రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం
posted on Jul 22, 2012 @ 11:11AM
అన్ని రాష్ట్రాల నుంచి దేశ రాజధాని ఢిల్లీకి తరలించిన బ్యాలెట్ల లెక్కింపును ఆదివారం ఉదయం ప్రారంభించారు. మధ్యాహ్నం సమయానికి ఫలితాలు వెలువడవచ్చని అధికారులు తెలిపారు. కొత్తగా ఎన్నికైన రాష్ట్రపతితో ఈనెల 25వ తేదీన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవీ ప్రమాణం చేయిస్తారు. యూపీఏతోపాటు ఎన్డీఏలోని పలు భాగస్వామ్య పక్షాలు ప్రణబ్‌కు మద్దతు ప్రకటించడం, తృణమూల్ కాంగ్రెస్ కూడా చివరి నిమిషంలో ఓటేయటంతో ఆయన ఎన్నిక కేవలం లాంఛనంగా మారింది.