Publish Date:Nov 15, 2013

EDITORIAL SPECIAL
  మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ ఏపీలో వైసీపీదే అధికారమని అంచనా వేస్తున్నాయి. అయితే టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం.. ఎగ్జిట్ పోల్స్ ని నమ్మొద్దని, నూటికి నూరు శాతం మళ్ళీ టీడీపీనే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. రేపు ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో చంద్రబాబు తమ పార్టీ నేతలకు, కార్యకర్తలకు గెలుపు మనదేనన్న భరోసా ఇచ్చారట. ప్రతిపక్షాల మైండ్‌గేమ్‌లో పడాల్సిన అవసరం లేదని, వారు చేస్తోన్న హంగామాకు బెదిరిపోవద్దని, గెలుపు మనదేనని వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. టీడీపీకి 116 సీట్లు వస్తాయని, దాని కంటే ఎక్కువ వచ్చే అవకాశం ఉందని, రాష్ట్రంలో అన్నివర్గాల ప్రజలు టీడీపీ వైపు నిలబడ్డారని అన్నారట. కేంద్రం, ఎన్నికల కమీషన్‌ సహాయంతో వైసీపీ ఎన్ని కుట్రలు చేసినా తట్టుకుని నిలబడ్డామని, గెలుపు మనదేనని, సంబరాలకు సిద్ధంగా ఉండాలని బాబు చెప్పినట్లు తెలుస్తోంది. వైసీపీకి పట్టున్న రాయలసీమలో కూడా టీడీపీ ఘన విజయం సాధించబోతోందని బాబు ధీమా వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. "గతంలో చిత్తూరులో టీడీపీకి 7 సీట్లు వస్తే.. ఈసారి మరో రెండు సీట్లు పెరుగుతున్నాయి. అదే విధంగా అనంతపురంలో వచ్చిన 12 సీట్లను నిలబెట్టుకుంటున్నామని, కర్నూలులో గతంలో 3 సీట్లు వస్తే.. ఈసారి తొమ్మిది సీట్లు సాధించబోతున్నామని, కడపలో మరో సీటు వస్తుందని.. గతానికంటే పది సీట్లు సీమలో అదనంగా గెలుచుకోబోతున్నాం" అని బాబు అన్నట్లు తెలుస్తోంది. రాయలసీమలోనే ఇలా ఉంటే మిగతా ప్రాంతాల్లో ఎలా ఉంటుందో చూసుకోవాలని ఆయన పార్టీ నేతలకు, కార్యకర్తలకు చెప్పారట.  ఇక ప్రకాశంలో ఏడు, నెల్లూరులో నాలుగు సీట్లు వస్తున్నాయని అన్నారట. రాజధాని ప్రాంతమైన  గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పదికి తగ్గకుండా వస్తాయని, గోదావరి జిల్లాల్లో కూడా అదే పరిస్థితి ఉందని, ఉత్తరాంధ్రలో మెజార్టీసీట్లు సాధిస్తామని తెలిపారట. మరి బాబుకి తమ గెలుపుపై ఉన్న నమ్మకం నిజమవుతుందో లేదో రేపు తెలుస్తోంది.
  ఎన్నికల ఫలితాలకు సమయం దగ్గరపడేకొద్దీ ఎన్నికల సంఘం సరికొత్త వివాదాల్లో చిక్కుకుంటోంది. ఈవీఎంల తరలింపు విషయంలో రాజకీయ పార్టీల నుంచి విమర్శలు ఎదుర్కొంటోంది. యూపీ, బీహార్, పంజాబ్, హర్యానాల్లో ఈవీఎంల ట్యాంపరింగ్‌కు సంబంధించిన వార్తలు కలకలం రేపుతున్నాయి. కౌంటింగ్‌కు రెండు రోజుల ముందు ఈవీఎంలను స్ట్రాంగ్ రూంల వద్దకు తీసుకొచ్చిన వీడియోలు కలకలం సృష్టించాయి. ప్రధాని మోదీ పోటీ చేస్తున్న ఉత్తర్‌ప్రదేశ్‌ లోని వారణాసిలో ఈవీఎంల తరలింపు వ్యవహారం వివాదాస్పదంగా మారింది. చందౌలీ నియోజకవర్గంలో ఆదివారం పోలింగ్ ముగియగా.. సిబ్బంది మంగళవారం ఈవీఎంలను కౌంటింగ్ సెంటర్‌కు తీసుకువచ్చారు. మంగళవారం ఉదయం ఈవీఎంలను కౌంటింగ్ సెంటర్‌ కాంప్లెక్స్‌లోని ఓ గదిలో భద్రపరచడాన్ని సమాజ్‌వాదీ పార్టీ కార్యకర్తలు మొబైల్ లో చిత్రీకరించారు. పోలింగ్ ముగిసిన రెండ్రోజుల తర్వాత ఈవీఎంలు తీసుకురావడంపై అధికారులను నిలదీశారు. దీనిపై స్పందించిన ఎన్నికల యంత్రాంగం.. వీడియోలో చూపించిన ఈవీఎంలు చందౌలీ నియోజవర్గానికి చెందిన రిజర్వ్‌ యూనిట్లని తెలిపారు. పోలింగ్‌ రోజున తరలించే క్రమంలో ఏర్పడ్డ ఇబ్బందుల కారణంగా వాటిని స్ట్రాంగ్‌ రూంలకు చేర్చడంలో ఆలస్యమైందని వివరించారు. కాగా.. గత డిసెంబరులో ఈసీ ఇచ్చిన ఆదేశాల ప్రకారం.. ఎన్నికల ప్రక్రియ ముగిసిన వెంటనే అన్ని ఈవీఎంలతో పాటే రిజర్వ్‌ యూనిట్లను కూడా తరలించాల్సి ఉంటుంది. అలాగే అవన్నీ కౌంటింగ్ ప్రక్రియ ముగిసే వరకు సాయుధ బలగాల పటిష్ఠ భద్రతలో ఉండాలి. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘాజీపూర్‌ నియోజవర్గ పరిధిలో ఓ వాహనంలో భారీ ఎత్తున ఈవీఎంలను తరలిస్తున్నారని ఆరోపిస్తూ బీఎస్పీ అభ్యర్థి అఫ్జల్‌ అన్సారీ స్థానికంగా ఉన్న ఓ స్ట్రాంగ్‌రూమ్‌ వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో జిల్లా రిటర్నింగ్‌ అధికారి అక్కడికి చేరుకొని స్ట్రాంగ్‌ రూమ్‌ వద్ద పార్టీలకు చెందిన ప్రతినిధులను కూడా ఉండడానికి అనుమతించడంతో ఆందోళన విరమించారు. బీహార్, హర్యానా, పంజాబ్‌లోని పలు ప్రాంతాల్లోనూ ఇలాంటి ఘటనలే వెలుగులోకి వచ్చాయి. అయితే.. ఈవీఎంల తరలింపు వార్తలపై స్పందించిన ఎన్నికల సంఘం.. ఆ వార్తలన్నీ కేవలం వదంతులేనని, భారీ బందోబస్తు మధ్య ఈవీఎంలను భద్రపరిచామని తెలిపింది.
  కేంద్రంలో బీజేపీకి గానీ, కాంగ్రెస్ కి గానీ పూర్తీ మెజారిటీ వచ్చే అవకాశం లేదని.. ఈసారి ప్రాంతీయ పార్టీలు కీలక పాత్ర పోషిస్తాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఎగ్జిట్ పోల్స్ మాత్రం మళ్ళీ కేంద్రంలో ఎన్డీయేనే అధికారంలోకి వస్తుందని అంచనా వేసాయి. ఇక ఏపీలో వైసీపీదే గెలుపని అభిప్రాయపడ్డాయి. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు తాజాగా టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుని కలిశారు. అంతేకాదు.. మళ్ళీ మీరే రావాలి, మిమ్మల్ని సీఎంగా మరోసారి చూడాలని తన ఆకాంక్ష అని బాబుతో విష్ణు చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బీజేపీ, టీడీపీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఓ వైపు చంద్రబాబు బీజేపీయేతర పక్షాలను ఏకం చేయడానికి తనవంతు ప్రయత్నాలు చేసున్నారు. మరి ఇలాంటి సమయంలో బీజేపీ నేత.. చంద్రబాబుని కలవడం రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి పూర్తి మెజారిటీ వస్తుందని చెప్పినా బీజేపీకి నమ్మకం లేదా? అందుకే మిగతా పార్టీ నేతలను దగ్గరికి తీసుకునే ప్రయత్నంలో భాగంగా.. బీజేపీ పెద్దలు బాబు వద్దకి విష్ణుని రాయబారానికి పంపారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లేక ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నమ్మని విష్ణు.. ఏపీలో టీడీపీనే గెలిచే అవకాశముందని నమ్ముతూ బాబుకి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారా? అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి ఈ విష్ణు.. బాబుని ఏ ఉద్దేశంతో కలిసారో ఆ పై వాడు విష్ణువుకే తెలియాలి.
ALSO ON TELUGUONE N E W S
  Cast: Bellamkonda Sai Srinivas, Kajal Agarwal, Sonu Sood, Tanikella Bharani, Abhimanyu Singh and others Production companies: AK Entertainments Cinematography: Sirisha Roy Music: Anup Rubens Submission: E TV Producer: Ramabrahmam Sunkara Story, story and direction: Teja Release Date: May 25th 2019 “If you aske me how is the movie I cannot tell you. I cannot it. After the movie releases, the audience should only tell it. Everyone has given their best but I was the one who was average.” This is what Teja said during the pre-release event. Does he know that the movie would not perform well? Or working for 2 years for the same movie made him feel low? How is the movie actually? Lets read the review. Story: Kajal takes help of Sonu Sood to evacuate a basti in order to build a shopping complex there. What does Sonu Sood expect in return from her? Why does Sita aka Kajal finds herself in trouble? How does Bellam Konda Srinivas help Kajal? Answer to all this questions forms the movie Sita   Plus Points Kajal Agarwal Conversations between Tanikella Barani & Sonu Sood   Minus Points: Teja’s Story & Direction Anup Rubens Music Bittiri Satti’s entertainment   Performances: Kajal Agarwal lives in every scene as Sita. Bellam Konda Srinivas also acted well. He tried to live each & every moment in the film. The fighting scenes near the police station & the pre climax fights were extremely good. But he did not fit in Raghuram’s character. There was nothing new for Sonu Sood. But the conversaations between Tanikella Barani & Sood were very interesting. All the other actors very just okay.   Analysis: This is not the story of Sita. This is Teja’s version of modern Ramayana! Sita eagerly waits for Rama in Ramayana. But such girls are not found in the modern days. Teja has tried telling that. But even today such girls exist & that is where Sita comes into picture. But the characterization of Rama is not upto the mark. This is where Teja has gone wrong!   TeluguOne Perspective: Bellam Konda Srinivas who has come out of his comfort zone & tried something new should be appreciated. There is someone in the universe who always tries to do good, this thought of Teja should also be appreciated. But somewhere between giving a good message & giving entertainment, Teja has missed track. Kajal’s acting, Payal’s glamour in a song & a few comedy scenes will give audience big relief!
