స్లిప్ అయితేనే అందం!     హెడ్ లైన్ చదివి తప్పుగా అనుకోకండి. మేం చెబుతున్నది డ్రెస్సు స్లిప్ అవ్వడం గురించి కాదు... స్లిప్ స్లయిల్లో ఉన్న డ్రెస్సు గురించి. వీ నెక్ మాదిరి లోతుగా ఉండే నెక్... సన్నని స్ట్రాప్ తో ఉండేదే స్లిప్ డ్రెస్. ఇప్పుడిది లేటెస్ట్ ఫ్యాషన్ ట్రెండ్.   ఇటు టాలీవుడ్ నుంచి అటు హాలీవుడ్ దాకా ఏ సినిమా అయినా చూడండి. ఎక్కడో ఒక చోట హీరోయిన్ అదరగొట్టే స్లిప్ డ్రెస్ వేస్తుంది. సినిమాలోనే కాదండీ... బైట కూడా సెలెబ్రిటీలు ఎంతో ఇష్టపడే ఫ్యాషన్ ఇది. పొడవుగా, పొట్టిగా గౌను ఎలా ఉన్నా... దానికి స్లిప్ టచ్ ఇస్తే చాలు... అది ఎక్స్ ట్రార్డినరీగా తయారైపోతుంది.   కొందరు వీటిని నేరుగా వేసేసుకుంటారు. కొందరేమో లోపల టీషర్ట్ లాంటిదేదైనా వేసుకుని పైన స్లిప్ డ్రెస్ వేస్తారు. కొందరు పైప స్కార్ఫ్ కప్పుతారు. మరికొందరు ఏ లేస్ టాపో వేస్తారు. ఎవరు వేసినా ఎలా వేసినా అందాన్ని ఇవ్వడం స్లిప్ డ్రెస్ స్పెషాలిటీ. అలా అని సామాన్యులకి అందని ఫ్యాషనేమీ కాదిది. అందుబాటులో ఉండే రేట్లలో అందమైన స్లిప్ డ్రెస్సులు బోలెడు దొరుకుతున్నాయి. వెంటనే షాపింగ్ కి బయల్దేరండి మరి! -sameera    

  ఏ ముఖానికి ఏ ఇయర్ రింగ్స్?     దిద్దులు పెట్టిన చెవులు ముద్దుగా ఉంటాయనేవారు ఒకప్పడు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది.చెవులను అంటిపెట్టుకుని చెంపలను తాకుతా అన్నట్టుగా ఉండే లోలాకులు ఇప్పుడు ఫ్యాషన్. అయితే ఫ్యాషన్ అన్నాం కదా అని ఏది పడితే అది పెట్టేసుకుంటే కుదరదు. మన ముఖం ఏ షేపులో ఉందో దాన్ని బట్టి ఇయర్ రింగ్స్ ఎంచుకోవాలి. అప్పుడే లుక్ అదురుతుంది.     గుండ్రంగా ఉండే ముఖానికి చిన్నగా ఉండే ఇయర్ రింగ్స్ బాగోవు. పొడవుగా ఉండేవి కానీ, మీడియం సైజువి కానీ తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ అవి  రౌండ్ గా ఉండకూడదు. ఓవర్ షేప్ లో కానీ, చతురస్రాకారంలో కానీ ఉండేవి పెట్టుకుంటే తిరుగుండదు. అలాగే స్క్వేర్ షేప్ ఉండే ముఖానికి కాస్త పొందికగా, సింపుల్ గా ఉండేవి పెట్టుకోవాలి. గజిబిజి డిజైన్లు ఎంచుకోకూడదు. ఎక్కువ రంగులు కూడా ఉండకూడదు.     నుదురు కొంచెం పెద్దగా, గడ్డం దగ్గరకు వచ్చేసరికి సన్నగా, చెప్పాలంటే ఓ రకంగా హార్ట్ షేపులో ఉండే ముఖాకృతి కొందరికి ఉంటుంది. వీళ్ల చెంపలు పల్చగా ఉంటాయి కాబట్టి కాస్త వెడల్పుగా ఉండి, చెంపల వరకూ వేళ్లాడే హ్యాంగిగ్స్ వేసుకుంటే సూపర్ గా ఉంటుంది.     ఇక ఓవర్ షేప్. ఈ ముఖాకృతి ఉన్నవారు ఎలాంటి లోలాకులు పెట్టుకున్నా బానే ఉంటుంది. దిద్దుల దగ్గర్నుంచి భుజాల వరకూ వేళ్లాడే హ్యాంగిగ్స్ దాకా సైజుతో కానీ డిజైన్ తో కానీ సంబంధం లేకుండా దేనినైనా ధరించవచ్చు. కాబట్టి వీళ్లు కాస్త భారీగా ఉండే డిజైన్స్ ను ఎంచుకున్నా ఫరవాలేదు. ఇయర్ రింగ్స్ విషయంలో ఒక ముద్ర వేయాలంటే వీళ్ల తర్వాతే ఎవరైనా. - Sameera  

