అబ్దుల్ కలాం పరిస్థితి విషమం?

  భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఆరోగ్య పరిస్థితి విషమంగా వున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లో వున్న ఒక ప్రైవేట్ ఆస్పత్రిలోని ఐసీయులో వున్నారు. షిల్లాంగ్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రసంగిస్తున్న అబ్దుల్ కలాం అకస్మాత్తుగా కుప్పకూలడంతో ఆయన్ను ఆస్పత్రిలో చేర్పించారు. ఐసీయులో వున్న ఆయన పరిస్థితి విషమంగా వున్నట్టు తెలుస్తోంది. కలాం వయసు 84 సంవత్సరాలు. కలాం ఆరోగ్య పరిస్థితి మీద ఆయన చికిత్స పొందుతున్న ఆస్పత్రి వర్గాలు స్పందించాయి. ‘‘కలాం ప్రస్తుతం ఐసీయులో వున్నారు. ఆయన కార్డియాక్ అరెస్ట్ సమస్యను ఎదుర్కొన్నారని భావిస్తున్నాం’’ అని ఆ వర్గాలు చెప్పాయి. అబ్దుల్ కలాం భారత 11వ రాష్ట్రపతిగా 2002 - 2007 మధ్యకాలంలో పనిచేసిన విషయం తెలిసిందే.

ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలి.. రావుల

  రాష్ట్రం విడిపోయిన తరువాత ఆంధ్రా రాష్ట్రానికి ఆర్ధిక లోటు ఉండగా.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మిగులు బడ్జెట్ తో లాభం పొందింది. కానీ ఇప్పుడు పరిస్థితి మాత్రం తిరగబడింది. తెలంగాణకు ప్రస్తుతం బడ్జెట్ లేదని.. తెలంగాణ ఖజానా ఖాళీ అయిందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ విషయంపై తెలంగాణ టీ.డీడీపీ నేతలు కేసీఆర్ పై మండిపడ్డారు. రాష్ట్రం మిగులు బడ్జెట్‌లో ఉందంటూనే బిల్లులన్నీ పెండింగ్‌లో పెడుతున్నారని రమణ ఆరోపించారు. అసలు వేతనాలు చెల్లించడానికే డబ్బులు లేవుకాని ఆకాశ హార్మ్యాలు అంటూ కోతలు కోస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని రావుల చంద్రశేఖర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

కేసీఆర్ ఇప్పుడెందుకు పోల్చుకోవట్లేదు

  తమ వేతనాలు పెంచమని డిమాండ్ చేస్తూ కార్మికుల సంఘాలు వారం రోజులకు పైగా సమ్మె చేసిన సంగతి తెలిసిందే. అయితే ముందు అంత పట్టించుకోని తెలంగాణ ప్రభుత్వం ప్రతిపక్షాలు కల్పించుకోని విమర్శించడంతో టీ సర్కార్ దిగొచ్చి వారి వేతనాలు పెంచుతామని చెప్పారు. దీంతో కార్మికల సంఘాలు కూడా సమ్మెను విరమించారు. అయితే వేతనాలు పెంచుతున్నామని చెప్పారు కాని అందుకు ఇప్పుడున్న ఆర్ధిక పరిస్థితి వల్ల అది సాధ్య కాదని.. ‘‘ప్రస్తుతం ఉన్న ఆదాయం మునిసిపాలిటీలను నిర్వహించడానికే చాలడం లేదని ఈ నేపథ్యంలో వారి వేతనాలు పెంచడం సాధ్యం కాదని తేల్చిచెప్పారు. దీంతో సీఎం కేసీఆర్ ఇప్పుడు వేతనాల పెంపుపై ఏం చేయాలనే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఈ విషయంపై వామపక్ష నేతలు విమర్శిస్తున్నారు.   అన్ని విషయాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పోల్చుకునే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కార్మికుల జీతాల విషయంలో మాత్రం ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడులా ఎందుకు వ్యవహరించలేకపోతున్నారని ఎద్దేవ చేశారు. ఇంతకు ముందు ప్రభుత్వా ఉద్యోగుల వేతనాలు పెంపుదల.. ఆర్టీసీ కార్మికుల వేతనాలు పెంచినప్పుడు ఆంధ్రా ప్రభుత్వం కంటే ఒక శాతం ఎక్కవ పెంచి ఆంధ్ర రాష్టం కంటె మేం ఎక్కువ అని చూపించారు కేసీఆర్. అయితే ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఆంధ్రా మున్నిపల్ కార్మికులకు జీతాలు పెంచితే కేసీఆర్ ఎందుకు ఇంకా పెంచలేదని.. అన్ని విషయాల్లో ఏపీతో, చంద్రబాబుతో పోల్చుకునే కేసీఆర్ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని రాజకీయ వర్గాలు అనుకుంటున్నాయి. దీనిలో భాగంగా వామపక్ష నేత తమ్మినేని వీరభద్రం స్పందించి మున్సిపల్ కార్మికుల వేతనాలు పెంచకుంటే తాము 28, 29, 30 తేదీల్లో ధర్నాలు చేస్తామని హెచ్చరించారు.

