
ఫౌజీ రీషూట్: అవుట్‌పుట్ నచ్చలేదా?.. తెరవెనుక ఏం జరుగుతోంది.?
రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో ‘ఫౌజీ’పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో ప్రభాస్‌ను సరికొత్త అవతార్‌లో చూపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని పెంచగా.. ఇప్పుడు ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ గురించి ఆసక్తికరమైన ప్రచారం మొదలైంది. తాజా సమాచారం ప్రకారం.. ‘ఫౌజీ’ కోసం రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ కొరియోగ్రఫీలో ఓ భారీ ఫైట్ సీక్వెన్స్‌ను చిత్రీకరించారట. అయితే ఆ సీక్వెన్స్ అవుట్‌పుట్ టీమ్ అనుకున్న స్థాయిలో రాకపోవడంతో, ఇప్పుడు ప్రముఖ ఫైట్ మాస్టర్ సాల్మన్ నేతృత్వంలో మళ్లీ చిత్రీకరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ రీషూట్‌కు సంబంధించిన వార్తల్లో మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. ఈ ఫైట్ సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ అయ్యే అవకాశం ఉందట. ప్రభాస్ ఒకవైపు, రజాకార్లు మరోవైపు ఉండే భారీ యాక్షన్ ఎపిసోడ్‌గా దీన్ని రూపొందిస్తున్నట్లు టాక్. ఈ యాక్షన్ ఎపిసోడ్లో ప్రభాస్ వార్ మెషీన్ వాహనంపై సిగార్‌తో కనిపిస్తారనే ప్రచారం అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది. వన్ ఆర్మీగా ప్రభాస్ ప్రత్యర్థులను ఎదుర్కొనే సన్నివేశాలు సినిమాలో హైలైట్‌గా నిలవవచ్చనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ‘ఫౌజీ’ కథ స్వాతంత్ర్యానికి ముందు కాలం నేపథ్యంలో సాగనుండటంతో.. ఆ కాలానికి తగ్గట్టుగా భారీ యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. హను రాఘవపూడి తనదైన భావోద్వేగభరితమైన కథనానికి యాక్షన్‌ను జోడిస్తే, ప్రభాస్ అభిమానులకు మరో కొత్త అనుభూతి దక్కే అవకాశం ఉంది. ప్రస్తుతం జరుగుతున్న షూటింగ్ షెడ్యూల్‌ను వచ్చే వారంలో పూర్తి చేయాలని టీమ్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. మొత్తానికి ‘ఫౌజీ’లో ప్రభాస్‌ను యుద్ధవీరుడిగా చూపించే యాక్షన్ ఎపిసోడ్స్‌పై ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా వన్ ఆర్మీ వర్సెస్ రజాకార్ల పోరాటమే ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే.. థియేటర్లలో అభిమానులకు గూస్బంప్స్ రావడం ఖాయమనే అంచనాలు ఉన్నాయి. ఇది కూడా చదవండి: మళ్ళీ ఫ్యామిలీ బాటలో నాని.. ప్యారడైజ్ దెబ్బకు రక్తపాతానికి గుడ్‌బై.! [Prabhas Fauzi ReShoot, Fauzi Movie Update, Prabhas Action Sequence, Fauzi Interval Bang, Fauzi Razakars Fight, Prabhas Fauzi Movie, Rebl Star Prabhas, Hanu Raghavapudi, Telugu Film News]
