంక్ష జనంలో బలంగా వినిపిస్తోంది.  రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు కూడా వేగంగా మారి పోతున్నాయి. ఉండవల్లి షాక్ తర్వాత, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి  రవీంద్రా రెడ్డి బాంబు పేల్చారు. ఒకప్పుడు కడప జిల్లా రాజకీయాల్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్’తోనే ఢీ అంటే ఢీ అన్నడీఎల్, జిల్లా రాజకీయాల్లో ఇటు నాయకులూ అటు, అటు నాయకులు ఇటు కావడంతో, వేరే దరి లేక (కావచ్చు) వైసీపీలో చేరారు. ఇప్పుడు ఆయన జగన్ రెడ్డి మీద యుద్ధానికి సిద్దమవుతున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేయని డీఎల్,వచ్చే 2024 ఎన్నికల్లో తప్పక పోటీ చేస్తానని ప్రకటించారు. ఏ పార్టీ తరుపున పోటీ చేసేది చెప్పక పోయినా ఆయన వైసీపీ ప్రభుత్వాని, జగన్ రెడ్డి పాలనను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. జగన్ రెడ్డి  పాలనలో ఆరాచకం విలయతాండవం చేస్తోందనే అర్థమొచ్చేలా ఘాటైన విమర్శలు చేశారు. ప్రభుత్వ పెద్దలు సొంత ఖజానా నింపుకోవడమే ధ్యేయంగా  పనిచేస్తున్నారని ఆరోపించారు. అంతేకాదు  ఏపీలో రెడ్ల రాజ్యం రావాలని కోరుకుని ఓట్లేసిన అందరికి తగిన శాస్త్రే జరిగిందంటూ సంచలన కామెంట్స్ చేశారు. డీఎల్ నైజం,ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలను గమనిస్తే ఆయన ప్రతిపక్ష శిబిరంలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. అంతే కాదు, జగన్ రెడ్డిని ఓడించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్న డీఎల్ ... టీడీపీలో చేరేఅవకాశాలే ఎక్కువగా ఉన్నాయని ఆయన సన్నిహితులు కూడా అంటున్నారు. గతంలోనూ ఆయన చంద్రబాబును కలిసి పార్టీలో చేరేందుకు సంసిద్దత వ్యక్త పరిచారు. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండున్నర సంవత్సరాల సమయం ఉన్నా   ఇప్పటికే రాజకీయ గాలి ఎటు వీస్తోందో గుర్తించిన నాయకులు టీడీపీ వైపు చూస్తున్నారు. సీఎం జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప జిల్లాలో కీల‌క నేత‌లు టీడీపీలో చేరేందుకు ముహూర్తం ఖ‌రారైంది. మాజీ ఎమ్మెల్సీ నారాయ‌ణ‌రెడ్డితో పాటు ఆయ‌న కుమారుడు భూపేశ్‌రెడ్డి ఈ నెల 20న టీడీపీ అధినేత చంద్ర‌బాబు స‌మ‌క్షంలో టీడీపీలో చేరుతున్నారు. జమ్మలమడుగులో బ‌ల‌మైన నాయ‌కుడైన నారాయ‌ణ‌రెడ్డి చేరిక‌తో టీడీపీకి మ‌ళ్లీ పూర్వవైభవం ఖాయ‌మంటున్నారు.  ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మంఛి వక్తగా, సమర్ధ నాయకునిగా పేరున్న కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జీవీ రెడ్డి ఈ నెల 21న టీడీపీలో చేరుతున్నారు. ఇలా ఇటు కాంగ్రెస్ నుంచి అటు వైసీపీ నుంచే కాకుండా, బీజేపీలో చేరిన టీడీపీ, కాంగ్రెస్ నాయకుకు కూడా,  టీడీపీ వైపు క్యూ కట్టేందుకు సిద్దమవుతున్నారు. సో... గత ఎన్నికల్ సందర్భంగా ఒక్క ఛాన్స్, ఒక్క ఛాన్స్ అంటూ వెంటబడిన జగన్ రెడ్డి కి ఇంకో ఛాన్స్ లేదని, వచ్చేది టీడీపీ ప్రభుత్వమే అంటున్నారు విశ్లేషకులు.