  Cast: Will Smith, Mena Massoud, Naomi Scott & others Music Director: Alan Menken Cinematography: Alan Stewart Directed By: Guy Ritchie Release Date: 24th May 2019   Irrespective of age, caste, creed, region there was only one Aladdin & his magic which entertained one & all. There are many fans for Aladdin’s stories. Famous Hollywood actor Will Smith acted as Jini for whom Victory Venkatesh dubbed his voice. And for Aladdin Varun Tej dubbed! How did they dub? How is the movie? Let us read the review.   Story: There was an Arabian city in which Aladdin was a thief. He had a pet monkey named Abu. He falls in love with a girl whom he gets introduced to in the streets. Later he realises that she is princess Jasmine. What did Aladdin do to win the princess’s heart? How did he save the city from the enemies? Answers to all this forms the movie Aladdin!   Plus Points: Venkatesh, Varun Tej Dubbing Visual Effects Will Smith, Naomi Scott Acting   Minus Points: Known story Telugu Version songs Background music Direction   Analysis: All of us know the Aladdin story & thus nothing special to tell about the story. The visual effects are wonderful. As the story starts and one gets engrossed in the movie, the telugu version songs disturb a lot, they are extremely awful! The only reason telugu audience would like it is because of Venkatesh & Varun Tej’s dubbing.   Performances: Will Smith as Jini, his comedy timing & Venkatesh’s exact dubbing has made his role apt. Mena as Aladdin was just perfect. The chemistry between Mena & Naomi was very nice.   TeluguOne View: Though the actors have given their best, the director failed in doing justice to the story. Still the movie’s visual effects & the grandeur story telling will attract the audience. The 90s kids will enjoy this movie for sure.
`ఆడ‌వారి మాట‌ల‌కు అర్థాలే వేరులే` సినిమాలో వెంక‌టేష్ ని ప్రేమించ‌మ‌ని వెంట పడుతుంది న‌టి స్వాతి. కానీ వెంక‌టేష్ కుఏజ్ కు ఆమె ఏజ్ కు స‌గం తేడా ఉంటుంది. దీంతో ఆమెకు చిన్న క్లాప్ పీకేస్తాడు వెంక‌టేష్‌. ఇక ఇప్పుడు సేమ్ అదే కాన్సెప్ట్ తో ఒక సినిమా రాబోతున్న‌ట్లు తెలుస్తోంది. అవును ఏజ్ గ్యాప్ ల‌వ్ స్టోరీతో ఒక సినిమా ప్లాన్ చేసాడ‌ట దిల్ రాజు. ఈ క‌థ‌ను యువ రైట‌ర్ ప్ర‌స‌న్న రాసిన‌ట్లు తెలుస్తోంది. వెంక‌టేష్ స‌ర‌స‌న నిత్య మీన‌న్ హీరోయిన్ గా న‌టించే అవ‌కాశాలున్న‌ట్లు స‌మాచారం అందుతోంది.  దీనికి ద‌ర్శ‌కుడు ఎవ‌ర‌న్న‌ది ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ప్ర‌స్తుతం వెంక‌టేష్ `వెంకీమామ‌` లో న‌టిస్తున్నాడు. ఈ సినిమా అయిపోయిన వెంట‌నే దిల్ రాజు బేన‌ర‌ల్ లో రూపొందే ఈ ఏజ్ గ్యాప్ ల‌వ్ స్టోరీ ఉండే అవ‌కాశాలున్న‌ట్లు స‌మాచారం అందుతోంది. చూద్దాం ఎలా ఉంటుందో మ‌రి. 
  క‌మెడియ‌న్స్  పేరు తెచ్చుకున్న సునీల్ , స‌ప్త‌గిరి, ష‌క‌ల‌క శంక‌ర్ హీరోలుగా మారి ప‌లు చిత్రాల్లో హీరోలుగా న‌టించి మెప్పించారు. ఇప్పుడు మ‌రో క‌మెడియ‌న్ జ‌బ‌ర్ద‌స్త్ , ఢీ, పోవే పోరా వంటి టెలివిజ‌న్ షోస్ ద్వ‌రా ఎంతో పాపుల‌రైన సుడిగాలి సుధీర్ హీరోగా `సాఫ్ట్ వేర్ సుధీర్` సినిమా చేస్తున్నాడు. ఇప్ప‌టికే ఈ సినిమా షూటింగ్ చాలా వ‌ర‌కు పూర్తి చేసుకుంది. ఈ చిత్రం ద్వారా రాజ‌శేఖ‌ర్ రెడ్డి పులిచ‌ర్ల ద‌ర్శ‌కుడుగా ప‌రిచ‌య‌మ‌వుతున్నాడు. ఓ నూత‌న నిర్మాణ సంస్థ నిర్మిస్తోంది.  సుధీర్ స‌ర‌స‌న ధ‌న్య బాల‌కృష్ణ హీరోయిన్ గా న‌టిస్తోంది. ఇంద్ర‌జ ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది. అలాగే గౌత‌మ్ రాజు, రామ్ ప్ర‌సాద్, రామ్ ల‌క్ష్మ‌ణ్‌, భీమ్స్ సిసిరోలియో లాంటి టాలెంటెడ్ టెక్నీషియ‌న్స్ ఈ సినిమాకు ప‌ని చేస్తున్నారు. సునీల్ లాంటి క‌మెడియ‌న్సే హీరోలుగా నిల‌దొక్కుకోలేక మ‌ళ్లీ క‌మెడియ‌న్స్ గా చేస్తున్నారు. మ‌రి సుధీర్ లాంటి చిన్న‌పాటి క‌మెడియ‌న్స్ హీరోలుగా నిల‌దొక్కుకోగ‌ల‌రా? ఉన్న ఫేమ్ ని కూడా పాడు చేసుకుంటారా? అంటున్నారా సినీ జ‌నాలు.
  అప్ప‌టి వ‌ర‌కు రైట‌ర్ గా మంచి పేరు తెచ్చుకున్న కొర‌టాల శివ `మిర్చి` సినిమాతో ద‌ర్శ‌కుడుగా మారాడు. ఆ త‌ర్వాత వ‌రుస స‌క్సెస్ ల‌తో దూసుకుపోతున్నాడు కొర‌టాల‌. అలా రైట‌ర్ కు డైర‌క్ట‌ర్ అవ‌కాశం కల్పించిన ప్ర‌భాస్   మ‌రో టాలెంటెడ్ రైట‌ర్ కు అవ‌కాశం ఇచ్చిన‌ట్లు స‌మాచారం అందుతోంది.  కంచె , గౌత‌మి పుత్ర శాత‌క‌ర్ణి, మ‌ళ్లీ మ‌ళ్లీ ఇది రాని రోజు, మ‌హాన‌టి చిత్రాల‌తో రైట‌ర్ గా పేరు తెచ్చుకున్న సాయి మాధ‌వ్ బుర్రా ఇటీవ‌ల ప్ర‌భాస్ ని క‌లిసి ఓ క‌థ‌ని వినిపించిన‌డ‌మే కాకుండా గ్రీన్ సిగ్న‌ల్ కూడా అందుకున్న‌ట్లు తెలుస్తోంది.  ఇదే కనుక నిజ‌మైతే మ‌రో రైట‌ర్ కు ప్ర‌భాస్ లైఫ్ ఇవ్వ‌బోతున్నాడ‌న‌డంలో సందేహం లేదు. ఇక ప్ర‌స్తుతం ప్ర‌భాస్ `సాహో` చిత్రంతో పాటు జాన్ అనే రెండు చిత్రాల్లో న‌టిస్తున్నాడు. అన్నీ కుదిరితే ఈ రెండు సినిమాలు పూర్తైన వెంట‌నే సాయి మాధ‌వ్ బుర్రాతో సినిమా ఉండే అవ‌కాశాలున్నాయి.   
