మేమూ ఉప్పూకారం తింటున్నాం.. మాకు బీపీ వస్తే జగన్ తాట తీస్తాం..

చంద్ర‌బాబు చేప‌ట్టిన 36 గంట‌ల నిర‌వ‌ధిక దీక్షలో టీడీపీ నాయ‌కులు సీఎం జ‌గ‌న్‌రెడ్డిపై చెల‌రేగిపోతున్నారు. తూటాల్లాంటి మాట‌ల‌తో వైసీపీ ప్ర‌భుత్వాన్ని తూట్లు పొడుస్తున్నారు. ఒక్కో నేత ఒక్కో ర‌కంగా వార్నింగ్ ఇస్తున్నారు. అందరిలోకీ ప‌రిటాల సునీత చేసిన హెచ్చ‌రిక హైలైట్‌. టీడీపీ అధికారంలోకి వ‌చ్చాక గంట క‌ళ్లు మూసుకుంటే చాలు.. తామేంటో చూపిస్తామంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.  ఏపీలో ప్రజాస్వామ్యం అపహాస్యమవుతోందని టీడీపీ నేత బుద్దా వెంకన్న ఫైర్ అయ్యారు. ఏపీని చంద్రబాబు రామరాజ్యంగా మారిస్తే, జగన్ రాక్షస రాజ్యంగా మార్చారని విమర్శించారు. తెలుగు తమ్ముళ్లకు బీపీ వస్తే జగన్ తాట తీస్తారని హెచ్చరించారు. వైసీపీ తాకాటు చప్పుళ్లకు భయపడమని.. 2024లో టీడీపీదే అధికారమని బుద్దా వెంకన్న అన్నారు.  ఇక మ‌రో ఫైర్‌బ్రాండ్ లీడ‌ర్ చింత‌మ‌నేని సైతం ఓ రేంజ్‌లో జ‌గ‌న్‌రెడ్డిని, మంత్రుల‌ను దుయ్య‌బ‌ట్టారు. ‘‘మంత్రి పదవి కోసమే ఇన్నాళ్లూ కొడాలి నాని టీడీపీ నేతలను తిట్టారు. త్వరలోనే ఆయన పదవి పోవడం ఖాయం. జగన్‌కే కాదు.. గాడ్సేకు కూడా అభిమానులున్నారు. మేమూ ఉప్పూకారం తింటున్నాం.. మాకూ బీపీ వస్తుంది’’ అని చింతమనేని ప్రభాకర్ హెచ్చ‌రించారు. రాష్ట్రంలో ఎన్నికల జరగాల్సిన స్థానిక సంస్థలకు నోటిఫికేషన్‌ ఇస్తే వైసీపీకి ముచ్చెమటలు పట్టిస్తామన్నారు చింతమనేని.  మ‌రోవైపు.. అమ్మను వదిలేసినవాడు అమ్మఒడి ఇస్తాడా? అని అమరావతి జేఏసీ అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాసరావు ప్రశ్నించారు. ‘‘చెల్లిని వదిలేసిన వాడికి సెంటిమెంట్స్ ఉంటాయా? జగన్మోహన్ రెడ్డి తన సమాధిని తానే కట్టుకుంటున్నాడు. అరాచకంతో అధికారంలోకి వచ్చిన ఏ నాయకుడూ పూర్తికాలం అధికారంలో లేడు. ఈరోజు నుంచి సీఎం జగన్ గంజాయి ముఖ్యమంత్రి. జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి తెచ్చినవారే సమాధి చేస్తారు. తాడేపల్లి నుంచి తరిమికొట్టే రోజు దగ్గరలోనే ఉంది. ఆంధ్రప్రదేశ్ బిడ్డల భవిష్యత్ కోసం ప్రజలంతా తిరగబడాలి. సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకు జగన్ అరాచకాన్ని సృష్టించాడు’’ అని కొలికపూడి మండిప‌డ్డారు.   

రేవంత్‌రెడ్డి ఇమేజ్ అదుర్స్‌.. ఇత‌ర రాష్ట్రాల్లోనూ రీసౌండ్‌...

రేవంత్‌రెడ్డి. ఇప్పుడిది పేరు మాత్ర‌మే కాదు ఓ ప‌వ‌ర్‌. కాంగ్రెస్‌కు ప‌వ‌ర్ బూస్ట‌ర్‌. టీపీసీసీ ప‌గ్గాలు చేప‌ట్టాక రేవంత్‌రెడ్డి పేరు తెలంగాణ వ్యాప్తంగా మ‌రింత మారుమోగుతోంది. తెలంగాణ‌లో ఏ ఇద్ద‌రు క‌లిసినా రేవంత్‌రెడ్డి దూకుడు గురించే మాట్లాడుకుంటున్నారు. కేసీఆర్‌పై, టీఆర్ఎస్ ప్ర‌భుత్వంపై ఆయ‌న చేసే ప‌దునైన‌ విమ‌ర్శ‌ల గురించే చ‌ర్చించుకుంటున్నారు. ఇలా, కొంత‌కాలంతా రాష్ట్ర‌మంతా రేవంత్‌రెడ్డి హ‌వా న‌డుస్తోంది. మ‌న‌కు ఇంత వ‌ర‌కే తెలుసు. కానీ, రేవంత్‌రెడ్డి టాపిక్ కేవ‌లం తెలంగాణ‌కే ప‌రిమితం కాలేద‌ని.. దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల నాయ‌కుల దృష్టిలోనూ రేవంత్‌రెడ్డి ఉన్నార‌ని తాజా ప‌రిణామంతో స్ప‌ష్ట‌మైంది. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే... పంజాబ్ మాజీ సీఎం అమ‌రీంద‌ర్‌సింగ్ తెలుసుగా. ఇటీవ‌లే ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేసి సొంత పార్టీ ఏర్పాట్ల‌లో బిజీగా ఉన్నారు. బీజేపీతో పొత్తుకూ సై అన్నారు. అమ‌రీంద‌ర్ ఎపిసోడ్ ఇప్పుడు ఇటు పంజాబ్‌లో, అటు కాంగ్రెస్‌లో వాడివేడి ర‌గిలిస్తోంది. బీజేపీతో జ‌త‌క‌ట్ట‌డంపై కాంగ్రెస్ వాదులు పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లూ చేస్తున్నారు. సెక్క్యూల‌రిజం ఏమందంటూ కుళ్ల‌బొడుస్తున్నారు. ఒళ్లుమండిన అమ‌రీంద‌ర్‌.. రివర్స్ అటాక్‌కు దిగారు. మీ కాంగ్రెస్ నేత‌లేమైనా సెక్యుల‌రిస్టులా? అంటూ సిద్ధూ గ‌తంలో బీజేపీలో లేరా? తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఆర్ఎస్ఎస్ వాది కాదా? అంటూ ఎదురు ప్ర‌శ్నించారు. ఇంత‌టి కీల‌క‌మైన విమ‌ర్శ‌లోనూ పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమ‌రీంద‌ర్‌సింగ్ నోటి నుంచి రేవంత్‌రెడ్డి పేరు రావ‌డ‌మే ఇక్క‌డ ఇంట్రెస్టింగ్ పాయింట్‌.  రేవంత్‌రెడ్డి ఆర్ఎస్ఎస్ వాది అవునా? కాదా? అనేది పెద్ద‌గా ప్రాధాన్యం లేని విష‌యం. బ‌హుషా విద్యార్థి ద‌శ‌లో రేవంత్‌ ఏబీవీపీలో ఉన్నందుకు కాబోలు ఆయ‌న‌లా అని ఉంటార‌ని అంటున్నారు. అయితే, రేవంత్‌రెడ్డి గురించి అంత చిన్న డీటైల్ కూడా.. ఆయ‌న‌ స్టూడెంట్ లైఫ్ గురించి కూడా.. పంజాబ్‌ మాజీ సీఎం కెప్టెన్‌ అమ‌రీంద‌ర్‌సింగ్‌కు తెలిసి ఉండ‌ట‌మే ఆస‌క్తిక‌ర‌మైన అంశం. కాంగ్రెస్‌లో రేవంత్‌రెడ్డి విష‌యంలో ఎంత డీప్ డిస్క‌ష‌న్ జ‌రిగి ఉంటుందో.. దేశ‌వ్యాప్తంగా కాంగ్రెస్ పెద్ద స్థాయి నాయ‌కులంద‌రికీ రేవంత్‌రెడ్డి గురించి ఎంత‌లా అప్‌డేట్ ఉండి ఉంటుందో.. అమ‌రీంద‌ర్‌సింగ్ వ్యాఖ్య‌ల‌తో అర్థ‌మైపోతోంద‌ని అంటున్నారు. రేవంత్‌రెడ్డిని జాతీయ కాంగ్రెస్‌ పూర్తిగా స్ట‌డీ చేశాకే.. పార్టీలో చేరిన వెంట‌నే వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, ఆ త‌ర్వాత పీసీసీ ప్రెసిడెంట్ ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టార‌ని చెబుతున్నారు. రేవంత్‌రెడ్డి చిచ్చ‌ర‌పిడుగు కాబ‌ట్టే.. తెలంగాణ‌లోనే కాదు పంజాబ్‌లోనూ ఆయ‌న పేరు రీసౌండ్ అవుతోంది. అందుకే, రేవంత్‌రెడ్డినా.. మ‌జాకా.. అంటున్నారు అభిమానులు.  

గంట క‌ళ్లు మూసుకుంటే మేమేంటో చూపిస్తాం.. మాకూ బీపీ వ‌స్తోందంటూ ప‌రిటాల వార్నింగ్‌..

