తొడగొట్టిన బాలయ్య.. సీమ హక్కుల కోసం హర్యానా తరహా ఉద్యమం! 

సినీ హీరో, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తొడగొట్టారు. సినిమాల్లో ఆయన తొడ గొట్టడం కామనే. కాని ఈసారి ఆయన తొడగొట్టింది జనం కోసం, జనం సమస్యల కోసం. తొడగొట్టడమే కాదు హర్యానా తరహా ఉద్యమానికి సిద్ధమని ప్రకటించారు. ఇంతకీ బాలయ్య ఉద్యమం చేయబోయేది దేని కోసమే తెలుసా... నీటి కోసం. రాయలసీమకు కృష్ణా జలాల కోసం. రాయలసీమకు నికర జలాల కోసం.  కృష్ణా జలాల్లో వాటా కోసం, ప్రాజెక్టులు కేంద్రం పరిధిలోకి వెళ్లడంపై కొన్ని రోజులుగా రాయలసీమలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఏపీలో ప్రాజెక్టులకు సంబంధించి కేంద్రం ఇచ్చిన గెజిట్ పై సీమ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాయలసీమ నీటి ప్రాజెక్టుల భవిష్యత్తుపై టీడీపీ నేతలు సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సదస్సుకు హిందూపురం ఎమ్మెల్యే హోదాలో నందమూరి బాలకృష్ణ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాయలసీమ నీటి కోసం అవసరమైతే ఢిల్లీ వెళ్లి పోరాటం చేద్దామని అన్నారు బాలకృష్ణ. హర్యానా తరహాలో ఢిల్లీలో ఉద్యమం చేపట్టాలని తెలిపారు. ఒకప్పుడు రతనాల సీమగా ఉన్న రాయలసీమ నేడు నిర్లక్ష్యానికి గురైందని బాలయ్య ఆరోపించారు. రాయలసీమకు మిగులు జలాలు కాదని, నికర జలాలు ఇవ్వాలని బాలకృష్ణ స్పష్టం చేశారు.నాడు రాయలసీమ అభివృద్ధికి ఎన్టీఆర్ ఎంతో కృషి చేశారని, సీమ కోసం హంద్రీనీవా తీసుకువచ్చారని బాలకృష్ణ  వివరించారు. కానీ హంద్రీనీవా ద్వారా నీళ్లిచ్చే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదని విమర్శించారు. చెరువులకు పుష్కలంగా నీరు అందించడంలేదని పేర్కొన్నారు. 14 వందల చెరువులుగా ఉండగా.. కేవలం 3 వందల చెరువులకు మాత్రమే జలాలు విడుదల చేశార్ననారు. పైగా కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతున్నారని బాలకృష్ణ మండిపడ్డారు. 

బుడ్డోడి రిప్లయికి ఎస్సై ఫిదా.. దుర్గమ్మ యాత్రకు డీజే కు లైన్ క్లియర్

ఎంత రాజకీయ నాయకులైనా ఆఖరుకు ఎంతోకొంత భయపడేది మాత్రం కచ్చితంగా పోలీసులకే. వంగివంగి సలాములు కొట్టే పోలీసులంటే రాజకీయ నేతలకు చులకన భావం ఉంటే ఉండొొచ్చు. కానీ నాలుగో సింహం గర్జిస్తే మాత్రం ఎవరైనా బెదిరిపోవాల్సిందే. రాజకీయ మిత్రుడైనా, అరాచక శత్రువైనా  సరే.. పోలీసులు పక్కనుంటేనే పార్టీలకు కొండంత అండ. అందుకే కేసీఆర్ అధికారంలోకి రాగానే ముందుగా సంతోషపెట్టింది పోలీసుల్ని మాత్రమే. అలాంటి ఓ పోలీసాఫీసరుకు ఆరేళ్ల పిల్లగాడు ఎదురునిలిచి సవాల్ చేయడం.. ఏమైనా జరిగితే తరువాత చూసుకుందాం అని చెప్పడం.. ముందుగా అమ్మవారి ముందు డీజే కు అనుమతించాలని సూచించడం విస్తుగొలిపే అంశాలు. స్వయానా అక్కడున్న పోలీసాఫీసరు కూడా బుడ్డోడు ఇచ్చిన జవాబులకు, చేసిన సూచనలకు శభాష్ అంటూ భుజం తట్టాడు.. ఆ ఎస్సై. దసరా నవరాత్రుల సందర్భంగా ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా పరిసరాల్లో పెద్దఎత్తున అమ్మవారి విగ్రహాలు ప్రతిష్టించారు. ఎంతో నిష్టగా నవరాత్రులకు ఏర్పాట్లు  చేసుకున్నారు. సాధారణంగా గణేశ్ నవరాత్రులైనా, దేవీ నవరాత్రులైనా పెద్దల కన్నా ఎక్కువగా పిల్లలే పూర్తి సమయం కేటాయిస్తారు. రకరకాల బాధ్యతలు తీసుకొని కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరిగేలా చూస్తారు. ఒకరకంగా చెప్పాలంటే పెద్దలది పెత్తనం అన్నట్టుగానే ఉంటుంది. కానీ అసలు పనిభారం అంతా కూడా యువకులు, పిల్లలే మోస్తారు. ఈ స్టోరీలో కనిపిస్తున్న ఇమేజ్ ను పరిశీలించినా కూడా పిల్లల చొరవతోనే ఆ కార్యక్రమం పూర్తయినట్టు కనిపిస్తుంది. అయితే నవరాత్రుల సందర్భంగా పోలీసులు నియమాలు కఠినంగా అమలు చేశారు. అటు కోవిడ్ నిబంధనలు కూడా కట్టుదిట్టంగా అమలు చేశారు. అయితే రూల్స్ పేరుతో కాస్త ఎక్స్ ట్రా చేయడం పోలీసులకు కొత్తేమీ కాదు.. గతంలో చాలా సందర్భాల్లో పోలీసుల ఓవరాక్షన్ చూశాం. గతేడాది హైదరాబాద్ లో వర్షాల కారణంగా సిటీ అంతా అతలాకుతలమైపోయింది. ఆ సమయంలో తమ అపార్టుమెంట్లలో కొందరు మహిళలు బతుకమ్మ  ఆడుకోవడానికి సమాయత్తమవుతుండగా ఓ ఎస్సై బతుకమ్మ ఆడరాదంటూ రూల్స్ ను బయటకు లాగాడు. దీంతో అక్కడి మహిళలు పోలీసులతో వాదనకు దిగారు. కచ్చితంగా తాము బతుకమ్మ ఆడి తీరుతామంటూ అక్కడి మహిళలు భీష్మించుక్కూర్చున్నారు. దీంతో పోలీసులు వెనుకడుగు వేయాల్సి వచ్చింది.  అలాగే కృష్ణా జిల్లాలోని ఓ గ్రామంలో కూడా బతుకమ్మ ఆడేందుకు ఏర్పాట్లు చేసుకోగా... స్థానిక సీఐ వచ్చి అక్కడి నుంచి బతుకమ్మలను లేపేయించాడు. ఇకముందు ఎవరైనా బతుకమ్మలు ఆడినట్లు తెలిసిందో మీకు మామూలుగా ఉండదు అంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఇటీవల గణేశ్ నవరాత్రులు కూడా సొంతిళ్లకే పరిమితం చేసుకోవాలని, వీధుల్లో, కూడళ్లలో పెట్టడానికి వీల్లేదని ప్రభుత్వం నిబంధనలు విధించింది. అయితే ప్రజల నుంచి తీవ్రమైన ఒత్తిడి, విమర్శలు రావడంతో కోర్టు జోక్యం చేసుకున్న కారణంగా గణేశ్ నవరాత్రులకు ఆటంకాలు తొలగిపోయాయి. ఇక తాజాగా కూడా నిబంధనల్లో భాగంగా డీజేలు వాడరాదని, నిమజ్జనం నిశ్శబ్దంగా చేసుకోవాలని హైదరాబాద్ లోని అన్ని కమిషనరేట్లు కూడా రూల్స్ ఫ్రేమ్ చేశాయి. రాత్రి 10 దాటితే డీజేలు ఆపాల్సిందే. లేకపోతే న్యూసెన్స్ కింద కేసులు బుక్ చేస్తామని పోలీసులు హెచ్చరించారు.  ఆ నిబంధనల ప్రకారమే సంబంధిత ఎస్సై కూడా దుర్గా నవరాత్రులు జరుగుతున్న ప్రదేశానికి వచ్చి డీజేలు ఆపాలంటూ నిర్వాహకులను ఒత్తిడి చేశారు. ఏం చెప్పాలో తెలియని పెద్దలంతా సైలెంట్ గా ఉన్న సందర్భంలో ఆరేళ్ల కుర్రాడు మాత్రం ధైర్యంగా ముందుకొచ్చి సముదాయించడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. DJ ఎందుకు పెట్టొద్దు సర్. మా దుర్గమ్మవారి ఊరేగింపుకు  DJ ఎందుకు పెట్టొద్దు... అంటూ SIని ప్రశ్నించాడు. ఏమన్నా ఉంటే రేపు చూసుకుందాం.. ఇప్పుడైతే DJ పెడుతాం.. అంటూ అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆ బుడ్డోడు తీసుకున్న చొరవకు ఎస్సై మంత్రముగ్ధుడైపోయాడు. ఆ అబ్బాయి చూపిన ధైర్యానికి ముచ్చటపడ్డాడు. ఎంతో ప్రోత్సాహంగా భజం తట్టాడు. దీంతో డీజేకు అనధికారికంగా గ్రీన్ సిగ్నల్ పడిపోయి అమ్మవారి ఊరేగింపు అంగరంగ వైభవంగా ముందుకు సాగిపోయింది.  ఏ ఇతర సంప్రదాయాల పండుగలకు గుర్తురాని నిబంధనలు హిందువుల పండుగకే గుర్తుకొస్తాయని, అయినా ఏ హిందూ నాయకుడికి కూడా ప్రశ్నించే సాహసం లేదని, ఈ ఆరేళ్ల బుడ్డోడు మాత్రం ఎందరో పెద్దలకు స్ఫూర్తిప్రదాతగా నిలిచాడని పలువురు హిందూ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.

క‌ర్నె ప్ర‌భాక‌ర్‌కు షాక్‌.. పార్టీ నుంచి గెంటేసిన‌ట్టేనా?