Different Types of Handbags and Purses   types of handbags styles, types of handbags pictures,types woman bags, lady bags types: Different types of handbags available in virtually innumerable designs and colours, creating, rather than waiting, even more of cravings (to own different styles for different moods and occasions) among the bag holders.     * Hand Bag As the name suggests, a hand bag is to be carried in a hand rather than slinging it across the shoulder which makes it slightly less preferable to the women, for obvious reason – need a hand to hold on to the bag, leaving you a little tied up. Still, a hand bag, by all means is one among the most preferred of handbags. Available in elegantly brilliant designs, hand bags go best with formals and semi-formals and good to go for a short travel. * Cosmetic Bag The name says it all. Available in different shapes and sizes, a cosmetic bag is meticulously designed, allowing you to carry all your cosmetics without the fear of spillage or damage. However, carrying anything other than cosmetics (except say a cell phone or a comb and mirror), isn’t what it is made for. Looks best with semi-formals and casuals. * Duffle Bag A duffle bag is the biggest of all the handbags and the drawstring opening at the top allows for accommodation of a whole lot of stuff inside it. It is generally used by women for long travel or by sportswomen. * Beach Bag A beach bag, contrary to what the name suggests, isn’t just meant to carry to beach; it can be held on to while on to a picnic, gym, or a casual stroll to anywhere. These colourful beach bags, ideally made of cloth or jute and straw, sometimes, are also provided with a plastic sheen that protects them from moisture. Available in many exquisite designs, beach bags go fantastically well with vibrant casual attire. * Tote Bag A tote is an oversized bag best suited for short travel or grocery shopping. Made of soft fabrics, a tote bag also has an adjustable strap that can be set according to your own length. In this age when plastic bags are a big no-no, tote bags are a welcome change. Not only can they accommodateyou while shopping, they add to the style statement as well, proving their utmost worth.

వేసవిలో పూల సొగసులు   సెగలు కక్కే వేసవిలో మనసూ, శరీరం చల్లదనాన్ని కోరుకోవడం సహజం. అందుకే మీ వస్త్రధారణలో పూలకు ప్రాధాన్యం ఇచ్చి చూడండి. మీ అల్మారాలో పూల ప్రింట్లు ఉన్న దుస్తులు ఉన్నాయా? కనీసం పూల రంగుల్లోని టాప్‌లు ఉన్నా ఫరవాలేదు. అవన్నీ మీ మనసుని హాయిగా ఉంచుతాయి. పైజామా, పలాజోలు లాంటివయినా ఆ ప్రింట్లలో ప్రయత్నించి చూడండి. * ఉక్కకు తాళలేకపోతున్నాం అనుకునే వారు.. చిన్నచిన్న పూల ప్రింట్ల టాప్‌లు వేసుకుని అడుగున కాస్త వదులుగా ఎలాంటి డిజైను లేని సాదా ప్యాంట్లో, స్కర్టులో వేసుకోవచ్చు. *  పైన పూల ప్రింట్లు వేసిన కుర్తీలకు జీన్స్‌ జతయితే అదిరిపోతుంది. కాలంతో సంబంధం లేని ఈ ఫ్యాషన్‌కి చిన్న మార్పులు చేసుకుంటే ఈ వేసవిలో మరింత ట్రెండీగా నిలిచిపోవచ్చని అంటున్నారు ఫ్యాషన్‌ నిపుణులు. *  మా దగ్గర ఫ్లోరల్‌ప్రింటు కుర్తాలు, జీన్స్‌ లేవు అంటారా? అయితే ఒక చక్కని పూల స్కార్ఫ్‌ కానీ, దుపట్టా కానీ´ కొనేయండి. అటు టాప్‌లపైనా పనికొస్తాయి.. కుర్తాలకూ సరిపోతాయి. *  మెడలో వేసుకునే హారాలూ, హెయిర్‌క్లిప్స్‌, బ్యాగులూ, బ్రేస్‌లెట్లూ, టోపీలూ, చెప్పులు వీటికి పూల డిజైన్లని ఎంపిక చేసుకుని చూడండి. *  సాయంత్రం పూట వేడుకలకు వెళ్లేవారు పూల ప్రింట్లున్న మ్యాక్సీలు, గౌన్లు ఎంచుకోవచ్చు. అలాగే పూల ప్రింటుతో ఉన్న జార్జెట్‌చీరను కట్టుకున్నా చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఆకట్టుకునేలా కూడా కనిపిస్తారు.  