దత్తన్న వారసురాలు విజయలక్షి ... అలయ్‌ బలయ్‌ తో అరంగేట్రం 

హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఎక్కాడున్నా, ఏ పదవిలో ఉన్నా, ఆయన మనసెప్పుడు హైదరాబాద్’లోనే ఉంటుంది. ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎక్కువగా హైదరాబద్’లోనే ఉన్నారు.హైదరాబాద్ మంత్రి అన్నా, హైదరాబాద్’కే మంత్రి అన్నా ఆయన ఎప్పుడూ పట్టించుకోలేదు. హైదరాబాద్’తో ఆయనకున్న అనుబంధం అటువంటిది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ప్రచారక్’ గా ప్రజా జీవితాన్ని ప్రారంభించిన దత్తాత్రేయ సుదీర్ఘ కాలం పాటు, సంఘ్ బాధ్యతలను నిర్వర్తించారు. దివిసీమ తుపాను సమయంలో సుదీర్ఘకాలం పాటు అక్కడే ఉండి పునర్నిర్మాణ, సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.  రాజకీయాలోనూ దత్తాత్రేయ తమ ప్రత్యేకతను నిలబెట్టుకున్నారు. రాజకీయాలకు అతీతంగా అందరి వాడుగా జనామోదం పొందారు.దత్తన్నగా ముద్ర వేసుకున్నారు.రాజాకేయ విభేదాలున్నా అన్ని పార్టీలలో ఆయనకు ఆత్మీయ మిత్రులున్నారు. ఆ ఆత్మీయ బంధం ప్రతిబింబమే ... ఇంచుమించుగా రెండు దశాబ్దాలుగా ఆయన ప్రతి సంవత్సరం దసరా సందర్భంగా  నిర్వహిస్తున్న అలయ్ బలయ్ ఆత్మీయ సమ్మేళనం. ప్రధానమంత్రి నరేందర్ మోడీ కూడా ప్రతి ఏటా దసరా అనంతరం బండారు దత్తాత్రేయ నిర్వహించే ‘అలయ్‌ బలయ్‌’ కార్యక్రమాన్ని మెచ్చుకున్నారు. ‘అలయ్‌ బలయ్‌’ వంటి కర్యక్రమాలు ప్రజల్లో ఐకమత్యం, సమానత్వాన్ని పెంచుతుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.  ప్రతి ఏటా విజయ దశమి తర్వాత నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం రాష్ట్ర ప్రజల్లో పండుగ వాతావరణాన్ని నింపుతుందని, అసాధారణ స్ఫూర్తిని చాటుతుందన్నారు.  ఈ సంవత్సరం ఆయన కుమార్తె విజయలక్ష్మి ఆధ్వర్యంలో అలయ్ బలయ్ నిర్వహించారు. విజయలక్ష్మి ఆయన వారసత్వాన్ని ఘనంగా అందిపుచ్చుకున్నారు. జలవిహార్’లో జరిగిన అలయ్ బలయ్ కార్యక్రమంలో ఉపరాష్ట్ర పతి వెంకయ్యనాయుడు, గవర్నర్లు, కేంద్రమంత్రులు, రాష్ట్ర మంత్రులు ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు.  ఇప్పుడు సహజంగానే దత్తన్న కూతురు, రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చినట్లేనా ? అన్న చర్చ రాజాకేయ వర్గాలలో మొదలైంది,  అయితే, ఇప్పటికే బీజేపీలో క్రియాశీలంగా పనిచేస్తున్న విజయలక్షి, తాను ఇప్పటికే బిజెపి పార్టీలో ఉన్నానని.. పార్టీ ఆదేశిస్తే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా సిద్దమని అన్నారు. నిజానికి, చాలా కాలంగా ఆమె పార్టీలో క్రియాశీల కార్యకర్తగా ఉన్నారు. ఇటీవల పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రలో పాల్గొన్నారు. ఇక అలయ్ బలయ్ తన ఆధ్వర్యంలో నిర్వహించడం బాధ్యతగా ఫీలవుతున్నానని చెప్పారు విజయలక్ష్మి. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి, ప్రముఖులు వచ్చి పాల్గొనడం మరింత ఉత్తేజాన్ని ఇచ్చిందన్నారు. నాన్నగారు తీసుకొచ్చిన అలాయ్ బలాయ్ సంప్రదాయాన్ని ఆనవాయితీగా కొనసాగిస్తానని తెలిపారు. ఆయన వారసురాలిగా సంస్కృతి, సంప్రదాయాలు, ప్రేమ, ఆప్యాయతల సమ్మేళనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించానని తెలిపారు.

కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి ఫిక‌ర్‌.. అందుకేనా 10ల‌క్ష‌ల మందితో వ‌రంగ‌ల్ మీటింగ్‌?

