TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

political-news-img

నేపాల్‌ వరదల్లో 140 మంది తెలుగు యాత్రికులు గల్లంతు..?

నేపాల్‌లో సంభవించిన ఆకస్మిక వరదలు తెలుగు రాష్ట్రాలకు చెందిన యాత్రికుల కుటుంబాల్లో తీవ్ర ఆందోళనకు కారణమయ్యాయి. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ట్రావెల్‌ ఏజెన్సీ ద్వారా కైలాస మానసరోవర్‌, నేపాల్‌ విహారయాత్రకు వెళ్లిన 156 మంది తెలుగు యాత్రికుల్లో 140 మంది ఆచూకీపై ప్రస్తుతం స్పష్టత లేకపోవ డం ఉత్కంఠకు దారితీ సింది. మొత్తం 156 మంది యాత్రికులు హైదరాబాద్ నుండి నేపాల్‌ పర్యటనకు వెళ్లారు. వీరిలో 16 మంది అనారోగ్యం కారణంగా తాము బస చేసిన గదుల్లోనే ఉండిపోయారు. మిగిలిన 140 మంది యాత్రలో భాగంగా బయ టకు వెళ్లిన సమయంలో నేపాల్‌–టిబెట్‌ సరిహద్దు పరివాహక ప్రాంతంలో ఆకస్మికంగా భారీ వరదలు సంభవించాయి.నేపాల్‌–టిబెట్‌ సరిహద్దు ప్రాంతం లోని భోటెకోషి, త్రిశూలి నదుల్లో ఒక్కసారిగా వరద ప్రవాహం పెరిగింది.భారీగా వచ్చిన వరదల కారణంగా పలు రహదారులు, వంతెనలు కొట్టుకుపోయాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడ టంతో పాటు కమ్యూనికే షన్‌ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. దీంతో బయటకు వెళ్లిన 140 మంది యాత్రి కులతో సంబంధాలు తెగిపోయాయి. వారి మొబైల్‌ ఫోన్లకు కుటుంబ సభ్యులు, నిర్వాహకులు సంప్రదించేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ సమా చారం అందకపోవడంతో ఆందోళన మరింత పెరిగింది. అనారోగ్యం కారణంగా గదుల్లోనే ఉండిపోయిన 16 మంది యాత్రి కులు ప్రస్తుతం సురక్షిత ప్రాంతంలో ఉన్నట్లు సమాచారం అందింది. అయితే పర్యటన కోసం బయటకు వెళ్లిన 140 మంది యాత్రికులు ఎక్కడ ఉన్నారు? అనే దానిపై అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది. యాత్రి కుల ఆచూకీ కోసం భారత రాయబార కార్యాలయం (ఇండియన్‌ ఎంబసీ), నేపాల్‌ భద్రతా బలగాలు రంగంలోకి దిగి హెలికాప్టర్ల ద్వారా వరద ప్రభావిత ప్రాంతాల్లో గాలింపు, సహా యక చర్యలు చేపడుతు న్నారు. వరదలోచిక్కుకుపో యిన వారిని గుర్తించి సుర క్షిత ప్రాంతాలకుతరలించేం దుకు ప్రయత్నాలు కొన సాగుతున్నాయి. యాత్రి కుల కుటుంబ సభ్యులు ఆందోళన చెందవద్దని, అధికారుల నుంచి వచ్చే సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని సూచనలు అందుతున్నాయి. అత్య వసర సహాయం కోసం నేపాల్‌లోని భారత రాయబార కార్యాలయం/సంబంధిత హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని అధికా రులు సూచిస్తున్నారు. నేపాల్‌లో చిక్కుకున్న తెలంగాణ వాసులకు ఢిల్లీ తెలంగాణ భవన్‌లో హెల్ప్‌లైన్ సెంటర్‌ ఏర్పాటు చేశారు.హెల్ప్‌లైన్‌ నెంబర్లు 9871999044, 9949351270 హెల్ప్‌లైన్‌ నెంబర్ 9618597969 లకు సంప్రదించవచ్చునని అధికారులు వెల్లడించారు. గల్లంతైన140మంది కుటుంబ సభ్యులు వారు సురక్షితంగా ఉన్నారనే వార్త వినడం కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు... Nepal Floods, Nepal Tibet Border Flash Flood, Nepal Army Rescue Operations, Telugu pilgrims, Hyderabad Pilgrims, Kailash Mansarovar Yatra, Stranded Indian Tourists, Telugu news, Telugu one

Published on: Thu Aug 27, 2026 11:31AM

political-news-img

నేపాల్‌లో భయంకర జలవిలయం.. రంగంలోకి భారత సాయం..!