Oct 9, 2026 4:56PMమళ్లీ ‘ఆ’ తప్పు చేయదలుచుకోలేదు.. బాలీవుడ్ డైరెక్టర్‌కి ‘నో’ చెప్పిన రామ్‌చరణ్.!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ‘ఆర్ఆర్ఆర్’తో అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. కథల ఎంపికలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో గతంలో తనతో సినిమా చేసిన ఓ బాలీవుడ్ దర్శకుడికి చరణ్ నో చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ దర్శకుడు మరెవరో కాదు.. ‘జంజీర్’ సినిమాతో చరణ్‌ను బాలీవుడ్‌కు పరిచయం చేసిన అపూర్వ లఖియా. తాజాగా ఆయన మరో కథతో రామ్ చరణ్‌ను సంప్రదించగా, ఈ మెగా హీరో సున్నితంగా తిరస్కరించినట్లు ప్రచారం జరుగుతోంది. అమితాబ్ బచ్చన్ నటించిన క్లాసిక్ మూవీ ‘జంజీర్’ను 2013లో రీమేక్ చేశారు. అపూర్వ లఖియా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రామ్ చరణ్‌కు జోడీగా ప్రియాంక చోప్రా నటించగా, సంజయ్ దత్, ప్రకాష్ రాజ్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషించారు. తెలుగులో ‘తుఫాన్’ పేరుతోనూ విడుదలైన ఈ సినిమా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. బాలీవుడ్లో తొలి ప్రయత్నమే నిరాశను మిగల్చడంతో రామ్ చరణ్‌కు ఈ సినిమా ఒక చేదు అనుభవంగా మిగిలిపోయింది. అయితే, ఆ తర్వాత చరణ్ తన కెరీర్‌ను పూర్తిగా కొత్త దిశలో ముందుకు తీసుకెళ్లారు. ‘రంగస్థలం’, ‘ఆర్ఆర్ఆర్’ వంటి చిత్రాలతో నటుడిగా తన స్థాయిని పెంచుకున్నారు. ప్రస్తుతం గ్లోబల్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. మరోవైపు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న తన తదుపరి సినిమాపై దృష్టి పెట్టారు. ఇలాంటి సమయంలో గతంలో తనకు పరాజయాన్ని అందించిన దర్శకుడితో మరోసారి సినిమా చేయడానికి ఆసక్తి చూపడం లేదనే ప్రచారం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే అపూర్వ లఖియా ప్రతిపాదనను చరణ్ తిరస్కరించడానికి ఇదే కారణమని అధికారికంగా వెల్లడి కాలేదు. మరోవైపు, ‘జంజీర్’ పరాజయం తర్వాత రామ్ చరణ్ హిందీలో మరో స్ట్రెయిట్ సినిమా చేయలేదు. సరైన కథ దొరికితే హిందీ సినిమాల్లో నటించేందుకు సిద్ధమేనని గతంలో ఆయన చెప్పినప్పటికీ, ఇప్పటివరకు అలాంటి ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం తెలుగు సినిమాలతో పాటు పాన్ ఇండియా మార్కెట్‌పై దృష్టి పెట్టిన చరణ్.. తన తదుపరి ప్రాజెక్టుల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. మరి భవిష్యత్తులో ఆయన బాలీవుడ్‌లోకి మళ్లీ అడుగుపెడతారా? అపూర్వ లఖియాతో మరోసారి పనిచేసే అవకాశం ఉంటుందా? అనేది వేచి చూడాలి. [Ram Charan, Ram Charan Rejects Apoorva Lakhia, Apoorva Lakhia New Movie, Zanjeer Movie Failure, Thoofan Movie Ram Charan, Ram Charan Upcoming Movies, Ram Charan Bollywood News]
Oct 9, 2026 2:14PM
రజినీకాంత్, ధనుష్ ల కొత్త పార్టీ: అధ్యక్షుడు, సెక్రటరీ ఎవరంటే!
