"సమరదీక్ష"కు సబిత అనుమతి

 

 

 

 

తెలంగాణ ఐక్యకార్యాచరణ సమితి నిర్వహించనున్న "సమరదీక్ష"కు పోలీసులు అనుమతినిచ్చారు. 36 గంటల దీక్షకు అనుమతించకుండా అడ్డుకోవడంతో తెలంగాణవాదులు ఆందోళన బాట పట్టారు. ఎంఎల్ సీ చుక్కా రామయ్య, ప్రజా గాయకుడు గద్దర్ అనుమతి కోసం హోంమంత్రిని ఆశ్రయించారు. దీంతో హోంమంత్రి సబిత సమర దీక్షకు అనుమతిని ఇచ్చారు. వినతి పత్రాన్ని సైబరాబాద్ కమిషనర్‌కు ఇవ్వాలని సూచించారు.


సోమవారం సాయంత్రం వరకు దీక్ష చేసుకోవాలని పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ సూచించారు. దీక్షకు పోలీసుల అనుమతి లభించడంతో తెలంగాణ రాజకీయ జేఏసీ నేతలు, విద్యార్థులు, తెలంగాణవాదులు ఇందిరాపార్క్‌కు భారీగా చేరుకుంటున్నారు. ఇప్పటికే సమరదీక్ష ప్రాంగణం తెలంగాణవాదులతో నిండిపోయింది.

 

Teluguone gnews banner