పొరుగు దేశమైన నేపాల్‌లో ఆకస్మికంగా వచ్చిన భారీ వరదలు తీవ్ర ముప్పును తెచ్చిపెట్టాయి. ఒక్కసారిగా నదులు ఉప్పొంగి ప్రవహించడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ విపత్తులో వందలాది మంది పర్యాటకులు చిక్కుకుపోవడం తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. రసువా పరిధిలోని భోటే కోశీ నది పరివాహక ప్రాంతంలో అకస్మాత్తుగా విరుచుకుపడిన ప్రవాహం ఆస్తి, ప్రాణ నష్టానికి దారితీసింది. పర్యాటక ప్రాంతాల్లో రద్దీగా ఉన్న సమయంలో వరదలు రావడంతో ఊహించని విధంగా భారీ సంఖ్యలో ప్రజలు చిక్కుకుపోయారు. ఈ ప్రకృతి విపత్తుపై ప్రధాని మోదీ తక్షణమే స్పందించారు. నేపాల్ ప్రధానమంత్రి బాలేంద్ర షాతో ఆయన ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. బాధితులకు భారత ప్రభుత్వం తరఫున సానుభూతి తెలిపారు. కష్టకాలంలో నేపాల్‌కు అవసరమైన అన్ని రకాల మానవతా సాయాన్ని, రెస్క్యూ మద్దతును అందించడానికి భారత్ సిద్ధంగా ఉందని మోదీ హామీ ఇచ్చారు. నేపాల్ సోదర సోదరీమణులకు భారత్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. నేపాల్ టూరిజం బోర్డు అందించిన ప్రాథమిక వివరాల ప్రకారం, ఈ వరద ధాటికి సుమారు 384 మంది పర్యాటకులు గల్లంతయ్యారు. ఇందులో 105 మంది భారతీయ పౌరులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మిగిలిన వారిలో నేపాల్ వాసులతో పాటు యూకే, అమెరికా, ఆస్ట్రేలియా తదితర దేశాలకు చెందిన పర్యాటకులు ఉన్నారు. స్థానిక యంత్రాంగం, నేపాల్ సైనిక బృందాలు బాధితుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ఇప్పటికే కొందరు ప్రాణాలు కోల్పోయినట్లు నిర్ధారణ కాగా, మిగిలిన వారిని సురక్షితంగా బయటకు తీసుకురావడానికి సహాయక చర్యలు వేగవంతం చేశారు. బాధితుల కుటుంబ సభ్యులు, పర్యాటకుల సమాచారం కోసం అధికారులు ప్రత్యేక ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ నంబర్లను అందుబాటులోకి తెచ్చారు. విపత్తు తీవ్రత దృష్ట్యా ప్రవాస భారతీయుల రక్షణ కోసం భారత విదేశాంగ శాఖ కూడా నేపాల్ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. గల్లంతైన వారి ఆచూకీ రాబోయే కొన్ని గంటల్లో లభ్యమయ్యే అవకాశం ఉందని, పరిస్థితులు సమసిపోయే వరకు పర్యాటకులు సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. Nepal Floods, PM Modi Balen Shah, Indian Tourists Missing Nepal, Bhote Koshi River Floods, Nepal Tourism Board Rescue

Published on: Wed Aug 26, 2026 8:18PM

political-news-img

నేపాల్ లో జల ప్రళయం.. వెయ్యి మంది గల్లంతు.!