ప‌రిటాల ఫ్యామిలీ. రాయ‌లసీమ‌లో ప‌రిటాల స‌త్తా ఎంతో తెలుసుగా. ఒక‌ప్పుడు కంటిచూపుతోనే సీమ‌ను శాసించేవారు. రాష్ట్ర రాజ‌కీయాల‌ను మార్చేసేవారు. అప్ప‌ట్లో ప‌రిటాల ర‌వీంద్ర చెప్పిందే వేదం.. చేసిందే శాస‌నం. న‌క్స‌లిజం, ఫ్యాక్ష‌నిజం, రాజ‌కీయం.. అన్నిటినీ మిక్స్ చేసి.. సీమ‌లో మొన‌గాడిలా నిలిచారు. ఆయ‌నిప్పుడు లేకున్నా.. ప‌రిటాల బ‌లం, బ‌ల‌గం చెక్కు చెద‌ర‌లేదు. డౌట్ ఉంటే అనంత‌పురం జిల్లాలో ఏ ఒక్క‌రిని అడిగినా చెబుతారు.   టీడీపీకి వెన్నుద‌న్నుగా ఉండే ప‌రిటాల ఫ్యామిలీ ఇప్పుడు ఆగ్ర‌హంతో ఊగిపోతోంది. దేవాల‌యంలాంటి టీడీపీ కేంద్ర కార్యాల‌యంపై వైసీపీ మూక‌లు దాడి చేయ‌డంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తోంది. చేసిన దాడులు స‌రిపోవ‌న్న‌ట్టు.. తాజాగా సీమకు చెందిన ఓ వైసీపీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విజ‌య‌వాడ‌లో కాబ‌ట్టి దాడుల‌తో స‌రిపోయింది.. అదే మా సీమ‌లో అయితే ఖూనీలు జ‌రిగేవంటూ మ‌రింత రెచ్చ‌గొట్టేలా మాట్లాడ‌టం క‌ల‌క‌లం రేపింది. దీంతో.. టీడీపీ కార్యాల‌యంపై వైసీపీ దాడులు, మంత్రుల బూతులు, వైసీపీ రెచ్చ‌గొట్ట‌డంపై మాజీ మంత్రి, టీడీపీ సీనియ‌ర్ నేత ప‌రిటాల సునీత తీవ్ర స్థాయిలో హెచ్చ‌రించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక గంట కళ్లు మూసుకుంటే తామేంటో చూపిస్తామంటూ పరిటాల సునీత వైసీపీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ‘‘మాలో ప్రవహించేది సీమ రక్తమే’’ అన్నారు. తన భర్తను చంపినప్పుడు కూడా ఓర్పుగా ఉండమన్నారు కాబట్టే ఉన్నామని.. ఆనాడే చంద్రబాబు కన్నెర్ర చేసి ఉంటే ఒక్కరు కూడా మిగిలి ఉండే వారు కాదని హెచ్చ‌రించారు. ఇక‌నైనా చంద్రబాబు తీరు మారాల‌న్నారు. తాము అధికారంలోకి వచ్చాక వైసీపీకి చుక్కలు చూపిస్తామని పరిటాల సునీత గ‌ట్టిగా హెచ్చరించారు.   

అరాచ‌క ప్ర‌భుత్వాన్ని త‌రిమి కొడ‌తాం.. టీడీపీ స్ట్రాంగ్ వార్నింగ్‌..

ఏపీలో అరాచక ప్రభుత్వం నడుస్తోందని మాజీ మంత్రి దేవినేని ఉమ మండిప‌డ్డారు. సీఎం జగన్‌రెడ్డి పాలనలో అరాచకత్వం రాజ్యమేలుతోందని విమర్శించారు. పట్టాభి ఇంటిపై వైసీపీ గూండాలు దాడి చేశారు.. దేవాలయం లాంటి పార్టీ కార్యాలయంపై గంజాయి బ్యాచ్‌తో దాడి చేయించారు.. ఇలాంటి దాడులకు భయపడబోమన్నారు దేవినేని ఉమా.  జగన్ రెడ్డి గుర్తుంచుకో.. టీడీపీ అధికారంలోకి వస్తుంది. మంత్రులు బరితెగించి బూతులు తిడుతున్నారు. అందరినీ ప్రజాస్వామ్య పద్ధతిలో తరిమి కొడతాం.. అంటూ దేవినేని ఉమా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. 11 సీబీఐ, 6 ఈడీ, 18 కేసుల్లో ముద్దాయిగా ఉన్న జ‌గ‌న్‌రెడ్డి పరిపాలనలో ఇంతకన్నా ఏమీ ఆశిస్తామ‌న్నారు. 28 వేల ఎకరాల్లో సాగవుతున్న గంజాయి గురించి మాట్లాడితే.. ఆ టాపిక్‌ను పక్కదారి పట్టించడానికే ఇలా దాడులు కార్యక్రమం చేశారన్నారు. ప్రజలు విద్యుత్ బాదుడుపై కోపంగా ఉన్నారు. ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లో వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు వస్తున్నాయి. మనవాడంటూ ప్రజల్ని ఎలా మోసం చేశారో కడపలో ఓ మాజీ మంత్రి చెప్పారు. ఇలా జ‌గ‌న్ గ్రాఫ్ దారుణంగా ప‌త‌న‌మ‌వుతుండ‌టంతో ఇలా దారుణాల‌కు తెగ‌బ‌డుతున్నార‌ని మండిప‌డ్డారు. తప్పు చేసిన అధికారుల లిస్టంతా రాస్తున్నాం. అధికారంలోకి వ‌చ్చాక అంద‌రి సంగ‌తీ తేలుస్తాం. జగన్‌రెడ్డికి డీజీపీ సాగిల పడ్డారు. 5 సార్లు కోర్టు మెట్లు ఎక్కారు. ప్రజాస్వామ్యానికి దెబ్బ తగిలింది. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలి. అసమర్థ, అవినీతి పాలనపై సీబీఐ విచారణ చేయాలంటూ దేవినేని ఉమ డిమాండ్ చేశారు.   

గంజాయి బ్యాచ్‌తో దాడి!.. వాళ్లు ఆ నాయ‌కుడి అనుచ‌రులేనా?

మంగ‌ళ‌గిరిలోని టీడీపీ ప్ర‌ధాన కార్యాల‌యం ఎన్టీఆర్ భ‌వ‌న్‌పై దాడి చేసి బీభ‌త్సం సృష్టించారు. ఈ దాడి చేసిన వారిపై టీడీపీ ఫిర్యాదు చేసినా.. ఇంత వ‌ర‌కూ ఎవ‌రినీ అదుపులోకి తీసుకోలేద‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. దాడి చేసింది త‌న అభిమానులేన‌ని సీఎం జ‌గ‌న్‌రెడ్డినే స్వ‌యంగా ఒప్పుకున్నారు. అందుకే, ఈ కేసులో జ‌గ‌న్‌రెడ్డి పేరు కూడా చేర్చాలంటూ టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ డిమాండ్ చేస్తున్నారు. దాడి ఘ‌ట‌న‌లో 70 మందిపై కేసు న‌మోదు చేసి చేతులెత్తేశారు. పైగా బాధితులైన టీడీపీ వ‌ర్గీయుల‌పైనా కేసులు క‌ట్టి.. అరెస్ట్ చేసి.. నాదెండ్ల బ్ర‌హ్మంను జైలుకు కూడా త‌ర‌లించ‌డం మ‌రింత దారుణ‌మైన విష‌యం అంటున్నారు.  మ‌రి, క‌ర్ర‌లు, రాడ్లు, సుత్తిల‌తో దాడి చేసిన వైసీపీ గూండాల‌ను ఇంకా ఎందుకు ప‌ట్టుకోలేక పోతున్నారు? సీసీకెమెరాల్లో ప‌క్కాగా విజువ‌ల్స్ ఉన్నా.. ధ్వంస ర‌చ‌న మొత్తం రికార్డైనా.. ఆ ఫూటేజీ ఆధారంగా నిందితుల‌ను ఎందుకు అరెస్ట్ చేయ‌ట్లేదు? వ‌చ్చిన వారంతా దేవినేని అవినాశ్ మిత్ర‌బృందంకు చెందిన వార‌ని విజ‌య‌వాడ‌లో ప్ర‌చారం జ‌రుగుతోంది. వారంతా గంజాయి బ్యాచ్ అని చెబుతున్నారు. టీడీపీ ఆఫీసుపై దాడి చేసిన అల్ల‌రిమూక‌ను బెజ‌వాడ వాసులు గుర్తు ప‌డుతున్నారు. మ‌రి, పోలీసులు మాత్రం వారిని గుర్తించ‌క‌పోవ‌డం.. అరెస్ట్ చేసి జైలుకు త‌ర‌లించ‌క‌పోవ‌డం అనుమానాల‌కు తావిస్తోంది. పోలీసులు పాల‌క ప‌క్షానికి కొమ్ము కాస్తున్నార‌నే ఆరోప‌ణ‌ల‌కు మ‌రింత బ‌లం చేకూర్చుతోంది. టీడీపీ నేత‌లు ప‌ట్టాభి, నాదెండ్ల బ్ర‌హ్మంల అరెస్టు విష‌యంలూ చూపించిన దూకుడు.. టీడీపీ కార్యాల‌యంపై దాడి చేసిన వైసీపీ గూండాలు, గంజాయి బ్యాచ్‌ల‌పై చూపించ‌రా? అని ప్ర‌శ్నిస్తున్నారు. మ‌రి, ఈ ఆరోప‌ణ‌ల‌కు పోలీసుల స‌మాధానం ఏంటి? సీసీ కెమెరా ఫూటేజ్‌లో క్లియ‌ర్‌గా క‌నిపిస్తున్నా.. నిందితులంద‌రినీ అరెస్ట్ చేయ‌క‌పోవ‌డాన్ని ఎలా చూడాలి?    

మ‌చిలీప‌ట్నం నుంచి రాజమండ్రి జైలుకు పట్టాభి తరలింపు.. బెయిల్ వ‌చ్చేనా? క‌స్ట‌డీ కోరేనా?

ఏపీలో ఇంకెవ‌రూ బూతులు మాట్లాడ‌న‌ట్టు.. రాష్ట్రంలో బూతుల‌ను నిషేధించిన‌ట్టు.. టీడీపీ అధికార ప్ర‌తినిధి ప‌ట్టాభి ఒక్క‌రే బూతు మాట్లాడిన‌ట్టు.. జ‌గ‌న్ కేబినెట్‌లో మంత్రులకు అస‌లు బూతులే రాన‌ట్టు.. ఒక్క ప‌ట్టాభిపైనే కేసులు పెట్టి.. రాత్రి వేళ ఆయ‌న ఇంటిపై దాడి చేసి.. ఇంటి తలుపులు ప‌గ‌ల‌గొట్టి.. అరెస్ట్ చేసి క‌క్ష్య సాధింపు చ‌ర్య‌ల‌కు వైసీపీ ప్ర‌భుత్వం పాల్ప‌డటంపై తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ప‌ట్టాభిని సాకుగా చూపి రాష్ట్ర‌వ్యాప్తంగా టీడీపీ ఆఫీసుల‌పై దాడుల‌కు తెగ‌బ‌డ్డాయి వైసీపీ మూక‌లు. దేవాల‌యం లాంటి టీడీపీ కార్యాల‌యంపై దాడికి నిర‌స‌న‌గా పార్టీ అధినేత చంద్ర‌బాబు 36 గంట‌ల నిర‌స‌న దీక్ష చేస్తున్నారు. ఇలా, ప‌ట్టాభి ఎపిసోడ్ అనేక మ‌లుపులు తిరుగుతూ రాజ‌కీయంగా ఉద్రిక్త‌త రాజేస్తోంది.  సీఎం జగన్‌ను బోసిడీకే అని తిట్టారంటూ నమోదైన కేసులో ప‌ట్టాభిని అరెస్ట్ చేసి కోర్టులో హాజ‌రుప‌ర‌చ‌గా 14 రోజుల రిమాండ్ విధించింది న్యాయ‌స్థానం. గురువారం ప‌ట్టాభిరామ్‌ను మ‌చిలీప‌ట్నం జైలుకు త‌రలించారు పోలీసులు. కొవిడ్ పరీక్ష‌లు నిర్వ‌హించిన అనంత‌రం.. శుక్ర‌వారం ప‌ట్టాభిని పోలీస్ బందోబ‌స్తుతో మ‌చిలీప‌ట్నం జైలు నుంచి రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి తరలించారు.  ఇక‌, పట్టాభికి బెయిల్ ఇవ్వాలంటూ ఆయ‌న త‌ర‌ఫు న్యాయ‌వాదులు కోర్టును ఆశ్ర‌యించ‌నున్నారు. మ‌రోవైపు, పోలీసులు సైతం ప‌ట్టాభిని ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని పిటిషన్‌ దాఖలు చేయ‌నున్నార‌ని తెలుస్తోంది. మ‌రి, ప‌ట్టాభికి బెయిల్ వ‌స్తుందా?  పోలీస్ క‌స్ట‌డీ వ‌స్తుందా? అనే ఉత్కంఠ కొన‌సాగుతోంది.   