సినీ రంగానికి ఉన్న అరుదైన ప్రత్యేకత ఏంటంటే పెళ్లి అయిన తర్వాత పిల్లలు ఉండి విడిపోయినా కూడా చాలా హుందాగా విడిపోతారు. అంతే కానీ కుటుంబ పరంగా ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం అనేది జరగదు. పైగా టన్నుల కొద్దీ ఉన్న అభిమానం మాత్రం ఇంచు కూడా తగ్గదు. ఈ కోవలోనే సూపర్ స్టార్ రజినీకాంత్ అల్లుడి హోదా నుంచి ధనుష్ విరమించుకున్నా ఆ ఇద్దరి మధ్య అభిమానం మాత్రం పోలేదనేది తమిళ సినీ సర్కిల్స్ లో ఎప్పుడు వికసిస్తూ తిరిగే మాట. ఇక తమిళనాడుకి, రాజకీయాలకి ఉన్న సంబంధం తెలిసిందే. దాదాపుగా దశాబ్దాల తరబడి నుంచి తమిళ రాజకీయాలని శాసిస్తుంది సినిమా వాళ్లే. కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో, పొలిటికల్ కారిడార్లలో ఒక సరికొత్త సంచలనాత్మక ప్రచారం శరవేగంగా వైరల్ అవుతోంది. రజనీకాంత్, ధనుష్ కలిసి ఒక కొత్త రాజకీయ పార్టీని స్థాపించబోతున్నారనే వార్తలు కోలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు భారీ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ వార్తల వెనుక ఉన్న అసలు నిజాలు ఏమిటి, అసలు ఈ రూమర్లు ఎందుకు పుట్టుకొచ్చాయో లోతుగా పరిశీలిస్తే ఆసక్తికర అంశాలు బయటపడుతున్నాయి.ఇటీవల తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలల్లో దళపతి విజయ్ 'తమిళగ వెట్రి కళగం' పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి ఊహించని విజయాన్ని సాధించడంతో, కోలీవుడ్‌లోని మరికొందరు స్టార్ హీరోల పొలిటికల్ ఎంట్రీపై చర్చలు వేడెక్కాయి. ఈ క్రమంలోనే ధనుష్ భారత ఎన్నికల సంఘం వద్ద 'తమిళగ ఎళుచ్చి కళగం' అనే పేరుతో ఒక నూతన రాజకీయ పార్టీని రిజిస్టర్ చేయించారని, దానికి రజనీకాంత్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తే, ధనుష్ జనరల్ సెక్రటరీగా బాధ్యతలు చేపడతారనే ఊహాగానాలు షికారు చేయడం ప్రారంభించాయి. ముఖ్యంగా ధనుష్ తన అభిమాన సంఘాలను సామాజిక సేవా కార్యక్రమాల వైపు నడిపించడం, ఫ్యాన్ క్లబ్స్ కోసం ప్రత్యేకంగా ఒక నూతన పతాకాన్ని ఆవిష్కరించడం వంటి పరిణామాలు ఈ పొలిటికల్ రూమర్లకు మరింత బలాన్ని చేకూర్చాయి. అంతేకాకుండా, గతంలో రజనీకాంత్ 'రజని మక్కల్ మన్రం' పేరుతో తన అభిమాన సంఘాలను బలోపేతం చేసి, దాదాపు 234 నియోజకవర్గాల్లో కార్యకర్తల నెట్‌వర్క్‌ను సిద్ధం చేసినప్పటికీ, ఆరోగ్య కారణాల వల్ల ప్రత్యక్ష రాజకీయాల నుంచి వెనక్కి తగ్గారు. ఇప్పుడు ఆ విస్తృతమైన అభిమాన బలాన్ని, ధనుష్ యంగ్ ఫ్యాన్ బేస్‌ను ఏకం చేస్తూ 100% పక్కా ప్రణాళికతో వీరు పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారంటూ నెట్టింట కథనాలు ఊపందుకున్నాయి. కొంతమంది విశ్లేషకులు ఒకడుగు ముందుకు వేసి, వచ్చే ఎన్నికల్లో వీరు మరో 2 లేదా 3 కీలక ప్రాంతీయ శక్తులతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉందంటూ లెక్కలు కట్టడం కూడా మొదలుపెట్టారు.అయితే, ఈ వైరల్ రూమర్లలో ఎంతవరకు నిజముందనేది ఇప్పుడు అసలైన ప్రశ్న. రజనీకాంత్, ధనుష్ ప్రతినిధుల నుంచి కానీ, లేదా ఇరు కుటుంబాల నుంచి కానీ ఈ ఉమ్మడి రాజకీయ ప్రవేశంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ధనుష్ తన స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను కేవలం సామాజిక కోణంలోనే విస్తరిస్తున్నారని, దానికి రాజకీయ రంగు పూయడం తొందరపాటే అవుతుందని ఆయన సన్నిహిత వర్గాలు గుసగుసలాడుతున్నాయి. రజనీ ఇదివరకే పొలిటికల్ చాప్టర్‌కు శుభం కార్డ్ వేశానని స్పష్టం చేసినందున, మళ్లీ కొత్త పార్టీ అధ్యక్షుడిగా వస్తారనడంలో వాస్తవం లేదనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా, అధికారిక స్పష్టత వచ్చే వరకు రజనీ, ధనుష్ కాంబినేషన్ వార్తలు నెటిజన్లకు, అభిమానులకు కావాల్సినంత సినీ హాట్ టాపిక్. [Rajinikanth And Dhanush Political Party Rumors, Rajinikanth Dhanush Political Party, Dhanush New Party Rumors, Tamilaga Ezhuchi Kazhagam, Telugu Cinema News, Telugu Cinema, Tollywood, Tollywood News]
Oct 7, 2026 10:44AM
అల్లు అర్జున్-బోయపాటి కాంబో: ఈసారి మాస్ సినిమా కాదు.. పెద్ద స్కెచ్ వేశారుగా.!