  జీన్స్ తో పోటీ పడుతున్న ధోతీ  రోజులు ఏలా మారుతున్నాయో దానికి తగ్గట్టు ఫ్యాషన్ పోకడలు కూడా రోజురోజుకూ మారిపోతున్నాయి. నిన్న చూసిన మోడల్ ఈ రోజు ఉండదు.. ఈరోజు చూసిన మోడల్ రేపు ఉంటుందన్న గ్యారెంటీ లేదు. ఈ ఫ్యాషన్ రంగంలో రోజుకో రకం వస్తూనే ఉంటుంది. ముఖ్యంగా డ్రెస్సింగ్.. యూత్ ని ఆకట్టుకోవడానికి ఎన్నో రకాల మోడల్స్ వస్తున్నాయి. ఇప్పటి వరకూ జీన్స్ ప్యాంట్ల్లు వాటిలోనే వేరే మోడల్స్ వచ్చాయి.. అయితే ఇప్పుడు వాటికి చెక్ పెట్టి వాటితో పోటీపడే ధోతి ప్యాంట్లు వచ్చేశాయి. రకరకాల డిజైన్లలో ఈ ధోతి ప్యాంట్లు మార్కెట్ల్ హడావుడి చేస్తున్నాయి. సెలబ్రిటీల దగ్గర నుండి కాలేజ్ గాళ్స్ వరకూ వీటికి అందరూ ఇష్టపడుతున్నారు. మీరూ ఒకసారి ట్రైచేయండి.. ఫ్యాషన్ పోకడను అనుసరించండి..    

ఇదే లేటెస్ట్ ఫ్యాషన్...!      

మీ చేతుల్లోనే లేటెస్ట్ ఫ్యాషన్...     ఆడవాళ్లు ట్రెండ్ ను ఫాలో అవడం అందరికి తెలిసిందే. కొత్త కొత్త లేటెస్ట్ ఫ్యాషన్ మార్కెట్ లోకి ఏది వచ్చిన కూడా దానిని ఫాలో అవడం చేస్తుంటారు. కానీ ట్రెండ్ ను ఫాలో అవడం కన్నా మీరే కొత్త ట్రెండ్ ను మీకోసం తయారు చేసుకోవచ్చు. కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మన దుస్తులకు చక్కని లుక్ వస్తుంది. శరీరంలో ఛాతీ భాగం కాస్త బొద్దుగా ఉన్నవారు చేతుల విషయంలో జాగ్రత్తపడాలి. బుట్ట చేతులు, వదులుగా ఉండే చేతులు, కుచ్చులుండేలా.... అసలు కుట్టించుకోకూడదు.   ఒంటికి అతుక్కుని ఉండే మోడల్ ఎంచుకోవాలి. కింది భాగంలో వదులుగా ఉండేలా దుస్తులు కుట్టించుకుంటే పై భాగం నుంచి దృష్టి మళ్ళుతుంది. నడుం కిందిభాగం లావుగా ఉండేవారు దుస్తుల చేతులతో తమాషాలు చేయవచ్చు. రకరకాల కుచ్చులు, బుట్ట చేతులు, వదులుగా ఉండే పొడవు చేతులు, రఫెల్స్... ఇలా ఎన్నో రకాలు ప్రయత్నించవచ్చు. అప్పుడు పైన కింద బ్యాలెన్స్ అయ్యి ఆకృతి అందంగా కనిపిస్తుంది.   మీ చేతులు సన్నగా ఉన్నాయా? ఒంటికి అటుక్కున్నట్లు, వేలడుతున్నట్లుండే ఫ్యాబ్రిక్ కాకుండా కాస్త నిలబడి ఉండే వస్త్రం ఎంచుకోవాలి. పొడవు చేతులు, మూడొంతుల పొడవున్న చేతులు ఇలాంటివారికి బాగుంటాయి. చేతులు లావుగా ఉన్నాయా? మీరు తప్పనిసరిగా మూడొంతుల పొడవుండే వదులు చేతులు కుట్టించుకోవాలి. పొట్టి చేతులు మీకు బాగోవు.   చక్కటి కుచ్చులతో ఒక మంచి షర్టు మీ వార్డ్ రోబ్ లో లేదా? ఒక మీటరు మంచి లేసు తీసుకుని మీ దగ్గరున్న తెల్ల షర్టుకి కుట్టించుకోండి. మీ దగ్గర ఒక మంచి పొడవు చేతుల తెల్ల షర్టు ఉంది. దాన్ని స్కర్టు మీద ధరించినపుడు అలాగే వేసుకోండి. అదే ప్యాంటు మీద ధరించినపుడు అలాగే వేసుకోండి. అదే ప్యాంటు మీద ధరించినపుడు అంచుల్ని రెండు మడతలు పైకి మడిచారనుకోండి. స్టైల్ గా ఉంటుంది.