హుజురాబాద్‌లో కేసీఆర్ 'సెప‌రేట్‌' స్కెచ్‌.. ఈసీ దిమ్మ‌తిరిగే షాక్‌.. అబ్ ఆయేగా మ‌జా..

హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచారం మరో ఏడు రోజుల్లో ముగుస్తుంది. అయినా తెరాస ప్రచారంలో ఇంతవరకు మంత్రి హరీష్ రావు మినహా మిగిలిన ముఖ్య నేతలు ఎవరూ, ప్రముఖంగా కనిపించ లేదు. వినిపించ లేదు. ముఖ్యంగా ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ప్రచారానికి దూరంగానే ఉన్నారు. కేటీఆర్ అయితే, ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం లేదని తేల్చి చెప్పేశారు. ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారంలో పాల్గొనే విషయంలోనూ కేటీఆర్ అనుమానాలనే వ్యక్త పరిచారు. ఇప్పుడు ఆ అనుమానమే నిజం అయింది.  ఈనెల 27న, హుజూరాబాద్ నియోజకవర్గం వెలుపల ఎల్కతుర్తి మండలం పెంచికల్ పేటలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ బహిరంగ సభకు తెరాస అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఎన్నికల నిబంధనల ప్రకారం హుజూరాబాద్‌ నియోజకవర్గంలో భారీ బహిరంగ సభలను నిర్వహించుకునేందుకు వీలు లేదు. అందుకే, హుజూరాబాద్ పక్కనే ఉండే ప్రాంతమైన పెంచికల్ పేటను టీఆర్‌ఎస్‌ ఎంచుకుంది. సభ హుజూరాబాద్ నియోజక వర్గం వెలుపల జరిగినా, జనాన్ని హుజూరాబాద్ నుంచే తరలించాలని, హరీష్ రావు ప్లాన్ రెడీ చేశారు. అయితే, తెరాస/ హరీష్ రావు  ఒకటి తలిస్తే, కేంద్ర ఎన్నికల సంఘం ఇంకొకటి తలచింది. హుజూరాబాద్ సహా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న ఉప ఎన్నికల సందర్భంగా ఎన్నికల కోడ్, ముఖ్యంగా కోవిడ్ స్పెషల్ కోడ్ ఉల్లంఘనలు జరుగుతన్న వైనాన్ని గుర్తించింది. ఈ నేపద్యంలో ఎన్నికల సంఘం ఎన్నికల కోడ్ అమలు తీరి తెన్నులను మరింత కఠినతరం చేస్తూ తాజా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం జాయింట్ డైరెక్టర్ అనూజ్ చందక్ ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల కోడ్, కేవలం నియోజక వర్గం పరిధిలో మాత్రమే కాకుండా, నియోజక వర్గం ఉన్న జిల్లా/ జిల్లాలకు మొత్తంగా వర్తిస్తుందని ఉత్తర్వులలో పేర్కొన్నారు. అలాగే, పరోక్షంగానే అయినా  హుజూరాబాద్ ఉప ఎన్నిక విషయంలో జరుగుతున్న ఎన్నికల కోడ్ ఉల్లంఘనలను కూడా అందులో పేర్కొన్నారు. దీంతో అధికార పార్టీ ఈ నెల 27న పెంచికల్ పేటలో జరపతలపెట్టిన ముఖ్యమంత్రి ఎన్నికల సభకు చిక్కులు ఏర్పడ్డాయి.  తాజా ఉత్తర్వులలో పేర్కొన్న మేరకు హుజూరాబాద్ తో పాటుగా నియోజక వర్గం విస్తరించి ఉన్న కరీంనగర్, హన్మకొండ జిల్లాల్లోనూ ఎన్నికల కోడ్ వర్తించనున్నట్లు స్పష్టమవుతోంది. ఉప ఎన్నిక జరుగుతున్న నియోజకవర్గానికి కొంత దూరంలో ఉండే ప్రాంతంలో భారీ స్థాయి బహిరంగ సభలు పెట్టడం కోడ్‌లో పేర్కొన్న నిబంధనలకు విరుద్ధమేనని కూడా సీఈసీ జాయింట్ డైరెక్టర్ అనూజ్ చందక్ తాజా ప్రకటనలో తెలిపారు. సో.. ముఖ్యమంత్రి సభ కూడా జరిగే అవకాశం లేదని తేలిపోయింది.  అయితే,  ఎన్నికల సంఘం తాజా ఉత్తర్వులకు ముందే, మంత్రి కేటీఆర్, ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంపై సందేహం వ్యక్తం చేయడంతో, దాల్ మే కుచ్.. హై క్యా ..అనే  అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఈటలను ఓడించడం ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్ రావు లక్ష్యం అయితే, ఈటల అడ్డు ఎలగూ తొలిగి పోయింది కాబట్టి, మిలిన అడ్డు హరీష్’ను కూడా తొలిగించుకోవడం కేటీఆర్ లక్ష్యంగా కనిపిస్తోందని అంటున్నారు. ఇందులో బాగంగానే కేటీఆర్ అభ్యర్ధి ఎంపిక నుంచే వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారా? అందుకే హరీష్ రావును బలిపశువుని చేసేందుకే హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో తాను పాల్గొనక పోవడంతో పాటుగా ముఖ్యమంత్రి కూడా పాల్గొనకుండా ఎన్నికల సంఘంలో చక్రం తిప్పారా అన్న సందేహాలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అదే నిజం అయితే హుజూరాబాద్ అంతిమ విజేత కేటీఆరే అవుతారు.

మోదీ ఫిదా.. బిలియ‌న్ మార్క్ టీకాలు.. స‌త్తా చాటిన టీమిండియా...

ఇండియా వ‌ల్ల కాద‌న్నారు. 130 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇవ్వాలంటే 8-9 ఏళ్లు ప‌డుతుంద‌న్నారు. భార‌త్‌కు అంత సామ‌ర్థ్యం లేద‌న్నారు. ఎగ‌తాళి చేసిన నోళ్లన్నీ ఇప్పుడు మూత‌ప‌డ్డాయి. అదే నోటితో శ‌భాష్ ఇండియా అంటూ భుజం త‌డుతున్నాయి. వ్యాక్సినేష‌న్‌లో అనిత‌ర సాధ్య‌మైన శ‌త‌కోటి ప్ర‌యాణాన్ని మ‌న దేశం సునాయాసంగా సాధించింది. కేవలం తొమ్మిదంటే 9 నెలల్లోనే దేశవ్యాప్తంగా 100 కోట్లకు పైగా డోసులను పంపిణీ చేసి అరుదైన ఘ‌న‌త గడించింది. కొవిడ్ మహమ్మారిపై పోరాటంలో భాగంగా భారత్ జనవరి 16న కరోనా టీకా కార్యక్రమాన్ని ప్రారంభించగా.. అక్టోబర్ 21 నాటికి 100 కోట్ల డోసుల పంపిణీ చేశారు. ఈ ప్రయాణాన్ని ‘ఆందోళన నుంచి భరోసా’ వరకు అని ప్ర‌ధాని మోదీ అభివర్ణించారు. టీకా పంపిణీలో 100 కోట్ల మార్క్‌ను దాటిన సందర్భంగా ప్రధాని మోదీ ‘టీమిండియా - సవాళ్లకు లక్ష్యంతో సమాధానం’ అనే టైటిల్‌తో ఓ హిందీ పత్రికకు ప్ర‌త్యేక‌ ఆర్టిక‌ల్ రాశారు. ఇంత‌కీ మెదీ ఏమ‌న్నారంటే.....  ఆందోళన నుంచి భరోసా వరకు చేరుకున్న ఈ ప్రయాణంతో దేశం మరింత బలమైందని మోదీ అన్నారు. టీకాలపై ఎన్ని అపోహలు సృష్టించినా, గందరగోళ పరిస్థితులు ఎదురైనా.. దేశ ప్రజల విశ్వాసంతోనే ఈ విజయం సాధించగలిగామన్నారు. ‘‘ఇది నాది అని ప్రతిఒక్కరూ అనుకున్నప్పుడు.. ఏదీ అసాధ్యం కాదు. దేశ ప్రజలందరికీ టీకాలు అందించాలన్న లక్ష్యంతో మన ఆరోగ్య కార్యకర్తలు ఎంతో శ్రమించారు. కొండలు ఎక్కి.. నదులు దాటారు. ప్రతికూల భౌగోళిక పరిస్థితులను అధిగమించారు. సామాజిక కార్యకర్తలు, రాజకీయ నేతలు, యువత కలిసికట్టుగా పనిచేశారు. అందుకే అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే మన దేశంలో టీకాపై సంకోచాలు కాస్త తక్కువే ఎదురయ్యాయి’’ అని మోదీ చెప్పారు. ‘‘దాదాపు 100 ఏళ్ల తర్వాత మానవాళి ఇంతటి ఘోరమైన మహమ్మారిని ఎదుర్కొంటోంది. కన్పించని శత్రువు వేగంగా పాకుతుంటే ఏం చేయాలో కూడా పాలుపోని పరిస్థితుల్లో పడిపోయాం. అలాంటి ఆందోళనల నుంచి బయటపడి టీకాలు తయారుచేసుకున్నాం. ఇప్పుడు 100 కోట్ల మైలురాయిని దాటుకుని మహమ్మారి నుంచి బయటపడగలమనే భరోసా ఇవ్వగలుగుతున్నాం. ఈ ప్రయాణంతో మనం మరింత బలంగా మారాం. దీని కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు’’ అని మోదీ ఆనందం వ్యక్తం చేశారు.    మ‌రోవైపు.. ప్రధాని మోదీ తన ట్విటర్ ఖాతా ప్రొఫైల్ పిక్ మార్చారు. దేశం 100 కోట్ల కరోనా టీకా డోసుల్ని పంపిణీ చేసి, కీలక మైలురాయి దాటిన వేళ.. ఆ ఘనతను ప్రతిబింబించే ఫోటోను ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకున్నారు.    