క‌ర్నె ప్ర‌భాక‌ర్‌. టీఆర్ఎస్ మౌత్‌పీస్‌. మాజీ ఎమ్మెల్సీ. మీడియాలో పార్టీ వాయిస్‌ను గ‌ట్టిగా వినిపించే లీడ‌ర్‌. ప్ర‌తిప‌క్షాల‌ను ఎండ‌గ‌ట్టే పార్టీ స్పోక్ ప‌ర్స‌న్‌. అలాంటి క‌ర్నె గొంతు కొన్నాళ్లుగా మూగ‌బోయింది. పార్టీ స‌మావేశాల్లో కానీ, మీడియా చ‌ర్చ‌ల్లో కానీ ప్ర‌భాక‌ర్ క‌నిపించ‌డం లేదు..వినిపించ‌డం లేదు. క‌ర్నె ప్ర‌భాక‌ర్‌ను కేసీఆర్ ప‌క్క‌న పెట్టేశారంటూ ప్ర‌చారం జ‌రిగింది. అందుకు బ‌ల‌మైన కార‌ణం కూడా ఉందన్నారు. ముఖ్య‌మంత్రి మాజీ పీఆర్వో విజ‌య్‌కుమార్‌ పార్టీ, ప్ర‌భుత్వ అంత‌ర్గ‌త స‌మాచారాన్ని లీక్ చేస్తున్నార‌నే ఆరోప‌ణ‌ల‌తో ఆయ‌న‌పై వేటు వేసిన విష‌యం తెలిసిందే. ఆ కోవ‌లోనే క‌ర్నె ప్ర‌భాక‌ర్ సైతం పాల‌సీ మేట‌ర్స్ ప్ర‌త్య‌ర్థుల‌కు రివీల్ చేస్తున్నార‌నే అనుమానంతో ఆయ‌న్ను కేసీఆర్ సైడ్ చేశార‌ని అన్నారు. చాలాకాలంగా పార్టీతో ఆయ‌న‌, ఆయ‌న‌తో పార్టీ.. ట‌చ్ మీ నాట్ అన్న‌ట్టు ఉంటున్నారు. క‌ర్నెకు  బీజేపీ గాలం వేసింద‌ని కొంద‌రు.. కాదు కాదు కాంగ్రెస్ వైపు చూస్తున్నార‌ని ఇంకొంద‌రు.. ఇలా గుస‌గుస‌లు న‌డుస్తున్నాయి. కార‌ణం ఏదైనా క‌ర్నె ప్ర‌భాక‌ర్ కొన్ని నెల‌లుగా కారు పార్టీకి దూరంగా ఉన్నార‌నేది మాత్రం వాస్త‌వం. కానీ, ఇప్పుడిప్పుడే మ‌ళ్లీ కేటీఆర్ ద్వారా పార్టీ లైన్‌లోకి వ‌చ్చే ప్ర‌య‌త్నాలు చేస్తున్న క‌ర్నెకు మ‌ళ్లీ అనుకోని షాక్ త‌గిలింది. తాజాగా.. మాజీ ఎమ్మెల్సీ క‌ర్నె ప్ర‌భాక‌ర్‌కు తెలంగాణ భ‌వ‌న్‌లో తీవ్ర అవ‌మానం జ‌రిగింది. తెలంగాణ భవన్ గేటు దగ్గర కర్నెను పోలీసులు అడ్డుకున్నారు. ఆయ‌నకు టీఆర్ఎస్ భ‌వ‌న్‌లోకి అనుమతి లేదని పోలీసులు తేల్చి చెప్పారు. అదేంటి.. తాను టీఆర్ఎస్ ప్లీనరీ మీడియా కోఆర్డినేటర్‌గా ఉన్నానంటూ కర్నె ప్రభాకర్ పోలీసుల‌తో చెప్పిన ప్ర‌యోజ‌నం లేకుండా పోయింది. ఆహ్వానితుల జాబితాలో క‌ర్నె పేరు లేదంటూ పోలీల‌సులు ఆయ‌న్ను తిప్పిపంపించేశారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే టీఆర్ఎస్‌ఎల్పీ సమావేశం సంద‌ర్భంగా కర్నె ప్ర‌భాక‌ర్‌కు ఇలాంటి చేదు అనుభ‌వం ఎదురైంది.  ఇది అనుకోకుండా జ‌రిగిన ఘ‌ట‌నా?  లేక‌, నిజంగానే క‌ర్నెను పార్టీ ఆఫీసులోకి రానీయ‌కుండా అడ్డుకున్నారా? అనే చ‌ర్చ‌ జ‌రుగుతోంది. గ‌తంలో టీఆర్ఎస్‌కు చెందిన‌ రాజ్య‌స‌భ స‌భ్యుడు డి.శ్రీనివాస్‌ను సైతం ఇలానే అవ‌మానించి వెన‌క్కి పంపించారు. ప‌రోక్షంగా డీఎస్‌ను పార్టీ నుంచి వెలివేశారు. సేమ్ టు సేమ్ డీఎస్‌లానే క‌ర్నె ప్ర‌భాక‌ర్‌కు సైతం పార్టీ ఆఫీసులోకి నో ఎంట్రీ అని ముఖం మీదే చెప్పేసి.. ఇక నీ దారి నువ్వు చూసుకో అనేలా ఇన్‌డైరెక్ట్ మెసేజ్ ఇచ్చేశార‌ని అంటున్నారు. క‌ర్నె ప్ర‌భాక‌ర్ కొంత‌కాలంగా టీఆర్ఎస్‌కు దూరంగా ఉంటూ.. వేరే పార్టీలతో ట‌చ్‌లో ఉంటున్నార‌నే సమాచారం మేర‌కే.. గులాబీ బాస్ ఆయ‌న‌పై క‌న్నెర్ర చేసిన‌ట్టు తెలుస్తోంది. తాజా ప‌రిణామంతో ఇక క‌ర్నె ప్ర‌భాక‌ర్ కారు పార్టీని విడిన‌ట్టేనంటున్నారు. బీజేపీ.. కాంగ్రెస్‌.. రెండింటిలో ఏ పార్టీ కండువా క‌ప్పుకుంటారో అనేది ఆస‌క్తిక‌రంగా మారింది.   

కల్యాణలక్ష్మినీ వదలని పందికొక్కులు.. విజిలెన్స్ రిపోర్టులో కళ్లు చెదిరే నిజాలు

హుజూరాబాద్ ఉపఎన్నికలో బీజేపీ దూకుడుకు కళ్లెం వేద్దామనుకుంటున్న తరుణంలోనే కేసీఆర్ కు దిమ్మతిరిగే రిపోర్టు ఒకటి బయటికొచ్చింది. తెలంగాణ ప్రజలకు కేసీఆర్ ను బాగా చేరువ చేసిన పథకాలల్లో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చాలా ముఖ్యమైనవిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ పథకాలతోనే కేసీఆర్ కు పేదప్రజల ఇంటి పెద్దకొడుకు అన్న పేరొచ్చింది. హిందువులకు కల్యాణలక్ష్మి, ముస్లింలకు షాదీముబారక్ పేరుతో ఈడొచ్చిన పేదింటి ఆడపిల్లల పెళ్లి ఖర్చుల కోసం రూ. లక్ష ప్రభుత్వం సాయం చేస్తోంది. కేసీఆర్ మానసపుత్రిక లాంటి ఈ పథకానికే కన్నం పడుతోంది. దీనిపై విజిలెన్స్ అధికారులు ప్రిపేర్ చేసిన ఓ రిపోర్టు తాజాగా ప్రభుత్వానికి చేరింది. ఆ రిపోర్టు చూశాక కంగు తినడం ప్రభుత్వ ఉన్నతాధికారుల వంతయింది.  పేదల పెళ్లిళ్లకు సాయం చేసే చిన్నమొత్తాలకు కూడా భారీ మొత్తంలో కన్నాలు వేస్తూ ఒక్కో లబ్ధిదారుని నుంచి రూ. వెయ్యి నుంచి రూ. 10 వేల దాకా లంచాలు పుచ్చుకొని ప్రభుత్వ సాయపు సొమ్మును రిలీజ్ చేస్తున్నట్టు అత్యంత విశ్వసనీయ సమాచారం. రాష్ట్రంలోని దాదాపు 10 జిల్లాల్లో క్షేత్రస్థాయిలో జరిగిన విజిలెన్స్ పరిశోధన తరువాత ఈ మేరకు పూర్తి రిపోర్టు ప్రభుత్వానికి నివేదించారు. అందులో ఒక్కరో ఇద్దరో కాదు.. ఏకంగా 40 మందికి పైగా ఎమ్మార్వోలు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ సొమ్ము నుంచి భాగం పంచుకుంటున్నారని గుర్తించారు. పరిశోధించిన పది జిల్లాల్లోనే 40కి పైగా కక్కుర్తి ఎమ్మార్వోల సంగతి బయటపడిందంటే రాష్ట్రం యావత్తులో విజిలెన్స్ దాడులు నిర్వహిస్తే ఇంకెంతమంది అధికారుల గుట్టురట్టవుతుందోనన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.  ఒక్క ఎమ్మార్వోలే కాదు.. అధికార పార్టీ నాయకులు, మిత్రపక్షమైన ఎంఐఎం పార్టీ లీడర్లకు కూడా ఈ ఆమ్యామ్యాల షేరింగ్ లో భాగం ఉందని విజిలెన్స్ అధికారులు నివేదించారు.  క్షేత్రస్థాయిలో టీఆర్ఎస్, ఎంఐఎం లీడర్లు, వారి అనుచరులు, మీసేవా కేంద్రాల నిర్వాహకులు, తహశీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది, మరికొందరు బ్రోకర్లు కలసి అక్రమాలకు పాల్పడినట్లు విజిలెన్స్ విచారణలో నిగ్గు తేలింది. అనర్హులకు డబ్బులు చెల్లించి వారి వద్ద నుంచి లంచాలు తీసుకున్నట్లు గుర్తించారు. ఆదిలాబాద్ ఆర్డీవో ఆఫీసులో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న ఓ వ్యక్తి కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకం దరఖాస్తుల ప్రక్రయలో దాదాపు 90 లక్షల మొత్తం దుర్వినియోగానికి పాల్పడ్డట్లు విశ్వసనీయ సమాచారం. ఈ ఘటనలో గుడిహత్నూర్ పోలీస్ స్టేషన్ లో నిందితునిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ కూడా చేయడం గమనించాల్సిన అంశం.  ఇక వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగర్ తాహశీల్దార్ ఆఫీసు కేంద్రంగా కూడా అవినీతి జరిగింది. ఇందుకోసం సదరు ముఖ్యాధికారి కొందరు ప్రజా ప్రతినిధులను, ఇతరులను బ్రోకర్లుగా నియమించుకుని వసూళ్లకు పాల్పడినట్లు విజిలెన్స్ అధికారులు నివేదించారు. ఇందులో ఓ మాజీ ఎంపీపీ, ఓ సర్పంచ్, మరో ముఖ్యమైన స్థానిక  వ్యక్తి ప్రమేయమున్నట్లు  నిర్ధారించారు. ఇదే తరహాలో వరంగల్ అర్బన్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, నల్లగొండ, సూర్యాపేట, ఆదిలాబాద్, నాగర్ కర్నూల్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన 40 మందికి పైగా రెవెన్యూ అధికారులు, ఇతర సిబ్బంది అంతా కలిసి పెళ్లి పథకాల లబ్దిదారుల దరఖాస్తు ప్రక్రియలోనే లంచాలకు పాల్పడ్డారు.  దరఖాస్తుదారుల నుంచి రూ. వెయ్యి నుంచి పది వేల వరకు వసూళ్లు చేశారు. తహశీల్దార్లతో పాటు డిప్యూటీ తహశీల్దార్లు, వీఆర్వోలు, వీఆర్ఏల ప్రమేయం ఉన్నట్లు విజిలెన్స్ విభాగం ప్రభుత్వానికి నివేదించింది.  ఈ నివేదిక కోసం విజిలెన్స్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశోధన మొదలుపెట్టినప్పటి నుంచే పలువురు తహశీల్దార్ల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. జనగామ జిల్లాలో జనగామతో పాటు స్టేషన్ ఘన్ పూర్, నర్మెట, తరిగొప్పుల, భూపాలపల్లి జిల్లాలో భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలోని మహబూబాబాద్, గూడూర్, కేసముద్రం నల్గొండ జిల్లాలోని త్రిపురారం, నిడమనూరు, తిరుమలగిరి, దామరచర్ల, మిర్యాలగూడ, వేములపల్లి, నక్రేకల్, కేతపల్లి వంటి కేంద్రాల్లో రెవిన్యూ అధికారులు ఆందోళనకు గురవుతున్నారు. అంతేకాదు.. సూర్యాపేట, ఆదిలాబాద్, నాగర్ కర్నూలు, నిజామాబాద్ జిల్లాల నుంచి అనేక మండలాల్లో ఇలాంటి అక్రమాలు జరిగినట్లు, జరుగుతున్నట్టు ఆధారాలతో సహా ప్రభుత్వానికి నివేదిక అందింది.  కేసీఆర్ ముందుగా ప్రక్షాళించాలనుకున్న విభాగాల్లో ముందువరుసలో ఉన్నది రెవిన్యూ విభాగమే కావడం గమనించాల్సిన అంశం. అయితే అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయారెడ్డి సజీవ దహనం తరువాత రెవెన్యూ అధికారుల తీరు మారుతుందని అంతా అనుకున్నారు. కానీ వాళ్ల పద్ధతి ఏమాత్రం మారకపోగా మరింత దిగజారినట్లు ఈ నివేదికలే తేల్చిచెబుతున్నాయి. రెవిన్యూ విభాగాన్ని సమూలంగా ప్రక్షాళించాలనుకున్న సందర్భంలో కూడా రెవిన్యూ అధికారుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత రావడమే గాక ప్రభుత్వం చేతగానితనం కూడా పెద్దఎత్తున ఎక్స్ పోజ్ అయింది. దీంతో కేసీఆర్ ఆచితూచి అడుగులు వేశారు. కానీ ఇప్పుడు కింది స్థాయి ఉద్యోగులతో కుమ్మక్కై తహశీల్దార్లు షాదీముబారక్, కల్యాణలక్ష్మి వంటి చిన్నస్థాయి లబ్ధిదారుల సొమ్ములకే ఎసరు పెడుతున్నట్టు నిగ్గు తేలడంతో ప్రభుత్వం చాలా తీవ్రమైన చర్యలే తీసుకుంటుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరోవైపు హుజూరాబాద్ లో ఉపఎన్నికలో ఎలాగైనా గెలిచి తీరాలన్న కసితో ఉన్న కేసీఆర్ విజిలెన్స్ నివేదికపై ప్రభుత్వాధికారులతో చర్చించి శాఖాపరంగా కఠినమైన నిర్ణయాలే తీసుకుంటారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.