  Summer Skirts for Girls     Come Summer vacation and kids have atleast some time for play..if the parents spare them from those busy Dance, Martial arts and Math classes, even during the vacation time. And with the Sun blasting away even the cool evening time, when will the kids come out and play ! Whether they are ready for play or not, Mom shall keep their wardrobe ready for every season..and so here are some Cottony soft Skirts for casuals and also the party looks.   Most of the kids clothing stores have the current trends for every season..and Summer calls in for tons of Cotton fabrics..dresses, frocks, skirts, skorts what not. But the colors you choose make the difference..light colors give it a cooler feeling but they are not easy to manage..and kids are the best at soiling clothes at the fastest. Hence, choosing lighter and cooler shades, sametime, not the plain ones but with simple prints or designs that can balance the easy-maintainance and coolness of the fabric. Shrinkage is one concern with cottons but these days they come treated and hence , not to worry. Just make sure you wash them and line dry them instead of shoving into the dryer..the dryer is the culprit, shrinks anything easily. Mixing denims with prints and pastels is an attractive look, one bright color with a printed fabric of lighter shades is another eye-catching pattern..florals and character prints are cool on kids without fail. If you want a stunning look, then purchase a single colored skirt and attach your favorite thin Zari border or a Crochet lace..customize the looks, but make sure the child manages to keep the skirt safe for longer..your efforts shouldnot be spoiled quickly ! Dressing up the kids is fun but a responsibility again..they should look cute and not older, sametime, be able to wear the skirt few more times, hence using rough and tough fabrics is a smarter idea..the talent test is to make that fighter fabric to look ultra cute ! ..Prathyusha  

  Beat The Heat In Style!     The weather is catching up on heat very quickly and you need some tips to prevent the heat from bothering you? There’s not much you can do about the weather but you can change your attire to stay cool. Let me use the bottom to top approach to help you decide on your summer look. Not many of us pay attention to the trouble our feet undergo during the summer months. Did you know that your feet swell up a little during the summer season? If you were unaware of this fact then you have been troubling your feet a lot, all these years. Your regular footwear makes your swollen feet very uncomfortable. You may be unaware of it immediately, but soon you will start experiencing discomfort. So what can be done for the poor swollen feet? The trick is to buy a pair of shoes/sandals of a slightly larger size than your regular preference. This will give your feet the much needed comfort in summer. Natural leather and known to expand so make a wise choice when you go shopping. Coming to your cloths, the fabric is what you need to choose correctly. I’m sure you know what not to wear, but do you know what to wear? If you are confused about that, let me clear your confusion with suggestions of simple dressing styles. You would be thinking that cotton will be my first suggestion. Let me improve your knowledge about fabrics. It is said that Linen will be a better choice over cotton in the summer months. Why? Simply because it is cooling. But, everything comes with a side effect. Linen is a fabric that requires frequent cleaning when you sweat into it. If you don’t mind that, then enjoy your summer with Linen on you. If this is not something you want to do then stick to the traditional cotton wear. Its not enough to choose the fabric, your choice of the color and style of your outfit also needs to be apt. Choose light colors that don't allow the heat to stay within. Coming to the style, you might have to do some summer shopping. Fortunately, this is not the only option. You can give a new look to your old cloths to make a perfect summer outfit. Make sure you have great tailor, because only the best can give the best. Take your cloths to the tailor and see if he or she can crop your skirts and blazers to make them summer fit. Also remember to allow your skin to breathe. Don’t suffocate it with extremely tight cloths. What about make up? I’m sure you know a million ways to present yourself beautifully. What you may not know is how to take care of your make up kit. Cosmetics too are intolerant to heat. They may melt and become unusable if you don’t protect them from the angry sun. The protection process of your make up kit begins with, placing a zip lock bag in the refrigerator and letting it remain there overnight. When you step out to conquer the world next morning, carry your make up kit in that cold bag. This will keep the heat from attacking your lipstick or foundation at least until you find a cool place to put it in. Try these tricks and enjoy summer! Kruti Beesam

