జగన్ పై అనర్హత వేటుపై యనమల ఏమన్నారంటే?

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీని బాయ్ కాట్ చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ పరిశీలకులు, రాజ్యాంగ నిపుణులు, అసెంబ్లీ వ్యవహారాలు, నిబంధనలపై అవగాహన ఉన్నవారు అందరూ కూడా జగన్, ఆయన పార్టీ ఎమ్మెల్యేలపై వేటు వేయాల్సిందే అంటున్నారు. అసెంబ్లీ నింబంధనల మేరకు వరుసగా 60 రోజులు అసెంబ్లీకి గైర్హాజరైన ఎమ్మెల్యేలపై వేటు వేసే అధికారం స్పీకర్ కు ఉంటుందంటున్నారు.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ స్పీకర్ గా పని చేసిన తెలుగుదేశం సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణ అయితే.. గైర్హాజర్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడమే కాదు.. తదుపరి ఎన్నికలలో పోటీకి అనర్హులుగా కూడా ప్రకటించే అవకాశం ఉందన్నారు. ఈ విషయాన్ని న్యాయస్థానాలు ల్చాల్సి ఉందన్నారు.   వరుసగా 60 రోజులపాటు సభకు హాజరు కాని ఎమ్మెల్యేలపై  అనర్హత వేటు వేయవచ్చని రాజ్యాంగ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయన్న యనమల రామకృష్ణుడు, తదుపరి ఎన్నికలలో వారిని పోటీకి అనర్హులుగా ప్రకటించే విషయంపై న్యాయస్థానాల అభిప్రాయం తీసుకోవలసి ఉందని చెప్పారు. 

వైసీపీలో జగన్ వర్సెస్ పెద్దిరెడ్డి?

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై పార్టీలో అసంతృప్తి పేరుకుపోతున్న పరిస్థితులు ఉన్నాయని పార్టీ శ్రేణులే బాహాటంగా చెబుతున్నాయి. పార్టీ సీనియర్ నాయకులు జగన్ ఆదేశాలను ఇసుమంతైనా పట్టించుకోవడం లేదంటున్నారు. దీంతో పార్టీ పరిస్థితి బద్దలవ్వడానికి సిద్ధంగా ఉన్న అగ్నిపర్వతంలా ఉందనీ, జగన్ పై పార్టీలో తిరుగుబాటు వచ్చినా ఆశ్చర్యం లేదనీ అంటున్నారు.  ముఖ్యంగా జగన్ కు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందిన మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జగన్ వైఖరితో విసిగిపోయారంటున్నారు వైసీపీ నేతలు. ఇటీవల పెద్దరెడ్డి తన అసమ్మతినీ, అసంతృప్తినీ బాహాటంగానే పార్టీ నేతల వద్దా, తన అనుచరుల వద్దా వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు.  వాస్తవానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీలో సీనియర్ నాయకుడు. అంతే కాకుండా వైఎస్ హయాం నుంచీ కూడా పెద్దిరెడ్డి ఆయన కుటుంబానికి విధేయంగా ఉంటూ వచ్చారు. వైఎస్ అనంతరం జగన్ తో కూడా అదే సాన్నిహిత్యం, విధేయతా ప్రదర్శిస్తూ వచ్చారు. అందుకే జగన్ ఆయనకు తన కేబినెట్ లో మంత్రిపదవి ఇవ్వడమే కాకుండా ఐదేళ్లూ మంత్రిగా కొనసాగనిచ్చారు.  ఇక గత ఎన్నికలలో జగన్ పార్టీ అత్యంత ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్నా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరులో తన పట్టు నిలుపుకున్నారు. అలాగే ఆయన కుమారుడు కూడా రాజంపేట నుంచి ఎంపీగా విజయం సాధించారు. ఇంత వరకూ బాగానే ఉంది.. కానీ ఎప్పుడైతే మద్యం కుంభకోణంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు, రాజంపేట ఎంపీ అయిన మిథున్ రెడ్డి అరెస్టయ్యారో అప్పటి నుంచీ పెద్దిరెడ్డిలో అసహనం మొదలైందంటున్నారు. మిథున్ రెడ్డి అరెస్టైన తరువాత ఇంత వరకూ జగన్ మిథున్ రెడ్డిని ములాఖత్ ద్వారా కలిసి పరామర్శించకపోవడమే ఇందుకు కారణమంటున్నారు. కారణాలేమైనా ఒక్క మిథున్ రెడ్డి అనే కాదు.. మద్యం కుంభకోణంలో అరెస్టైన ఎవరినీ కూడా జగన్ రెడ్డి జైలుకు వెళ్లి పరామర్శించలేదు. ఆ విషయం అలా ఉండగా తాజాగా జగన్ తాడేపల్లి ప్యాలెస్ లో  జగన్ పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. ఆ సందర్భంగా జగన్  పెద్దిరెడ్డికి కీలక బాధ్యత అప్పగించారు. తాను అసెంబ్లీకి హాజరు కాకపోయినా.. పార్టీ ఎమ్మెల్యేలు సభకు హాజరై పార్టీ వాయిస్ ను గట్టిగావినిపిచాలన్న జగన్  పెద్దిరెడ్డిని  ముందుండి పార్టీ సభ్యులను గైడ్ చేయాలని ఆదేశించారు. అయితే పెద్దిరెడ్డి ఆ ఆదేశాలను పాటించలేదు.. సరికదా తన వల్ల కాదని ముఖంముందే కుండబద్దలు కొట్టేశారు. అంతటితో ఆగకుండా పార్టీ అధినేత సభను బాయ్ కాట్ చేసి తనను వెళ్లమనడమేంటని పార్టీ  నేతలతో ఒకింత అసహనంతో వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఈ విషయమే పార్టీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తోంది. పెద్దిరెడ్డి వంటి నేతే జగన్ ఆదేశాలను ఖాతరు చేయలేదంటే.. పార్టీపై జగన్ పట్టు సడలినట్టేనని అంటున్నారు.  సొంత పార్టీ నేతల విశ్వాసంపొందడంలోనే విఫలమైన జగన్ ను  జనం ఎలా నమ్ముతారని పార్టీ శ్రేణుల్లోనే చర్చ జరుగుతోంది.

ఓపిక పట్టు.. జాక్ పాట్ కొట్టు.. సేనాని సంయమనం కథ!

