
- ఎన్ని ఏళ్లు అయినా 'అతడు'కి తగ్గని క్రేజ్
- సెకండ్ రీ రిలీజ్ బుకింగ్స్ కి అదిరిపోయే రెస్పాన్స్
- ఖలేజా రికార్డు బ్రేక్ అవుతుందా?
- మహేష్ ఫ్యాన్స్ కోరిక నెరవేరుతుందా?
కొన్ని సినిమాలు ఎన్నిసార్లు చూసినా బోర్ అనిపించదు. మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. అలాంటి అరుదైన సినిమాలలో 'అతడు'(Athadu) ముందు వరుసలో ఉంటుంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్(Trivikram) కాంబినేషన్ లో వచ్చిన మొదటి చిత్రమిది. జయభేరి ఆర్ట్స్ నిర్మించిన 'అతడు' మూవీ.. 2005 ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
'అతడు'తో ప్రేమలో పడని తెలుగు సినీ ప్రియుడు లేడంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా బుల్లితెరపై ఈ చిత్రం సృష్టించిన సంచలనాలు అన్నీఇన్నీ కావు. అత్యధిక సార్లు టెలికాస్ట్ అయిన సినిమాగానూ రికార్డు క్రియేట్ చేసింది.

'అతడు' సినిమా మహేష్ బాబు 50వ పుట్టినరోజు సందర్భంగా 2025 ఆగస్టు 9న మొదటిసారి రీ-రిలీజ్ అయింది. అప్పుడు వరల్డ్ వైడ్ గా రూ.7 కోట్ల గ్రాస్ రాబట్టింది. (Athadu Re Release)
రీ-రిలీజ్ లో ఏడు కోట్లు రాబట్టడం అనేది మంచి కలెక్షన్స్ కిందే లెక్క. అయితే అక్కడుంది 'అతడు' కాబట్టి.. ఆ లెక్క సరిపోలేదు. ఇంకా ఎక్కువ వసూళ్లు రాబడుతుందని అభిమానులు ఆశించారు.
తెలుగు సినిమాల్లో రీ-రిలీజ్ పరంగా రూ.10 కోట్లకు పైగా గ్రాస్ తో 'ఖలేజా' టాప్ లో ఉంది. అది కూడా మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమానే కావడం విశేషం.
'ఖలేజా' రికార్డును 'అతడు' బ్రేక్ చేస్తుంది అనుకుంటే అది సాధ్యం కాలేదు. అయితే ఇప్పుడు సెకండ్ రీ-రిలీజ్ లో ఆ రికార్డు బ్రేక్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.
ఈ ఫిబ్రవరి 28న 'అతడు' సెకండ్ రీ-రిలీజ్ కి రెడీ అయింది. ఇప్పటికే బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ప్రస్తుతం తక్కువ థియేటర్లలోనే బుకింగ్స్ ఓపెన్ అయినప్పటికీ.. అప్పుడే బుక్ మై షోలో ట్రెండింగ్ లోకి రావడం విశేషం. ఇక పూర్తిస్థాయిలో బుకింగ్స్ ఓపెన్ అయితే.. ఏ రేంజ్ రెస్పాన్స్ వస్తుందో ఊహించుకోవచ్చు.
ప్రస్తుతం థియేటర్లలో పెద్ద సినిమాల తాకిడి లేకపోవడం.. అతడు సినిమాని మళ్ళీ మళ్ళీ చూడటానికి అభిమానులు, ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తుండంతో సెకండ్ రీ-రిలీజ్ లోనూ బుకింగ్స్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇదే జోరు కొనసాగితే.. ఫస్ట్ రీ-రిలీజ్ ని మించిన వసూళ్లు రాబట్టినా ఆశ్చర్యం లేదు.
Also Read: 24 ఏళ్ళ క్రితం బండ్ల గణేష్ హీరోగా భారీ సినిమా.. ఎందుకు ఆగిపోయింది?






.webp)