లెహెంగాతో ఇండో వెస్టర్న్ స్టయిల్స్.. 5 మోడ్రన్ లుక్స్  

నెయిల్ పాలిష్ ఇలా కూడా వేసుకోవచ్చు...!   ఒక్కొక్కరికి ఒక్కో అలవాటు ఉంటుంది. కొందరు కుక్కల్ని పెంచుకుంటే, మరికొందరు పిల్లుల్ని పెంచుకుంటారు. ఇంకొందరయితే గోళ్లు పెంచుకుంటారు. గోళ్లు పెంచడం అంటే అలా ఇలా కాదు... చాలా శ్రద్ధ తీసుకుంటారు... ఇంకా చెప్పాలి అంటే గోళ్ళపైన ఎంతయితే శ్రద్ధ పెడతారో నెయిల్ పాలిష్ చేసుకోవడంలో కూడా అంతే శ్రద్ధ వహిస్తారు. నెయిల్ పాలిష్ లో క్రియేటివిటీ ఏ రేంజ్ కి వెళ్లిందో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి...  

What to Wear with Jeans How to Wear Jeans, Wear with Jeans, Fashion Jeans How with Wear: Dressing up jeans to create a smart casual look can be created quickly and easily with basics and accessories. Keeping the whole look simple and sleek ups the ante of jeans Try one of the following: * Crisp white button-down shirt. A classic shirt is a staple in every woman's closet, fitted with room to move and shape through the waist. A black shirt is more casual for this look. * A fitted white tee and cardigan. A take on the classic twinset, the tee adds a modern feel to the combination and provides a great blank canvas for adding punches of colour with cardigans and accessories. A dark cardigan (think navy, bottle green, chocolate, deep red) is a smarter colour, while lighter ones (pale blues and pinks, soft greens and muted shades) are on the more casual end. * A fitted white tee and a blazer. There are so many fabulous blazers available for all budgets and sizes. Black is always an easy classic, while navy pinstripe, darker colours and luxurious fabrics are sophisticated options. Velvet, corduroy, tweed, preppy knits, satin or even leather can make dark wash jeans smart. Weekend * Sheer chiffon, silk, or tissue-thin cotton tops, either sleeveless or elbow length, in a v-neck or pussy-bow tie instantly up the smartness factor of a pair of jeans. Layer with black or nude camis for a refined take. If this look seems to dressy, adding a vest or blazer over the top can take the look down a few notches. * A trench coat in cooler weather teamed with jeans is an outfit in itself. Quick and simple, this combination can go from grocery shopping to doing the school-run to the movies. * Wearing a heel elevates the status of jeans from straight casual to smart casual. Leave the sky-high stilettos at home and choose a classic one- to two-inch pump in a dark colour for a long-legged look. Black is always a simple staple and lets the rest of the outfit shine. Work Out * Peep-toes are a go-to option when dressing up jeans. A hint of foot is sexy - keep the feet in mint condition with a pedicure and a coat of polish. T-straps, embellished D'Orsays, sleek platforms and boots are great options. * When wearing flats for a smart casual look, keep the hem of the jeans just above the ground and covering the foot. Closed-in shoes (like ballet flats) are more sophisticated for this look than a pair of sandals or flip flops/thongs. * With this look, a bold accessory looks great. Chunky cocktail rings, beaded necklaces or statement earrings pull the look together. * Remember the rule of thumb - either a necklace or earrings, a ring or bangle. * Layering multiple necklaces in similar lengths and styles is fashion-forward and shows discreet personality * A mid-sized bag complements the outfit, and a handheld tote or slouchy hobo is casual, but when added to classic separates, the look becomes smart casual. An oversized bag or evening clutch would look out of place. Evening Out

Footwear For Little Girls   Who says the little feet dont get noticed!! They are the most adorable and cute feet ever! And so they need to be dressed up too. Every lifestyle store that showcases footwear has a section specially for the Little ladies' feet too.   Depending on the season and the country these footwear are available in, they come in various styles and materials. Boots, rainy wear, flipflops, shoes for school, what not..... The girls are famous for Pink! And so are their shoes...pink rules as usual. But for Moms who like to see other colors in life, stores offer footwear for their girls in various colors..until one day they trick Mom into buying everything pink!! -pratyusha.t

