congress

తెలుగు ప్రజలతో చెలగాట మాడుతున్న కాంగ్రెస్, బీజేపీలు

  ఎన్నికల తరువాత కేంద్రంలో అధికారం దక్కించుకోవడమే పరమావధిగా కాంగ్రెస్, బీజేపీలు సున్నితమయిన రాష్ట్ర విభజన వ్యవహారంపై వికృత రాజకీయ క్రీడ ఆడుతున్నాయి. ఆ రెండు పార్టీలు ఈ మొత్తం వ్యవహారంలో తమకే పూర్తి రాజకీయ లబ్ది కలగాలనే కోణంలోనే ఆలోచిస్తూ ఎత్తులు పైఎత్తులు వేస్తూ రాష్ట్ర విభజనకు సహకరించుకొంటూనే, ఒకదానిపై మరొకటి కత్తులు దూసుకొంటున్నాయి. ఒకవైపు రాష్ట్ర విభజన చేసి తెలంగాణాలో తమ పార్టీలకి ప్రయోజనం కలిగేలా జాగ్రత్తపడుతూనే, మరో వైపు తామే సీమాంధ్ర ప్రజల మేలు కోసం (ఎక్కువ) పరితపించిపోతున్నట్లు ఆయా పార్టీల నేతలు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు.   కాంగ్రెస్ అధిష్టానానికి చెక్కభజన చేస్తున్న కేంద్రమంత్రులు జేడీ.శీలం వంటివారు తాము గట్టిగా పట్టుబట్టడం వలననే సీమాంధ్రకు స్వతంత్ర ప్రతిపత్తి, ప్రత్యేక ప్యాకేజీలు ఇచ్చేందుకు సోనియా, రాహుల్ గాంధీలు చాల దయతో అంగీకరించారని, అందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుకొంటున్నామని చెప్పడం చూస్తుంటే, వారిరువురు రాష్ట్రవిభజన చేస్తున్నపటికీ, వారు దయతో ప్యాకేజీలు విదిలించినందుకు సీమాంధ్ర ప్రజలు కూడా ఎంతయినా ఋణపడి ఉండాలన్నట్లు సూచిస్తున్నట్లుంది. అంతేకాక కేవలం తాము, తమ అధిష్టానం, కాంగ్రెస్ పార్టీ మాత్రమే సీమాంధ్రకోసం పరితపించిపోతున్నట్లుగా మాట్లాడుతూ, తమ కాంగ్రెస్ పార్టీయే రాష్ట్ర విభజన చేసిన విషయాన్ని మరుగునపరిచే ప్రయత్నం కూడా చేస్తున్నారు. పనిలోపనిగా తాము కోరిన ప్యాకేజీలనే బీజేపీ కాపీ కొట్టి, అది తమ ప్రతాపమే అన్నట్లు మాట్లాడుతోందని ఎద్దేవా చేసారు.   ఇక బీజేపీ నేతలు కూడా వారికి తీసిపోనట్లు తాము కాంగ్రెస్ అధిష్టానం మెడలువంచి సీమాంధ్రకు స్వతంత్ర ప్రతిపత్తి, ప్రత్యేక ప్యాకేజీలు ఇప్పించేందుకు ఒప్పించామని, అందువల్ల ఈ ‘టోటల్ ఖ్యాతి’ మొత్తం తమకే పూర్తిగా చెందాలని బిగ్గరగా వాదిస్తోంది.   ఈవిధంగా కాంగ్రెస్, బీజేపీలు రెండూ రాష్ట్ర విభజన చేసేందుకు ఒకదానికొకటి పరస్పరం సహకరించుకొంటూ అటు తెలంగాణాలో తమ తమ పార్టీ ప్రయోజనాలు కాపాడుకొనే ప్రయత్నం చేస్తూనే, మరోవైపు రెండూ కూడా సీమాంధ్రపై కపట ప్రేమ ఒలకబోస్తున్నాయి. అయితే రెండు ప్రాంతాలలో ప్రజలను ఆకట్టుకోవాలనే ప్రయత్నంలో అవి ఆడుతున్నఈ నాటకాలను చూసి రెండు ప్రాంతాలలో ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా వాటిని అసహ్యించుకొంటున్నారనే సంగతి అవి గ్రహించలేకపోవడం విచిత్రం. సున్నితమయిన ఈ అంశంతో కోట్లాది తెలుగు ప్రజల భావోద్వేగాలు ముడిపడిన సంగతిని ఏ మాత్రం పట్టించుకోకుండా రెండు పార్టీలు ఆడుతున్న నాటకాలతో అవి ఆశిస్తున్నట్లు ఏమాత్రం రాజకీయలబ్ది కలుగకపోగా సరిగ్గా అదే అంశంతో ఘోరంగా దెబ్బ తినే ప్రమాదం ఉందని గ్రహించలేకపోవడం మరీ విచిత్రం.

tdp

తెదేపా ఆంధ్ర, తెలంగాణా శాఖలకు శ్రీకారం?

  రాష్ట్ర విభజన అనివార్యమని తెలియడంతో తెలుగుదేశం పార్టీ రెండు రాష్ట్రాలకు విడివిడిగా పార్టీ శాఖలను ఏర్పాటు చేసేందుకు కసరత్తు మొదలుపెట్టక తప్పలేదు. నిన్న ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తన పార్టీ నేతలతో సమావేశమయ్యి ఈ విషయమపై చర్చించారు. కాంగ్రెస్ అధిష్టానం తన రాజకీయ ప్రత్యర్ధులను అన్నివిధాల దెబ్బతీసేందుకే ఎన్నికలు దగ్గిరపడేవరకు ఈ విభజన వ్యవహారాన్ని సాగదీసుకొంటూ వచ్చిందని, ఇంకా ఆలస్యం చేసినట్లయితే, ఒకవేళ కాంగ్రెస్ మరేదయినా నక్కజిత్తులు ప్రదర్శిస్తే ఎన్నికలకు సిద్దం అవడానికి కూడా ఇక సమయం మిగలకపోవచ్చని, అందువలన వెంటనే ఆంధ్ర, తెలంగాణా ప్రాంతాలకు ప్రత్యేక శాఖల ఏర్పాటు చేయవలసిందిగా తెదేపా నేతలు ఆయనను కోరినట్లు సమాచారం. అందుకు కోసం మొదట రెండు కమిటీలను నియమించేందుకు చంద్రబాబు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు సమాచారం.   పార్టీకి చెందిన ఆంధ్ర, తెలంగాణా నేతలతో మళ్ళీ త్వరలోనే విడివిడిగా సమావేశమయ్యి కమిటీలో సభ్యుల పేర్లను, కమిటీల విధివిధానాలను ఖరారుచేసే అవకాశాలున్నాయి. నిన్న జరిగిన సమావేశంలో ఉభయ ప్రాంతాలకు చెందిన సీనియర్‌ నేతలు అందరూ పాల్గొన్నారు. ఒకవేళ తెలుగుదేశం రెండు రాష్ట్రాలలో ప్రత్యేక శాఖలు ఏర్పాటు చేసుకోవాలంటే, ముందుగా ఆ పార్టీని జాతీయపార్టీగా మార్చుకొని ఎన్నికల సంఘం వద్ద నమోదు చేయించుకోవలసి ఉంటుంది. ఆ తరువాత రెండు రాష్ట్రాలలో శాఖలకు విడివిడిగా పార్టీ అధ్యక్షులను, కార్యవర్గాలను ఏర్పాటు చేసి, చంద్రబాబు ఆ రెండింటికి జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చెప్పట్టవలసి ఉంటుంది.   ఈ సమావేశంలో వారు బీజేపీతో పొత్తుల వ్యవహారంపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది. వారిలో బీజేపీతో ఎన్నికల పొత్తులకు మొదట సానుకూలంగా ఉన్న సీమాంధ్ర నేతలు ఇప్పుడు వ్యతిరేఖించగా, తెలంగాణా నేతలు పొత్తులు పెట్టుకోవాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. ఈరోజు బీజేపీ రాజ్యసభలో టీ-బిల్లుపై వ్యవహరించిన తీరుని బట్టి ఆ పార్టీతో ఎన్నికల పొత్తులు పెట్టుకోవాలా లేదా? అనే సంగతి నిర్ణయించుకోవడం మేలని వారు భావించినట్లు తెలుస్తోంది.