పీకే స్కెచ్‌తోనే టీడీపీ ఆఫీసుల‌పై దాడులు?.. ఆయ‌న‌ చాలా డేంజ‌ర్ గురూ!

ఏపీ వ్యాప్తంగా టీడీపీ కార్యాల‌యాల‌పై ఏక‌కాలంలో వైసీపీ శ్రేణులు దాడుల‌కు తెగ‌బ‌డ్డాయి. మంగ‌ళ‌గిరిలోని టీడీపీ సెంట్ర‌ల్ ఆఫీసుపైనైతే అచ్చం సినీ ఫ‌క్కీలో అటాక్ జ‌రిగింది. అదేదో ఫ్యాక్ష‌న్ సినిమా సీన్ మాదిరి.. రౌడీ మూక‌లు వ‌రుసగా వాహ‌నాలు వేసుకొని.. వాటిపై వేలాడుతూ వ‌చ్చి.. క‌ర్ర‌లు, రాడ్లు, సుత్తిల‌తో దాడి చేశారు. వాహ‌నంతో గేటును ఢీ కొట్ట‌డం అయితే ముందుగానే రిహార్స‌ల్స్ చేసొచ్చిన‌ట్టుగా ప‌క్కాగా గుద్దేశారు. క‌ట్ చేస్తే.. ఇటు మంగ‌ళ‌గిరి టీడీపీ ఆఫీసు ధ్వంసం చేయ‌గానే.. ఎవ‌రో ఫోన్ చేసి ఉస్కోమ‌న్న‌ట్టు.. ప‌క్కాగా ఇంచుమించు అదే స‌మ‌యానికి ఏపీవ్యాప్తంగా వివిధ జిల్లాల్లోని కార్యాల‌యాల‌పైనా వైసీపీ శ్రేణులు బీభ‌త్సం సృష్టించారు. ఇక‌, వీట‌న్నిటికంటే ముందు విజ‌య‌వాడ‌లో టీడీపీ నేత ప‌ట్టాభి ఇంటిపై దాడితో ఈ గొలుసుక‌ట్టు దాడుల‌కు నాంది ప‌డింది. ఇలా ప‌ట్టాభి జ‌గ‌న్‌ను ఉద్దేశించి బోసిడీకే అన‌గానే.. అలా వైసీపీ వాళ్లంతా స‌డెన్‌గా రెచ్చిపోవ‌డం మాత్రం కాక‌తాళీయంగానో, యాధృచ్చికంగానో జ‌రిగింది కానే కాదంటున్నారు. ఇదంతా ప‌క్కా వ్యూహం ప్ర‌కార‌మే జ‌రిగింద‌ని గ‌ట్టిగా న‌మ్ముతున్నారు. మ‌రి, ఆ ప‌క్కా వ్యూహం ర‌చించిందెవ‌ర‌నేదే ఇక్క‌డ ఇంట్రెస్టింగ్ పాయింట్‌.  సీఎం జ‌గ‌న్ పాల‌నా వ్య‌వ‌హారాల‌తో నిత్యం బిజీగా ఉంటారు. సో, అమ‌లు ఆయ‌న ఆదేశాల‌తోనే జ‌రిగింద‌ని అంటున్నా.. వ్యూహం మాత్రం జ‌గ‌న్‌ది కావ‌చ్చు, కాక‌పోవచ్చు. ఇక‌, సీఎంను అంటిపెట్టుకునే ఉండే స‌జ్జ‌ల ప్లాన్‌ చేశారా? అంటే ఆయ‌న‌కు అంత సీన్ లేదంటున్నారు. మ‌రి, ఈ క్రిమిన‌ల్ మైండ్ విజ‌య‌సాయిరెడ్డిదా అంటే.. ఆయ‌న‌కు జ‌గ‌న్‌తో గ్యాప్ పెర‌గ‌డం వ‌ల్ల విజ‌య‌సాయి కూడా కాదంటున్నారు. ఇక మ‌రింత లోతుగా విశ్లేషిస్తే.. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కార్యాల‌యాల‌పై ఏక‌కాలంలో మూక దాడుల వ్యూహ‌క‌ర్త‌, సూత్ర‌ధారి.. ప్ర‌శాంత్ కిశోర్ కావొచ్చ‌ని భావిస్తున్నారు. ఆ మేర‌కు ఉన్న‌త స్థాయి రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది.  ఇటీవ‌లే ప్ర‌శాంత్ కిశోర్‌తో జ‌గ‌న్ పార్టీ డీల్ కుదుర్చుకున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే పీకే టీమ్ విశాఖ‌లో రంగంలోకి దిగింద‌ని టాక్‌. పీకే బృందం వ‌చ్చిరాగానే ప‌ని మొద‌లుపెట్టేసింద‌ని అంటున్నారు. డ్ర‌గ్స్‌, గంజాయి ఎపిసోడ్ ఏపీలో హాట్ హాట్‌గా సాగుతుండ‌టంతో పాటు.. అప్పులు, జీతాలు ఆల‌స్యం, ప‌థ‌కాల కోత‌, ప‌న్నుల‌ బాదుడు.. ఇలా జ‌గ‌న్ ఇమేజ్ ప్ర‌జ‌ల్లో బాగా డ్యామేజ్ జ‌రిగింద‌ని గుర్తించ‌డంతో.. ప‌బ్లిక్‌ను ఈ విష‌యాల నుంచి డైవ‌ర్ట్ చేసేందుకు అద‌ను కోసం ఎదురుచూస్తున్న పీకే టీమ్‌.. ప‌ట్టాభి ప్రెస్‌మీట్‌ను త‌మ‌కు అనుకూలంగా, అవ‌కాశంగా మార్చుకున్నార‌ని చెబుతున్నారు. అందుకే, ప‌ట్టాభి మీడియాతో మాట్లాడారో లేదో.. వెంట‌నే దాడుల వ్యూహాన్ని జ‌గ‌న్‌కు చెప్ప‌డం.. ఆయ‌న ఓకే అన‌డం.. ఆ వెంట‌నే దేవినేని అవినాశ్‌ మ‌నుషుల‌తో అటాక్స్ చేయించ‌డం.. అంతా గంట‌ల వ్య‌వ‌ధిలో చ‌క‌చ‌కా జ‌రిపించేశార‌ని అంటున్నారు. పీకే టీమ్ వేసిన స్కెచ్ కాబ‌ట్టే.. ఇంత ప‌క్కాగా వ‌ర్క‌వుట్ చేశార‌ని చెబుతున్నారు.  ఇక, ప్ర‌శాంత్ కిశోర్ ఇలాంటి దాడుల‌ను ఎంక‌రేజ్ చేస్తారా అనే డౌట్ అస్స‌లు రాన‌వ‌స‌రం లేదంటున్నారు విశ్లేష‌కులు. ఎందుకంటే.. బెంగాల్‌లో మ‌మ‌త‌కు పొలిటిక‌ల్ అడ్వైజ‌ర్‌గా ఉన్న పీకే వ్యూహాల‌న్నీ దాడులు, విధ్వంసం చుట్టూనే తిరిగాయి. హింస ఆయ‌న అమ్ముల‌పొదిలోని ప‌దునైన వ్యూహం అంటారు. అంతేకాదు, ఇటీవ‌ల యూపీలో లఖింపూర్ ఖేరీ రైతుల మార‌ణ‌కాండ‌ స్కెచ్ కూడా ఆయనదే అనే మాట కూడా అక్కడక్కడా వినవస్తోంది. అదే నిజం అయితే.. ఇప్పుడు ఏపీలో టీడీపీ ఆఫీసుల‌పై జ‌రిగిన దాడులు వ్యూహం కూడా ప్ర‌శాంత్ కిశోర్ బృందానిదే అన‌డానికి సందేహించాల్సిన ప‌నిలేదంటున్నారు. ఏది ఏమైనా.. పీకే గొప్ప వ్యూహకర్త మాత్రమే కాదు.. కొంచెం చాలా ప్రమాదకర వ్యూహకర్త గానూ అనుమానించ వలసి వస్తోంది.  

సొంత‌పార్టీ.. బీజేపీతో పొత్తు.. రైతు పోరాటంలో 'కెప్టెన్' ఇన్నింగ్స్‌..

పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరేందర్ సింగ్ కొత్త పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు. ఇది అనూహ్య పరిణామం కాదు. అయితే, పోయిపోయి బీజేపీతో పొత్తుకు సిద్ధం కావడం విషయంలో రాజకీయ విశ్లేషకులు కొద్దిపాటి విస్మయం ప్రకటిస్తున్నారు. అయితే, అలాగని బీజేపీ అంటరాని పార్టీ అని కాదు. ఆ రోజులు పోయాయి, ఇప్పుడు బీజేపీని ఏ పార్టీ కూడా అంటరాని పార్టీగా చూడడంలేదు. బీజేపీ కూడా వెనకటిలా మడికట్టుకుని కూర్చోవడం లేదు. ‘నువ్వొస్తానంటే ... నేనొద్దంటా’ అంటూ క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్నవారికి కూడా రెడ్ కార్పెట్ పరచి మరీ స్వాగతం పలుకుతోంది. ఇప్పటికే చాలామంది కాంగ్రెస్ పార్టీ మాజీ పెద్దలు బీజేపీలో చేరి, కాషాయం నీడ పట్టున విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపధ్యంలో అమరీందర్ సింగ్ నేరుగా బీజేపీలో చేరినా ఆశ్చర్య పోనవసరం లేదు. కానీ, బహుశా రాజకీయంగా లెక్కలేసుకుని కావచ్చు ఆయన సెపరేట్ రూట్’ను ఎంచుకున్నారు.   అయితే అందరి విషయం వేరు, కెప్టెన్ పరిస్థితి వేరు ..నిజానికి, కెప్టెన్ అనే కాదు, పంజాబ్ రాజకీయ నాయకుల అందరి పరిస్థితి అదే. చివరకు ఆర్ఎస్ఎస్’లో పుట్టి బీజేపీలో పెరిగిన కాషాయ నాయకులు కూడా పార్టీలో ఉండలేక, బయటకు వెళ్ళలేక కిందామీద అవుతున్నారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా సంవత్సరానికి పైగా సాగుతున్న రైతుల ఆందోళన ఇతర రాష్ట్రాల కంటే పంజాబ్ రాష్ట్ర రాజకీయాలపైనే ఎక్కువ ప్రభావం చూపింది. ఈ మూడు చట్టాల కారణంగానే, శిరోమణి అకాలీ దళ్ కేంద్ర మంత్రి పదవులను వదులుకుని ఎన్డీఎ నుంచి బయటకు వచ్చింది. బీజేపీతో తెగతెంపులు చేసుకుంది. పంజాబ్’ సాగు చట్టాలు, ఆ చట్టాలు తెచ్చిన బీజేపీ పట్ల పంజాబ్ ప్రజల్లో వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో వేరే చెప్పనక్కరలేదు. భయంకర వ్యతిరేకత ఉంది కాబట్టే, ఆకలీ దళ్.. పదవిని వదులుకుని మరీ బీజేపీతో తెగతెంపులు చేసుకుంది. ఇలాంటి పరిస్థితిలో 40 ఏళ్లకుపైబడిన రాజకీయ అనుభవం, ఇంచుమించుగా పదేళ్ళు రాష్ట్రాన్ని పాలించిన అనుభం, అన్నిటినీ  మించి పంజాబ్ ప్రజల నాడి పక్కాగా తెలిసిన కెప్టెన్ అమరీందర్ సింగ్, పోయి పోయి బీజేపీతో పొత్తు పెట్టుకోవడం ఏమిటీ? అనే ప్రశ్నకే సమాధానం రాజకీయ విశ్లేషకులకు సైతం చిక్కడం లేదు.  అయితే, అమరీందర్ సింగ్ పంజాబ్ కాంగ్రెస్’లో తమ ప్రత్యర్ధి, నవజ్యోతిసింగ్ సిద్దుల్లా చిల్లర రాజకీయాలు చేసే వ్యక్తి అయితే కాదు. మెచ్యూరిటీ ఉన్న రాజకీయ నాయకుడు. అదీగాక  పంజాబ్ ముఖ్యమంత్రిగా, ఆ తర్వాత మాజీ ముఖ్యమంత్రిగా కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాను కలిసి రాజకీయాలతో పాటుగా సాగు చట్టాల గురంచి, సాగు చట్టాల రాజకీయం గురించి కూడా సుదీర్ఘంగా చర్చించారు. తాజాగా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన అనంతరం అమరీందర్ సింగ్ మీడియా అడ్వైజర్ రవీన్ థక్రల్ కెప్టెన్ సొంత పార్టీ, బీజేపీతో పొత్తుకు సంబంధించి  ట్విట్టర్ వేదికగా ప్రకటన చేయడం గమనార్హం. అంతే కాదు అదే సమయంలో అమరీందర్ సింగ్ ప్రతినిధి, ‘పంజాబ్ ప్రజల ప్రయోజనం కోసం, ఏడాదిగా పోరాటం చేస్తున్న రైతులకు తమ పార్టీ అండగా ఉంటుదని’ అన్నారు. అంటే, అదేమిటనేది స్పష్టంగా తెలియక పోయినా, కెప్టెన్ జోక్యంతో సంవత్సర కాలానికి పైగా కొనసాగుతున్నరైతుల ఆందోళనకు త్వరలో ఏదో ఒక పరిష్కారం లభించే అవకాశం లేక పోలేదని అనిపిస్తోందని అంటున్నారు.  నిజానికి, రైతుల ఆందోళన  కేవలం పంజాబ్’లో మాత్రామే కాదు, పంజాబ్’తో పాటుగా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నయూపీ, ఉత్తరాఖండ్ ఇతర రాష్ట్రాల రాజకీయాలను ప్రభావితం చేస్తోంది. ఈనేపధ్యంలో బీజేపీ, అమరీందర్ సింగ్ మధ్యవర్తిత్వంతో రైతుల ఆందోళనకు పరిష్కారం కనుగొనే అవకాశం ఉందని, పరిశీలకులు అంటున్నారు, అదే జరిగితే పార్టీలు కూడా కెప్టెన్’ టీమ్ ‘లో చేరితే, అమరీదర్ కూటమి ఎన్నికల్లో గెలిచినా గెలవక పోయినా  కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడం మాత్రం కష్టమే అంటున్నారు. ఈ పరిణామం పరోక్షంగా  ఆమ్ ఆద్మీ పార్టీ( ఆప్)కి మేలు చేస్తాయని, చివరకు పిట్ట పిట్ట పోరు పిల్లి తీర్చింది అన్న విధంగా  కాంగ్రెస్ పార్టీలో కెప్టెన్ , సిద్దూల మధ్య రగిలిన చిచ్చు చివరకు, ‘ఆప్’ కేజ్రివాల్’కు  సర్పైజ్ గిఫ్ట్ అవుతుందని  రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఏమో రాజకీయాల్లో ఏదైనా జరగ వచ్చును.  

గెలిచాక‌ ఈటల బీజేపీలో ఉండరంటూ ప్ర‌చారం.. ఓటమిని టీఆర్ఎస్‌ ఒప్పుకున్న‌ట్టేనా?

ఇటు నుంచి కాకపోతే అటునుంచి నరుక్కు రమ్మని సామెత. హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో మంత్రి హరీష్ రావు మాటల తీరు గమనిస్తే అలానే ఉంది. బీజేపీ అభ్యర్ధి, మాజీ మంత్రి ఈటల రాజేందర్’ ను ఏదో ఒక విధంగా ఓడించాలని ఎన్ని తంటాలు పడినా, ఫలితం కనిపిస్తున్నట్లు లేదు. అందుకే, ఇక అటు నుంచి నరుక్కురావడం మొదలు పెట్టారు. బీజేపీ, ఈటలకు మధ్య పుల్లలు పెట్టే పనికి పూనుకున్నారు. ఈట‌ల‌ తమ పార్టీలో ఉండేటట్లు లేరని బీజేపీ వాళ్లే చెప్పుకుంటున్నారంటూ హ‌రీశ్‌రావు ప‌దే ప‌దే ప్ర‌చారం చేస్తున్నారు. ఈ ప్రచారం వెనక పెద్ద కుట్రే ఉందని బీజేపీ నాయకులు అంటున్నారు. ఈటల ఎన్నికల్లో గెలిచిన తర్వాత బీజేపీలో ఉండరు కాంగ్రెస్’లో చేరిపోతారు అని ప్రచారం సాగిస్తే, బీజేపీ అభిమానులు, సానుభూతి పరులు ఈటలకు ఓటు వేయరని ఆ విధంగా ఈటల గెలుపును అడ్డుకోవాలని హరీష్ రావు ఒక వ్యూహం ప్రకారమే తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీజేపీ నాయకులు అంటున్నారు. అలాగే బీజేపీ అభిమానులు, ముఖ్యంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఈటల విజయం కోసం పనిచేస్తున్న ఆర్ఎస్ఎస్ కార్యకర్తల్లో అనుమానాలు రేకెత్తించేందుకే హరీష్ ఈటల ‘భారత్‌ మాతాకీ జై అని నినాదం కూడా చేయడం లేదంటూ ప్రచారం చేస్తున్నరని బీజేపీ సంఘ్ పరివార్ వర్గాలు మండిప‌డుతున్నాయి.   అయితే, మంత్రి హరీష్ మాత్రం చెప్పిన అబద్ధాన్నే మళ్ళీ మళ్ళీ చెపుతున్నారు. ఎక్కడి కెళ్ళినా, “ రాజేందర్ గారు కూడా బీజేపీలో ఉండేటట్లు అనిపించడం లేదు. ఆయన ఎక్కడ భారత్ మాతా కీ జై అంటలేడు, జైశ్రీరాం అంటలేడు, జై మోదీ కూడా అంటలేడు. ఆయన కథనే చెప్పుకుంటున్నడు. ఆయన అవసరం కోసం బీజేపీలో చేరిండు తప్ప, మనస్సుతో చేరలేదని జనమే చెప్తున్నరు. బీజేపీ కార్యకర్తలే చెప్తున్నరు. దీనిని బట్టి ఏందంటే మనం అనవసరంగా నష్టపోకూడదు. ఆయన అంటించుకున్న బురద మనందరికీ అంటించే ప్రయత్నం చేస్తుండు. ఆయన బాధను మనందరి బాధగా తీర్చే ప్రయత్నం చేస్తుండు.” అంటూ అదే పనిగా అసత్య ప్రచారం సాగిస్తున్నారని బీజేపీ, సామాన్య ప్రజలు కూడా గుర్తించారు. ఈటల తెరాసలో ఉన్నప్పుడు కూడా తెరాసను, కేసీఆర్ ను చూసి ఓటు వేయలేదని, అప్పుడు కూడా ఈటలకే  ఓటు వేశామని ..ఇప్పుడు కూడా ఈటలకే ఒటేస్తామని చెపుతున్నారని అంటున్నారు,  

సైకో రెడ్డిపైనా కేసు పెట్టాలి.. లోకేశ్‌నూ అరెస్ట్ చేస్తారా? ఇంటికో ఓటు ఎవ‌రికంటే.. టాప్ న్యూస్@7pm

