తెలంగాణకి బొత్స పరోక్ష మద్దతు?
posted on Jul 21, 2012 @ 5:32PM
బొత్స సత్యనారాయణ శనివారం ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతు హిందీ మాట్లాడేవారికి 13 రాష్టాలు ఉన్నప్పుడు తెలుగు మాట్లాడేవారికి రెండు రాష్ట్రాలు ఉంటే తప్పేమిటని అన్నారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం త్వరగా నిర్ణయం తీసుకోవాలని అన్నారు. రాష్ట్ర విభజనపై పార్టీ అధిష్టానం, కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటానని ఆయన చెప్పారు. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై తనకు ఏ విధమైన సమాచారం లేదని అన్నారు.