tdp

కాంగ్రెస్ వ్యూహంతో తెదేపా-బీజేపీలు కటీఫ్

  లోక్ సభలో నిన్న తెలంగాణా బిల్లు ఆమోదం పొందింది గనుక ఇక ఈరోజు రాజ్యసభకు వెళుతుంది. బీజేపీ కూడా బిల్లుకి మద్దతు ఇస్తునందున ఇక రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందడం కేవలం లాంచనప్రాయమే. కాంగ్రెస్ పార్టీలో తెరాస విలీనానికి ఆ పార్టీ అధినేత కేసీఆర్ అంగీకరించినట్లు సమాచారం. కనుక కాంగ్రెస్, తెరాస నేతలమధ్య పదవులు, టికెట్స్ పంపకాలు పూర్తి చేసుకొనగానే, అందరూ కాంగ్రెస్ కండువాలు కప్పుకొని తమ ప్రధాన ప్రత్యర్దులయిన తెదేపా, బీజేపీలపై యుద్ధం ప్రకటిస్తారు. బీజేపీ విషయానికి వస్తే విభజనకు సహకరించినప్పటికీ ఆ ప్రయోజనమంతా తెరసకి అది కాంగ్రెస్ లో విలీనమయితే కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది తప్ప బీజేపీకి ఒరిగేదేమీ ఉండదు.   రాష్ట్ర విభజన దెబ్బతో తెలంగాణాలో డీలాపడిన తెదేపా, అందుకు సహకరించిన బీజేపీతో పొత్తులు పెట్టుకొంటే ఆ ప్రభావం సీమాంధ్రలో తీవ్రంగా ఉంటుంది గనుక ఒంటరిపోరుకే సిద్దపడవచ్చును. ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్, తెరాసలు చేతులు కలిపినట్లయితే విజయోత్సాహంతో ఉన్నవారిని ఎదుర్కొని ఓడించడం తెదేపా, బీజేపీల వల్ల కాదు.   కాంగ్రెస్ విసిరిన గాలానికి చిక్కుకొన్న బీజేపీ రెండు ప్రాంతాలలో నష్టపోవడమే కాకుండా, తెదేపాను కూడా పోగ్గోట్టుకొనే అవకాశం ఉంది. ఎన్నికల తరువాత కేంద్రంలో అధికారం దక్కించుకోవాలని ఉవ్విళ్ళూరుతున్న బీజేపీ, ఇటువంటి కీలక సమయంలో దక్షిణాదిన ఉన్న ఏకైక మిత్రపార్టీ తెదేపాను పోగొట్టుకొంటే ఆ నష్టం తిరిగి ఎన్నడూ పూడ్చుకోలేదు. ఒకవేళ చంద్రబాబు థర్డ్ ఫ్రంట్ కి మొగ్గు చూపినట్లయితే, ఇక బీజేపీకి ఎదురీత తప్పకపోవచ్చును. బహుశః విభజన ద్వారా కాంగ్రెస్ ఆశించిన అనేక ప్రయోజనాలలో తెదేపా-బీజేపీలను దూరం చేయడం, తద్వారా రాష్ట్రంలో తెదేపాను, జాతీయ స్థాయిలో బీజేపీని బలహీనపరచడం కూడా ఒకటయి ఉండవచ్చును.   అయితే ఇంతవరకు చంద్రబాబు కానీ, ఆ పార్టీ సీనియర్ నేతలు గానీ బిల్లు ఆమోదంలో బీజేపీ పాత్రపై పెదవి విప్పలేదు. బహుశః ఈ రోజు రాజ్యసభలో బిల్లుపై బీజేపీ వ్యవహరించిన తీరు చూసిన తరువాత చంద్రబాబు బీజేపీతో పొత్తులపై విస్పష్టమయిన ప్రకటన చేయవచ్చును. అయిది, బీజేపీ ఇప్పుడు రాజ్యసభలో బిల్లుని ఎంతగా వ్యతిరేఖించినప్పటికీ బిల్లు ఆమోదం పొందడం లాంచనమే గనుక, బహుశః తెదేపా ఆ పార్టీతో ఎన్నికల పొత్తులను నిరాకరించవచ్చును.

bjp

బీజేపీ కూడా మూల్యం చెల్లించుకోక తప్పదా

  సీమాంధ్ర తరపున పోరాడుతామని, మూజువాణి ఓటుకి ఒప్పుకోమని వాదించిన బీజేపీ నిన్న లోక్ సభలో బిల్లుని అడ్డుకొనే ప్రయత్నం చేయకుండా ప్రేక్షకపాత్ర వహించి సహకరించింది. తెలంగాణాకు కట్టుబడి ఉన్నందునే బిల్లుకి మద్దతు ఇచ్చామని సమర్దించుకొంది. తృణమూల్ కాంగ్రెస్, జేడీ(యూ) వంటి పార్టీలు సైతం బిల్లుని వ్యతిరేఖిస్తూ సభ నుండి వాకవుట్ చేసి నిరసన తెలుపగా, కనీసం బీజేపీ ఆపని కూడా చేయలేకపోయింది. కాంగ్రెస్-బీజేపీల బండారం బయటపడుతుందనే భయంతోనే సభలో తలుపులు, కిటికీలు మూయించి, లోక్ సభ ప్రసారాలు నిలిపివేయించి రెండు పార్టీలు కలిపి రహస్యంగా బిల్లుని ఆమోదింపజేసి ఉంటాయి. బహుశః గత రెండు మూడు రోజులుగా ఆ రెండు పార్టీల మధ్య జరుగుతున్నా చర్చలన్నీ ఈ వ్యూహం కోసమే తప్ప సవరణల కోసమో లేక బిల్లుకి మద్దతు కోసమో మాత్రం కాదనిపిస్తోంది.   కాంగ్రెస్ అధిష్టానం ప్రత్యక్షంగా కపట నాటకాలు ఆడితే, బీజేపీ తెర వెనుక నిలబడి కనబడకుండా ఆడింది. కాంగ్రెస్ కత్తితో సీమాంధ్ర ప్రజల గొంతులు కొస్తే, బీజేపీ అంతకంటే దారుణంగా తడిగుడ్డతో వారి గొంతు నులుమింది. కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర విభజనకు పూనుకొన్నపుడే సీమాంధ్రలో తన పార్టీని పణంగా పెట్టుకొని జూదం మొదలుపెట్టింది గనుక అందుకు అది పశ్చాతాపపడబోదు. ఎందుకంటే తెలంగాణాలో తెరాసని విలీనం చేసుకొని, 15 యంపీ సీట్లు సాధించి ఆ లోటుని అది భర్తీ చేసుకోగలదు. కానీ, బీజేపీ చేసిన పనివల్ల సీమాంధ్రలో తుడిచిపెట్టుకుపోవడమే కాక తెలంగాణాలో కాంగ్రెస్-తెరాసలు చేతులు కలిపినప్పుడు అక్కడ కూడా పూర్తిగా తుడిచిపెట్టుకు పోవడం ఖాయం.   సోనియా, రాహుల్ గాంధీలు రాష్ట్రంలో పర్యటించలేరని దుస్థితిలో ఉన్నారని ఎద్దేవా చేసిన నరేంద్ర మోడీ, ఇప్పుడు తను, తన అగ్ర నేతలు కూడా సీమాంధ్రలో కాలుపెట్టలేని దుస్థితి చేజేతులా కల్పించుకొన్నారు. నిన్నటి వరకు మోడీకి బ్రహ్మ రధం పట్టిన సీమాంధ్ర ప్రజలు, బీజేపీ చేసిన పనికి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన ఫోటోలున్న బ్యానర్లను చింపి తగులబెట్టారు. ఆపార్టీ కార్యాలయాలపై దాడులు చేసారు.   సీమాంధ్ర ప్రజాగ్రహానికి గురయిన బీజేపీతో ఎన్నికల పొత్తులు పెట్టుకొనేందుకు తెలుగుదేశం పార్టీ కూడా నిరాకరించవచ్చును. తన రాజకీయ ప్రత్యర్ధి కాంగ్రెస్ పార్టీకి సహకరించి బీజేపీ ఏమి బావుకొంటుందో తెలియదు కానీ ఎన్డీయే కూటమిని బలోపేతం చేయగల తెలుగుదేశం పార్టీ మద్దతుని, చంద్రబాబు సహకారాన్ని పోగొట్టుకోవడం తధ్యంగా కనిపిస్తోంది.

chidambaram

చిదంబర మాయతో ఓట్లు రాలుతాయా?

  ఆర్ధికమంత్రి చిదంబరం నిన్న లోక్ సభలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ గమనిస్తే, అది పూర్తిగా ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రూపొందించినదేనని అర్ధమవుతుంది. మధ్యతరగతి ప్రజలను మభ్యపెట్టగలిగితే చాలు ఎన్నికలలో ఓట్లు గలగలా రాలిపోతాయనే భ్రమలో నుండి కాంగ్రెస్ పార్టీ బహుశః ఎన్నటికీ బయటపడలేదేమోనని ఈ బడ్జెట్ చూస్తే అర్ధమవుతుంది. మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా కొనుగోలుచేసే సెల్ ఫోన్లు, ఫ్రిజ్జులు, స్కూటర్లు, మోటార్ సైకిల్సు, కంప్యూటర్లు , ప్రింటర్లు, చిన్న కార్లపై సుంకాలు తగ్గించడం ద్వారా చిదంబరం వారిని ప్రసన్నం చేసుకొనే ప్రయత్నం చేసారు. ఇక గంపగుత్తగా లక్షలాది మంది సైనికులను, వారి వెనుక ఉండే వారి కుటుంబాల ఓట్లను రాల్చుకొనే ప్రయత్నంలో ఒకే ర్యాంక్-ఒకే పెన్షన్ పధకానికి కూడా లాంచనంగా ఆమోదముద్ర వేసారు. ఎన్నికలే కనుక లేనట్లయితే ఈ బడ్జెట్లో ప్రజల గోళ్ళూడగొట్టి మరీ బలవంతంగా పన్నులు వసూలు చేసేవారు. కానీ, ఎన్నికలను ఎదురుగా పెట్టుకొని అటువంటి సాహసం చేయడంమెందుకని ఈసారికి ప్రజలను కనికరించారు. అందువల్ల ఈ బడ్జెట్లో కొత్తగా పన్నులు లేవు. ఉన్న పన్నులు పెరుగలేదు. అదేవిధంగా వేటి ధరలు కూడా పెంచే ప్రయత్నం చేయలేదు.   దేశంలో ప్రజలందరూ అల్ప సంతోషులు, ‘మెమొరీ లాస్’ వ్యాధితో బాధపడుతున్నారని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ, ఈ తాయిలాలతో వారందరూ సంబరపడిపోతూ గత పదేళ్ళలో తను వెలగబెట్టిన నిర్వాకాలన్నిటినీ కూడా మరిచిపోయి, గుడ్డిగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీకే ఓట్లు వేసేస్తారని కాంగ్రెస్ అధిష్టానం దృడంగా విశ్వసిస్తోంది. అందుకే ఎన్నికల ముందు తాయిలాలు పంచిపెడుతోంది. ఇది ఆ పార్టీకి ప్రజల విజ్ఞత పట్ల ఎంతటి చులకన భావం ఉందో అద్దం పడుతోంది. ఇంతవరకు వెలువడిన సర్వే నివేదికలన్నీ కూడా రానున్న ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభవం తప్పదని పదే పదే హెచ్చరిస్తున్నా కూడా మేల్కొనకపోగా తను భ్రమలో ఉంటూ ప్రజలను కూడా భ్రమింపజేసేందుకు ప్రయత్నిస్తోంది. అయితే కధ క్లైమాక్సుకు చేరుకొన్న తరువాత దానికి ఇంతకంటే వేరే గత్యంతరం లేదు కూడా.

