
-కింగ్ ప్రస్తుతం 100 వ చిత్రంతో బిజీ
-అంత బిజీ లోను ఇండియన్ సినిమాకి సేవలు
-ఆ సేవలేంటి!
కింగ్ నాగార్జున(Nagarjuna)సినీ జర్నీ గురించి చెప్పడం స్టార్ట్ చేస్తే అభిమానులు, ప్రేక్షకులే తమ ముఖంపై చిరునవ్వుని ప్రదరిస్తూ 'రెండు దశాబ్దాల క్రితమే తెలుగు సినిమాకి పాన్ ఇండియా ఇమేజ్ ని అలిమిన హీరో. మాస్, క్లాస్, ఎంటర్ టైన్ మెంట్, భక్తి రస చిత్రాల్లో చేసి మెప్పించిన ఏకైక హీరో అని ఏ మాత్రం తడబాటు లేకుండా చెప్తారు. రికార్డ్స్ గురించి కూడా చెప్పేంత అనుంబంధం మాకు, నాగార్జున మధ్య ఉంది. తాజా వార్త ఏమైనా ఉంటే చెప్పమని అంటారు. మరి వాళ్ళ కోసం కొత్త న్యూస్.. డీటెయిల్స్ చూద్దాం.
తెలుగు సినిమాని ప్రపంచ సినిమాతో పోటీగా నిలబడేలా చేయడానికి నాగార్జున తన వంతు కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే అన్నపూర్ణ స్టూడియోలో రీసెంట్ గా మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ విషయంపై నాగార్జున మాట్లాడుతు ప్రపంచ స్థాయి కథలని చెప్పాలనుకునే భారతీయ దర్శకుల కలలకి అత్యాధునిక వసతులు అరకొర గా ఉండేవి. ఇప్పుడు మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ తో హైదరాబాద్ లోనే ఆ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. దీంతో ఎపిక్ అడ్వెంచర్ నుంచి సైన్సు ఫిక్షన్ డ్రామా వరకు ఎన్నో కథల్ని సులభంగా తెరకెక్కించవచ్చు అవతార్, అవెంజర్స్ వంటి హాలీవుడ్ సినిమాల మేకింగ్ లో మోషన్ క్యాప్షన్ టెక్నాలజీ ని ఉపయోగించారని నాగార్జున చెప్పుకొచ్చాడు.
also read: Chiranjeevi: చిరంజీవితో ఇలాంటి సినిమానా? అది కామెడీ కాదంటున్న సీనియర్ రైటర్
నాగార్జున ప్రస్తుతం తన 100 వ చిత్రాన్ని శరవేగంగా పూర్తి చేసి అభిమానులు, ప్రేక్షకుల్లో ఒక మెమొరీబుల్ మూవీగా నిలిచిపోయేలా చేయాలనే పట్టుదలతో ఉన్నాడు. యాక్షన్ ఫ్యామిలీ డ్రామా గా తెరకెక్కుతుండగా రా కార్తీక్ దర్శకుడు. తన నట వారసులు నాగ చైతన్య, అఖిల్ కూడా కనిపించబోతున్నారనేది టాక్.







.webp)