గులాబీ కొత్త బాస్ ఎవరో? ఎన్నికల షెడ్యూల్ రిలీజ్.. 

తెలంగాణలో అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్ష ఎన్నికకు షెడ్యూల్‌‌ను విడుదల చేసింది. ఎన్నిక‌ల రిట‌ర్నింగ్ అధికారి శ్రీనివాస్ రెడ్డి ఈ ఎన్నిక‌ల షెడ్యూల్‌ను విడుద‌ల చేశారు. ఆదివారం నుంచి ఈ నెల 22 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. శనివారం (ఈ నెల 23) ఉదయం 11 గంటలకు నామినేషన్లను పరిశీలించనున్నారు. ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం మూడు గంటల వరకు తెలంగాణ భవన్ లో నామినేషన్లు స్వీకరించనున్నారు. 24న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందని ఎన్నికల అధికారి శ్రీనివాస్ రెడ్డి  తెలిపారు. 25న హెచ్‌ఐసీసీలో జరిగే ప్లీనరీలో పార్టీ అధ్యక్షుడి ఎన్నిక ఉంటుంది.  ఇది టీఆర్ఎస్ పార్టీ పదో అధ్యక్ష ఎన్నికగా.. ఐదేళ్ల తర్వాత తాజాగా ఎన్నిక జరగనుంది. టీఆర్ఎస్ పార్టీ విధివిధానాల ప్రకారం ప్రతి రెండేళ్లకు ఒకసారి (ఏప్రిల్ 27న) అధ్యక్షుణ్ని ఎన్నుకోవాల్సి ఉంటుంది.  చివరిసారిగా 2017లో ఎన్నికలు జరగ్గా, వరుసగా 8వ సారి కేసీఆర్ ఏకగ్రీవంగా అధ్యక్షుడయ్యారు. 2019లో ఎన్నిక జరగాల్సి ఉండగా, సార్వత్రిక ఎన్నికలు రావడంతో ప్రక్రియను వాయిదా వేసుకున్నారు.  2021లో కరోనా విలయం కారణంగా టీఆర్ఎస్ అధ్యక్ష ఎన్నికలు జరగలేదు.ఇప్పుడు కరోనా తీవ్రత తగ్గడం, తెలంగాణలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతున్న నేపథ్యంలో అధ్యక్ష ఎన్నికకు సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 12769 గ్రామాల్లో గ్రామ కమిటీలు, 3600 పైచిలుకు వార్డు క‌మిటీల‌తో పాటు బ‌స్తీ క‌మిటీలు, డివిజ‌న్ క‌మిటీలు, మండ‌ల‌, ప‌ట్ట‌ణ క‌మిటీల ఎన్నిక పూర్తి చేసుకుంది. సంచలనాలేవీ లేకపోతే టీఆర్ఎస్ అధ్యక్షుడిగా 9వ సారి కేసీఆర్ బాధ్యతలు చేపట్టడం లాంఛనమే అవుతుంది. మొత్తంగా 20 ఏండ్ల పాటు కేసీఆరే అధ్యక్షుడిగా ఉన్నట్లైంది.  పార్టీ అధ్యక్ష ఎన్నికలు ముగిసిన తర్వాత పార్టీ ఓ భారీ సభను నిర్వహించబోతున్నట్లు మంత్రి కేటీఆర్ చెప్పారు. ఉద్యమాలతో సాధించుకున్న తెలంగాణలో టీఆర్ఎస్ అద్భుతమైన విధానాలతో పరిపాలన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న నేపథ్యాన్ని పురస్కరించుకొని పార్టీ ద్విదశాబ్ది ఉత్సవాలను నవంబర్ 15వ తేదీన వరంగల్‌లో నిర్వహిస్తామ‌ని, తెలంగాణ విజయ గర్జన పేరుతో జరగబోయే ఆ సభకు పార్టీ శ్రేణులు భారీగా హాజరుకావాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. అక్టోబర్ 27న నుంచి అన్ని నియోజకవర్గాల్లో విజయ గర్జన సభ సన్నాహక సమావేశాలు జరుగుతాయన్నారు.  

మాటల్లేవ్.. మాట్లాడుకోవటాల్లేవ్! ఎదురుపడినా పలకరించుకోని మంచు విష్ణు, పవన్..

మూవీ ఆర్టిస్ట్ ఆసోసియేషన్ ఎన్నికలు జరిగి వారమైంది. కొత్త కార్యవర్గం బాధ్యతలు కూడా చేపట్టింది. అయినా మా ఎన్నికల వేడి మాత్రం చల్లారడం లేదు. పోలింగ్ రోజున ఎలాంటి ఉద్రిక్తత పరిస్థితులు ఉన్నాయో.. ఇప్పుడు కూడా అదే పరిస్థితి కొనసాగుతోంది. మెగా , మంచు కుటుంబాల మధ్య మా వివాదం మరింత ముదురుతున్నట్లు కనిపిస్తోంది. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ నిర్వహించిన అలబ్ బలయ్ కార్యక్రమంలోనూ మా ఫైటింగ్ సీన్ రిపీటైంది.  గవర్నర్ దత్తన్న ఆహ్వానంతో జల విహార్ లో జరిగిన అలబ్ బలయ్ ఆత్మీయ కార్యక్రమానికి హాజరయ్యారు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్. మా కొత్త అధ్యక్షుడు మంచు విష్ణు కూడా వచ్చారు.  వేదికపై ఇద్దరి సీట్లు పక్క పక్కనే వచ్చాయి. దీంతో వీళ్లద్దరిని అక్కడికి వచ్చిన వారు ఆసక్తిగా గమనించారు. కాని  కనీసం పలకరించుకోలేదు పవన్ కల్యాణ్, మంచు విష్ణు. ఎవరి సీటులో వాళ్లు అలా కూర్చుండిపోయారు. దత్తన్న నుంచి సన్మానం తీసుకుని వస్తున్న పవన్ ను పలకరించాలని విష్ణు ప్రయత్నించినా.. జనసేనాని పట్టించుకోలేదు. దీంతో కరచాలనం కోసం ముందుకు వచ్చిన మంచు.. పరిస్థితి అర్ధం చేసుకుని మళ్లీ వెనక్కి వెళ్లారు. అలయ్ బలయ్ వేదికపై దాదాపు గంటపాటు పక్కపక్కనే కూర్చున్నారు పవన్ కల్యాణ్, మంచు విష్ణు. కాని ఒక్క మాట మాట్లాడుకోవటం కాదు కనీసం ఒకరి వైపు ఒకరు చూసుకోలేదు. వేదిక దిగి వెళ్లిపోయే సమయంలో అందరికి అభివాదం చేసుకుంటూ వెళ్లిన పవన్.. మంచు విష్ణుకు మాత్రం చేయలేదు. మంచు విష్ణు కూడా పవన్ కల్యాణ్ తో సాధ్యమైనంత దూరంగా ఉండటానికే ప్రయత్నించారు. అలయ్ బలయ్ వేదికగా కనిపించిన ఈ సీన్లు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారాయి. మా ఎన్నికలు రగిల్చిన వివాదం మరింత ముదిరేలా కనిపిస్తుందని చెబుతున్నారు. మా ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ ప్యానెల్ కు సపోర్ట్ చేసింది మెగా కుటుంబం. ప్రకాశ్ కు మద్దతుగా నాగబాబు తన వంతు ప్రయత్నాలు చేశారు. పవన్ కల్యాణ్ కూడా ఆయనకు మద్దతుగా మాట్లాడారు. దీంతో మా ఎన్నికల ఫలితం తర్వాత మెగా ఫ్యామిలీకి షాక్ తగిలిందనే ప్రచారమే జరిగింది. మా ఎన్నికల్లో విష్ణు, ప్రకాష్ రాజ్ పోటీ చేసినా.. అసలు పోటీ మాత్రం మోహన్ బాబు, చిరంజీవి మధ్య జరిగిందనే టాక్ నడిచింది. మా పోరులో చిరంజీవిపై మోహన్ బాబు విజయం సాధించారనే చర్చలు నడిచాయి. దీంతో మంచు, మెగా వర్గాల మధ్య డైలాగ్ వార్ కొనసాగుతోంది. తాజాగా జరుగుతున్న పరిణామాలు అలానే సూచిస్తున్నాయి. 

