హుజురాబాద్ కు కేటీఆర్ వెళ్లరట.. హరీష్ ను బలిపశువు చేయబోతున్నారా?

హుజూరాబాద్ ఉప ఎన్నిక కౌంట్ డౌన్ మొదలైంది. పోలింగ్ పది రోజుల్లోకి వచ్చింది. ప్రచారం వేడెక్కింది. నియోజక వర్గంలో మంత్రి హరీష్ రావుతోపాటుగా మరో అర డజను మందికి పైగా మంత్రులు ఓ రెండు డజన్ల మందికి పైగా ‘ఎమ్మెల్యేలు ఇతర నాయకులు పార్టీ అభ్యర్ధి గెలుపు కోసం శ్రమపడుతున్నారు. అయితే తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఅర్  మాత్రం ఇంతవరకు ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదు. అంతే కాదు  హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచారంలో తాను పాల్గొనడం లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓ చిన్న ఎన్నిక అంటూ తేలిగ్గా తీసేశారు., హుజూరాబాద్’లో ఓడి పోయినా కొంపలేమీ కూలి పోవని, అన్నారు. హుజురాబాద్ ఉపఎన్నికపై కేటీఆర్ చేసిన కామెంట్లు ఇప్పుడు చర్చగా మారాయి. హుజురాబాద్ ఉప ఎన్నిక వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సెమీ పైనల్ గా భావిస్తున్నారు. అందుకే అన్ని పార్టీలు సవాల్ గా తీసుకున్నాయి. బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతోంది. అధికార పార్టీ కూడా తన బలగాన్ని మోహరించింది. హుజురాబాద్ కోసమే దళిత బంధును తీసుకొచ్చారనే విమర్శలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్.. ఉప ఎన్నిక చాల చిన్నదని చెప్పడం రాజకీయ వర్గాలను విస్మయపరుస్తోంది. తాము చేయించిన సర్వేల్లో ఓటమి ఖాయమని తేలడంతోనే కేటీఆర్ ముందే చేతులెత్తేశారా అన్న చర్చ వస్తోంది. ఓడిపోవడం ఖాయమని నిర్ధారించుకున్నారు కాబట్టే.. ఆయన హుజురాబాద్ ప్రచారానికి వెళ్లడం లేదని అంటున్నారు. విపక్షాలు కూడా ఇవే ఆరోపణలు చేస్తున్నాయి. ఓటమి భయంతోనే కేటీఆర్ హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొన లేదని, అదే ఓటమిభయంతో ముఖ్యమంత్రి కొడుకు కేటీఆర్’ను సేఫ్ జోన్ లో ఉండేలా జగ్రత్ట్ పడుతున్నారని అంటున్నాయి. ముఖ్యంగా, తెరాస ప్రధాన ప్రత్యర్ధి బీజేపీ నేతలు తెరాస అగ్ర ద్వయం టార్గెట్ గా విరుచుకు పడుతున్నాయి.  హుజురాబాద్‎కు కేటీఆర్‎ను పంపిస్తే కొడుకు ఫేయిలవుతాడని కేసీఆర్ భయపడి హరీశ్‎ను పంపించాడని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి అన్నారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎక్కడ ఓడిపోతుందో.. అక్కడ కేటీఆర్ ఉండరు. వర్కింగ్ ప్రెసిడెంట్‎గా సారు, కారు, 16 అని 7 సీట్లు ఓడిపోయాడు. జీహెచ్ఎంసీలో గతంలో 99 సీట్లు గెలిస్తే.. ఈసారి 54 సీట్లు మాత్రమే గెలిచాడు. కేసీఆర్ భయపడి హుజురాబాద్‎కు కేటీఆర్‎ను పంపిస్తే కొడుకు ఫేయిలవుతాడని కేసీఆర్ భయపడి హరీశ్‎ను పంపించాడు. హరీశ్, ఈటల మంచి మిత్రులు. కానీ వారి మధ్య చిచ్చుపెట్టి.. హరీశ్‎ను ఇంచార్జీగా పంపించారని చెప్పారు.

డీజీపీ మారాలి.. దాడులను ఖండించిన బీజేపీ..

వాటిని దాడులంటారా? ఫ్యాక్షన్ కు పరాకాష్ట్ర. ఉన్మాదానికి నిలువుటద్దం. ఇది ప్రజాస్వామ్య రాజ్యమా? రాజారెడ్డి రాజ్యాంగమా? అంటూ టీడీపీ కార్యాలయాలపై జరిగిన వైసీపీ దాడులపై ప్రజలంతా మండిపడుతున్నారు. పార్టీలకతీతంగా నాయకులంతా అధికార పార్టీ తీరుపై మండిపడుతున్నారు. ఇది అరాచక పాలనంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేయగా.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు సైతం వైసీపీ ఆగడాలను తీవ్రంగా ఖండించారు.  ఏపీలో టీడీపీ కార్యాలయాలపై వైసీపీ కార్యకర్తలు దాడి చేయడం మంచిది కాదని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. బీజేపీ తరఫున ఇలాంటి అనైతిక సంఘటనలను ఖండిస్తున్నట్లు తెలిపారు. రాజకీయ పార్టీలు మాట్లాడే భాష విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. డీజీపీ తీరునూ సోము తప్పుబట్టారు. టీడీపీ చేసిన ఆరోపణలపై డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ స్పందించారు కానీ, వైసీపీ చేసిన భౌతిక దాడులపై స్పందించలేదన్నారు. ఇలాంటి విషయాల్లో డీజీపీలో మార్పు రావాలని సోము వీర్రాజు సూచించారు.   

మహిళలకు 40 శాతం సీట్లు.. యూపీలో ప్రియాంక ఫార్మూలా హిట్టయ్యేనా?

ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల సమయం సమీపిస్తున్న నేపధ్యంలో, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రియాంక వాద్రా కొత్త కొత్త ఆలోచనలో ముందుకు సాగుతున్నారు. రాష్ట్రంలో అద్ద్వాన్న స్థితికి చేరుకున్న కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు ప్రియాంక, ముందుండి పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. ఇటీవల్ లఖింపూర్ ఖేరి సంఘటన నేపధ్యంగా ప్రియాంకా వాద్రా, ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వంపై ఆమె వీరోచితంగా పోరాడారు. యూపీలో కాంగ్రెస్ బతికే వుందని, పార్టీ నాయకులు, క్యాడర్’కు భరోసా ఇచ్చేందుకు ఆమె కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగిపోతున్నారు. ఇప్పటికే సుదీర్ఘ పాద యాత్రకు ప్లాన్ చేసిన ప్రియాంక ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే సంవత్సరం (2022) ప్రారంభంలో జరిగే ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో  పార్టీ తరఫు నుంచి 40 శాతం టికెట్లను మహిళలకు రిజర్వ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. అంటే 160 మందికి అసెంబ్లీలో మొత్తం సభ్యులు 403) హస్తం పార్టీ టికట్ ఇస్తుందని ప్రియాంక చెప్పారు. అయితే ఇంత మంది అభ్యర్ధులు దొరుకుతారా అనే అనుమానాలు కొందరిలో ఉన్నాయి అనుకోండి. అది వేరే విషయం. కాంగ్రెస్ పార్టీ సూత్రం ప్రాయమైన నిర్ణయం అయితే తీసుకున్నారు. ఈ నేపధ్యంలోనే ప్రియాంక  మహిళలు మరో అడుగు ముందుకు వేయాల్సి ఉందని అన్నారు. నిజానికి యూపీలో మహిళలపై ఎలాంటి అత్యాచారం, హత్యలు ఎలాంటి నేరాలు ఘోరాలు జరిగిన కాంగ్రెస్ పార్టీ తరపున ప్రియాంక అందరికంటే ముందుగా స్పదించే వ్యక్తిగా , వార్తల్లో నిలిచారు. కొంతకాలం క్రితం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్‌, హథ్రాస్ అత్యాచార ఘటనల విషయంలో ప్రియాంక గట్టిగా పోరాటం చేశారు.  ఉత్తర్‌ప్రదేశ్‌లోని బాలికల కోసం, మార్పును కోరుకునే మహిళల కోసం, కాంగ్రెస్ పార్టీ రానున్న ఎన్నికల్లోమహిళలకు 40 శాతం సీట్లు కేటాయించాలనే  నిర్ణయం తీసుకుందని ప్రియాంక చెప్పారు.”మహిళలు మార్పు తీసుకురాగలరు. వారు మరో అడుగు ముందుకు వేయాల్సి ఉంది. ప్రస్తుతం దేశంలో ఉన్న విద్వేష రాజకీయాలను మహిళలు మాత్రమే అంతం చేయగలరు. మీరు నాతో కలిసి పనిచేయాలని అభ్యర్థిస్తున్నా” అని అన్నారు. కాగా ప్రస్తుత ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీలో 40 మంది మహిళా ఎమ్మెల్యేలున్నారు. అదులో 35మంది బీజీపీ సభ్యులు. కాంగ్రెస్, బీఎస్పీ తరపున ఇద్దరేసి ఉన్నారు. ఎస్పీ తరపున ఒకే ఒక్క మహిళ విజయం సాధించారు.

ఏపీలో రాష్ట్రపతి పాలన విధిస్తారా?ఆర్టికల్ 356 ఏం చెబుతోంది?  