కేసీఆర్ అడ్డంగా బుక్కయ్యారా!

  ఓటుకు నోటు వ్యవహారంలో ఫోన్ ట్యాపింగ్ తెరపైకి వచ్చిన దగ్గరనుండి ఈ విషయంపై ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలు వాదనలు జరుపుకుంటూనే ఉన్నాయి. అయితే ఈ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఇరుక్కున్నారా అంటే అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి. అసలు ఈ కేసు బయటకు వచ్చినదగ్గరనుండి ఏపీ ముఖ్యమంత్రితో సహా పలు అధికారులు ఫోన్లు ట్యాపింగ్ జరిగాయని మొత్తుకున్నాయి. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం మే చేయలేదంటూ ఎన్నో మాటలు చెప్పింది. కానీ సర్వీసు ప్రొవైడర్లు మాత్రం ఉన్నతాధికారుల ఆదేశాలు మేరకే ఫోన్ ట్యాపింగ్ చేశామని చెప్పారు. దీంతో కేసీఆర్ అడ్డంగా బుక్కయ్యారని తెలుస్తోంది. ఇప్పుడు టీడీపీని దెబ్బ తీయాలని చూసిన కేసీఆర్ తను తీసిన గోతిలో తానే పడ్డారని రాజకీయవర్గాలు చర్చించుకుంటున్నాయి.   ఇప్పుడు సర్వీసు ప్రొవైడర్లు ఫోన్లు ట్యాపింగ్ జరిగాయని చెప్పడంతో తరువాత ఏం పరిణామాలు చేసుకుంటాయో అని ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. సుప్రీంకోర్టు కూడా కాల్ డేటా ఇవ్వాల్సిందేనని సర్వీసు ప్రొవైడర్లను ఆదేశించింది. ఇక సర్వీసు ప్రొవైడర్లు కాల్ డేటా ఇచ్చిన తరువాత అసలు కథ బయటపడుతుంది. ఇదిలా ఉండగా టీడీపీ నేతలు కేసీఆర్ పై మండిపడుతున్నారు. నారా లోకేశ్ కూడా ఇదే విషయంపై ఫోన్ ట్యాపింగ్ జరిగిందని నిజం బయటపడింది ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు అంటూ కేసీఆర్ ను ప్రశ్నించారు. కుట్రపూరితంగా ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడిన వారి పైన చట్టం చర్యలు తీసుకుంటుందని అన్నారు. మొత్తానికి అటు ఆంధ్రా.. ఇటు తెలంగాణ రాష్ట్రాల మధ్య ఇరుక్కుపోయిన సర్వీసు ప్రొవైడర్లు ఆఖరికి కేసీఆర్ ను ఇరికించారని తెలుస్తోంది.

