కిల్లి కృపారాణిపై ధర్మాస్త్రం

    కాంగ్రెస్ నేతలకి బయట పార్టీలతో ఎంత బెడద ఉంటుందో, లోపల కూడా అంతే మంది శత్రువులతో నిత్యం యుద్ధం చేయవలసి ఉంటుంది. లేకుంటే ఆ పార్టీలో ఎవరూ నిలబడలేరు. బహుశః అందుకే వారు ఎన్నడూ కూడా చక్కగా వారి విధులను నిర్వర్తించగా, పరిపాలన చేయగా చూసేందుకు ప్రజలు నోచుకోవడం లేదు. ఇక విషయంలోకి వస్తే, శ్రీకాకుళం జిల్లాలో ధర్మాన ప్రసాదరావు సీబీఐ మరక పడనంత వరకు ఎదురులేని నాయకుడిగా చక్రం తిప్పేవారు. ఆ జిల్లాలో ఆయనకు గట్టి పోటీనిచ్చిన తేదేపా నాయకుడు ఎర్రంనాయుడు కూడా మరణించడంతో, ఇక ధర్మానకి ఎదురే లేకుండా పోయింది.   అయితే, సీబీఐ లిస్టులో ఆయన పేరు ఎక్కినప్పటి నుండీ ఆయనకి చెడ్డ రోజులు మొదలయ్యాయి. ఆ తరువాత బలవంతంగా పదవిలోంచి దిగవలసి రావడం, నిన్న మొన్నటి వరకు అరెస్టు గండం అన్నీకలిసి జిల్లా రాజకీయాలలో ఆయన ప్రాభవానికి బీటలు తెచ్చాయి. దానికి తోడూ ఆయన కుటుంబ సభ్యుడు గిరిజనులకు చెందిన కన్నెధార అనే కొండ ప్రాంతాన్ని స్వాదీనం చేసుకోవడానికి చేసిన ప్రయత్నాలు కూడా ఆయనకు జిల్లాలో చాల చెడ్డ పేరు తెచ్చిపెట్టాయి.   ఈ సంధి కాలంలో కిల్లి క్రిపారాణీ చాలా చాకచక్యంగా స్థానిక కాంగ్రెస్ నేతలను తనవైపు తిప్పుకొని కొంచెం గుర్తింపు పొంది, ఇప్పుడు ఏకంగా కేంద్ర మంత్రి అయిపోయారు.   ఇప్పుడు ధర్మాన సీబీఐ అరెస్ట్ గండం తప్పించుకోవడంతో కొంచెం తేరుకొని జిల్లా రాజకీయాల మీద మళ్ళీ పట్టు సాధించేందుకు పావులు కదపడం మొదలుపెట్టారు. ఇంత కాలం సమైక్యాంధ్ర ఉద్యమ కారులు ఆయన రాజీనామా కోసం ఎంత ఒత్తిడి తెచ్చినప్పటికీ లొంగని ఆయన మొన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి విభజనను వ్యతిరేఖిస్తూ మాట్లాడగానే, వెంటనే తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన  అనుచరులయిన స్థానిక ఎమ్మెల్యేలు జగన్నాధం, భారతి, సత్యవతిలు కూడా రాజీనామా చేయనున్నారు. ముఖ్యమంత్రి విభజనపై చెప్పిన మాటలను తాను పూర్తిగా సమర్దిస్తున్నామని, రాష్ట్రం విడిపోతే అన్నీ సమస్యలేనని, అందుకే రాష్ట్ర సమైక్యత కోసం రాజీనామాలు చేస్తున్నటు దర్మాన ప్రకటించారు.   దీనితో ఇంత వరకు రాజీనామా చేయడానికి నిరాకరిస్తున్నతన ప్రత్యర్ధి కిల్లి క్రుపా రాణీపై ఒత్తిడి పెరిగేలా చేయగలిగారు. ధర్మాన తన రాజీనామాతో కేవలం శాసన సభ్యత్వం మాత్రమే వదులుకోగా, కృపా రాణీ మాత్రం అతికష్టం మీద సంపాదించుకొన్న కేంద్ర మంత్రి పదవిని వదులుకోక తప్పనిసరి పరిస్థితి కల్పించారు.   ఆమె మీడియాతో మాట్లాడుతూ తనకు పదవుల మీద కాంక్ష లేదని, కేవలం ప్రజల ఆందోళనలు కేంద్రానికి తెలియజేయడానికే పదవిలో కొనసాగుతున్నాని, తన రాజీనామా పత్రం బ్యాగులో పెట్టుకొనే తిరుగుతున్నానని, ఎప్పుడు అవసరమనుకొంటే అప్పుడు తక్షణం తప్పుకొంటానని చెప్పడం, ధర్మాన వర్గం ప్రయోగించిన రాజీనామాస్త్రాల మహిమేనని చెప్పక తప్పదు.   ఇప్పుడు ధర్మాన చేయవలసిందల్లా సమైక్యవాదులను ఆమె ఇంటివైపు మళ్లించడమే. ఆమె రాజీనామా చేసినట్లయితే జిల్లా రాజకీయాలలో మళ్ళీ సమతూకం ఏర్పడి, ధర్మాన పై చేయి సాధించడానికి అవకాశం ఏర్పడుతుంది.