న‌వంబ‌ర్ 15న వ‌రంగ‌ల్‌లో విప‌క్షాల‌కు దిమ్మ‌తిరిగేలా 10 ల‌క్ష‌ల మందితో తెలంగాణ విజ‌య గ‌ర్జ‌న స‌భ‌. ప్ర‌తీ గ్రామానికి ఓ బ‌స్సు ఏర్పాటు చేసి.. 20వేల బ‌స్సుల్లో స‌భ‌కు జ‌నం త‌ర‌లింపు. స‌భ నిర్వ‌హ‌న బాధ్య‌త‌లు మంత్రి కేటీఆర్‌కు అప్ప‌గింత‌. జ‌న స‌మీక‌ర‌ణ‌, స‌భ ఏర్పాట్ల‌పై సోమ‌వారం నుంచి తెలంగాణ భ‌వ‌న్‌లో రోజులు 20 నియోజ‌క‌వ‌ర్గాల నేత‌ల‌తో కేటీఆర్‌, కేశ‌వ‌రావు స‌మావేశాలు. ఇదీ గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆర్ ర‌చించిన స‌రికొత్త స‌భా వ్యూహం. ఇంత‌కీ ఉన్న‌ట్టుండి కేసీఆర్‌ ఇంత హ‌డావుడి ఎందుకు చేస్తున్న‌ట్టు? 10 ల‌క్ష‌ల మందితో స‌భ పెట్టాల్సిన అవ‌స‌రం ఏమొచ్చింది? వ‌రంగ‌ల్‌లోనే ఎందుకు పెడుతున్న‌ట్టు? ఎల‌క్ష‌న్ల సీజ‌న్ కాకున్నా, స‌రైన‌ సంద‌ర్భ‌మూ లేకున్నా.. భారీ బ‌హిరంగ‌ స‌భ ఆవ‌శ్య‌క‌త ఏంటి? ఇలా ప్ర‌శ్న‌ల‌న్నిటికీ ఒక‌టే స‌మాధానం.. రేవంత్‌రెడ్డి. అవును, సీఎం కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి ఫిక‌ర్ ప‌ట్టుకున్న‌ట్టుంది. కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి నిర్వ‌హించిన వ‌రుస బ‌హిరంగ స‌భ‌లు సూప‌ర్ డూప‌ర్ స‌క్సెస్ అయ్యాయి. తెలంగాణ‌లో ఏ దిక్కున స‌భ పెట్టిన‌.. జ‌నం తండోప‌తండాలుగా త‌ర‌లివ‌చ్చారు. ల‌క్ష‌లాది మందితో స‌భా ప్రాంగ‌ణం కిక్కిరిసిపోయింది. వ‌ర్షం ప‌డినా, ఎంత ఆల‌స్య‌మైనా.. ఏ ఒక్క‌రూ క‌ద‌ల‌కుండా రేవంత్‌రెడ్డి స్పీచ్‌ను అంతా చెవులురిక్క‌రించి వినేవారు. ఆ స‌భా వేదిక‌లపై నుంచి సీఎం కేసీఆర్‌కు ప‌దే ప‌దే స‌వాళ్లు విసిరారు రేవంత్‌. స‌భ‌కు వ‌చ్చిన జ‌నాల‌ను లెక్కేసుకోండి.. ల‌క్ష‌కు ఒక్క‌రు త‌క్కువున్నా.. రెట్టింపు సంఖ్య‌తో మ‌ళ్లీ స‌భ పెడతానంటూ ఛాలెంజ్ చేసేవారు. అలా రేవంత్‌రెడ్డి స‌భ‌ల‌కు అనూహ్యంగా జ‌నం త‌ర‌లిరావ‌డం.. అవ‌న్నీ బ్ర‌హ్మాండంగా హిట్ కావ‌డం చూసి.. తెలంగాణ‌కు రేవంత్‌రెడ్డీ ఆశాకిర‌ణం అనే మెసేజ్ ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా వెళ్లిపోయింది. రేవంత్ స‌భ‌ల గురించి జ‌నం రోజుల త‌ర‌బ‌డి చ‌ర్చించుకున్నారు. కేసీఆర్‌కు క‌రెక్ట్ మొగుడు రేవంతేనంటూ ప్ర‌చారం జ‌రిగిపోయింది. ఈ ప‌రిణామం గులాబీ బాస్‌కు నిద్ర‌ప‌ట్ట‌కుండా చేసింది. క‌ట్ చేస్తే.. న‌వంబ‌ర్ 15న వ‌రంగ‌ల్‌లో 10 ల‌క్ష‌ల మందితో భారీ బ‌హిరంగ స‌భ‌కు స్కెచ్ వేశారు కేసీఆర్‌.  ఇన్నాళ్లూ కేవ‌లం హుజురాబాద్ ఎన్నిక‌ల‌పైనే ఫోక‌స్ పెట్టారు కేసీఆర్‌. ఈట‌ల‌ను ఎలాగైనా ఓడించాల‌ని స‌ర్వ‌శ‌క్తులూ ఒడ్డుతున్నారు. అయినా, స‌ర్వేల ఫ‌లితం అంతంత మాత్రంగా ఉందంటున్నారు. ద‌ళిత బంధు తీసుకొచ్చినా.. హుజురాబాద్‌లో ద‌ళిత‌ కుటుంబానికి 10 ల‌క్ష‌లు పంచుతున్నా.. ఆ క్రెడిట్ కేసీఆర్ అకౌంట్లో కాకుండా.. ఈట‌ల ఖాతాలో ప‌డుతుంద‌ని కేసీఆర్ అస్స‌లు