నేపాల్‌లో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టించాయి. టిబెట్ సరిహద్దుకు సమీపంలోని రసువా జిల్లాలో మెరుపు వరదలకు ఓ గ్రామం మొత్తం కొట్టుకుపోయింది. దాదాపు వెయ్యి మందికి పైగా గల్లంతయ్యారు. బుధవారం సంభవించిన ఈ వరద ఉద్ధృతి కారణంగా సంభవించిన నష్టం వివరాలు తెలియాల్సి ఉంది. పర్వత ప్రాంతమైన ఈ ప్రాంతంలో ప్రవహించే భోటె కోషి నదిలో నీటి ప్రవాహం భారీగా పెరగడంతో దిగువ ప్రాంతాలు జలదిగ్బంధనంలో చిక్కుకున్నాయి. ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. త్రిషూలి నదీ పరివాహక ప్రాంతంతో పాటు నువాకోట్, ధాడింగ్, చిత్వాన్, గోర్ఖా జిల్లాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని నేపాల్ ప్రభుత్వం హెచ్చరించింది. ఆయా జిల్లాల ప్రజలు ఎగువ ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించింది. Nepal Floods, Rasuwa District Flash Floods, Bhotekoshi River, Nepal Natural Calamity, Over1000missing

Published on: Wed Aug 26, 2026 4:54PM

political-news-img

ఇరాన్ పై దాడులకు అమెరికా ఫుల్ స్టాప్.. కానీ.!

దాడు చేపట్టబోమని అగ్రరాజ్యం మధ్య ప్రాచ్య పరిణామాల నేపథ్యంలో అంతర్జాతీయంగా ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ, తమ వైఖరిని అమెరికా విదేశాంగ శాఖ స్పష్టం చేయడంతో ఉద్రిక్తతలు ఒకింత తగ్గినట్ల యుద్ధ నిపుణులు చెబుతున్నారు. ఇరాన్ పై ఇప్పట్లో కొత్త దాడులేవీ ఉండవని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తమ మిత్రదేశాలకు అఫీషియల్ గా తెలియజేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో వైమానిక, క్షిపణి దాడుల కంటే వ్యూహాత్మక చర్యలకే మొగ్గు చూపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. అయితే.. ఈ దాడుల విరమణకు షరతులు ఉన్నాయని స్పష్టం చేశారు. ఇరాన్ లేదా ఆ దేశానికి మద్దతుగా ఉన్న దళాలు అమెరికా, అమెరికా మిత్రదేశాలపై దాడులకు పాల్పడితే... ఈ సారి ప్రతీకార దాడులు తీవ్రాతి తీవ్రంగా ఉంటాయని మార్కో రూబియో హెచ్చరించారు. అదలా ఉంటే.. ప్రత్యక్ష దాడులను నిలిపివేసినప్పటికీ, ఇరాన్ పై ఆర్థిక ఆంక్షలను తీవ్రం చేసింది. ఇరాన్‌కు అంతర్జాతీయ వ్యాపార సంబంధాలు తెగిపోయేలా 'ఆపరేషన్ ఎకనామిక్ అవుట్‌కాస్ట్' పేరిట భారీ స్థాయిలో ఆర్థిక ఆంక్షలను ప్రకటించింది. ఇందులో భాగంగా ఇరాన్‌కు చెందిన సుమారు 60 సంస్థలు, పలువురు కీలక వ్యక్తులు, వాణిజ్య నౌకలను తాజాగా బ్లాక్ లిస్ట్ లో చేర్చింది. ఇరాన్ సైనిక వ్యూహాలకు నిధులు సమకూరకుండా చేయడం, ఆ దేశ పెట్రోలియం, పెట్రోకెమికల్ ఎగుమతులను అడ్డుకోవడమే ఈ ఆంక్షల ముఖ్య ఉద్దేశమని అమెరికా స్పష్టం చేసింది. అలాగే హర్మూజ్ జలసంధి ప్రాంతంలో ఇరాన్ ఓడరేవుల నుండి నౌకల రాకపోకలను నియంత్రించేందుకు అమెరికా నౌకాదళం దిగ్బంధాన్ని కొనసాగిస్తోంది. సముద్ర మార్గంలో సైతం ఇరాన్ చేసే వాణిజ్య కార్యకలాపాలను అడ్డుకోవడం ద్వారా ఆ దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేసే వ్యూహంతో అమెరికా ముందుకు సాగుతోంది. పశ్చిమాసియాలో పూర్తి స్థాయి యుద్ధాన్ని నివారించేందుకే అమెరికా ఈ నిర్ణయం తీసుకుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దాడులు ఉండబోవన్న అమెరికా ప్రకటన ఇరాన్ కు ఏమంత ఉపశమనం కలిగించే అవకాశం లేదంటున్నారు. ఎందుకంటే.. దాడులైతే ఉండవని ప్రకటించింది కానీ, అదే సమయంలో మరింత కఠిన ఆంక్షల పంజా విసరడంతో ఇరాన్ వేగంగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి చేతులెత్తేయాల్సిన పరిస్థితి వస్తుందని అంటున్నారు. No attacks on Iran, America, US-Iran crisis, US sanctions on Iran, Marco Rubio, West Asia tensions