ఆంధ్రప్రదేశ్ లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ కార్యాలయాలు, టీడీపీ నేతల ఇండ్లపై దాడులు జరగడం అలజడి రేపుతోంది. మంగళగిరిలో ఉన్న తెలుగు దేశం పార్టీ ప్రధాన కార్యాలయంలోకి వందలాది మంది చొరబడి విధ్వంసం స్పష్టించడం కలకలం రేపుతోంది. మంగళగిరి ఆఫీసుతో పాటు జిల్లాల్లోని టీడీపీ కార్యాలయాలపైనా ఏకకాకంలో దాడులు జరగడం దేశ వ్యాప్తంగా  సంచలనంగా మారింది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే నేతలే టార్గెట్ గా కొన్ని రోజులుగా ఏపీలో దాడులు జరుగుతున్నాయి. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి పై గతంలో రెండు సార్లు దాడి జరిగింది. తాజాగా మరోసారి పట్టాభి ఇంటిపై దాడికి తెగబడ్డారు. వందమందికి పైగా అతని ఇంట్లోకి చొరబడి బీభత్సం చేశారు. ఏపీలో టీడీపీ టార్గెట్ గా జరుగుతున్న దాడులపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. గవర్నర్ కు పరిస్థితిని వివరించారు. అరాచకాలకు అడ్డాగా మారిన ఏపీలో వెంటనే రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు చంద్రబాబు. టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ తో రాష్ట్రపతి పాలనకు సంబంధించిన ఆర్టికల్ 356పై చర్చ జరుగుతోంది. రాష్ట్రాల్లో ఏఏ పరిస్థితుల్లో రాష్ట్రపతి పాలన విధిస్తారు.. ఎందుకు విధిస్తారు.. రాష్ట్రపతి పాలన విధించాకా జరిగే పరిణామాలు ఏంటనే చర్చ జనాల్లో సాగుతోంది. భారత దేశంలో ఏదైనా రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రజాప్రభుత్వాన్ని సస్పెండు చేసి లేదా రద్దుచేసి, రాష్ట్రాన్ని నేరుగా కేంద్ర ప్రభుత్వ పాలనలోకి తీసుకురావడాన్ని రాష్ట్రపతి పాలన అంటారు. భారత రాజ్యాంగం లోని 356 వ అధికరణం ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి ఈ అధికారం సంక్రమించింది. దీని ప్రకారం, రాజ్యాంగ యంత్రాంగం వైఫల్యం చెందిందని భావించినపుడు, దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా రాష్ట్రపతి పాలనను విధించవచ్చు. రాష్ట్రంలోని పరిస్థితిపై గవర్నరు ఇచ్చిన నివేదికపై ఆధారపడి కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటుంది. రాష్ట్రపతి పాలన అమల్లో ఉండగా, రాష్ట్రపతి ప్రతినిధిగా రాష్ట్ర గవర్నరు పరిపాలనా బాధ్యతలు నిర్వహిస్తారు. ఈ బాధ్యతల్లో భాగంగా గవర్నరు తనకు సహాయపడేందుకు అధికారులను నియమించుకోవచ్చు. భారత సమాఖ్య వ్యవస్థలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగం నిర్దేశించిన పరిధిలో తమ అధికార, విధులను నిర్వర్తించాలి. దేశ ఐక్యత, సమగ్రత, రక్షణ దృష్ట్యా అనూహ్యమైన పరిస్థితులు తలెత్తినప్పుడు వాటిని ఎదుర్కోవడానికి ఉద్దేశించిన అధికారాలకు ‘అత్యవసర అధికారాలు’గా పేరు పెట్టారు. రాజ్యాంగం 18వ భాగంలో ప్రకరణ 352 నుంచి 360 వరకు మూడు రకాల అత్యవసర అధికారాలను పేర్కొన్నారు. అవి.. 1.           జాతీయ అత్యవసర పరిస్థితి (ప్రకరణ 352) 2.           రాష్ట్రంలో రాజ్యాంగపరమైన అత్యవసర పరిస్థితి లేదా రాష్ట్రపతి పాలన (ప్రకరణ 356) 3.           ఆర్థిక అత్యవసర పరిస్థితి (ప్రకరణ 360) ప్రకరణ 355 ప్రకారం ప్రతీ రాష్ట్రంలో రాజ్యాంగబద్ధంగా పాలన కొనసాగేలా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే. అలాకాకుండా ఏదైనా రాష్ట్రంలో రాజ్యాంగ బద్ధంగా పరిపాలన కొనసాగించడానికి అవకాశం లేనప్పుడు లేదా రాజ్యాంగ సంక్షోభం ఏర్పడిన పరిస్థితుల్లో.. గవర్నర్ పంపిన నివేదిక ద్వారా లేదా మరో విధంగా గానీ, రాష్ట్రపతి భావించినప్పుడు ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించవచ్చు. ప్రకరణ 365 ప్రకారం కేంద్ర ఆదేశాలను రాష్ట్రాలు ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘిస్తే కూడా రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉంది. రాష్ట్రపతి పాలన విధించిన రోజు నుంచి రెండు నెలల్లోగా పార్లమెంట్ రాష్ట్రపతి పాలనను సాధారణ మెజారిటీతో ఆమోదించాల్సి ఉంటుంది. పార్లమెంట్ ఆమోదించిన రోజు నుంచి ఆరు నెలల వరకూ రాష్ట్రపతి పాలన కొనసాగుతుంది. అలా ప్రతి ఆరు నెలలకోసారి పార్లమెంట్ ఆమోదాన్ని పొందాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ రాష్ట్రపతి పాలనను మూడు సంవత్సరాలకు మించి కొనసాగనివ్వకూడదు. రాష్ట్రపతి పాలన విధించినప్పుడు చోటు చేసుకునే పరిణామాలు 1.  రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేస్తారు. 2.  రాష్ట్ర విధాన సభను రద్దు చేయవచ్చు లేదా సుప్తచేతనావస్థలో ఉంచవచ్చు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని సుప్తచేతనావస్థలోనే ఉంచారు (అంటే అసెంబ్లీ రద్దు కాకుండా నిద్రాణ స్థితిలో ఉంటుంది). ఈ వ్యవస్థలో ఉన్నప్పుడు అసెంబ్లీని తిరిగి పునరుద్ధరించవచ్చు. 3.  రాష్ట్రపతి.. రాష్ట్ర పాలన బాధ్యతను స్వీకరించి దాన్ని గవర్నర్ ద్వారా నిర్వహిస్తాడు. 4.  గవర్నర్‌కు సహకరించడానికి సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను సలహాదారులుగా నియమిస్తారు. 5. రాష్ట్ర జాబితాలోని అంశాలపైన పార్లమెంట్, రాష్ట్రపతి ఆర్డినెన్‌‌స ద్వారా చట్టాలను రూపొందించవచ్చు. 6. రాష్ట్ర బడ్జెట్‌ను కూడా పార్లమెంట్ ఆమోదిస్తుంది. దేశంలో 1950 నుంచి ఇప్పటివరకు సుమారు 120 కంటే ఎక్కువ సార్లు రాష్ట్రపతి పాలన విధించారు. ఈ ప్రకరణను కేంద్రం రాజకీయ స్వప్రయోజనాలకే దుర్వినియోగం చేసిన సందర్భాలే ఎక్కువని ప్రతిపక్షాలు, రాజ్యాంగ నిపుణులు విమర్శించారు. 1977లో జనతాపార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ పాలనలోని 9 రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేసింది. 1980లో కాంగ్రెస్ ప్రభుత్వం జనతాపార్టీ పాలన లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేసింది. 1984లో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్.టి. రామారావు ప్రభుత్వాన్ని అకారణంగా బర్తరఫ్ చేసి మెజారిటీ లేని నాదెండ్ల భాస్కరరావును ముఖ్యమంత్రిగా నియమించడం దుర్వినియోగానికి పరాకాష్టగా పేర్కొనవచ్చు. మృత శాసనమా లేదా మరణ శాసనమా?  రాష్ట్రపతి పాలనను రాజ్యాంగంలో చేర్చడంపై రాజ్యాంగ పరిషత్‌లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ దీనికి సమాధానం చెబుతూ ప్రకరణ.. 356 రాజ్యాంగంలో మృత శాసనంగా (డెడ్ ఆర్టికల్) ఉంటుందని, దీన్ని చాలా జాగ్రత్తగా, అతి తక్కువగా తుది ప్రత్యామ్నాయంగానే వినియోగిస్తారని భరోసా ఇచ్చారు. కానీ తర్వాతి కాలంలో దీనికి భిన్నంగా జరిగింది. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించడం పాలకులకు పరిపాటిగా మారిపోయింది. ఎస్‌ఆర్ బొమ్మై కేసు – మార్గదర్శకాలు 1994లో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ ఆర్ బొమ్మైకేసు సందర్భంగా సుప్రీంకోర్టు రాష్ట్రపతి పాలన విధించడానికి సంబంధించి కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ కేసును ప్రకరణ 356 విషయంలో అత్యంత ప్రామాణికంగా పరిగణిస్తారు.  గవర్నర్ నివేదిక రాష్ట్రంలోని వాస్తవిక పరిస్థితులను ప్రతిబింబించేలా ఉండాలి. వ్యక్తిగత అభిప్రాయాలను వ్యక్తీకరించరాదు. రాష్ట్ర ప్రభుత్వానికి మెజారిటీ ఉందా లేదా అనే అంశాన్ని శాసనసభలో మాత్రమే పరీక్షించాలి. బల నిరూపణ కోసం ముఖ్యమంత్రికి తగిన సమయం ఇవ్వాలి. పార్లమెంట్.. రాష్ట్రపతి పాలనను ఆమోదించే వరకు రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేయరాదు. లౌకిక తత్వానికి విఘాతం కలిగించినా లేదా దాన్ని కాపాడలేకపోయినా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రకరణ 356 ప్రకారం రద్దు చేయవచ్చు. శాంతి భద్రతలకు భంగం వాటిల్లడం వేరు, రాజ్యాంగపరమైన వైఫల్యం వేరు. కాబట్టి శాంతి భద్రతలకు విఘాతం కలిగిందనే సాకుతో రాష్ట్రపతి పాలన విధించడం సమంజసం కాదు. ప్రకరణ 356ను ప్రయోగించడాన్ని అంతిమ ప్రత్యామ్నాయంగానే చూడాలి. రాష్ట్రంలోని పరిస్థితులను చక్కబెట్టేందుకు రాజ్యాంగంలోని ఇతర ప్రత్యామ్నాయాలైన ప్రకరణ 256, 257లను కూడా ఉపయోగించాలి.  రాష్ట్రపతి పాలనను దురుద్దేశంతో విధించినా లేదా రాష్ట్రపతి పాలన విధించడానికి సమంజసమైన కారణాలు లేకపోయినా న్యాయస్థానం జోక్యం చేసుకొని రాష్ట్రపతి ఆదేశాలను కొట్టివేయవచ్చు.రాష్ట్రపతి పాలనను సుప్రీంకోర్టు కొట్టివేస్తే రద్దు చేసిన ప్రభుత్వాన్ని, విధానసభను పునరుద్ధరిస్తారు. దేశంలో ఎప్పుడెప్పుడు? దేశంలో ఇప్పటి వరకూ దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ రాష్ట్రపతి పాలన ఏదో ఒక సందర్భంలో అమల్లోకి వచ్చిందని చెప్పొచ్చు. ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఇప్పటి వరకూ రాష్ట్రపతి పాలన విధించలేదు. అన్నిటి కంటే ఎక్కువగా ఉత్తరప్రదేశ్‌లో 9 సార్లు రాష్ట్రపతి పాలన విధించారు. తర్వాత వరుసగా బీహార్, పంజాబ్‌లలో 8 పర్యాయాలు రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. ఆంధ్ర రాష్ట్రంలో 1954, నవంబర్ 15 నుంచి 1955, మార్చి 28 వరకు ఒక పర్యాయం రాష్ట్రపతి పాలన విధించారు. సారా వ్యతిరేకోద్యమం, ఆనాటి ముఖ్యమంత్రి ప్రకాశం పంతులుపై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది.1973లో జై ఆంధ్ర ఉద్యమ నేపథ్యంలో అప్పటి ముఖ్యమంత్రి పి.వి.నరసింహారావు రాజీనామాతో 1973, జనవరి 11 నుంచి  డిసెంబర్ 10 వరకు ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించారు. సుప్రీంకోర్టు తీర్పులు – న్యాయసమీక్ష 1975లో చేసిన 38వ రాజ్యాంగ సవరణ ప్రకారం.. రాష్ట్రపతి తన అభీష్టం మేరకు లేదా సంతృప్తి మేరకు ప్రకరణ 356ను ప్రయోగించవచ్చు. ఈ విషయంలో రాష్ట్రపతిదే తుది నిర్ణయం. ఆ నిర్ణయాన్ని న్యాయస్థానంలో ప్రశ్నించరాదు అనే ఉద్దేశంతో రాజ్యాంగ సవరణ చేశారు. అయితే 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా దాన్ని తొలగించారు. ఆ మేరకు రాష్ట్రపతి తీసుకున్న నిర్ణయాన్ని న్యాయస్థానంలో ప్రశ్నించవచ్చు. న్యాయ సమీక్షకు అతీతం కాదు. ఈ మధ్యనే ఢిల్లీలో విధించిన రాష్ట్రపతి పాలనను ప్రశ్నిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