congress

కాంగ్రెస్, బీజేపీ చేతిలో రాష్ట్ర భవిష్యత్

  ఈరోజు ఆర్ధిక మంత్రి చిదంబరం లోక్ సభలో తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. కేంద్రమంత్రి కావూరి నిన్న మీడియాతో మాట్లాడుతూ, ఈరోజు సీమాంధ్ర కాంగ్రెస్ కేంద్రమంత్రులందరూ పోడియం వద్దకు వెళ్లి ఆందోళన చేస్తామని స్పష్టం చేసారు. రాష్ట్ర విభజన బిల్లుని ఎట్టి పరిస్థితుల్లో ఆమోదింపజేయాలనే కృత నిశ్చయంతో ఉన్నందునో లేక ఆవిధంగా నటిస్తునందునో కాంగ్రెస్ అధిష్టానం వారినందరినీ కూడా సభ నుండి సస్పెండ్ చేసేందుకు కూడా వెనుకాడకపోవచ్చును. రాష్ట్ర విభజన నిర్ణయంతో సీమాంధ్ర ప్రజలలో తీవ్ర వ్యతిరేఖత మూటగట్టుకొన్న కాంగ్రెస్ పార్టీ, కధ ఇంతవరకు వచ్చిన తరువాత మిగిలిన సీమాంధ్ర మంత్రులను సస్పెండ్ చేసినంత మాత్రాన్న కొత్తగా వచ్చే నష్టం ఏమీ ఉండబోదు. పైగా ఆవిధంగా చేయడం వలన ఒకవేళ ఏ కారణం చేతనయినా సభలో బిల్లు ఆమోదం పొందలేకపోయినా, దానిని ఆమోదింపజేసేందుకు తన యంపీలను, చివరికి కేంద్రమంత్రులను కూడా సభ నుండి సస్పెండ్ చేసేందుకు కూడా వెనకాడలేదని, కానీ చిత్తశుద్దిలేని బీజేపీ వలననే బిల్లు ఆమోదం పొందలేకపోయిందని తెలంగాణా ప్రజలకు దైర్యంగా చెప్పుకోవచ్చును. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చేస్తూ సభలో రాష్ట్రానికి చెందిన సభ్యులెవరూ లేకుండా చేసి, బిల్లుని ఆమోదించే ఆలోచనని బీజేపీతో సహా అన్ని ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా తప్పు పడుతున్నపటికీ, కాంగ్రెస్ ఈ విషయంలో మొండిగా ముందుకే వెళ్ళే ప్రయత్నం చేస్తుంది.   సీమాంధ్రలో తన పార్టీని పణంగా పెట్టయినా సరే తెలంగాణాలో రాజకీయ లబ్ది పొందాలని నిశ్చయించుకొన్న తరువాతనే కాంగ్రెస్ రాష్ట్ర విభజనకు పూనుకొంది. అందువల్ల తెరాసను విలీనం లేదా కనీసం ఎన్నికల పొత్తులకయినా ఒప్పించాలంటే తప్పనిసరిగా ఏదో విధంగా బిల్లుని ఆమోదింపజేయవలసి ఉంటుంది. అలా కుదరకపోతే అందుకోసం తను శక్తి వంచనా లేకుండా కృషి చేశానని కేసీఆర్ ను నమ్మించవలసి ఉంటుంది. అప్పుడే ఆయన కాంగ్రెస్ పార్టీని కనికరిస్తారు. ఒకవేళ ఎన్నికల తరువాత కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏ కూటమి కేంద్రంలో మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తగినన్ని లోక్ సభ స్థానాలు సాధించినట్లయితే, తెరాస మద్దతు ఇస్తుంది. అప్పుడే రాహుల్ గాంధీని ప్రధాని కుర్చీలో కూర్చోబెట్టడం వీలవుతుంది.   కాంగ్రెస్ తన ఈ ఆశయాన్ని, లక్ష్యాన్ని ఇన్ని నెలలలో ఎంత తీవ్రంగా ఒత్తిళ్ళు వచ్చినా ఎన్నడూ మరువలేదు, వెనక్కి తగ్గలేదు గనుక ఇప్పుడు కూడా అదే లక్ష్యంగా ముందుకు సాగవచ్చును. ఇక రాష్ట్ర విభజన బిల్లు ఆమోదానికి సభలో సాధారణ మెజార్టీ సరిపోతుందని న్యాయశాఖ తేల్చి చెప్పింది గనుక, మిగిలిన సీమాంధ్ర కాంగ్రెస్ మంత్రులను కూడా సస్పెండ్ చేసి బిల్లుని మూజువాణి ఓటుతో ఆమోదింపజేసే ప్రయత్నం చేయవచ్చును.   ఇక ఈ వ్యవహారంలో బీజేపీ తన చేతికి మట్టి అంటకుండా బయటపడాలని భావిస్తే, కర్ర విరగ కుండా పాము చావకుండా అన్నట్లుగా వ్యవహరిస్తూ ఏదో ఒక కుంటి సాకుతో సభ నుండి వాకవుట్ చేసి బిల్లుకి పరోక్షంగా సహకరించవచ్చును. కానీ, చంద్రబాబు ప్రభావంతో తెదేపాతో పొత్తులకే మొగ్గు చూపినట్లయితే బిల్లుపై చర్చకు పట్టుబట్టి కాలయాపన చేసి బిల్లు ఆమోదం పొందకుండా అడ్డుకొనే ప్రయత్నం చేయవచ్చును. ఏమయినప్పటికే, రేపు లేదా ఎల్లుండి లోగా రాష్ట్ర భవిష్యత్ ను, రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పే కీలక నిర్ణయం జరుగబోతోందని ఖచ్చితం చెప్పవచ్చును.

bjp

రాష్ట్రంపై మోడీ ప్రభావం ఉంటుందా?

  దేశంలో మిగిలిన రాష్ట్రాలలో మోడీ ప్రభంజనం ఎంత బలంగా ఉన్నపటికీ, మన రాష్ట్రంలోమాత్రం అంతగా ప్రభావం చూపకపోవచ్చును. అందుకు కారణం సమైక్యాంధ్ర, తెలంగాణా సెంటిమెంట్లు బలంగా ఉండటమే.ఈ కారణంగా తెలంగాణాలో తెరాస, ఆంద్రాలో తెదేపా, వైకాపా, కొత్తపార్టీల ప్రభావమే అధికంగా ఉంటుంది. కానీ, బీజేపీ తెలంగాణా బిల్లుకి మద్దతు ఇస్తుందా లేదా? అనే అంశం రాష్ట్రంలో బీజేపీపై, తెదేపాతో పొత్తులపై తీవ్ర ప్రభావం చూపనుంది. నరేంద్ర మోడీ రాష్ట్రంపై ఏమేరకు ప్రభావం చూపగలరనేది కూడా దానినిబట్టే ఉంటుంది. ఒకవేళ రేపు పార్లమెంటులో తెలంగాణా బిల్లు ఆమోదం పొందినట్లయితే తెలంగాణాలో కాంగ్రెస్, తెరాసలు మరింత బలపడతాయి. ఆ రెండు పార్టీలు విలీనం లేదా పొత్తులకు కూడా అంగీకరించినట్లయితే ఇక వారిని ఎదుర్కోవడం ఎవరివల్ల కాదు.   తెదేపాకు తెలంగాణాలో బలమయిన క్యాడర్ ఉన్నపటికీ, ఒకవేళ బీజేపీ టీ-బిల్లుకి మద్దతు ఇచ్చినట్లయితే, తెదేపా కూడా బీజేపీని దూరం పెట్టే అవకాశం ఉంది. అందువల్ల తెలంగాణా బిల్లుకి మద్దతు ఇచ్చినప్పటికీ బీజేపీ తెలంగాణాలో పెద్దగా లబ్దిపొందలేదు. పైగా ఆంధ్రా, తెలంగాణా రెండు ప్రాంతాలలో కూడా బీజేపీ ఒంటరయిపోతుంది. కానీ, బిల్లుకి మద్దతు ఇచ్చినట్లయితే తెలంగాణాలో నరేంద్ర మోడీ ప్రభావం కొంతమేర ఆ పార్టీకి లబ్ది చేకూర్చవచ్చును.   కానీ అదే కారణంగా బీజేపీని, మోడీని సీమాంధ్ర ప్రజలు వ్యతిరేఖించవచ్చును. ఒకవేళ మోడీ విజయావకాశాలను దృష్టిలో ఉంచుకొని తెదేపా దైర్యం చేసి బీజేపీతో ఎన్నికల పొత్తులు పెట్టుకొన్నట్లయితే, అది కాంగ్రెస్, వైకాపా, కొత్త పార్టీలకు ఒక ఆయుధాన్ని అందిస్తుంది. కనుక తెదేపా బీజేపీతో పోత్తులకు అంగీకరించకపోవచ్చును. అదే జరిగితే, స్వయంగా నరేంద్ర మోడీ వచ్చి సీమాంధ్రలో ప్రచారం చేసినా బీజేపీ ఒక్కసీటు కూడా గెలిచే అవకాశం ఉండబోదు.   అందువల్ల బీజేపీ తెలంగాణా వ్యవహారంలో కర్ర విరగకుండా, పాము చావకుండా అన్నట్లు వ్యవహరించి తప్పుకోవచ్చును. అప్పుడు కాంగ్రెస్ మూజువాణి ఓటుతో బిల్లుని ఆమోదింపజేసుకొంటే, తెలంగాణా బిల్లుకి పరోక్షంగా సహకరించామని తెలంగాణాలో, బిల్లుకి మద్దతు ఈయలేదని సీమాంధ్రలో చెప్పుకొని బీజేపీ తక్కువ నష్టంతో బయటపడవచ్చును. బిల్లుకి నేరుగా మద్దతు ఈయలేదు గనుక, తెదేపాకు కూడా బీజేపీతో పొత్తులకి అంగీకరించే అవకాశం ఉంది. అప్పుడు మోడీ ప్రభావం కూడా తప్పకుండా ఉంటుంది.