1. సైకో రెడ్డిని సైతం టీడీపీ కార్యాల‌యంపై దాడి కేసులో నిందితుడిగా చేర్చాలని డిమాండ్ చేశారు నారా లోకేశ్‌. ‘‘జ‌గ‌న్‌రెడ్డి మీకే కాదు, మాకూ ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్లకి బీపీ వ‌స్తే నువ్వు ఏపీలో ఉండ‌వు’’ అని లోకేష్‌ హెచ్చరించారు. తాను జైలుకెళ్లడానికైనా సిద్ధమని ప్రకటించారు. పార్టీ కార్యాలయంలోకి జొరబడ్డ సీఐకి కాఫీ, టీ ఇచ్చి పంపితే హత్యాయత్నం కేసు పెట్టారని తెలిపారు. పట్టాభి ఏదో అన్నాడని ఫీలవుతోన్న సీఎం జగన్.. తన వద్దనున్న మంత్రి ఏపీలోని తల్లులందర్నీ తప్పుడు మాటలు అనలేదా? అని ప్రశ్నించారు. వైసీపీ ఇంకా ఇదే విధంగా రెచ్చగొట్టినా.. దాడులు చేసినా చూస్తూ ఊరుకోం.. తలలు పగులుతాయని లోకేష్ హెచ్చరించారు.  2. సీఎం జ‌గ‌న్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్య‌ల కేసులో టీడీపీ అధికార ప్ర‌తినిధి ప‌ట్టాభిరామ్‌కు న‌వంబ‌ర్ 4 వ‌ర‌కు.. 14 రోజుల రిమాండ్ విధించింది విజ‌య‌వాడ కోర్టు. వైద్య పరీక్షల అనంతరం ప‌ట్టాభిని కోర్టులో ప్రవేశ పెట్టారు పోలీసులు. సీఎంను గాని, ప్రభుత్వం పెద్దలనుగానీ తాను తూలనాడలేదని.. ప్రభుత్వ లోపాలను మాత్ర‌మే ఎత్తి చూపానని ప‌ట్టాభి చెప్పారు. పట్టాభికి స్టేషన్‌ బెయిల్‌ ఇవ్వాలని ఆయన తరఫు న్యాయవాది కోరారు. పట్టాభిపై గతంలోనే అనేక కేసులు ఉన్నాయని ప్ర‌భుత్వ న్యాయ‌వాది అభ్యంత‌రం తెలిపారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి పట్టాభికి 14 రోజుల రిమాండ్‌ విధించడంతో ఆయ‌న్ను మ‌చిలీప‌ట్నం జైలుకు త‌ర‌లించారు.  3. టీడీపీ యువ నాయకుడు నాదెండ్ల బ్రహ్మంను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజ‌రుప‌రిచారు. బ్ర‌హ్మంకు మంగళగిరి కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. టీడీపీ కార్యాలయంపై దాడి జరిగిన రోజు అక్కడికి వెళ్లిన తనను నిర్బంధించారని ఆర్‌.ఐ సక్రూనాయక్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగళగిరి గ్రామీణ పోలీసు స్టేషన్‌లో నాదెండ్ల బ్ర‌హ్మంపై కేసు నమోదైంది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయగా.. ఆ కేసులో బ్రహ్మం చౌదరి ఏ6గా ఉన్నారు.  4. హుజూరాబాద్‌ ఉపఎన్నికలో ‘ఇంటికో ఓటు కాంగ్రెస్‌కు’ అనే నినాదాన్ని ఇంటింటికీ తీసుకెళ్లాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. నిరుద్యోగ యువత, విద్యార్థులు, కొత్త ఓటర్లను ఆకట్టుకునేలా ప్రచారం ఉండాలని సూచించారు. ఇంటింటికీ తిరిగి కాంగ్రెస్‌కు ఓటు ఎందుకు వేయాలో ప్రజలకు వివరించాలన్నారు. వ‌చ్చే వారం రోజుల పాటు అమ‌లు చేయాల్సిన ప్రచార వ్యూహాలపై పార్టీ హుజురాబాద్‌ ఇంఛార్జిల‌తో చర్చించారు రేవంత్‌రెడ్డి. టీఆర్ఎస్‌, బీజేపీల‌ లోపాయికారి ఒప్పందాలు, చీకటి రాజకీయాలను బయట పెట్టాలని నేతలకు దిశానిర్దేశం చేశారు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.  5. టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తున్న 36 గంట‌ల నిర‌స‌న‌ దీక్షకు రైతులు మద్దతు తెలిపారు. సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు ఆళ్ల గోపాలకృష్ణరావు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. టీడీపీ కార్యాలయం, నేతలపై దాడిని ఖండించిన రైతు సంఘాలు ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతు సంఘం నేతలు నిరసన వ్యక్తం చేశారు.  6. టీడీపీ కార్యాలయంలో అనుమానాస్పద వ్యక్తిని పట్టుకున్నామని.. ఆరా తీస్తే అతడిని డీజీపీ కార్యాలయంలో పీఆర్వోగా గుర్తించామని ప‌య్యావుల తెలిపారు. టీడీపీ ఆఫీసులోని సీసీ కెమెరాల్లో అన్నీ రికార్డయ్యాయని చెప్పారు. ఈ దాడికి సూత్రధారులు, పాత్రదారులు ఎవ‌రో తెలియాలంటే సీబీఐ విచారణ జరిపించాలని అన్నారు. డీజీపీ పాత్రపైనా విచారణ జరిపించాలని పయ్యావుల డిమాండ్‌ చేశారు. దాడి ఘటనలపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని.. అన్ని విషయాలూ తేలుస్తామని హెచ్చ‌రించారు. 7. ఏపీలో రాక్షస పాలన రాజ్యమేలుతోందని టీడీపీ నేత అశోక్ గజపతిరాజు ఫైర్ అయ్యారు. కరుడుగట్టిన నియంత హిట్లర్ కూడా మట్టిలో కలసిపోయారని ముఖ్యమంత్రి తెలుసుకోలేక పోతున్నారని అన్నారు. బి.పి పెరిగితే ఆసుపత్రికి వెళతారు.. అంతేగాని టీడీపీ కార్యాలయాలపైకి, నేతల ఇళ్లపైకి వెళ్లి దాడులు చేయ‌రు.. అలా చేసే వారిని ముఖ్యమంత్రి ప్రోత్సహించటం హేయమని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తన రాజకీయ అనుభవంలో ఇంత ఘోరం తానెన్నడూ చూడలేదన్నారు అశోక్ గ‌జ‌ప‌తిరాజు. బాధితులపైనే అక్రమ కేసులు పెట్టడం ఏ రాజ్యాంగంలోనూ ఉండదని మండిప‌డ్డారు. 8. సీఎం జ‌గ‌న్‌పై ఎంపీ ర‌ఘురామ విరుచుకుప‌డ్డారు. ‘‘బీపీలు పెరిగితే దాడులు చేస్తారని సీఎం మాట్లాడడమేంటి? రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి జగన్‌ ఇలా మాట్లాడతారా? వైసీపీ నేతలు బూతులు మాట్లాడటం లేదా? గతంలో వైసీపీ నేతలు మాట్లాడిన మాటలు జగన్‌కు గుర్తులేవా? మిమ్మల్ని అనని మాటలకే మీ అత్యుత్సాహకులకు బీపీలు పెరిగిపోతే.. మీపై కోడికత్తి దాడి జరిగినప్పుడు మీ అత్యుత్సాహకులు ఏమయ్యారు?’’ అంటూ ప్ర‌శ్నించారు. కొందరు అధికారులు అత్యుత్సాహంతో వ్యవహరిస్తున్నారంటూ ప‌రోక్షంగా డీజీపీపై మండిప‌డ్డారు.  9. సీఎం కేసీఆర్ ఒక పిరికోడని.. అందుకే హుజురాబాద్ రావడం లేదని బీజేపీ నాయకురాలు విజయశాంతి విమ‌ర్శించారు. జనం మధ్యకు రాని సీఎం మనకు అవసరమా? అని ప్రశ్నించారు. కేసీఆర్ రావణ రాజ్యం పోవాలన్నారు. దేశంలోనే కేసీఆర్ చెత్త సీఎం అని సర్వేలో తేలిందని గుర్తు చేశారు. కేసీఆర్‌ను గద్దె దించాలని.. టీఆర్ఎస్‌ను సమాధి చెయ్యాలన్నారు. ఇక బానిస బతుకులు మనకు వద్దంటూ హుజురాబాద్ ప్ర‌జ‌ల‌కు పిలుపిచ్చారు విజయశాంతి.  10. వందేళ్ల‌లో అతి పెద్ద మహమ్మారిపై పోరాటంలో మన దేశానికి 100 కోట్ల వ్యాక్సిన్ డోసులతో బలమైన రక్షణ కవచం లభించిందని ప్రధాని మోదీ అన్నారు. 2021 జనవరి 16న దేశంలో వ్యాక్సినేషన్ కార్య‌క్ర‌మం ప్రారంభించ‌గా.. అక్టోబ‌ర్ 21 గురువారం ఉదయం 10 గంటల వరకు 100 కోట్ల వ్యాక్సిన్ డోసులను ప్రజలకు ఇచ్చినట్టు కేంద్ర‌ ప్రభుత్వం ప్రకటించింది. ఇది అమెరికాలో ఇచ్చిన వ్యాక్సిన్ డోసుల కన్నా రెట్టింపు. ఈ సంద‌ర్భంగా దేశంలోని వ్యాక్సిన్ తయారీ కంపెనీలు, వ్యాక్సిన్ రవాణాలో భాగ‌స్వామ్యులైన వారు, వైద్య రంగంలో నిపుణులు, టీకాలు ఇచ్చిన సిబ్బంది, తదితరులందరికీ మోదీ ధన్యవాదాలు తెలిపారు.

పట్టాభికి 14 రోజుల రిమాండ్‌.. జైలుకు త‌ర‌లింపు.. కోర్టులో హోరాహోరీ వాద‌న‌లు..

సీఎం జ‌గ‌న్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్య‌ల కేసులో టీడీపీ అధికార ప్ర‌తినిధి ప‌ట్టాభిరామ్ అరెస్ట్‌తో బుధ‌వారం రాత్రి తీవ్ర ఉద్రిక్త‌త నెల‌కొంది.  పోలీసులు ప‌ట్టాభి ఇంటి త‌లుపులు బ‌ద్ద‌ల‌గొట్టి.. ఇంట్లోకి జొర‌బ‌డి.. బ‌ల‌వంతంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఆయ‌న్ను తోట్లవల్లూరు పోలీస్ స్టేష‌న్‌కు త‌ర‌లించారు. తోట్ల‌వ‌ల్లూరులోకి బ‌య‌టివారెవ‌రూ రాకుండా పోలీసులు క‌ట్ట‌డి చేశారు. క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త న‌డుమ‌.. ప‌ట్టాభిని గురువారం మ‌ధ్యాహ్నానికి విజ‌య‌వాడ తీసుకొచ్చారు. సాయంత్రం మూడో అదనపు మెట్రో పాలిటన్ కోర్టులో ప్రవేశ పట్టడంతో ఆయనకు నవంబర్ 4 వరకు రిమాండ్ విధించింది కోర్టు.     అరెస్టుకు ముందు ప‌ట్టాభి రిలీజ్ చేసిన వీడియో సంచ‌ల‌నంగా మారింది. పోలీస్ క‌స్ట‌డీలో త‌న‌ను కొట్టే అవ‌కాశ‌ముంద‌నే అనుమానం వ్య‌క్తం చేశారు. ప‌ట్టాభి వీడియో రిలీజ్ చేసినందుకో ఏమో కానీ, పోలీసులు త‌న‌ను కొట్టలేదని టీడీపీ నేత పట్టాభి తెలిపారు. వైద్య పరీక్షల అనంతరం ఆయనను కోర్టులో ప్రవేశ పెట్టారు. పట్టాభి మాట్లాడుతూ.. సీఎంను గాని, ప్రభుత్వం పెద్దలనుగానీ తాను తూలనాడలేదన్నారు. ప్రభుత్వ లోపాలను మాత్ర‌మే ఎత్తి చూపానని చెప్పారు. గతంలో తనపై దాడి జరిగితే దోషులను పట్టుకోలేదని తెలిపారు.  పట్టాభికి స్టేషన్‌ బెయిల్‌ ఇవ్వాలని ఆయన తరఫు న్యాయవాది కోరారు. ప్రభుత్వ న్యాయవాది జోక్యం చేసుకొని.. పట్టాభిపై గతంలోనే అనేక కేసులు ఉన్నాయని కోర్టు దృష్టికి తెచ్చారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి పట్టాభికి 14 రోజుల రిమాండ్‌ విధించారు. పట్టాభిని పోలీసులు మచిలీపట్నం జైలుకు తరలించారు. 

