ఏపీ ప్రభుత్వం లక్ష టాబ్లెట్ లు.. 100 కోట్లు
* లక్ష టాబ్లెట్ లు.. 100 కోట్లు
* ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఈ-మెయిలింగ్ సిస్టమ్
* వారం రోజులపాటు ట్రెయినింగ్
* స్కూళ్లకు కూడా టాబ్స్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రాబాబు నాయుడు ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయడంలో ఎంత సమర్ధుడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే హైదరాబాద్ ఉన్న ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసింది.. ఐటీ రంగంలో హైదరాబాద్ అంత ముందుండటానికి వెనుక కారణం చంద్రాబాబే. ఇప్పుడు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూడా టెక్నాలజీని ఉపయోగించడానికి నడుంకట్టారు. దీనికోసం సుమారు 100 కోట్ల వ్యయంతో లక్ష టాబ్లెట్ లను కొనుగోలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్కెటింగ్, రెవిన్యూ, ఎక్సైజ్, ఇరిగేషన్, కమర్షియల్ టాక్సెస్, అగ్రికల్చర్ వంటి డిపార్ట్ మెంట్ లకు 32,000 టాబ్లెట్ లను ఇవ్వనుంది. మరో 6,700 టాబ్లెట్ లను ఆడిపార్ట్ మెంట్లలోని సీనియర్ ఉద్యోగులకు ఇవ్వనుంది. అయితే టాబ్లెట్ లు కొనడం దగ్గరనుండి వాటిని అఫీషియల్స్ కు అందజేయడం.. వారికి ఆన్ లైన్ సర్వీసు ప్రొవైడ్ చేయడం వంటి పూర్తి బాధ్యతలు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిపార్ట్ మెంట్ చూసుకుంటుంది. అయితే ఐటీ డిపార్ట్ మెంట్ 7,8 లేదా 9 అంగుళాలు, అడ్వాన్స్ డ్ ఫిచర్స్ కలిగిన టాబ్లెట్ ను కొనుగోలు చేయనుందని... వీటికి ఇంటర్నెట్ సర్వీసు ఉండటం ద్వారా ప్రభుత్వం ద్వారా ఎప్పటికప్పుడు అప్ డేట్స్ తెలుసుకోవచ్చని ఒక సీనియర్ ప్రభుత్వాధికారి తెలిపారు.
మొదటి విడతలో ప్రతి జిల్లాకు 2,000 టాబ్లెట్ లు ఇస్తామని, రెండో విడతలో భాగంగా ప్రతి మండలానికి 10 నుండి 20 టాబ్లెట్ లు ఇస్తామని అది కూడా కేడర్ ను బట్టి ఇస్తామని తెలిపారు. టాబ్లెట్ ఉపయోగించే విధానం, ఎలా ఆపరేట్ చేయాలి లాంటి డౌట్ లకు ఒక వారం రోజుల పాటు క్లాసులు కూడా నిర్వహిస్తామని.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొత్తం ఈ-మెయిల్ సిస్టమ్ ద్వారా నడవాలని ప్రభుత్వ అధికారులు అంటున్నారు. ఈ టాబ్లెట్ లను కేవలం ప్రభుత్వ కార్యలయాలకు మాత్రమే కాదు ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ స్కూళ్లకు కూడా అందించాలని.. రాష్ట్రంలో మొత్తం 62,000 టాబ్లెట్ లను స్కూళ్లకు అందజేయాలని ఏపీ ప్రభుత్వం చూస్తుందని ప్రభుత్వ అధికారులు స్పష్టం చేశారు.