కాంగ్రెస్ తో కాంగ్రెస్ యుద్ధం

  రాష్ట్ర విభజన కంటే దానిపై వివిధ రాజకీయ నేతలు, ముఖ్యంగా కాంగ్రెస్ నేతలు చేస్తున్నవివాదస్పద వ్యాఖ్యలే ప్రస్తుతం పెద్ద సమస్యగా మారింది. మొన్న కేసీఆర్, నిన్న ముఖ్యమంత్రి మళ్ళీ ఆయనకి జవాబుగా టీ-కాంగ్రెస్ మరియు తెరాసా నేతలు వరుస పెట్టి చేస్తున్న ప్రసంగాలు అగ్నికి ఆజ్యం పోస్తుంటే, వాటిని చల్లార్చే ప్రయత్నం చేసే బదులు దిగ్విజయ్ సింగ్, సుశీల్ కుమార్ షిండే వంటి వారు ఆ మంటలను మరింత ఎగదోస్తున్నారు.   ఒకప్పుడు కేవలం తెలంగాణకే పరిమితమయిన ఆ మంటలు ఇప్పుడు రాష్ట్రమంతా వ్యాపించాయి. ఈ మంటలను రాష్ట్రంలో ప్రతిపక్షపార్టీల కంటే అధికార కాంగ్రెస్ పార్టీయే ఎక్కువగా పెంచి పోషిస్తోంది. కాంగ్రెస్ అధిష్టానం ఇటువంటి క్లిష్టమయిన సమస్యను పరిష్కరించడానికి పూనుకొన్నపుడు ముందుగా తన రాష్ట్రనేతలని పూర్తిగా కట్టడి చేసి ఉండి ఉంటే సమస్య తీవ్రత చాలావరకు తగ్గి ఉండేది. కానీ, కాంగ్రెస్ పార్టీలోఎవరినీ ఎవరూ కట్టడి చేయలేరని ఆ పార్టీ నేతలు నేడు నిరూపిస్తున్నారు.   విభజనకు అనుకూలంగా కొందరు, వ్యతిరేఖంగా మరి కొందరు ఎవరికి తోచిన రీతిలో వారు మాట్లాడుతూ సమస్యను మరింత జటిలం చేస్తున్నారు. నిన్న సాక్షాత్ ముఖ్యమంత్రే అధిష్టానం నిర్ణయాన్ని వ్యతిరేఖిస్తూ మాట్లాడటం దీనికి పరాకాష్ట అనుకొంటే, ఆయనపై టీ-కాంగ్రెస్ నేతలందరూ యుద్దానికి దిగడం ఆ పార్టీలో క్రమశిక్షణ ఎంత గొప్పగా ఉందో తెలియజేస్తోంది. అధిష్టానానికి విధేయులమని ప్రకటించుకొనే కాంగ్రెస్ నేతలు అందరు ఈ విధంగా ఎవరికీ తోచినట్లు వారు మాట్లాడుతూ సమస్యని పెంచిపోషిస్తున్నారు.   బహుశః దీనినే కాంగ్రెస్ మార్క్ పాలన అంటారేమో మరి. కాంగ్రెస్ నేతల చెలరేగిపోతున్న తీరుచూస్తే, ఈ వాద ప్రతివాదాలు, ఒకరినొకరు దూషించుకోవడం వగైరా డ్రామాలన్నీ కూడా కాంగ్రెస్ వ్యూహంలో భాగామేనేమో? అని ప్రజలు అనుమానించే పరిస్థితి కల్పిస్తున్నారు. ఎందుకంటే ప్రతిపక్షాలకు రాష్ట్ర విభజన అంశంలో వ్రేలు పెట్టేందుకు ఎటువంటి అవకాశం ఈయకుండా ఉండేందుకే ప్రతిపక్ష పాత్ర కూడా కాంగ్రెస్ పార్టీ తమ నేతల చేతనే పోషింపజేస్తున్నట్లు కనబడుతోంది.

ఆ కమిటీకి తెలంగాణాతో కూడా లింక్ ఉందిట

  టీ-కాంగ్రెస్ మరియు తెరాస నేతలు తెలంగాణా ప్రక్రియకు అంటోనీ కమిటీకి ఎటువంటి సంభందం లేదని, అది కేవలం సీమంద్రా వాళ్ళ సమస్యలు వినేందుకు మాత్రమే ఏర్పాటయిన కమిటీ అని చెపుతుండగా, దిగ్విజయ్ సింగ్ ఈ రోజు డిల్లీలో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణా విభజన నిర్ణయ ప్రక్రియకు, అంటోనీ కమిటికీ సంబంధం ఉందని స్పష్టం చేసారు. అంతేగాక దానికి నిర్దిష్ట వ్యవధి కూడా ఏమి లేదని బాంబు ప్రేల్చారు. అంటోనీ పార్లమెంటు సమావేశాలతో కొంచెం బిజీగా ఉన్నారని, అది పూర్తవగానే అంటే ఈ నెలాఖరున అంటోనీ కమిటీ హైదరాబాదు వచ్చి ముఖ్యమంత్రి సలహా మేరకు సీమంద్రా నేతలతో సమావేశం అవుతుందని ఆయన తెలిపారు.   అంటే, అంటోనీ కమిటీ పని ప్రారంభించడానికే ఇంకా ఇరవై రోజులపైనే వ్యవధి ఉందని తెలుస్తోంది. ఆ కమిటీ సీమంధ్రకు చెందిన వివిధ నేతలతో సమావేశాలు మొదలు పెట్టిన తరువాత అవి ఎంత కాలంలో ముగుస్తాయో తెలియదు. రాష్ట్ర విభజను వ్యతిరేఖిస్తున్న సీమంధ్ర నేతలు, వీలయినంత ఎక్కువ కాలం కాలయాపన చేసేందుకే ప్రయత్నం చేస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు. వారి ధర్మ సందేహలన్నిటినీ విన్న తరువాత వారు లేవనెత్తిన సమస్యల గురించి చర్చించడానికి మళ్ళీ కేంద్ర మంత్రులతో కూడిన ఒక సబ్ కమిటీ నియామకం ఏర్పాటు చేయవలసి ఉంటుంది. ఆ సబ్ కమిటీ సీమంద్ర నేతలు నివేదించిన అన్ని సమస్యలకి ఆమోదయోగ్యమయిన పరిష్కారాలు కనుగొనవలసి ఉంటుంది. మళ్ళీ వాటిపై అంటోనీ కమిటీ సదరు సీమంధ్ర నేతలతో చర్చించి వారిని ఒప్పించడమో లేక వారికి కేవలం తమ నిర్ణయాలు తెలియజేసిన తరువాతనో, విభజన ప్రక్రియ మొదలుపెట్టవచ్చును. ఈ ప్రకారం చూస్తే ఈ కమిటీ సమావేశాలు, పరిష్కారాలు, మళ్ళీ చర్చలు, సమావేశాలకే ఎంత లేదన్నా కనీసం రెండు మూడు నెలలు పట్టే అవకాశం ఉంది. అంటే, అంత వరకు రాష్ట్రంలో ఈ అనిశ్చితస్థితి తప్పకపోవచ్చును.   కేంద్రం తెలంగాణా ప్రకటన చేసే ముందుగానే ఈ ప్రక్రియ అంతా చేసి ఉండిఉంటే, నేడు రాష్ట్రం ఇంత అశాంతి ఉండేది కాదు. తెలంగాణా ప్రకటనకు ముందు కేవలం తెలంగాణా ప్రాంతంలో మాత్రమే అశాంతి నెలకొని ఉండేది. కానీ ఇప్పుడు రాష్ట్రంతా ఉద్రిక్త వాత్రవరణం, అరాచకం నెలకొని ఉంది. ఇందుకు కేంద్రాన్నే తప్పుపట్టాల్సి ఉంటుంది. కాంగ్రెస్ రాష్ట్ర విభజన ప్రకటన చేసేందుకు కేవలం తన రాజకీయ ప్రయోజనాలను మాత్రమే చూసుకొంది తప్ప, రాష్ట్రాన్ని రాష్ట్ర సమస్యలను లెక్కలోకి తీసుకోలేదని దీనివల్ల అర్ధం అవుతోంది. దీనికి రాష్ట్ర ప్రజలు భారీ మూల్యమే చెల్లిస్తున్నారిప్పుడు.