ఇది నిజంగా ఒక విజ‌య గాథ‌. ప్ర‌స్తుతం శ్రీకాళ‌హ‌స్తి ఆల‌య చైర్మ‌న్ గా నియ‌మితులైన కొట్టేసాయి.. అప్ప‌ట్లో నిజంగానే సీఐ అంజూ యాద‌వ్ చేతిలో చెంప‌దెబ్బ కొట్టించుకున్నారు. ఆ అవ‌మాన భారం ఆయ‌న్ను ఎంత‌కీ వ‌ద‌ల్లేదు. ఎందుకంటే అది ప‌బ్లిక్ లో జ‌రిగింది. దానికి తోడు వీడియోల్లోనూ రికార్డ‌య్యింది.  కానీ కాలం అన్నీ చూస్తూనే ఉంటుంది. ఆ శివ‌య్య కూడా స‌రిగ్గా అదే స‌మ‌యంలో ఓర్పు వ‌హించు నీకూ మంచి కాలం వ‌స్తుంద‌ని అభ‌య‌మిస్తుంటాడు. మ‌న‌మే దాన్ని గ్ర‌హించాల్సి ఉంటుంద‌ని సాయి అలా ఓపిక ప‌డుతూ వ‌చ్చారు. ఈలోగా రాష్ట్రంలో రాక్ష‌స పాల‌న అంత‌మై కూట‌మి పాల‌న మొద‌లైంది. జనసేనాని తొలిచూపు.. కొట్టే సాయి వైపు మ‌ళ్లింది. అప్పుడు పార్టీ కోసం చెంప దెబ్బ తిన్న నేత‌కు ఏదైనా సాయం చేస్తే మేల‌నిపించింది. వెంట‌నే కొట్టేసాయిని అదే ఆల‌యం చైర్మ‌న్ గా చేశారు. ఈ మ‌ధ్య కాలంలో సేనాని ప‌దే ప‌దే ఇదే మాట అంటున్నారు. ఇటీవ‌ల మ‌చిలీప‌ట్నం ఉదంతం తీస్కుంటే, సేనాని ఇదే చెప్పారు. మీరెవ‌రూ చ‌ట్టాన్ని చేతిలోకి తీస్కోవ‌ద్దు. అంతా చ‌ట్ట ప్ర‌కార‌మే వెళ్దాం. కాస్త సంయ‌మ‌నం వ‌హించ‌మ‌ని అన‌డం మాత్ర‌మే కాదు త‌న శ్రేణుల‌ను ఉద్దేశించి.. పెద్ద ఎత్తున ట్వీట్ లెట‌ర్ రాశారు కూడా.  ఇప్పుడు కొట్టే సాయి రూపంలో.. అదే నిరూపించారు. సంయ‌మ‌నం వ‌హిస్తే క‌ఠిన కాలం క‌రుగుతుంది. అదృష్ట‌కాలం వ‌రిస్తుంది. ఇదిగో ఇలాంటి ప‌ద‌వులు సైతం పొందే అవ‌కాశం ల‌భిస్తుంది. కాబ‌ట్టి ఓపిక ప‌ట్టు జాక్ పాట్ ప‌ట్టు అన్న‌ది ఇందు మూలంగా మ‌నం నేర్చుకోవ‌ల్సిన పాఠంగానూ తెలుస్తోంది.

అయ్యో జ‌గ‌న్.. ఉన్న ఎమ్మెల్యే ప‌ద‌వి కూడా ఊస్టింగేనా!?

  నేను అసెంబ్లీకి రాను. కావాలంటే మీరు వెళ్లండి. అవ‌స‌ర‌మైతే మీకు పెద్దిరెడ్డినిచ్చి పంపిస్తా! అంటూ త‌న ఎమ్మెల్యేల‌తో అన్నారు జ‌గ‌న్. అంతే కాదు మ‌న‌మంతా క‌ల‌సి.. ఆ 11 సీట్ల‌కు కూడా  రాజీనామా చేసేద్దాం.. నేనైతే ఎంపీగా పోటీ చేస్తా అంటూ ట్విస్ట్ ఇచ్చేస‌రికి ప‌క్క‌నే ఉన్న అవినాష్ రెడ్డి ఒక్క‌సారిగా అదిరిప‌డ్డారట‌. ఇదేందిదీ..... ఉరుము ఉరిమి మం*లం మీద ప‌డ్డ‌ట్టు నా మీద ప‌డ్డాడేంటని ఒక్క‌సారిగా కంగారు ప‌డ్డార‌ట భార‌తీరెడ్డి బావ అవినాష్ రెడ్డి. అంతే కాదు.. హీరో, విల‌న్ కొట్టుకుని మ‌ధ్య‌లో క‌మెడియ‌న్ని చంపేసిన‌ట్టు.. న‌న్నిలా టార్గెట్ చేశారేంట‌ని అవినాష్ లోలోన తెగ కుమిలిపోతున్నార‌ట‌. ఇదంతా ఇలా ఉంటే.. జ‌గ‌న్ గానీ, ఒక వేళ పులివెందుల ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసి.. అవినాష్ చేత క‌డ‌ప ఎంపీగా రిజైన్ చేయించి.. ఆ  ఎంపీ పోస్టుకు తాను పోటీ చేశారే అనుకుందాం. ఆబ్వియ‌స్ గా అవినాష్ పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తుండొచ్చు. ఓకే ఇన్నాళ్లు వైయ‌స్ ఫ్యామిలీ నుంచి కాకుండా అదే ఫ్యామిలీ అయినా కాస్త దూర‌పు మ‌నిషి ఒక‌రు ఈ సీటు నుంచి పోటీ చేశారే అనుకుందాం.. మొన్న‌టి జెడ్పీ ఎన్నిక‌ల్లో ఏం జ‌రిగిందో అంద‌రికీ తెలిసిందే. దీంతో పులివెందుల‌లో వైయ‌స్ పులి.. గాండ్రిపున‌కు బ‌దులు.. మియాం మియాం అని అరిస్తే ప‌రిస్థితేంటి? అంతే కాదు.. ఇటు ఉన్న‌దీ బాయె అటు ఉం* కున్న‌దీ పాయె అన్న‌ట్టుగా మారే సీన్ ఎదుర‌వుతుంది. దీంతో జ‌గ‌న్ కండీష‌న్ అడ‌క‌త్తెర‌లో పోక‌చెక్క‌గా మారుతుందని అంటారు విశ్లేష‌కులు. ప్రెజంట్ జ‌గ‌న్ స్కెచ్ ఏంటంటే.. తానుగానీ ఎంపీగా పోటీ చేస్తే ఇక్క‌డకు కేంద్ర బ‌ల‌గాలు దిగుతాయ‌ని.. జ‌నంలోని వ్య‌తిరేక‌త కూడా బ‌య‌ట ప్ర‌పంచానికి తెలుస్తుంద‌ని ఆయ‌న ఆలోచ‌న‌గా తెలుస్తోంది. రిస్క్ తీస్కోవ‌డం మంచిదే! కాద‌న‌డం లేదు. కానీ, నీటిలోని ముస‌లి.. అధికారంలో ఉన్న పార్టీ మోస్ట్ ప‌వ‌ర్ఫుల్ గా ఉంటాయి. పులివెందుల‌లో మొన్న ఎలాంటి సీన్ జ‌రిగిందో.. సేమ్ టూ సేమ్ సీన్.. వ‌చ్చే ఉప ఎన్నిక‌ల్లోనూ జ‌రిగితే..  జ‌గ‌న్ 2. 0 అనే ఆశ‌ల్లోంచి 2 ఎగిరిపోయి.. కేవ‌లం జీరో మిగిలితే.. !!!ఊహించుకోడానికే భ‌య‌మేస్తోంది జ‌గ‌న‌న్నా.. త‌గ్గు త‌గ్గు.. అన్న‌ది వైసీపీ కేడ‌ర్ అలెర్ట్ గా తెలుస్తోంది.