Published on: Wed Aug 26, 2026 11:01AM

political-news-img

ట్రంప్ మరో షాక్.. వీసా అప్పాయింట్ మెంట్ల నిలిపివేత.!

అమెరికా వెళ్లేందుకు సిద్ధమవుతున్న విదేశీ ప్రయాణికులకు, విద్యార్థులకు, టెక్ నిపుణులకు ట్రంప్ మరో షాక్ ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ దౌత్య కార్యాలయాల్లో వీసా అపాయింట్‌మెంట్లను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో ఇప్పటికే షెడ్యూల్ అయిన పలు ఇంటర్వ్యూలు రద్దయ్యాయి. దీంతో అమెరికా వెళ్లాలని ఇప్పటికే షెడ్యూల్ ఖరారు చేసుకుని వీసా అప్పాయింట్ మెంట్ కు రెడీ అవుతున్న వారు తీవ్ర ఆందోళనకు గురౌతున్నారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇమిగ్రేషన్ నిబంధనలను కఠినం చేస్తున్నామన్న పేరుతో ఇష్టారీతిగా నిబంధనలను మార్చేస్తూ గందరగోళం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా తీసుకున్న ఈ నిర్ణయం అంతర్జాతీయంగా హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే పూర్తిస్థాయి సమాచారంతో దరఖాస్తు చేసుకున్న వేల మంది పర్యటనలు, ఉన్నత చదువుల పరిస్థితిలో అనిశ్చితి నెలకొనడంతో ఆందోళన చెందుతున్నారు. వీసా అప్పాయింట్ మెంట్లను అకస్మాత్తుగా నిలిపివేయడంపై అమెరికా విదేశాంగ శాఖ.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ ఎంబసీలు, కాన్సులేట్‌లలో పనిచేస్తున్న సిబ్బంది కోసం ఒక ప్రత్యేక అంతర్గత శిక్షణ కార్యక్రమం ప్రారంభించినందున ఇప్పుడు దరఖాస్తుల ప్రాసెసింగ్, అపాయింట్‌మెంట్లు నిలిపివేసినట్లు వెల్లడించింది. రాయబార కార్యాలయాల పనితీరును మెరుగపరచి, నూతన విధానాలకు అనుగుణంగా దౌత్య సిబ్బందికి అవగాహన కల్పించడం కోసమే ఈ విరామమని వివరించింది. అయితే హఠాత్తుగా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా అప్పాయింట్ మెంట్లు రద్దు చేయడం దరఖాస్తుదారులను ఇబ్బందుల్లో పడేసింది. US Visa Appointments Paused Worldwide, America Visa Interview Cancellation, Donald Trump Immigration Rules, US Embassy Staff Training, US Visa Updates Telugu

Published on: Wed Aug 26, 2026 10:29AM

political-news-img

రష్యా విమానాశ్రయంలో అమెరికా యుద్ధ విమానం.. ఏం జరుగుతోంది?