అనిశ్చితి పాపం కాంగ్రెస్‌దే

  ప్రస్తుతం రాష్ట్రంలో నెల‌కొన్న అనిశ్చిత ప‌రిస్ధితికి కాంగ్రెస్ పార్టీనే కార‌ణం అన్నారు లోక్ స‌త్తా పార్టీ అధినేత జ‌య‌ప్రకాష్ నారాయ‌ణ‌, శుక్రవారం మీడియాతో స‌మావేశం అయిన ఆయ‌న ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభ‌జ‌నను కాంగ్రెస్ పార్టీ త‌మ సొంత పార్టీ విష‌యం భావించ‌డం వ‌ల్లే ప్రస్థుతం రాష్ట్రం ఇలా అగ్నిగుండాల మారింద‌న్నారు. రాష్ట్రం విడిపోయినా ప్రజ‌లు ఒక‌టే అనే భావ‌న ప్రజ‌ల‌కు క‌ల్పించ‌టంలో కాంగ్రెస్ పార్టీ విఫ‌ల‌మ‌య్యింద‌న్నారు. రాష్ట్రం ఇలా అగ్ని గుండంలా ఉన్న దేశ ప్రదాని, హోం మంత్రులు స్పందించ‌క‌పోవ‌డం దారుణం అన్నారు. గత మూడేళ్లుగా అటు సీమాంధ్రలో, ఇటూ తెలంగాణలో ఆర్థిక వ్యవస్థ స్తంభించిందని జయప్రకాశ్ నారాయణ ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు.

న‌రేంద్రమోడి స‌భ‌కు స‌ర్వం సిద్దం

  ఎల‌క్షన్లకు ఇంకా చాలా రోజులు ఉండ‌గానే బిజెపి త‌న ప్రచ‌రాన్ని మొద‌లు పెట్టింది. ఆ పార్టీ ప్రచార సార‌దిగా ఉంటూ ప్రదాని అభ్యర్ధిగా కూడా భావిస్తున్న గుజ‌రాత్ ముఖ్యమంత్రి న‌రేంద్ర మోడి ఆదివారం హైద‌రాబాద్ రానున్నారు.  హైదరాబాద్ వేదికగా తన ప్రచారయుద్ధాన్ని మొదలుపెట్టనున్నారు. 'నవభారత యువభేరి' పేరుతో హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో మోడీ భారీ బ‌హిరంగ స‌భ నిర్వహించ‌నున్నారు. ఇందుకు బీజేపీ రాష్ట్ర నాయ‌క‌త్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. స‌భ‌కు వ‌చ్చే అభిమానులు కార్యక‌ర్తల నుంచి ఐదు రూపాయ‌ల చొప్పున ప్రవేష రుసుమును వ‌సూలు చేయ‌నున్నారు అయితే ఈ మొత్తాన్ని ఉత్తరాఖండ్ వ‌ర‌ద బాదితుల‌కు అందించ‌నున్నారు. ఈ స‌భ‌కు లక్షకు పైగా ప్రజలు వ‌స్తార‌ని భావిస్తున్న బిజెపి అందుకు త‌గ్గట్టుగానే ఏర్పాట్లాను చేస్తున్నారు. రాష్ట్ర పర్యటన భాగంగా బ‌హిరంగ స‌భ‌తో పాటు నరేంద్రమోడీ ఓ పాఠశాలలో సర్దార్ పటేల్ విగ్రహాన్ని ఆవిష్కరించి, పార్టీ రాష్ట్ర నాయ‌కుల‌తో సమావేశం అవుతారు.