కాళేశ్వరం వినా హరీష్ పై వేరే కోపం లేదు.. కవిత

బీఆర్ఎస్ నుంచి సస్పెండైన కల్వకుంట్ల కవిత వాయిస్ ఇప్పుడు ఒకింత నెమ్మదించిందా? బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావుపై తీవ్రమైన ఆరోపణలు చేైసి పార్టీ నుంచి సస్పెండైన కవిత.. సొంత పార్టీ ఏర్పాటు చేస్తారని అంతా భావించారు. అయితే తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతూ కొత్త పార్టీ విషయంలో ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె కేసీఆర్ వందల మందితో చర్చించిన తరువాతనే పార్టీ పెట్టారని గుర్తు చేశారు. తాను కూడా ఇప్పుడు అలాగే చేస్తున్నానన్నారు. బీఆర్ఎస్ కు చెందిన పలువురు నేతలు తనతో టచ్ లో ఉన్నారని చెప్పిన కవిత.. తండ్రి పార్టీ నుంచి సస్పెండైన మొదటి కుమార్తెను తానునని చప్పారు.  ఇక తను తీవ్రంగా విమర్శించిన హరీష్ రావు గురించి మాట్లాడుతూ కాలేశ్వరం విషయంలో తప్ప ఆయనపై తనకు వేరే కోపం ఏమీ లేదన్నారు. ఇరిగేష్ శాఖకు సంబంధించి అవకతవకలు, అక్రమాలు, అవినీతి గురించి 2016లోనే కేటీఆర్ ను అలర్ట్ చేశానని చెప్పిన కవిత.. హరీష్ రావు కాళేశ్వరం విషయంలో పూర్తి బాధ్యత అంతా కేసీఆర్ పై నెట్టేవేసి తప్పించుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. కాళేశ్వరం విషయంలో ప్రతి నిర్ణయం కేసీఆర్ దేనని హరీష్ రావు పీసీ ఘోష్ కమిషన్ కు చెప్పారన్నారు.  ఇక ఎమ్మెల్సీ పదవికి రాజీనామాపై మాట్లాడుతూ.. తాను స్పీకర్ ఫార్మట్ లోనే రాజీనామా సమర్పించానని స్పష్టం చేశారు. రాజీనామా ఇవ్వడమే కాకుండా వెంటనే ఆమోదించాల్సిందిగా ఫోన్ చేసి మరీ  కోరానని తెలిపారు. బతుకమ్మకు సంబంధించి తనకు చాలా ఆహ్వానాలు వస్తున్నాయన్న కల్వకుంట్ల కవిత.. మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ ను తమ స్వగ్రామం చింతమడకలోనే జరుపుకుంటానన్నారు. తీన్మార్ మల్లన్న కొత్త పార్టీ గురించి మీడియా అడిగిన ప్రశ్నకు ప్రజాస్వామ్యంలో ఎవరికైనా పార్టీ పెట్టుకునే హక్తు ఉందని ముక్తాయించారు. 

సీఎం రమేష్‌పై అనుచిత వ్యాఖ్యల కేసులో మాజీ ఎమ్మెల్యేపై విచారణ

  బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్‌ను జూబ్లీహిల్స్ పోలీస్‌లు విచారించారు. బీజేపీ అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్‌పై అనుచిత వ్యాఖ్యల కేసులో భాగంగా ఆయన్ను సుమారు 30 నిమిషాల పాటు ప్రశ్నించారు. విచారణ అనంతరం కిషోర్ మాట్లాడుతు తాను కేటీఆర్‌పై సీఎం రమేష్ అసత్య ఆరోపణలు చేసిన సీఎం రమేష్ వ్యాఖ్యలను ఖండిస్తూ నేను మాట్లాడినందుకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో నాపై కుట్రపూరితంగా  కేసు నమోదు చేశారని ఆయన ఆరోపించారు.  చట్టాలను గౌరవించి విచారణకు హాజరయ్యారని స్పష్టం చేశారు. బీజేపీ, కాంగ్రెస్ కలిసి కుమ్మక్కయి ఎన్ని కేసులు పెట్టినా మీకు భయపడేది లేదని తెలిపారు. మా పార్టీ నాయకుల గురించి పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తే సీఎం అయినా, ఎంపీ అయినా తప్పకుండా తిప్పికొడతానని  కిషోర్‌ తెలిపారు. అక్రమ కేసులకు భయపడేది లేదు అని  కిశోర్ తేల్చిచెప్పారు. తెలంగాణ ఉద్యమంలో 172 కేసులు.. ఆరు నెలలు జైలుకు పోయిన నిఖార్సైన ఉద్యమకారుణ్ణి నేను అని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై సీఎం రమేష్ చేసిన ఆరోపణలు ఖండిస్తూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌ కుమార్‌పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేష‌న్‌లో కేసు న‌మోదైన సంగ‌తి తెలిసిందే.

ఆల్మట్టి ఎత్తు పెరిగితే.. తెలంగాణ భూములు క్రికెట్ స్టేడియాలే!

ఆల్మట్టి ఎత్తు పెంచితే తెలంగాణ పొలాలు సాగు భూములుగా ఉండవనీ, క్రికెట్ స్టేడియంలుగా మారిపోతాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణలోని ఐదు జల్లాలకు వరప్రదాయిని వంటి కృష్ణానది రాష్ట్రంలో ఉనికిమాత్రంగా కూడా లేకుండా పోతుందని హెచ్చరించారు. కర్నాటక ప్రభుత్వం ఆల్మట్టి ఎత్తు పెంచేందుకు సన్నాహాలు చేస్తున్నదని రేవంత్ సర్కార్ దానిని ఆపాలని డిమాండ్ చేశారు. శనివారం (సెప్టెంబర్ 20)న మీడియా సమావేశంలో మాట్లాడిన కవిత.. రాష్ట్రంలో మహాబూబ్‌నగర్‌, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం, హైదరాబాద్‌  జిల్లాలకు అత్యంత ప్రధానమైన జలవనరు కృష్ణానదే అన్నారు. కర్నాటక ఆల్మట్టి ఎత్తు పెంచితే..  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లాకు చుక్క నీరు అందదని పేర్కొన్నారు. కర్నాటక రాష్ట్రం ఆల్మట్టి డ్యాం ఎత్తును 524 అడుగులకు పెంచేందుకు సన్నాహాలు చేస్తున్నదన్న కవిత.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆల్మట్టి హైట్ పెంచకుండా జీవో ఉందని గుర్తు చేశారు. ఇప్పుడు రేవంత్ కర్నాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వంతో మాట్లాడి అయినా కోట్లాడి అయినా ఆల్మట్టి ఎత్తు పెంచకుండా చూడాలని డిమాండ్ చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు సోనియాతో ఫోన్ చేయించి ఆల్మట్టి ఎత్తు పెంపును విరమించుకునేలా చేయాలని ఆమె రేవంత్ ను కోరారు.   త్వరలో  జరగనున్న కృష్ణా ట్రిబ్యునల్ మీటింగ్ కు  సీఎం స్వయంగా వెళ్లి ఆల్మట్టి ఎత్తు ఆపే విధంగా పోరాటం చేయాలని డిమాండ్ చేశారు. 

భార‌త్ లో జెన్ జీ కి స్కోపెంత‌?

భార‌త్ లో జెన్ జీ మూమెంట్ వ‌స్తుంది. అందుకు మా పూర్తి స‌హ‌కారం ఉంటుంద‌ంటున్నారు కాంగ్రెస్ అగ్ర‌నేత‌ రాహుల్ గాంధీ.  నేపాల్లో జ‌రిగిన ఈ జెన్ జీ ఉద్య‌మంలో  విద్యార్ధుల‌దే కీల‌క పాత్ర‌.  మొన్నా మ‌ధ్య బంగ్లాదేశ్ లో జ‌రిగిన ఉద్య‌మాల‌కు కూడా ఆయువు ప‌ట్టు అక్క‌డి విద్యార్ధులే. నేపాలీ విద్యార్ధులు పాల‌కుల అవినీతి మీద ఫైర్ అయితే, బంగ్లాలో రిజ‌ర్వేష‌న్ల వ్య‌వ‌హారంలో భ‌గ్గుమ‌న్నారు. దీంతో ప్ర‌భుత్వాలు కూలిపోయాయి. అలాంటి సిట్యువేష‌న్ ప్రెజంట్ భార‌త్ లో ఉందా? ఇక్క‌డి యూత్ అంత‌టి  ఆగ్ర‌హావేశాల‌తో ర‌గ‌లిపోతున్నారా? అన్న‌ది ప‌రిశీలించాల్సి ఉంది. ప్ర‌స్తుతం   భార‌త్ లోని విప్ల‌వాగ్ని జ్వాల‌లు బాగా త‌గ్గిపోయాయి. వ‌ర్సిటీ టూ ఫారెస్ట్ వెళ్లే యూతే లేదిప్పుడు. అంతా క్యాంప‌స్ సెల‌క్ష‌న్స్. థ‌ర్డ్ ఇయ‌ర్ లోనే ఆయా విద్యార్ధుల‌ను ఎగ‌రేసుకుపోతున్నాయి   కార్పొరేట్ కంపెనీలు. కొండొక‌చో ఒక్కో టాలెంటెడ్ విద్యార్ధికి కోట్లాది రూపాయల ఆఫ‌ర్లు అందుతున్నాయ్. దీంతో యూత్ మూడ్ కౌన్ బ‌నేగా క‌రోడ్ ప‌తీ.. అన్న‌ట్టుగా ఉంది. ప్రెజంట్ ఏపీ తెలంగాణ యూత్ విష‌యానికి వ‌స్తే.. ఏదో సోసోగా బీటెక్ చేశామా.. అమీర్ పేటలో ఒక డిప్ల‌మో కోర్సు చ‌దివామా.. ఫేక్ ఎక్స్ పీరియ‌న్స్ పెట్టామా.. యూఎస్ చెక్కేశామా అన్న కోణంలో థింక్ చేస్తున్నారు త‌ప్ప‌ దేశస్థితిగతులు, సమస్యలూ.. ఇవన్నీ పట్టించుకునే వాతావరణం లేదనిపిస్తోంది.  ఇప్పుడు అమెరికాకు చెక్కేసే  సిట్యువేష‌న్ కూడా లేక పోవ‌డంతో.. వీరంతా ప్ర‌స్తుతం ఇక్క‌డే స్థిర‌ప‌డేలా కొత్త‌దారులు వెతుకుతున్నారు. బీటెక్ చ‌దివి కూడా ఏమేం చేసి సంపాదించుకోవ‌చ్చో పరిశీలిస్తున్నారు. అంతెందుకు ఈ మ‌ధ్య బీటెక్ పానీపూరీ వాలా అంటూ ఒక అమ్మాయి ఏకంగా త‌న డిగ్రీ పేరిట బోర్డు పెట్టేసింది. అంత‌గా యువ‌త ఇక్క‌డే ఉండి ఎలా ఎద‌గొచ్చో ప‌రిశీలిస్తున్నారు. మారిన కాల‌మాన ప‌రిస్థితుల కార‌ణంగా.. న‌గ‌ర జీవ‌నం ఎలా సాగించాలో అడ‌వుల్లోకి వెళ్లి వెతుక్కోవ‌డం లేదు. ఇక్క‌డే ఇంటి ప‌ట్టునే ఉండి.. యావ‌రేజ్ గా నెల‌కో యాభై వేలు ఎలా సంపాదించాలో చూస్తున్నారు. త‌ద్వారా.. వారికంటూ విప్ల‌వానికి సంబంధించిన ఆశ‌లు ఆశ‌యాలేం పుట్ట‌డం లేదు. అమిత్ షా అన్న‌ట్టు ప‌కోడీలు అమ్ముకునైనా బ‌త‌కొచ్చ‌న్న కోణంలో థింక్ చేస్తున్నారు. మీరు కావాలంటే ఏదైనా ట్రిప్ వెళ్లిన‌పుడు ఆ యా టూరింగ్ స్పాట్స్ లో చిన్నా చిత‌కా బిజినెస్ చేసే వాళ్ల‌ను చూడండి.. వారి వారి క్వాలిఫికేష‌న్లు అడ‌గండి.. బీటెక్, ఎంటెక్ అంటారు.  ఇక స్టార్ట‌ప్ ల సంగ‌తి స‌రే స‌రి. ఈ స్టార్ట‌ప్ ల‌కు వాటి తాలూకూ ఇంక్యుబేట‌ర్ల‌కు స్కిల్ డెవ‌ల‌ప్మెంట్ పేరిట ఇస్తున్న ప్రోత్సాహ‌కాల కార‌ణంగా కొంద‌రు కొత్త కొత్త ఐడియాలు వేసి.. కోట్లు సంపాదించ‌డం ఎలా? అన్న కోణంలో థింక్ చేస్తున్నారు. ఆ మాట‌కొస్తే.. తాను ఒక‌రి కింద ప‌ని చేయ‌డం ఏంటి? ప‌ది మందికీ తానే జాబ్స్ ఇస్తే ఎలా ఉంటుందో బిల్ గేట్స్ కా బాప్ రేంజ్ లో థింక్ చేస్తున్నారు. ఇపుడీ జ‌న‌రేష‌న్ ఎంజాయ్ మెంట్ ని ఎక్కువ‌గా కోరుకుంటోంది. ఇక్క‌డ వారికి కావ‌ల్సింది ప‌ని, డ‌బ్బు, ఆపై ఫుల్ ఎంట‌ర్టైన్మెంట్. అది దొరికితే చాలు ఇక విప్ల‌వాలు వాటి కార‌ణంగా ప్రాణాలు కోల్పోవ‌డం ఎందుకు? అన్న కోణంలో థింక్ చేస్తున్నారు. ఉద్య‌మాలు న‌డిపేంత తీరుబాటు వెస‌లుబాటు ఎవ‌రికీ లేదిక్క‌డ‌. మ‌రి భార‌త్ లో జెన్ జీ మూమెంట్ ఎలా వ‌స్తుంది? రాహుల్ ఆశ‌లు ఆశ‌యాలు నెర‌వేరే దారేద‌ని చూస్తే.. అప్పుడ‌ప్పుడూ అక్క‌డ‌క్క‌డా అందుకు త‌గిన అవ‌కాశాలు వ‌స్తుంటాయి. కానీ అవి చాలా చాలా ప‌రిమితంగా మాత్రమే ఉంటున్నాయి. ఎవ‌రూ రిస్క్ తీస్కుని అక్క‌డేదో త‌గ‌ల‌బ‌డుతోంద‌ని ఆ మంట‌ల్లో ప‌డి మాడి మ‌సై పోవ‌డం లేదు. అంత జాగ్ర‌త్త‌గా ఉంటోంది ప్రెజంట్ యూత్. బేసిగ్గా ఉద్య‌మాల ద్వారానే నాయ‌కులు పుట్టుకొస్తారు. ప్ర‌స్తుతం చెలామ‌ణిలో ఉన్న నాయ‌కులంతా గ‌తంలో ఒక ఎమ‌ర్జెన్సీ టైంలో వ‌చ్చిన వారే. ఆ త‌ర్వాతి కాలంలో.. తెలంగాణ ఉద్య‌మం లాంటి వాటి ద్వారా వ‌చ్చారు. ఇప్పుడు రాహుల్ రాజేస్తున్న ఈ ఉద్య‌మంలోకి యువ‌త అంత‌గా దూసుకురావాలంటే అందుకంటూ త‌గిన వాతావ‌ర‌ణ స్థితిగ‌తులు ఏర్ప‌డాలి. అలాంటి ప‌రిస్థితులు కూడా త‌యారు కావాలి. దానికి తోడు ఇటు పాక్ అటు బంగ్లా ఆపై నేపాల్లో కావాల‌నే అల‌జ‌డులు సృష్టించి.. అటు పిమ్మ‌ట ఆ జ్వాల‌లు.. భార‌త్ లోకి తీసుకురావాల‌న్న‌ది రాహుల్ కొంద‌రు విదేశీయుల‌తో క‌ల‌సి చేస్తోన్న కుట్ర‌గా అంచ‌నా వేస్తున్నారు. అందుకే ఈ జెన్ జీ కామెంట్లు గుప్పిస్తున్న‌ట్టుగా చెబుతున్నారు. ప్ర‌స్తుతం ఉన్న యువ‌త.. మాన‌సిక‌- సామాజిక- ఆర్ధిక- రాజ‌కీయ స్థితిగ‌తుల్లో రాహుల్ గాంధీ ఆశిస్తున్న‌ట్టు ఈ జెన‌రేష‌న్ క‌దులుతుందా? అన్న‌ది అనుమాన‌మే అంటారు చాలా మంది.

ఈ పిట్రోడాకి ఏమైంది?

పాక్ కి వెళ్తే  సొంతింటికి వెళ్లిన‌ట్టు ఉంటుంద‌న్నారు కాంగ్రెస్ విదేశీ వ్య‌వ‌హారాల స‌ల‌హాదారు శ్యాంపిట్రోడా. కొంప‌దీసి పిట్రోడా కూడా అద్వానీలా పాకిస్థాన్ లో పుట్ట‌లేదు క‌దా అన్న అనుమానంతో ఆయ‌న బ‌యోగ్ర‌ఫీ త‌ర‌చి చూసిన వారికి పిట్రోడా ఒడిశాలో పుట్టిన గుజ‌రాతీ అని తెలిసింది. హ‌మ్మ‌య్య బ‌తికిపోయాం లేకుంటే ఈ ర‌చ్చ ఎక్క‌డెక్క‌డికో వెళ్లిపోయేద‌న్న ఆందోళ‌న  నుంచి వారు ఒక్కసారిగా బయటపడ్డారు. నిజానికి ఒక ప్రాంతం ప‌ట్ల పైకి క‌నిపించేది వేరు లోప‌లికి క‌నిపించేది వేరు. టెన్ మిత్స్ అబౌట్ పాకిస్తాన్ అంటూ ఎప్పుడో రామ‌చంద్ర గుహ వంటి వారు రాసిన వ్యాసాల సంగ‌తి తెలిసిందే. పాకిస్థాన్ కి సంబంధించి  ఎన్నో అపోహ‌లు ఉంటూనే ఉంటాయి. అక్క‌డ పైకి మ‌న‌కు ఉగ్ర‌వాద‌మే క‌నిపిస్తుంది. లోప‌ల మ‌రోలా ఉంటుంది. ఉండొచ్చు కూడా.  కానీ పిట్రోడా ఈ కామెంట్ చేయాల్సిన  టైం మాత్రం ఇది కాదంటారు పరిశీలకులు. మొన్న ఆప‌రేష‌న్ సిందూర్ విష‌యంలో ఏం జ‌రిగిందో అంద‌రికీ తెలిసిందే. పాక్ వ‌ల్ల భార‌త్, అమెరికా మధ్య  త‌గువులొచ్చిన సీన్ క‌నిపిస్తోంది. ఇప్ప‌టికీ పాక్, అమెరికా సాయంతో థ‌ర్డ్ పార్టీ మీడియేష‌న్ తో భార‌త్ తో స‌యోధ్య‌కు ప్ర‌య‌త్నం చేస్తోంది. అందుకు భార‌త్ స‌సేమిరా అంటోంది. దానికి తోడు అమెరికా చేయి విడిచి చైనా, ర‌ష్యాల‌తో చెలిమి చేస్తోంది భార‌త్. దీనంత‌టికీ కార‌ణం పాకిస్థానే. ఎప్పుడైతే ట్రంప్ త‌న కుటుంబ పెట్టుబ‌డులు పాక్ లో పెడుతున్నారో,  అప్పటి నంచీ గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ ని ద‌గ్గ‌ర‌కు చేర్చుకుంటున్నారు. అప్ప‌టి  నుంచీ అమెరికాకు మ‌న‌కూ మ‌ధ్య దూరం  పెరుగుతూ వ‌స్తోంది. భార‌త్, పాక్ ఘ‌ర్ష‌ణ‌లు ఆపింది ట్రంపే అన్న కోణంలో పాక్ ఆయ‌న‌కు నోబుల్ శాంతి బ‌హుమ‌తికి ప్ర‌తిపాదించ‌డం, భార‌త్ ఇందుకు ఒప్పుకోక పోవ‌డం వంటి కార‌ణాల రీత్యా ప్ర‌స్తుతం భార‌త్, అమెరికా మ‌ధ్య సంబంధాలు  దిగ‌జారుతూ వ‌స్తున్నాయ్. దీనంత‌టికీ కార‌ణం పాకిస్థానే. ఈ క్ర‌మంలో పిట్రోడా ఈ పిచ్చి ప్రేలాప‌న చేయ‌డంతో అంద‌రిలోనూ అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం అవుతున్నాయి. పిట్రోడ్ పాక్ విషయంలో చేసిన కామెంట్లతో ఊరుకోకుండా..   నేపాల్, బంగ్లా  ఎంత ప్ర‌శాంతంగా ఉన్నాయో చూడ‌మంటున్నారు. ఇటీవ‌లే  నేపాల్ మొత్తం త‌గ‌ల‌బ‌డగా.. ఇక బంగ్లా లో మిల‌ట‌రీ వ‌ర్సెస్ తాత్కాలిక ప్ర‌భుత్వంగా  మారింది  ప‌రిస్థితి. తాత్కాలిక బంగ్లా ప్ర‌ధాని తో బంగ్లా ఆర్మీ ప‌డ‌లేక పోతోంది. కొత్త‌గా ఎన్నిక‌లు జ‌రిపి తీరాల్సిందే అని ప‌ట్టుబ‌డుతోంది  బంగ్లాదేశ్ సైన్యం. మొన్నా మ‌ధ్య విద్యార్ధులంతా రోడ్ల‌పైకి వ‌చ్చారు కూడా. పాత‌ ప్ర‌భుత్వం దిగిపోయేట‌పుడు బంగ్లాలో జ‌రిగిన హింస  కూడా ఏమంత త‌క్కువ కాదు. అలాంటి నేపాల్, బంగ్లా ల్లో ఆయ‌న‌కు అంత‌టి శాంతి సౌభ్రాతృత్వాలు ఎక్క‌డ క‌నిపిస్తున్నాయో చెప్పాల‌ని నిల‌దీస్తున్నారు నెటిజ‌న్లు. ఇదంతా భార‌త్ వ్య‌తిరేక వాద‌న‌లో భాగ‌మ‌ని అంటారు చాలా మంది. వీరు మోడీ  ప్ర‌భుత్వాన్ని వ్య‌తిరేకించ‌డానికి ఇక్క‌డున్న స‌మ‌స్య‌ల‌పై విమ‌ర్శ‌లు చేయాలిగానీ మ‌న బ‌ద్ధ శ‌తృవు పాకిస్తాన్ సొంతిల్లు లాంటిద‌న‌డం.. పొరుగున ఉన్న నేపాల్, బంగ్లాదేశ్ లు.. ప్ర‌శాంతంగా ఉంటాయ‌న‌డం స‌రికాద‌న్న స‌ల‌హాలు అందుతున్నాయి.

తెలుగుదేశంలోకి అలాంటి వారికి నో ఎంట్రీ!

తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సమక్షంలో వైసీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్సీలు టీటీపీ గూటికి చేరారు. శుక్రవారం (సెప్టెంబర్ 19) ఉండవల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, మర్రిరాజశేఖర్, బల్లి కల్యాణ చక్రవ్తరిలు తెలుగుదేశం తీర్ధం పుచ్చుకున్నారు.  వీరి చేరికకు ముందు చంద్రబాబు వారితో విడివిడిగా మాట్లాడారు. ఒక్కొక్కరితో పదే నిముషాల సేపు మాట్లాడిన ఆయన వారు తెలుగుదేశం గూటికి చేరడానికి కారణం, వారు పార్టీలో ఏ స్థానం కోరుకుంటున్నారు. ప్రజలలో వారికి ఉన్న ఆదరణ ఏంత అన్న విషయాలపై చంద్రబాబు వారితో మాట్లాడినట్లు తెలుగుదేశం వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే.. గ‌తానికి బిన్నంగా తాజాగా పార్టీలో చేరేందుకు ముందుకు వ‌చ్చిన వారితో ఆయ‌న 10 నిమిషాల చొప్పున చ‌ర్చించారు. అలాగే తెలుగుదేశం కూటమి ప్రభుత్వ పని తీరుపై వారి అభిప్రాయాన్ని తెలుసుకున్నారు. వారి వారి నియోజకవర్గాలలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజలు ఏమనుకుంటున్నారన్న విషయాన్ని ఆరా తీశారు.  ఆ తరువాతే వారికి తెలుగుదేశం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.  ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ ఏమీ పుష్పకవిమానం  కాదన్నారు. ప్రజల కోసం పని చేసే వారికి మాత్రమే పార్టీలోకి ఎంట్రీ ఉంటుందని కుండబద్దలు కొట్టారు. ఎవరినిబడితే వారిని పార్టీలో చేర్చుకునే ప్రశక్తే లేదన్నారు. వైసీపీ హయాంలో ప్రజాకంటకులుగా వ్యవహరించిన  ఆ పార్టీ నేతలకు ఎంట్రీ ఉండదని స్పష్టం చేశారు. 

జగన్ సోదరుడి కంపెనీల్లో సిట్ సోదాలు

సిట్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బిగ్ షాక్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో ఆయన సోదరుడు వైఎస్ అనిల్ రెడ్డి కంపెనీలు, నివాసాలలో సోదాలు నిర్వహించింది. ఈ అనిల్ రెడ్డి ఎవరంటే జగన్ రెడ్డి పెదనాన్న వైఎస్ జార్జిరెడ్డి రెండో కుమారుడు.  చెన్నైలోని   మైలాపూర్, టీనగర్, పేరంగుడి, అరప్పుకొట్టాయ్ తో పాటు హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో ఉన్న అనిల్‌రెడ్డికి సంబంధించిన కంపెనీల కార్యాలయాలు, ఇంజంబాక్కం, చెన్నై అళ్వార్‌పేట్ ల్లోని అనిల్‌రెడ్డి  నివాసాల్లో సిట్ ఏకకాలంలో సోదాలు చేసింది. దాదాపు పది ప్రాంతాలలో ఈ సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో సిట్ కీలక డాక్యుమెంట్లు, హర్డ్ డిస్క్ లు స్వాధీనం చేసుకుంది మద్యం ముడుపుల సొమ్మును ఈ కంపేనీల ద్వారా విదేశాలకు తరలించారని భావిస్తున్న సిట్ అందుకు సంబంధించి ఆధారాల సేకరణకు ఈ సోదాలు నిర్వహించింది.   శుక్రవారం (సెప్టెంబర్ 19)న ఏకకాలంలో పది చోట్ల సిట్ చేపట్టిన ఈ సోదాలు రాత్రి పొద్దుపోయే వరకూ సాగాయి.   కాగా సిట్‌ సోదాలు చేసిన కంపెనీల్లో  షిలో ఇండస్ట్రీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, ఫోరెస్‌ ఇంపెక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌  తదితర కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలన్నీ కూడా  2019లో  జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాతే ఏర్పాటు అయినవే కావడం గమనార్హం. మద్యం ముడుపుల సొమ్ము మళ్లింపు కోసమే ఈ కంపెనీలను ఏర్పాటు చేసినట్లు సిట్ అనుమానిస్తోంది.  అసలు ఈ సంస్థలు ఎందుకు పెట్టారు? , వీటి కార్యకలాపాలేంటి? అన్నదిశగా సిట్ దర్యాప్తు సాగిస్తున్నట్లు తెలుస్తోంది.  ఇటీవలే అనిల్‌రెడ్డి పీఏ దేవ రాజ్‌ సిట్‌ విచారించిన సంగతి తెలిసిందే. ఆ విచారణలో దేవరాజ్ ఇచ్చిన సమాచారం ఆధారంగానే ఇప్పుడు అనిల్ రెడ్డి నివాసాలు, కంపెనీలలో సిట్ సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది.  సిట్‌    షిలో ఇన్‌ఫ్రా వెంచర్స్‌ ఎల్‌ఎల్‌పీ, షిలో ఇండస్ట్రీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ , క్వన్న ఎగ్జిమ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ , వర్క్‌ ఈజీ స్పేస్‌ సొల్యూషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ , ఇండోరాక్స్‌ ఎల్‌ఎల్‌పీ , ఫోరెస్‌ ఇంపెక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ,శ్రీ గోవిందరాజా మిల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌  ట్రాన్‌సెల్‌ బయోలాజిక్స్‌ ప్రైవేట్‌ లిమి టెడ్, హైదరాబాద్‌ తదితర కంపెనీల్లో సోదాలు చేసింది.  

ఫిరాయింపులపై ఎవరి భాష్యం వారిదే!

ఫిరాయింపుల మీద తెలంగాణ రాష్ట్రంలో చిత్ర విచిత్ర‌మైన వాద‌న‌లు తెర మీద‌కు వ‌స్తున్నాయ్. ఓట్ల చోరీ  కంటే ఎమ్మెల్యేల చోరీ అతి పెద్ద నేరమంటారు  కేటీఆర్. ఇదిలా ఉంటే సీఎం రేవంత్.. అస‌లు ఫిరాయింపు ఎక్క‌డుంది?  ఒక సీఎం అన్నాక‌.. ఎంద‌రో ఎమ్మెల్యేలు  వ‌స్తుంటారు పోతుంటారు. ఆ టైంలో వారికి కండువాలు క‌ప్పుతుంటాం. కండువా కప్పుకున్నంత మాత్రాన ఫిరాయింపు కాదని భాష్యం చెబుతారు. అబ్బే తెలంగాణలో ఫిరాయింపులేం లేవంటారాయన.  ఇదే విష‌యంలో..   క‌డియం శ్రీహ‌రి మరో చిత్రమైన వాదనను తెరపైకి తీసుకువచ్చారు. తాను ఏ పార్టీ అన్నది అసెంబ్లీ స్పీకర్ తేలుస్తారు. ఈ విషయంలో తాను చెప్పేదేం లేదంటున్నారు కడియం శ్రీహరి.  ఒక ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నారో స్పీక‌ర్ తేల్చ‌డ‌మేంటి?  అంటూ విస్తుపోవడం పరిశీలకుల వంతు అవుతోంది. ఆయ‌న  ఏ పార్టీ ద్వారా బీఫాం తీసుకుని పోటీ చేసి గెలిచారో ఆ పార్టీ ఎమ్మెల్యే అవుతారు కదా. మరి కడియం మాట్లలోని వితండం ఎక్కడిది అంటే.. ఇక్క‌డ మ‌రో విచిత్ర‌మైన ప‌రిస్థితి అదేంటంటే.. ఇదే స్టేష‌న్ ఘ‌న్ పూర్ సీటు త‌న‌కు ద‌క్కాల్సింది పోయి.. శ్రీహ‌రి త‌న్నుకుపోయార‌ని అంటారు రాజ‌య్య‌. టికెట్ ఇవ్వ‌కుంటే తాను కాంగ్రెస్ లోకి వెళ్తాన‌ని బెదిరించి మ‌రీ క‌డియం ఈ టికెట్ బ‌ల‌వంతానా తీసుకున్నారని చెబుతున్నారాయన.   ఇక పోతే ఇదే క‌డియం.. ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చిన వెంట‌నే అన్న మాట‌.. ఏంటంటే, ఏదైనా జ‌ర‌గొచ్చు. కాంగ్రెస్ అధికారం వెంట‌నే కోల్పోవ‌చ్చు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొంద‌రు మా ట‌చ్ లో ఉన్నార‌ంటూ ఫీలర్లు వదిలారు.  ఆ వెంట‌నే వెళ్లి కాంగ్రెస్ లో చేరిపోయారు. అదే మంటే నియోజ‌క‌ర్గం కోస‌మే ఇదంతా చేస్తున్నానంటారు. కావాలంటే చూడండీ ఇప్ప‌టి వ‌ర‌కూ వెయ్యి కోట్ల‌కు పైగా నిధులు ప‌ట్టుకొచ్చానని చెప్పుకుంటున్నారు.  ఇటు చూస్తే సీఎం అస‌లు ఫిరాయింపులే లేవంటున్నారు. అటు చూస్తే అస‌లు ఓట్ల చోరీక‌న్నా  ఎమ్మెల్యేల చోరీ అతి పెద్ద‌ద‌ని కేటీఆర్ అంటారు. ఇక అటు ఇటు కాని సందిగ్దావ‌స్త ఈ ఎమ్మెల్యేల‌ది. మొన్న‌టికి మొన్న బీఆర్ఎస్ గ‌ద్వాల్ స‌భ జ‌రిగితే ఎమ్మెల్యే బండ్ల త‌న ఫ్లెక్సీల‌కు ప‌ర‌దాలు క‌ప్పుకున్న దృశ్యం క‌నిపించింది. దీంతో తెలంగాణ‌లో ఫిరాయింపులపై తెలంగాణలో ఎవరికి వారు తమ సొంత భాష్యం చెప్పుకుంటున్నట్లు కనిపిస్తోంది. 

రాజకీయ పార్టీలపై ఈసీ కొరడా... 474 పార్టీల గుర్తింపు రద్దు

  చట్టబద్ధ నిబంధనలను ఉల్లంఘిస్తూ, చురుకైన రాజకీయ కార్యకలాపాలు లేని పార్టీలపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రక్షాళన చేపట్టింది. జూన్ నుంచి కొనసాగుతున్న స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా యాక్టీవ్‌గా లేని 808 పార్టీల నమోదును ఈసీ రద్దు చేసింది. 2019 తర్వాత జరిగిన ఏకైనా ఎన్నికల్లో పాల్గొనని పార్టీలను ఈసీ గుర్తించి చర్యలు తీసుకుంది. పేరుకు మాత్రమే నమోదు చేసుకున్నా, వీటికి స్థిరమైన కార్యాలయాలు కూడా లేవని కమిషన్ వెల్లడించింది.  ఇంతకుముందు 334 పార్టీలను రద్దు చేసిన ఈసీ, మరో విడతలో 474 పార్టీలను కూడా వేటు వేసింది. రెండు నెలల్లో మొత్తం 808 పార్టీల నమోదును రద్దు చేసింది. ఇప్పటి వరకు దేశంలో 2,520 గుర్తింపు లేని నమోదిత రాజకీయ పార్టీలు ఉండగా, తాజా నిర్ణయంతో ఆ సంఖ్య 2,046కు తగ్గింది. ప్రస్తుతం భారత్‌లో ఆరు జాతీయ పార్టీలు, 67 రాష్ట్ర స్థాయి పార్టీలు మాత్రమే చురుకుగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయని ఈసీ స్పష్టం చేసింది.

టీడీపీలో చేరిన ముగ్గురు వైసీపీ ఎమ్మెల్సీలు

  వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. ముగ్గురు ఎమ్మెల్సీలు తెలుగుదేశం పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం సీఎం చంద్రబాబు  ఎమ్మెల్సీలు మర్రి రాజశేఖర్, బల్లి కళ్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీలు  పార్టీ కండువాలు కప్పి సీఎం సాదరంగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన నేతలకు ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు.  ఇప్పటికే ఆ పార్టీకి, పదవులకు ఈ ముగ్గురు ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. రాజీనామాలపై మండలి ఛైర్మన్‌ ఇంకా నిర్ణయం తీసుకోలేదు.  ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యేలు సునీల్, విజయశ్రీ, పులివర్తి నాని, ఎమ్మెల్సీలు పేరాబత్తుల రాజశేఖర్, అనురాధ, చిరంజీవి, ఆలపాటి రాజేంద్రప్రసాద్, బీటీ నాయుడు, రామ్‌గోపాల్ రెడ్డి, కంచర్ల శ్రీకాంత్, సీఎం కార్యక్రమాల సమన్వయకర్త మంతెన సత్యనారాయణ రాజు, ఫారెస్ట్ డెవలెప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సుజయ్ కృష్ణరంగారావు, తదితరులు పాల్గొన్నారు.  

ఒక ఆడబిడ్డపై నలుగురు కలిసి దాడి చేస్తున్నారు : సీఎం రేవంత్

  సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ నిర్వహించారు. పలు అంశాలపై మాట్లాడారు. మాజీ ఎమ్మెల్సీ కవితపై కేసీఆర్, కేటీఆర్, హారీశ్‌రావులు కలిసి ఆడపిల్లపై దాడి చేయాలని చూస్తున్నారని పేర్కొన్నారు. ఇది వారి ఇంటి సమస్య. వారిని ప్రజలు బహిష్కరించేవారు. కాళేశ్వరం విచారణ బాధ్యతను సీబీఐకి అప్పగించి చాలా రోజులైనా కిషన్‌రెడ్డి ఎందుకు మాట్లాడలేదు. కేటీఆర్ ఏం చేప్తే కిషన్‌రెడ్డి అది చేస్తారు అని తెలిపారు. కండువాలు కప్పినంత మాత్రాన పార్టీ మారినట్లు కాదని ముఖ్యమంత్రి తెలిపారు.  నేను కూడా ఈరోజు ప్రోగ్రాంలో ఎంతో మందికి కండువాలు కప్పాను ఆ కండువా ఏంటో కూడా వాళ్ళు చూసుకోకుండా కప్పించుకున్నారని ఆయన పేర్కొన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని ముఖ్యమంత్రి తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని సీఎం తెలిపారు. ‘‘బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించి మూడు బిల్లులు రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. రాష్ట్రపతి నిర్ణయం తీసుకునే గడువు అంశం సుప్రీంకోర్టులో ఉంది. దీనిపై సర్వోన్నత న్యాయస్థానం ఏం చెప్తుందో వేచి చూస్తున్నాం. న్యాయ నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. మళ్లీ కోర్టుకు వెళ్లాలా? వద్దా? అనేది అప్పుడే నిర్ణయం తీసుకుంటాం’’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. 2014-19 బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో  కేసీఆర్‌ కేబినెట్‌లో ఒక్క మహిళ కూడా మంత్రిగా అవకాశం కల్పించలేదని పేర్కొన్నారు.లేరు. తెలంగాణ ఉద్యమం పేరుతో కేసీఆర్ కొన్ని వందల మంది పిల్లల ఉసురు పోసుకున్నారు.. అది ఊరికే పోదని అన్నారు.ఇక హైదరాబాద్‌ మెట్రో విషయంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, కేటీఆర్‌ కలిసి అడ్డంకులు సృష్టిస్తున్నారు. ఎల్‌అండ్‌టీతో ఒప్పందం చేసుకుంటేనే అనుమతులు ఇస్తామని కేంద్రం చెబుతోంది. కేంద్రంలో ఉన్న కిషన్‌రెడ్డి ఇలాంటి మెలికలు పెడుతున్నారు రేవంత్‌రెడ్డి తెలిపారు.