ఊహించ‌లేక‌పోయారు. అందుకే, హుజురాబాద్ ఎన్నిక‌ల‌కు రెండు వారాల ముందు.. హ‌డావుడిగా పార్టీ మీటింగ్ పెట్టి.. మ‌న‌దే గెలుపంటూ స‌ర్వేలు చెబుతున్నాయంటూ శ్రేణుల్లో ధైర్యం నూరిపోసే ప్ర‌య‌త్నం చేశారు. ప‌నిలో ప‌నిగా.. ప్ర‌జ‌ల అటెన్ష‌న్ హుజురాబాద్ నుంచి షిఫ్ట్ చేసేందుకు వ‌రంగ‌ల్ స‌భ‌ను ప్ర‌క‌టించార‌ని అంటున్నారు. బ‌హిరంగ స‌భ‌తో తాత్కాలిక టార్గెట్ హుజురాబాద్ అయినా.. అస‌లు ల‌క్ష్యం మాత్రం రేవంత్‌రెడ్డినే. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ద‌ళిత-గిరిజ‌న దండోరా స‌భ‌ల‌తో ల‌క్ష‌లాది మందితో బ‌ల ప్ర‌ద‌ర్శ‌న‌ చేశారు. ప్ర‌జ‌లంతా రేవంత్ వెంటే ఉన్నార‌నేలా ఆ స‌భ‌లు స‌క్సెస్ కావ‌డంతో కేసీఆర్ ఉలిక్కిప‌డ్డారు. రేవంత్ స‌భ‌ల‌కు ధీటుగా.. వ‌రంగ‌ల్‌లో ఒకే ఒక స‌భ‌తో కాంగ్రెస్‌కు కౌంట‌ర్ ఇవ్వాల‌నేది కేసీఆర్ వ్యూహంలా క‌న‌బ‌డుతోంది. రేవంత్‌రెడ్డి ల‌క్ష-రెండు ల‌క్ష‌ల‌తో స‌భ‌లు నిర్వ‌హిస్తే.. గులాబీ బాస్ మాత్రం ఏకంగా 10 ల‌క్ష‌ల మందితో భారీ బ‌హిరంగ స‌భ‌ను నిర్వ‌హించి.. విప‌క్షాల‌కు దిమ్మ‌తిరిగే మెసేజ్ ఇవ్వాల‌ని భావిస్తున్నారు.  తెలంగాణ విజ‌య గ‌ర్జ‌న స‌భ‌కు వ‌రంగ‌ల్‌ను ఎంచుకోవ‌డ‌మూ వ్యూహాత్మ‌క‌మే అంటున్నారు. రేవంత్‌రెడ్డి ద‌ళిత‌-గిరిజ‌న దండోరా స‌భ‌ల్లో భాగంగా వ‌రంగ‌ల్‌లో 10 ల‌క్ష‌ల మందితో భారీ స‌భ పెట్టి.. రాహుల్‌గాంధీని ర‌ప్పించాల‌ని భావించినా అది సాధ్యం కాలేదు. అందుకే, రేవంత్‌రెడ్డి పెట్ట‌లేక పోయిన వ‌రంగ‌ల్‌లో 10 ల‌క్ష‌ల మందితో స‌భ నిర్వ‌హించి స‌త్తా చాటాల‌ని కేసీఆర్ ప‌ట్టుద‌ల‌గా ఉన్నారు. తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలోనూ అదే వ‌రంగ‌ల్‌లో భారీ స‌భ పెట్టి స‌క్సెస్ చేసిన అనుభ‌వం కేసీఆర్‌కు ఉంది. అదే స్పూర్తితో రేవంత్‌రెడ్డికి స‌వాల్ విసిరేరా.. వ‌రంగ‌ల్‌ను వేదిక చేయ‌బోతున్నారు గులాబీ బాస్‌.  అయితే, అన్నివ‌ర్గాల ప్ర‌జ‌ల్లో కేసీఆర్ స‌ర్కారుపై అసంతృప్తి వ్య‌క్త‌మ‌వుతున్న ప్ర‌స్తుత త‌రుణంలో.. టీఆర్ఎస్ స‌భ‌కు 10 ల‌క్ష‌ల మంది వ‌స్తారా? అంటే డౌటే అంటున్నారు. అందుకే, ఊరికో బ‌స్సు వేసి.. న‌యానో, భ‌యానో జ‌నాల‌ను బ‌ల‌వంతంగా ర‌ప్పించే ప్ర‌య‌త్నం చేయ‌బోతున్నార‌ని చెబుతున్నారు. ఇలానే, 2018లో హైద‌రాబాద్ శివారు కొంగ‌ర‌క‌ల‌న్‌లో ప్ర‌గ‌తి నివేద‌న స‌భ పేరుతో 25 ల‌క్ష‌ల మందితో భారీ బ‌హిరంగ స‌భ అంటూ కేసీఆర్‌ ఊద‌ర‌గొట్టినా.. ఆ చారిత్ర‌క స‌భ‌కు ప‌ట్టుమ‌ని 4 ల‌క్ష‌ల మంది కూడా రాలేద‌నే విమ‌ర్శ ఉంది. ఇప్పుడూ అలానే 10 ల‌క్ష‌ల మందంటూ ఆర్భాటం చేసినా.. టీఆర్ఎస్ స‌భ‌కు రేవంత్‌రెడ్డి మీటింగ్‌కు వ‌చ్చినంత మంది వ‌చ్చినా స‌క్సెస్ అయిన‌ట్టేన‌ని అప్పుడే సెటైర్లు ప‌డుతున్నాయి. వ‌రంగ‌ల్‌లో జ‌ర‌ప‌బోయే తెలంగాణ విజ‌య గ‌ర్జ‌న స‌భ‌ను ఏ మేర‌కు విజ‌య‌వంతం అవుతుందో చూడాలి మ‌రి...