ప్రపంచ దేశాల ఉద్రిక్తతలు పీక్స్ కు చేరిన ఈ తరుణంలో అమెరికా యుద్ధ విమానం రష్యా రాజధాని మాస్కోలోని నుకోవో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అవ్వడం కలకలం రేపింది. ఉక్రెయిన్ మరియు రష్యాల నాలుగేళ్లుగా అత్యంత భీకరమైన సాయుధ పోరాటం కొనసాగుతున్న నేపథ్యంలో, ఉక్రెయిన్‌కు నేరుగా సైనిక మద్దతు అందిస్తున్న అమెరికాకు చెందిన యుద్ధ విమానం రష్యన్ భూభాగంలో ల్యాండ్ కావడం అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఫ్లైట్ ట్రాకింగ్ నెట్‌వర్క్ అందించిన వివరాల ప్రకారం, ఆర్సీహెచ్ 4555 అనే నంబరు కలిగిన అమెరికా మిలిటరీ ఫ్లైట్ అమెరికాలోని మేరీల్యాండ్ ప్రాంతం నుండి బయలుదేరి రిగా ఎయిర్‌పోర్టుకు చేరుకుంది.ఆ తర్వాత రిగా విమానాశ్రయం నుంచి మాస్కోలోని నుకోవో ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయింది. అమెరికా సైనిక రవాణా విభాగంలో సీ-17 గ్లోబ్‌మాస్టర్ III విమానాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. భారీ ఎత్తున సైనిక సిబ్బందిని, యుద్ధ సామాగ్రిని త్వరితగతిన రవాణా చేయడంతో పాటు, అత్యున్నత స్థాయి దౌత్యవేత్తలు, ప్రెసిడెన్షియల్ కార్యాలయ అధికారుల ప్రయాణాలకు ఈ విమానాలను వినియోగిస్తుంటారు.అటువంటి విమానం రష్యాలో అకస్మాత్తుగా ల్యాండ్ అవ్వడం వెనుక ఉన్న కారణాలు, వ్యూహాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అమెరికా, రష్యాల మద్య బ్యాక్ డోర్ దౌత్య చర్చలు జరుగుతున్నాయా? అన్న వ్యూహాగానాలు వినిపిస్తున్నాయి. రష్యాపై అమెరికా ఆర్థిక, దౌత్య ఆంక్షలు విధించిన క్రమంలో అమెరికా మిలిటరీ రవాణా విమానం మాస్కో రావడంపై సర్వత్రా ఆసక్తి, ఉత్కంఠ వ్యక్తమౌతోంది. అయితే అమెరికా యుద్ధ విమానం రష్యాలో ల్యాండ్ అయిన విషయంపై తమ వద్ద ఎటువంటి సమాచారం లేదని రష్యా అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ అన్నారు. రెండు దేశాల మధ్య తక్షణమే ఎలాంటి అధికారిక దౌత్య సమావేశాలు జరగడం లేదని రష్యా ప్రభుత్వ మీడియా స్పష్టం చేసింది. అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు, హార్మూజ్ జలసంధి లో నౌకల రాకపోకల స్తంభన నేపథ్యంలో ఈ మిలిటరీ విమానం ల్యాండింగ్ ఆసక్తికర పరిణామంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఉక్రెయిన్ సంక్షోభం ముదిరిన తర్వాత అమెరికా, రష్యాల మధ్య కమ్యూనికేషన్ దాదాపుగా మూసుకుపోయింది.ఈ నేపథ్యంలో అమెరికా యుద్ధ విమానం రష్యా రాజధాని మాస్కో లో ల్యాండ్ కావడం... అత్యవసర సంప్రదింపుల కోసమా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. US Military Plane lands inMoscow, C-17 Globemaster III Russia, Russia US Relations News, Moscow Vnukovo Airport US Aircraft, US Air Force Moscow Landing Telugu News

Published on: Tue Aug 25, 2026 7:07PM

political-news-img

అమెరికా ఆంక్షలు లెక్క చేయం.. ప్రతీకార దాడులు చేస్తాం.. ఇరాన్ వార్నింగ్.!

పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు దట్టంగా అలుముకున్నాయి. ఇరాన్ పై అమెరికా కొత్తగా కఠినాతి కఠినమైన ఆంక్షలు విధించడమే ఇందుకు కారణం. అమెరికా విధించిన ఆంక్షలపై ఘాటుగా స్పందించిన ఇరాన్ ప్రతీకార చర్యల తప్పవని హెచ్చరించింది. ఆపరేషన్ ఎకనామిక్ అవుట్‌క్యాస్ట్ పేరుతో అమెరికా ఇరాన్ పై ఆంక్షలువిధిస్తున్నట్లు చేసిన ప్రకటన.. ఇరాన్ ఆదాయ మూలాలను దెబ్బతీయడమే లక్ష్యంగా ఉంది. ఈ కొత్త ఆంక్షల పరిధిలోకి డిజిటల్ ఆస్తులు, సాంకేతిక పరిజ్ఞానం, బంగారం, విమానయాన రంగం, సముద్ర ఆధారిత నౌకా రవాణా రంగాలు తీవ్రంగా ప్రభావితమౌతాయి. అలాగే.. ఇరాన్‌తో ఎ వ్యాపార వాణిజ్య సంబంధాలు నెరిపే ఇతర దేశాలు, అంతర్జాతీయ కంపెనీలపై కూడా ఆంక్షలు అమలు చేస్తామని వాషింగ్టన్ హెచ్చరించింది. ఇరాన్ చమురు విక్రయాలు, ఆయుధ కొనుగోళ్లు, సైబర్ ఆపరేషన్లతో నేరుగా సంబంధం కలిగిన 60కి పైగా వ్యక్తులు, ప్రైవేటు సంస్థలు, సరుకు రవాణా నౌకలను అమెరికా ఆ ఆంక్షల జాబితాలో చేర్చింది. దీనిపై ఇరాన్ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. శత్రువుల దాడి కోసం నిష్క్రియగా వేచి చూడబోమని, ఎదురుదాడే తమ మార్గమని కుండబద్దలు కొట్టింది. అమెరికాది ఆర్థిక ఉగ్రవాదమని పేర్కొన్న ఇరాన్.. దానిని తిప్పికొట్టేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నామని కుండబద్దలు కొట్టింది. చైనా, రష్యా వంటి తమ మిత్రదేశాలు అమెరికా ఏకపక్ష ఆంక్షలను అంగీకరించబోవని ఇరాన్ ధీమా వ్యక్తం చేసింది. అంతే కాకుండా, అమెరికాకు సహకరించే పొరుగు దేశాలు భూకంప స్థాయి ప్రతీకారాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించింది. ఇరాన్ మౌలిక వనరులను అమెరికా దెబ్బతీయాలని చూస్తే, పర్షియన్ గల్ఫ్, హార్ముజ్ జలసంధి ద్వారా ప్రపంచానికి వెళ్లే చమురు రవాణాను పూర్తిగా నిలిపేస్తామని వార్నింగ్ ఇచ్చింది. Iran Warning to America, US Iran Sanctions, Tehran Retaliation, Operation Economic Outcast, Persian Gulf Oil Crisis

Published on: Tue Aug 25, 2026 11:01AM

political-news-img

పాక్ వైమానిక స్థావరాల్లో టర్కీ, చైనా విమానాలు.. అసలేం జరుగుతోంది?