  బీజేపీ, కాంగ్రెస్ లు ప్రత్యర్థి పార్టీలు. ఇరు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు ఒంటి కాలు మీద లేస్తారు. అయితే ఇదంతా జాతీయ రాజకీయాల్లోనేనట. తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ లు శ్రేణులు కలిసి పనిచేసి టీఆర్ఎస్ ను దెబ్బకొట్టాయనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల విడుదలైన ఎగ్జిట్ పోల్స్.. తెలంగాణలో టీఆర్ఎస్ భావించినట్లు 16 సీట్లు గెలిచే అవకాశం లేదని.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కూడా రెండు,మూడు సీట్లు వరకు గెలిచే అవకాశముందని అంచనా వేశాయి. అయితే బీజేపీకి రెండు మూడు స్థానాల్లో గెలుపు అవకాశాలు రావడానికి కారణం కాంగ్రెస్ సహకారమే అని టీఆర్ఎస్ ఆరోపిస్తోంది. నిజామాబాద్ ఎంపీ స్థానం నుండి టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత రెండో దఫా పోటీ చేశారు. ఈ స్థానం నుండి బీజేపీ అభ్యర్ధిగా ధర్మపురి అరవింద్ బరిలోకి దిగారు. అయితే అరవింద్.. గతంలో కాంగ్రెస్ లో బలమైన నేతగా పేరు తెచ్చుకున్న డి. శ్రీనివాస్ తనయుడు కావడంతో.. ఆయన వెంట మెజార్టీ కాంగ్రెస్ పార్టీ నేతలు నిలిచారని ప్రచారం జరుగుతోంది. అదీగాక ఎలాగైనా కవిత గెలుపుకి బ్రేకులు వేయాలని భావించిన మెజారిటీ కాంగ్రెస్ శ్రేణులు.. ఓట్లు చీల్చకూడదని భావించి అరవింద్ కి ఓటేసినట్లు తెలుస్తోంది. కరీంనగర్ స్థానంలో కూడ ఇదే రకమైన పరిస్థితి నెలకొందని టీఆర్ఎస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. బీజేపీ నేత బండి సంజయ్ కుమార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత ఆయన కరీంనగర్ నుండి బీజేపీ ఎంపీ అభ్యర్ధిగా బరిలోకి దిగారు. ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థిగా బి.వినోద్ కుమార్ బరిలో ఉన్నారు. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి చెందిన కేడర్ ఎక్కువగా బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కు ఓటు వేయాలని కోరినట్టుగా టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. లోకల్ లో బండి సంజయ్ కి ఉన్న సొంత ఇమేజ్ కి తోడు, కాంగ్రెస్ కేడర్ కూడా తోడు కావడంతో.. కరీంనగర్ లో బీజేపీకి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిజామాబాద్, కరీంనగర్ లలోనే కాదు.. మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా ఇలాంటి పరిస్థితే ఉందని టీఆర్ఎస్ భావిస్తోంది. ఈ స్థానం నుండి బీజేపీ అభ్యర్ధిగా మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ నుండి బీజేపీలో చేరిన డీకే అరుణ పోటీ చేశారు. ఇక్కడ టీఆర్ఎస్ గెలుపుని ఎలాగైనా అడ్డుకోవాలని భావించిన కాంగ్రెస్ నేతలు.. మొన్నటి వరకు తమ పార్టీలో ఉండి వెళ్లిన డీకే అరుణ గెలుపు కోసం కృషి చేసినట్లు తెలుస్తోంది. మొత్తానికి తెలంగాణలో టీఆర్ఎస్ జోరుకి అడ్డుకోవడం కోసం.. కాంగ్రెస్ తన ప్రత్యర్థి అయిన బీజేపీ గెలుపుకి కృషి చేసిందని ప్రచారం జరుగుతోంది.
  ఏపీలో మళ్లీ ఎన్నికలు జరుగుతాయనీ, అందుకు టీడీపీ ప్లాన్ కూడా సిద్ధం చేసిందని ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదీ మాటలు కూడా ఇందుకు సంకేతాలుగా కనిపిస్తున్నాయి. ఈ నెల 27 అర్థరాత్రి వరకూ ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందన్న ఆయన.. తప్పనిసరి అయితే రీపోలింగ్ జరిపిస్తామన్నారు. వీవీ ప్యాట్ స్లిప్పుల్లో తేడా వచ్చినా, ఈవీఎం డీకోడ్ కాకపోయినా, ఈవీఎంలు మొరాయించినా, పార్టీల మధ్య ఓట్ల తేడా తక్కువగా ఉన్నా రీపోలింగ్‌ జరిపించే అవకాశం ఉందని ద్వివేది స్పష్టం చేశారు. ఈ మాటలను టీడీపీ తనకు అనుకూలంగా మార్చుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగా వస్తే సరే. ఒకవేళ వ్యతిరేకంగా వస్తే మాత్రం ఈవీఎంలు, వీవీప్యాట్లలో తేడా కొట్టిందనీ, అంతా గందరగోళం అయిపోయిందనీ మళ్లీ ఎన్నికలు జరపాల్సిందేనని టీడీపీ పట్టుపట్టే ఛాన్సుందని తెలుస్తోంది. వైసీపీ వైపు నుంచీ చూస్తే... ఆ పార్టీ మళ్లీ ఎన్నికలు అనే ఆలోచనలోనే లేదు. ఎందుకంటే కచ్చితంగా తామే గెలుస్తామని బలంగా నమ్ముతోంది. ఈ నమ్మకమే టీడీపీని మళ్లీ ఎన్నికలవైపు నడిపిస్తోందనే ప్రచారం జరుగుతోంది. వైసీపీ అంత కాన్ఫిడెంట్‌గా ఉందంటే.. ఎన్నికల్లో ఏదో గోల్‌మాల్ జరిగిందనీ, దాన్ని ఎలాగైనా కనిపెట్టి.. మొత్తం ఎన్నికల్ని రద్దు చేసైనా సరే నిజానిజాల్ని బయటకు తేవాలని టీడీపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో గందరగోళం జరిగినట్లు టీడీపీ నిరూపిస్తే, వీవీప్యాట్ స్లిప్పుల్లో తేడాలను కనిపెడితే, అప్పుడు ఈసీ కూడా గట్టిగా ప్రశ్నించలేని పరిస్థితి ఉంటుంది. అది రీపోలింగ్‌కి దారితీస్తుంది. మరి రేపటి ఫలితాలు ఎవరికి అనుకూలంగా ఉంటాయో, ఒకవేళ టీడీపీకి ప్రతికూలంగా ఉంటే రీపోలింగ్‌ అంటారేమో చూడాలి.
  ఏపీలో వైసీపీనే అధికారంలోకి వస్తుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసాయి. రాజకీయ విశ్లేషకులు కూడా వైసీపీకి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. దీంతో ఫలితాలు రాకముందే వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం మొదలైంది. నిజానికి వైసీపీ శ్రేణులు తమదే అధికారమని మొదటి నుంచి నమ్మకంగా చెబుతున్నాయి. వైఎస్ జగన్ పేరుతో సీఎం నేమ్ ప్లేట్, జగన్ సీఎం ప్రమాణస్వీకారానికి ముహూర్తం, జగన్ డ్రీం కేబినెట్ లిస్ట్.. ఇలా సోషల్ మీడియాలో వైరల్ అయిన కొన్ని పరిశీలిస్తే చాలు.. గెలుపుపై వైసీపీ శ్రేణులు ఎంత నమ్మకంగా ఉన్నాయో అర్ధమవుతోంది. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా వైసీపీకి అనుకూలంగా ఉన్న నేపథ్యంలో జగన్ కేబినెట్ లో ఎవరెవరు ఉండబోతున్నారన్న చర్చలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా కీలక నేత విజయసాయి రెడ్డిని జగన్ తన మంత్రివర్గంలోకి తీసుకొని కీలకమైన ఆర్థిక శాఖ అప్పగించనున్నారన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం వైసీపీలో నెంబర్ 2 అంటే విజయసాయి రెడ్డి గుర్తుకొస్తారు. జగన్ కు అత్యంత సన్నిహితుడుగా పేరున్న విజయ సాయి రెడ్డి వైసీపీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు పార్టీ కోసం తనవంతుగా కష్టపడుతున్నారు. అందుకే జగన్.. వైసీపీ అధికారంలోకి వస్తే విజయ సాయి రెడ్డిని కేబినెట్ లోకి తీసుకోవాలి అనుకుంటున్నారట. అయితే విజయ సాయిరెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఆయన రాజ్యసభ సభ్యుడిగా మాత్రమే ఉన్నారు. దీంతో ఆయనను ఎమ్మెల్సీ కోటాలో మంత్రిగా తీసుకోవాలన్న ప్రయత్నాల్లో జగన్ ఉన్నట్లు సమాచారం. ఇక ఎంతో కీలకమైన స్పీకర్ పదవిని దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు అప్పగించాలన్న యోచనలో జగన్ ఉన్నారని కూడా చర్చ జరుగుతోంది. స్పీకర్ పదవికి అంబటి రాంబాబు పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. వీరితో పాటు మొదట్నుంచి తన వెంటే ఉన్న కొంతమంది నాయకులకు కూడా తన కేబినెట్‌లో జగన్ చేర్చుకోబోతున్నారని తెలుస్తోంది. ధర్మాన కృష్ణదాస్, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, రోజా, ఆళ్ల రామకృష్ణారెడ్డి, కొడాలి నాని తదితరులకు పదవులు దక్కవచ్చని వైసీపీలో చర్చ జరుగుతోంది.
  సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ఈ నెల 23 న ఫలితాలు వెలువడనున్నాయి. అప్పటికి వరకు నిన్న సాయంత్రం విడుదలైన ఎగ్జిట్ పోల్స్ గురించి చర్చలు జరుగుతూ ఉంటాయి. లోక్ సభ ఎన్నికల్లో కూడా తెలంగాణలో టీఆర్ఎస్‌కే మెజారిటీ సీట్లు ఖాయమని ఎగ్జిట్ పోల్స్ తేల్చేశాయి. అయితే టీఆర్ఎస్ చెబుతున్న 16 సీట్లకు రెండు, మూడు సీట్లు తగ్గే అవకాశముందని సర్వేలు అంచనా వేశాయి. అంతేకాదు తెలంగాణలో బీజేపీ బోణి కొట్టనుందని అంచనా వేశాయి. దీంతో బీజేపీ గెలవబోయే సీటు ఏది అయ్యుంటుంది అంటూ విపరీతమైన చర్చలు జరుగుతున్నాయి. తెలంగాణలో బీజేపీ గెలిచే అవకాశమున్న సీటు అంటే ముందుగా కరీంనగర్ పేరు వినిపిస్తోంది. ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా బండి సంజయ్ బరిలోకి దిగారు. బండి సంజయ్ ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటారన్న పేరుంది. దీంతో పార్టీలతో సంబంధం లేకుండా ప్రజలు ఆయన వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా యువత ఆయనకు అండగా నిలబడ్డారు. దీన్నిబట్టి చూస్తుంటే బండి సంజయ్ పుణ్యమా అని తెలంగాణలో బీజేపీ ఖాతాలో ఒక సీటు పడేలా ఉంది. ఇక బీజేపీ మరో రెండు స్థానాల్లో కూడా బలమైన పోటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అవే సికింద్రాబాద్, నిజామాబాద్ స్థానాలు. ఈ రెండింట్లో ముఖ్యంగా సికింద్రాబాద్ లో బీజేపీ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. సికింద్రాబాద్ నుంచి బీజేపీ అభ్యర్థిగా సీనియర్ నేత కిషన్ రెడ్డి బరిలోకి దిగారు. సికింద్రాబాద్ లో బీజేపీకి పట్టు ఉండటమే కాకుండా కిషన్ రెడ్డికి కూడా వ్యక్తిగతంగా మంచి ఇమేజ్ ఉండటంతో.. ఇక్కడ బీజేపీ గెలిచే అవకాశాలు లేకపోలేదు. ఇక నిజామాబాద్ లో బీజేపీ గెలుస్తుందని చెప్పలేము కానీ టీఆర్ఎస్ కి గట్టి పోటీ ఇస్తుందనే అభిప్రాయం మాత్రం వ్యక్తమవుతోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినట్టు తెలంగాణలో బీజేపీ బోణి కొడుతుందో లేదో ఈ నెల 23 న తేలనుంది.
  విజయవాడలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా గురించి ప్రెస్ మీట్ పెట్టాలని ప్రయత్నించి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విఫలమయ్యారు. వర్మ రూపొందించిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్‌' సినిమా ఏపీలో తప్ప అన్ని ప్రాంతాల్లో విడుదలైంది. అయితే ఇప్పుడు ఏపీలో సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయ్యింది. దీంతో మే 1న సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో ప్రెస్ మీట్ పెట్టాలని వర్మ అనుకున్నారు. విజయవాడలో నడిరోడ్డుపై లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రెస్ మీట్ పెడతానంటూ ట్విట్టర్‌లో చెప్పిన వర్మ...అనుకున్న ప్రకారం బయల్దేరారు. దీంతో అక్కడ ఎయిర్ పోర్టుకు చేరుకోగానే వర్మను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏపీలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో వర్మ ప్రెస్ మీట్‌కు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో వర్మ ఎలాంటి ప్రెస్ మీట్ పెట్టకుండానే వెనుదిరిగారు. ట్విట్టర్ వేదికగా ఏపీ ప్రభుత్వం మీద విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై స్పందించిన వైసీపీ అధినేత జగన్.. వర్మకు అండగా నిలిచారు. ట్విట్టర్ వేదికగా ఆయన చంద్రబాబును ప్రశ్నించారు. "విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టలేని  పరిస్థితుల్లో మన ప్రజాస్వామ్యం ఉంది.  పోలీసుల్ని బంట్రోతులు కన్నా హీనంగా వాడుకునే పరిస్థితుల్లో మన ప్రజాస్వామ్యం ఉంది. ఇదా ప్రజాస్వామ్యం..! చంద్రబాబు గారూ..! ఇంతకీ రామ్ గోపాల్ వర్మ చేసిన తప్పేంటి..?"  అని జగన్ ట్వీట్ చేశారు. అయితే ఈ ఘటనపై వర్మ మీద విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల అనుమతి తీసుకోకుండా ప్రెస్ మీట్‌ ఎలా పెడతారు? అయినా నడిరోడ్డు మీద ప్రెస్ మీట్ ఏంటి? ట్రాఫిక్ కి అంతరాయం కలగదా? అలా నడిరోడ్డు మీద మీటింగ్ పెట్టి ఏదైనా జరగరాని సంఘటన జరిగితే ఎవరిదీ బాధ్యత? అంటూ వర్మ తీరుపై పలువురు మండిపడుతున్నారు. పోలీసులు కూడా వర్మ ప్రెస్ మీట్ కి ఎందుకు అనుమతి ఇవ్వలేదో వివరించారు. విజయవాడ నగరపరిధిలో సెక్షన్‌ 30 పోలీస్‌ యాక్ట్‌, సెక్షన్‌ 114 సీఆర్‌పీసీ, ఎలక్షన్‌ కోడ్‌ అమల్లో ఉన్నాయని గుర్తు చేశారు. ఈ సమయంలో ప్రెస్ మీట్ నిర్వహించుకొనేందుకు ముందస్తుగా పోలీసులు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. నిత్యం రద్దీగా ఉండే విజయవాడలోని పైపులరోడ్డు, ఎన్టీఆర్‌ సర్కిల్‌ వద్ద ప్రెస్‌ మీట్‌ నిర్వహిస్తే ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగి ప్రజలకు అసౌక్యం ఏర్పడే అవకాశం ఉందన్నారు. ఈ ప్రాంతంలో వర్మ ప్రెస్ మీట్ నిర్వహిస్తే రెండు వర్గాల మధ్య ఘర్షణలకు దారి తీసే అవకాశం ఉందని భావించామన్నారు. దీంతో ముందస్తుగా రామ్‌గోపాల్ వర్మను అదుపులోకి తీసుకొన్నట్టు  పోలీసులు తెలిపారు. ఎలక్షన్‌ కోడ్‌ అమలు, పోలీసుల అనుమతి.. ఇలాంటివి పట్టించుకోకుండా వైఎస్ జగన్ వర్మకి సపోర్ట్ గా మాట్లాడడంపై కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మొన్నటి వరకు చంద్రబాబుని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అని, పవర్ లెస్ సీఎం అని అన్నారు. ఆయనకసలు అధికారులు లేవని, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఈసీ చెప్పిందే వేదమని డైలాగ్ లు కొట్టారు. తీరా పోలీసులు ఎన్నికల కోడ్ పేరుతో వర్మ ప్రెస్ మీట్ ని అడ్డుకుంటే మాత్రం.. చంద్రబాబు సీఎం అని, టీడీపీ ప్రభుత్వం అని గుర్తుకొచ్చిందా?. అయినా పవర్ లెస్ సీఎం ఓ ప్రెస్ మీట్ ని ఎలా అడ్డుకోగలడు?, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఈసీ, సీఎస్ చెప్పిందే వేదమని మీరే చెప్పారు కదా. మరి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు నడిరోడ్డుపై ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి వారు అనుమతి ఇస్తారేమో అడగండి అంటూ పలువురు జగన్ ని ప్రశ్నిస్తున్నారు.
  తెలంగాణ వ్యాప్తంగా ఇంటర్ బోర్డు నిర్వాకంతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. దాదాపు 20 మంది ఇంటర్ విద్యార్థులు మార్కులు తక్కువ వచ్చాయనో, ఫెయిల్ అయ్యామనో ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అయితే ఇంత జరుగుతున్నా దీనిపై సీఎం కేసీఆర్ స్పందించకపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తప్పుకి బాధ్యులైన వారిని శిక్షించి మీకు అండగా ఉంటామని.. విద్యార్థులకు, తల్లిదండ్రులకు భరోసా ఇవ్వలేదు. కనీసం ఆత్మహత్యల పట్ల విచారం వ్యక్తం చేసి.. మిగతా విద్యార్థుల్లో ధైర్యం నింపే ప్రయత్నం కూడా చేయలేదు. కేసీఆర్ కి ఓ ఐదు నిమిషాలు ప్రెస్ మీట్ పెట్టడానికో లేక ఒక ట్వీట్ చేయడానికో కూడా టైం లేదా? అంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అన్నింట్లో తోటి తెలుగు రాష్ట్రమైన ఏపీతో పోటీ పడే కేసీఆర్.. తెలంగాణలో విద్యార్థుల ఆత్మహత్యపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించినా.. తన సొంతం రాష్ట్రంలో ఇంత జరుగుతుంటే కేసీఆర్ ఎందుకు స్పందించట్లేదు అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై ట్విట్టర్ వేదికగా చంద్రబాబు స్పందించారు. 'పరీక్షలో ఫెయిల్ అయ్యామని తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ విద్యార్ధులు ఆత్మహత్య చేసుకున్నట్లు వెలువడుతున్న వార్తలు బాధ కలిగించాయి. ఉజ్వల భవిష్యత్తు ఉన్న విద్యార్ధుల మరణం నన్ను కలిచివేసింది. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. విద్యార్ధులకు నా విజ్ఞప్తి ఒక్కటే.. కేవలం పరీక్షలు, పాస్ కావడం మాత్రమే జీవితం కాదు. అవి మీ ప్రతిభకు గుర్తింపు మాత్రమే.. కానీ పరీక్షల కంటే మీ జీవితాలు ముఖ్యం. మీ ప్రాణాలు అంతకన్నా అమూల్యమైనవి. పరీక్షల్లో తప్పినంత మాత్రాన మీ జీవితాలను అర్థాంతరంగా ముగించి, మీ కన్నవారు మీపై పెట్టుకున్న ఆశలను కడతేర్చకండి. ఈ వయసులో తల్లిదండ్రులకు కడుపుకోత పెట్టకండి. మీ ముందెంతో సుందరమైన బంగారు భవిష్యత్తు ఉంది. ప్రపంచ చరిత్రలో విజేతలుగా నిలిచిన చాలామంది మొదట పరాజితులే..చదువు అనేది కేవలం విజ్ఞానానికే, అదే జీవితం కాదు. ఓటమి విజయానికి తొలిమెట్టు. మళ్లీ మంచి ఫలితాల కోసం కష్టపడి చదవండి. ఎప్పటికప్పుడు మీ నైపుణ్యాలను పెంచుకోండి. ఎంచుకున్న రంగాలలో ప్రతిభ చూపి రాణించండి. కష్టపడితే విజయం మీదే, బంగారు భవిష్యత్తు మీదే. జీవితంలో మీ ఎదుగుదలే తల్లిదండ్రులకు, దేశానికి  మీరిచ్చే బహుమతి.' అని ట్వీట్ చేశారు. ఈ మాత్రం స్పందన తెలంగాణ సీఎం కేసీఆర్ నుంచి కరువైందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