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు? కేసీఆర్ మాటల అర్ధం అదేనా..!

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయా? మొదటి టర్మ్ లాగే ఈసారి కూడా కేసీఆర్ సంచలనం చేయబోతున్నారా? ఈ చర్చే తెలంగాణ రాజకీయ వర్గాల్లో కొన్ని రోజులుగా సాగుతోంది. సీఎం కేసీఆర్ ఇటీవల తీసుకుంటున్న నిర్ణయాలు, పార్టీ కమిటీలను గతంలో ఎప్పుడు లేనంత స్థాయిలో నియమించడం, నవంబర్ లో వరంగల్ లో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేయడం ఇందుకు బలాన్నిచ్చాయి. అయితే ముందస్తు ఎన్నికల ప్రచారంపై పార్టీ సమావేశంలో క్లారిటీ ఇచ్చారు గులాబీ బాస్.  ముందస్తు ఎన్నికల ఊహాగానాలకు, వ్యూహాగానలకు ఒకే సారి తెరదించారు కేసీఆర్. ఈసారి ముందస్తు ఎన్నికలకు వెళ్ళే ఆలోచన లేదని తేల్చి చెప్పారు.  తెరాస ఎల్పీ, పార్లమెంటరీ పార్టీ సంయుక్త సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్, ఈ మేరకు స్పష్టమైన ప్రకటన చేశారు. “ఈసారి మనం ముందస్తుకు వెళ్లడం లేదు. మనం చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా రెండేళ్లు సమయం ఉంది. ఈ రెండేళ్లలో చేయవలసిన  అన్ని పనులు  చేసుకుని, సరైన సమయంలోనే ఎన్నికలకు పోదాం”  అని ముఖ్యమంత్రి తమ మనసులోని మాటను బయట పెట్టారు. వచ్చే ఎన్నికల్లో  మరిన్ని ఎక్కువ స్థానాలు గెలిచేలా పనిచేయాలని పార్టీకి దిశానిర్దేశం చేశారు. అయితే ఇది ముఖ్యమంత్రి మనసులోని మాటా, హుజూరాబాద్ ఉప ఎన్నికలను, పార్టీలో నెలకొన్న సంక్షోభ పరిస్థితులను  దృష్టిలో ఉంచుకుని వ్యూహాత్మకంగా చేసిన ప్రకటనా అనే విషయంలో అనుమానాలు వస్తున్నాయి. హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాలను బట్టి నిర్ణయం మారినా మార వచ్చని పార్టీలో చర్చ మొదలైందని అంటున్నారు. హుజూరాబాద్’లో విజయం సాధిస్తే, ఆ షాక్ నుంచి విపక్షాలు తేరుకునే ముందే ముందస్తు ఎన్నికలకు వెళ్ళినా ఆశ్చర్య పోనవసరం లేదనే వాదన ఒకటి పార్టీ వర్గాల్లో వినవస్తోంది. విపక్షాలకు ఎంత  ఎక్కువ సమయం ఇస్తే అంత ఎక్కువ మూల్యం చేల్లికోవలసి వస్తుందని, అంతర్గత వ్యూహబృందం ఆలోచనగా కూడా చెపుతున్నారు. అయితే హుజూరాబాద్ గెలుపు ఓటములతో సంబంధం లేకుండా, ఇతర పరిణామాలను బేరీజు వేసుకుని ముఖ్యమంత్రి నిర్ణయం ఉంటున్నది పార్టీ సీనియర్ నాయకుడు అన్నారు. అంతే కాకుండా హుజూరాబాద్ ఉప ఎన్నికను మించిన క్లిష్ట సమస్యలున్నాయని, ఆయన పేర్కొన్నారు. అయితే అవేమిటి అనేడి మాత్రం ఆయన బయట పెట్టలేదు.  పార్టీ నాయకుల్లో విశ్వాసం పెంచేందుకు ముఖ్యమంత్రి హుజూరాబాద్ లో మనమే గెలుస్తున్నామని అన్నారు. ప్రతిపక్షాలకు దిమ్మ తిరిగేలా వరంగల్ ప్రజాగర్జన సభ నిర్వహించాలని నిర్ణయం సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. రోజూ 20 నియోజకవర్గాలకు సన్నాహక సమావేశాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి సూచించారు.ఒక విధంగా పార్టీ ద్విశతాబ్ధి ఉత్సవాల పురస్కరించుకుని, పార్టీకి కొత్త దశ దిశలతో పాటుగా కొత్త నాయకత్వాన్ని ముదుకు తీసుకురావడం కూడా ముఖ్యమంత్రి మదిలోని ఆలోచనగా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అదలా ఉంటే పార్టీలో చోటు చేసుకుంటున్న పరినామాలను గమనిస్తే ఎవరు అవునన్నా ఎవరు కాదన్నాపార్టీలో అంతా బాగుంది అనుకునే పరిస్థితిలో పార్టీ లేదు. పార్టీ  నాయకత్వం లేదు. అదే పార్టీ నాయకుల మాటల్లో ప్రతిధ్వనిస్తోంది. అందుకే తెరాసలో ఏదో జరుగుతోంది ... అనే మాట అంతటా బలంగా వినవస్తోంది.