పాకిస్థాన్ కు భారీగా ఆయుధాల సరఫరా అంశం ఇప్పుడు దక్షిణాసియా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. పాకిస్థాన్ గగనతలంలో ప్రత్యక్షమవుతున్న విదేశీ సైనిక విమానాలు అంతర్జాతీయంగా హాట్ టాపిక్ గా మారింది. 60 గంటల వ్యవధిలో పెద్ద సంఖ్యలో టర్కీకి చెందిన సి-130 హెర్క్యులస్ సైనిక రవాణా విమానాలు పాకిస్థాన్‌కు వచ్చి వెళ్లడం సంచలనంగా మారింది. ఆగస్టు 19 నుంచి ఆగస్టు 21 మధ్య చోటుచేసుకున్న ఈ సైనిక రాకపోకలు, శత్రుదేశాల కదలికలపై నిశితంగా క అంతర్జాతీయ నిఘా సంస్థలు అప్రమత్తం చేశాయి. రావల్పిండి సమీపంలోని నూర్ ఖాన్ వైమానిక స్థావరం, అలాగే కరాచీలోని మస్రూర్ వైమానిక స్థావరాలలో టర్కీ సైనిక విమానాలు పదేపదే ల్యాండ్ అయ్యాయి. అంత తక్కువ సమయంలో, అంతటి భద్రతా ప్రాముఖ్యత ఉన్న వైమానిక స్థావరాలలో ఈ స్థాయిలో సైనిక విమానాల రాకపోకలు పలు అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. అంతేకాకుండా, టియుఎఎఫ్ 526 అనే ప్రత్యేమైన కాల్‌సైన్‌తో రికార్డైన టర్కీకి చెందిన మరొక భారీ ఎ-400ఎమ్ సైనిక విమానం పాకిస్థాన్‌లోని మురిద్ స్థావరంలో కనిపించడం ఈ అనుమానాలకు బలాన్ని చేకూర్చింది. అసలు ఈ విమానాల్లో టర్కీ నుంచి పాకిస్థాన్‌కు తరలించినది ఏమిటి? అంటే.. వాటి ద్వారా పాకిస్థాన్ కు భారీగా ఆయుధాలు.. అత్యాధునిక డ్రోన్లు, వాటి నిర్వహణకు సంబంధించిన డిజిటల్ వ్యవస్థలు అన్న అనుమానాన్ని నిఘా వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. వీటితో పాటు, హెచ్‌క్యూ-సిరీస్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను కూడా పాక్ స్థావరాలకు ఈ విమానాల ద్వారా చేరి ఉండోచ్చని నిఘావర్గాలు చెబుతున్నాయి. టర్కీ విమానాలు నూర్ ఖాన్, మస్రూర్ స్థావరాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న సమయంలోనే.. చైనాకు చెందిన సైనిక రవాణా విమానాల కదలికలు కూడా అక్కడ కనిపించడం మరింత ఆందోళనకరంగా మారింది. ఇది టర్కీ, పాకిస్థాన్, చైనా దేశాల మధ్య పెరుగుతున్న త్రైపాక్షిక సైనిక , రక్షణ సంబంధాలకు నిదర్శనంగా చెబుతున్నారు. పాకిస్థాన్ గతంలోనే టర్కీ నుంచి బైరక్టార్ రక్షణ డ్రోన్లను కొనుగోలు చేసిన విషయంతెలిసిందే. ఇటీవల ఆగస్టు 7న పాకిస్థాన్, టర్కీ, సౌదీ అరేబియాల మధ్య చారిత్రాత్మకమైన మక్కా ఉమ్మడి రక్షణ ఒప్పందం కుదిరింది. ఈ త్రైపాక్షిక భద్రతా ఒప్పందంలోని నిబంధనల ప్రకారం, ఈ మూడు దేశాల్లో ఏ దేశంపై విదేశీ దాడి జరిగినా, అది మిగిలిన రెండు దేశాలపై జరిగిన దాడిగానే భావించి ఉమ్మడిగా స్పందిస్తాయి. ఈ కీలక భద్రతా ఒప్పందం కుదిరిన కొద్ది రోజుల వ్యవధిలోనే ఈ స్థాయిలో భారీ సైనిక విమానాల కదలికలు సాగడం గమనార్హం. ఈ సైనిక విమానాలలో ఏం తరలించారనే దానిపై టర్కీ గానీ, పాకిస్థాన్ ప్రభుత్వం గానీ ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయకపోవడంతో ఆయుధాల సరఫరా అనుమానాలు మరింత పెరుగుతున్నాయి. కేవలం రాడార్ సమాచారం, విమానాల కదలికలు, అంతర్జాతీయ నిఘా వర్గాల ప్రాథమిక సమాచారం ఆధారంగానే ఈ వివరాలు బయటకు వచ్చాయి. Turkish military aircraft in Pakistan, C130 Hercules Rawalpindi, Turkey Pakistan drone supply, HQ air defense systems, Mecca joint defense agreemen

Published on: Mon Aug 24, 2026 10:48AM

political-news-img

అమెరికాతో కెనడా వాణిజ్య చర్చలు బంద్.!