లోకేశ్‌ను అరెస్ట్ చేస్తారా?.. టీడీపీ నేత‌ బ్ర‌హ్మం అరెస్ట్‌, రిమాండ్‌తో హైటెన్ష‌న్‌..

ఏపీలో రాజ‌కీయాలు మ‌రింత వేడెక్కుతున్నాయి. స్టేట్ స్పాన్స‌ర్డ్ టెర్ర‌రిజం బీభ‌త్సం సృష్టిస్తోందని స‌ర్వ‌త్రా ఆగ్ర‌హం వెల్లువెత్తుతోంది. టీడీపీ నేత‌లంతా డీజీపీని, పోలీసుల తీరును తీవ్రంగా త‌ప్పుబ‌డుతున్నారు. టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఏకంగా 36 గంట‌ల దీక్ష చేస్తున్నారు. టీడీపీ కార్యాల‌యంపై వైసీపీ రౌడీల దాడి ఘ‌ట‌న‌పై ఇంత ఆగ్ర‌హం, నిర‌స‌న వ్య‌క్త‌మ‌వుతున్నా.. ఖాకీల వైఖ‌రి ఏమాత్రం మార‌డం లేదు. మంగ‌ళ‌గిరి ఆఫీసు దాడి ఘ‌ట‌న‌లో ఇప్ప‌టి వ‌ర‌కూ ఒక్క వైసీపీ కార్య‌క‌ర్త‌ను కూడా అరెస్ట్ చేయ‌ని పోలీసులు.. అదే ఘ‌ట‌న‌లో టీడీపీ వారిపై మోపిన కేసుల్లో మాత్రం దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఎన్ని విమ‌ర్శ‌లు వ‌స్తున్నా.. టీడీపీని వేధించే చ‌ర్య‌లు మాత్రం అంతే దూకుడుగా కొన‌సాగిస్తున్నారని అంటున్నారు. టీడీపీ యువ నాయకుడు నాదెండ్ల బ్రహ్మంను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజ‌రుప‌రిచారు. బ్ర‌హ్మంకు మంగళగిరి కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. టీడీపీ కార్యాలయంపై దాడి జరిగిన రోజు అక్కడికి వెళ్లిన తనను నిర్బంధించారని ఆర్‌.ఐ సక్రూనాయక్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగళగిరి గ్రామీణ పోలీసు స్టేషన్‌లో నాదెండ్ల బ్ర‌హ్మంపై కేసు నమోదైంది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయగా.. ఆ కేసులో బ్రహ్మం చౌదరి ఏ6గా ఉన్నారు.  బుధవారం రాష్ట్ర బంద్‌ సందర్భంగా ఉండవల్లిలో ఆందోళన చేస్తున్న నాదెండ్ల బ్రహ్మంను పోలీసులు అరెస్టు చేశారు. బుధవారమంతా జిల్లాలోని వివిధ పోలీస్‌ స్టేషన్లకు తిప్పారు. గురువారం ఉదయం మంగళగిరి గ్రామీణ పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. మధ్యాహ్నం మంగళగిరి కోర్టులో హాజరు పర్చారు. కోర్టు రెండు వారాల రిమాండ్ విధించ‌డంతో బ్ర‌హ్మంను గుంటూరు స‌బ్ జైలుకు త‌ర‌లించారు. అరెస్టు అనంతరం పోలీసులు తనను తీవ్రంగా దూషించారని, మేడికొండూరు సీఐ మారుతీ కృష్ణ త‌న‌ను కొట్టారని బ్రహ్మం న్యాయమూర్తికి ఫిర్యాదు చేయ‌డం క‌ల‌క‌లంగా మారింది.  ఇక ఆర్‌.ఐ స‌క్రూనాయ‌క్‌ను టీడీపీ ఆఫీసులో నిర్బంధించార‌నే కేసులో టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్‌ను ఏ1గా చేర్చారు పోలీసులు. ఏ6గా ఉన్న నాదెండ్ల బ్ర‌హ్మంనే అరెస్ట్ చేసి, జైలుకు త‌ర‌లించి.. ప‌రోక్షంగా లోకేశ్‌ను బెదిరింపుల‌కు గురి చేసేలా పోలీసుల చ‌ర్య‌లు ఉన్నాయ‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. దాడి చేసిన వారిని ఇంత వ‌ర‌కూ అరెస్ట్ చేయ‌కుండా.. బాధితుల‌పైనే కేసులు పెట్టి జైలుకు పంపించ‌డం జ‌గ‌న్ పాల‌న‌తో పోలీసు వ్య‌వ‌స్థ ఎంత‌లా ప‌త‌న‌మైంద‌నే విష‌యం చెప్ప‌డానికి ఇది మ‌రో నిద‌ర్శ‌నం అంటూ మండిప‌డుతున్నారు. మ‌రి, ఏ6 నాదెండ్ల బ్ర‌హ్మంను అరెస్ట్ చేసిన‌ట్టే.. ఏ1గా కేసు న‌మోదు చేసిన నారా లోకేశ్‌నూ అరెస్ట్ చేసే సాహ‌సం పోలీసులు చేస్తారా? అలా జ‌రిగితే టీడీపీ త‌ఢాకా ఏంటో చూపిస్తామంటున్నారు తెలుగు త‌మ్ముళ్లు. 

హిట్ల‌ర్ కూడా మ‌ట్టిలో క‌లిసిపోయారు.. బీపీ పెరిగితే ఆస్ప‌త్రికి వెళ‌తారు..

రెండున్న‌ర ఏళ్ల అరాచ‌క పాల‌న తారాస్థాయికి చేరింది. ప్ర‌తిప‌క్ష పార్టీని భ‌య‌భ్రాంతుల‌కు గురి చేసేందుకు ఉన్మాద చ‌ర్య‌లకు దిగుతున్నారు. కేసులతో బెద‌ర‌డం లేద‌ని.. ఏకంగా దాడుల‌కే తెగ‌బ‌డ్డారు. ఇటీవ‌ల చంద్ర‌బాబు నివాసంపై దాడి ప్ర‌య‌త్నం.. ఆ త‌ర్వాత కాకినాడ‌లో టీడీపీ-ప‌ట్టాభిల‌పై దాడి య‌త్నం.. తాజాగా ఏపీ వ్యాప్తంగా టీడీపీ కార్యాల‌యాల‌పై విధ్వంస‌కాండ‌. ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల నుంచి ప్ర‌జ‌ల దృష్టిని మ‌ర‌ల్చ‌డం.. గంజాయి దందా, జీతాలు ఆల‌స్యం, ప‌థ‌కాల కోత‌, పన్ను బాదుడు, అప్పుల కుప్ప నుంచి డైవ‌ర్ట్ చేయ‌డానికి.. దాంతో పాటు టీడీపీనీ భ‌య‌పెట్టాల‌నే వ్యూహంతో ఇలా మూక‌దాడుల‌తో రెచ్చిపోయార‌ని అంతా త‌ప్పుబ‌డుతున్నారు. ఇంత జ‌రిగినా సీఎం జ‌గ‌న్ మాత్రం వైసీపీ దాడుల‌ను స‌మ‌ర్థించుకోవ‌డం హీనాతి హీనం అంటున్నారు. త‌న‌ను తిడితే, త‌న అభిమానుల‌కు బీపీ వ‌చ్చి ఇలా దాడి చేశారంటూ జ‌గ‌న్ చేసిన దారుణ‌మైన వ్యాఖ్య‌ల‌పై స‌ర్వ‌త్రా ఆగ్ర‌హం వ్య‌క్తం అవుతోంది. తాజాగా, జ‌గ‌న్ స్టేట్‌మెంట్‌పై టీడీపీ సీనియ‌ర్ నేత అశోక్ గ‌జ‌ప‌తిరాజు తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు.  రాష్ట్రంలో రాక్షస పాలన రాజ్యమేలుతోందని టీడీపీ నేత అశోక్ గజపతిరాజు ఫైర్ అయ్యారు. కరుడుగట్టిన నియంత హిట్లర్ కూడా మట్టిలో కలసిపోయారని ముఖ్యమంత్రి తెలుసుకోలేక పోతున్నారని అన్నారు. బి.పి పెరిగితే ఆసుపత్రికి వెళతారు.. అంతేగాని టీడీపీ కార్యాలయాలపైకి, నేతల ఇళ్లపైకి వెళ్లి దాడులు చేయ‌రు.. అలా చేసే వారిని ముఖ్యమంత్రి ప్రోత్సహించటం హేయమని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తన రాజకీయ అనుభవంలో ఇంత ఘోరం తానెన్నడూ చూడలేదన్నారు అశోక్ గ‌జ‌ప‌తిరాజు. బాధితులపైనే అక్రమ కేసులు పెట్టడం ఏ రాజ్యాంగంలోనూ ఉండదని చెప్పారు.  నాగరిక ప్రపంచంలో ఉంటూ మంత్రులు ఏ విధమైన భాష వినియోగిస్తున్నారో అందరికీ తెలుసన్నారు. ప్రతి పక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్‌రెడ్డి మాట తీరు ఎలా ఉండేదో కూడా ప్రజలందరికీ తెలుసని గుర్తు చేశారు. అధికార పార్టీ జవాబుదారిగా ఉంటే ప‌ద్ద‌తిగా ఉంటుంద‌ని అశోక్ గజపతిరాజు హితవు పలికారు. మ‌రి, అధికారంతో క‌ళ్లు, చెవులు మూసుకుపోయి ఉన్న వైసీపీ ప్ర‌భుత్వానికి ఇలాంటి మంచి మాట‌లు త‌లకెక్కుతాయా? అంటున్నారు.

ఇంటికో ఓటు.. రేవంత్‌రెడ్డి పిలుపు.. కాంగ్రెస్ దూకుడు..