కిర‌ణ్‌పై నిప్పులు చెరిగిన కెసిఆర్‌

  తెలంగాణ ప్రక‌ట‌న త‌రువాత చాలా రోజులు మౌనం పాటించిన కిర‌ణ్‌ నిన్న ఒక్క సారిగా నోరు విప్పారు అంతేకాదు తాను అసలు సిలైన స‌మైక్యవాదినంటూ త‌న మాట‌ల‌తో చెప్పక‌నేచెప్పారు. అయితే సియం మాట‌లు ఎలా ఉన్న ఆయ‌న మాట‌ల దుమారం మాత్రం రాష్ట్ర రాజ‌కీయాల‌ను కుదిపేస్తుంది. కిర‌ణ్ కుమార్ రెడ్డి మాట‌ల‌పై ఆయ‌న సొంత పార్టీ నుంచే తీవ్ర స్థాయిలో విమ‌ర్శలు ఎదుర‌వుతున్నాయి. అయితే కిర‌ణ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్య ల పై ప్రెస్ మీట్ పెట్టి మ‌రి స్పందించారు తెలంగాణ రాష్ట్ర స‌మితీ అధ్యక్షుడు కెసిఆర్‌. రాష్ట్ర విభజన ప్రకటనతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మానసిక స్థితి దెబ్బతిందన్న కెసిఆర్ కిరణ్ పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారని విమ‌ర్షించారు. హైదరాబాద్ గురించి మాట్లాడే హక్కు కిర‌ణ్‌కు లేదన్న ఆయ‌న విభజన ప్రకటన వచ్చిన తర్వాత కూడా హైదరాబాద్ పరిస్థితి ఏంటని కిరణ్ ప్రశ్నించడం హాస్యస్పదం అన్నారు. అంతేకాదు సియం చెప్పిన లేక‌ల‌పై తాము బ‌హిరంగ చ‌ర్చకు సిద్దం అన్న ఆయ‌న సియం అందుకు రెడీ నా అన్ని స‌వాలు విసిరారు.క‌రెంటు, నీళ్లు లాంటి విష‌యాల‌ను చెప్పి కిర‌ణ్ కుమార్ రెడ్డి ప్రజ‌ల‌ను భ‌య‌పెట్టే ప్రయ‌త్నం చేస్తున్నార‌న్న కెసిఆర్, రాష్ట్ర ఏర్పడితే అన్నిరంగాల్లో అభివృద్ది చెందుతామ‌ని తెలంగాణ ప్రజ‌ల‌కు భ‌రోసా ఇచ్చారు.

విభజన కోస్తా ఆంధ్ర, రాయలసీమకు శరాఘాతం !

  తరచూ తెలంగాణా తమ్ముళ్ళు ,నాయకులూ అంటుంటారు .ఆంధ్ర వారు పెద్దన్న పాత్ర పోషించి రాష్ట్రాన్ని విడగొట్టి తెలంగాణా ఏర్పాటుకు మార్గం సులభ తరం చేయాలి అని . ఇప్పుడు కాంగ్రెస్ ఉద్దేశం ప్రకారం  తమ్ముడికి  అత్యాశ కలిగిన గడుసరి పెళ్ళాం(ఉద్యమాలు ) వుండడం వల్ల అన్న ఆస్తులన్నీతమ్ముడికి జాలిపడి  ఇచ్చేసి బికారి అయ్యి సన్యాసి అయి అడువులకు పోవలన్నట్లు వుంటుంది . "ఆనాడు  లక్ష్మణుడు అన్నకోసం భార్యను రాజ్యాన్ని వదిలి అడివి కి వెళ్ళాడు .  ఈ నాటి  తమ్ముడు అన్నను కట్టు బట్టలతో తరిమేస్తున్నాడు .  నోరు మంచిదైతే వూరు మంచిది అనే నానుడి పోయి నోరున్న వాడిదే రాజ్యం అన్నట్లు ఈ విభజన నిర్ణయం బాధేస్తుంది" .  ఉమ్మడి రెక్కల కష్టం తో హైదరబాద్ ను నిర్మిస్తే హైదరబాద్ మాది అని అనడం ఎంత భావ్యమో చెప్పాలి . అది తెలంగాణా కు మాత్రం సొంతం అంటే ఎలా !. మీరు నిజంగా హైదరబాద్ 1956 నుంచి ఏమి మారలేదు అంటే ఆప్పటి నుంచి వున్నా  ఆస్తులు ఉమ్మడి ఆస్తులు గా ప్రకటించండి. అవి రెండు రాష్ట్రాలకు చెండుతాయీ . ... ఏమి మాటలు రావడం లేదా...  గొంతు పెగలడం లేదా ఏమి న్యాయము ఇది !. సోదరా సోదరుల్లాగా విడిపోతాము అని చెపుతూ మీరు మీ భార్య  పిల్లలు ఆంధ్ర కు పోయి అడుక్కోండి అన్నట్లు వున్నది . మీ ఆంధ్ర నాయకులూ,వ్యాపార వేత్తలు ,పెట్టుబడి దారులు , దొంగలు, దోపిడీ దారులు ,రక్త పిపాసులు. మీరు నిర్మించిన హైటెక్ సిటీ పిచ్చుకుల గూడు, మీ రచయతలు సాహిత్యం తెలియదు ,మీ ఆంధ్ర  గోంగూర పెడ లాగా వుంటుంది ,మీ బ్రాహ్మణులకు మంత్రాలూ రావు , మీ తెలుగు తల్లి పనికిరాని పిచ్చీ తల్లి . ఆంధ్ర ప్రజలు మంచోళ్ళు  అయినా కాని వాళ్ళు హైదరబాద్ వదిలి వెళ్ళాల్సిందే .. ...  ఇది మన తెలంగాణ నాయకులు చెప్పే కథలు ,వినిపించే నీతులు  మనసు లేని, హృదయం లేని కర్కో టకపు  మూర్కపు పిడి  వాదనలు.  ఇప్పుడు  వీరికి నిజాం నవాబు గొప్ప నాయకుడు,రజాకార్లు దేశభక్తులు. మావో ఇష్టు తరహాలో నూతన  తెలంగాణా ప్రభుత్వమట ! మీరు రాజకీయ నాయకుల్లో,పెట్టుబడి దారుల్లో  మంచి ,చెడు లేని వారిని ప్రాంతాల వారి గా  చూపించాగలరా !. వెయ్యి అబద్ధాలతో తెలంగాణా ప్రజలను అవి నిజాలుగా నమ్మించడం లో  వేర్పాటు వాదులు తాత్కాలిక విజయం సాధించారు . గాంధీ గారి గ్రామ స్వరాజ్యం,స్వతంత్రం  పోయి ,ఒకే చోట అధికారాలు ,వసతులు ,ఉద్యోగాలు ,పెట్టుబడులు పెట్టడం వల్ల ఈరోజు మనకు ఈ పరిస్థితి వచ్చింది .  మన రేపటి ఆంధ్ర పరిస్థితి నీళ్ళు ఉండవు ,ప్రభుత్వ ,ప్రైవేటు ఉద్యోగాలు దొరకవు ,విమానాశ్రయాలు లేవు ,రవాణ సౌకర్యాలు అంతంత మాత్రమే ,కనీసం చెప్పుకో దగ్గ ట్రైన్లు లేవు . ఎట్లా చూసిన నష్టమే !.   కలసి వుండడం నిజంగా  సాధ్యం కాకపోతే హైదరబాద్ నగరం ను స్వయం ప్రతి పత్తి కల రాష్ట్రము లాగా ,UT స్టేట్ ,లేదా రాజ్యాంగ పిత  Dr BR అంబేద్కర్ చెప్పినట్లు  రెండవ రాజధానిగా హైదరబాద్  ఏర్పడాల్చిందే !. దీని వల్ల  ఉభయ ప్రాంతాలకు సమాన  న్యాయం జరుగుతుంది . అన్ని ప్రాంతాలు మెల్ల మెల్లగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉంటాయీ!. ఇప్పుడే మన హక్కులు నయానో భయానో సాధించుకోవాలి !. మొహమాటానికి ,భేషజాలకు ,మర్యాద ల కు పొతే మనకు మిగిలేది మట్టే  (బొగ్గు కూడా తెలంగాణా లోనే వుంది )  .