‘సరైనోడు’ వంటి మాస్ బ్లాక్‌బస్టర్ అందించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బోయపాటి శ్రీను కాంబినేషన్‌పై ఎప్పటి నుంచో ఆసక్తి ఉంది. ఈ కాంబోలో మరో సినిమా వస్తే బాగుంటుందని అభిమానులు కూడా చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఈ కాంబినేషన్‌కు సంబంధించి ఇండస్ట్రీలో ఆసక్తికరమైన టాక్ వినిపిస్తోంది. గీతా ఆర్ట్స్ బ్యానర్లో అల్లు అర్జున్, బోయపాటి శ్రీను కాంబినేషన్లో ఓ ప్రాజెక్ట్‌పై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ డిస్కషన్స్ దశలోనే ఉందని చెబుతున్నారు. ఇంకా అధికారికంగా ఏమీ ఫైనల్ కాలేదు. గతంలోనూ గీతా ఆర్ట్స్‌లో బోయపాటి సినిమా గురించి వార్తలు వచ్చాయి. ‘సరైనోడు’ తర్వాత ఈ బ్యానర్ బోయపాటికి అడ్వాన్స్ కూడా ఇచ్చినట్లు అప్పట్లో కథనాలు వచ్చాయి. అల్లు అర్జున్‌తోనే మరో సినిమా చేయాలనే ఆలోచన కూడా ఉన్నట్లు ప్రచారం జరిగింది. అయితే అది అప్పట్లో కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు మాత్రం పరిస్థితులు మారాయి. అల్లు అర్జున్ ‘పుష్ప’ సిరీస్‌తో పాన్ ఇండియా స్థాయిలో తన మార్కెట్‌ను మరింత పెంచుకున్నారు. దీంతో బన్నీతో సినిమా చేయాలంటే కేవలం తెలుగు మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని కాకుండా మరింత పెద్ద స్కేల్లో ఉండాల్సిన అవసరం ఉంది. ఇదే సమయంలో బోయపాటి శ్రీనుకు కూడా ‘అఖండ’, ‘అఖండ 2’తో పాన్ ఇండియా మార్కెట్‌పై ఫోకస్ పెరిగింది. ఆయన సినిమాలకు హిందీలో డబ్బింగ్ ద్వారా మంచి గుర్తింపు ఉండటం కూడా ఈ కాంబినేషన్‌కు కలిసొచ్చే అంశంగా మారింది. అయితే ఈ ప్రాజెక్ట్ విషయంలో అసలు ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఇది బోయపాటి మార్క్ మాస్ యాక్షన్ సినిమా కాదట. అల్లు అర్జున్ సన్నిహిత వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం.. ఈ ప్రాజెక్ట్‌ను పాన్ ఇండియా మార్కెట్ ను టార్గెట్ చేస్తూ, బిగ్ స్కేల్ లో భారీగా ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. గీతా ఆర్ట్స్ కూడా ప్రస్తుతం వరుసగా సినిమాలు నిర్మించడం కంటే పెద్ద, క్వాలిటీ ప్రాజెక్టులపై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అల్లు అర్జున్-బాసిల్ జోసెఫ్ కాంబినేషన్‌తో పాటు బోయపాటి-బన్నీ కాంబో కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. అయితే ఇక్కడ మరోసారి చెప్పుకోవాల్సిన విషయం.. అల్లు అర్జున్-బోయపాటి సినిమా ఇంకా అధికారికంగా ఖరారు కాలేదు. ప్రస్తుతం చర్చలు మాత్రమే జరుగుతున్నాయి. కథ, స్కేల్, డేట్స్ వంటి అంశాలపై క్లారిటీ వచ్చిన తర్వాతే ఈ కాంబినేషన్‌పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇది కూడా చదవండి: ప్యారడైజ్ థియేటర్లలో మిస్సయింది.. ఓటీటీలో మాత్రం గూస్బంప్స్ గ్యారెంటీ.! [Allu Arjun Boyapati Srinu Combo, Allu Arjun Next Movie, Boyapati Srinu Next Movie, Icon Star Allu Arjun, Boyapati Sreenu, Sarrainodu Movie, Geetha Arts, Telugu Film News]