ఇదేమి రాజ్యం? రాజారెడ్డి రాజ్యం.. ఫ్యాక్షన్ రాజ్యం.. రౌడీ రాజ్యం?

ఆంధ్రప్రదేశ్ లో అరాచక పాలన పీక్స్ కు వెళ్లింది. రాజారెడ్డి రాజ్యమంటే ఎట్టా ఉంటాదో రుచి చూపించారని, కడప ఫ్యాక్షన్ మంగళగిరిలో అమలు చేశారనే ఆరోపణలు వస్తున్నాయి.  జస్ట్ నాటు బాంబులు మాత్రమే వేయలేదు.. మిగతా అంతా సేమ్ టూ సేమ్. కర్రలు, రాడ్లు, సుత్తిలతో టీడీపీ ఆఫీసులపై దాడులకు తెగబడ్డారు. రాళ్లతో విధ్వంసం స్రుష్టించారు. వందలాది మంది మూకగా వచ్చి.. పక్కా ప్లాన్డ్ గా అరాచకానికి పాల్పడ్డారు. ఏకంగా మంగళగిరిలోని టీడీపీ రాష్ట్ర కార్యాలయంపైనే అటాక్ చేయడమంటే మాటలా? పక్కనే డీజీపీ ఆఫీసు ఉన్నా.. ఇంకోవైపు ఏపీఎస్పీ బెటాలియన్ ఉన్నా.. వందలాది మంది ఇలా మూకదాడులకు దిగారంటే.. ఇది ఆంధ్రప్రదేశా? అఫ్ఘనిస్తానా? మాట్లాడితే కొట్టేస్తారా? ప్రశ్నిస్తే చంపేస్తారా? ప్రెస్ మీట్లు పెడితే విధ్వంసానికి దిగుతారా? ఇది ప్రజాస్వామ్య పాలనా? లేక, రాజారెడ్డి రాజ్యాంగమా? అన్న అనుమానాలు వస్తున్నాయి. జగన్ సీఎం అయినప్పుడే అంతా భయపడ్డారని, భయపడినట్టే జరిగిందని అంటున్నారు. కడప ఫ్యాక్షన్ ను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఏకకాలంలో మంగళగిరి, విశాఖ, తిరుపతి, నెల్లూరు, హిందూపురం, కర్నూలు వంటిచోట్ల వైసీపీ దాడులకు తెగబడిందంటే ఏమనాలి? వారిని ఏం చేయాలి? ఇది పక్కా ప్లాన్డ్ కాకపోతే ఇంకేంటి? ఇవి తాడేపల్లి ప్యాలెస్ డైరెక్షన్లో జరిగిన దాడులు కాక ఇంకేంటి? వైసీపీలో ఫ్రస్టేషన్ ఫీక్స్ కు చేరింది. అన్నివైపులా విమర్శలు వెల్లువెత్తుతుండటంతో తట్టుకోలేకపోతోంది. అప్పులు ముట్టడం లేదు.. కరెంట్ కోతలు ఆగడం లేదు.. ఉద్యోగులు ఉద్యమిస్తున్నారు.. నిరుద్యోగులు తిరగబడుతున్నారు.. సంక్షేమ పథకాలకు భారీ కోత పడుతున్నాయి.. నవరత్నాలు ఒక్కోటిగా రాలిపోతున్నాయి.. ఇలా లెక్కలేనన్ని సమస్యలతో సతమతమవుతున్న వైసీపీ సర్కారుపై డ్రగ్స్ దందా పిడుగుపాటులా పడింది. వైసీపీ నాయకుల కనుసన్నల్లో డ్రగ్స్ యవ్వారం సాగుతోందంటూ టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి నిత్యం ప్రభుత్వాన్ని తూట్లు పొడుస్తూనే ఉన్నారు. అదంతా నిజమే కావడంతో.. సమాధానం చెప్పుకోలేక వైసీపీలో ఫ్రస్టేషన్ పెరిగిపోయి.. ఇలా దాడులకు దిగుతున్నారని అంటున్నారు. ఇటీవల కాకినాడ టీడీపీ కార్యాలయంపై ఇలానే దాడికి తెగబడింది వైసీపీ. పట్టాభిపై దాడికి ప్రయత్నించింది. అప్పుడే వారిపై కఠిన చర్యలు తీసుకొని ఉంటే.. పరిస్థితి ఇక్కడి వరకూ వచ్చుండేది కాదు. వైసీపీ బెదిరింపులకు భయపడకుండా పట్టాభి తన దూకుడును కంటిన్యూ చేయడంతో.. అధికార పార్టీ దొంగలు తట్టుకోలేకపోయారు. విజయవాడలోని పట్టాభి ఇంటిపై పడి విధ్వంసం స్రుష్టించారు. ఆ దాడికి కొనసాగింపుగా.. మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయంపై పడి ఫ్యాక్షన్ తరహా దాడి చేశారు. పావు గంట పాటు కిష్కిందకాండను తలపించారు. ఫుల్లుగా తాగేసి.. ఆయుధాలు చేతపట్టి.. రచ్చ రచ్చ చేశారు. వైసీపీ రౌడీల దాడిలో పలువురు టీడీపీ సిబ్బంది తీవ్రంగా గాయపడగా.. వారి ప్రాణాలకు ఏమైనా అయితే అందుకు జగన్ బాధ్యత వహిస్తారా? పట్టాభి మాటలకే దాడికి దిగితే.. ఇక మంత్రులు కొడాలి నాని, అనిల్ కుమార్ లు నిత్యం బూతులు మాట్లాడుతున్నందుకు తాడేపల్లి ప్యాలెస్ పై ఇంకెలాంటి దాడులు చేయాలో వైసీపీ వాళ్లే చెప్పాలి? తాడేపల్లి ప్యాలెస్ ను తగలబెట్టాలా? లేక, కడప బాంబులతో పేల్చేయాలా? వైసీపీ నాయకులే చెప్పాలంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. తమది ప్రజాస్వామ్య పార్టీ కాదని.. ఫ్యాక్షన్ పార్టీ అని.. వైసీపీ పదే పదే నిరూపించుకుంటోంది. ఇటీవల, ఏకంగా టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంటిపైనే వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్ రౌడీలను వేసుకొని దాడికి వచ్చారంటే అంతకన్నా అరాచకం ఇంకే ముంటుంది. జోగి రమేశ్ పై ఇప్పటి వరకూ ఎలాంటి చర్యలు లేవు. అదే టీడీపీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి ఆరోపణలు చేస్తే మాత్రం.. పోలీసులు ఇంటికొచ్చి మరీ నోటీసులు ఇస్తారు. వైసీపీ మూకలు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఆఫీసులను విధ్వంసం చేస్తారు. అందుకే అంటున్నారు.. ఇదేమి రాజ్యమని? రాజారెడ్డి రాజ్యం.. ఫ్యాక్షన్ రాజ్యం.. రౌడీ రాజ్యం.. గూండా రాజ్యమని. చంద్రబాబు డిమాండ్ చేసినట్టు.. వెంటనే ఏపీ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి రాష్ట్రపతి పాలన విధించాల్సిన అవసరం ఎంతైనా ఉందనే డిమాండ్లు బలంగా వినిపిస్తున్నాయి.

టీడీపీ నేతల అరెస్టులు.. రోడ్లపై జగన్ పార్టీ లీడర్లు! డీజీపీ.. వైసీపీ వర్కింగ్ ప్రెసిడెంటా?