అమెరికాతో కెనడా వాణిజ్య చర్చలను బంద్ చేసింది. ఈ రెండు దేశాల మధ్యా ఉన్న ఉచిత వాణిజ్య బంధానికి కెనడా చెల్లు చీటీ రాసేసింది. దశాబ్దాలుగా హిత మిత్రదేశాలుగా ఉన్న ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు ఒక్కసారిగా క్షీణించాయి. అమెరికాతో సాగిస్తున్న కీలక వాణిజ్య చర్చలను నిలిపివేస్తున్నట్లు కెనడా ప్రధాని మార్క్ కార్నీ ప్రకటించారు. చర్చల చివరి దశలో అమెరికా ప్రతిపాదించిన కొత్త షరతులు అసంబద్ధంగా, ఏకపక్షంగా, తమకు తీవ్ర ఆర్థిక నష్టం కలిగించేవిగా ఉన్నాయని పేర్కొంటూ.. కెనడా ప్రయోజనాల పరిరక్షణ కోసం అమెరికాతో వాణిజ్య చర్చలకు ఫుల్ స్టాప్ పెట్టినట్లు ఆయనా ప్రకటనలో పేర్కొన్నారు. కెనడా ప్రయోజనాలను దెబ్బతీసేలా ఉన్నందున ఈ కఠిన నిర్ణయం తీసుకోక తప్పలేదని స్పష్టం చేశారు. అదలా ఉండగా, అమెరికా కూడా.. తీవ్రంగా స్పందించింది. కెనడా నుంచి దిగుమతి అయ్యే 20 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులపై 50 శాతం టారిఫ్‌లు విధించేందుకు నిర్ణయించింది. ఇతర ప్రధాన ఎగుమతి దేశాల కంటే కెనడాకు అత్యంత మెరుగైన వాణిజ్య సదుపాయాలు కల్పించేందుకు తాము ముందడుగు వేసినప్పటికీ.. కెనడానే చివరి నిమిషంలో కొత్త డిమాండ్లను తెరపైకి తెచ్చిందని అమెరికా ఆరోపించింది. గతంలో అంగీకరించిన కొన్ని కీలక హామీల నుంచి కూడా కెనడా వెనక్కి తగ్గిందని పేర్కొంది. Canada band trade talks with America, Mark Carney Canada PM, Donald Trump 50 percent tariffs, US Canada trade dispute, 880 billion trade war

Published on: Sat Aug 22, 2026 12:56PM

political-news-img

చైనా అధ్యక్షుడి అమెరికా పర్యటన.. ఎప్పుడంటే? ఎందుకంటే?

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ అమెరికాలో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించారు. సౌత్ కరోలినాలో జరిగిన ఓ ర్యాలీలో వేలాది మంది ప్రజల సమక్షంలో ట్రంప్ చైనా అధ్యక్షుడి అమెరికా పర్యటన విషయాన్ని వెల్లడించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, చైనాల మధ్య గత కొంతకాలంగా వాణిజ్య యుద్ధాలు, టారిఫ్‌ల వివాదాలు, టెక్నాలజీ ఆంక్షలు తీవ్రస్థాయిలో కొనసాగుతున్న నేపథ్యంలో చైనా అధ్యక్షుడి అమెరికా పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల మే 13 నుండి 15 వరకు డొనాల్డ్ ట్రంప్ చైనాలో 3 రోజులు పర్యటంచిన సంగతి తెలిసిందే. చైనాలోని గ్రేట్ హాల్ ఆఫ్ ది పీపుల్, టెంపుల్ ఆఫ్ హెవెన్ వంటి ప్రదేశాల్లో షీ జిన్‌పింగ్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ట్రంప్ చైనా పర్యటన ఇరు దేశాల మధ్య సంబంధాలలో ఓ కొత్త అధ్యాయానికి ప్రారంభంగా అప్పట్లోనే పరిశీలకులు విశ్లేషించారు. ఆ సందర్భంగా ట్రంప్.. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ను అమెరికా పర్యటనకు రావలసిందిగా ఆహ్వానించారు. ఆ ఆహ్వానాన్ని పురస్కరించుకుని జన్ పింగ్ మరో రెండు వారాలలో అమెరికార పర్యటనకు రానున్నారు. ఈ పర్యటనలో అమెరికా, చైనా అధ్యక్షుల మధ్య ముఖాముఖీ చర్చలు జరిగే అవకాశం ఉంది. ఈ చర్చలలో గ్లోబల్ ట్రేడ్ రీసెట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ , సెమికండక్టర్ చిప్స్ ఎగుమతులు, గ్లోబల్ మార్కెట్ స్థిరత్వం పైచర్చించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. China President America Tour, Donald Trump, Xi Jinping, Trump Xi News, Global Economy, TeluguOne

Published on: Sat Aug 22, 2026 11:53AM