  ఒక ప‌న్నెండేళ్ల పిల్ల‌వాడు ఏదో ఘోర‌మైన ప్ర‌మాదంలో తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. అత‌ని కుడి చేయి ఎందుకూ ప‌నికిరాకుండా పోయింది. కానీ ఆ పిల్ల‌వాడికి చిన్న‌ప్పటి నుంచీ ఓ కోరిక ఉండేది. ఎలాగైనా తను క‌రాటేలో గొప్ప ప్ర‌తిభావంతుడిని కావాలన్న‌దే ఆ కోరిక‌! కానీ ఇప్పుడేం చేసేది? త‌న కుడి చేయి ఇక క‌రాటేకి స‌హ‌క‌రించ‌దు క‌దా! అయినా ఆశ చావక తన బ‌డిలో ఉంటున్న క‌రాటే మాస్ట‌రు ద‌గ్గ‌ర‌కు వెళ్లాడు.   `నేను ఇంక జీవితంలో క‌రాటేని నేర్చుకోలేమోన‌ని అనిపిస్తోందండీ` అన్నాడు బాధ‌గా. ఆ మాస్ట‌రుగారు ఒక్క‌నిమిషం ఆలోచించి `నీలో క‌నుక నిజంగా ప‌ట్టుద‌ల ఉంటే త‌ప్ప‌కుండా క‌రాటేలో గొప్ప నేర్పును సాధిస్తావు. కానీ నేనేం చెబితే నువ్వు అలాగే చేయ‌వ‌ల‌సి ఉంటుంది. స‌రేనా!` అని అన్నాడు. `నా చిన్న‌ప్ప‌టి కోరిక‌ను నెర‌వేర్చుకునేందుకు నేను ఎలాంటి క‌ష్టాన్నైనా భ‌రించ‌డానికి సిద్ధంగా ఉన్నాను.' అంటూ సంతోషంగా ఒప్పుకున్నాడు పిల్ల‌వాడు. మ‌రుస‌టి రోజు నుంచి పిల్ల‌వాడు రోజూ క‌రాటే మాస్టరుగారి ద‌గ్గ‌ర‌కు వెళ్లసాగాడు. కానీ విచిత్రంగా ఆ కరాటే మాస్ట‌రు రోజూ పిల్ల‌వాడికి ఒక‌టే కదలికని నేర్పేవాడు. ఎన్నిరోజులు చేసినా అదే ప‌ని. అదే కదలిక‌ని అభ్యాసం చేసీ చేసీ పిల్ల‌వాడు అలసిపోయేవాడు. ఎప్పుడూ ఒక‌టే ర‌కం భంగిమ‌తో అత‌నికి చిరాకు వేసేది. కానీ ఏం చెప్పినా చేయాల్సిందే అన్న గురువుగారి మాట‌కి క‌ట్టుబ‌డి ఊర‌కుండిపోయేవాడు. కొన్నాళ్ల‌కు ఇంక ఉండ‌బ‌ట్ట‌లేక `కరాటే అంటే ఇంతే కాదు క‌దా! ఇంకా వేరే ఏమైనా నేర్పుతారా?` అని అడిగాడు. `నువ్వు ఈ ఒక్క కదలిక‌నే సాధ‌న చేస్తూ ఉండు. చాలు!` అంటూ క‌స్సుమ‌న్నారు గురువుగారు. ఇంక మారుమాట్లాడ‌కుండా అదే భంగిమ‌ను సాధ‌న చేస్తూ ఉండిపోయాడు పిల్లవాడు. ఇలా ఉండ‌గా కొన్నాళ్ల‌కి ఆ బ‌డిలో కరాటే పోటీలు మొద‌లుపెట్టారు. `నువ్వు కూడా ఈ పోటీల‌లో పాల్గోవాలి!` అన్నారు గురువుగారు. `ఏదీ ఈ ఒక్క భంగిమ‌న‌తోనా!` అంటూ ఉక్రోషంగా బ‌దులిచ్చాడు పిల్ల‌వాడు.   గురువుగారు ఓ చిరున‌వ్వు న‌వ్వి ఊరుకుండిపోయారు. ఆశ్చర్యంగా పిల్ల‌వాడు త‌న‌కి పోటీలో ఎదుట‌ప‌డిన ఇద్ద‌రు ప్రత్యర్థుల‌నీ చాలా తేలికగా మ‌ట్టి క‌రిపించేశాడు. పోటీలో ముందుకు వెళ్తున్న కొద్దీ మ‌రింత బ‌ల‌మైన ప్ర‌త్య‌ర్థులు ఎదురుపడ‌సాగారు. కానీ ఎలాగొలా చివ‌రిక్ష‌ణంలో అయినా వాళ్ల‌ని ఓడించగ‌లిగాడు. పోటీలో ఒకో అంచె ముందుకు వెళ్తున్న కొద్దీ అత‌నిలో విశ్వాసం పెరిగిపోసాగింది. చివ‌రికి ఎలాగైతేనేం... ఆ పోటీలో అత‌నే విజేత‌గా నెగ్గాడు. `గురువుగారూ! జ‌రిగింది న‌మ్మ‌లేక‌పోత‌న్నాను. నేనీ ఒక్క క‌ద‌లిక‌తోనే విజ‌యాన్ని సాధిస్తాన‌ని మీరు ఎలా అనుకున్నారు?` అని అడిగాడు ఆశ్చ‌ర్యంగా. `మ‌రేం లేదు! నీకు నేర్పిన ఈ క‌ద‌లిక క‌రాటేలోనే చాలా క‌ష్ట‌మైన‌ది. అందుక‌ని చాలామంది దాన్ని నేర్చుకోవ‌డానికి వెనుకాడ‌తారు. ఇక‌పోతే చాలామంది కుడిచేత్తో పోరాడినంత బ‌లంగా ఎడ‌మ‌చేత్తో పోరాడ‌లేరు. అందుక‌నే ఆ ఒక్క పట్టుతోనే నువ్వు విజ‌యాల‌ను సాధించ‌గ‌లిగావు` అన్నారు గురువుగారు. ఎంత‌సేపూ త‌న బ‌ల‌హీన‌త గురించి ఆలోచించే ఆ పిల్ల‌వాడు, ఆ బ‌ల‌హీన‌త‌ని సైతం బ‌లంగా ఎలా మార్చుకోవాలో ఇప్పుడు నేర్చుకున్నాడు. ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ ఏదో ఒక బలహీనత ఉంటుంది. కానీ ఒకోసారి దాన్నే తన బలంగా మార్చుకోవడమో లేక ఇతర మార్గాలను అన్వేషంచడమో చేస్తే విజయం తప్పక దక్కుతుంది.  
  కొందరిని చూస్తే ఆశ్చర్యం గా అనిపిస్తుంది. ఎప్పుడు ఆనందం గా వుంటారు, జరిగే పొరపాట్లని హుందాగా ఒప్పుకుంటారు. ఏది కలిసి రాని సమయంలో కూడా నమ్మకంతో వుంటారు. ఇవన్నీ వాళ్ళని ప్రత్యేకం గా నిలబెడతాయి . ఏంటి వాళ్ళ సీక్రెట్ ? అంటే జాన్స్ హోప్ కిన్స్ యూనివర్సిటీ కి చెందిన డాక్టర్ బ్లాకేమన్ ఏం చెబుతున్నారో తెలుసా ? పాజిటివ్ మైండ్ సెట్ ...తో జీవితం లో ఎదురయ్యే ప్రతి సంఘటనని చూడటం . ఆ ఒక్క అలవాటే వారిని అందరి నుంచి ప్రత్యేకం గా నిలబెడుతుంది, అంతే కాదు అలాంటి వారికే అన్ని కలిసివస్తాయి కూడా. ఎందుకంటే వాళ్ళకి ఎదురయ్యే ప్రతిదానిలో ఒక అవకాసం కనిపిస్తుంది .అంటున్నారు ఆయన. మరి అలాంటి మాజిక్ మన జీవితాలలో కూడా జరగాలంటే ? ఆయన చెబుతున్న ఈ కింది వాటిని ఫాలో అవ్వటమే.   లోపలినుంచి మొదలు కావలి .. మన లోపలి నుంచి మనం ఎంత ప్రశాంతం గా, ఉంటామో మనలో ఆందోళన అంత తక్కువ వుంటుంది. అంటే ఆందోళనగా వున్నప్పుడు అప్పటికప్పుడు మనసుని ప్రశాంతం కమ్మని చెబితే మాట వినదు. మొదటి నుంచి దానికి ఆ ప్రశాంత తని  అలవాటు చేయాలి. దానికోసం రోజు ధ్యానం, మెడిటేషన్ వంటి ఆరోగ్యకర అలవాట్లని చేసుకోవాలి. ఒక్క అరగంట అయినా చాలు . ఆ రోజు లో మనకి ఎదురయ్యే ఎన్నో సంఘటనలు ని ఆందోళన పడకుండా దాటగలుగుతాము .ఆందోళన లేనప్పుడు మెదడు చురుకుగా పని చేస్తుంది . సమస్యలు కి పరిష్కారాలు సులువుగా దొరుకుతాయి. అలా ఆడుతూ పాడుతూ వాటిని దాటుతుంటే అందరు వీళ్ళకి అన్ని కలిసివస్తాయి అంటారు. అది కేవలం మీరు ప్రశాంతం గా వుండటం వల్లే సాధ్యమవుతుంది .   ఓ చిన్న మంత్రం ఇది కూడా గడిచి పోతుంది ...ఇదే మంత్రం చాలా మందిని ఎన్నో గడ్డు సమయాలని దాటేలా చేసింది. చేస్తోంది. చాలా సారులు కాలం పరీక్ష పెడుతుంది. ఒకదాని వెనుక ఒకటి మన సహనాన్ని పరీక్షిస్తాయి. అప్పుడే నిటారుగా నిలబడాలి. ఎదురయ్యిన గాలికెరటం మనలని దాటి పోయేదాకా ఎదురు చూడాలి . అది దాటిపోతుందని, మంచి రోజులు ఎదురవుతాయని నమ్మాలి. జీవిత చక్రం లో ఎత్తుపల్లాలు ఎంత సహజమో తెలిసి కూడా క్రుంగి పోవటం లో అర్ధం లేదుకదా   నీకు నీవే శత్రువు కావద్దు ఒక చిన్న పొరపాటు జరిగితే చాలు ..నేనింతే ..అనుకుంటూ నిందించుకోవటం మానేయాలి. ఎదుట వుండే శత్రువుతో పోరాడటం సులువు, కాని మన లోపలి శత్రువు తో పోరాడలేము , గెలవలేము. పొరపాట్లు చేయటం నేరం కాదు. వాటిని ఎలా సరిదిద్దు కోవాలో ఆలోచించాలి .అంతే సగం బాధ తీరిపోతుంది. చాలా సారులు జరిగిన విషయాన్నే తలుచుకు , తలుచుకు బాధ పడుతుంటారు . దానివల్ల ఆత్మ విశ్వాసం తగ్గటం తప్ప వేరే లాభం ఏమి ఉండదు.   చుట్టూ వైఫైలా వుండాలి మంచి ఆలోచనలతో , ఉత్సాహం గా వుండే స్నేహితులని చుట్టూ ఉంచు కుంటే చాలు. చాలావరకు సమస్యలు ఎదురే కావు.. మన స్వబావం మూలం గా మనం కొని తెచ్చు కునే సమస్యలు ఎన్నో వుంటాయి. అవి మన స్నేహితుల వల్ల మన దగ్గరకి రాకుండా వుంటాయి. ఎప్పడు మంచి ఆలోచనలు కలిగి వుండటం ఒక్కటి చాలు ఎన్నో విజయాలు పొందటానికి.   ప్రతి చిన్న విజయం విలువైనదే ప్రతి రోజు చిన్నదో , పెద్దదో ఒక విజయాన్ని అయితే సెలెబ్రేట్ చేసుకోవాలి. నచ్చిన పని చేయటం, ఇష్టమైన పుస్తకం చదవటం, నుంచి పెట్టుకున్న టార్గెట్ రీచ్ అవ్వటం వరకు అన్ని విలువైనవే.ఆ విజయాల్ని మననం చేసిన కొద్ది ఉత్శాహం కలుగుతుంటుంది. దానితో తృప్తి కలుగుతుంది.  