సొంత జిల్లాలో జగన్ కు ఝలక్.. ముందస్తు ఎన్నికలపై కేసీఆర్ క్లారిటీ.. కేరళ కల్లోలం టాప్ న్యూస్@7pm

రాయలసీమ నీటి కోసం అవసరమైతే ఢిల్లీ వెళ్లి పోరాటం చేద్దామని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. హర్యానా తరహాలో ఢిల్లీలో ఉద్యమం చేపట్టాలన్నారు. ఒకప్పుడు రతనాల సీమగా ఉన్న రాయలసీమ నేడు నిర్లక్ష్యానికి గురైందని బాలయ్య ఆరోపించారు. రాయలసీమకు మిగులు జలాలు కాదని, నికర జలాలు ఇవ్వాలని బాలకృష్ణ స్పష్టం చేశారు.  --------- ఎన్డీయేలోకి వైసీపీ రావాలంటూ  కేంద్రమంత్రి రాందాస్ అథవాలే కీలక వ్యాఖ్యలు చేశారు.  కేంద్రం భాగస్వామ్యంతోనే ఏపీ అభివృద్ధి సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. ప్రాజెక్టులు, రహదారులు పూర్తిచేసుకోవచ్చని ప్రతిపాదించారు. పరిశ్రమల ప్రైవేటీకరణ కాంగ్రెస్ హయాంలోనూ జరిగిందని అథవాలే  అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం అసాధ్యమన్నారు అథవాలే. ఏపీకి  మూడు రాజధానుల అంశం కేంద్రం పరిధిలో లేదని స్పష్టం చేశారు.  ---- ఈనెల 20న టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరుతున్నామని మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డి ప్రకటించారు. తాను, తన కుమారుడు భూపేశ్‌రెడ్డి టీడీపీ కండువాలు కప్పుకోబోతున్నామని చెప్పారు. జమ్మలమడుగులో టీడీపీకి మళ్లీ పూర్వవైభవం తెస్తామని నారాయణరెడ్డి ప్రకటించారు. జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా దేవగుడి భూపేశ్‌రెడ్డిని ఖరారు చేస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకొన్నట్లు సమాచారం. --------- తిరుపతి-ఢిల్లీ మధ్య స్పైస్‌జెట్‌ విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. తిరుపతి-ఢిల్లీ మధ్య స్పైస్‌జెట్‌ విమాన సర్వీసును కేంద్ర మంత్రి  జ్యోతిరాదిత్య సింధియా ప్రారంభించారు. ఆథ్యాత్మిక రాజధానిని జాతీయ రాజధానితో అనుసంధానం చేశామన్నారు. తిరుపతికి ఏటా మూడున్నర కోట్ల మంది భక్తులు వస్తారని మంత్రి సింధియా తెలిపారు. --------- ముందస్తు ఎన్నికలకు వెళ్లడంలేదని తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. చేయాల్సిన పనులు చాలా ఉన్నాయన్నారు. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉందని, అన్ని పనులు చేసుకుందామని చెప్పారు. రోజుకు 20 నియోజకవర్గాలకు సన్నాహక సమావేశాలు నిర్వహించాలని పేర్కొన్నారు. విపక్షాలకు దిమ్మదిరిగే రీతిలో వరంగల్ ప్రజాగర్జన సభ ఉండాలని టీఆర్ఎస్ నేతలకు దిశానిర్దేశం చేశారు. ------ హుజూరాబాద్ ఉప ఎన్నికపై స్పందిస్తూ విజయం తమదేనని ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 26న గానీ, లేక 27న గానీ హుజూరాబాద్ లో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఈ సమావేశంలో నిర్ణయించారు. ఈ సభకు కేసీఆర్ హాజరుకానున్నారు. ఇక ఈ నెల 25న టీఆర్ఎస్ ప్లీనరీ నిర్వహించనున్నారు. ఈ ప్లీనరీకి 6,500 మంది ప్రతినిధులకు మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు --- తెలంగాణ ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్ రావుపై