ఎంసెట్ కౌన్సిలింగ్‌కు లైన్ క్లియ‌ర్

  ఎంసెట్ కౌన్సిలింగ్‌కు హైకోర్టు లైన్ క్లియ‌ర్ చేసింది. చాలా రోజులు విద్యార్ధులు, త‌ల్లి దండ్రులు ఆత్రుత‌గా ఎదురు చూస్తున్న కౌన్సింలింగ్‌కు హైకోర్ట్ ఒకే అంది. ఈ నెల 19 నుంచి కౌన్సిలింగ్ ప్రారంభించాల‌ని ఉన్నత విద్యామండ‌లిని ఆదేశించింది. దీనికి సంభందించిన నోటిఫికేష‌న్ కూడా వారం ముందుగా రిలీజ్ చేయాలని కోర్టు ఆదేశించింది. వీటితో పాటు యాజ‌మాన్య కోటా సీట్లకు సంబందించిన వివ‌రాల్ని ముందుగానే వెబ్‌సైట్‌లో పొందుపర‌చాల‌ని హైకోర్టు సూచించింది. మేనేజ్‌మెంట్‌ కోటా సీట్ల భర్తీ కూడా కౌన్సెలింగ్‌ ద్వారానే భర్తీ చేయాలని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలతో ఈ నెల 12న కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల చేసేందుకు ఉన్నత విద్యా మండలి రెడీ అవుతుంది. ఈ మధ్య కాలంలో ఎంసెట్‌ కౌన్సెలింగ్‌లో ఇంత జాప్యం జరగడం ఇదే మొదటిసారి.

సోనియాను క‌లిసిన రాముల‌మ్మ

  టి ఆర్ ఎస్ బ‌హిష్కృత నేత విజ‌య‌శాంతి, యుపిఏ అద్యక్షురాలు సోనియా గాందిని క‌లిశారు. ఏఐసిసి అధికార ప్రతినిధి రేణుకా చౌద‌రితో క‌లిసి ఆమె సోనియా నివాసానికి వెళ్లారు. విజ‌య‌శాంతి పార్టీ వ్యతిరేక కార్యక‌లాపాల‌కు పాల్పడుతుంద‌న్న ఆరోప‌ణ‌లతో ఇటీవ‌లే టిఆర్ఎస్ పార్టీ ఆమెను సస్పెండ్ చేసింది. కొద్దిరోజులుగా పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నవిజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరుతారన్న వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పార్టీలో త‌న‌కు స‌ముచిత స్ధానం ద‌క్కటం లేద‌న్న ఆసంతృప్తితో ఉన్న ఆమె పార్టీకి దూర‌మ‌వుతూ వ‌చ్చారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు అనుకూల నిర్ణయాన్ని ప్రకటించిన సందర్భంలో కూడా ఆమె పార్టీ కార్యాల‌యానిక రాలేదు. ఈ ప‌రిస్థితుల్లో విజ‌య‌శాంతి సోనియాను క‌ల‌వ‌డంతో ఆమె కాంగ్రెస్ చేర‌టం కాయంగానే క‌నిపిస్తుంది. ఇంత‌వ‌ర‌కు అధికారికంగా ప్రక‌టించ‌క‌పోయినా త్వర‌లోనే ప్రక‌ట‌న వెలువ‌డ‌వ‌చ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