విష్ణు గెలుపులో టీఆర్ఎస్ కీరోల్‌!.. చీర‌లు పంచిన ఆ ఎమ్మెల్యే ఎవ‌రు?

ప్ర‌కాశ్‌రాజ్ ఓట‌మికి అనేక కార‌ణాలు. అలానే, మంచు విష్ణు గెలుపున‌కూ అంత‌కుమించే రీజ‌న్స్‌. మోహ‌న్‌బాబు ముందుండి చ‌క్రం తిప్ప‌డం.. సీనియ‌ర్ల‌ను ప్ర‌స‌న్నం చేసుకోవ‌డం.. పోస్ట‌ల్ ఓట్లు రాబ‌ట్ట‌డం.. క‌మ్మ‌-రెడ్డి కాంబినేష‌న్‌.. వైసీపీ స‌పోర్ట్ ఇలా అనేక అంశాలు మంచు విష్ణు గెలుపున‌కు దోహ‌ద‌ప‌డ్డాయి. వీటితో పాటు తెర‌వెనుక అధికార టీఆర్ఎస్ పార్టీ ప్ర‌ముఖులు సైతం మంచుకు బాగా స‌హ‌క‌రించార‌ని తెలుస్తోంది. మోహ‌న్‌బాబు ప‌దే ప‌దే సీఎం కేసీఆర్ పేరు ప్ర‌స్తావించ‌డం.. విష్ణు గెలుస్తాడ‌ని తన‌కు ముందే తెలుస‌ని మంత్రి త‌ల‌సాని వ్యాఖ్యానించ‌డం అందుకు నిద‌ర్శ‌నం. మంత్రి త‌ల‌సాని త‌న ప్ర‌సంగంలో మోహ‌న్‌బాబును బాగా పొగ‌డడం ఆస‌క్తిక‌రం. తాజాగా, మ‌రో టీఆర్ఎస్ ఎమ్మెల్యే విష‌య‌మూ మ‌రింత ఇంట్రెస్టింగ్‌గా మారింది.  టీఆర్ఎస్ పార్టీ లీడ‌ర్ల‌కు మెగా ఫ్యామిలీ బాగా స‌న్నిహిత‌మే అయినా.. మా ఎన్నిక‌లు వ‌చ్చే స‌రికి ప‌లువురు కారు పార్టీ నేత‌లు మెగా కుటుంబం స‌పోర్ట్ చేసిన ప్ర‌కాశ్‌రాజ్‌కు కాకుండా మంచు విష్ణుకు మ‌ద్ద‌తు ఇచ్చార‌ని అంటున్నారు. మా లోని తెలంగాణ‌వాదులు మంచుకు స‌పోర్ట్ చేసేలా చూశారు. ఇక‌, మంత్రి కేటీఆర్‌కు ముఖ్యఅనుచ‌రుడైన ఎమ్మెల్యే జీవ‌న్‌రెడ్డి సైతం మా ఎన్నిక‌ల్లో తెర‌వెనుక కీల‌క పాత్ర ప్లే చేశార‌ని చెబుతున్నారు. మా లో స‌భ్య‌త్వం ఉన్న చిన్న‌స్థాయి క‌ళాకారుల‌కు జీవ‌న్‌రెడ్డి స్వ‌యంగా ఖరీదైన పట్టు చీరలు , బ‌ట్ట‌లు పంచార‌ని అంటున్నారు. మంచు విష్ణుకే ఓటేయాల‌ని విజ్ఞ‌ప్తి చేస్తూ.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవ‌న్‌రెడ్డి అలా గిఫ్ట్‌గా పట్టు బ‌ట్ట‌లు ఇవ్వ‌డం ఆస‌క్తిక‌ర ప‌రిణామం. జీవ‌న్‌రెడ్డి వ్య‌క్తిగ‌తంగా ఈ ప‌ని చేశారా? లేక‌, పార్టీ పెద్ద‌ల డైరెక్ష‌న్‌లో చీర‌లు పంచారా? అనే విష‌యంపై క్లారిటీ లేక‌పోయినా.. బ‌ట్ట‌లు పంచిన విష‌యం మాత్రం నిజ‌మేన‌ని స‌మాచారం.  జ‌గ‌న్‌కు బంధువైన విష్ణు గెలుపున‌కు వైసీపీ-రెడ్డి-క్రిష్టియ‌న్ వ‌ర్గాలు పూర్తిగా స‌హ‌క‌రించాయి. బాల‌కృష్ణ సైతం మ‌ద్ద‌తు ఇవ్వ‌డంతో టీడీపీ శ్రేణులూ మంచుకే జై కొట్టారు. ఇక త‌ట‌స్థంగా ఉండాల్సిన టీఆర్ఎస్‌.. అలా ఉన్న‌ట్టుగానే న‌టిస్తూ.. తెర వెనుక మాత్రం విష్ణు గెలుపున‌కు కృషి చేసిందని అంటున్నారు. తాజాగా ఎమ్మెల్యే జీవ‌న్‌రెడ్డి చీర‌లు పంచిన విష‌యం బ‌య‌ట‌కు రావ‌డం ఆ అనుమానాల‌కు బ‌లం చేకూర్చిన‌ట్టైంది.   

‘‘అసలు ఈ సీఎం హిందువేనా?’’.. ఇందకీలాద్రిపై భక్తుల ఆగ్రహం.. 

ఆంధ్రప్రదేశ్ లో కొన్ని రోజులుగా హిందూ పండుగలపై వివక్ష చూపుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఆలయాలపై వరుసగా జరిగిన దాడులు, టీటీడీలో నెలకొన్న వివాదాలు, బెడవాడ దుర్గమ్మ గుడిలో జరిగిన పరిణామాలతో ఇవి మరింత బలపడ్డాయి. అయినా ఆలయాల నిర్వహణలో ప్రభుత్వ నిర్లక్ష్యం కొనసాగుతూనే ఉంది. వైభవంగా జరగాల్సిన బెజవాడ దుర్గమ్మ నవరాత్రోత్సవాల్లోనూ ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.  ఇందకీలాద్రిపై దసరా రోజున దర్శన విధానం తీవ్ర విమర్శలపాలైంది. వీవీఐపీ, వీఐపీల క్యూల్లో వెళ్లినవారికి దర్శనం చకచకా జరిగిపోగా.. ఉచిత దర్శనం, టికెట్లు కొనుగోలు చేసిన క్యూలలో దర్శనానికి ఐదారు గంటలు పట్టడంతో భక్తులు అసహనంతో రగిలిపోయారు. అమ్మవారిని త్వరగా దర్శనం చేసుకుని వెళ్లిపోదామని వచ్చిన భక్తులకు, దూరప్రాంతాల నుంచి వచ్చినవారికి దర్శనం ఆలస్యమవడంతో సహనం కోల్పోయారు. దసరా రోజున భక్తులకు దర్శనానికి ఐదారు గంటల సమయం పట్టడంతో  కోపోద్రిక్తులయ్యారు. సీఎం డౌన్‌డౌన్‌.. సీఎం డౌన్‌డౌన్‌  అంటూ భక్తులు ఇంద్రకీలాద్రిపై నినాదాలు చేశారు.  పోలీసులు వారించినా భక్తులు వినిపించుకోలేదు. ‘‘అసలు ఈ సీఎం హిందువేనా?’’ అంటూ ఓ భక్తుడు ఆగ్రహంతో ప్రశ్నించాడు. అలా కొద్దిసేపు నినాదాలు చేయడంతో క్యూలు వేగంగా ముందుకు కదిలాయి. ఇందకీలాద్రిపై దసరా రోజున చేసిన ఏర్పాట్లపైనా భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం కావాలనే హిందూ పండుగలపై వివక్ష చూపుతుందని కొందరు ఆరోపించారు. మొత్తానికి దసరా పండుగ రోజున ఇందకీలాద్రిపై సీఎం డౌన్ డౌన్ అనే నినాదాలు వినిపించడం సర్వత్రా చర్చగా మారింది. 

కశ్మీర్‌కు ఆజాదీ!.. ఆరెస్సెస్‌ అధినేత క్లారిటీ...

ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు. రాజ్యాంగంలో జ‌మ్మూ-క‌శ్మీర్‌కు ప్ర‌త్యేకంగా క‌ల్పించిన హ‌క్కుల‌ను ర‌ద్దు చేసింది. అప్ప‌టి నుంచీ దేశంలోని మిగ‌తా రాష్ట్రాల మాదిరే క‌శ్మీర్ కూడా. వేరే ప్ర‌త్యేక‌త‌లు, మిన‌హాయింపులు ఏవీ ఉండ‌వు. మ‌రి, ఆర్టిక‌ల్ 370 ర‌ద్దుతో జ‌మ్మూ-క‌శ్మీర్ స‌మ‌స్య‌ల‌న్నీ తీరిపోయాయా? క‌శ్మీర్‌లో అభివృద్ధి ఫ‌లాలు క‌నిపిస్తున్నాయా? ఆజాదీ డిమాండ్ అంత‌రించిపోయిందా? ఇలా అనేక ప్ర‌శ్న‌ల‌కు ఆరెస్సెస్ చీఫ్ మోహ‌న్ భ‌గ‌వ‌త్ ఆస‌క్తిక‌ర అభిప్రాయాలు చెప్పారు.  జమ్మూ-కశ్మీర్‌కు ప్రత్యేక హోదాను కల్పించిన అధికరణం 370 రద్దుతో సమస్య మొత్తం తొలగిపోలేదని, ఇప్పటికీ స్వాతంత్య్రం (ఆజాదీ) గురించి మాట్లాడుతున్న వారు భారత్‌లో కలిసిపోతేనే పరిష్కారం లభిస్తుందని ఆరెస్సెస్‌ అధినేత మోహన్‌ భగవత్ అన్నారు. ‘ఆజాదీ కోరుకుంటున్న వారూ మన దేశంలో విలీనమయ్యేలా సమాజం చొరవతీసుకోవాలి. గత నెలలో ముంబైకి వ‌చ్చిన జమ్మూకశ్మీర్‌ ముస్లిం విద్యార్థులు భారత్‌లో తామూ ఓ భాగం కావాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. అందుకు వారికి ఎలాంటి అవరోధాలు ఉండబోవు’ అని భగవత్ చెప్పారు.  ‘తమ చిన్నారుల చేతుల్లో పుస్తకాలకు బదులు రాళ్లు పెట్టిన తల్లిదండ్రులు ఇప్పుడు ఉగ్రవాదులను కీర్తించడం మానేశారు. పాకిస్థాన్‌ ద్వారా ప్రేరణ పొందుతున్న వారు, మనసులో మతతత్వ భావనలు ఉన్న వారే ఆజాదీ డిమాండ్‌ చేస్తున్నారు. అలాంటి వారు ఇంకా కొందరున్నారు. భారత్‌లో వారిని విలీనం చేసేలా మన ప్రయత్నాలను ముమ్మరం చెయ్యాలి’ అని మోహన్‌ భగవత్ పిలుపిచ్చారు.  ఆర్టిక‌ల్‌ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్‌లో అభివృద్ధి ఆనవాళ్లు కనిపిస్తున్నాయని, ఇటీవల తన పర్యటనలో ఆ విషయాన్ని గమనించానని ఆరెస్సెస్ చీఫ్ అన్నారు. ‘గతంలో జమ్మూ, లద్దాక్‌ ప్రాంతాలు తీవ్ర వివక్షకు గురయ్యాయి. 80శాతం ఆర్థిక వనరులు కశ్మీర్‌ స్థానిక నాయకుల జేబుల్లోకే వెళ్లేవి. ప్రజలకు ఎలాంటి లబ్ధి చేకూరేది కాదు. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ప్రజలు సంతోషంగా జీవిస్తున్నారు. ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవడంతో ప్రజలు వారిని గురించి ఆందోళన చెందడంలేదు’ అంటూ భగవత్ చెప్పుకొచ్చారు.  అరెస్సెస్ అధినేత మాట‌ల‌ను బ‌ట్టి.. ఇప్ప‌టికీ క‌శ్మీర్‌లో ఆజాదీ డిమాండ్ స‌జీవంగానే ఉంద‌నే భావ‌న క‌లుగుతోంది. ఉగ్ర‌వాద భ‌యం త‌గ్గింద‌ని.. ఇప్పుడిప్పుడే అభివృద్ధి జరుగుతోంద‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. అయితే, క‌శ్మీరీ ముస్లింలు ఇంకా పూర్తి స్థాయిలో భార‌త్‌లో తాము భాగం కాలేద‌ని.. కావాల‌ని కోరుకుంటున్న‌ట్టు స్ప‌ష్టం అవుతోంది.  