కాంగ్రెస్ సీనియర్ నేత కోదండరెడ్డి ఎస్ఈసీ శశాంక్ గోయల్ కు ఫిర్యాదు చేశారు. హరీశ్ రావు గత నెలరోజులుగా హుజూరాబాద్ నియోజకవర్గంలో మకాం వేసి, ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఆయనను హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి బయటికి రప్పించాలని, లేదా మంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాతే ప్రచారంలో పాల్గొనేలా ఆదేశాలు ఇవ్వాలని ఎస్ఈసీని కోరారు. -------- కేరళలో భారీ వర్షాలు కురియడంతో కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఈ ఘటనల్లో మరణించిన వారి సంఖ్య 21కి పెరిగింది. 7 జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో, ప్రధాని నరేంద్ర మోదీ కేరళ సీఎం పినరయి విజయన్ తో మాట్లాడారు. వర్ష బీభత్సంపై చర్చించారు. కేరళ ప్రజలు సురక్షితంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్టు మోదీ తెలిపారు. బాధితుల పునవారాసం కోసం చర్యలు తీసుకోవాలని సీఎంకు సూచించారు. ---- ఉత్తరాఖండ్ లో రాబోయే మూడ్రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. ఈ మేరకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రభుత్వ యంత్రాంగం, విపత్తు నిర్వహణ బృందాలు సర్వసన్నద్ధంగా ఉండాలని సీఎం పుష్పర్ సింగ్ ధామీ ఆదేశించారు. ఈ క్రమంలో చమోలీ జిల్లా అధికారులు నేటి బద్రీనాథ్ యాత్రను నిలిపివేశారు. ------- టీమిండియా హెడ్ కోచ్ గా రవిశాస్త్రి పదవీకాలం ముగుస్తున్న నేపథ్యంలో కొత్త కోచ్ కోసం బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వానించింది. కోచ్ గా కొనసాగేందుకు శాస్త్రి ఆసక్తి చూపకపోవడంతో బీసీసీఐ కొత్త కోచ్ అన్వేషణకు తెరలేపింది. టీమిండియా హెడ్ కోచ్ పదవితో పాటు ఇతర సహాయక సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చని బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది. ------  

బీజేపీ వైపు క‌విత ఆస‌క్తి!.. క‌ల్వ‌కుంట్ల కుటుంబంలో కుంప‌టి..

క‌ల్వ‌కుంట్ల కుటుంబంలో రాజ‌కీయ‌ కుంప‌టి. క‌విత‌తో తండ్రికి, అన్న‌కు విభేదాలు. కేటీఆర్‌కు క‌విత రాఖీ క‌ట్ట‌లేదు. ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో ఇంటి ఆడ‌బిడ్డ బ‌తుక‌మ్మ ఆడ‌టానికి రాలేదు. ఎప్ప‌టి నుంచో న‌డుస్తున్న గుస‌గుస‌ల‌కు ఈ రెండు సంద‌ర్భాలు మ‌రింత ఆజ్యం పోశాయి. పైగా, ఇటీవ‌ల శాస‌న‌మండ‌లిలో ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌పై ఎమ్మెల్సీ క‌విత గ‌ట్టిగా ప్ర‌శ్నించ‌డం మ‌రింత అనుమానాల‌కు కార‌ణ‌మైంది. క‌ల్వ‌కుంట్ల ఫ్యామిలీలో గొడ‌వ‌లు తారాస్థాయికి చేరాయ‌ని తేలిపోయింది. కేటీఆర్‌ను ముఖ్య‌మంత్రిని చేయ‌డం క‌విత‌కు ఇష్టం లేద‌ని అందుకే వారి మ‌ధ్య తేడా వ‌చ్చింద‌ని అంటున్నారు. ఆస్థి త‌గాదాల వ‌ల్లే వైరం పెరిగింద‌ని కూడా చెబుతున్నారు. కార‌ణ‌మేంటో తెలీదు కానీ.. క‌విత‌ను కేసీఆర్‌, కేటీఆర్ ప‌క్క‌న పెట్టేశార‌నే మాత్రం వాస్త‌వ‌మే..అంటున్నారు.  వాట్ నెక్ట్స్‌. తండ్రి ద‌గ్గ‌ర‌కు తీసుకోవ‌డం లేదు. అన్న దూరం పెట్టేశాడు. ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లోకీ అడుగుపెట్ట‌లేనంతా గ్యాప్ పెరిగిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? మ‌రోక‌రైతే ఇంతే ప్రాప్తం అనుకుని.. ఉన్న‌దాంతో అడ్జ‌స్ట్ అయ్యేవారు. కానీ.. ష‌ర్మిల‌, క‌విత లాంటి రాజ‌కీయ ర‌క్తం పారుతున్న నేత‌లు అంత ఈజీగా ప‌ట్టిన ప‌ట్టు విడిచిపెట్టారు. తామేమీ కూర‌లో క‌రివేపాకులం కాద‌ని.. వాడుకొని వ‌దిలేస్తే ఊరుకునేది లేద‌ని.. గ‌ట్టిగా ఎదురుతిరిగే ర‌కం. అందుకే, వైఎస్ ష‌ర్మిల అన్న‌ను వ‌దిలేసి వ‌చ్చి సొంత‌పార్టీ పెట్టేసుకున్నారు. ష‌ర్మిల‌లానే క‌విత సైతం వేరు కుంప‌టి పెట్టుకుంటారా? లేక‌, వేరే పార్టీలో చేరిపోతారా? ఇలా ర‌క‌ర‌కాల చ‌ర్చ జ‌రుగుతోంది. క‌విత కొత్త పార్టీ పెట్టుకుంటార‌ని.. తెలంగాణ జాగృతినే రాజ‌కీయ పార్టీగా మార్చుతార‌ని.. అందుకే ఇటీవ‌ల ఏఆర్ రెహ‌మాన్‌, గౌత‌మ్‌మీన‌న్‌ల‌తో ప్ర‌త్యేకంగా బ‌తుక‌మ్మ పాట రిలీజ్ చేసి ముంద‌స్తు మెసేజ్ ఇచ్చారంటూ ఓ టాక్ న‌డుస్తోంది. తాజాగా, క‌విత బీజేపీలో చేరుతారంటూ కొత్త వాద‌న తెర‌పైకి వ‌చ్చింది.  కేసీఆర్‌ను ఎదిరించి సొంతంగా పార్టీ పెట్టి నిల‌బ‌డ‌టం అంత వీజీ కాద‌ని అంద‌రికంటే క‌విత‌కే బాగా తెలిసుంటుంది. అందుకే, కొత్త పార్టీ కాకుండా వేరే పార్టీ అయితేనే బెట‌ర్ అనేది ఆమె ఆలోచ‌న‌లా ఉంది. రేవంత్‌రెడ్డి ఉన్నారు కాబ‌ట్టి, కాంగ్రెస్‌లో ఆయ‌న‌దే హ‌వా కాబ‌ట్టి.. ఆ పార్టీలో చేరినా క‌విత‌కు పెద్ద‌గా ప్ర‌యోజ‌నం ఉండ‌క‌పోవ‌చ్చు. అందుకే, బీజేపీనే క‌విత‌కు బెస్ట్ ఆప్ష‌న్ అంటున్నారు. ఆ ప్ర‌చారానికి మ‌రింత బ‌లం చేకూర్చేలా.. జ‌ల‌విహార్‌లో బండారు ద‌త్తాత్రేయ నిర్వ‌హించిన అల‌య్ బ‌ల‌య్ కార్య‌క్ర‌మంలో.. బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షులు బండి సంజ‌య్‌, క‌విత‌లు ప‌క్క ప‌క్క‌నే కూర్చొని చ‌ర్చించుకోవ‌డం రాజ‌కీయంగా చ‌ర్చ‌నీయాంశ‌మైంది.  అల‌య్ బ‌ల‌య్ క‌దా.. పార్టీల‌కు అతీతంగా క‌లుసుకోవ‌డం, మాట్లాడుకోవ‌డం కామ‌నే క‌దా అనుకోవ‌డానికి లేదు. ఎందుకంటే నిజామాబాద్‌లో ఎంపీగా పోటీ చేసిన క‌విత‌ను ఓడించింది బీజేపీనే. కేసీఆర్ కుటుంబానికి మాత్ర‌మే ప‌ద‌వులు వ‌చ్చాయ‌ని.. క‌విత భారీగా అక్ర‌మ ఆస్తులు కూడ‌బెట్టార‌ని.. బండి సంజ‌య్ ప‌దే ప‌దే ఘాటైన విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఇంత‌కు ముందెప్పుడూ సంజ‌య్‌-క‌విత‌లు మ‌ర్యాద‌పూర్వకంగానైనా మాట్లాడుకున్న‌ది లేదు. అస‌లు ఆ ప్రోగ్రామ్‌కు క‌విత ఇంత‌కుముందెప్పుడూ హాజ‌రుకాలేదు కూడా. ఈసారే క‌విత‌ అల‌య్ బ‌ల‌య్‌కు రావ‌డం.. కావాల‌నే బండి సంజ‌య్‌తో ముచ్చ‌ట్లు పెట్ట‌డం వెనుక‌.. తెర వెనుక ఏదో జ‌రుగుతోంద‌ని అంటున్నారు. కేసీఆర్‌, కేటీఆర్‌ల‌కు ఝ‌ల‌క్ ఇచ్చేందుకే క‌విత బీజేపీ అధ్య‌క్షుడితో ప‌రిచ‌యం పెంచుకుంటున్నారా?  కావాల‌నే కాషాయ పార్టీకి ద‌గ్గ‌ర‌వుతున్నారా? అనే అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. ప‌రిస్థితులు నిషితంగా గ‌మ‌నిస్తే.. త్వ‌ర‌లోనే క‌విత కీల‌క నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉందంటున్నారు. చూడాలి ఏం జ‌రుగుతుందో.. ఏమో, గుర్రం ఎగ‌రావ‌చ్చు.. రాజ‌కీయాల్లో ఏదైనా సాధ్య‌మే క‌దా....