మౌనం వీడిన ముఖ్యమంత్రి

  కేంద్ర తెలంగాణ ప్రక‌ట‌న చేసిన త‌రువాత తొలి సారిగా ముఖ్యమంత్రి కిర‌ణ్ కుమార్ రెడ్డి నోరు విప్పారు. రాష్ట్ర విభ‌జ‌నపై ఎవ‌రికి ఎలాంటి అభ్యంతరాలు ఉన్న ఆంటోని క‌మిటీకి నివేదించుకోవాలి అన్నారు. దీంతోపాటు స‌మైక్యాంద్ర కొసం స‌మ్మె బాట ప‌ట్టిన ఉద్యోగుల‌ను స‌మ్మె విర‌మించుకోవాల‌ని కోరారు. ఇలాంటి చ‌ర్యల వల్ల ఇరు ప్రాంతాల ప్రజ‌లు తీవ్రంగా న‌ష్టపోవాల్సి వ‌స్తుంద‌న్నారు. సీమాంద్ర లో జాతీయ నాయ‌కులు విగ్రహాల కూల్చివేతపై సీయం సీరియ‌స్ అయ్యారు ఇలాంటి ప‌నుల‌తో స‌మ‌స్య మ‌రింత పెద్దదుతుందే కాని ప‌రిష్కారం దొర‌క‌ద‌ని చెప్పారు.విధ్వంసాలకు పాల్పడే వారిపై కఠిన వైఖరి అవలంభిస్తామని హెచ్చరించారు. శాంతిభద్రతల విషయంలో తమ ప్రభుత్వం కచ్చితంగా, కఠినంగా ఉంటుందని స్పష్టం చేశారు. కేంద్ర ప్రక‌ట‌నపై స్పందించిన సియం సిడ‌బ్ల్యూసి ప్రక‌ట‌న తాను ఖండించ‌టం లేదు అంటూనే స‌మ‌ర్ధించ‌టం కూడా లేద‌న్నారు.. వ్యక్తిగ‌తంగా ఇప్పటికీ తాను స‌మైక్య వాదినే అన్నారు. విభ‌జ‌న విష‌యంలో అన్ని పార్టీలు దొంగ‌నాట‌కాలు ఆడుతున్నాయి అన్న కిర‌ణ్ విభ‌జ‌న విష‌యం ఇంకా కాంగ్రెస్ పార్టీ వ‌ద్దే ఉంద‌న్నారు.ఉద్యమాల కోసం ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.

ఆందోళ‌న కారుల‌కు డిజిపి వార్నింగ్‌

  తెలంగాణ ప్రక‌ట‌న‌తో ఇరుప్రాంతాల్లో ప‌రిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి.. దీంతో ప‌రిస్థితుల‌ను కొలిక్కి తీసుకొచ్చేందుకు డిజిపి దినేష్ రెడ్డి ప్రెస్‌మీట్ నిర్వహించి హెచ్చరిక‌లు జారీ చేశారు. త్వర‌లో ఉద్యమం మ‌రింత ఉదృతం అవుతుంద‌న్న ఆందోల‌న కారుల హెచ్చరిక‌ల నేప‌ధ్యంలో దినేష్ రెడ్డి పోలీసులు ఉద్యమ‌కారులపై వ్యవ‌హ‌రించే తీరుపై మాట్లాడారు. రైల్ రోకో లాంటి ఆందోల‌న‌లు చేప‌డితే క‌ఠినమైన శిక్షలు ప‌డ‌తాయ‌ని హెచ్చరించారు. అంతేకాదు జాతీయ‌నాయ‌కులు విగ్రహాలు ద్వంసం చేయడం కూడా తీవ్రమైన నేరం అన్న ఆయ‌న అలాంటి త‌ప్పుల‌కు క‌నీసం మూడేళ్ల జైళు శిక్ష ప‌డుతుంద‌న్నారు. ప్రజ‌ల ధ‌న మాన ప్రాణాల‌ను కాపాడ‌మే పోలీసుల క‌ర్తవ్యం అన్నారు. విభ‌జ‌న స‌మైక్య ఉద్యమాల‌ నేప‌ధ్యంలో పోలీసులపై విమ‌ర్శలు చేయ‌డాన్ని ఆయ‌న త‌ప్పు ప‌ట్టారు.. ఈవిష‌యంలో మీడియా కూడా సంయ‌మ‌నం పాటించాల‌న్నారు. పోలీసులకు అన్ని ప్రాంతాల వారు స‌మాన‌మేనని వారు ఎవ‌రికి సాయంగానే, ఎవ‌రి పై క‌క్షపూరితంగానో ప‌ని చేయ‌ర‌ని చెప్పారు. సీమాంద్రులు ప్రజాస్వామ్య ప‌ద్దతుల్లో ఎలాంటి ఉద్యయం అయినా చేసుకోవ‌చ్చన్న ఆయ‌న ప్రజాస్వామ్య ప‌ద్దతుల్లో ఎవ‌రు నిర‌స‌న‌లు తెలిపిన తాము అడ్డుచెప్పమ‌న్నారు.

సారీ, అధిష్టానాన్ని ఇక ఆపలేను: లగడపాటి

      రాష్ట్ర విభజన జరిగిన మరుక్షణమే రాజకీయ సన్యాసం చేస్తానని ప్రగల్భాలు పలికిన లగడపాటి రాజగోపాల్ ఇప్పుడు కొత్త పల్లవి అందుకొన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే తన పోరాటమంతా తెదేపా వల్ల వృదా అయిపోయిందని, చంద్రబాబు ఇకనయినా నోరు విప్పి రాష్ట్ర విభజనపై తన అభిప్రాయం స్పష్టం చేయాలని, లేకుంటే తెలుగు జాతి ఆయనను ఎన్నటికీ క్షమించదని అన్నారు. తను రాష్ట్రం విడిపోకుండా ఉండాలని విశ్వప్రయత్నాలు చేసానని, కానీ ఆపలేకపోయానని అన్నారు. కాంగ్రెస్ అధిష్టానం తన నిర్ణయం వెనక్కు తీసుకొనేలా చేయగల శక్తి తనకు లేదని ఆయన తెలిపారు. తెదేపా, వైకాపాలు తమ ద్వంద వైఖరి కట్టిపెట్టి రాష్ట్ర సమైక్యతకోసం కృషిచేయాలని ఆయన హితవు పలికారు. ఇక మొన్నటి వరకు రాష్ట్ర విభజన చేస్తే రాష్ట్రాన్ని అగ్నిగుండం చేసేస్తానని ప్రగల్బాలు పలికిన కావూరి సాంభ శివరావు, తన చిరకాలవాంచ అయిన కేంద్ర మంత్రి పదవి స్వీకరించిన కారణంగా అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి పోయారు. ఇప్పుడు నేనేమి చేయలేని నిస్సాహయుడనని ఆయన అన్నారు. మరి కొద్ది రోజులలో మరి కొంత మంది మంత్రులు యంపీలు కూడా ఇదే పాట పాడే అవకాశం ఉంది. ఇప్పుడు ఆంటోనీ కమిటీ కూడా ఏర్పాటయిపోయింది కనుక ఇక కాంగ్రెస్ వ్యూహం ప్రకారం మెల్లగా కమిటీతో సమావేశాలు మొదలుపెట్టి, కొన్ని వరాలు ప్రకటింప జేసుకొని  అంతిమంగా రాష్ట్ర విభజనకు అయిష్టంగానే ఒప్పుకొంటున్నట్లు నటిస్తూ ఎన్నికలకి సిద్దం అయిపోతారు. వారితో బాటే మిగిలిన పార్టీ నేతలు కూడా సమైక్య విరమణ చేసేయడం మనం చూడవచ్చును.