narendra modi

మోడీ ప్రవేశంతో మారిన లెక్కలు

  బీజేపీ నరేంద్ర మోడీని తన ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించక ముందు, 2014లో జరగబోయే ఎన్నికలపట్ల ప్రజలు, మీడియా కూడా పెద్ద ఆసక్తి చూపలేదు. ఎందుకంటే ఎన్నికలలో పోటీ చేయనున్న కాంగ్రెస్ పార్టీ పీకల లోతు అవినీతిలో కూరుకుపోగా, ప్రధాని అభ్యర్ధి విషయంలో బీజేపీ అగ్రనేతల మధ్య గొడవలు ప్రజలలో తీవ్ర నిరాశ, నిర్లిప్తతలు కలిగించాయి. కానీ, ఎట్టకేలకు బీజేపీ నరేంద్ర మోడీని తన ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించడంతో హటాత్తుగా పరిస్థితులు మారిపోయాయి. సమర్ధుడు, పరిపాలనాదక్షుడు, అపార రాజకీయ అనుభవంగల నరేంద్ర మోడీ నేతృత్వంలో దేశంలో పరిస్థితులు మళ్ళీ గాడినపడతాయనే ఆశ, భావన ప్రజలకు కలగడం, దానికి తోడూ నరేంద్ర మోడీ సుడిగాలిలా దేశవ్యాప్తంగా ప్రచారం మొదలుపెట్టడంతో దేశంలో రాజకీయ పరిస్థితులలో ఒక్కసారిగా మారిపోయాయి.   దానితో ఉలిక్కిపడి లేచిన కాంగ్రెస్ అధిష్టానం మోడీని ఏదోవిధంగా అప్రదిష్టపాలు చేసేందుకు విశ్వప్రయత్నాలు చేసింది. కానీ, నాలుగు రాష్ట్రాలలో జరిగిన ఎన్నికలలో మోడీ ప్రభంజనం ముందు కాంగ్రెస్ ప్రయత్నాలు గాలికి కొట్టుకుపోయాయి. ఆ తరువాత మోడీకి కోర్టులు కూడా ‘క్లీన్ చిట్’ ఇవ్వడంతో ఇక కాంగ్రెస్ చేసేదేమీలేక, యువరాజు రాహుల్ గాంధీకి పట్టాభిషేక మహోత్సవం నిర్వహించి, కాంగ్రెస్ ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించాలని అనుకొంది. ముందుగా ప్రధాని డా.మన్మోహన్ సింగ్ చేత ‘స్వచ్చంద పదవీ విరమణ’ ప్రకటన కూడా చేయించింది. పట్టాభిషేక మహోత్సవం కూడా నిర్వహించింది. కానీ, రాహుల్ గాంధీని తమ ప్రధాని అభ్యర్ధి గా ప్రకటించే సాహసం మాత్రం చేయలేకపోయింది. ఆవిధంగా ప్రకటిస్తే ప్రజలు అతనిని మోడీతో పోల్చి చూసుకొంటే మరింత తేలిపోయే ప్రమాదం ఉందని భావించడమే అందుకు కారణంగా కనబడుతోంది. అందువల్ల ఎన్నికలలో రాహుల్ గాంధీ పార్టీకి సారధ్యం వహిస్తారనే చిన్న ప్రకటనతో సరిపెట్టుకొంది. కనీసం అప్పుడు కూడా పార్టీ గెలుపోటములకు ఆయనే పూర్తి భాద్యత వహిస్తారని ఎవరూ దైర్యంగా ప్రకటించలేకపోవడం కాంగ్రెస్ దీనస్థితికి అద్దం పడుతోంది.   ఇంతవరకు వెలువడిన దాదాపు డజనుపైగా సర్వే నివేదికలలో ఏ ఒక్కటి కూడా కాంగ్రెస్ గెలుస్తుందని కానీ, కనీసం గెలిచే అవకాశముందని కానీ ద్రువీకరించకపోవడం విశేషం.తాజాగా టైమ్స్-సి ఓటర్ సంస్థ నిర్వహించిన సర్వేలో కూడా బీజేపీ నేతృత్వంలో ఎన్డీయే కూటమి ఎన్నికలలో గెలిచే అవకాశం ఉందని మరోమారు ద్రువీకరించింది. ఆ నివేదిక ప్రకారం త్వరలో జరుగనున్న కాంగ్రెస్ పార్టీ కేవలం 89 సీట్లు, బీజేపీ 202 సాధించుకొనే అవకాశమున్నట్లు ప్రకటించింది.

last balls

ఆ లాస్ట్ బాల్ కి అర్ధమేమిటో?

  లోక్ సభలో నిన్న రాష్ట్ర విభజన బిల్లు ప్రవేశపెట్టగానే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేస్తారని అందరూ భావించారు. కానీ ఆయన లాస్ట్ బాల్స్ ఇంకా మిగిలే ఉన్నాయని అనడంతో మళ్ళీ ఆ లాస్ట్ బాల్స్ ఎప్పుడు పడతాయి, ఏవిధంగా ఎవరు వేస్తారనే చర్చ మొదలయింది. ఈ ‘లాస్ట్ బాల్స్’ అనేది తెలంగాణా అంశంలాగే అంతుపట్టని ఓ బ్రహ్మపదార్ధంలా మారిందంటే అతిశయోక్తి కాదు. దానికి ఎవరు తోచిన నిర్వచనాలు వారు చెప్పుకొనే సౌలభ్యం కూడా ఉంది. లాస్ట్ బాల్స్ అంటే:   1.విభజన బిల్లుని ఆపడానికి ఇంకా చాలా అస్త్రాలున్నాయి.   2.రాజీనామా చేయడానికి ఇంకా చాలా సమయం ఉంది.   3.కాంగ్రెస్ అధిష్టానంపై కిరణ్ కుమార్ రెడ్డి మరిన్ని విమర్శలు.   4. కిరణ్ పదవిలో కొనసాగేందుకు అధిష్టానం మరింత గడువు పొడిగింపు.   5. కాంగ్రెస్ రాజకీయ ప్రత్యర్ధులను పక్కదారి పట్టించి, బిల్లుని ఆమోదింపజేయడానికి ఇంకా చాలా మార్గాలున్నాయి.   6. కొత్త పార్టీ పెట్టేందుకు కాంగ్రెస్ అధిష్టానం అనుమతి ఇంకా రావలసి ఉంది.   ఇలా ఈ ‘లాస్ట్ బాల్స్’కి ఎవరికి తోచినట్లు వారు ఎన్ని భాష్యాలయిన చెప్పుకోవచ్చును. సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు అది విభజన ఆపే అస్త్రాలని భావిస్తే, టీ-కాంగ్రెస్ నేతలు రాజీనామాకు ఇంకా సమయం ఉందని చెపుతున్నట్లు భావిస్తారు. ప్రత్యర్ధ రాజకీయ పార్టీలవారు ఆఖరి మూడు పాయింట్లని లాస్ట్ బాల్స్ గా భావిస్తారు.   ఇలా కిరణ్ కుమార్ రెడ్డి ఎవరికి ఏ రూపంలో చూసుకోవాలంటే ఆ రూపంలో దర్శనమిస్తున్నారు. ఆయన కొందరికి అధిష్టానాన్ని సైతం దైర్యంగా ధిక్కరిస్తున్న (సమైక్య) హీరో. మరికొందరికి (తెలంగాణా పాలిట) విలన్, ఇంకొందరికి అధిష్టానానికి విదేయుడయిన సమైక్య ముసుగులో విభజనవాదిగా కనిపిస్తూ అలరిస్తున్నారు. ఆయన తను అధిష్టానానికి అత్యంత విధేయుడయిన అసలు సిసలయిన సమైక్యవాదినని స్వయంగా ప్రకటించుకొంటూ ఉంటారు. దానిని డిల్లీ నుండి దిగ్విజయ్ సింగ్ ఎప్పటికప్పుడు ద్రువీకరిస్తుంటారు.

america

బీజేపీ గెలుపుని అమెరికా ముందే పసిగట్టిందా?

  భారతదేశంలో చాలామంది ప్రజలు, రాజకీయ పార్టీలు కూడా బీజేపీ విజయంపై, నరేంద్ర మోడీని ప్రధాని అభ్యర్ధిత్వంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఇంకా సందిగ్ధంలో ఉన్నపటికీ, ఆవులిస్తే పేగులు లెక్కపెట్టగల అమెరికా మాత్రం రానున్న ఎన్నికలలో బీజేపీ గెలుపుని, అలాగే నరేంద్ర మోడీ ప్రధాని అవుతారని ముందే పసిగట్టేసింది. అందుకే ఇంతకాలంగా మోడీకి వీసా నిరాకరించి తమ దేశంలో అడుగుపెట్టడానికి కూడా ఒప్పుకోని అమెరికా, ఇప్పుడు తన భారతదేశ రాయబారి నాన్సీ పావెల్ ను ఆయన వద్దకు ‘ద్వైపాక్షిక సంబంధాల’ గురించి మాట్లాడే మిషతో పంపిస్తోంది. ఎన్నికల గంట మ్రోగక ముందే అమెరికా మోడీతో ‘ద్వైపాక్షిక సంబంధాల’ గురించి మాట్లాడాలనుకోవడం, ఆయనే ప్రధాన మంత్రి కాబోతున్నారని అమెరికా నిరదారించుకొందని అర్ధమవుతోంది. అలా కాకుంటే, ‘ద్వైపాక్షిక సంబంధాల’ గురించి ఆయనతో కాక యువరాజు రాహుల్ గాంధీతో మాట్లాడాలని భావించేది.   ఇది బీజేపీకి, ముఖ్యంగా నరేంద్ర మోడీకి సానుకూల అంశమవుతుంది. అమెరికా అభ్యర్ధన మేరకు విదేశాంగశాఖ మంత్రి సల్మాన్ కుర్షీద్, తన మంత్రిత్వ శాఖ ద్వారానే మోడీతో నాన్సీ పావెల్ కు సమావేశం ఏర్పాటు చేయవలసిరావడం కాంగ్రెస్ పార్టీకి పుండు మీద కారం చల్లినట్లే అవుతుంది. అది కుర్షీద్ మాటలలోనే వ్యక్తమయింది. “ఇదివరకు వారు (అమెరికా) గుజరాత్ అల్లర్లలో ఆయన ప్రమేయం గురించి చాలా మాట్లాడారు. కానీ, మళ్ళీ ఇప్పుడు ఆయనతోనే మరెందుకో సమావేశామవ్వాలనుకొంటున్నారు. పావెల్ ఈ సమావేశంలో మోడీతో ఏమీ మాట్లాడబోతున్నారనేది చాలా ఆసక్తికరంగా ఉందు.”   ఇంతకాలంగా అమెరికా నరేంద్ర మోడీని దూరంగా అట్టేబెట్టినప్పటికీ, ఇంగ్లాండ్ ,జపాన్, దక్షిణ కొరియా, అనేక యూరోపియన్ దేశాలు మాత్రం వేగంగా అభివృద్ధి చెందుతున్న గుజరాత్ లో పెట్టుబడులు పెట్టేందుకు ‘నమో నరేంద్ర మోడీ’ అంటూ ఆయన చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నాయి. నరేంద్ర మోడీ భారత్ ప్రధాని అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్న ఈ తరుణంలో కూడా ఇంకా బిగదీసుకొని కూర్చొంటే, నష్టపోయేది తమ వ్యాపార సంస్థలేనని, ఒక దేశ ప్రధానికి వీసా నిరాకరిస్తూ ఆ దేశంతో ‘ద్వైపాక్షిక సంబంధాలను’ నడపడం అసాధ్యమనే జ్ఞానోదయం అమెరికాకి నేటికి కలగడంతో, అమెరికా కూడా ‘నమో!నమో!’ అంటూ మోడీ గుమ్మం ముందు నిలబడేందుకు సిద్దమయిపోయింది.

