మరికాసేపట్లో గ్రూప్-2 పరీక్షలు
posted on Jul 21, 2012 @ 12:20PM
మరికాసేపట్లో గ్రూప్-2 పరీక్ష ప్రారంభం కానుంది. మొత్తం 781 పోస్టులకు గాను 5 లక్షల మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1360 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు గంట ముందుగానే చేరుకోవాలని అధికారులు సూచించారు. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి 4.30 వరకు పేపర్- 1 పరీక్ష జరుగుతుంది. అదే విధంగా అదివారం ఉదయం 10 గంటల నుంచి 12.30 వరకు పేపర్ 2 పరీక్షను నిర్వహిస్తారు.