ఉద్యోగుల సమ్మె వద్దు

      తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును నిరసిస్తూ రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని డిమాండ్ చేస్తూ ఏపీ ఎన్జీవోలు, ఆర్టీసి కార్మికులు సమ్మెకు వెళ్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఈ నెల12 నుండి సమ్మె చేస్తామంటూ ప్రభుత్వానికి నోటీసు కూడా ఇచ్చారు. దీంతో తెలంగాణ బిల్లు వెంటనే పార్లమెంట్ లో పెట్టాలని డిమాండ్ చేస్తూ తాము కూడా సమ్మెకు వెళ్తామని తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మె నోటీసు ఇచ్చారు. ఈ నేపథ్యంలో విజయవాడ కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మాట్లాడుతూ సీమాంధ్ర ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెకు వెళ్లొద్దని, సమ్మెల మూలంగా ప్రజలు ఇబ్బందులు పడతారని, ఉద్యోగులు జీతాలు కోల్పోతారని అన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉంచేందుకు తాము అన్ని విధాలుగా పోరాడుతున్నామని, ఉద్యోగులు సమ్మె యోచనను విరమించుకోవాలని ఆయన అన్నారు.

సరిహద్దులు నిర్దారణకొరకు భద్రాచలం వచ్చిన కేంద్ర బృందం

  ఈ రోజు ఒక ప్రముఖ దినపత్రికలో ఒక ఆసక్తికరమయిన వార్త వచ్చింది. ఐదుగురు సభ్యులతో కూడిన కేంద్ర అధికారుల బృందం ఒకటి తెలంగాణ రాష్ట్ర భౌగోళిక సరిహద్దుల నిర్ధారణ నిమిత్తం ఖమ్మం జిల్లాలోని భద్రాచలం డివిజన్‌కు వచ్చి అక్కడ సరిహద్దులను నిర్దారించుకొనట్లు ప్రచురించింది. భద్రాచలం డివిజన్‌న్ను తెలంగాణ నుండి తప్పించి, దానికి సమీపంలో ఉన్న తూర్పుగోదావరి జిల్లాలో కలిపేందుకు వీలుగా స్థానిక అధికారుల సహాయంతో సరిహద్దుల మార్పులకి అవసరమయిన వివరాలను వారు సిద్దం చేసుకొంటున్నట్లు సమాచారం. ఈ సంగతిని ఖమ్మం జిల్లాకు చెందిన కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి దృష్టికి తీసుకు వెళ్ళగా, తనకు కనీసం మాట మాత్రంగా చెప్పకుండా కేంద్రం అధికారుల బృందాన్ని పంపడాన్నిఆమె నిరసన తెలియజేసారని ఆ పత్రికలోవార్త వచ్చింది. ఖమ్మం జిల్లాలోని భద్రాచలం డివిజన్‌ను ఎట్టి పరిస్థితుల్లో తూర్పుగోదావరి జిల్లాలో కలపకుండా అడ్డుకొనేందుకు ఆమె సూచన మేరకు జిల్లాకు చెందిన పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు తమ అధినాయకత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఢిల్లీకి ప్రయాణమవుతున్నట్లు తెలిసింది. కేంద్రం ఇంకా విభజన ప్రక్రియ మొదలు పెట్టక ముందే ఇంత వేగంగా కేంద్ర బృందం రంగంలోకి దిగడం విశేషమే. ఇదే నిజమయితే, కాంగ్రెస్ పార్టీ చెపుతున్నట్లు నాలుగు నెలలోనే విభజన ప్రక్రియ మొత్తం పూర్తి చేయగలదేమో.

