బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్.. సెలబ్రిటీల ఆస్తులు అటాచ్

 

ఇటీవల బెట్టింగ్ యాప్స్‌తో కోట్ల రూపాయలు కాజేస్తున్నారు కొంతమంది కేటుగాళ్లు. ఇందుకోసం కొంతమంది సెలబ్రెటీలను ప్రమోషన్లకు వాడుకుంటున్నారు. బెట్టింగ్ యాప్స్ కోసం సెలబ్రెటీలు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇటీవల బెట్టింగ్ యాప్స్ కోసం ప్రమోషన్ చేసిన వారిపై ఈడీ కొరడాఝులిపిస్తుంది. 

ఆన్‌లైన్ బెట్టింగ్, మనీ లాండరింగ్ నిరోధక చట్టం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అధికారులు దూకుడు పెంచారు. పీఎంఎల్ ఏ కేసులో ప్రముఖల ఆస్తులను అటాచ్ చేశారు. ఇప్పటికే నటులు సోనూసూద్‌, నేహాశర్మ ఆస్తులు అటాచ్‌ చేసిన ఈడీ, తాజాగా మాజీ క్రికెటర్లు యువరాజ్‌ సింగ్‌, రాబిన్ ఊతప్ప, టీఎంసీ మాజీ ఎంపీ మిమీ చక్రవర్తి, నటి ఊర్వశి రౌతేలా తల్లి ఆస్తులు సైతం అటాచ్ చేశారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu