విజయమ్మ దీక్షపై విజయ శాంతి ఫైర్
posted on Jul 21, 2012 @ 4:06PM
ఈ నెల 23వ తేదీన సిరిసిల్లలో విజయమ్మ తలపెట్టిన నేతన్న దీక్షపై విజయశాంతి తీవ్రంగా మండిపడ్డారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సమైక్యవాద పార్టీ అని స్పష్టంగా తేలిపోయిందని ఆమె అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే వైయస్ విజయమ్మ దీక్ష చేస్తున్నారని ఆమె విమర్శించారు. తెలంగాణ పట్ల వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి చిత్తశుద్ధి లేదని, అందుకే తాము వైఖరి చెప్పాలని అడుగుతున్నామని ఆమె అన్నారు.