Congress Telangana Game

'తెలుగు' జాతితో కాంగ్రెస్ 'విభజన' ఆట..!

      ఇంతకముందు తెలుగు వన్  'తెలంగాణ తూచ్' అనే ఆర్టికల్ లో చెప్పినట్లు తెలంగాణ బిల్లు ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో ఆమోదం పొందడం కష్టంగా కనిపిస్తోంది. రాష్ట్ర విభజన రాజకీయాలు ఢిల్లీలో అనుకొనిమలుపులు తిరిగుతూ కేంద్రాన్ని దిక్కుతోచని స్థితిలో పడవేస్తున్నాయి. రాజ్యంగ౦లోని ఆర్టికల్ 110(1)అధికరణం ప్రకారం...సీమాంధ్రకు ఇచ్చే ఆర్ధిక కేటాయింపులు బిల్లులో ప్రతిపాదిస్తే దానిని ముందుగా లోక్ సభలో ప్రవేశ పెట్టాల్సి వుంటుంది. దీనిని రాజసభలో ప్రవేశపెట్టడం కుదరదు. అయితే కేంద్రం వ్యూహాత్మకంగా బిల్లుని మొదట లోక్ సభలో బదులుగా రాజ్యసభలో ప్రవేశపెట్టేందుకు సిద్దమయింది. ఒకవైపు బిల్లుకి బీజేపీ మద్దతు కోరుతూనే, ఒకవేళ బిల్లుకి బీజేపీ మద్దతు ఈయకపోయినట్లయితే అదే బిల్లుతో బీజేపీని రాజకీయంగా దెబ్బ తీయవచ్చనే ఆలోచనతో సంప్రదాయానికి విరుద్దంగా విభజన బిల్లుని తొలుత రాజ్యసభలో ప్రవేశపెట్టాలని కాంగ్రెస్ వ్యూహం పన్నింది. అనేక ఆర్ధిక అంశాలతో కూడిన రాష్ట్ర విభజన బిల్లును లోక్ సభలో చర్చించి, ఆమోదించకుండా రాజ్యసభలో ప్రవేశపెట్టడానికి వీలులేదని హమీద్ అన్సారీ తేల్చిచెప్పడంతో, కేంద్ర౦ ఇరకాటంలో పడింది. రాష్ట్రపతి నుంచి బిల్లు కేంద్రానికి అందాక కూడా ఏ సభలో బిల్లు పెట్టాలో తెలియనంత అయోమయంలో కాంగ్రెస్‌ పార్టీ వుందని అంటే, దాన్ని నమ్మగలమా? ఇప్పటికే పార్లమెంటు సమావేశాల్లో ఐదు రోజులు వృధా అయిపోయాయి. తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టేందుకు అనుమతి ఇవ్వాలని హోంశాఖ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కోరింది. రాష్ట్రపతి ఈ రోజే సమాధానమిస్తారో, రేపటికి నిర్ణయాన్ని వాయిదా వేస్తారో తెలీదు. ఫిబ్రవరి 21పార్లమెంట్ సమావేశాలకు ఆఖరిరోజు. లోక్‌సభ ఆమోదం పొంది, తమ ముందుకు వచ్చిన 14 రోజుల్లోపు రాజ్యసభ కూడా బిల్లును ఆమోదించాల్సి ఉంటుంది. రాష్ట్రపతి అనుమతిచ్చినా, రేపు లోక్‌సభలో రైల్వే బడ్జెట్‌ ప్రవేశపెట్టాల్సి వుంటుంది.  ఫిబ్రవరి 17న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు కాబట్టి వాటిపై రెండు, మూడు రోజులు చర్చకు సమయం కేటాయించక తప్పదు. అప్పటికి పార్లమెంట్ సమావేశాలు ముగింపు దశకు చేరుకుంటాయి. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న తీరుచూస్తే తెలంగాణ బిల్లు ఆమోదం పొందడం కష్టమని కాంగ్రెస్ రాజకీయ నిపుణులు ఏనాడో స్పష్టం చేసిన.... కాంగ్రెస్ పార్టీ తన స్వార్ధ నీచ రాజకీయాలకోసం తెలంగాణ ప్రజల్లో ‘సీమాంధ్ర’ అంటే విద్వేషభావం ఇంకా పెరిగిపోయేలా చేసి తాను లాభపడలని చూస్తుందని రాజకీయ విశ్లేషకుల భావన.   పార్లమెంటులో తెలంగాణ బిల్లు పాస్ అవడానికి బిజెపి మద్దతు కూడా అవసరమని కొత్త పల్లవి అ౦దుకున్న కాంగ్రెస్ పార్టీ... బిజెపి, టిడిపి తెలంగాణా ద్రోహులుగా చిత్రీకరించి లాభపడాలని చూస్తోంది. సీమాంధ్ర ప్రాంతానికి కూడా పూర్తిగా అన్యాయం చేస్తున్నామనే భావన అక్కడి ప్రజల్లో కల్పిస్తే.... త్వరలో కాంగ్రెస్ లో కలిసిపోయే జగన్ మోహన్ రెడ్డి పక్కన చేరుతారు కాబట్టి....చివరికి ఇరుప్రాంతాల్లో లాభపడేది తామేనని కాంగ్రెస్ అదిష్టానం భావిస్తోందని సమాచారం.    అయితే ఇక్కడిదాకా వచ్చాక తెలంగాణ అంశం ఆగిపోతే...ఆగ్రహావేశాలతో రగిలిపోతున్న ఇరుప్రాంతా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి సమాధి కట్టాడం ఖాయమని ఇరుప్రాంత రాజకీయ నిపుణులు చర్చించుకుంటున్నారు!                              

Telangana bill  Lok Sabha

ఢిల్లీ 'టి' సంగ్రామం: బిల్లు లోకసభలోనే!

      తెలంగాణ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టేందుకు రాజ్యసభ చైర్మన్ అయిన ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ అభ్యంతరం వ్యక్తం చేయడంతో కేంద్రం వ్యూహం బెడిసికొట్టి తిరిగి బిల్లు రాష్ట్రపతి వద్దకు చేరింది. కేంద్రం వ్యూహాత్మకంగా బిల్లుని మొదట లోక్ సభలో బదులుగా రాజ్యసభలో ప్రవేశపెట్టేందుకు సిద్దమయింది. ఒకవైపు బిల్లుకి బీజేపీ మద్దతు కోరుతూనే, ఒకవేళ బిల్లుకి బీజేపీ మద్దతు ఈయకపోయినట్లయితే అదే బిల్లుతో బీజేపీని రాజకీయంగా దెబ్బ తీయవచ్చనే ఆలోచనతో సంప్రదాయానికి విరుద్దంగా విభజన బిల్లుని తొలుత రాజ్యసభలో ప్రవేశపెట్టాలని కాంగ్రెస్ వ్యూహం పన్నింది. అనేక ఆర్ధిక అంశాలతో కూడిన రాష్ట్ర విభజన బిల్లును లోక్ సభలో చర్చించి, ఆమోదించకుండా రాజ్యసభలో ప్రవేశపెట్టడానికి వీలులేదని హమీద్ అన్సారీ తేల్చిచెప్పడంతో, కేంద్ర౦ ఇరకాటంలో పడింది. లోకసభలో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టేందుకు అనుమతి ఇవ్వాలని హోంశాఖ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కోరింది. అందుకు ప్రణబ్ ముఖర్జీ కూడా అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది.  ఇప్పుడు తాజాగా బిల్లుని లోక్ సభలో ఎప్పుడు ప్రవేశపెట్టాలనే అంశంపై కాంగ్రెస్ పెద్దలు తలలు పట్టుకొని చర్చించుకొంటున్నారు. దీంతో బిల్లును సభలో ప్రవేశపెట్టే విషయంపై చర్చించేందుకు లోకసభ స్పీకర్ మీరా కుమార్ మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంటా 15 నిమిషాలకు లోకసభ వ్యవహారాల కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏ కూటమికి లోక్ సభలో తనకు తగినంత సభ్యుల బలం కాగితాలమీద కనిపిస్తున్నపటికీ, బిల్లును ఓటింగుకి పెడితే వారిలో ఎంతమంది అనుకూలంగా ఓటు వేస్తారో తెలియదు. ఇదే అదునుగా బీజేపీ తనను రాజకీయంగా దెబ్బ తీయాలని చూసిన కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పేందుకు బిల్లుపై చర్చకు పట్టుబట్టవచ్చును. అదే జరిగితే పుణ్యకాలం కాస్త పూర్తయిపోతుంది!  