మనసుదోచే మువ్వల పట్టీలు     వయసుతో ఎటువంటి సంబంధం లేకుండా చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఆడవాళ్లందరూ ఇష్టపడేవి కాలి పట్టీలు. గొలుసులు, గాజులతోపాటు ఆడవాళ్ళు రోజూ ధరించే ఆభరణంగా స్థిరపడిపోయాయి కాలి పట్టీలు. కాస్త అడుగులేసే వయసు రాగానే కూతురుకు ముందుగా మువ్వల పట్టీలు చేయించి పెడతారు అమ్మా నాన్నలు. వారి బుజ్జి బుజ్జి అడుగులకు ఆ మువ్వల గలగలలు తోడై ఇల్లంతా తిరుగుతుంటే మురిసిపోతారు.     ఈనాటి అమ్మాయిలకు సంప్రదాయ దుస్తులు ధరించడమే బద్ధకంగా భావిస్తున్నారు. కానీ, కాలి పట్టీలు కూడా కాలానుగుణంగా తమ రూపురేఖలు మార్చుకుని ఆధునికతను సంతరించుకున్నాయని వారు తెలుసుకోవడం లేదు. పట్టు లంగా, వోణీ వేసుకున్నా, జీన్స్, టీషర్ట్ వేసుకున్నా వారి వస్త్రాధరణకు తగినట్టుగా ఎన్నో పట్టీలు మార్కెట్‌లో లభిస్తున్నాయి. అంతేకాదు, తమ అభిరుచికి తగ్గట్టుగా వాటిని మార్చుకుని, మాచింగ్‌గా కూడా చేసుకోవచ్చు.     సాధారణంగా కాలి పట్టీలు వెండి లేదా బంగారంతో తయారుచేస్తారు. కాని ఈరోజు మార్కెట్లో ఎన్నో రకాల కాలి పట్టీలు అందుబాటులో ఉన్నాయి. చెక్క పూసలు, బ్లాక్‌మెటల్, రంగు రంగుల పూసలు, రాళ్లు, ముత్యాలు, మువ్వలు, గొలుసులు.. చివరకు ప్లాస్టిక్ గొట్టాలు, లెదర్‌తో చేసిన పట్టీలు కూడా దొరుకుతున్నాయంటే నమ్ముతారా? ఇవి జీన్స్, స్కర్ట్స్, మినీస్, కాప్రీలు మొదలైన డ్రెస్సులకు అనువుగా మాచింగ్‌గా ఉంటాయి. అందుకే కాలేజీ అమ్మాయిలు ఇటువంటి అధునాతనమైన పట్టీలు పెట్టుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు.     అలాగని ఎప్పటికీ అవే వేసుకోవాలంటే కూడా ఇష్టపడరు. పెళ్లిళ్ళు, పార్టీల కోసం వారు ధరించే పట్టు, హెవీవర్క్ చీరలు, డ్రెస్సులకు ధీటుగా బంగారు నగలకు ఏ మాత్రం తీసిపోని పనితనంతో రంగు రంగుల రాళ్లు, ముత్యాలు, పూసలు, క్రిస్టల్స్ పెట్టి తయారుచేసిన కాలి పట్టీలు కూడా దొరుకుతున్నాయి. వెండి, బంగారంతో చేసినవి ఒకటో, రెండో కాలి పట్టీలు కొనుక్కునే బదులు ఇలాంటివి డ్రెస్సులకు మాచింగ్ ఉండేట్టు ఎన్నైనా కొనుక్కోవచ్చు.     అంతేకాదు అమ్మాయిలు తమ కొత్త డ్రెస్సులకు, అందులోని రంగులకు మాచింగ్‌గా కూడా పట్టీలు చాలా సులువుగా తయారుచేసుకోవచ్చు. ఇవన్నీ ఎక్కువ ఖరీదు కూడా ఉండవు. అందువలన ఈ పట్టీలు విరివిగా అమ్ముడవుతున్నాయి. పండగ, పెళ్లి, పార్టీ, పుట్టిన రోజు వచ్చినా, డ్రెస్సుతోపాటు కొనుక్కునే మాచింగ్ గాజులు, నగలలో కాలిపట్టీలు కూడా చేరిపోయాయి. ఎంతైన ఆ మువ్వల సవ్వడి వింటే అబ్బాయిలు కూడా ఫ్లాట్ అయిపోవాల్సిందే మరి.  