తెలుగు దేశం పార్టీ కార్యాలయాలు, టీడీపీ నేతలపై దాడికి నిరసనగా ఆ పార్టీ ఇచ్చిన పిలుపుతో ఏపీలో బంద్ కొనసాగుతోంది. టీడీపీ కార్యాలయాలపై ఏకకాలంలో దాడులు జరగడం తీవ్ర ఉద్రిక్తత స్పష్టించింది. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఆందోళనలు చేస్తున్నాయి. అయితే  టీడీపీ బంద్‌కు పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి ఆందోళనలు చేపట్టకుండా టీడీపీ నేతలు, కార్యకర్తలను ముందస్తుగా అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు. అన్ని జిల్లాల్లోనూ టీడీపీ ముఖ్య నేతలను అర్ధరాత్రి నుంచే గృహ నిర్బంధం చేశారు. ఇక రోడ్లపై నిరసనకు దిగుతున్న టీడీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌లకు తరలిస్తున్నారు. దీంతో టీడీపీ కార్యకర్తల నిరసనలతో హోరెత్తుతోంది. కనిగిరి బస్టాండులో టీడీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. విజయవాడలో పోలీసులు భారీగా మోహరించారు. అలాగే విశాఖ, శ్రీకాకుళం బస్టాండు దగ్గర తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఆయా ప్రాంతాల్లో నిరసనగా దిగిన టీడీపీ నేతలు, కార్యకర్తల ముందస్తు అరెస్టులు కొనసాగుతున్నాయి. ఒంగోలులో టీడీపీ నేతలను అరెస్టు చేశారు. ఏపీలో నిరసనల నేపథ్యంలో తెల్లవారు జామునుంచే బస్టాండ్లు, బస్సు డిపోల ముందు భద్రతను కట్టుదిట్టం చేశారు. ముందు జాగ్రత్త చర్యగా భారీగా పోలీసులను మోహరించారు. అనుమానితులను ఎక్కడికక్కడ అరెస్ట్‌ చేస్తున్నారు. ఇక శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా పోలీసులు భారీగా మోహరించారు. బంద్ కోసం వస్తున్న టీడీపీ నేతలను ముందస్తు అరెస్టులు చేశారు పోలీసులు. ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద టిడిపి పార్టీ మాజీ జిల్లా అధ్యక్షులు ఛౌదరి బాబ్జీతో పాటు పలువురు టిడిపి నేతలను అరెస్టు చేసి పోలీసులు. ఒంగోలులో బస్సులను అడ్డుకునేందుకు టీడీపీ కార్యకర్తలు ప్రయత్నించారు. స్పాట్‌లో ఉన్న పోలీసులు రంగంలోకి దిగి కార్యకర్తలను అడ్డుకున్నారు. నేతలను, మహిళా కార్యకర్తలను బలవంతంగా పోలీసు వాహనంలో ఎక్కించారు. ఈ సందర్భంగా పోలీసులకు టీడీపీ కార్యకర్తలకు మధ్య పెనుగులాట జరిగింది. అనంతరం అరెస్ట్ చేసిన టీడీపీ కార్యకర్తలను పోలీసులు పోలీస్ స్టేషన్ కు తరలించారు. టీడీపీ కార్యాలయాలపై దాడులు చేసిన వైసీపీ కార్యకర్తలను ఇంతవరకు అరెస్టు చేయలేదని, న్యాయం చేయాలని ఆందోళనకు దిగిన తమను పోలీసులు బలవంతంగా చేస్తున్నారని టీడీపీ కార్యకర్తలు ఆరోపించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసుల తీరుపై టీడీపీ నేతలు తీవ్రంగా ఫైరవుతున్నారు. టీడీపీ కార్యకర్తలను అరెస్టు చేస్తున్న పోలీసులు... అధికార పార్టీ కార్యకర్తలను ఎందుకు వదిలేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మండిపడ్డారు. డీజీపీ.. వైసీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మారిపోయారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 

అరాచకానికి కేరాఫ్ గా ఏపీ.. వైసీపీ దాడులపై పవన్ కల్యాణ్ ఫైర్.. 

ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ కార్యాలయం, నేతల ఇళ్లపై దాడులను జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఖండించారు. ప్రజా స్వామ్యంలో ఇటువంటి దాడులు ఎవరికీ క్షేమం కాదన్నారు. రాజకీయ పార్టీలుగా ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయన్నారు జనసేనాని. ఇటువంటి దాడులు అరాచకానికి, దౌర్జన్యానికి దారి తీస్తాయని తెలిపారు. ఒకేసారి పలు ప్రాంతాలలో దాడి అంటే.. ఉద్దేశపూర్వకంగా చేసిందేనన్నారు.  కేంద్ర హోంశాఖ, ఏపీ పోలీసు శాఖలు ఈ దాడులపై ప్రత్యేక దృష్టి సారించాలని పవన్ కల్యాణ్ సూచించారు. వైసీపీ వర్గం వారే ఈ దాడులు చేయించారని చెబుతున్నారని తెలిపారు. నిందితులు ఎంతటి వారైనా అరెస్టు చేసి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి పోకడలు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టన్నారు. ఈ తరహా దాడులు పునరావృతం కాకుండా చూడాలని పవన్ కల్యాణ్ కోరారు. దోషులను శిక్షించకపోతే అరాచకానికి కేరాఫ్ గా ఏపీ మారిపోతుందని పవన్ కల్యాణ్ హెచ్చరించారు. 

సైకో, శాడిస్ట్‌, డ్ర‌గ్గిస్ట్ జ‌గ‌న్‌రెడ్డి.. తేల్చుకుందాం రా! 

ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ కార్యాలయాలు, టీడీపీ నేతలపై జరుగుతున్న దాడులపై నారా లోకేష్ తీవ్రంగా స్పందించారు. ఘాటైన పదజాలంతో విరుచుకుపడ్డారు. "ఇప్ప‌టివ‌ర‌కూ ముఖ్య‌మంత్రి అని గౌర‌వించి గారూ అనేవాడిని. నీ వికృత‌, క్రూర బుద్ధి చూశాక  సైకో, శాడిస్ట్‌, డ్ర‌గ్గిస్ట్ జ‌గ‌న్‌రెడ్డి అని అంటున్నాను. నువ్వూ, నీ బినామీలు డ్ర‌గ్స్ బిజినెస్ చేస్తారు. నిల‌దీసే టిడిపి నేత‌ల‌పై దాడుల‌కు పాల్ప‌డ‌తావా? ప‌రిపాలించ‌మ‌ని ప్ర‌జ‌లు అధికారం అందిస్తే... పోలీసుల అండ‌తో మాఫియా సామ్రాజ్యం న‌డుపుతావా? టిడిపి కేంద్ర‌కార్యాల‌యాల‌పై గూండా మూక‌ల‌తో దాడుల‌కు తెగ‌బ‌డ‌తావా? ఎన్నాళ్లిలా ఇంట్లో దాక్కుని నీ కుక్కలతో దాడులు చేయిస్తావు! నువ్వే రా తేల్చుకుందాం అంటూ సవాల్ చేశారు నారా లోకేష్.  "తెలుగుదేశం స‌హ‌నం చేత‌కానిత‌నం అనుకుంటున్నావా?  నీ ప‌త‌నానికి ఒక్కో ఇటుకా నువ్వే పేర్చుకుంటున్నావు. నిన్ను ఉరికించి కొట్ట‌డానికి తెలుగుదేశం అధికారంలోకి రావాల్సిన అవ‌స‌రంలేదు. నీ అరాచ‌కాల‌పై ఆగ్ర‌హంగా వున్న కేడ‌ర్‌కి మా లీడ‌ర్ క‌నుసైగ చేస్తే చాలు. నీ కార్యాల‌యాల విధ్వంసం నిమిషం ప‌ని. నీ ఫ్యాన్ రెక్క‌లు మ‌డిచి విరిచి  నీ పెయిడ్ ఆర్టిస్టుల్ని రాష్ట్రం దాటేంత‌వ‌ర‌కూ త‌రిమి కొడ‌తారు మా కార్య‌క‌ర్త‌లు. అన్ని ఆన‌వాయితీల‌ని బ్రేక్ చేసి, ప్ర‌జాస్వామ్యానికి పాత‌రేసి..నీ స‌మాధికి నువ్వే గొయ్యి త‌వ్వుకుంటున్నావు కోడికత్తిగా.." అంటూ నారా లోకేష్ తీవ్ర పదజాలంతో మండిపడ్డారు.  టీడీపీ నేతలు, కార్యాలయాలపై దాడులు దారుణమని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. టీడీపీ నేత పట్టాభి ఇంటిపై దాడిని ఆయన ఖండించారు. దాడి ఘటనపై తక్షణమే డీజీపీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పార్టీలతో సంబంధం లేకుండా నిందితులను అరెస్ట్ చేయాలని సూచించారు. రాష్ట్రంలో రౌడీ రాజ్యం పాలన చేస్తోందని టీడీపీ నేత బోండా ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో ఉన్నామా? పాకిస్థాన్‌లో ఉన్నామా? అని ప్రశ్నించారు. ఇక్కడ చట్టం ఉందా? తాలిబన్ పాలన ఉందా?, వైసీపీ అవినీతిని ఎత్తి చూపితే దాడులా? అని ఆయన ప్రశ్నించారు.  

బుధవారం ఏపీ బంద్.. రాష్ట్రపతి పాలనకు చంద్రబాబు డిమాండ్ 

ఆంధ్రప్రదేశ్ లో తెలుగు దేశం పార్టీ కార్యాలయాలపై వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడటం ప్రకంపనలు స్పష్టిస్తోంది. వైసీపీ కార్యకర్తల దౌర్జన్యకాండతో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ శ్రేణులు ఎక్కడికక్కడ ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. టీడీపీ కార్యాలయాలపై దాడికి నిరసనగా బుధవారం ఏపీ బంద్‌కు టీడీపీ పిలుపునిచ్చింది. ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బంద్‌కు పిలుపు నిచ్చారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారాయని మండిపడ్డారు. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.  డీజీపీకి., సీఎంకు తెలిసే టీడీపీ కార్యాలయాలపై దాడి జరిగిందని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఏపీ వ్యాప్తంగా టీడీపీ కార్యాలయాలపై జరిగిన దాడిని ఆయన ఖండించారు. ‘‘40 ఏళ్ల పాటు రాజకీయాలు చూశాను. స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం ఎప్పుడూ చూడలేదు. ప్రభుత్వం, పోలీసులు కుమ్మక్కై పార్టీ కార్యాలయంపై దాడి చేశారు. ఆర్గనైజ్డుగా ఒకేసారి రాష్ట్రంలో వివిధ చోట్ల దాడులు చేశారు. పార్టీ కార్యాలయల పైనా దాడులు ఎప్పుడూ జరగలేదు. 100 మీటర్లలోపే డీజీపీ కార్యాలయం ఉన్నా.. దాడులు ఆపలేకపోయారు. డీజీపీకి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తరు.. గవర్నరుకు ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేశారు.. పరిస్థితి వివరించాను.’’ అని చెప్పారు.  డ్రగ్ మాఫియాకు రాష్ట్రం అడ్డాగా మారిందని చంద్రబాబు అన్నారు. రాష్ట్రాన్ని డ్రగ్స్ కోరల నుంచి బయటపడేయాలని కోరడం తప్పా అని ఆయన ప్రశ్నించారు. ‘‘ఏపీలో గంజాయి ఉత్పత్తి చేసి దేశం మొత్తం సరఫరా చేస్తుంటే ప్రశ్నించకూడదా..?. స్టేట్ టెర్రరిజానికి వ్యతిరేకంగా రాష్ట్ర బంద్‌కు పిలుపిస్తున్నాం. పార్టీ కార్యాలయాలపై దాడి చేసి చంపేయాలని చూస్తారా..?. పులివెందుల రాజకీయాలు చేస్తారా..?. పార్టీ కార్యాలయంపై దాడులు చేసి చంపే ప్రయత్నం చేస్తోంటే డీజీపీ ఎక్కడ పడుకున్నారు. డీజీపీ నేరస్తులతో లాలూచీ పడతారా..?. ఇది టీడీపీకి సంబంధించిన విషయం కాదు. ప్రజాస్వామ్యానికి సంబంధించిన విషయం. ప్రజాస్వామ్యానికి సంబంధించిన విషయం కాదు. పార్టీ కార్యాలయం పైనా.. నేతల పైనా దాడులు జరిగితే.. ప్రజాస్వామ్యం ఎక్కడిది..?.  శాంతి భద్రతలు ఫెయిల్ అయ్యాయి. డీజీపీ కార్యాలయం పక్కన దాడులు చేస్తే ఆర్టికల్ 356 ఎందుకు అమలు చేయకూడదు..?.’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. 