కాంగ్రెస్ బీజేపీలకి వీర సైనికుడి భార్య చెంపపెట్టు

  రక్షణ మంత్రి అంటోనీ “పాక్ సైనికుల దుస్తులలో వచ్చిన కొందరు వ్యక్తులు భారత సైనికులను చంపారని” చేసిన ప్రకటనను పట్టుకొని పార్లమెంటులో కాంగ్రెస్ బీజేపీలు బాధ్యతా రాహిత్యంగా ప్రవర్తిస్తూ ఒకరిపై మరొకరు కత్తులు దూసుకొంటుంటే, వారికి గడ్డి పెడుతున్నట్లుగా పాకిస్తాన్ సైనికుల దాడిలో మృతి చెందిన సైనికుడు విజయ రాయ్ భార్య పుష్పారాయ్ ప్రభుత్వం ఇచ్చిన నష్టపరిహారాన్ని తిరస్కరింఛి, ముందు తన భర్తను పొట్టన బెట్టుకొన్న పాకిస్తాన్‌కు తగిన విధంగా బుద్ధి చెప్పాలని కోరారు.   ప్రభుత్వం నిర్లక్ష్యం వలననే తన భర్త చనిపోయాడని, ఇటువంటి ఘటనలు తరచూ జరుగుతూ అనేకమంది సైనికులు చనిపోతున్నపటికీ, ప్రభుత్వంలో ఎటువంటి మార్పు కలగకపోవడం చాలా విచారకరమని ఆమె అన్నారు. ఇకనయినా ప్రభుత్వం మేల్కొని అటువంటి దుష్కర మూకలను పెంచి పోషిస్తున్న పాక్ ప్రభుత్వానికి దీటుగా జవాబు చెప్పాలని ఆమె కోరారు. ఇంకా ఎంత కాలం ఈవిధంగా సైనికులు తమ ప్రాణాలు పాక్ సైనికులకు బలివ్వాలి అని ఆమె ఆవేదనతో ప్రశ్నించారు.   చనిపోయిన ఐదుగురు జవాన్లలో నలుగురు బీహార్ రాష్ట్రానికే చెందిన వారే కావడంతో సర్వత్రా నిరసనలు, రైల్ రోకోలు జరుగుతున్నాయి. రక్షణ మంత్రిని క్షమాపణ చెప్పమని బీజేపీ పట్టుబడుతుంటే, ఆయన పూర్తి సమాచారంతో మళ్ళీ పార్లమెంటుకు సమాధానం చెపుతానని శలవు తీసుకొన్నారు. కానీ రెండు పార్టీలు కూడా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలో మాత్రం చర్చించేందుకు మాత్రం ఆసక్తి కనబరచలేదు.   ఆ సైనికుడి వీరపత్ని ప్రభుత్వం ఇచ్చిన నష్టపరిహారాన్ని తిరస్కరించిన తరువాతయినా ఈ కాంగ్రెస్ బీజేపీలకి జ్ఞానోదయం అవుతుందని భావించడం అడియాసే అవుతుందేమో!

విభజనకు జీజం వేసింది రాజశేఖర్‌రెడ్డే

      రాష్ట్ర విభజనకు జీజం వేసింది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డేనని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. రాష్ట్ర విభజనపై 40 మంది శాసనసభ్యులతో చిన్నారెడ్డి నాయకత్వంలో అధిష్ఠానానికి వైఎస్ లేఖ పంపారని గుర్తు చేశారు. వైఎస్ బాటలోనే టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కూడా పయనించారని వ్యాఖ్యానించారు. 2009 ఎన్నికల్లో వేర్పాటువాదానికి అనుకూలంగా కేసీఆర్‌తో కలిసి టీడీపీ పోటీ చేసిందని గుర్తుచేశారు. అలాగే తెలంగాణ ఉద్యమంతో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా అఖిల పక్ష భేటీలో వేర్పాటువాదానికి అనుకూలంగా అభిప్రాయాలు చెప్పడంతో చివరగా కాంగ్రెస్ నిర్ణయం ప్రకటించిందన్నారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్‌ను దోషిగా నిలపాలని ప్రతిపక్షాలు ప్రయత్నిస్తుండటం నీచమన్నారు. దేశ సమగ్రతకు పాటుపడిన ఇందిరా, రాజీవ్ గాంధీ విగ్రహాల ధ్వంసానికి వైసీపీ నేతలు పాల్పడుతుండటం దౌర్భాగ్యమని, ఆ పార్టీలో విష పురుగులు ఉన్నందునే ఇలా జరుగుతోందన్నారు.

కెసిఆర్ కు భద్రత పెంపు

      కెసిఆర్ హత్యకు కుట్ర జరుగుతోందని తెరాస ఎమ్మెల్యేలు హరీష్ రావు, ఈటెల రాజేందర్‌లు రెండు రోజుల క్రితం ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కెసిఆర్‌కు ప్రభుత్వం భద్రత పెంచింది. మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ వ్యవసాయ క్షేత్రం వద్ద ప్రత్యేక బలగాలతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కొత్త బుల్లెట్ కారును సమకూర్చింది. కెసిఆర్ వ్యవసాయ క్షేత్రానికి చేరుకోగానే పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. బాంబు స్క్వాడ్ పరిసర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించింది. స్థానిక ఎస్సై, ఎఆర్ ఎస్సై, నలుగురు కానిస్టేబుళ్లు, జిల్లా కేంద్రమైన సంగారెడ్డి నుండి వచ్చిన ఎనిమిద మంది ప్రత్యేక అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

టిఆర్‌ఎస్‌లో మరో వికెట్‌ పడింది

  కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ దిశగా వేగంగా అడుగులు వేస్తుండటంతో టీఆర్‌ఎస్‌ పార్టీకి దిక్కుతోచడం లేదు.  ఆ పార్టీకి చెందిన సీనియర్‌ నాయకులు కూడా ఒకరొకరుగా పార్టీని వీడి కాంగ్రెస్‌ పార్టీ వైపు వెళుతున్నారు. తాజాగా టిఆర్‌ఎస్‌ పార్టీ కి చెందిన మాజీ మంత్రి వరంగల్‌ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే విజయరామారావు ఆ పార్టీకి గుడ్‌ బై చెప్పారు. మంగళవారం రాత్రి పార్టీ పెద్దలతో ఆయన జరిపిన చర్చలు విఫలం అవ్వడంతో వెంటనే ఆయన రాజీనామా చేశారు. గత ఆరునెలలుగా పార్టీలో తనకు సముచిత స్థానం దక్కడం లేదన్న విజయరామారావు, తన నియెజిక వర్గంలో ఉధ్యమానికి ఉపయోగపడని వారికి ప్రాదాన్యత ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చాలా రోజులుగా తనకు అసంతృప్తి ఉన్నా ఉద్యమానికి నష్టం కలుగ కూడదనే ఇన్నాళ్లు వేచి చూశానన్నారు.