  ట్రెండీ బాగ్స్ కాదు …..ఫ్రెండ్లీ బాగ్స్    కాలేజ్, ఆఫీస్, షాపింగ్ ఇలా ఎటు వెళ్లినా సరే మనవెంట బ్యాగ్ ఉండాల్సిందే. అలాంటిది మనకు సూటయ్యే బ్యాగ్ ఏది..? ప్రజెంట్ ఏ ట్రెండ్ బ్యాగ్స్ చక్కర్లుకొడుతున్నాయో తెలుసుకోండి.. హ్యాండ్‌‌బ్యాగ్స్ చూడడానికి అందంగానే కాదు.. మనకి సౌకర్యవంతంగా కూడా ఉండాలి. ఇంకా మనకు ఈ మధ్య సందర్భాన్ని బట్టి వేసుకునే హ్యాండ్ బాగ్స్ అన్ని ఒకచోట కంబోపాక్స్ లో దొరుకుతున్నాయి ఆన్ లైన్  షాపింగ్ లో ఇలా అయితే, అన్నీ బ్యాగ్స్ అందరికీ సూట్ కావు.. మన శరీరాకృతిని బట్టీ బ్యాగ్స్‌ని ఎంచుకోవడం వల్ల ఇంకా అందంగా కనిపిస్తాం. ఎత్తు తక్కువగా ఉండేవారికి పొడవు బ్యాగ్స్ అంటే స్లింగ్ బ్యాగ్ తరహావి బాగుంటాయి.. సన్నగా, పొడవుగా ఉన్నవారికి పొట్టి బ్యాగులు బాగుంటాయి. మార్కెట్లోకి ఇప్పుడు స్టైలీష్ బ్యాగ్స్ కూడా వస్తున్నాయి. అందులో మీకు నచ్చినవి ఎంచుకోవచ్చు.. ఫ్లోరల్, డిజిటల్ బ్యాగ్స్ ప్రజెంట్ ట్రెండ్ ఆఫీస్ కి , కిడ్స్ కి లంచ్ పెట్టడానికి కూడా ఇప్పుడు చాల మంది ఈ జూట్ బాగ్స్ వాడుతున్నారు స్లింగ్ బ్యాగ్స్ కూడా మరింత ఫ్యాషన్‌గా మారాయి.. ఇక వేసవి సెలవులకి టూర్ కి వెళ్లే వాళ్ళకోసం ఈ ట్రావెల్ బాగ్స్ చాల బాగుంటాయి. బ్యాక్ ప్యాక్ బ్యాగ్స్ అయితే ఎప్పుడూ ట్రెండీనే కాబట్టి మీకు అనువైన బ్యాగ్స్ ఎంచుకోండి.. ఫ్యాషన్ ఐకాన్‌గా నిలవండి..