వారంటే మంత్రి సురేశ్‌కి భ‌యం.. ద‌ళితుల‌పై దాడిపై అందుకేనా మౌనం?

జ‌గ‌న్‌రెడ్డి సీఎం అయ్యాక ఏపీలో ఏ ఒక్క వ‌ర్గమూ ప్ర‌శాంతంగా లేదు. అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లూ ఏదో ఒక విధంగా బాధితులుగానే మారారు. ద‌ళితుల‌పై దాడులు మునుపెన్న‌డూ లేనంత‌గా జ‌రుగుతున్నాయి. శిరోముండ‌నం చేసినా ప‌ట్టించుకునే పాల‌కులే లేరు. వైసీపీ ప్ర‌భుత్వంలో అంద‌రికంటే ఎక్కువ‌గా అణిచివేయ‌బ‌డుతున్న‌ది ఎస్సీలే అంటారు. తాజాగా, మంత్రి సురేశ్ ఇలాఖాలో ద‌ళితుల‌పై జ‌రిగిన దాడి తీవ్ర క‌ల‌క‌లం రేపుతోంది. ఇంత జ‌రుగుతున్నా.. మంత్రి గారు మాత్రం ప‌ట్టించుకోక‌పోవ‌డం, దాడి చేసిన వారిపై త‌గు చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డం విమ‌ర్శ‌ల పాల‌వుతోంది. అందుకే, మినిస్ట‌ర్‌ సురేశ్‌పై టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షులు అచ్చెన్నాయుడు తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. వైసీపీలోని ఓ వ‌ర్గానికి సురేశ్ భ‌య‌ప‌డుతున్నారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.  సొంత నియోజకవర్గంలో ఎస్సీలపై దాడులు చేస్తుంటే విద్యాశాఖ మంత్రి సురేశ్‌ ఏం చేస్తున్నారని అచ్చెన్న‌ ప్రశ్నించారు. వైసీపీలోని ఓ వర్గానికి సురేశ్‌ భయపడుతున్నారని ఆరోపించారు. భయపడకపోతే దాడి చేసిన నేతలను సస్పెండ్ చేయాలన్నారు. దళితుల భూములు, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దాడి చేసిన వైసీపీ నేతలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని అచ్చెన్నాయుడు డిమాండ్‌ చేశారు.    ఏపీలో ఎస్సీలను అణచివేయడమే వైసీపీ నైజంగా కనిపిస్తోందని దుయ్య‌బ‌ట్టారు. ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలంలో దళితులపై వైసీపీ నాయకుల దాడిని తీవ్రంగా ఖండించారు. జగన్ పాలనపై ఎస్సీలు వ్యతిరేకంగా ఉన్నారనే అక్క‌సుతోనే దాడులు చేసి బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిషత్ ఎన్నికల్లో  వైసీపీ నేతలు ఓడిపోతే దానికి దళితులు కారణం అవుతారా? ఆ ఆరోప‌ణ‌తో త‌న‌కు ఓటేయ‌లేద‌ని ద‌ళితుడిపై దాడి చేసి కొడ‌తారా? అంటూ మండిప‌డ్డారు.   

హీటెక్కిన హుజురాబాద్ ఉప సమరం.. ఈనెల 27న సీఎం కేసీఆర్ ప్రచారం

తెలంగాణ రాజకీయాలను హీటెక్కిస్తున్న కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఉప ఎన్నిక సమరం కాక రేపుతోంది. మరో 10 రోజుల్లో ప్రచార గడువు ముగియనుండటంతో అన్ని పార్టీలు స్పీడ్ పెంచాయి. బతుకమ్మ, దసరా పండుగలతో గత పది రోజులుగా ప్రచారం మందకొడిగా సాగింది. పండుగలు ముగియడంతో ప్రచారం తారా స్థాయికి చేరింది. అన్ని పార్టీల స్టార్ క్యాంపెయినర్లు జోరుగా జనంలో తిరుగుతున్నారు.  హుజూరాబాద్ ఉప ఎన్నికను సవాలుగా తీసుకున్న టీఆర్ఎస్ విజయమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 27న ఉప ఎన్నిక ప్రచారానికి వెళ్తున్నట్టు సమాచారం. కరోనా నేపథ్యంలో ఎన్నికల సంఘం విధించిన ఆంక్షల పరిధిలోనే కేసీఆర్ పర్యటన ఉంటుందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  మరోవైపు ఈ నెల 25న హైదరాబాద్‌లో టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ, అధ్యక్ష ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో ఆదివారం టీఆర్ఎస్ భవన్‌లో ఆ పార్టీ శాసన, పార్లమెంటరీ పార్టీ సంయుక్తంగా భేటీ అవుతున్నాయి.  కేంద్ర, రాష్ట రాజకీయాలు, టీఆర్ఎస్ ప్రస్థానం, పార్టీ భవిష్యత్తు, పార్టీ అధ్యక్షుడి ఎన్నిక వంటి అంశాలను కేసీఆర్ ప్రస్తావించే అవకాశం ఉందని సమాచారం. ఈ నెల 25న హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో జరగనున్న పార్టీ ప్లీనిరీ సమావేశాలకు సంబంధించిన ఏర్పాట్లను టీఆర్ఎస్ ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి దాదాపు 14 వేల మంది ప్రతినిధులను ఆహ్వానించనున్నట్టు సమాచారం. 

దసరా రోజు కుమ్మేశారు.. ఎంత తాగారంటే? 

అనుమానం లేదు. తెలంగాణ ధనిక రాష్ట్రమే.ఒక్క రోజులో రెండు వందల  కోట్ల రూపాయల మద్యం తాగిన రాష్ట్రం ధనిక రాష్ట్రం కాక ఇంకేమవుతుంది. దసరా పండగ సందర్బంగా ఒక్కరోజే, 178 కోట్ల విలువగల మద్యం రాష్ట్రంలోని వైన్ షాపులు,  బార్ అండ్ రెస్టారెంట్‌లకు చేరింది. అంతకు స్టాక్తో కలిపితే   పండగ పూట కనీసం ఓ రెండు వందల  కోట్ల రూపాయల మేరకు  మద్యం అమ్మకాలు జరిగాయని ఎక్సైజ్ శాఖ అంచనాకు వచ్చినట్లు సమాచారం.ఇది గత సవత్సరం కంటే చాలా ఎక్కువని కూడా అధికారుల లెక్కలు చెపుతున్నాయి. గత ఏడాది దసరాతో పోల్చితే ఈసారి లిక్కర్‌ విక్రయాల్లో 39 శాతం, బీర్లలో 57 శాతం వృద్ధిరేటు నమోదయిందని వివరించారు.  ఈ సారి దసరా సందర్భంగా ఈ నెల 12 నుంచి 16 (శనివారం) వరకు ఐదు రోజుల్లోనే రూ.685 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరగడం గమనార్హం. దీంతో ఎక్సైజ్‌ శాఖకు జోరుగా ఆదాయం వచ్చింది. గత ఏడాది దసరా సందర్భంగా ఈ అమ్మకాలు రూ.406 కోట్ల దాకా జరిగాయి.  అంతే కాదు, మొత్తంగా చూస్తే  అక్టోబర్ నెలలో మొదటి 11 రోజుల్లో 1400 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి.  దేశంలో ఆకలితో అలమటిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిగి, దేశం ఆకలి కేకలు పెడుతోందని అంతర్జాతీయ నివేదికలు ఘోషిస్తున్న సమయంలో, ఇంకా నిండా ఏడేళ్లు అయినా నిండని తెలంగాణ ఒక్కరోజులో వందల కోట్ల రూపాయల విలువ చేసే మద్యం తాగడం అంటే మాములు విషయం కాదు. దేశంలో మరే రాష్ట్రం సాధించని, మరో గొప్ప విజయం తెలంగాణ రాష్ట్రం సాధించింది అనుకోవచ్చును.   నిజానికి, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం మద్యం అమ్మకాలుపెరుగుతూనే ఉన్నాయి. గత సంవత్సరం ఇదే అక్టోబర్ నెలలో 2వేల 623 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. ఈ సంవత్సరం అక్టోబర్ నెలలో సెలవులు పోను 11 రోజుల్లోనే 1400 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. ఈ లెక్కన అక్టోబర్ నెల చివరి రోజుకు రాష్ట్రంలో మద్యం విక్రయాలు  3 వేల కోట్ల మార్క్’ను దాటేసినా దాటేస్తుందని అధికారులు లెక్కలు వేస్తున్నారు.అంతేకాదు దేశంలో ఏ రాష్ట్రంలో మద్యం మీద రాని ఆదాయం తెలంగాణలో వస్తోంది. అందుకే ప్రభుత్వం బడ్జెట్లోనే  మద్యం అమ్మకాల నుంచి 30 వేల కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా  పెట్టుకుంది. గతంలో ఆశించిన లక్ష్యాలను చేరుకున్న మద్యం విక్రయాలు, ఈ సంవత్సరం కూడా చేరే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని ఎక్సైజ్ శాఖ అధికారులు చెపుతున్నారు. సో.. చీర్స్..

ఫ్యామిలీ చేతిలోనే కాంగ్రెస్ పగ్గాలు! జీ హుజూర్ అన్న నేతలు..  

కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశం అనుకున్నట్లుగానే జరిగింది. ఆశించిన విధంగానే ముగిసింది. ఐదు గంటలకు పైగా జరిగిన సమావేశంలో సోనియా గాంధీ, పార్టీ అధ్యక్ష పదవి గురించి చాలా స్పష్టంగా మళ్ళీ మళ్ళీ అడగవలసిన అవసరం లేకుండా, కుండబద్దలు కొట్టేశారు. ‘నేనే పార్టీ ప్రెసిడెంట్ ...తాత్కాలికం కాదు ..పూర్తిస్థాయి అధ్యక్షురాలిని నేనే’ అని చాలా స్పష్టంగా చెప్పారు. ‘‘నేను పూర్తి కాలం పని చేసే, చురుగ్గా వ్యవహరించే కాంగ్రెస్ అధ్యక్షురాలిని’’ అని సోనియా గాంధీ స్పష్టం చేశారు. సీడబ్ల్యూసమావేశానికి హాజరైన అసమ్మతి నేతల బృందం జీ 23 సభ్యులు గులాంనబీ ఆజాద్, ఆనంద్ శర్మ సహా అందరూ సోనియా నిర్ణయాన్ని స్వాగతించారు. ఈ సమావేశానికి మొత్తం 52 మంది హాజరయ్యారు.అందరూ చప్పట్లు కొట్టారు.సంతోషం వ్యక్త పరిచారు. అంతేకాని, ఈ నిర్ణయం ఎవరు తీసుకున్నారు ? ఎప్పుడు తీసుకున్నారు? అని ఏ ఒక్కరూ అడగలేదు ..క్రమశిక్షణ గల నాయకులుగా,’జీ హుజూర్’ అంటూ జేజేలు పలికారు. ఆ విధంగా సోనియా గాంధీ, ‘నేనే పార్టీ , పార్టీనే నేను’ అని ఒక్క ముక్కలో తేల్చేశారు.   సో... అధ్యక్షుడు, అధ్యక్షురాలు లేని పార్టీలో కీలక నిర్ణయాలు ఎవరు తీసుకుంటున్నారు? వంటి కపిల సిబల్ మార్క్ సందేహాలకు ఇక ఆస్కారం లేదు. అంతే కాదు సోనియా గాంధీ, తనతో మాట్లాడ దలచుకున్నవారు మీడియా ద్వారా కాకుండా నేరుగా తనతోనే  చెప్పవచ్చని స్పష్టం చేశారు. ఇటీవల కాలంలో, మీడియా ద్వారా అసంతృప్తిని వ్యక్త పరుస్తున్న జీ 23 సీనియర్లకు చురకలు అంటించారు. ఏది జరిగినా నాలుగు గోడల మధ్య జరగాలే కానీ, లోపలి విషయాలు బయటకు పొక్కదానిని వీలు లేదని ఘట్టిగా హెచ్చరించారు.నిజానికి సోనియా గాంధీ ఈ మధ్య కాలంలో ఎప్పుడు లేని విధంగా తమ దృఢ సంకల్పాన్ని చాలా బలంగా, స్థిరంగా వ్యక్త పరిచారు. సోనియా గాంధీ, ఫుల్ టైమ్ ప్రకటనని స్వాగతించిన సీడబ్ల్యూసీ, రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని మరో మారు అంతే గట్టిగా కోరింది.  కోరింది. రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని సీడబ్ల్యూసీ సభ్యులంతా కోరినట్లు పార్టీ సీనియర్ నాయకురాలు అంబికా సోని మీడియా సమావేశంలోనూ తెలిపారు. అయితే, ఈవిషయంలో ఆయనపై వత్తిడి తెచ్చేది లేదని నిర్ణయాన్ని రాహుల్ గాంధీకే వదిలేశామని మరో సీనియర్ నేత మల్లిఖార్జున్ ఖర్గే అన్నారు. ఈ విషయంలో పార్టీ నాయకుల మధ్య ఎలాంటి విబేధాలు లేవని లోక్ సభ మాజీ స్పీకర్ మీరా కుమారి అన్నారు. సో..సోనియా గాంధీ ... ఆమె తర్వాత రాహుల్ గాంధీ అధ్యక్షుడు అయ్యేందుకు సీడబ్ల్యూసీ ఒకే సారి ఓకే చెప్పేసింది. ఆ విధంగా నాయకత్వ సమస్యకు సోనియా గాంధీ శాశ్వత పరిష్కారం చూపారు. గాంధీలదే పార్టీ అని ఆమె చెప్పకనే చెప్పారు.వచ్చే సంవత్సరం (2022) అక్టోబర్’లో అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ ప్రారంభమవుతుందని అంబికా సోనీ సూచన ప్రాయంగా చెప్పారు. అంటే అంతవరకు సోనియా ఆ తర్వాత రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్షపదివిలో కొనసాగుతారని క్లారిటీ ఇచ్చారు.  కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని సీనియర్ నాయకులు ముక్తకంఠంతో చేసిన  విజ్ఞప్తులను పరిశీలిస్తానని రాహుల్ గాంధీ హమీ ఇచ్చారు. సమావేశానంతరం మీడియా అడిగిన ప్రశ్నకు ఆయ స్పందిస్తూ,  ఆ విషయం పరీశీలిస్తానని చెప్పారు. అయితే  పార్టీ నేతల నుంచి ముందు సైద్ధాంతిక స్పష్టత రావాలని, అన్నారు. అదే సమయంలో పార్టీ ఎన్నికలు జరిగే వరకూ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉండాలని కొందరు నేతలు సమావేశంలో ప్రతిపాదించారని రాహుల్ గాంధీ స్వయంగా చెప్పారు.అంటే, సీడబ్ల్యూసీ సమావేశం ప్రధానంగా  మూడు విషయాలలో స్పష్టత నిచ్చింది...అందులో మొదటిది పార్టీ ఇప్పుడు నడుస్తున్న తీరునే నడుస్తుంది. అయితే ఇంతకాలం, తాత్కాలిక అధ్యక్షురాలిగా పరిమితులకు లోబడి పనిచేసిన సోనియా గాంధీ, ఇక ఫై పూర్తి అధికారాలతో, నిర్ణయాలు తెసుకుంటారు. అంటే కపిల్ సిబల్ లాగా, ఆ నిర్ణయం ఎవరు తీసుకున్నారు? ఈనిర్ణయం ఎలా తీసుకున్నారు? అని లీగల్ పాయింట్లు లాగితే, ఇక అంతే సంగతులు క్రమశిక్షణ చర్యలు తప్పవు. అలాగే,ఇంతవరకు ఏ బాధ్యతా లేకున్నా కీలక నిర్ణయాలు రాహుల్ ఎలా తీసుకుంటున్నారు ? అని మళ్ళీ మరొకరు ప్రశ్నించ కుండా సోనియా గాంధీ రేపో మాపో ఆయన్ని వర్కింగ్ ప్రెసిడెంట్’ గా ప్రకటిస్తారు. గతంలో ప్రశాంత్ కిషోర్ ప్రొపోజ్ చేసిన విధంగా,ఏ కమల నాథ్’నో మరొక జీహుజూర్ ‘నో మరో వర్కింగ్ ప్రెసిడెంట్’ చేస్తారు. అక్కడితో కథ ముగిసిపోతుంది.

బుల్లెట్టు బండెక్కి పాతబస్తి పోయే ధైర్యం కేటీఆర్ కు ఉందా?  

తెలంగాణలో అధికార టీఆర్ఎస్, బీజేపీ మధ్య హాట్ పాలిటిక్స్ కొనసాగుతున్నాయి. హుజురాబాద్ కేంద్రంగా రెండు పార్టీల మధ్య యుద్ధమే జరుగుతోంది. ప్రజా సమస్యలపై నేతల మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతోంది. భారీ వర్షాలతో పలు ప్రాంతాల్లో జన జీవనం స్థంభిస్తోంది. దీంతో వరదల విషయంలో అధికార పార్టీని టార్గెట్ చేస్తూ దూకుడుగా వెళుతున్నారు కమలం నేతలు. తాజాగా శనివారం హైదరాబాద్ లో కుండపోతగా వర్షం కురిసింది. వరదలు పోటెత్తడంతో పలు లోత్టటు ప్రాంతాలు జలమయం అయ్యాయి. శనివారం పాతబస్తిలో భారీ వర్షం కురవడంతో పలు ప్రాంతాలు అల్లాడిపోయాయి. పాతబస్తీలో వరదల నేపథ్యంలో బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మున్సిపల్  శాఖ మంత్రి కేటీఆర్ కు ఆసక్తికర ప్రతిపాదన చేశారు. నగరంలో భారీ వర్షాలకు పలు ప్రాంతాలు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నాయో చూసొద్దాం రండి అంటూ ఆహ్వానించారు. బుల్లెట్ బండి పై పాతబస్తీ పోదాం వస్తవా కేటీఆర్ అంటూ సవాల్ చేశారు రాజా సింగ్. భారీ వర్షాలకు నాలాలు ఉప్పొంగుతున్నాయని, నీరు ఇళ్లలోకి, దుకాణాల్లోకి వెళుతోందని, జనజీవనం అస్తవ్యస్తంగా మారిందని రాజాసింగ్ వివరించారు. "నిధుల గురించి, పాతబస్తీ అభివృద్ధి గురించి మీరు పదేపదే శాసనసభలో చెప్పారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎలా ఉన్నాయో మనిద్దరమే వెళ్లి చూసొద్దాం. నా బుల్లెట్ బండిపై మొదట గోషామహల్ నియోజకవర్గంలో పర్యటిద్దాం, ఆ తర్వాత పాతబస్తీలో పర్యటిద్దాం" అని తెలిపారు. భారీ వర్షాలకు ఆయా ప్రాంతాల్లో రియాలిటీ ఎలా ఉందో మీరే చూడొచ్చు...  ఏం అభివృద్ధి జరిగిందో మీ అంతట మీరే తెలుసుకోవచ్చు! అంటూ కేటీఆర్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రాజా సింగ్ సవాల్ ను కేటీఆర్ స్వీకరిస్తారా లేదా అన్నది ఆసక్తిగా మారింది. 

ఈటలని వెంటాడుతున్న ఓటమి భయం.. ఎందుకో తెలుసా?