  అనగనగా ఓ రెండు గుర్రాలు ఉండేవి. దేవతా గుర్రాలంటే మాటలా! పాలరాతి తెలుపుతో, నురగలాంటి జూలుతో మహా అందంగా ఉండేవి. వాయువేగంతో ముల్లోకాలూ చుట్టిపారేసేవి. జనం ఆ గుర్రాలను చూసినప్పుడల్లా ముక్కున వేలేసుకునేవారు. అంత అందమైన గుర్రాలను చూడటంతో తమ జన్మ ధన్యమైపోయిందని మురిసిపోయేవారు. కానీ ఆ గుర్రాల మనసులో ఏదో చింత! రెండు గుర్రాలనీ అంతా సమానంగా చూస్తున్నారు. రెండూ అందమైనవే అనీ, రెండూ వేగమైనవే అనీ పొగుడుతున్నారు. ‘అలా జరగడానికి వీల్లేదు! ఈ ప్రపంచంలో అన్ని గుర్రాలకంటే నేనే అందంగా ఉండాలి,’ అన్న ఆలోచన రెండు గుర్రాలలోనూ కలిగింది. అంతే వాటిలో ఒక గుర్రం నిదానంగా దేవుడి దగ్గరకి చేరింది.   ‘భగవంతుడా! నన్ను ఇంత అందంగా అద్భుతంగా సృష్టించినందుకు కృతజ్ఞతలు. దేవతా గుర్రంగా నా జన్మ ధన్యమైపోయింది. కానీ నాదో చిన్న కోరిక,’ అంది ఆ గుర్రం. దాని మనసులో మాట గ్రహించినట్లుగా భగవంతుడు ఓ చిరునవ్వు నవ్వి- ‘నువ్వు దేవతా గుర్రానికి. నీ కోరికని తీర్చాల్సిందే! ఏం కావాలో కోరుకో!’ అన్నాడు. ‘నేను అందంగా ఉన్న మాట నిజమే కానీ ఇంకాస్త అందంగా ఉంటే బాగుండు అన్న దుగ్థ నన్ను తెగ వేధిస్తోంది. ఆలోచించి చూస్తే నాలో చాలా అవకరాలే కనిపిస్తున్నాయి. అవన్నీ సరైపోయి నేను ఇంకా అందంగా ఉండేట్లు ఆశీర్వదించండి స్వామీ!’ అని వేడుకుంది.   ‘ సరే! నీలో నీకు ఏ లక్షణాలు లోపాలుగా కనిపిస్తున్నాయో చెప్పు. అవన్నీ సరిదిద్దుతాను,’ అంటూ అభయమిచ్చాడు భగవంతుడు. దాంతో ఆ గుర్రం తనలో తనకి లోపాలుగా తోచిన లక్షణాలన్నింటినీ ఏకరవు పెట్టడం మొదలుపెట్టింది. ‘ఈ తల చూసారా! మరీ మెడకి అంటుకుపోయినట్లుగా ఉంది. అది ఇంకాస్త పొడవు ఉంటే బాగుంటుంది. ముక్కు కూడా మరీ సన్నగా ఉందేమో అని నా అనుమానం. ఇక కాళ్లు ఇంకాస్త పొడవుంటే భలే ఉంటుంది. దయచేసి ఇవన్నీ సరిదిద్దురూ!’ అంది గుర్రం. ‘తథాస్తు! రేపు ఉదయం నువ్వు లేచి చూసుకునే సరికి ఈ లోపాలేవీ లేని సరికొత్త రూపం నీకు వస్తుంది,’ అన్నాడు భగవంతుడు.   మొదటి గుర్రం సంతోషంగా భగవంతుని దగ్గర సెలవు తీసుకుంది. అది అలా వెళ్లిందో లేదో రెండో గుర్రం భగవంతుడి దగ్గరకు చేరుకుంది. ‘హే భగవాన్‌! ఆ గుర్రం తన అందాన్ని పెంచుకోవాలనే కోరికతోనే నీ దగ్గరకి వచ్చిందని నాకు తెలుసు. ఎలాగైనా ప్రపంచంలోనే గొప్ప గుర్రం అనిపించుకోవాలని దాని తపన. దాని అత్యాశని మీరు అణచాల్సిందే! అది తనలోని అందం మెరుగుపడేందుకు ఏ లక్షణాలనైతే కోరుకొందో... అవి నాలో మరింత ఎక్కువగా ఉండేలా వరం ఇవ్వండి,’ అని వేడుకుంది. ‘అయ్యో అదెంత భాగ్యం! అసలే నువ్వు దేవతా గుర్రానివి. నీ కోరికను తీర్చాల్సిందే! రేపు ఉదయం నువ్వు లేచి చూసుకునేసరికి ఆ లక్షణాలన్నీ నీలో కనిపిస్తాయి. తథాస్తు!’ అంటూ నవ్వాడు భగవంతుడు.   ఆ రాత్రి గుర్రాలకి సరిగా నిద్రపట్టనే లేదు. ఎప్పుడెప్పుడ తెల్లవారుతుందా... నిబిడీకృతమైన తమ అందాన్ని ఎప్పుడెప్పుడు చూసుకుంటామా అన్న ఉద్విగ్నతతో ఆ రాత్రిని గడిపాయి. ఎప్పుడో అర్ధరాత్రి వాటికి మాగన్నుగా నిద్రపట్టింది. తెల్లవారాక చూసుకుంటే ఆ రెండు గుర్రాలకీ తమ కోరిక నెరవేరిన విషయం తెలిసిపోయింది. కాకపోతే... మొదటిగుర్రం కోరుకున్న లక్షణాల కారణంగా అది అచ్చు ఒంటెలా మారిపోయింది. మొదటి గుర్రం కోరుకున్న లక్షణాల మోతాదు తనలో మరింతగా ఉండాలని కోరుకోవడంతో రెండో గుర్రం జిరాఫీలా మారిపోయింది!!!   తమ శరీరాల వంక చూసుకున్న గుర్రాలు రెండూ లబోదిబోమంటూ భగవంతుడి దగ్గరకు పరుగులెత్తాయి. ఆయనను చూస్తూనే ‘ఏమిటీ మాకీ అన్యాయం!’ అంటూ ఆక్రోశించాయి.   ‘మీరు కోరుకున్న వరాన్ని యథాతథంగా తీర్చాను. ఇది అన్యాయం ఎలా అవుతుంది? ఆగమేఘాల మీద పరుగులు తీసే దేవతాశ్వాలు ఎలా ఉండాలో, మిమ్మల్ని అలా పుట్టించాను. కానీ మీకు మీ శరీరం పట్ల కానీ, దానిని అందించిన నా పట్ల కానీ నమ్మకం లేదు. అదే అసలైన అన్యాయం. మీరు నిజంగా నన్ను ఏదన్నా కోరుకోవాలని అనుకుంటే... ఎలాంటి నిస్సత్తువా దరిచేరకుండా బలిష్టంగా ఉండాలనో, కోరుకున్న గమ్యాలని సమర్థంగా చేరుకోవాలనో అడగాల్సింది! కానీ మీరు పైపై మెరుగులకే ప్రాధాన్యతని ఇచ్చారు. ఇక ఫలితం అనుభవించండి. ఇక నుంచీ మీరు దేవతా అశ్వాలు కాదు. ఒకరేమో ఒంటెలాగా ఎడారుల్లో తిరుగుతూ నానా బరువులూ మోయాల్సి ఉంటుంది. మరొకరేమో చిటారుకొమ్మ మీద దొరికే ఆహారంతో తృప్తిపడుతూ అడవులలో కాలం గడపాల్సి వస్తుంది. పోండి!,’ అనేశాడు భగవంతుడు. అదీ విషయం! (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)   - నిర్జర.