Oct 5, 2026 5:45PM
‘వారణాసి’లో హాలీవుడ్ నటి: మహేష్‌తో రొమాన్స్ చేస్తున్న ఆ బ్యూటీ ఎవరు.?
సూపర్‌స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘వారణాసి’పై రోజుకో కొత్త వార్త బయటకు వస్తోంది. ఇప్పటికే ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి భారీ తారాగణంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పుడు ఈ లైనప్‌లో హాలీవుడ్ హీరోయిన్ పేరు వినిపిస్తోంది. బ్రిటిష్ నటి డైసీ ఎడ్గర్-జోన్స్ ‘వారణాసి’లో నటిస్తున్నారనే ప్రచారం ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. అంతేకాదు.. సినిమాలో మహేష్ బాబుతో ఆమెకు కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు కూడా ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. రాజమౌళి గత చిత్రం ‘ఆర్ఆర్ఆర్’లో జూనియర్ ఎన్టీఆర్ సరసన జెన్నీ పాత్ర కోసం డైసీ ఎడ్గర్-జోన్స్ పేరు మొదట వినిపించింది. అయితే కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్‌లో ఆమె నటించలేదు. ఆ పాత్రలో చివరకు ఒలివియా మోరిస్ కనిపించారు. ఇప్పుడు అదే డైసీ.. మహేష్ బాబుతో కలిసి ‘వారణాసి’లో కనిపించబోతున్నారనే వార్త ఆసక్తిని పెంచుతోంది. రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ మూవీ టైమ్ ట్రావెల్, అడ్వెంచర్, భారతీయ పురాణాల అంశాలను కలిపిన భారీ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్. మహేష్ బాబు ఇందులో రుద్ర పాత్రతో పాటు శ్రీరాముడి పాత్రలో కూడా కనిపించనున్నారు. ప్రియాంక చోప్రా మందాకినిగా, పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభగా నటిస్తున్నారు. ఇప్పటికే ‘వారణాసి’ షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. 2027 ఏప్రిల్ 7 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది కూడా చదవండి: ‘భోగి’ టీజర్ అదిరిపోయింది.. శర్వానంద్‌లో ఇలాంటి యాక్షన్ ఎప్పుడూ చూడలేదు.! [Daisy Edgar Jones In Varanasi, Daisy Edgar Jones, Varanasi Movie, Mahesh Babu, SS Rajamouli, RRR Movie, Jr NTR, Telugu Film News]
Oct 4, 2026 4:27PM
ఫస్ట్ టైమ్ అలాంటి పాత్రలో: లోకేష్ కనగరాజ్ సినిమాలో అల్లు అర్జున్ రోల్ ఇదే.!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అట్లీ దర్శకత్వంలో ‘రాకా’ చేస్తుండగా.. ఆ తర్వాత తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌తో కలిసి ఓ భారీ పాన్ ఇండియా సినిమా చేయబోతున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ అధికారికంగా ప్రకటించారు. ‘AA23’ వర్కింగ్ టైటిల్‌తో పిలుస్తున్న ఈ సినిమాపై అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్న ఈ ప్రాజెక్ట్‌ను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లోకేష్ కనగరాజ్ సినిమాలో అల్లు అర్జున్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారనే ప్రచారం