ఏపీలో వైసీపీ అరాచకాలు.. అమిత్ షాకు చంద్రబాబు ఫోన్

ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ కార్యాలయాలు, టీడీపీ నేతలపై ఇండ్లపై వైసీపీ శ్రేణులు దాడులకు పాల్పడటం తీవ్ర ఉద్రిక్తతలు స్పష్టిస్తోంది. టీడీపీ కేంద్ర కార్యాలయంతో పాటు నెల్లూరు టీడీపీ కార్యాలయంపై దాడి జరిగింది. విజయవాడలోని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభీ, హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ, కడపలో సీనియర్ నేత అమీర్ బాబు నివాసాలపై దాడి జరిగింది. వైసీపీ నేతల దాడులతో పార్టీ కేంద్ర కార్యాలయానికి హుటాహుటిన చేరుకున్నారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు. పట్టాభితో పాటు పార్టీ కార్యకర్తలతోనూ మాట్లాడారు. దాడి వివరాలను చంద్రబాబుకు టీడీపీ శ్రేణులు  వివరించారు. చంద్రబాబు వెంట దేవినేని ఉమ, కొల్లు రవీంద్ర, ముఖ్యనేతలు కూడా కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు.  ఇక కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు చంద్రబాబు ఫోన్‌ చేశారు. టీడీపీ నేతలు, కార్యాలయాలపై పక్కా ప్రణాళిక ప్రకారం దాడులు చేయిస్తున్నారని అమిత్‌షాకు చంద్రబాబు ఫిర్యాదు చేశారు. దాడి విషయం తన దృష్టికి రాలేదని అమిత్ షా తెలిపారు. పార్టీ ప్రధాన కార్యదర్శి ద్వారా లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామని అమిత్ షా హామీ ఇచ్చారు. టీడీపీ కార్యాలయానికి కేంద్ర భద్రతాబలగాల రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఏపీ పోలీస్ అధికారులతో మాట్లాడతానని చంద్రబాబుకు అమిత్‌షా హామీ ఇచ్చారు

టీడీపీ కార్యాలయాలు, నేతల ఇండ్లపై వైసీపీ దౌర్జన్యకాండ.. జగన్ రెడ్డి అరాచక పాలన! 

ఆంధ్రప్రదేశ్ రౌడీ రాజ్యంగా మారిపోయిందా? అరాచకాలకు కేరాఫ్ గా మారిందా? అటవిల పాలన సాగుతోందా? అంటే కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు అవుననే చెబుతున్నాయి. మంగళవారం ఏపీలో చోటు చేసుకున్న ఘటనలతో  జగన్ రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్ లో అరాచక రాజ్యం సాగుతుందనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న నేతలే టార్గెట్ గా వాళ్ల ఇండ్లపై వైసీపీ కార్యకర్తలు దాడులకు దిగారు. టీడీపీ కార్యాలయాలపైనా దాడికి పాల్పడి బీభత్సం స్పష్టించారు.  ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అధికార వైసీపీ నేతలు కార్యకర్తలు రెచ్చిపోయారు. బహిరంగంగానే దౌర్జన్యకాండకు దిగారు.  టీడీపీ కార్యాలయాలు, నేతలపై వైసీపీ శ్రేణులు దాడులకు దిగాయి. పక్కా ప్రణాళికతో టీడీపీ కార్యాలయాలు, నేతల ఇళ్లపై దాడులు చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ నేతలు దాడి చేశారు. గేట్లు నెట్టుకొని టీడీపీ కేంద్ర కార్యాలయం లోపలికి వైసీపీ శ్రేణులు వెళ్లారు. కార్యాలయంలో కనపడినవారిపై దాడి, అద్దాలు పూర్తిగా ధ్వంసం చేశారు. విశాఖ, తిరుపతి, గుంటూరులోని టీడీపీ కార్యాలయాలపైనా వైసీపీ శ్రేణులు దాడులు చేశారు.  నెల్లూరు జిల్లా టిడిపి కార్యాలయం పై వైసీపీ కార్యకర్తలు దాడికి యత్నించారు. 200 మంది మారణాయుదాలతో టిడిపి కార్యాలయం ముట్టడించారు,  అప్రమత్తం అయిన నెల్లూరు టిడిపి నాయకులు వైసీపీ కార్యకర్తలను ధీటుగా ఎదుర్కొన్నారుటీడీపీ కార్యాలయాల పై దాడిని నపుంసక చర్యగా అభివర్ణించారు టిడిపి జిల్లా అధ్యక్షుడు అజీజ్. రాష్ట్ర ప్రజల సమస్యల పై మాట్లాడటం ప్రతిపక్షం హక్కన్నారు. గంజాయి, హెరాయిన్ పై మాట్లాడితే దాడికి పాల్పడటం పిరికి పంద చర్య అన్నారు అజీజ్.  ఇక విజయవాడలో టీడీపీ నేత పట్టాభి నివాసంపై కూడా దాడి జరిగింది. అతని ఇంట్లోని పలు విలువైన వస్తువులు ధ్వంసం చేశారు. హిందూపురం లో బాల కృష్ణ ఇంటి మీద, కడప లో వైసీపీ సీనియర్ నేత అమీర్ ఇంటి మీద దాడులు జరిగాయి. విషయం తెలుసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు టీడీపీ కేంద్ర కార్యాలయానికి బయల్దేరారు. టీడీపీ కార్యాలయంపై దాడి జరగడంతో చంద్రబాబు హుటాహుటిన బయల్దేరారు. హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంటి ముట్టడికి వైసీపీ నేతల యత్నించారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి‌పై  టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి వ్యాఖ్యలను నిరసిస్తూ బాలకృష్ణ ఇంటి ముందు బైఠాయించారు. బాలకృష్ణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.  ఇక రేణిగుంటలో విద్యుత్ ఛార్జీలపై టిడిపి చేపట్టిన నిరసన ర్యాలీ రసాబసగా మారింది. ప్రశాంతంగా ర్యాలీ నిర్వహిస్తున్న టిడిపి నాయకుల పై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. టిడిపి ర్యాలీలో పాల్గొన్న తిరుపతి పార్లమెంట్ టిడిపి అధ్యక్షుడు నరసింహ యాదవ్, శ్రీకాళహస్తి టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి పై చెప్పులను విసిరారు వైసీపీ నాయకులు. చీపుర్లతో చెప్పులను టిడిపి నాయకుల పై విసిరేశారు వైసీపీ మహిళా కార్యకర్తలు. వైసీపీ కార్యకర్తలు నిలువరించడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారు. వైసీపీ కార్యకర్తల దాడులతో భయాందోళనకు గురైన వ్యాపారులు..  షాపులను మూసేశారు.

యాదాద్రిలో 10 వేల మంది ఋత్వికులతో మహాసుదర్శన యాగం..

యాదాద్రి పుణ్యక్షేత్రం పునః ప్రారంభ ముహూర్తాన్ని చినజీయర్‌స్వామి ఖరారు చేసిన నేపథ్యంలో.. ముఖ్య‌మంత్రి కె.చంద్రశేఖర్ రావు మంగ‌ళ‌వారం యాదాద్రిలో పర్యటించారు. దాదాపుగా పూర్తికావస్తున్న ఆలయ పునర్నిర్మాణ పనులను, ప్రధానాలయం, గర్భగుడిని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా పరిశీలించారు. సీఎం కేసీఆర్.. ఏరియ‌ల్ వ్యూ ద్వారా యాదాద్రి ఆల‌య అభివృద్ధి పనులతోపాటు, ప‌రిస‌రాల‌న్నింటినీ ప‌రిశీలించారు.  యాదాద్రి క్షేత్రం టెంపుల్ సిటీ దగ్గర ఏర్పాటు చేసిన హెలీపాడ్ వద్దకు ముఖ్యమంత్రి చేరుకున్నారు. అక్కడ నుంచి కాన్వాయ్‌లో ఘాట్ రోడ్డు ద్వారా ముఖ్యమంత్రి నేరుగా కొండపై బాలాలయానికి చేరుకున్నారు. అక్కడ దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, వేదపండితులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. బాలాలయంలో ప్రత్యేక  అర్చన చేసిన ముఖ్యమంత్రికి వేద పండితులు ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. అక్కడి నుంచి ముఖ్యమంత్రి వీఐపీ ప్రవేశ ద్వారం నుంచి ప్రధాన దేవాలయానికి చేరుకున్నారు. పెంబర్తి కళాకారులు తయారుచేసిన ప్రధానాలయ ద్వారాలను సీఎం ప్రత్యేకంగా పరిశీలించారు. ప్రాంగణంలోని ఆలయ ప్రాకారం వెంట ఉన్న శిల్పాల ప్రత్యేకతలను వెంట ఉన్నవారికి వివరించారు. అడుగడుగునా వ్యూ పాయింట్ల వద్ద ఆగి, అక్కడి నుంచి కనిపించే అందమైన దృశ్యాలను సీఎం కేసీఆర్ తిలకించారు.  గండి చెరువు, పుష్కరిణి, కల్యాణ కట్ట, దీక్షాపరుల మంటపం, సత్యనారాయణ వ్రత మంటపం తదితర నిర్మాణాల విశేషాల గురించి అధికారులతో చర్చించారు. జలాశయాలను ప్రత్యేకంగా రూపొందించిన తీరును సీఎం సహచర మంత్రులతో పంచుకున్నారు.   స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డిని ముఖ్యమంత్రి అభినందిస్తూ.. ‘‘ మీరు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఇంతటి ఉజ్వలమైన దేవాలయం నిర్మించడం వల్ల.. సునీతమ్మా నీ జన్మ ధన్యమైంది’’ అని  ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం వేంచేపు మంటపం వద్ద కొద్దిసేపు ఆగి పరిశీలించిన ముఖ్యమంత్రి ప్రధాన దేవాలయం గర్భాలయం వైపు చేరుకున్నారు. బంగారు వర్ణంతో శంకు, చక్ర నామాలతో ఇండోర్ లో తయారు చేయించిన క్యూలైన్లను, గర్భాలయ ద్వారాల బంగారు తాపడాలను సీఎం కేసీఆర్  పరిశీలించారు. అక్కడ మంటపంలో ఏర్పాటు చేసిన నర్సింహస్వామి కల్యాణ ఘట్టాన్ని, చిత్రించిన తంజావూరు చిత్రపటాన్ని ప్రత్యేకంగా పరిశీలించారు.  ఆలయ మంటపం చుట్టూ తాపడం చేసి ఉన్న  ప్రహ్లాద చరిత్ర ఘట్టాల విశేషాలను మంత్రివర్గ సహచరులు, ఎమ్మెల్యేలు,  టీఆర్ఎస్ నాయ‌కులు మోత్కుప‌ల్లి న‌ర్సింహులుతో పంచుకున్నారు. ఆల్వార్ మంటపం కలియదిరుగుతూ, ఒక్కో శిల్పాన్ని సీఎం ప్రత్యేకంగా పరికించారు. ధ్వజస్థంభం ఏర్పాటు కానున్న వేదికను కూడా పరిశీలించారు. పనుల పురోగతిని ఆలయ స్తపతి, ఆనంద్ సాయి ముఖ్యమంత్రికి వివరించారు. తుది పనులపై సీఎం కేసీఆర్ పలు సూచనలు చేశారు. క్యూ కాంప్లెక్స్, ఎస్కలేటర్స్, శివాలయం, విష్ణు పుష్కరిణితోపాటు, క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామి ఆలయ నిర్మాణాలను కూడా సీఎం పరిశీలించారు. ఈ సమయంలో ఆలయ అర్చకులు తమకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని కోరగా, నిర్ణయం ఎప్పుడో తీసుకున్నాం కనుక, ఇక ఎంతమాత్రం ఆలస్యం చేయక, అర్చకులకు, ఆలయ ఉద్యోగులకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని మంత్రి జగదీశ్ రెడ్డిని, కలెక్టర్ పమేలా సత్పతిని సీఎం కేసీఆర్ ఆదేశించారు. అదేవిధంగా రింగురోడ్డు నిర్మాణ సమయంలో షాపింగ్ స్థలాలు కోల్పోయిన వారికి కల్యాణ కట్ట సమీపంలో ప్రతి ఒక్కరికీ వేయి స్క్వేర్ ఫీట్ల విస్తీర్ణంలో ఉచితంగా షాపులు నిర్మించి ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. తరతరాలుగా క్షేత్రాన్ని ఆశ్రయించి బతుకుతున్న వారి బతుకుదెరువుకు ఎటువంటి భంగపాటు రానివ్వద్దని హెచ్చరించారు. అనంతరం, చినజీయర్ స్వామి స్వదస్తూరితో రాసి ఇచ్చిన ముహూర్త పత్రికను స్వామివారి పాదాల చెంత ఉంచాలని.. ఆలయ ఈఓ గీతకు ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా అందించారు.  ఆలయ ప్రధాన అర్చకులతో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. యాదాద్రిలో పది వేల మంది రుత్విక్కులతో సుదర్శన హోమం నిర్వహిస్తామని, జీయర్ స్వామి స్వయంగా పర్యవేక్షిస్తారని వివరించారు.  అనంతరం యాదాద్రిలోని రామలింగేశ్వరాలయంలో అభిషేక అర్చన చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్, వివిఐపీ గెస్ట్ హౌజ్ లో మంత్రులు, ఎమ్మెల్యేలు, తదితర ప్రముఖులతో కలిసి భోజనం చేశారు.