aam admi party

ఆమాద్మీ శకం ముగిసినట్లేనా

  భక్తుడు కోరుకొన్నదే దేవుడు వరంగా ఇస్తాడన్నట్లు, జన్ లోక్ పాల్ బిల్లు పేరుతో రాజినామాకు సిద్దపడిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రివాల్‌ కు ఆ శ్రమ లేకుండానే, డిల్లీలోని ముండ్కా నియోజకవర్గం స్వతంత్ర శాసనసభ్యుడు రామ్‌బీర్‌ షోకీన్‌ ఆమాద్మీ ప్రభుత్వానికి తన మద్దతు ఉపసంహరించుకోబోతున్నట్లు నిన్న ప్రకటించారు. ఆమాద్మీ పార్టీ ఎన్నికల సందర్భంగా ప్రజలకు చేసిన వాగ్దానాలను అమలు చేయనందుకు తను మద్దతు ఉపసంహరించుకొంటున్నానని తెలిపారు. కొద్ది రోజుల క్రితమే వినోద్ కుమార్ బిన్నీ అనే ఆమాద్మీ పార్టీ శాసనసభ్యుడు తనకు మంత్రి పదవి ఈయలేదని తిరుగుబాటు చేస్తే, అతనిని పార్టీ నుండి సస్పెండ్ చేసారు. కానీ, అతను ఇంకా అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వానికి మద్దతు కొనసాగిస్తుండటం వలన ఇంకా ప్రభుత్వం నిలబడి ఉంది. 70 మంది సభ్యులు ఉన్న డిల్లీ శాసనసభలో ప్రభుత్వం నిలబడాలంటే కనీసం 36 మంది మద్దతు అవసరం ఉంటుంది. ప్రస్తుతం ఆమాద్మీ ప్రభుత్వానికి 28మంది స్వంత పార్టీ సభ్యులు, 8మంది కాంగ్రెస్ శాసనసభ్యులతో కలిపి మొత్తం 36 మంది మద్దతు ఉంది. కానీ, ఇప్పుడు రామ్‌బీర్‌ షోకీన్‌ మద్దతు ఉపసంహరించుకోవడంతో ఆ సంఖ్య 35 అవుతుంది గనుక ఆమాద్మీ ప్రభుత్వం శాసనసభలో మెజార్టీ కోల్పోయి ప్రభుత్వం పడిపోతుంది. అరవింద్ కేజ్రీవాల్ ఎలాగు జన్ లోక్ పాల్ బిల్లుని సాకుగా చూపి, తన ప్రభుత్వాన్ని తానే కూల్చుకోవడానికి సిద్దపడ్డారు గనుక, ఇప్పుడు రామ్‌బీర్‌ షోకీన్‌ మద్దతు ఉపసంహరణతో ఆయన చేతికి మసి అంటకుండా ఆ పని పూర్తయిపోతుంది.   అరవింద్ కేజ్రీవాల్ డిల్లీ ముఖ్యమంత్రిగా భాద్యతలు చేప్పటినపుడు దేశ రాజకీయాలలో ఒక సరికొత్త శకం, ప్రభుత్వపాలనలో ఒక నూతన ఒరవడి మొదలయిందని ఆయన ప్రభుత్వంపై డిల్లీ ప్రజలే కాకుండా యావత్ దేశప్రజలు కూడా చాలా ఆశలు పెట్టుకొన్నారు. రాజకీయ వ్యవస్థను, ప్రభుత్వ పాలన తీరుని సమూలంగా మార్చివేస్తానని హామీలు గుప్పించిన అరవింద్ కేజ్రీవాల్ అది తన శక్తికి మించినదని గ్రహించడం వలనో లేక ప్రభుత్వ యంత్రాంగంలో తను ఆశించిన విధంగా మార్పు తేలేననే అసహనంతో తన నిస్సహాయతకు తానే సిగ్గుపడుతూ దానిని కప్పిపుచ్చుకొనేందుకు ఘర్షణ వైఖరి అవలంభిస్తూ చేజేతులా తన ప్రభుత్వాన్ని కూల్చుకోవాలని ప్రయత్నిస్తున్నారో కానీ, నేడు రామ్‌బీర్‌ షోకీన్‌ ఆయన కోరిక తీర్చబోతున్నారు.   తమని అధికారంలో రాకుండా అడ్డుకొనేందుకే కాంగ్రెస్ ఆమాద్మీ పార్టీని ప్రోత్సహించి, మద్దతు ఇస్తోందని బీజేపీ చేసిన ఆరోపణలు కూడా ఇప్పుడు నిజమని నమ్మవలసి వస్తోంది. సరిగ్గా ఎన్నికల గంట మ్రోగే ముందు, ఆమాద్మీ ప్రభుత్వాన్ని తన చేతికి మసి అంటకుండా దింపేసి, సాధారణ ఎన్నికలతో బాటు డిల్లీలో కూడా మళ్ళీ శాసనసభ ఎన్నికలు కూడా నిర్వహించి కాంగ్రెస్ పార్టీ డిల్లీ ప్రభుత్వాన్ని హస్తగతం చేసుకోనేందుకే ఈ తాత్కాలిక ఏర్పాటు చేసుకొన్నట్లుంది. అత్యంత ప్రజాదారణ కలిగిన అమాద్మీ ప్రభుత్వానికి తాము బేషరతుగా మద్దతు ఇచ్చామని అయినా దానిని ఆమాద్మీ సద్వినియోగపరుచుకొని తను ప్రజలకు ఇచ్చిన హామీలను నేరవేర్చలేకపోయినా కనీసం సరిగ్గా పరిపాలించలేకపోయిందని చాటింపు వేసుకొని కాంగ్రెస్ పార్టీ ఇక నిర్భయంగా డిల్లీ ప్రజలను ఓట్లు అడగవచ్చును.   ఈ వైఫల్యంతో ఇక ఆమాద్మీ పార్టీ ఇక దేశంలోనే కాదు కనీసం డిల్లీలో కూడా మళ్ళీ ఓట్లు అడగలేని పరిస్థితి కల్పించుకొంది. ఆమాద్మీ ప్రయోగం ఈవిధంగా విఫలం కావడం యావత్ దేశప్రజలకు తప్పక విచారం కలిగిస్తుంది. డిల్లీ వంటి అతి చిన్నరాష్ట్రంలో గట్టిగా నెలరోజుల పాటు ప్రభుత్వాన్ని నడుపలేని ఆమాద్మీ పార్టీ రానున్న ఎన్నికలలో దేశ వ్యాప్తంగా వీలయినన్ని ఎక్కువ లోక్ సభ స్థానాలకు పోటీ చేయాలనుకోవడం చూస్తే ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతానన్నట్లుంది.

seemandhra

ఇక సీమాంధ్ర వంతు

  కాంగ్రెస్ పార్టీలో సహజసిద్దమయిన నాటకీయ పరిణామాల తరువాత రాజ్యసభ ఎన్నికలు ముగిసాయి. అధిష్టానం తను ప్రతిపాదించిన ముగ్గురు అభ్యర్ధులతో పాటు తెరాస అభ్యర్ధి కేశవ్ రావుని కూడా గెలిపించుకొంది. మరి కాకతాళీయమో లేక వ్యూహాత్మకమో కానీ ఎన్నికల ఫలితాలు వెలువడిన కొద్ది సేపటికే కేంద్ర క్యాబినెట్ తెలంగాణా బిల్లుని కూడా ఇంచుమించుగా యధాతధంగా ఆమోదిస్తున్నట్లు ప్రకటించింది. క్యాబినెట్ ఆమోదించిన బిల్లుని ఈరాత్రే రాష్ట్రపతికి పంపించవచ్చని కూడా తెలియజేసింది. టీ-బిల్లు రాష్ట్రపతి ఆమోదం ముద్ర వేసుకొని రాగానే ఈనెల 12న రాజ్యసభలో ప్రవేశపెడతామని కొత్త ముహూర్తం కూడా ప్రకటించేసింది. వీటితో తెరాస అధ్యక్షుడు కేసీఆర్ ప్రసన్నం అయినట్లయితే, ఆ పార్టీని విలీనమో లేకపోతే కనీసం ఎన్నికల పొత్తులకయినా ఒప్పించగలిగితే, ముందు అనుకొన్న పధకం ప్రకారం ఇక తెలంగాణాలో వెనక్కి తిరిగి చూసుకోనవసరం లేదు.   ఇక కాంగ్రెస్ పార్టీపై భగ్గుమంటున్న సీమాంధ్రలో చాలా చాకచక్యంగా నిర్వహించవలసిన పనులు కొన్ని మిగిలిపోయాయి. మొట్ట మొదట తన సమైక్య సింహం కిరణ్ కుమార్ రెడ్డిపై వేటువేసి పార్టీ నుండి బయటకు సాగనంపి, సీమాంధ్ర ప్రజలలో ఆయనకు సానుభూతి, దానితో బాటు సమైక్యవీరుడుగా ప్రత్యేక గుర్తింపు కలిగించాలి. పార్లమెంటులో విభజన బిల్లు ఆమోదించేలోగా దిగ్విజయ్, షిండే, చాకో వంటివారు రంగంలో దిగి రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తూ, కొత్త పార్టీ స్థాపనకు తగిన వాతావరణం సృష్టించాలి. ఆ తరువాత కొత్తపార్టీ తన అభ్యర్ధుల జాబితాను విడుదల చేసేక, ఆ జాబితా ప్రకారం వారిపై పోటీ చేసే తన డమ్మీ అభ్యర్ధుల జాబితాను విడుదల చేయాలసి ఉంటుంది. ఇక ఇటీవల కాలంలో దారితప్పుతున్నట్లు కనబడుతున్న తన మరో సమైక్యసింహాన్ని కూడా ఎన్నికలలోగా తన చిలకలను ప్రయోగించయినా సరే మచ్చిక చేసుకొని మళ్ళీ దారికి తెచ్చుకోవలసి ఉంటుంది.   ఆ తరువాత యువరాజవారి సైన్యాధ్యక్షతలో సొనియా-రాహుల్ భక్తజన శ్రేణులందరూ ఉత్సాహంగా కదనరంగంలోకి దూకి తెదేపాను డ్డీకొనాలి. వీలయితే తన రెండు సమైక్య సింహాలతో హోరాహోరీ యుద్ధం చేస్తున్నట్లు నటించాలి. అంతిమంగా ఆ రెండింటిని గెలిపించుకొని మళ్ళీ వెనక్కి రప్పించుకోవాలి. అందుకు చాలా శ్రమ పడాలి. కానీ, యువరాజవారి పట్టభిషేకం జరగాలంటే ఆ మాత్రం కష్టపడక తప్పదు మరి.

Telangana state impossible

Teluguone Exclusive తెలంగాణ తూచ్...!