మే 23 న ఫలితాలు వెలువడ్డాయి. టీడీపీ కేవలం 23 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకుని ఘోర పరాజయం చవి చూసింది. అయితే టీడీపీకి, 23కి ఏదో తెలియని అవినాభావ సంబంధం ఉందనిపిస్తోంది. విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ కి 2014 లో తొలిసారిగా సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు.. వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకొన్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో  టీడీపీకి 103 , వైసీపీకి 66 , బీజేపీకి 4, ఇద్దరు ఇండిపెండెంట్లు విజయం సాధించారు. ఆ తర్వాత చోటు చేసుకొన్న రాజకీయ పరిణామాల్లో సుమారు 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరారు. ఈ విషయమై వైసీపీ స్పీకర్ కి కూడా ఫిర్యాదు చేసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడంపై వైసీపీ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఇదిలా ఉంటే ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ చేతిలో టీడీపీ ఘోర పరాజయం పాలైంది. టీడీపీ కేవలం 23 ఎమ్మెల్యే స్థానాలకు మాత్రమే పరిమితమైంది. మరో విచిత్రం ఏంటంటే ఎన్నికల ఫలితాలు కూడ మే 23వ తేదీనే వెలువడ్డాయి. అప్పుడు 23 ఎమ్మెల్యే లను చేర్చుకొని టీడీపీ వైసీపీకి షాకిస్తే.. ఇప్పుడు వైసీపీ టీడీపీని కేవలం 23 ఎమ్మెల్యే లకు పరిమితం చేసి అంతకు పదింతలు షాక్ ఇచ్చింది.  
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ జిల్లా గాజువాక మరియు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచి పోటీ చేశారు. అయితే అనూహ్యంగా రెండు చోట్లా పరాజయం పాలయ్యారు. దీంతో జనసేన శ్రేణులు పడుతున్న మనోవేదన అంతా ఇంతా కాదు. పవన్ కనీసం ఒక్క చోటైనా గెలిచి అసెంబ్లీలో అడుగు పెడతారని ఆయన అభిమానులు ఆశపడ్డారు. కానీ వారి ఆశల మీద వైసీపీ ప్రభంజనం నీళ్ళు చల్లింది. అయితే ఇప్పుడు తాజాగా భీమవరానికి సంబంధించి సంచలనం రేపే అంశం ఒకటి జన సైనికులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.గత ఏప్రిల్ 11 న జరిగిన పోలింగ్ లో ఒక్క భీమవరం నుంచి మొత్తం ఒక లక్ష 68 వేల 5 ఓట్లు పోలయ్యాయి అని సాక్షి పేపర్ లోనే వేశారు. కానీ నిన్న సీన్ కట్ చేస్తే మాత్రం అక్కడ ఏకంగా ఒక లక్ష 92 వేల 61 ఓటింగ్ నమోదు అయ్యినట్టు వెల్లడైంది.దీనితో తప్పు ఎక్కడ జరిగిందని పోల్ అయిన ఓట్ల కన్నా ఎక్కువ కౌంటింగ్ రావడం ఏమిటని మళ్ళీ అక్కడ కౌంటింగ్ నిర్వహించాలని జనసేన శ్రేణులు ఎన్నికల సంఘం వారిని డిమాండ్ చేస్తున్నారు.మరి వీరి డిమాండ్ పై ఎన్నికల సంఘం ఎలా స్పందిస్తుందో చూడాలి.  
  ఏపీ ఎన్నికల పోరులో ఘన విజయం సాధించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఈ నెల 30వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఆయన విజయవాడలోనే ప్రమాణ స్వీకారం చేయాలని నిర్ణయించారు. కాగా జగన్ తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆహ్వానించారు. జగన్ ప్రమాణ స్వీకారానికి హాజరవ్వాలని కేసీఆర్ నిర్ణయించారు. గత కొంతకాలంగా కేసీఆర్, జగన్ లు సన్నిహితంగా ఉంటున్నారు. ఏపీలో జగన్ గెలవాలని కేసీఆర్ బలంగా కోరుకున్నారు. అప్పుడే రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలుంటాయన్నారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఏపీలో ఏర్పాటు కానుండటంతో.. కేసీఆర్ తో పాటు తనయుడు కేటీఆర్, కొందరు నేతలు కూడా ప్రమాణస్వీకారానికి హాజరయ్యే అవకాశాలున్నాయి.
కొందరు చేయి పైకెత్తితే చాలు భరించలేని నొప్పితో విలవిల్లాడిపోతారు. మరికొందరు నాలుగడుగులు వేయగానే నడుము నొప్పంటూ కూర్చుండిపోతారు. ఇక మోకాలి నొప్పి సంగతైతే చెప్పనే అక్కర్లేదు. అది ఇంటింటి బాధగా మారిపోయింది. అందరు మనుషుల్లోనూ ఒకే తీరున ఈ బాధలు ఎందుకు కనిపిస్తున్నాయి? మనిషి పరిణామక్రమానికీ, ఈ నొప్పులకీ మధ్య సంబంధం ఏమన్నా ఉందా? అన్న అనుమానం వచ్చింది ఆక్స్‌ఫర్డుకి చెందిన పరిశోధకులకి. దాంతో ఆ నొప్పుల వెనుక ఉన్న రహస్యం కాస్తా బయటపడిపోయింది.   నాలుగు నుంచి రెండుకి మనిషి కూడా మొదటి మిగతా జంతువులగానే నాలుగుకాళ్ల మీదే నడిచేవాడన్న విషయం తెలిసిందే! క్రమేపీ రెండుకాళ్ల మీద నిలబడటంతో అతని మేధస్సు కూడా పరుగులెత్తడం మొదలుపెట్టింది. ఇలా రెండు కాళ్ల మీద నడిచే క్రమంలో అతని కీళ్ల మధ్య కొన్ని కీలకమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ఆ మార్పులను తెలుసుకునేందుకు పరిశోధకులు దాదాపు 300 అస్థిపంజరాలను గమనించారు. వీటిలో 40 కోట్ల సంవత్సరాల నాటి మనుషుల ఎముకలు కూడా ఉన్నాయి. వాషింగ్టన్‌లోని స్మిత్‌సోనియన్‌ సంస్థ సేకరించిన ఈ పురాతన ఎముకలకి సంబంధించిన స్కాన్లను పరిశీలించి ఆనాటికీ, ఈనాటికీ మన ఎముకల తీరులో వచ్చిన మార్పులను పోల్చి చూశారు.   బోలెడు మార్పులు మనిషి నిలబడి నడిచేటప్పుడు మరింత బరువుని మోసేందుకు వీలుగా, అతని తుంటి ఎముక దిగువ భాగం కాస్త వెడల్పుగా మారిందట. దీని వలన అది త్వరగా అరిగిపోయే ప్రమాదం ఉందని తేలింది. ఆ కారణంగానే మనలో ఆర్థ్రైటిస్ సమస్యలు తలెత్తుతున్నాయట. ఇక భుజం కీలు దగ్గరేమో దీనికి విరుద్ధమైన మార్పు కనిపించింది. నడిచేటప్పుడు భుజాల మీద భారం తగ్గడం వల్లనో ఏమో... అక్కడి కీలు ఎముక మధ్య ఉన్న ఖాళీ తగ్గిందని తేలింది. దీని వల్ల ఆ ప్రదేశంలో ఉండే రక్తనాళాలు, కండరాలు నొక్కుకుపోతున్నాయని గమనించారు. చేతిని పైకెత్తగానే ఒక్కసారిగా భుజం కండరాలు విలవిల్లాడిపోవడానికి కారణం ఇదే కావచ్చు. మనుషుల మోకాళ్లు త్వరగా అరిగిపోవడానికి కూడా పరిణామక్రమంలో వచ్చిన ఈ మార్పులే కారణమని బయటపడింది.   ఆరంభం మాత్రమే అసలే పరిణామక్రమంతో మన శరీరంలో కొన్ని లోపాలు చోటు చేసుకున్నాయని బాధపడుతుంటే... ఇది మున్ముందు మరింత తీవ్రం కానుందని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు. ఈ మార్పులు ఇలాగే కొనసాగితే మరో 4000 ఏళ్ల తరువాత మోకాలు, తుంటి, భుజానికి సంబంధించి మరిన్ని సమస్యలు ఉత్పన్నం అవుతాయని హెచ్చరిస్తున్నారు. అయితే తగినంత వ్యాయామం చేయడం, నిటారుగా నడవటం వంటి జాగ్రత్తలు పాటిస్తే ఈ లోపాలను కొంతవరకు ఎదుర్కోవచ్చునని సూచిస్తున్నారు.   - నిర్జర.