వ్యాక్సినేషన్ లో భారత్ బాహుబలి.. అడుగు దూరంలో వంద కోట్ల టీకాలు.. 

ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసిన,చేస్తున్న కరోనా మహమ్మారిని అణచివేసే శక్తి ఒక్క వాక్సిన్ కు మాత్రమే ఉందని ప్రపచ దేశాలన్నీ గుర్తించాయి. ఏ దేశానికి అ దేశం ఎవరి ప్రయత్నాలు చేశారు. మన శాస్త్రవేత్తలు ప్రపంచ దేశాలతో పోటీ పడ్డారు ... అంతిమ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇప్పడు మన దేశం కరోనా మహమ్మారి కోరలను అణచివేసే వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో అరుదైన రికార్డుకు అడుగు దూరంలో ఉంది.  దేశంలో ఇప్పటివరకు 99కోట్లకు పైగా వాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ఈ రోజు (మంగళవారం) తెలిపింది.ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ, మన దేశం  ‘‘వాక్సిన్ డోసుల పంపిణీలో 99కోట్ల మార్క్’ను దాటాం. 100కోట్ల డోసుల మైలురాయి దిశగా భారత్ వేగంగా కదులుతోంది’’  అని మంత్రి ట్వీట్ చేశారు.  కరోనా వైరస్‌ను అరికట్టేందుకు బృహత్తర టీకా పంపిణీ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 16న ప్రారంభించింది. తొలినాళ్లలో డోసుల కొరత, ఇతరత్రా కారణాల వల్ల నెమ్మదిగా సాగిన వ్యాక్సినేషన్‌.. కరోనా రెండో దశ నుంచి ఊపందుకుంది. ఇటీవల సెప్టెంబరు 17న మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఒక్క రోజులోనే 2.5కోట్ల మందికి టీకాలు వేసి అరుదైన రికార్డు సృష్టించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా టీకాల పంపిణీ 99కోట్లు దాటగా.. బుధవారానికి 100కోట్ల మైలురానికి చేరే అవకాశాలు కన్పిస్తున్నాయి. అదే జరిగితే చైనా తర్వాత 100కోట్ల డోసులు పంపిణీ చేసిన రెండో దేశంగా భారత్‌ అరుదైన గుర్తింపు సాధించనుంది. టీకా పంపిణీలో ఉత్తరప్రదేశ్‌ అగ్రస్థానంలో ఉంది. ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు 12కోట్లకు పైగా డోసులను పంపిణీ చేశారు. ఆ తర్వాత 9.21కోట్ల డోసుల పంపిణీతో మహారాష్ట్ర రెండో స్థానంలో నిలిచింది. పశ్చిమబెంగాల్‌, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, బిహార్‌, కర్ణాటక, రాజస్థాన్‌లలోనూ 6 కోట్లకు పైగా డోసులను పంపిణీ చేశారు.వాక్సినేషన్ వేగం పెరిగే కొద్దీ దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి క్రమంగా అదుపులోకి వస్తోంది. గత కొద్దిరోజులుగా తగ్గుముఖం పట్టిన కొత్త కేసులు.. తాజాగా 13 వేలకు పడిపోయాయి. కొత్త కేసులు 231 రోజులు, క్రియాశీల కేసులు 227 రోజుల కనిష్ఠానికి క్షీణించాయి. మరణాల సంఖ్య 200 దిగువనే నమోదైంది. మంగళవారం కేంద్ర ఆరోగ్య శాఖ ఈ గణాంకాలను విడుదల చేసింది.  సోమవారం 11,81,314 మంది కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. వారిలో 13,058 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. అంతక్రితం రోజుకంటే కొత్త కేసులు 500 మేర తగ్గాయి. నిన్న 19,470 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు 3,40,94,373 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. అందులో 3,34,58,801 మంది వైరస్‌ను జయించారు. ఇటీవల కాలం వైరస్ వ్యాప్తి అదుపులో ఉండటంతో క్రియాశీల కేసులు గణనీయంగా తగ్గుముఖం పడుతున్నాయి. ప్రస్తుతం ఆ కేసుల సంఖ్య 1,83,118గా ఉంది. క్రియాశీల రేటు 0.54 శాతానికి తగ్గగా.. రికవరీ రేటు  98.14 శాతానికి పెరిగింది. నిన్న 164 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా 4,52,454 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. 

కేటీఆర్ ఓ బచ్చా... దమ్ముంటే చర్చకు రా! రేవంత్ రెడ్డి కౌంటర్.. 

తెలంగాణ రాజకీయాలు గరంగరంగా సాగుతున్నాయి. రాజకీయ వేడి రాజేసిన హుజురాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ దగ్గర పడుతున్న కొద్ది నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. వక్తిగత దూషణలు, సవాళ్లతో హీటెక్కిస్తున్నారు లీడర్లు. తనను టార్గెట్ చేసిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కేటీఆర్ ఓ బచ్చా అన్నారు. కేటీఆర్ కు దమ్ముంటే  నవంబర్ 15 లోపు తనతో బహిరంగ చర్చకు రావాలన్నారు రేవంత్ రెడ్డి.  కేటీఆర్ అన్నింటిలోనూ  తన కంటే జూనియర్ అన్నారు రేవంత్ రెడ్డి. తాను ఒక జాతీయ పార్టీకి అధ్యక్షున్ని అయితే కేటిఆర్ ఒక ప్రాంతీయ పార్టీకి వర్కింగ్ ప్రసిడెంట్ గా ఉన్నారన్నారు. తాను  రాజకీయాల్లో జడ్పీటీసీ గా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా , ఎంపీగా పని చేశానని చెప్పారు. రాజకీయాలు, పదవులు, పార్టీలు ఎక్కడ చూసినా కేటీఆర్ తనతో సమానం కాదన్నారు రేవంత్ రెడ్డి. ఏ విషయంలో చర్చకు అయినా తాను సిద్ధమని, కేటిఆర్ కు దమ్ముంటే చర్చలకు రావాలని, మొఖం చాటేయ్యొద్దని  రేవంత్ రెడ్డి సవాల్ చేశారు.  సోమవారం మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన రేవంత్ రెడ్డి.. టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. హుజురాబాద్ ఉప ఎన్నిక తర్వాత టీఆర్ఎస్ లో తిరుగుబాటు వస్తుందన్నారు. తిరుగుబాటు వస్తుందని తెలుసు కాబట్టే ముందస్తు ఎన్నికలకు వెళ్లడం లేదని కేసీఆర్ చెబుతున్నారని అన్నారు. కాని తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఖాయమని రేవంత్ రెడ్డి చెప్పారు. గుజరాత్ తో పాటు తెలంగాణలోఅసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని కూడా చెప్పారు. బీజేపీతో కేసీఆర్ కలిసి డ్రామా చేస్తున్నారని, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా కుట్రలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి తెలిపారు.  రేవంత్ రెడ్డి కామెంట్లకు మంగళవారం కౌంటరిచ్చారు మంత్రి కేటీఆర్. హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో దమ్ముంటే కాంగ్రెస్‌ పార్టీ డిపాజిట్‌ తెచ్చుకోవాలని రేవంత్‌రెడ్డికి కేటీఆర్‌ సవాల్‌ విసిరారు. హుజూరాబాద్‌లో బీజేపీ, కాంగ్రెస్‌ కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. ఈటల రాజేందర్‌ కోసం కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థిని నిలబెట్టిందని కేటీఆర్‌ అన్నారు. హుజూరాబాద్‌లో తప్పకుండా తెరాస గెలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రేవంత్‌ చిలకజోస్యం చెప్పుకుంటే మంచిదని కేటీఆర్ ఎద్దేవా చేశారు.   