అంతా అంటున్నారు హుజురాబాద్ రేసులో కాంగ్రెస్ లేద‌ని. పోటీ టీఆర్ఎస్‌, బీజేపీ మ‌ధ్య‌నే కొన‌సాగుతోంద‌ని. కానీ, తామూ బ‌రిలోనే ఉన్నామంటూ.. చెయ్యెత్తి పిడికిలి బిగిస్తున్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి. ఇప్ప‌టికే కాంగ్రెస్ త‌ర‌ఫున యువ‌జ‌న నాయ‌కుడిని నిల‌బెట్టి.. శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. ఓవైపు వెంక‌ట్ ప్ర‌చారంలో దూసుకుపోతుండ‌గా.. తెర‌వెనుక గెలుపు వ్యూహాలు ర‌చించే ప‌నిలో బిజీగా ఉన్నారు రేవంత్‌రెడ్డి.  తాజాగా, హుజూరాబాద్‌ ఉపఎన్నికలో ‘ఇంటికో ఓటు కాంగ్రెస్‌కు’ అనే నినాదాన్ని ఇంటింటికీ తీసుకెళ్లాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. నిరుద్యోగ యువత, విద్యార్థులు, కొత్త ఓటర్లను ఆకట్టుకునేలా ప్రచారం ఉండాలని సూచించారు. ఇంటింటికీ తిరిగి కాంగ్రెస్‌కు ఓటు ఎందుకు వేయాలో ప్రజలకు వివరించాలన్నారు.  వ‌చ్చే వారం రోజుల పాటు అమ‌లు చేయాల్సిన ప్రచార వ్యూహాలపై పార్టీ హుజురాబాద్‌ ఇంఛార్జిల‌తో చర్చించారు రేవంత్‌రెడ్డి. కాంగ్రెస్ పార్టీ ఒక యువ నాయకుడు, విద్యార్థి నేతకు టికెట్‌ ఇచ్చి ప్రోత్సహించిన విషయాన్ని యువతలోకి తీసుకు వెళ్లాలని సూచించారు. టీఆర్ఎస్‌, బీజేపీల మోసపూరిత విధానాలు, ఇచ్చి నెర‌వేర్చ‌ని వాగ్దానాలను ప్ర‌జ‌ల‌కు అర్థ‌మ‌య్యేలా వివరించాలని అన్నారు. కారు, క‌మ‌లం పార్టీల‌ లోపాయికారి ఒప్పందాలు, చీకటి రాజకీయాలను బయట పెట్టాలని నేతలకు దిశానిర్దేశం చేశారు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.   

బీపీ ఇప్పుడే వ‌చ్చిందా? కోడిక‌త్తి దాడి జ‌రిగితే ఏమ‌య్యారు? జ‌గ‌న్‌పై ర‌ఘురామ సెటైర్లు..

టీడీపీ కార్యాల‌యాల‌పై దాడులు జ‌ర‌గ‌డం దారుణ‌మైతే.. దాడి చేసిన వారిని స‌మ‌ర్థిస్తూ సీఎం జ‌గ‌న్ మాట్లాడ‌టం అంత‌కన్నా దారుణం అంటున్నారు. ముఖ్య‌మంత్రి స్థాయిలో ఉండి ఇలాంటి దాడుల‌ను ప్రోత్స‌హిస్తున్న‌ట్టు మాట్లాడటాన్ని అంతా త‌ప్పుబ‌డుతున్నారు. త‌న‌ను తిడితే.. త‌న మీద ప్రేమ ఉన్న అభిమానుల‌కు బీపీ వ‌చ్చి అలా ఎదురుతిరిగారంటూ వైసీపీ రౌడీల‌ను సీఎం వెన‌కేసుకు రావ‌డం.. ప్ర‌భుత్వ ప్రేరేపిత ఉగ్ర‌వాద‌మే అంటున్నారు. జ‌గ‌న్ వ్యాఖ్య‌ల‌పై స‌ర్వ‌త్రా ఆగ్ర‌హం వ్య‌క్తం అవుతుండ‌గా.. తాజాగా వైసీపీ ఎంపీ ర‌ఘురామ కృష్ణ‌రాజు సైతం స్పందించారు. ‘‘బీపీలు పెరిగితే దాడులు చేస్తారని సీఎం మాట్లాడడమేంటి? రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి జగన్‌ ఇలా మాట్లాడతారా? వైసీపీ నేతలు బూతులు మాట్లాడటం లేదా? గతంలో వైసీపీ నేతలు మాట్లాడిన మాటలు జగన్‌కు గుర్తులేవా? మిమ్మల్ని అనని మాటలకే మీ అత్యుత్సాహకులకు బీపీలు పెరిగిపోతే.. మీపై కోడికత్తి దాడి జరిగినప్పుడు మీ అత్యుత్సాహకులు ఏమయ్యారు?’’ అంటూ ప్ర‌శ్నించారు ఎంపీ ర‌ఘురామ‌. కొందరు అధికారులు అత్యుత్సాహంతో వ్యవహరిస్తున్నారంటూ ప‌రోక్షంగా డీజీపీపై మండిప‌డ్డారు. ఇప్పటికైనా వైసీపీ నేతలు మారేందుకు ప్రయత్నించాలంటూ హిత‌వు ప‌లికారు. బోసిడీకే పదానికి వైసీపీ అధికార వెబ్‌సైట్‌లో కొత్త పదాన్ని సృష్టించారని.. అద‌స‌లు తిట్టే కాద‌ని.. గూగుల్‌లో వెతికితే.. మీరు బాగున్నారా.. అనే అర్థం వ‌స్తోంద‌ని మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. 

ఆ అనుమానాస్ప‌ద వ్య‌క్తి అత‌నే.. దాడుల‌పై సీబీఐ విచారణకు డిమాండ్‌..

అంతా సినిమాటిక్‌గా సాగిపోయింది. కార్లు ర‌య్‌మంటూ రావ‌డం.. కారుతో టీడీపీ ఆఫీసు గేటును గుద్ద‌డం.. గేటు విర‌గొట్టి లోనికి చొచ్చుకెళ్ల‌డం.. వ‌స్తూ వ‌స్తూ రాడ్లు, క‌ర్ర‌లు, సుత్తి తీసుకురావ‌డం.. అంతా ప్రీ ప్లాన్డ్ ప‌క్కా స్కెచ్‌తో చేసిన దాడుల‌ని ఇప్ప‌టికే తేలిపోయింది. ఇదంతా తాడేప‌ల్లి ప్యాలెస్ డైరెక్ష‌న్‌లోనే జ‌రిగింద‌ని టీడీపీ మండిప‌డుతోంది. అయితే, మంగ‌ళ‌గిరి పార్టీ కేంద్ర కార్యాల‌యంలో ఆ అనూహ్య ఘ‌ట‌న జ‌రిగింది. టీడీపీ ఆఫీసులో ఓ అనుమానాస్ప‌ద వ్య‌క్తిగి పార్టీ వ‌ర్గాలు ప‌ట్టుకున్నాయి. అత‌డిని ప్ర‌శ్నిస్తే డీజీపీ కార్యాల‌య సిబ్బంద‌ని తేలింది. అంటే, చంద్ర‌బాబు అన్న‌ట్టు.. ఇది ప్ర‌భుత్వ-పోలీస్ ప్రేరేపిత ఉగ్ర‌వాద‌మేగా..! అంటున్నారు. అందుకే, దాడి ఘ‌ట‌న వెనుకున్న కుట్ర అంతా బ‌య‌ట‌కు రావాలంటే సీబీఐ విచార‌ణ జ‌రిపించాల‌ని టీడీపీ సీనియ‌ర్ నేత ప‌య్యావుల కేశ‌వ్ డిమాండ్ చేస్తున్నారు.   టీడీపీ కార్యాలయంలో అనుమానాస్పద వ్యక్తిని పట్టుకున్నామని.. ఆరా తీస్తే అతడిని డీజీపీ కార్యాలయంలో పీఆర్వోగా గుర్తించామని ప‌య్యావుల తెలిపారు. టీడీపీ ఆఫీసులోని సీసీ కెమెరాల్లో అన్నీ రికార్డయ్యాయని చెప్పారు. ఈ దాడికి సూత్రధారులు, పాత్రదారులు ఎవ‌రో తెలియాలంటే సీబీఐ విచారణ జరిపించాలని అన్నారు. డీజీపీ పాత్రపైనా విచారణ జరిపించాలని పయ్యావుల డిమాండ్‌ చేశారు.  దాడి ఘటనలపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని.. అన్ని విషయాలూ తేలుస్తామని హెచ్చ‌రించారు. కొంతమంది వల్ల పోలీసు వ్యవస్థ అంతర్మథనంతో నలిగిపోయే పరిస్థితి నెలకొందన్నారు. అధికారం ఉందని దాడులకు పాల్పడితే తగిన బుద్ధి చెబుతామని వైసీపీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ప‌య్యావుల కేశ‌వ్‌. గంజాయిపై ప్రశ్నిస్తే దాడులా? అని నిలదీశారు. ఇలాంటి దాడుల‌కు భయపడేది లేదని మండిప‌డ్డారు.   

70 ల‌క్ష‌ల మందిని అరెస్ట్ చేస్తారా? డీజీపీని నిల‌దీసిన‌ లోకేశ్‌..

టీడీపీ నేతల అరెస్ట్‌లపై నారా లోకేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇలా అరెస్టు చేసుకుంటూ పోతే.. తెలుగుదేశం పార్టీలో 70 ల‌క్ష‌ల మందిని అరెస్ట్ చేయాలంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ‘‘డీజీపీ గారూ! మాపైనా, మా కార్యాల‌యాల‌పైనా దాడి చేసినోళ్ల‌లో ఒక్క‌డినైనా అరెస్ట్ చేశారా?.. ఇదేం అరాచ‌కమ‌ని శాంతియుతంగా నిర‌స‌న తెలిపే టీడీపీ నేత‌లను అరెస్ట్ చేస్తారా?. మా నాయకులు ప‌ట్టాభి, నాదెండ్ల బ్ర‌హ్మం.. ఇలా అరెస్టు చేసుకుంటూ పోతే..తెలుగుదేశం పార్టీలో 70 ల‌క్ష‌ల మందిని అరెస్ట్ చేయాలి. ఒక్క‌సారి బుర్ర‌త‌క్కువ‌ స‌ల‌హాదారుల బుర్ర‌తో కాకుండా చ‌దువుకున్న ఐపీఎస్ బుర్ర‌తో ఆలోచించండి. మీరు చేస్తున్న‌ది ఎంత త‌ప్పో తెలిసొస్తుంది.. అంటూ ట్విట‌ర్‌లో మండిప‌డ్డారు లోకేశ్‌.   నాదెండ్ల బ్ర‌హ్మంని నిన్న‌టి నుంచి స్టేష‌న్ల చుట్టూ తిప్పి..తిప్పి ఏదో చేయాల‌నే మీ ప్లాన్ బెడిసికొట్టడంతో కొత్త డ్రామా మొద‌లుపెట్టారు. నాదెండ్ల బ్ర‌హ్మంపై ఈగ వాలినా మీదే బాధ్య‌త డీజీపీ గారు. చ‌ట్టాన్ని అతిక్ర‌మించి చేసిన ప్ర‌తీ అరెస్టుకి, పాల్ప‌డిన ప్ర‌తీ అరాచ‌కానికీ న్యాయ‌స్థానాల ముందు త‌ల‌దించుకుని దోషిగా నిల‌బ‌డేందుకు సిద్ధంగా ఉండండి.. అంటూ లోకేష్ ఫైర్ అయ్యారు.