      ఢిల్లీలో విభజన రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఉత్కంఠకు గురిచేస్తున్నాయి. ఢిల్లీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలలో స్పష్టత కంటే గందరగోళ పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తెలంగాణ బిల్లుపై నెలకొన్న సస్పెన్స్...అదిరిపోయే ట్విస్టులతో టీ-20 మ్యాచ్ లాగా ఢిల్లీలో ఆఖరి పోరాటం సాగుతోంది. తాజాగా కేంద్రమంత్రుల వర్గం నుంచి తెలుగువన్ కి అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం..తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అసాధ్యమని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకు అసాధ్యమో కూడా వివరిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ఇంకా కొన్ని దశల్ని దాటాల్సివుంది. కానీ ఈ దశలన్నిటినీ దాటేంత సమయం కేంద్రంలో వున్న యు.పి.ఎ. ప్రభుత్వానికి లేదని అభిప్రాయపడుతున్నారు. యుపీఏ-2కు ఇవే చివరి సమావేశాలు. కాబట్టి సభ జరిగే ప్రతిరోజు కేంద్రానికి చాలా ముఖ్యమైనవి. తెలంగాణ బిల్లు నుంచి మతహింసనిరోధక బిల్లు వరకూ చాలా ముఖ్యమైన బిల్లును ఈ సమావేశాల్లో ఆమోదింప చేసుకోవాలని కాంగ్రెస్ పట్టుదలతో వుంది. కాని వరుసగా లోకసభ లో వాయిదాల పర్వం కొనసాగుతుండడంతో, విభజన బిల్లుని త్వరగా సభ ముందుకు తేవాలని అధిష్టానం చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. గురువారం లోక్ సభలో విభజనకు సంబంధించి ప్రధాని మన్మోహన్ ప్రకటన చేయాల్సి వుంది. తెలంగాణ ఏర్పాటుతో సీమంధ్రకు ఎలాంటి అన్యాయం జరగదని, సీమాంధ్ర ప్రాంతాన్ని అన్ని విధాల ఆదుకుంటామని స్వయంగా మన్మోహన్ చేత ప్రకటన చేయించాలని భావించిన కాంగ్రెస్ అధిష్టానానికి సీమాంధ్ర నేతలు షాకిచ్చారు. సభను పది నిమిషాలు కూడా సజావుగా జరగకుండా అడ్డుకున్నారు. ఇకపై కూడా ఇలాగే సభను అడ్డుకొనేందుకు కొత్త వ్యూహాలు రచిస్తున్నారు. ఈ పరిణామాలు అధిష్టానానికి మింగుడుపడకపోయినా, ఏం చేయాలోనన్న దానిపై కూడా స్పష్టత లేదని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. బిజెపి పార్టీ కాంగ్రెస్ తెచ్చిన బిల్లుల విషయంలో ఎలాంటి అభ్యంతరాలు లేవంటూనే...కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు ఉభయసభల్లో గొడవ చేస్తూ సభా కార్యక్రమాలకు అడ్డుతగులుతుంటే తెలంగాణ బిల్లు ఎలా పాస్ అవుతుందని సుష్మాస్వరాజ్ ప్రశ్నించినట్లు తెలిసింది. లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్, రాజ్యసభ అధ్యక్షుడు హమీద్ అన్సారీ సభ్యుల గొడవ, గందరగోళం మధ్య తెలంగాణ బిల్లును ఆమోదించేందుకు అనుమతి ఇవ్వకపోవచ్చుననే అనుమానాన్ని సుష్మాస్వరాజ్ వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఉభయ సభల్లో గొడవ చేస్తున్న కాంగ్రెస్ ఎంపీలను సభల నుండి సస్పెండ్ చేసేందుకు కూడా వారు అంగీకరించకపోవచ్చునని ఆమె చెప్పినట్లు తెలిసింది. ఫిబ్రవరి 21పార్లమెంట్ సమావేశాలకు ఆఖరిరోజు. కాని ఇప్పటిదాకా విభజన బిల్లు పార్లమెంట్ మొఖం కూడా చూడలేదు. ఫిబ్రవరి10న టి-బిల్లు రాజ్యసభ ముందుకు రాబోతున్నది అని షిండే ప్రకటించారు. అయితే అసలు ఇంతవరకు బిల్లు క్యాబినెట్ ముందుకు రాలేదు. గురువారం క్యాబినెట్ ముందుకి బిల్లు వస్తుందని అంతా భావించిన అది శుక్రవారానికి వాయిదా పడింది. ఈ రోజు బిల్లుకి క్యాబినెట్ ఆమోదం లభిస్తే అక్కడ నుంచి రాష్ట్రపతి వద్దకు వెళుతుంది. రాష్ట్రపతి న్యాయసలహా కోరాలని భావిస్తే బిల్లు ఆమోదం పొందడం కష్టం. అలాగాకాకుండా తన వద్దే వుంచుకొని రెండు, మూడు రోజులు పరిశీలించిన కేంద్రానికి ఇబ్బందులు తప్పవని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఫిబ్రవరి 12న మధ్యంతర రైల్వే బడ్జెట్, ఫిబ్రవరి 17న ఓటాన్ అకౌంట్ బడ్జెట్, ఫిబ్రవరి 15 శనివారం సెలవు, ఫిబ్రవరి 16 ఆదివారం సెలవు, మిగిలింది రెండే రోజులు అవి ఫిబ్రవరి 13, ఫిబ్రవరి 14... ఫిబ్రవరి 12న మధ్యంతర రైల్వే బడ్జెట్, ఫిబ్రవరి 17న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు కాబట్టి వాటిపై రెండు, మూడు రోజులు చర్చకు సమయం కేటాయించక తప్పదు. అప్పటికి పార్లమెంట్ సమావేశాలు ముగింపు దశకు చేరుకుంటాయి. కేంద్ర క్యాబినెట్, రాష్ట్రపతి, రాజ్యసభ ఇలా విభజన బిల్లు అన్నీ ప్రక్రియలను దాటుకొని ఫిబ్రవరి 12నాటికి బిల్లు లోకసభ కు రావాలి. కాని ఫిబ్రవరి 12న రైల్వే బడ్జెట్ వుంది కానుక ఆ రోజు విభజన బిల్లు ప్రవేశపెట్టరు. ఫిబ్రవరి 15, ఫిబ్రవరి 16 శని, ఆదివారాలు పార్లమెంట్ కి సెలవు దినాలు, ఫిబ్రవరి 17 నుంచి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ వుంటుంది కాబట్టి మిగిలింది రెండే రోజులు అవి ఫిబ్రవరి 13, ఫిబ్రవరి 14...ఆ రెండు రోజుల్లో బిల్లు లోక్ సభలో పెట్టి అమోదించుకోవాలి. కాని ఆ వేగాన్ని అందుకోవడం కష్టమని కాంగ్రెస్ పార్టీ టాస్క్ మాస్టర్లు అధిష్టానానికి తేల్చిచెప్పడంతో..ఆ పార్టీ దిక్కు తోచనిస్థితిలో పడిపోయిందట. కాబట్టి చివరాఖరికి చేపోచ్చేదే౦టంటే...ఇప్పుడప్పుడే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సాధ్యం కాదు...ఇది పేరు చెప్పడం ఇష్టంలేని కొంతమంది కేంద్రమంత్రుల నుంచి మాకందిన బోగట్టా!

కిరణ్ కుమార్ రెడ్డిపై వేటు వేస్తే

  కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజనను నిరసిస్తూ నిన్న డిల్లీలో దీక్ష చేయడంతో ఆయనపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న కాంగ్రెస్ అధిష్టానం రేపు రాజ్యసభ ఎన్నికలు పూర్తవగానే, ఆయనను ముఖ్యమంత్రి పదవిలో నుండి తప్పించబోతోందని మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవిభజన ప్రకటన చేసినప్పటి నుండి ఆయన ఏదో ఒక రూపంగా తన నిరసనను తెలియజేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ ఆయన క్రమశిక్షణ గల కాంగ్రెస్ నాయకుడని కాంగ్రెస్ పెద్దలే స్వయంగా కితాబులు ఇస్తూ వచ్చారు తప్ప ఏనాడు క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదు. ఆ తరువాత కేంద్రప్రభుత్వం పంపిన టీ-బిల్లుకి వ్యతిరేఖంగా ఆయన శాసనసభలో తీర్మానం చేయించినప్పుడు కూడా ఆయనపై ఎటువంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోవలసిన అవసరం లేదని చెప్పిన కాంగ్రెస్ అధిష్టానం, ఇప్పుడు డిల్లీలో దీక్ష చేసినందుకు ఆయనను పదవిలో నుండి తొలగించాలనుకొంటే, అసలు ఆయన దీక్ష చేయకుండా ముందే ఎందుకు అడ్డుకోలేదనే ప్రశ్నకు సమాధానం చెప్పవలసి ఉంటుంది.   కాంగ్రెస్ అధిష్టానం పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టే సమయంలో ఆయన సీమాంధ్ర కాంగ్రెస్ నేతలందరితో కలిసి డిల్లీలో నిరసన దీక్ష చెప్పట్టబోతున్నారనే సంగతి ఆయన అనుచరుల ద్వారా ప్రకటిస్తూనే ఉన్నారు. ఆయన దీక్ష చేసినట్లయితే అది తనకు తీరని అప్రదిష్ట కలిగిస్తుందని తెలిసి ఉన్నపటికీ, కాంగ్రెస్ ఆయనను అడ్డుకొనే ప్రయత్నం చేయలేదు. కనీసం పీసీసీ అధ్యక్షుడు బొత్ససత్యనారాయణ వంటి తన విధేయులను కూడా వారించలేదు. వారించి ఉంటే దీక్షలో ముఖ్యమంత్రి ఒంటరివారయ్యే వారు. ఆయనే అవమానం పాలయ్యేవారు. కానీ కాంగ్రెస్ వారించలేదు. అందుకే అధిష్టానానికి విదేయులయిన కేంద్రమంత్రులు, యంపీలు, శాసన సభ్యులు, చివరికి పీసీసీ అధ్యక్షుడు బొత్ససత్యనారాయణతో సహా అందరూ దీక్షలో కూర్చొన్నారు.   రాష్ట్ర విభజనపై మాట్లాడేందుకు కాంగ్రెస్ అధిష్టానమే వారికి స్వేచ్చ ప్రసాదించిందని ఇంతకాలం గొప్పగా చెప్పుకొన్నప్పుడు, ఇప్పుడు వారు దీక్ష చేసి నిరసన తెలియజేస్తే మాత్రం ఎందుకు ఆగ్రహించాలి? ముఖ్యమంత్రి నిరసన దీక్ష చేసి పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించారని, పార్టీకి అప్రదిష్ట కలిగించారని కాంగ్రెస్ అధిష్టానం భావించి ఆయనపై వేటు వేయదలచుకొంటే మరి పార్టీ పరువు కాపాడవలసిన పీసీసీ అధ్యక్షుడు బొత్ససత్యనారాయణతో సహా దీక్షలో పాల్గొన్న సీమాంధ్ర నేతలందరిపై కూడా వేటు వేయవలసి ఉంటుంది. కానీ, వారందరినీ అడగకుండానే క్షమించేసి, కేవలం ముఖ్యమంత్రిపైనే వేటు వేస్తే, ఆయనని, కాంగ్రెస్ అధిష్టానాన్ని అనుమానించక తప్పదు.   పార్టీ తరపున నిలబడిన రాజ్యసభ సభ్యుల గెలుపుకోసం కిరణ్ కుమార్ రెడ్డి చేసిన కృషి అధిష్టానం పట్ల ఆయన విధేయతకు అద్దం పడుతోంది. అటువంటి వ్యక్తిని ఇప్పుడు ఈ సాకుతో పదవిలో నుండి తప్పిస్తే, అది ఆయనకు శిక్షగా కాక సమైక్య చాంపియన్ గా ఎదిగేందుకు బహుమానం ఇస్తున్నట్లుంది. రాష్ట్ర సమైక్యత కొరకు తన అధిష్టానాన్నే ధిక్కరిస్తున్న కారణంగా ప్రజలలో జేజేలు అందుకొంటున్న కిరణ్ కుమార్ రెడ్డిని, పార్లమెంటులో తెలంగాణా బిల్లు ఆమోదం పొందక మునుపే పదవిలో నుండి తప్పించినట్లయితే, ఆయన బిల్లు ఆమోదం పొందేవరకు కూడా కేంద్రంపై తీవ్ర పోరాటం చేసి ప్రజలలో మరింత మంచి పేరు తెచ్చుకోవడానికి వీలవుతుంది. అప్పుడు ఆయన కొత్త పార్టీ పెట్టుకొని ప్రజలలోకి వెళితే దాని ఫలితం ఏవిధంగా ఉంటుందో ఊహించుకోవచ్చును. సీమాంధ్రలో కాంగ్రెస్ వ్యతిరేఖ ఓటు కిరణ్ కుమార్ రెడ్డి ఖాతాలోనే జమా అవ్వాలంటే, అందుకు ఇదే మంచి పద్ధతి.