హుజూరాబాద్ ఉపఎన్నిక పోలింగ్ కి ఇంకా ఎంతో సమయం లేదు. రాజకీయ పార్టీలు, అభ్యర్ధులు ప్రచార జోరు పెంచారు. ఇంత వరకు  నవరాత్రి ఉత్సవాలు, దీక్షల్లో ఉన్న రాజకీయ పార్టీల పెద్దలు ప్రచారంలో జోష్ పెంచేందుకు హుజూరాబాద్ చేరుకుంటున్నారు. ముఖ్యంగా ఎలాగైనా గెలవాలని ఆరాట పడుతున్న అధికార తెరాస ... తెరాసను ఓడించి పంతం నెగ్గించుకోవాలని పట్టు మీదున్న బీజేపీ ... ప్రచార వేడినిని పెంచుతున్నాయి. తెరాస ప్రచార బాధ్యతలను భుజానికి ఎత్తుకున్న మంత్రి హరీష్ రావు, ఎప్పటికప్పుడు కొత్త అస్త్రాలతో బీజీపీకి సవాళ్ళు  విసురుతున్నారు. బ్రహ్మాస్త్రం అనుకున్న దళిత బంధుతో సహా ఇంతవరకు ప్రయోగించిన అన్ని అస్త్రాలు తుస్సుమన్నాయో ఏమో ... ఇప్పుడు కొత్తగా పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరల పెరుగుదలను  ఆశ్రయించారు. గ్యాస్ టాక్స్’లో రాష్ట్రం వాటా పై చర్చకు రావాలని బీజేపీని  సవాలు చేశారు. అయితే బీజేపీ తరపున దుబ్బాక ఎమ్మెల్యే  రఘునందన్ రావు  ప్రతిసవాల్ కు మాత్రం హరీష్ సమాధానం చెప్పలేదు.  బీజేపీ అభ్యర్ధి ఈటల హరీష్ సవాళ్ళకు అంతగా భయపడ లేదు కానీ,ఆయన్ని భయపెడుతున్న అంశం వేరొకటుంది. హుజూరాబాద్ నియోజక వర్గం నుంచి ఆరు సార్లు గెలిచిన ఈటల అన్నిసార్లు ‘కారు’ గుర్తు మీదనే గెలిచారు. ఈటల అంటే కారు ... కారంటే ఈటల అన్నంతగా, ఈటల గుర్తు కారని, ప్రజల మనసుల్లో ముద్ర పడిపోయింది. అయితే ఇప్పుడు, గుర్తు మారింది. బీజేపీ గుర్తు కమలం గుర్తు పై ఈటల పోటీ చేస్తున్నారు. ఈమధ్య ఈటల శిబిరం నుంచి తెరాస శిబిరానికి చేరిన నాయకుడొకరు, అలవాట్లో పొరపాటుగా ఈటలకు జై కొట్టినట్లుగా, రేపు జనాలు అదే అలవాట్లో పొరపాటుగా కారు గుర్తుకు గుద్దేస్తే ... ఇప్పుడు ఈటలను, బీజేపీని భయపెడుతున్న విషయం ఇదే.  ప్రధాన పోటీ తెరాస, బీజేపీ మధ్యనే అయినా  కాంగ్రెస్’ తో పాటుగా ఇద్దరు ముగ్గురు, చిన్నా చితకా పార్టీల అభ్యర్ధులు,ఒకరిద్దరు ఇండిపెండెంట్ అభ్యర్ధులు, అధికార పార్టీ వ్యతిరేక ఓటును గాట్టిగానే పట్టుకు పోతారు. అదొక ముప్పు అలా ఉంటే, ఈటల గుర్తు ‘కారు’ అనుకుని, ముఖ్యంగా నిరక్షరాస్యులైన వృద్ధులు, మహిళలు అలవాటులో పొరపాటున కారు బటన్ నొక్కేస్తే ఎలా అనే ఆందోళన ఈటలను వెంటాడుతోంది. అయితే, ముందుగానే ప్రమాదాన్ని పసిగట్టిన బీజేపీ...ఈటల గుర్తు ..కమలం ..కమలం గుర్తు ఓటేద్దాం ఈటలను గెలిపిద్దామని... పెద్ద ఎత్తున ఇంటింటి ప్రచారాన్ని చేపట్టింది. ఈటల కూడా ప్రతి సందర్భంలో కమలం పువ్వు గుర్తును గుర్తుచేస్తున్నారు. అయినా గుర్తు మార్పు కొంప ముచుతుందేమో అన్న భయం అయితే ఈటలను వెంటాడుతూనే ఉందని అంటున్నారు.

ఫ్యాన్‌కు ఓటేస్తే ఫ‌స‌క్‌.. మోత్కుప‌ల్లి ఫిక్స్‌.. జ‌న‌సేన=పిచ్చిసేన‌.. టాప్ న్యూస్ @ 7pm

1. ఏపీలో ప్రజలు ఫ్యాన్‌ గుర్తుకు ఓటేస్తే ఇంట్లో ఫ్యాన్‌ ఆగిపోయిందని టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ మండిప‌డ్డారు. రాష్ట్రాన్ని జగన్ అంధకారంధ్రప్రదేశ్‌గా మార్చారని విమర్శించారు. ‘‘ఓ వైపు విద్యుత్‌ ఛార్జీల పెంపు పేరుతో ప్రజలపై భారం మోపుతున్నారు. మరోవైపు విద్యుత్‌ కొరతతో అంధకారంలో ఉండాల్సిన పరిస్థితి. అవసరం మేర బొగ్గు నిల్వ చేసుకోవాలన్న కేంద్రం హెచ్చరికలను రాష్ట్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టి.. అవినీతి సొమ్ము నిల్వ చేసుకోవ‌డంలో జ‌గ‌న్ బిజీ అవ్వ‌డం వ‌ల్లే రాష్ట్రానికి ఈ దుస్థితి అంటూ అని నారా లోకేశ్‌ ఆరోపించారు.   2. ఏపీలో ప్రజలకు విద్యుత్‌ లేకుండా చేసేందుకు జగన్‌ కంకణం కట్టుకున్నారని బీజేపీ నేత లంకా దినకర్‌ మండిపడ్డారు. సక్రమంగా విద్యుత్‌ సరఫరా చేయలేని పరిస్థితిలో సీఎం జగన్‌ ప్రభుత్వం ఉందన్నారు. ఏపీలో అస్తవ్యస్థ పాలనతో పరిశ్రమలు కుదేలయ్యాయన్నారు. విద్యుత్‌ లేక పరిశ్రమల భవిష్యత్‌ అగమ్యగోచరంగా మారబోతోందని దిన‌క‌ర్‌ విమ‌ర్శించారు.   3. మాజీమంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఈ నెల 18న ఆయన సీఎం కేసీఆర్‌ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్నారు. ఆలేరు, భువనగిరితోపాటు మునుగోడు నియోజకవర్గంలోని తన అనుచరులు, అభిమానులతో టీఆర్‌ఎస్‌లో చేరేందుకు ఆయన ఏర్పా ట్లు చేసుకుంటున్నారు. మోత్కుప‌ల్లికి దళితబంధు చైర్మన్‌ లేదా ఎమ్మెల్సీ ఇస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.  4. సీఎం జగన్‌కు ప్రకాశం టీడీపీ ఎమ్మెల్యేలు రవికుమార్, బాల వీరాంజనేయస్వామి, సాంబశివరావులు మ‌రో లేఖ రాశారు.  ప్రకాశం జిల్లా ప్రగతి, సమస్యలపై సీఎం శ్రద్ధ వహించడం లేదన్నారు. గతంలో రాసిన లేఖల్లో రాజకీయం వెతికారు తప్ప ఆవేదనని అర్థం చేసుకోలేదని చెప్పారు. ఎవరి ప్రయోజనాల కోసం "వెలుగొండ"కి అన్యాయం చేస్తున్నారు? అని లేఖ ద్వారా ప్రశ్నించారు. 5. మంత్రి ఆదిమూలపు సురేష్ ఇలాకలో దళితులపై దాడి జరిగింది. ప్ర‌కాశం జిల్లా పెద్దారవీడు మండలం మద్దలకట్టలో గత స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు ఓటు వేయలేదంటూ జార్జ్ అనే వ్యక్తిపై సత్యనారాయణరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి దాడికి పాల్పడ్డారు. వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థిగా సత్యనారాయణరెడ్డి పోటీచేసి ఓడిపోయారు. మీ సామాజికవర్గం వారు ఓటు వేయకపోవటం వల్లే తాము ఓడిపోయామంటూ జార్జ్‌పై దాడికి పాల్పడ్డారు. గాయాలపాలైన ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు.  6. జనసేన నాయకుడుకు పిచ్చి పరాకాష్టకు చేరినట్టే.. జన సైనికులకు అదే పరిస్థితి ఏర్పడిందంటూ భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మండిపడ్డారు. పెట్రో ధరలు పెరిగాయని ప్రకాశం జిల్లాలో ఇరవై ఎనిమిది మంది ప్రయాణికులు ఉన్న బస్సుకు నిప్పు పెట్టిన వ్యక్తి జనసైనికుడని ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు జనసేనకు ఓటు వేయలేదని జనాన్ని చంపేస్తారేమోనని అన్నారు. షూటింగ్ అయిపోగానే రెండు నెలలకు ఒకసారి వచ్చి రెండు మీటింగులు పెట్టి యుద్ధం చేద్దామంటాడని విమర్శించారు.  7. ఏపీవ్యాప్తంగా కరెంట్ కోతలు మొదలయ్యాయని ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు. కరెంట్‌కు బొగ్గు ఇవ్వలేని వారు, ఆక్వాకు సీడ్, ఫీడ్ ఎలా ఇస్తారు? అని ప్రశ్నించారు. ప్రభుత్వానికి మందు చూపు ఉందా లేదా అని ప్రజలు అనుకుంటున్నారని తెలిపారు. మందుపై ఉన్న చూపు విద్యుత్‌పై ఎందుకులేదో మనం ఆలోచన చేయాలని  రఘురామ సూచించారు.  8. దుగ్గిరాల ఎంపీపీ ఎంపికలో వివాదం ఇంకా కొనసాగుతోంది. ఎమ్మెల్యే ముస్తఫా కార్యాలయం ఎదుట టీడీపీ ఎంపీపీ అభ్యర్థి జబీన్, టీడీపీ నేతలు బైఠాయించారు. తక్షణమే దుగ్గిరాల టీడీపీ ఎంపీపీ అభ్యర్థి జబీన్‌కు కుల ధృవీకరణ పత్రాన్ని మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. జబీన్‌కు బీసీ-ఇ కులదృవీకరణ పత్రం ఇవ్వకపోవడం దుర్మార్గమని.. ముస్లింలకు రాజకీయ సమాధి కట్టాలని వైసీపీ ప్రయత్నం చేస్తుందని టీడీపీ మండిపడింది.  9. న్యాయస్థానాలు, దేవస్థానాలు మాత్రామే రైతులకు న్యాయం చేస్తాయని నమ్ముతున్నామని.. అమరావతి రైతుల ఉద్యమం 669వ రోజుకు చేరుకున్న సంద‌ర్భంగా వారు అభిప్రాయ‌ప‌డ్డారు. దేవి నవరాత్రుల సందర్భంగా మందడం గ్రామంలో అమ్మవారి ఊరేగింపులో అమరావతి గ్రామాల రైతులు భారీగా పాల్గొన్నారు. అమరావతే ఏకైక రాజధానిగా ఉండాలని, రైతు మహాపాదయాత్ర విజయవంతం కావాలని రైతులు అమ్మవారికి మొక్కుకున్నారు.  10. తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో మావోయిస్ట్ పార్టీ నేత ఆర్కే అంత్యక్రియలు ముగిశాయి. అంత్యక్రియలకు సంబంధించిన ఫొటోలను మావోయిస్టు పార్టీ విడుదల చేసింది. పామేడు-కొండపల్లి సరిహద్దు ప్రాంతాల్లో ఆర్కే అంత్యక్రియలు నిర్వహించనట్టు తెలుస్తోంది. శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు ఆర్కే అంత్యక్రియలు పూర్తి అయినట్లు చెబుతున్నారు. మావోయిస్టు లాంఛనాలతో ఆర్కే అంత్యక్రియలు పూర్తి చేశారు. ఆర్కే మృతదేహంపై ఎర్ర జెండా కప్పి మావోయిస్టులు నివాళులు అర్పించారు.  

శశికళ కొత్త పార్టీ పెడతారా? అన్నాడీఎంకే చీలిపోనుందా? 