దీపికాకు వాళ్లిద్దరంటే కోపమట

  దీపికా పదుకొణే ఈ పేరు వింటే చాలు కుర్రకారు పడిచస్తారు. ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ పొజిషన్ ను లో ఉన్నదీపికా పడుకునే అంటే కుర్రకారుకే కాదు అటు బాలీవుడ్ యువ హీరోలకు కూడా చాలా క్రేజ్. అందుకే ఈ భామతో నటించడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే అందరితో కలివిడిగా ఉండే ఈ అమ్మడు బాలీవుడ్ లో ఇద్దరిని మాత్రం తన శత్రువులుగా భావిస్తుందట. ఆ ఇద్దరు ఏవరో ఇప్పటికే అర్ధమయివుండొచ్చు.. అదే కత్రినాకైఫ్, అనుష్కశర్మ. తన మాజీ లవర్ రణబీర్ సింగ్ ను తన నుండి దూరం చేసిందని కత్రినా కైఫ్ అంటే దీపికా ఫుల్లు ఫైర్ మీద ఉందట. అందుకే కత్రినా గురించి తన దగ్గర ప్రస్తావిస్తే... ఏ మాత్రం తట్టుకోలేదట. మరో భామ అనుష్కశర్మ.. దీపికాకంటే ముందే రణవీర్ కు అనుష్క కు మధ్య రిలేషన్ ఉందని వార్తలు జోరుగానే వినిపించాయి. ఆతరువాత దీపికా ఎంట్రీతో వాళ్లిద్దరూ విడిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు కోహ్లితో జట్టు కట్టేసింది అనుష్కశర్మ. అయితే అప్పుడప్పుడూ తన మాజీ లవర్ తో టచ్ లోకి రావాలని చూస్తుందట అనుష్క శర్మ దీంతో అనుష్కశర్మని కూడా తన శత్రువుల లిస్టుల చేర్చేసిందట. అందుకే వాళ్లకి దక్కాల్సిన అవకాశాలను ఎప్పటికప్పుడు తన సొంతం చేసుకోవాలని చూస్తోందట ఈ బీ టౌన్ హాట్ కేక్...

అమరావతి కోసం డెవలపర్.. టీడీపీ లో కీలకమైన మార్పులు

  ఏపీ రాజధాని అమరావతి సీడ్ క్యాపిటల్ నమూనాను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సింగపూర్ వాణిజ్యమంత్రి ఈశ్వరన్ అందించిన సంగిత తెలిసిందే. ఇప్పుడు చంద్రబాబు ఈ రాజధాని నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్టు తెలుస్తోంది. ఇన్నీ రోజులు పుష్కరాల నేపథ్యంలో రాజమండ్రిలో ఉన్న చంద్రబాబు హైదరాబాద్ కు చేరుకున్నారు. సాధ్యమైనంత త్వరలో ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం డెవలపర్ ను చంద్రబాబు ఎంపిక చేయనున్నారు. స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో అమరావతిని నిర్మించనున్నారు. ఇప్పటికే అమరావతికి పక్కావాస్తు కుదిరిందని.. పరిశ్రమలు నిర్మాణానికి అన్ని సౌకర్యాలు ఉన్నాయని నిపుణులు స్పష్టం చేశారు. అయితే ఏపీ రాజధాని అమరావతి భూకంపాల జోన్ 3.. ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ ఎర్త్ క్వేక్ ఇంజనీరింగ్ రీసెర్చ్ సెంటర్ అధిపతి చెప్పారు. ఏపీ రాజధాని అవరావతిలో కొంత కృష్ణాతీర ప్రాంతంలో కూడా ఉంది కాబట్టి.. తీర ప్రాంతాలు జోన్ 3 కిందకు వస్తాయని చెబుతున్నారు. ఈనేపథ్యంలో రాజధాని ప్రాంతంలో అంతర్జాతీయ ప్రమాణాలతో, భూకంప తీవ్రతను తట్టుకునే విధంగా కట్టడాలు నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోంది.   ఇదిలా ఉండగా టీడీపీ లో పలు కీలకమైన మార్పులు చేయనున్నట్టు తెలుస్తోంది. ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల్లో రెండు కమిటీలు ఏర్పాటు చేసి వేర్వేరుగా అధ్యక్షులను నియమించనున్నారు. ఈమేరకు ఇప్పటికే పార్టీలో చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. అయితే రెండు కమిటీలకు సంబంధించి అత్యున్నత నిర్ణయాధికార వ్యవస్థగా పొలిట్ బ్యూరో ఉండనుంది. దీనిని కూడా త్వరలోనే కొత్తగా ఏర్పాటు చేయనున్నారు. అయితే ఏపీ అధ్యక్షుడిగా కళా వెంకట్రావు లేదా అశోక్ గజపతి రాజు పేర్లను పరిశీలిస్తున్నారని తెలంగాణలో మాత్రం ప్రస్తుతం ఉన్న వారే ఉండనున్నారని తెలుస్తోంది.