వరద విలయంలో ఉత్తరాఖండ్.. సహాయచర్యల్లో ఆర్మీ టీమ్స్ 

కుండపోత వర్షాలతో దేవభూమి ఉత్తరాఖండ్‌ విలవిలలాడుతోంది. కొద్ది రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలకు రాష్ట్రంలోని అనేక నదులు పొంగిపొర్లుతున్నాయి.  లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరద ఉద్ధృతికి పలు చోట్ల వంతెనలు కొట్టుకుపోయాయి. కొన్ని చోట్ల కొండచరియలు విరిగిపడి ఇళ్లు ధ్వంసమయ్యాయి. కుమావూన్ రీజియన్‌లో ఇళ్లు నేల మట్టమయ్యాయి. అనేకమంది శిథిలాల క్రింద చిక్కుకున్నారు. వరదల్లో ఇప్పటివరకు 16 మంది ప్రాణాలు కోల్పోయారు.    భారీ వర్షాలకు నైనిటాల్‌ జిల్లా అతలాకుతలమైంది. వరద ఉద్ధృతికి నైనిటాల్‌ సరస్సు ఉప్పొంగడంతో సమీప గ్రామాలకు వరద పోటెత్తింది. దీంతో ఇళ్లల్లోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నైనిటాల్‌‌కు వెళ్ళే దారులన్నీ దిగ్బంధనం కావడంతో మిగిలిన రాష్ట్రంతో సంబంధాలు తెగిపోయాయి. రామ్‌గఢ్‌ జిల్లాలో కొండచరియలు విరిగిపడి పలు ఇళ్లు నేలమట్టమయ్యాయి. వరద ఉద్ధృతికి పలు చోట్ల రోడ్లపై నిలిపి ఉంచిన వాహనాలు కొట్టుకుపోయాయి. హల్ద్వానీ ప్రాంతంలో గౌలా నది ఉప్పొంగడంతో ఆ నదిపై ఉన్న వంతెన కొంతమేర కొట్టుకుపోయింది. చంపావత్‌ ప్రాంతంలో చల్తీ నదికి వరద పోటెత్తడంతో నిర్మాణంలో ఉన్న వంతెన కొట్టుకుపోయింది.     వర్షాల కారణంగా కేదార్‌నాథ్‌, బద్రీనాథ్‌ యాత్రలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఆ ఆలయాలకు వెళ్తూ మార్గమధ్యంలో ఉన్న ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్టిన తర్వాతే యాత్రికులను అనుమతిస్తామని తెలిపారు. ఉత్తరాఖండ్‌లో వరద పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆరా తీశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్ ధామి, కేంద్రమంత్రి అజయ్ భట్‌లతో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి అన్నివేళలా సహాయ సహకారాలు అందిస్తామని మోదీ హామీ ఇచ్చారు.   రాష్ట్రంలోని వరద బాధితులకు సహాయపడేందుకు మూడు సైనిక హెలికాప్టర్లను పంపిస్తామని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి చెప్పారు. రెండు హెలికాప్టర్లను నైనిటాల్‌కు, ఒక హెలికాప్టర్‌ను గర్వాల్ రీజియన్‌కు పంపుతామన్నారు. వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్నవారిని ఈ హెలికాప్టర్ల సహాయంతో రక్షిస్తామని చెప్పారు. ప్రజలను సురక్షితంగా కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ఆందోళన చెందవద్దని ముఖ్యమంత్రి కోరారు. చార్‌ధామ్ యాత్రకు వెళ్ళే భక్తులు ప్రస్తుతం ఎక్కడ ఉన్నవారు అక్కడే ఉండాలని, వాతావరణ పరిస్థితి మెరుగుపడిన తర్వాత ప్రయాణాన్ని పునఃప్రారంభించవచ్చునని తెలిపారు. భారీ వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నామని చెప్పారు. ఎడతెరిపిలేని వర్షాల వల్ల రైతులు తీవ్రంగా దెబ్బతిన్నారని తెలిపారు.

కేటీఆర్‌కు రేవంత్‌రెడ్డి ట్వీట్‌.. అధికారుల క్విక్ రియాక్ష‌న్‌..

రేవంత్‌రెడ్డి. ఇప్పుడో వ్య‌క్తి కాదు శ‌క్తి. టీపీసీసీ చీఫ్‌గా కేసీఆర్ స‌ర్కారుపై యుద్ధం చేస్తున్నారు. ప్ర‌జా గొంతుక‌ను ప్ర‌భుత్వానికి గ‌ట్టిగా వినిపిస్తున్నారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై, అధికారుల‌ త‌ప్పుడు విధానాల‌పై స‌ర్కారును ఎప్ప‌టిక‌ప్పుడు ఎండ‌గ‌డుతున్నారు. తాజాగా, హైద‌రాబాద్‌లోని ఓ అక్ర‌మ నిర్మాణంపై మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేశారు రేవంత్‌రెడ్డి. క‌ట్ చేస్తే.. తెల్లారేస‌రిక‌ల్లా ఆ అక్ర‌మ బిల్డింగ్ మ‌టాష్‌. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే... ఉప్పల్‌ చౌరస్తాలో హైదరాబాద్‌కు చెందిన ఓ మంత్రి అండతో అక్రమ నిర్మాణం వెలుస్తున్నట్లు పీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి ట్విటర్‌ వేదికగా మంత్రి కేటీఆర్‌కు ఫిర్యాదు చేశారు. ఉప్పల్‌ చౌరస్తాను ఆనుకొని క‌డుతున్న అక్రమ నిర్మాణంపై ఎన్ని ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ‘మీ శాఖలో బాగోతాలు మీద చర్యలు ఉంటాయా..? లేదా మీరూ ఇందులో భాగస్వాములేనా..?’ అంటూ కేటీఆర్‌ను రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. నిర్మాణానికి సంబంధించిన వీడియోతో సహా కేటీఆర్‌కు ట్విట్ట‌ర్‌లో ఫిర్యాదు చేశారు. తెలంగాణ సీఎంఓ కార్యాలయానికి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు కూడా టాగ్‌ చేశారు. రేవంత్‌రెడ్డి ట్వీట్‌పై జీహెచ్‌ఎంసీ అధికారులు వెంట‌నే స్పందించారు. అనుమతులు లేకుండా క‌డుతున్న బిల్డింగ్‌ సెంట్రింగ్‌ నిర్మాణాన్ని కూల్చివేశారు. ఇదేదో ఫిర్యాదు చేయ‌గానే స్పందిస్తే బాగుండేదిగా.. రేవంత్‌రెడ్డి రంగంలోకి దిగితేనే ప‌న‌వుతుందా? అంటూ స్థానికులు జీహెచ్ఎమ్‌సీ అధికారుల‌పై మండిప‌డుతున్నారు. రేవంతా..మ‌జాకా.. అని చ‌ర్చించుకుంటున్నారు.   

ఇటు ఉగ్ర దాడులు.. అటు టీ20 మ్యాచ్‌లు.. మోదీపై విమ‌ర్శ‌లు..

క‌శ్మీర్‌లో పాక్ ప్రేరేపిత ఉగ్ర‌వాదులు రెచ్చిపోతున్నారు. బోర్డ‌ర్‌లో కాల్పుల‌కు స్వ‌స్తి ప‌లికి.. క‌శ్మీర్ గ్రామాల్లో తుపాకుల‌కు ప‌ని చెబుతున్నారు. సామాన్య పౌరులే టార్గెట్‌గా తూటాలు పేలుస్తున్నారు. వారి ఐడెంటిటీ క‌నుక్కొని, స్థానికేత‌రుల‌ను గుర్తించి.. ప‌క్కాగా టార్గెట్ చేస్తున్నారు. ఇక ఇటీవ‌ల ఉగ్ర‌వాదుల దాడిలో ఏకంగా ఐదుగురు భార‌త జ‌వాన్లు చ‌నిపోవ‌డం మ‌రింత క‌ల‌క‌లంగా మారింది. ఓవైపు పాకిస్తాన్ ఇంత‌లా ఉగ్ర‌దాడుల‌తో రెచ్చిపోతుంటే.. మ‌రోవైపు త్వ‌ర‌లో జ‌రిగే టీ20 క‌ప్‌లో ఆ దేశంతో క‌లిసి క్రికెట్ ఆడేందుకు టీమిండియా సిద్ధ‌మ‌వుతుండ‌టంపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఇదే అద‌నుగా ప్ర‌తిప‌క్షాలు ప్ర‌ధాని మోదీపై విరుచుకుప‌డుతున్నాయి. సరిహద్దుల్లో పాకిస్థాన్‌ చర్యల వల్ల భారత సైనికులు ప్రాణాలు కోల్పోతుంటే ఆ దేశంతో టీ20 ఆడతారా? అంటూ ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ ప్రధాని మోదీని ప్రశ్నించారు. ‘జమ్మూకశ్మీర్‌లో గత కొంతకాలంగా జరుగుతోన్న ఉగ్ర దాడుల్లో ఇప్పటివరకు తొమ్మిది మంది సైనికులు అమరులయ్యారు. భారత పౌరుల జీవితాలతో పాకిస్థాన్‌ నిత్యం 20-20 ఆడుతోంది. ఇలాంటి సమయంలో అక్టోబర్‌ 24న పాకిస్థాన్‌తో భారత్‌ టీ20 మ్యాచ్‌ ఆడబోతోంది. సైనికులు మరణిస్తున్నా పాకిస్థాన్‌తో టీ20 ఆడతారా?’ అని ఒవైసీ నిల‌దీశారు.   

గెలుపోటములు సహజమేనట.. హుజురాబాద్ లో కేటీఆర్ హ్యాండ్సప్? 