  పాత ఫ్యాషన్‌ తిరిగివచ్చింది   కాలం క్షణకాలం కూడా ఆగకుండా మారిపోతుంటుంది. దాంతో పాటే మన అభిరుచులు కూడా! దాన్నే మనం ట్రండ్ అంటాం. ఇవాళ ఉన్న ట్రెండ్‌ రేపు ఉండకపోవచ్చు. కానీ.... కానీ.... ఒకోసారి ఆ ట్రెండ్ తిరిగివచ్చేస్తే! పాతికేళ్లనాటి ఫ్యాషన్‌ మళ్లీ ర్యాంప్ మీద నడిచేందుకు సిద్ధమైపోతే! అలా ఇప్పుడు తిరిగొచ్చి దుమ్ము లేపుతున్న పాత ట్రెండ్స్‌ని ఓసారి చూద్దామా! Wide legged jeans నడం కిందకి దిగేకొద్దీ వెడల్పుగా ఉండే జీన్స్‌ ఓ పాతికేళ్ల క్రితం ఫ్యాషన్‌. బెల్‌బాటంను పోలిన ఈ ప్యాంట్స్ ఎంత త్వరగా వచ్చాయో అంతే తొందరగా మాయమైపోయాయి. కానీ ఓ రెండేళ్ల క్రితం ఫ్యాషన్ ప్రపంచంలోకి తిరిగి అడుగుపెట్టాయి. మళ్లీ ఈ ట్రెండ్ మాయమైపోయేలోగా ఓ జత తీసుకునేందుకు మనం తొందరపడాల్సిందే! Platform sandals ఎంత ఎత్తు హీల్‌ ఉంటే అంత ఫ్యాషన్. కానీ హైహీల్స్‌ గురించి వైద్యులు చెప్పే మాటలు అటుంచితే... నడవడానికి కూడా చాలా అసౌకర్యంగా ఉంటుంది. అందుకేనేమో సోల్ మొత్తం ఎత్తుగా ఉండే ఒకనాటి ప్లాట్‌ఫామ్‌ చెప్పులని ఫ్యాషన్ ప్రపంచం మళ్లీ వేసుకుని చూసుకుంటోంది. Bright Sunglasses సన్‌గ్లాసెస్ అంటే నల్లగానో, ట్రాన్స్‌పరెంటగానో ఉండే రోజులు పోయాయి. 90వ దశకంలో వచ్చిన నీలం, ఆకుపచ్చ రంగులతో తళతళ్లాడిపోయే కళ్లద్దాలకు మీద మళ్లీ జనం కన్ను పడింది. అంతేకాదు.... ఇప్పుడు కళ్లద్దాలు ఎలా ఉన్నా ఫ్యాషనే! గుండ్రంగా ఉన్నా, బాగా పెద్దగా ఉన్నా, స్టీల్ ఫ్రేంతో ఉన్నా... ఇప్పుడు ఫ్యాషన్ ప్రపంచం అంతా సన్‌గ్లాసెస్‌తోనే ఆడుకుంటోంది. Brown Lipstick ఒకప్పుడు ఏ రంగు కావాలంటే ఆ రంగు లిప్‌స్టిక్‌ పెట్టుకొనేవారు. రానురానూ జనం బుద్ధిగా పెదాల రంగుకి దగ్గరగా ఉండే లిప్‌స్టిక్‌నే వాడుతున్నారు. కానీ ఇప్పుడు పాత ట్రెండ్‌ తిరిగి వచ్చింది. కాంట్రాస్ట్‌ లిప్‌స్టిక్‌కి కాలం కలిసొచ్చింది. ముఖ్యంగా బ్రౌన్‌ రంగు లిప్‌స్టిక్‌ ఇప్పుడు ఫ్యాషన్ ప్రపంచంలో తప్పనిసరిగా పాటించాల్సిన ట్రెండ్‌! Huge Earrings చెవులకి వీలైనంత పెద్ద బుట్టల్ని వేసుకోవడం చాలా పాత ట్రెండే. దశాబ్దానికోసారి ఈ ట్రెండ్ మారుతూ.... ప్రస్తుతానికి మళ్లీ నిండైన బుట్టల మీదకి జనం మనసు మళ్లింది. సీరియల్స్ దగ్గర్నుంచీ ర్యాంప్ మీద నడకల వరకూ ఇప్పుడు బుట్టల మీదకే దృష్టి మళ్లుతోంది.     ఇవే కాదు... ఒకప్పుడు కుర్రకారుని వెర్రెత్తించిన డెనిమ్‌ జాకెట్స్, పాత సినిమాల్లో మాత్రమే కనిపించే షోల్డర్‌ ప్యాడ్స్ (shoulder pads) అన్నీ ఇప్పుడు తిరిగొస్తున్నాయి. కొత్తే కాదు... ఒకోసారి పాత కూడా వింతే అని రుజువుచేస్తున్నాయి.

Cute Necklaces for Little Girls The Cute, Little Girls always grab our attention !!! Moms dont bother about their looks specially when there is a sweet girl to dress up. Here are some ideas to decorate their tender necks. Some very talented artists have created beautiful and cute necklaces for little girls, kudos to their talent and interest. Off the counter, we can find many of these designs but few are still in their budding stages of patenting and marketing. Crochets, laces, chains, beads, gumballs, sequins, pearls, jute, wool, silk threads etc...whatnot...anything and everything soft can be used to make necklaces for their soft skin. Usually artists avoid harmful and sharp objects in making necklaces for kids. Their accesories come in soft, pastel colors and bright hues too, depending on the season they are worn. All the necklaces shown in pictures here have been created by various artists whose creativity demands much appreciation and we demand their products to be marketed and available across the world, as they are pretty and adorable too!! -Pratyusha.T

3D Trend In Tattoos Fashion World is always wonderful with constant change in trends. Tattoo is one such fashion which influenced almost everyone who go along with trends. For youth, Tattoos have become symbol of pride like jewellery and accessories. Tattoos have a special page in this current fashion booklet. This is the reason, we get to see so many new designs and fashions coming up in Tattoos and in this row, now “3D”Tattoos are winning hearts of tattoo lovers.   However, tattoos can get even crazier and extend from two dimensions into three with some creativity, artistry and unexpected uses of shading. In fact, these 3D tattoos look so downright realistic that they will absolutely blow your mind. When going out for permanent tattoo gets difficult or when this permanent stuff becomes boring, then above said temporary tattoos which coming in 3D will be perfect choice.   These 3D tattoos look very natural and so many designs are in the market in many possible designs; this will allow you to change your tattoos as per your mood or suitable to occasion. These 3D tattoos are so similar like stickers we get to see in the market, but because of the 3D effect incorporated in to it gives natural look and appears, unbelievable and outstanding. Now so many artists are constantly working for you to create exceptional and highly impressive designs for you. You too want to immerge yourself into fashion world with latest 3D tattoos? then go, get started now itself. - Bhavana