జయలలితకు సుప్రీం షాక్..

  తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసులో కర్ణాటక కోర్టు తనను నిర్ధోషిగా పరిగణిస్తూ తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే కర్ణాటక కోర్టు ఇచ్చిన తీర్పుపై చాలా అసంతృప్తి వ్యక్తం చేశారు. జయలలితను నిర్ధోషిగా ప్రకటించడంపై ప్రతిపక్షనేతలు పలు ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో కర్నాటక కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కర్నాటక ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఈ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు జయలలితతోపాటు మరో ముగ్గురికి కూడా నోటీసులు జారీ చేశారు. అయితే మళ్లీ విచారణ జరపాలని కర్నాటక ప్రభుత్వం వేసిన పిటిషన్‌తో మాత్రం ఏకీభవించింది కానీ హైకోర్టు తీర్పు పైన స్టేకు సుప్రీం కోర్టు నిరాకరించింది. కాగా నిర్ధోషిగా విడుదలైన తరువాత జయలలిత తమిళనాడు సీఎంగా ప్రమాణస్వీకారం చేసి అనంతరం ఆర్కే నగర్ నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

ఇప్పుడు ఏమంటావ్ కేసీఆర్

  నోటు ఓటు కేసులో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఆసక్తికరమైన అంశాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసులో మొదటి నుండి ఏపీ ముఖ్యమంత్రి సహా పలువురి అధికారుల ఫోన్లు ట్యాపింగ్ జరిగాయని ఆరోపించాయి. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం మేం ఫోన్లు ట్యాపింగ్ చేయలేదంటూ వాదిస్తూ వచ్చాయి. కానీ విజయవాడ కోర్టులో హాజరైన సర్వీసు ప్రొవైడర్లు తాము ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే ఫోన్లు ట్యాపింగ్ చేశామని చెప్పకనే చెప్పారు. ఈ నేపథ్యంలో కోర్టు వాటికి సంబధించిన సమాచారం ఇవ్వాలని కోరగా సర్వీసు ప్రొవైడర్లు మాత్రం అందుకు నిరాకరించారు. ఆ సమాచారం ఇస్తే తెలంగాణ ప్రభుత్వం ప్రాసిక్యూషన్ చేస్తామని హెచ్చరించిందని.. కాల్ డేటా అందించవద్దని చెప్పిందని కోర్టుకు చెప్పారు . కానీ కోర్టు అవన్నీ తోసిపుచ్చి కాల్ డేటా ఇవ్వాల్సిందేనని తీర్పు నిచ్చింది. కానీ సర్వీసు ప్రొవైడర్లు కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అక్కడ కూడా వారికి చుక్కెదురైంది. అలాంటి పప్పులేమి ఉడకవు కాల్ డేటా ఇవ్వాల్సిందే అని తేల్చిచెప్పింది. దీంతో సర్వీసు ప్రొవైడర్లు వారం రోజులు గడువు కోరారు.   ఇప్పుడు దీనిపై టీడీపీ యువనేత.. కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయ కర్త నారాలోకేశ్ స్పందించి కేసీఆర్ పై ప్రశ్నలు సంధించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఇప్పటి వరకూ తెలంగాణ ప్రభుత్వం వాదిస్తూ వచ్చింది.. ఇప్పుడు టెలికాం కంపెనీలు కూడా ఒప్పుకున్నాయి.. ఇప్పుడు కేసీఆర్ మీరేం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. కేసీఆర్ చెప్పెదొకటి చేసేదొకటి అని.. వారు అవునంటే కాదని.. కాదంటే అవునని విమర్శించారు. గతంలో తెలంగాణ ఉద్యమం పేరుతో విద్యార్ధులను బలిచేశారు.. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ పేరుతో అధికారులను బలి చేశారని ట్విట్టర్లో మండిపడ్డారు.  

రాహులు జగన్ టూర్ సీక్రెట్ ఎంటీ?

  కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అనంతపురం జిల్లాలో పర్యటించిన సంగతి తెలిసిందే. దానికి ముందు వైఎస్సార్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కూడా అనంతపురం జిల్లాలో పర్యటించారు. అయితే ఇప్పుడు వీరిద్దరూ ఒకే సమయంలో యాత్రలు చేపట్టంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రాహుల్, జగన్‌లు అనంతపురం జిల్లాలో రహస్యంగా కలిశారా? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. వీరిద్దరూ కావాలనే ఒకేసారి పర్యటనలో పాల్గొన్నారని.. రహస్యంగా కలిసి మంతనాలు జరిపారని పలు రాజకీయ విశ్లేషకులు చెవులుకొరుక్కుంటున్నారు. అసలు ఇంతకు ముందే పలువురు కాంగ్రెస్ నాయకులు ఆ పార్టీని వీడి వైఎస్సార్ పార్టీలోకి వెళ్లిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వైస్సార్ పార్టీలోకి వెళ్లి జగన్ ను కాంగ్రెస్ లోకి తీసుకొస్తారేమో అని పలు విమర్శలు కూడా వచ్చాయి. ఇప్పుడు దీనిలో భాగంగా రాహుల్ గాంధీ, జగన్ నిజంగానే కలిశారా? కలిస్తే ఏం మాట్లాడుకున్నారు? అనే ప్రశ్శలు మొదలవుతున్నాయి.   ఇదిలా ఉండగా పార్లమెంట్ సమావేశాల్లో ప్రత్యేక హోదా గురించి మాట్లాడని రాహుల్ గాంధీ అక్కడి నుండి అనంతపురం వచ్చి ఇక్కడ ప్రత్యేక హోదా గురించి మాట్లాడటం చాలా ఆశ్యర్యంగా ఉంది. జగన్ కూడా ఎప్పుడు ఏ సాకు దొరుకుతుందా ఏ కారణంతో ప్రతిపక్షపార్టీని విమర్శించాలన అని చూడటమే తప్ప ప్రత్యేక హోదా గురించి ఎక్కువ మాట్లాడింది లేదు. ఈ నేపథ్యంలో పలువురు టీడీపీ నేతలు ఇద్దరు నేతలపై మండిపడుతున్నారు. ఇద్దరు కూడబలుక్కొని అనంతపురంలో పర్యటించారనే ఆరోపిస్తున్నారు. తెలుగుదేశాన్ని దెబ్బతీయడానికే తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని కుట్రలు చేసినా టీడీపీని ఏం చేయలేరని టీడీపీ వర్గాలు తెలిపాయి.

పంజాబ్ లో ఉగ్రవాదుల దాడి, 9మంది పౌరులు మృతి

  ఈరోజు తెల్లవారు జామున పంజాబ్ రాష్ట్రంలోని గురుదాస్ పూర్ జిల్లాలో దీనానగర్ పోలీస్ స్టేషన్ పై ఉగ్రవాదులు చేసిన దాడిలో పౌరులు, పోలీసులు కలిపి మొత్తం 9మంది మరణించారు. ఉగ్రవాదులు మొదట అమ్రిత్ సర్ వెళుతున్న బస్సులో ప్రయాణికులపై విచక్షణారహితంగా కాలుపులు జరిపారు. ఆ తరువాత పోలీస్ స్టేషన్ పై దాడి జరిపారు. ఒక హోటల్ యజమానిని బెదిరించి అపహరించుకొని వచ్చిన మారుతీ కారులో వారు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకొన్నారు. వారందరూ సైనిక దుస్తులు ధరించి చేతిలో అత్యాధునిక ఆయుధాలతో పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి విచాక్షానా రహితంగా పోలీసులపై కాల్పులు జరుపడంతో అక్కడికక్కడే 9మంది మరణించారు. ఈ సంగతి తెలుసుకొన్న రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అదనపు బలాలను అక్కడికి పంపించి ఉగ్రవాదులను నిలువరించే ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య హోరాహోరీ కాల్పులు జరుగుతున్నాయి. అంతకు ముందు పఠాన్ కోట్-గురుదాస్ పూర్ రైల్వే ట్రాక్ పై ఉగ్రవాదులు ఐదు బాంబులను కూడా అమర్చారు. కానీ భద్రతా దళాలు సకాలంలో వాటిని గుర్తించి తొలగించడంతో పెను ప్రమాదం తప్పిపోయింది.