ముఖ్యమంత్రి కేసీఆర్  మాటల్లో జోష్ తగ్గింది. దుబ్బాక ఉప ఎన్నికకు ముందు ఆయన మాటల్లో వినిపించిన బేలతనం.. మోత్కుపల్లి నరసింహులు పార్టీలో చేరిన సమయంలో  ఆయన చేసిన ప్రసంగంలో కనిపించింది.  ఆయన ప్రతి మాటలో ప్రతి పలుకులో, ప్రతి వంపులో  ఏదో భయం తొంగి చూసింది. ముఖ్యంగా హుజూరాబాద్ ప్రస్తావన వచ్చిన ప్రతి సందర్భంలో చివరకు  హుజూరాబాద్ లో మనమే గెలుస్తున్నాం  అని చెప్పే సందర్భంలోనూ ముఖ్యమంత్రి మాటల్లో ఓటమి భయం పస్పుటంగా కనిపించిందని ఎవరో కాదు సొంత పార్టీ నాయకులే అంటున్నారు.  ఇతర విషయాల సంగతి ఎలా ఉన్నా  హుజూరాబాద్ విషయంలో ముఖ్యమంత్రి ఒక నిర్ణయానికి వచ్చారు.. డిసైడైపోయారు అనే మాట పార్టీ నాయకుల మాటల్లోనే వినవస్తోంది. రేవంత్ రెడ్డి పిచ్చాపాటికి జవాబుగా, మీడియాతో ముచ్చట్లు పెట్టిన తె మంత్రి కేటీఅర్ చాలా చాలా విషయాలు చెప్పారు. గొప్పలు చెప్పుకున్నారు. మా పథకాలను కేంద్రం అనుకరించి అమలు చేస్తోందన్నారు.హుజురాబాద్ లో వంద శాతం విజయం సాధిస్తున్నాం అన్నారు.. నాగార్జున సాగర్ లో జానారెడ్డినే ఓడించాం.. రాజేందర్ అంతకన్నా  పెద్ద లీడరా అంటూ ఎగ సెక్కాలాడారు. అయితే దుబ్బాకలో ఎందుకు ఓడిపోయామో మాత్రం  చెప్పలేదనుకోండి. అయితే  చాంతాడంత రాగం తీసి అదేదో పాటపడినట్లుగా  చివరాఖరులో, హుజూరాబాద్’లో ఓడిపొతే ఓడి పోతాం’ అని అర్థం వచ్చేలా’ఎన్నికలలో గెలుపు ఓటములు సహజమే అంటూ తత్వబోధనకు దిగారు కేటీఆర్.   ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజం అనేది ఇపుడు కొత్తగా కేటీఆర్ కనుగొన్న సత్యం కాదు. అందరికీ తెలిసిన, అందరి అనుభవంలో ఉన్న వాస్తవమే. అయినా, ఇప్పుడు ఆయన ఆ విషయాన్ని ప్రత్యేకించి చెప్పుకున్నారంటే హుజూరాబాద్ ఓటమికి కేటీఆర్ సిద్దమైపోయారని అనుకోవచ్చును అంటున్నారు.  నిజానికి కేటీఆర్ హుజూరాబాద్ లో తెరాస ఓటమినే కోరుకుంటున్నారా అన్న అనుమానాలు కూడా ఇప్పుడు పార్టీలోని  కొందరు నాయకులు వ్యక్తపరుస్తున్నారు. సుమారు నాలుగు నెలలకు పైగా హుజూరాబాద్ చుట్టూనే రాజకీయాలు నడుస్తున్నా కేటీఆర్ ఇంతవరకు అటుకేసి కన్నెత్తి చూడలేదు. అంతే కాదు హుజూరాబాద్ ఉపఎన్నికకు పార్టీ అనవసర ప్రాధాన్యత ఇస్తోందని, పరోక్షంగా హరీష్ రావును దెప్పిపొడిచారు.  అనేక ఉప ఎన్నికల్లో హుజూరాబాద్ ఒకటి, అంటూ తమ చేతికి రేపటి ఓటమి తడి అంటకుండా ముందు నుంచి జాగ్రత్త పడుతూ వస్తున్నారని అంటున్నారు, ఇప్పుడు తాజాగా మళ్ళీ అదే మాటన్నారు. హుజురాబాద్ ఖచ్చితంగా చిన్న ఎన్నికే అన్నారు ..అదే సమయంలో, రాష్ట్ర ప్రజల ఆలోచనకు హుజురాబాద్ ఉప ఎన్నిక కచ్చితంగా ప్రతిబింబమే అన్నారు. అంటే, గెలిస్తే, తమ ఖాతాలో వేసుకుని, ఓడి పోతే సర్వం తానై హుజూరాబాద్ పులి మీద స్వారీ చేస్తున్న హరీష్ రావును బోనులో నిలిపేందుకు వ్యూహాత్మకంగా చిట్ చాట్ చేశారు అంటున్నారు. హుజూరాబాద్ స్టార్ క్యాంపైనర్ జాబితాలో, రెండో స్థానంలో ఉన్న కేటీఆర్, తానూ హుజూరాబాద్ ప్రచారానికి వెళ్ళడం లేదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి వెళ్ళేది కూడా అనుమానమే అన్నట్లుగా సీఎం ప్రచారం కూడా ఇంకా ఖరారు కాలేదని కేటీఆర్ చెప్పారు. అయితే, తాను గతంలో గెలిచినా నాగార్జున సాగర్ ఉపఎన్నిక ప్రచారానికి కానీ, ఓడిపోయిన  దుబ్బాక కు కూడా వెళ్ళలేదని చెప్పు కొచ్చారు. అలాగే, రేవంత్ ఈటల తదితరులు తెరాసపై కుట్రకు తెరలేపారు.. ఓ కాంగ్రెస్ మాజీ ఎంపీ ఈటెలకు ఓటయ్యాలని లేఖ రాయడం ఏమిటీ అంటూ ఓటమీ తధ్యం అనే ధోరణిలో మాట్లాడారు. మొత్తానికి సోమవారం కేసీఆర్ , మంగళవారం కేసీఆర్ పలికిన పలుకులను పక్క పక్కన పెట్టి చూస్తే.. హుజూరాబాద్ వషయంలో తెరాస నాయక ద్వయం ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లుందని పరిశీలకులు భావిస్తున్నారు.   

కేసీఆర్ కోరుకున్నదే సీఈసీ చేసిందా?దళిత బంధుపై రాజకీయ రగడా? 

మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు కారెక్కారు. హుజూరాబాద్ లో దళిత బందుకు బ్రేక్ పడింది. ఉపఎన్నిక అయ్యేంత వరకు హుజురాబాద్ లో దళిత బంధు పథకం అమలు చేయవద్దని కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. ఇది యాదృచ్చికమే కావచ్చును.. కానీ ఆయనంటే గిట్టని వాళ్ళు, అది ఆయన పాద మహిమ అంటే అనవచ్చును. అయితే కేసీఆర్ కోరుకున్నదే కేంద్ర ఎన్నికలసంఘం కరుణించింది అనే మాట కూడా వినిపిస్తోంది.  ముఖ్యమంత్రి కేసీఆర్ ఏది చేసినా పక్కా ప్రణాలికతో చేస్తారు. ముందస్తు వ్యూహం ఎంత పటిష్టంగా ఉంటుందో ... వెంక నుంచి పొడిచే వెన్ను పోటు కుట్ర కూడా అంతే పదునుగా ఉంటుందంటారు. అదీ, ఇదీ  ఒకేసారి అమలు చేయడంలో కేసీఆర్ కి కేసీఆరే సారి కాదంటే కేటీఆర్ అని కూడా పార్టీ క్యారిడార్లలో వినిపిస్తూ ఉంటుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వైఫల్యం వల్లనే కేంద్ర ఎన్నికల సంఘం  దళిత బంధు పథకం నిలిపివేసిందని ఆరోపించారు. ఏదో విధంగా దళిత బంధు పథకాన్ని నిలిపివేయించి, ఇతరులపై నెపాన్ని నెట్టాలని కేసీఆర్‌ కుట్ర చేశారని ఆరోపించారు. దళితులను మరోసారి మోసం చేసినందుకు ఆయన తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. దళిత బంధు డబ్బులను లబ్ధిదారుల అకౌంట్‌లో వేస్తూనే.. వాటిని డ్రా చేసుకోకుండా ఫ్రీజ్‌ చేయించారని అన్నారు.  దళిత బంధుకు బ్రేకేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం  తీసుకున్న నిర్ణయం పై కారు, కమలం మధ్య జగడం నడుస్తోంది. హుజూరాబాద్‌ నియోజకవర్గంలో బీజేపీ, టీఆర్‌ఎస్‌ మధ్య గొడవ మొదలైంది.  దళిత బంధు అమలును బీజేపీయే నిలిపివేయించిందని ఆరోపిస్తూ ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ బండ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్‌ నాయకులు సోమవారం రాత్రి హుజూరాబాద్‌ పట్టణంలోని అంబేద్కర్‌ చౌరస్తా వద్ద ఈటల రాజేందర్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం బీజేపీ నాయకులు సీఎం కేసీఆర్‌ దిష్టిబొమ్మను దహం చేస్తుండగా టీఆర్‌ఎస్‌ నాయకులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. బీజేపీ నేతలు ఫిర్యాదు చేయడం వల్లే ఎన్నికల కమిషన్‌ దళిత బంధు  పథకాన్ని నిలిపివేసిందని ఆరోపించారు. ఆ పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్‌, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ల దిష్టిబొమ్మలను దహనం చేశారు. ప్రధాని నరేంద్రమోదీ జోక్యం చేసుకొని పథకాన్ని యథావిధిగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. లేదంటే దళితవాడల్లోకి బీజేపీ నేతలను రానివ్వబోమని హెచ్చరించారు.  బీజేపీ లేఖ వల్లనే దళితబంధు పథకం నిలిచిపోయిందని టీఆర్ఎస్ ప్రచారం చేస్తోందని బీజేపీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి మండిపడ్డారు. దళిత బంధు పథకం అమలుపై టీఆర్ఎస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ఈనెల 7న కేంద్ర ఎన్నికల సంఘానికి రాసిన లేఖను విడుదల చేశారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్, హుజురాబాద్ ఎన్నికల రిటర్నింగ్ అధికారిని బదిలీ చేయాలని లేఖలో పేర్కొన్నట్లు చెప్పారు. దళితబంధు లబ్ధిదారులను గుర్తించినప్పటికీ వాళ్ళ ఖాతాలో కావాలనే నగదు జమ చేయటంలేదని ఆరోపించారు. ఎన్నికలకు రెండు, మూడు రోజుల ముందు దళితబంధు నిధులను లబ్ధిదారుల ఖాతాలో జమ చేయాలని అధికార పార్టీ  ప్రయత్నాలు చేస్తోందన్నారు.  అయితే, దళిత బందు విషయంలో మొదటినుంచి దళితులలో ఉన్ననుమానాలను ఎన్నికల సంఘం నిజం చేసింది.ఇక ఈ పరిస్థితులలో హుజురాబాద్ లో దళితులు ఎటు మొగ్గుతారు, ఎవరికి ఓటేస్తారు.. చూడవలసి వుంది...