.webp)
జనవరిలో పెద్ద సినిమాల సందడి బాగానే ఉంది కానీ, ఫిబ్రవరిలో ఎక్కువగా చిన్న, మీడియం రేంజ్ సినిమాలే తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. ఈ వారంలో విడుదలవుతున్న సినిమాల్లో శ్రీవిష్ణు 'విష్ణు విన్యాసం' ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది.
విష్ణు విన్యాసం:
శ్రీవిష్ణు హీరోగా నటించే ఎంటర్టైనర్స్ కి యూత్ లో మంచి క్రేజ్ ఉంది. 'సామజవరగమన', 'సింగిల్' సినిమాల తరహాలో 'విష్ణు విన్యాసం' పేరుతో మరో మంచి ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. మారుతీరావు దర్శకత్వంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ నిర్మించిన ఈ రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ ఫిబ్రవరి 27న విడుదలవుతోంది. ప్రచార చిత్రాలు ఆకట్టుకున్నాయి. కామెడీ వర్కౌట్ అయితే శ్రీవిష్ణు ఖాతాలో మరో విజయం పడినట్లే. (Vishnu Vinyasam)
ఉత్తుత్త హీరోలు:
'ఫన్ బకెట్'తో నటుడిగా ప్రయాణం మొదలుపెట్టి, సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి కమెడియన్ గా మంచి గుర్తింపు పొందిన మహేష్ విట్టా.. ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. 'ఉత్తుత్త హీరోలు' అనే సినిమాలో హీరోగా నటించాడు. హర్ష కొడాలి దర్శకత్వం వహించిన ఈ కామెడీ సినిమాకి మహేష్ విట్టానే నిర్మాత కావడం విశేషం. ఫిబ్రవరి 27న థియేటర్లలో అడుగుపెడుతోంది. (Uttutta Herolu)
సన్ ఆఫ్:
వినోద్ కుమార్, సాయి సింహాద్రి ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం 'సన్ ఆఫ్'. బాధ్యత లేని కొడుక్కి జీవితం విలువ, బంధం విలువ తెలియజేసిన తండ్రి కథగా ఇది తెరకెక్కింది. బత్తుల సతీష్ దర్శకుడు. సాయి సింహాద్రి నిర్మించిన ఈ ఫ్యామిలీ డ్రామా ఫిబ్రవరి 27న రిలీజ్ అవుతోంది. (Son Of Movie)
ది కేరళ స్టోరీ-2:
2023లో వివాదాల నడుమ విడుదలై, వరల్డ్ వైడ్ గా రూ.300 కోట్ల గ్రాస్ తో 'ది కేరళ స్టోరీ' అనూహ్య విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ ఫిబ్రవరి 27న 'ది కేరళ స్టోరీ-2' వస్తోంది. ఈసారి కూడా బాక్సాఫీస్ దగ్గర అలాంటి మ్యాజిక్ రిపీట్ అవుతుందేమో చూడాలి. (The Kerala Story 2)
అతడు రీ రిలీజ్:
ఈ వారం రీ రిలీజ్ సందడి కూడా ఉంది. మహేష్ బాబు, త్రివిక్రమ్ కలయికలో వచ్చిన తొలి చిత్రం 'అతడు' ఫిబ్రవరి 28న విడుదలవుతోంది. ఇది సెకండ్ రీ రిలీజ్ అయినప్పటికీ అడ్వాన్స్ బుకింగ్స్ అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. (Athadu Re Release)
ఓటీటీ:
ఓటీటీలోనూ పలు సినిమాలు, సిరీస్ లు ప్రేక్షకులను అలరించనున్నాయి. రాజీవ్ కనకాల ప్రధాన పాత్ర పోషించిన 'డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు' అనే వెబ్ సిరీస్ ఫిబ్రవరి 27 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. అలాగే శ్రీ చిదంబరం గారు, హనీ వంటి సినిమాలు ఓటీటీ ఎంట్రీ ఇస్తున్నాయి.
అమెజాన్ ప్రైమ్ వీడియో:
ది బ్లఫ్ మూవీ - ఫిబ్రవరి 25
ఇక్కీస్ మూవీ - ఫిబ్రవరి 26
హనీ మూవీ - ఫిబ్రవరి 27
ఈటీవీ విన్:
శ్రీ చిదంబరం గారు మూవీ - ఫిబ్రవరి 26
జీ5:
డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు(D/o Prasad Rao) వెబ్ సిరీస్ - ఫిబ్రవరి 27
తడయం వెబ్ సిరీస్ - ఫిబ్రవరి 27
సన్ నెక్స్ట్:
హనీ మూవీ - ఫిబ్రవరి 27
ఆహా:
హాట్ స్పాట్ 2 మచ్ మూవీ - ఫిబ్రవరి 27
నెట్ ఫ్లిక్స్:
అక్యూజ్డ్ మూవీ - ఫిబ్రవరి 27
జియో హాట్ స్టార్:
సీక్రెట్ స్టోరీస్: రోస్లిన్ వెబ్ సిరీస్ - ఫిబ్రవరి 27
Also Read: నందమూరి ఫ్యాన్స్ కి బిగ్ న్యూస్.. మోక్షజ్ఞ డెబ్యూపై క్లారిటీ వచ్చేసింది!