అలాగయితే నేను క్రికెట్ ఆడేవాడినే కానేమో? శ్రీశాంత్

  క్రికెటర్లు శ్రీశాంత్, అంకిత్ చవాన్ మరియు అజిత్ చండిలా ముగ్గురూ 2013 సం.లో జరిగిన ఐ.పి.యల్. మ్యాచ్ లలో స్పాట్ ఫిక్సింగ్ మరియు బెట్టింగ్ నేరాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ డిల్లీ పోలీసులు వారిని అరెస్ట్ చేసి వారి ముగ్గురిపై చార్జ్ షీట్లు దాఖలు చేసారు. వారిలో శ్రీశాంత్ కి కి అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో సబందాలు కూడా ఉన్నాయని డిల్లీ పోలీసులు ఆరోపించారు. వారు ముగ్గురూ 2013సం.లోనే బెయిలుపై విడుదలయినప్పటికీ వారిపై ఇంతవరకు ఆ కేసులు కొనసాగుతూనే ఉన్నాయి. ఆ కేసులను విచారించిన డిల్లీ హైకోర్టు, వారు ముగ్గురూ ఆ నేరం చేసినట్లు డిల్లీ పోలీసులు సరయిన ఆధారాలు చూపలేకపోయినందున వారిని నిర్దోషులుగా ప్రకటించింది.   ఈ కేసులో నిర్దోషిగా బయటపడిన తరువాత శ్రీశాంత్ డిల్లీ నుండి తన స్వస్థలమయిన కేరళలో కొచ్చి చేరుకొన్నప్పుడు విమానాశ్రయంలో ఆయనకి ఆహిమానులు ఘన స్వాగతం పలికారు. ఆ సందర్భంగా ఆయన వారితో మాట్లాడుతూ చాలా ఆసక్తికరమయిన వ్యాఖ్యలు చేసారు. తనకు దావూద్ ఇబ్రహీంతో సంబంధాలు ఉన్నట్లయితే అసలు క్రికెట్ ఆడేవాడినేకాదేమో! అతనిలాగే నేను కూడా ఏ దుబాయ్ లోనో దాక్కోవలసివచ్చేది. కానీ క్రికెట్ పై ఉన్న మక్కువతోనే పట్టుదలగా ఆడి ఈ పేరు, డబ్బు, అభిమానులను సంపాదించుకోగలిగాను. నాపై ఆరోపణలు వచ్చినప్పుడు చాలా మంది చాలా రకాలుగా విమర్శలు చేసారు. కానీ ఆ కష్టకాలంలో నా కుటుంబ సభ్యులు, అభిమానులు నాకు అండగా నిలబడ్డారు. వారి ప్రార్దనలు, ఆశీస్సుల కారణంగానే నేను ఈ కేసు నుండి నిర్దోషిగా బయటపడగాలిగాను. అందుకు వారందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను. మళ్ళీ క్రికెట్ పై దృష్టి కేంద్రీకరించి పూర్వ వైభవం సాధించేందుకు గట్టిగా కృషి చేస్తానని” ఆయన అన్నారు.

12 రోజుల్లో 11.29 కోట్ల మంది పుష్కరస్నానాలు!

  ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలలో అత్యంత వైభవంగా నిర్వహించిన గోదావరి పుష్కరాలు నిన్న శనివారం సాయంత్రం హారతి కార్యక్రమంతో ముగిసాయి. ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 4.89కోట్లు, తెలంగాణా రాష్ట్రంలో 6.4కోట్ల మంది భక్తులు పుష్కర స్నానాలు ఆచరించినట్లు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా ప్రకటించాయి. ఈ మహా పుష్కరాల గురించి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు విస్తృతంగా ఏర్పాట్లు, ప్రచారం చేయడంతో ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా ఈసారి ఏకంగా 11.29 కోట్ల మంది భక్తులు పుష్కర స్నానాలు చేసారు.   ఈ పుష్కరాలను ఆదిపుష్కరాలు అంటారు. కనుక నేటి నుండి మరొక 12రోజుల పాటు ఉండే అంత్యపుష్కరాల సమయంలో గోదావరిలో పుణ్యస్నానాలు చేసినా అదే ఫలితం ఉంటుందని పండితులు చెపుతున్నారు. ఈ పుష్కరాల రద్దీ సమయంలో పుణ్య స్నానాలు చేయలేక పోయినవారు ఈ 12రోజులలో ఎప్పుడయినా పుణ్యస్నానాలు చేసినా అదే ఫలితం లభిస్తుందని పండితులు చెపుతున్నారు.

సంపూర్ణ తెలంగాణ రాలేదు

  ప్రస్తుతం ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు హైకోర్టు విభజన.. ఉద్యోగులు విభజనపై వివాదం జరుగుతుంది. అయితే ఈ రెండింటిలో తెలంగాణ ప్రభుత్వానికి మొట్టికాయలే పడ్డాయి. హైకోర్టు విభజన చేయాలంటూ తెలంగాణ వాదులు కోర్టులో ఆరోపించినా ఇప్పట్లో విభజించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. మరోవైపు విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఆంధ్రా ఉద్యోగులను రిలీవింగ్ చేస్తానంటుంటే మరో వైపు కేంద్రం అలాంటి పప్పులేమి ఉడకవు వాళ్లను విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించింది.   ఈనేపథ్యంలో తెలంగాణ న్యాయవాదులు కలిసి హైకోర్టు విభజన కోసం రౌండ్‌టేబుల్‌ సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సమావేశంలో తెలంగాణ పొలిటికల్ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రం విడిపోయినా ఇంకా సంపూర్ణ తెలంగాణ రాలేదని.. హైకోర్టు, ఉద్యోగుల విభజన కోసం ఆగష్టు 6 తర్వాత ఉద్యమం చేయనున్నట్లు తెలిపారు. అంతేకాదు ఉద్యమం చేసి ప్రత్యేక తెలంగాణ సాధించినట్టు హైకోర్టు కోసం కూడా ఉద్యమం చేయాలని సూచించారు. ప్రత్యేక హైకోర్టు డిమాండ్ ఒక్క న్యాయవాదులకే పరిమితం కారాదాని చెప్పిన ఆయన, ఇందు కోసం తెలంగాణ సమాజం ఉద్యమబాట పట్టాలని అన్నారు.

మందుబాబులకు మంచులక్ష్మీ క్లాస్

  కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మీ సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. అటు చిత్రరంగంలోనే కాదు ఇటు సామాజిక కార్యక్రమాల్లో కూడా చురుకుగా పాల్గొంటారు. పదిమందికి ఉపయోగపడే నాలుగు మంచి మాటలను చెప్పడానికి ఆమె తనంతట తాను చొరవ చూపిస్తారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మంచు లక్ష్మీతో మందుబాబులకు కౌన్సిలింగ్ ఇప్పించాలనుకుంటున్నారట. ఇదేంటి అనుకుంటున్నారా.. అంటే తాను స్వయంగా కలిసి కౌన్సిలింగ్ చేస్తారని కాదు.. మంచు లక్ష్మితో ఓ ప్రకటనను చేయించనున్నారట. మంచు లక్ష్మీతో మాట్లాడించి ఆప్రకటనను మద్యం తాగి వాహనం నడిపే మందు బాబులకు చూపిస్తారట. మరి ఎన్ని చెప్పినా మారని మందుబాబులు లక్ష్మీ మాటలకు మారుతారో లేదో చూడాలి..

చిరంజీవికి అర్హత లేదు..

  గోదావరి మహాపుష్కరాలు చివరి రోజు కావడంతో పలువురు ప్రముఖులు రాజమండ్రి పుష్కరఘాట్లో స్నానమాచరించారు. ఈ సందర్భంగా ఏపీ ఎంపీ మంత్రి అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ చిరంజీవిపై మండిపడ్డారు. గోదావరి మహాపుష్కరాల నేపథ్యంలో మొదటిరోజు జరిగిన తొక్కిసలాటకు కారణం చంద్రబాబే అంటు అనవసరమై విమర్శలు చేస్తున్నారంటూ.. ప్రమాదవశాత్తు జరిగిన సంఘటనని రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. పార్టీ పెట్టి దానిని నడపడం చేతకాక కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన చిరంజీవికి చంద్రబాబును విమర్శించే హక్కులేదని ఎద్దేవ చేశారు. కైకలూరులో పుష్కర యాత్రికులకు మంత్రి ఆహారపొట్లాలను పంపిణీ చేశారు. ఏపీ దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావు, టీటీడీ చైర్మన్‌ చదలవాడ కృష్ణమూర్తి, డాలర్‌ శేషాద్రి సహా పలువురు ప్రముఖులు పుణ్యస్నానమాచరించారు.