  నువ్వులు మనకి కొత్తేమీ కాదు. శ్రాద్ధ కర్మలలో నువ్వులను వాడటం చూస్తే, వేల సంవత్సరాల నుంచే భారతీయులు దీనిని పండిస్తూ ఉండేవారని అర్థమైపోతుంది. ఇప్పటికీ నువ్వుల పంటలో మన దేశానిది అగ్రస్థానమే!   - హైందవ ఆచారాలలో నువ్వులది సుస్థిరమైన స్థానం. నరక చతుర్దశి, సంక్రాంతి సమయాలలో చేసుకునే పిండివంటలలో నువ్వులు తప్పకుండా ఉండాలంటారు. నువ్వులలో పోషక పదార్థాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వాటిని తినడం వల్ల శరీరంలో శరీరంలో తగినంత వేడి కలుగుతుందనే ఈ సూచన.   - కనీసం నెలకి రెండుసార్లయినా నువ్వుల నూనెతో తైలాభ్యంగనం చేయాలని చెబుతుంటారు. నువ్వుల నూనెని ఒంటికి పట్టించి, మర్దనా చేసి.... అది ఆరిన తరువాత స్నానం చేయడమే ఈ తైలాభ్యంగనం. మిగతా నూనెలతో పోల్చుకుంటే, నువ్వుల నూనె సాంద్రత చాలా ఎక్కువ. కాబట్టి ఒంటికి పట్టిన మట్టి, మకిలిని తొలగించి స్వేదరంథ్రాలను శుభ్రం చేయగలదు. ఇక నువ్వుల నూనెలో ఉండే విటమిన్ ఇ, కెలు అటు చర్మాన్నీ, ఇటు కేశాలనీ కూడా ఆరోగ్యవంతంగా ఉంచుతాయి.   - మన దీపారాధనలో కూడా నువ్వులనూనెదే ప్రథమ ఎంపిక. ఎక్కువ కాంతిని ఇస్తాయనీ, ఎక్కువసేపు వెలుగుతాయనీ నువ్వుల నూనెతో దీపాలను వెలిగిస్తారు. నువ్వుల నూనెతో వెలిగించిన దీపాలతో చుట్టుపక్కల వాతావరణంలో ఉన్న సూక్ష్మక్రిములు సైతం నశించిపోతాయట.   - నోటి పూత, నోరు పొడిబారిపోవడం వంటి సమస్యలు ఉన్నప్పుడు నువ్వుల నూనెను కాసేపు పుక్కిలించమని ఆయుర్వేదంలో చెబుతారు. ఇదే తరువాత కాలంలో ఆయిల్ పుల్లింగ్ అనే ప్రక్రియకు దారితీసింది.   - నువ్వులలో తగినంత జింక్, కాల్షియం ఉంటాయి. ఈ రెండు పోషకాలూ ఎముకలను దృఢంగా ఉంచుతాయని తెలిసిందే! ముఖ్యంగా పిల్లలలో సరైన ఎదుగుదల ఉండేందుకు నువ్వులు ఉపయోగపడతాయి. ఇక స్త్రీలు ఆస్టియోపొరోసిస్ వంటి ఎముకల సమస్యలు ఎదుర్కోకుండా ఉండేందుకు అప్పుడప్పుడూ నువ్వులు తీసుకోవాలని సూచిస్తున్నారు.   - నువ్వులలో అరుదైన Phytosterols అనే రసాయనం ఉంటుంది. దీని వలన రక్తంలోని కొవ్వు శాతం తగ్గుతుందనీ, రోగనిరోధక శక్తి పెరుగుతుందనీ, కొన్ని రకాల కేన్సర్లను సైతం అడ్డుకొంటుందనీ పరిశోధనల్లో రుజువైంది.   - నువ్వులలో పీచు పదార్థాలు అధికంగా ఉంటాయి. ఆహారం త్వరగా జీర్ణం అయ్యేందుకు, పేగులలో తగిన కదలికలు ఉండేందుకు ఈ పీచు పదార్థాలు ఉపయోగపడతాయి. తద్వారా జీర్ణసంబంధమైన వ్యాధులెన్నింటిలోనో నువ్వులు ఉపశమనాన్ని కలిగిస్తాయి.   - నువ్వులు యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉంటాయి. పైగా గుండె ధమనులలో పేరుకుపోయే కొవ్వుని తొలగించడంలో కూడా గొప్ప ప్రభావం చూపుతాయి. నువ్వులలో ఉండే మెగ్నీషియం రక్తపోటుని అదుపులో ఉంచుతుంది. ఈ కారణాలన్నింటి వల్లా గుండె ఆరోగ్యానికి నువ్వులు దివ్యౌషధం అని చెప్పవచ్చు.   ఇంతేకాదు! సహజసిద్ధమైన సన్స్క్రీన్లాగా, కాలి పగుళ్లకు నివారణగా, కంటిచూపుని మెరుగుపరిచేదిగా, ఒత్తిడిని తగ్గించే మందుగా, ఊపిరితిత్తుల సమస్యలకి ఔషధంగా, రక్తహీనతని ఎదుర్కొనే ఆయుధంగా... నువ్వులు అనేకరకాలుగా లాభిస్తాయి. ఇక ఆహారపదార్థాలకు రుచి అందించడంలో నువ్వుల పాత్ర గురించి చెప్పనే అక్కర్లేదు. అందుకే ఫాస్ట్ఫుడ్స్లో సైతం నువ్వులను విపరీతంగా వాడతారు. మెక్సికోలో ఉత్పత్తి అయ్యే నువ్వులలో 75 శాతం నువ్వులను మెక్డొనాల్డ్స్ సంస్థ తన ఉత్పత్తుల కోసం ఖరీదు చేస్తుందంటే ఆశ్చర్యం కలగక మానదు. ఇంత ప్రశస్తమైనది కాబట్టే నువ్వుల నుంచి నూనె తీసిన తరువాత ఆ తెలకపిండిని కూడా మనవారు పశువులకు ఆహారంగా పెడుతూ ఉంటారు. - నిర్జర.  
  ఆకుకూరల్లో ఘుమఘుమలాడేది ఏది అంటే వెంటనే వచ్చే సమాదానం పుదీనా. నిజమే కదా ఏ వంటకానికైనా మంచి రుచిని వాసనను తీసుకురావాలంటే ఖచ్చితంగా పుదీనాను వాడాల్సిందే. అందులో ఎండాకాలం ఎండల నుంచి ఉపశమనం కావాలనుకుంటే క్రమం తప్పకుండా పుదీనాను వాడతారు చాలామంది. దీనిని కేవలం వంటకాలకి మాత్రమే దీనిని ఉపయోగిస్తారు అనుకోకండి. వైద్యపరంగా కూడా పుదీనాకి మంచి గుర్తింపే ఉంది. ముఖ్యంగా ప్రాకృతిక వైద్యం, ఆయుర్వేదం మొదలైనవాటిలో దీనిని బాగా ఉపయోగిస్తారు. ఈ పుదీనా రక్తప్రసరణని క్రమబద్దీకరించటమే కాకుండా జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది. గొంతు నొప్పికి, కడుపులో మంటకి ఇదొక మంచి మందు. పుదీనాతో ఎన్ని ఉపయోగాలున్నాయో చూద్దామా.     జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయాలంటే పుదీనాను క్రమం తప్పకుండా వాడితే మంచిదని వెైద్యులు చెబుతున్నారు. పుదీనా ఆకుల రసంలో అల్లంరసం, కలబంద గుజ్జు, ఏలకు లు, దాల్చిన చెక్క కలిపి నూరి ప్రతి రోజూ  2-3 చెంచాలు సేవిస్తూవుంటే అరుగుదల పెరుగుతుంది. జీర్ణకోశ వ్యాధులకి, కడుపు నొప్పికి, పుదీనా గింజలు కొన్ని నమిలిన  తరువాత ఒక గ్లాసుడు వేడినీళ్ళు తాగితే ఎంతో ఉపశమనం కలుగుతుంది.     పుదీనా కషాయం ఎలాంటి జ్వరాన్నైనా తగ్గిస్తుంది. అంతేకాదు ఈ కషాయం వల్ల కామెర్లు, ఛాతిమంట, కడుపులో మంట, మూత్ర సంబంధవ్యాధులు కూడా తగ్గుముఖం పడతాయి.   పుదీనా, మిరియాలు, ఇంగువ, ఉప్పు, జీలకర్ర, ఎండుద్రాక్ష, ఖర్జూరాలు కలిపి మొత్తం నూరుకుని లేహ్యంలా సేవిస్తే ఉదరసంబందిత వ్యాధులు నివారణ అవుతాయి. ఆకలి ఎక్కువగా లేని వారు, పుల్లత్రేనుపులతో బాధపడేవారు, కడుపులో గ్యాస్ పేరుకుపోయి ఇబ్బంది పడేవారు కూడా ఈ లేహ్యాన్ని తినవచ్చు. ఫలితాన్ని మీరే స్వయంగా చూడచ్చు.   ప్రెగ్నెన్సీ మొదటి రోజుల్లో కొంతమంది వాంతులతో బాధపడుతూ ఉంటారు అలాంటివారు చెంచాడు పుదీనా రసంలో అదే కొలతలో నిమ్మరసం, తేనే కలుపుకుని ఆరారా తాగుతూ ఉంటే వాంతులు తగ్గుతాయి. వికారం కూడా రాకుండా ఉంటుంది.    నిద్రలేమితో బాధపడేవారు రాత్రి పడుకోవటానికి ముందు ఈ ఆకుల్ని ఒక గ్లాసుడు నీళ్ళల్లో వేసి మూతపెట్టి అరగంట తర్వాత తాగితే మంచి నిద్ర పడుతుంది. మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది.   అరికాళ్ల మంటలకు పుదీనా ఆకులను మొత్తగా రుబ్బి పేస్టులా చేసుకుని ఫ్రిజ్‌లో కాసేపు ఉంచిన తరువాత బయటకు తీసి చల్లగా ఉన్నప్పుడు అరికాళ్లకు రాస్తూ ఉంటే మంటలు క్రమంగా తగ్గుముఖం పడతాయి.   పుదీనా ఆకుల్ని ఎండబెట్టి దానిని టీ పొడిలో కలిపి టీ చేసుకుని తాగితే గొంతునొప్పి తాగటమే కాకుండా గొంతులో మాధుర్యం కూడా పెరుగుతుంది.   చెవి, ముక్కుల్లో ఏర్పడే ఇన్‌ఫెక్షన్‌కి తాజా పుదీనా ఆకులు కొన్ని చేతితో రసంలా తీసి ఆ రసంలో దూదిని  ముంచి ఆ డ్రాప్స్ చెవిలో, ముక్కులో ఆరారా  వేస్తూ ఉంటే ఇన్ఫెక్షన్ క్రమంగా తగ్గిపోతుంది.   నోటి దుర్వాసనకి కూడా ఇది మంచి మందు. నోరు వాసన వచ్చేవారు పుదీనా ఆకుల్ని ఎండబెట్టి పొడిచేసి అందులో కాస్త ఉప్పు వేసుకుని ఆ పొడితో రోజూ పళ్ళు తోముకుంటే నోటి దుర్వాసన మాయం అవ్వటమే కాదు చిగుళ్ళు కూడా గట్టిపడతాయి.   ఎండాకాలంలో మజ్జిగలో పుదీనా ఆకులు వేసుకుని తాగితే చాలా చలవ చేస్తుంది. నిమ్మరసంలో పుదీనా కలుపుకుని తాగితే దాహం కూడా తీరుతుంది. వేసవికాలానికి పుదీనా ఒక మంచి నేస్తంలాంటిది.   ఈ రోజుల్లో ప్రతి వస్తువులోనూ పుదీనాని కలుపుతున్నారు. సబ్బులలో, పేస్టులలో, పేస్ క్రీమ్స్ లో, ఆఖరికి ఈ మధ్య సిగరెట్ తయారీలో కూడా పుదీనాని వాడుతున్నారు. ఈ పుదీనా సిగరెట్ వల్ల గొంతు నొప్పులు అలాగే గొంతు కాన్సర్ వచ్చే అవకాశాలు కూడా చాలా మటుకు తగ్గుతాయట. ఇన్ని ఉపయోగాలున్న పుదీనా ని మనం నిర్లక్షం చెయ్యకుండా క్రమం తప్పకుండా వాడదామా. ...కళ్యాణి
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.