అనుకున్నదే జరిగింది. తమిళనాడు రాజకీయాలలో మరో ఇన్నింగ్స్ ఆడేందుకు చిన్నమ్మ శశికళ మళ్ళీ తెరమీదకు వచ్చారు. జయలలిత మరణం తర్వాత, కాలం కలిసిరాక జైలుపాలైన ఆమె జైలు నించి విడుదలైన తర్వాత రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఇప్పుడు అమ్మ పార్టీని బతికించుకోవడం కోసం అంటూ రీఎంట్రీ ఇచ్చారు. జైలుకు వెళ్ళే సమయంలో ఎక్కడైతే ఆమె శపధం చేశారో, అదే జయలలిత సమాధి నుంచి మరో రాజకీయ ప్రస్థానానికి శ్రీకారం చుట్టారు. భారీ అనుచరగణంతో జయ సమాధి వద్ద వచ్చిన శశికళ ‘అమ్మ’ కు ఘనంగా  నివాళులు అర్పించారు. రాజకీయ రీఎంట్రీ వైపు తొలి అడుగు వేశారు.   అయితే ఇది ఆమె తొలి ప్రయత్నం కాదు. ఇంతకు ముందు కూడా ఆమె పొలిటికల్ రీఎంట్రీ ప్రయత్నాలు చేశారు. ఈ సంవత్సరం (2021) ఏప్రిల్’లో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందే, రీ ఎంట్రీకి ప్రయత్నించారు. బెంగుళూరు జైలు నుంచి వస్తూనే ... అన్నా డిఎంకే జెండాలతో వందకు పైగా వాహనాలతో రాష్ట్రంలోకి ఎంట్రీ ఇచ్చారు.ఆలా డైరెక్ట్’గా రాజకీయాల వైపు అడుగులు వేశారు. అయితే, ఆమె ప్రయత్నం ఫలించలేదు. అప్పటికింకా అధికారంలో ఉన్న ఆన్నా డిఎంకే ఆమెకు చెక్ చెప్పింది. అలాగే, జూన్,జూలై నెలల్లో ‘వస్తున్నా ,, వచ్చేస్తున్నా’ అంటూ మరోసారి మరో రాయివేశారు. అది కూడా అంతే ..పేలలేదు.  ఇప్పుడు సమయం సందర్భం చూసుకుని, శశికళ ముచ్చటగా మూడో ప్రయత్నం చేశారు. రేపు (అక్టోబర్ 17)జరిగే, అన్నాడీఎంకే స్వర్ణోత్సవాలను పురస్కరించుకుని అందుకు ఒకరోజు ముందు ఈరోజు మెరీనాతీరంలో జయలలిత, ఎంజీఆర్‌ల సమాధులకు నివాళులర్పించారు. ఈసారి అయినా ఆమె ప్రయత్నం ఫలిస్తుందా అంటే, ఆమె తిరిగి అన్నా డిఎంకే’లో కాలు పెట్టడం కష్టమే అంటున్నారు పరిశీలకులు. శశికళ రాకను పార్టీలోని రెండు ప్రాధాన వర్గాలు, మాజీ ముఖ్యమంత్రి పళని స్వామి వర్గం, మాజీ ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వర్గం .. ఇద్దరు నాయకులు వ్యతిరేకిస్తున్నారు.  అలాగే తమిళనాడులో పాగా వేసేందుకు ప్రయత్నిస్తున్న అన్నాడిఎంకే మిత్ర పక్షం, బీజీపీ కూడా శశికళ రాజకీయ పునరాగమనాన్ని వ్యతిరేకిస్తోంది. ఈ నేపధ్యంలో ఆమె మళ్ళీ అమ్మ పార్టీలో అడుగు పెట్టలేకపోయినా సొంత పార్టీ పెట్టే అవకాశాలను మాత్రం కాదనలేమని అంటున్నారు. అయితే అది లక్ష్మీ పార్వతి పెట్టిన ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీలా ... ఉంటుందా ... ఇంకోలా ఉంటుందా అనేది మాత్రం ఇప్పుడే చెప్పలేమని అంటున్నారు. 

దేశంలో ముస్లింల జనాభా పెరుగుతోందా? 

భారత దేశం అంటే హిందూ దేశంగా భావిస్తారు. అయితే కొన్ని రోజులుగా దేశంలో ఓ ప్రచారం సాగుతోంది. దేశంలో ముస్లిం జనాభా విపరీతంగా పెరిగిపోతుందని.. ఇది ఇలాగే కొనసాగితే మరో ముప్పే ఏండ్లలో భారత దేశంలో హిందువుల కంటే ముస్లిం జనాభే ఎక్కువ అవుతుందనే చర్చ జరుగుతోంది.ఆరెస్సెస్, విశ్వ హిందూ పరిషత్ తో పాటు పలు హిందూ సంఘాలు కూడా ఇదే విషయం చెబుతున్నాయి. విజయదశమి సందర్భంగా చేసిన ప్రసంగంలో మోహన్ భగవత్ మరోసారి ఇదే అంశంపై మాట్లాడారు.  దేశంలో ముస్లిం, క్రిస్టియన్ జనాభా పెరిగిపోతుందని చెప్పారు మోహన్ భగవత్.  జనాభా నియంత్రణ విధానాన్ని తీసుకురావాలన్నారు. వచ్చే 50 ఏళ్లను దృష్టిలో పెట్టుకొని దాన్ని రూపొందించాలని సూచించారు. ఇది అందరికీ సమానంగా వర్తింపచేయాలని.. జనాభా అసమతౌల్యత పెద్ద సమస్యగా మారిందని వ్యాఖ్యానించారు. జమ్మూకశ్మీర్ లో ప్రజలను భయపెట్టడం కోసం ఉగ్రవాదులు హింసను ఆశ్రయిస్తున్నారని మండిపడ్డారు. పాకిస్తాన్ తాలిబన్ ఉగ్రవాదం నుంచి జనాభా నియంత్రణ వరకు పలు అంశాలపై మోహన్ భగవత్ మాట్లాడారు.  జనాభా నియంత్రణ విధానాన్ని తీసుకురావాలన్న  ఆర్ఎస్ఎస్ చీఫ్ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తీవ్రంగా స్పందించారు. మోహన్ భగవత్ విజయదశమి ప్రసంగం అబద్దాలు సగం సత్యాలతో నిండి ఉందని ఓవైసీ ఆరోపించారు. జనాభా నియంత్రణ విధానం ఆర్టికల్ 370 రద్దు ఇతర అంశాలపై భగవత్ చేసిన కామెంట్లను ఖండించారు అసద్. ముస్లింలు క్రిస్టియన్ల జనాభా పెరిగిందనే అబద్ధాన్ని ఆయన పునరావృతం చేశారని చెప్పారు. కాని దేశంలో ముస్లిం జనాభా పెరుగుదల రేటు తక్కువగా ఉందని ఒవైసీ చెప్పారు. బాల్య వివాహాలు సెక్స్ సెలక్టివ్ అబార్షన్ ల వంటి సామాజిక దూరాచారాల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం ఉందని అన్నారు.  ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీర్ లో ప్రజలు ప్రయోజనాలు పొందుతున్నారని భగవత్ చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ ఈ ఏడాది జరిగిన పౌరహత్యలను ఒవైసీ ప్రస్తావించారు. హత్యలు ఎందుకు జరుగుతున్నాయని ప్రశ్నించినఅసద్.. దీనివల్ల ఇంటర్నెట్ షట్ డౌన్ లు సామూహిక నిర్బంధాలతో కశ్మీర్ ఒక రావణకాష్టంలా మారిందని విమర్శించారు. సగం నిజం సగం అబద్దం చెప్పడం వల్ల ఎటువంటి ఉపయోగపడడం ఉండదని ఓవైసీ విమర్శించారు. 

ఈనెల 18న టీఆర్ఎస్ లోకి మోత్కుపల్లి నర్సింహులు..

గత రెండు, మూడు నెలలుగా జరుగుతున్న ప్రచారం నిజం కాబోతోంది. మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు అధికార టీఆర్ఎస్ లో చేరబోతున్నారు. మోత్కుపల్లి నర్సింహులు కారెక్కడానికి ముహుర్తం ఖరారైంది. ఈనెల 18 సోమవారం  మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్ సమక్షం లో గులాబీ కండువా కప్పుకోనున్నారు మోత్కుపల్లి నర్సింహులు. పార్టీలో చేరిన వెంటనే మోత్కుపల్లిని దళిత బంధు చైర్మన్‌గా ప్రకటిస్తారని తెలుస్తోంది. జులై 23న బీజేపికి రాజీనామా చేసిన మోత్కుపల్లి నర్సింహులు.. అప్పటి నుంచి బీజేపీ వైఖరిపై, హుజూరాబాద్ బీజేపి అభ్యర్థి ఈటల రాజేందర్‌పై సంచలన ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. అదే క్రమంలో టీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన దళిత బంధు పథకంను సమర్థిస్తూ ఆ పార్టీకి అనుకూలంగా ఉంటూ వస్తున్నారు. సీఎం కేసీఆర్ కు మద్దతుగా బహిరంగంగానే ప్రకటనలు చేస్తున్నారు. అప్పటి నుంచే ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరడం ఖాయం అనే టాక్ వినిపించింది. మాదిగ సామాజిక వర్గానికి చెందిన మోత్కుపల్లి నర్సింహులు రాజకీయ జీవితం తెలుగుదేశం పార్టీ నుంచి మొదలైంది. ఉమ్మడి నల్గొండ జిల్లా ఆలేరు నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు నర్సింహులు. టీడీపీతో పాటు కాంగ్రెస్ , ఇండిపెండెంట్ గా కూడా ఆయన విజయం సాధించారు. టీడీపీలో ఉన్నప్పటి నుంచే మోత్కుపల్లి, కేసీఆర్ మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. మోత్కుపల్లి నిజాయితీ గల వ్యక్తని, ఆయనకు దళిత బంధు చైర్మన్ బాధ్యతలు అప్పగిస్తే.. ప్రభుత్వ ప్రతిష్ఠ ఇనుమడిస్తుందని కేసీఆర్ నమ్మకం. ఇటీవల జరిగిన దళిత బంధు సమీక్ష సమావేశంలోనూ మోత్కుపల్లికి కేసీఆర్.. అధిక ప్రాధాన్యం ఇచ్చారు. తన పక్కనే కూర్చోబెట్టుకోవడం ద్వారా.. దళిత బంధుకు కాబోయే చైర్మన్ ఆయనేనన్న సంకేతాలిచ్చారని పరిశీలకులు భావిస్తున్నారు. గతంలో ఎన్టీఆర్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన మోత్కుపల్లి.. 2019 ఎన్నికలకు ముందు టీడీపీని వీడారు. మధ్యలో ఓ సారి కాంగ్రెస్ లోకి వెళ్లినప్పటికీ.. అక్కడ ఇమడలేక.. మళ్లీ టీడీపీ గూటికే చేరారు. ఆ తర్వాత మారిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో బీజేపీలోకి వెళ్లిన ఆయన.. ఇటీవలే ఆ పార్టీకి రాజీనామా చేశారు. కేసీఆర్ పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. సీఎంను ఏకంగా అంబేడ్కర్ కంటే గొప్పవాడిగా కీర్తించారు.