రాజ్యసభ రాజకీయం!

      ప్రస్తుత లోక్‌సభ చివరి సమావేశాలు ఇప్పుడు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో తెలంగాణ బిల్లును ఆమోదించేస్తామని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. సభని జరగనివ్వమని, బిల్లుకు అడ్డుపడిపోతామని సీమాంధ్ర ఎంపీలు చెబుతున్నారు. మరోవైపు బీజేపీ మాత్రం సభను సజావుగా నడిపితేనే బిల్లుకు మద్దతు వుంటుందని చెబుతుంది. ఇదిలావుంటే ప్రభుత్వం కూల్‌గా ఈనెల 10న రాజ్యసభలో తెలంగాణ బిల్లును ప్రవేశపెడతామని ప్రకటించింది.   ప్రస్తుతం తెలంగాణ బిల్లు చుట్టూ ఏర్పడిన పరిస్థితులను చూస్తే ఈ బిల్లుకు రాజ్యసభలో ఆమోదం లభించేలా చేసి, లోక్‌సభలో బిల్లుకు జెల్లకొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. రాజ్యసభలో బిల్లును ఆమోదింపజేసుకోవడం ద్వారా తెలంగాణ ప్రాంతాన్ని, లోక్‌సభలో బిల్లుకు చిల్లు వేయడం ద్వారా సీమాంధ్ర ప్రాంతాన్ని సంతృప్తి పరచాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు అర్థమవుతోందని పరిశీలకులు అంటున్నారు. ప్రస్తుతానికి ఈ గండాన్ని ఇలా గట్టెక్కించి మిగతా విషయాన్ని వచ్చే ఎన్నికల తర్వాత చూసుకోవచ్చనే యోచనలో కేంద్రం ఉన్నట్టు భావిస్తున్నారు. ఎన్నికలలో తమను గెలిపిస్తే లోక్‌సభలో కూడా బిల్లు ఆమోదం పొందేలా చర్యలు తీసుకుంటామని చెబుతూ తెలంగాణ ప్రాంత ఓటర్లకి గాలం వేసే ఉద్దేశంలో ఇటు కాంగ్రెస్‌తోపాటు అటు బీజేపీ కూడా వున్నట్టు తెలుస్తోందని అంటున్నారు. రాజ్యసభలో ఆమోదం పొందిన బిల్లుకు కాలదోషం పట్టదు కాబట్టి తెలంగాణ సమస్య అనే రావణ కాష్టాన్ని శాశ్వతంగా కాలుతూ వుండేలా చూడటం ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ వ్యూహంలా వుందని పరిశీలకులు అంటున్నారు.

నిండు నూరేళ్ళ ఆంధ్రప్రదేశ్ కప్: 2

      సాధనా దినం: జంతర్ మంతర్ నుంచి మా సమైఖ్య ప్రతినిది -  " సంపూర్ణ ఆంద్ర టీం ప్రాక్టిస్ మ్యాచ్ కి మద్దతు గా జనసంద్రంగా మారింది జంతర్ మంతర్. లోక్ మరియు రాజ్యసభ గ్రౌండ్స్ నిరవధిక వాయిదా వల్ల సంపూర్ణ ఆంద్ర కెప్టెన్ కిరణ్ తన రెండో బంతిని ఇక్క్డడ నుంచి వెయడం ఈ రోజు విశేషం. రెండో బంతి దూసుకొని వెల్తు వివిధ ప్రతిపక్షపార్టీలను ప్రేరేపిస్తూ తన గమ్యాన్ని చేరుకొంది. ఆట చివరి ఒవర్ రెండో బంతి ముగిసేసరికి సంపూర్ణ ఆంద్ర స్పష్టమైన అధిక్యంతో నిజాం మీద ఉంది. ఉక్కిరి బిక్కిరి అయిన నిండు నూరేళ్ళ ఆంద్రప్రదేశ్ కప్ ని సమర్పిస్తున్న తలతిక్కల కేంద్ర ప్రభుత్వం మరియు నిజాం టీం కళ్ళు తేలవేయడం ఈ రోజు ప్రత్యేకత. హైలెట్స్ ఆఫ్ ద డే : 1. చెయూతని ఇస్తున్న చంద్రన్న 2. మన దారి కి వచ్చిన మోదీ 3. వెల వెల పొయిన నెహ్రు గాట్ 4. లోక్ మరియు రాజ్య సభ గ్రౌండ్స్ నిరవదిక వాయిదా 5. తల తిక్కల కేంద్ర ప్రభుత్వం ఇంకా మొండి వైకరి వీడకపొవడం 6. ఇప్పుడే నిద్ర లేచిన సీమా౦ద్ర బి.జె.పి, రేపు ఢిల్లీ పయనం 7.  స్లెడ్జింగ్ / బాల్ టంపరింగ్ / ధూశన / ఆటగాళ్లని కొనే సంస్క్రుతి కి తెర లేపిన  8. చురకలు అంటించిన సుష్మ. .....Suresh Karothu

నిండు నూరేళ్ళ ఆంధ్రప్రదేశ్ కప్

      సంపూర్ణ ఆంద్ర మరియు నిజాం సంపూర్ణ ఆంద్ర ఇన్నింగ్స్ 300 / 1 ఇయర్ నిజాం 299 / 4 ఇయర్స్ హైలెట్స్: సంపూర్ణ ఆంద్ర కెప్టెన్ కిరణ్ తన టీం లగడపాటి / శైలజానాద్ / అశొక్ బాబు మిగతా వాళ్లతో చివరి ఓవర్ గురించి చర్చిస్తున్నరు... నిజాం టీం చివరి ఓవర్ వరకు వెయిట్ చెయకుండా సంబరాలు అంబరన్ని అంటే ట౦టూ చేస్తున్నారు ... చివరికి... కెప్టెన్ కిరణ్ చివరి ఓవర్ వెయడానికి నిర్ణయించు కొన్నారు. 2014.జనవరి.31 - మెదటి బంతి ------ పుర్తిగా నిజాం కోట ని పడగొట్టి అసెంబ్లీలో .. ముజువాణి వోట్ తో క్లీన్ బౌల్డ్ ఆకస్మిక మార్పుల వళ్ళ ఆట హైదరబాద్ నుంచి డిల్లీ కి మర్చడం అయింది. ఓవెర్ టూ డిల్లీ , అక్కడ మా సమైక్యాంధ్ర ప్రతినిది విరామం తరువాత... విరామం / వాణిజ్య ప్రకటనలు / సమాలోచనలు : వాణిజ్య ప్రకటనలు : 1. మీ రాష్టం లో విభజన దోమల బెడద ఎక్కువ ఉందా .... వాడండి సమైక్య బిల్లలు ... 2. కుల , మత , ప్రాంత విద్యేశాలు రెచ్చగొట్తే కా౦గ్రేస్ పార్టిని సమూలంగ ఒక్క ఉతుక్కే నాశనం చేస్తుంది సమైక్య వాషింగ్ పౌడర్ .... 3. నిండు నూరేళ్ళ ఆంద్రప్రదేష్ కప్ ని సమర్పిస్తున్న వారు ... తల తిక్కల కేంద్ర ప్రభుత్వం.... ఇప్పుడు డిల్లీ నుంచి అక్కడ మా సమైక్య ఆంద్ర ప్రతినిది వివరణ - "నిన్న రాత్రి ఆకస్మతుగా ఆట హైదరబాద్ నుంచి డిల్లీ కి మర్చడం వల్ల ... మొదట బంతి కి విరిగిన వికెట్త్ ముక్కలు ప్రత్యేక విమానం లొ థర్డ్ అంపైర్ వద్దకు పరిశీలనకు పంపారు. సంపూర్ణ ఆంద్ర మరియు నిజాం టీంస్ స్పెషల్ విమానంలో డిల్లీ కి చెరుకొన్నారు. స్లెడ్జింగ్ కి పాల్పడిన సంపూర్ణ ఆంద్ర ఆటగాళ్లు చిరంజీవి / పనబాకా / కావురి ని టీం కెప్టైన్ కిరణ్ జీవిత కాల నిషేదం విదించాలని టీం కోచ్ అశోక్ బాబు కి విజ్ఞప్తి చెసారు. ఇక రెండు టీం ల అబిమానుల బలా బలాలు : సమైక్య ఆంద్ర - త్రుణమొల్ / జె.డి.యు / చిన్న చిన్న ప్రంతీయ పార్టిలు నిజాం - కాంగ్రెస్ అటు ఇటు తెల్చుకోలేక ఉన్న - బి.జె.పి రెపటి మాచ్ కి సాదనగ సంపూర్ణ ఆంద్ర టీం జంతర్ మంతర్, నిజాం టీం నెహ్రు గాట్ ని ఎంచుకొన్నయి. "   ......Suresh Karothu