రేవంత్ చెప్పిన తెలంగాణ ట్రంప్ ఎవరంటే?

తెలంగాణముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావును తెలంగాణ ట్రంప్ గా అభివర్ణించారు. ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్ననిర్ణయాలు ఏ విధంగా అయితే అమెరికాకు నష్టం చేకూరుస్తున్నాయో.. అలాగే గతంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు తెలంగాణకు తీరని నష్టాన్ని చేకూర్చాయన్నారు. అయితే ఈ సందర్భంగా ఆయన నేరుగా కేసీఆర్ పేరును ప్రస్తావించకుండా గతంలో తెలంగాణలోనూ ఓ ట్రంప్ ఉండేవారని అంటూ.. ఆయన పాలన నచ్చకే తెలంగాణ జనం ఓడించి ఫామ్ హౌస్ లో కూర్చోబెట్టారని పేర్కొన్నారు. ఢిల్లీలో శుక్రవారం (సెప్టెంబర్ 19) జరిగిన బిజినెస్ స్టాండర్డ్స్ యాన్యువల్ ఫోరం సదస్సులో రేవంత్ మాట్లాడారు.  ఈ సందర్భంగా ఆయన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అవలంబిస్తున్న విధానాలపై తీవ్ర విమర్శలు చేశారు.  ట్రంప్ విధానాల కారణంగానే పలు సంస్థలు అమెరికాను కాదంటున్నాయన్నారు. అలా అమెరికా వద్దనుకుంటున్న సంస్థలు తెలంగాణకు రావాలని రేవంత్ పిలుపునిచ్చారు. ఈ విషయంలో హార్వర్డ్, స్టాన్ ఫెర్డ్ సంస్థలతో తాను మాట్లాడతానని చెప్పారు.   తెలంగాణకు వచ్చే సంస్థలకు అవసరమైన అన్ని మౌలిక వసతులూ కల్పిస్తామన్న రేవంత్... తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. ఇష్టారాజ్యంగా పాలన చేసే అవరైనా ట్రంపే అవుతారన్న రేవంత్ రెడ్డి.. అటువంటి వారి పాలన ఎక్కువ రోజులు నడవదన్నారు.  

ఆ కేసు కూడా సీబీఐకి?

తెలంగాణ ప్రభుత్వం మరో కీలకమైన, అత్యంత ప్రధానమైన కేసును సీబీఐకి అప్పగించనుంది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలు, అవకతవకలు, అవినీతికి సంబంధించిన  కేసును సీబీఐకి అప్పగించిన రేవంత్ సర్కార్.. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసును కూడా సీబీఐకి అప్పగించాలని భావిస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించే విషయంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ గా యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై కొందరు అధికారులతో ఇప్పటికే చర్చించినట్లు విశ్వస నీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. అలాగే మంత్రివర్గ సహచరులతో కూడా ఈ విషయమై చర్చించి వారి అభిప్రాయం తీసుకున్నట్లు చెబుతున్నారు.  ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్మమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ సహా పలువురు బీఆర్ఎస్ నేతలపై ఆరోపణలు ఉన్న సంగతి విదితమే. ఫోన్ ట్యాపింగ్ కేసులో రాష్ట్రప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ఇప్పటికీ దర్యాప్తు కొనసాగిస్తున్నది. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కేసును సీబీఐకి అప్పగించాలని నిర్ణయించడం ప్రాధాన్యత సంతరించుకుంది. సిట్ దర్యాప్తునకు నిందితులు ముఖ్యంగా ఈ కేసులో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు సహకరించడం లేదని, అందుకే కేసు దర్యాప్తు ఏళ్ల తరబడి ఒక కొలిక్కి రాకుండా సుదీర్ఘంగా సాగుతోందనీ రేవంత్ భావిస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాల ద్వారా తెలుస్తోంది. అదే దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తే.. విషయం మరింత సీరియస్ అవుతుందనీ, అధికారులు సహకరించకుండా ఉండే పరిస్థితి ఉండదని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారంటున్నారు. 

ఏపీ శాసనమండలి సోమవారానికి వాయిదా

  వైసీపీ నేతల గందరగోళం మధ్య శాసనమండలి సోమవారానికి వాయిదా పడింది. ప్రశ్నోత్తరాల సమయంలో వైద్యకళాశాలల అంశంపై చర్చించాలంటూ వైసీపీ నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్మించారు. బీఏసీ సమావేశంలో వైద్యకళాశాలపై చర్చిస్తామని ఛైర్మన్‌ చెప్పారు. మరోవైపు జీఎస్టీ సంస్కరణల అంశంపై  స్టేట్‌మెంట్‌ ఇవ్వాలని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ను మండలి ఛైర్మన్‌ కోరారు. సభలో ఆర్డర్‌లో ఉంచాలని పయ్యావుల విజ్ఞప్తి చేశారు. వైసీపీ సభ్యులు తమ ఆందోళనను కొనసాగించడంతో మండలి ఛైర్మన్‌ మోషేనురాజు సభను సోమవారానికి వాయిదా వేశారు.  వైద్యశాలల అంశంపై చర్చించాలంటూ వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. మండలి ఛైర్మన్‌ మోషేనురాజు ప్రశ్నోత్తరాలు చేపడుతున్న సమయంలోనూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఛైర్మన్‌ పోడియం వద్దకు వెళ్లి ప్లకార్డులు ప్రదర్శించారు. మరోవైపు టీడీపీ సభ్యులు కూడా వైసీపీకు పోటీగా నినాదాలు చేశారు. వైసీపీ ఆరోపణలను తిప్పికొడుతూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ క్రమంలో ప్రశ్నోత్తరాలు పూర్తయినట్లు ఛైర్మన్‌ ప్రకటించారు. వైద్యకళాశాలలపై స్వల్ప చర్చ చేపట్టాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించామని.. సభ సజావుగా జరిగేలా సహకరించాలని వైసీపీ సభ్యులను ఆయన కోరారు. 

అభివృద్ధి కోసం కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తున్నా : కడియం శ్రీహరి

  స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తున్నానని ఎమ్మెల్యే కడియం శ్రీహరి వెల్లడించారు. మాజీ సీఎం కేసీఆర్ 36 మంది ఎమ్మెల్యేలను బీఆర్‌ఎస్ పార్టీలో చేర్చుకున్నారు. వారిలో ఇద్దరిని మంత్రులను కూడా చేశారు. అప్పుడు బీఆర్‌ఎస్‌లో చేరిన వారెవరూ రాజీనామా చేయలేదు. ఇప్పుడు ఆ పార్టీ అగ్రనేతలకు విలువలు గుర్తుకొచ్చాయా? సభాపతి నోటీసు ఇచ్చారు, ఆయన నిర్ణయాన్ని గౌరవిస్తాను’’ అని కడియం శ్రీహరి స్పష్టం చేశారు.  ఈ ప్రాంత ప్రగతికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్ని విధాలా సహకరిస్తున్నారని తెలిపారు. హనుమకొండలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నియోజకవర్గంలోని పలు ప్రాంతాలకు గోదావరి జలాలను అందించామని చెప్పారు. చెరువులు నిండిపోయాయని, కాలువల్లో పూడిక తీయించి మరమ్మతులు చేసి సాగునీరు చేరేలా చర్యలు చేపట్టినట్లు వివరించారు. ముఖ్యమంత్రి సహకారంతోనే అనేక అభివృద్ధి పనులు ముందుకు సాగుతున్నాయి. స్టేషన్‌ ఘన్‌పూర్‌ ప్రజలతోనే ఉంటాను, వారి కోసం కృషి చేస్తాను.