మొదలైంది. ఇప్పటివరకు బన్నీ ఫుల్ లెంగ్త్ సీరియస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించలేదు. ‘రేసుగుర్రం’లో మాత్రం కొంతసేపు పోలీస్ గెటప్‌లో కనిపించిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పుడు లోకేష్ సినిమాలో బన్నీని పవర్ఫుల్ కాప్‌గా చూపించబోతున్నారనే టాక్ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. లోకేష్ కనగరాజ్ సినిమాలంటే సాధారణంగా డ్రగ్స్, గ్యాంగ్స్టర్స్, మాఫియా, యాక్షన్ ఎలిమెంట్స్ గుర్తొస్తాయి. అయితే పోలీస్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా చేయాలనే తన ఆసక్తిని లోకేష్ గతంలో వ్యక్తంపరిచారు. దీంతో లోకేష్.. అల్లు అర్జున్ కాంబినేషన్లోనే అలాంటి పోలీస్ స్టోరీ చేయబోతున్నాడా? అనే చర్చ మొదలైంది. ఇది కూడా చదవండి: ఏమో ఏమో ఇది.. సరికొత్త లవ్ ఆంథమ్ వచ్చేసింది.! [Allu Arjun Cop Role, Allu Arjun Police Role, Allu Arjun Role In AA23, AA23 Movie, Allu Arjun, Lokesh Kanagaraj, Anirudh Ravichander, Raaka Movie, Telugu Film News, Telugu News]
Sep 29, 2026 4:50PM.webp)
శ్రీకాంత్ ఓదెలకు షాక్: బుచ్చిబాబుతో చిరంజీవి నెక్స్ట్ మూవీ.!
ఇప్పటికే 'విశ్వంభర' షూటింగ్ పూర్తి చేసిన మెగాస్టార్ చిరంజీవి.. ప్రస్తుతం 'కాకా'తో బిజీగా ఉన్నారు. బాబీ కొల్లి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ.. వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. దీని తర్వాత చిరంజీవి చేయబోయే సినిమా విషయంలో.. ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. నిజానికి చిరంజీవి తన 159వ సినిమాను శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చేయాల్సి ఉంది. నాని నిర్మాతగా ఈ సినిమా అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా వచ్చింది. అయితే ఇప్పుడు అనూహ్యంగా.. మెగాస్టార్ నెక్స్ట్ మూవీ కోసం బుచ్చిబాబు రంగంలోకి దిగుతున్నట్లు వార్తలొస్తున్నాయి. నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల రూపొందించిన 'ప్యారడైజ్' మూవీ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కలెక్షన్స్ సంగతి పక్కన పెడితే.. ఈ సినిమాకి ఫస్ట్ షో నుంచే నెగెటివ్ టాక్ వచ్చింది. ముఖ్యంగా శ్రీకాంత్ పై దారుణమైన ట్రోల్స్ వచ్చాయి. దీంతో ఓదెలతో చిరంజీవి సినిమా డౌట్ అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు అదే నిజమయ్యేలా కనిపిస్తోంది. బుచ్చిబాబుతో సినిమా చేయడానికి చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని నిర్మించనుందని సమాచారం. మెగా హీరో వైష్ణవ్ తేజ్ డెబ్యూ మూవీ 'ఉప్పెన'తో డైరెక్టర్ గా పరిచయమైన బుచ్చిబాబు.. తన సెకండ్ మూవీ 'పెద్ది'ని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో చేశారు. ఇప్పుడు థర్డ్ మూవీకి ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో చేతులు కలపబోతున్నట్లు న్యూస్ వైరల్ అవుతోంది. ఒకవేళ చిరంజీవి-బుచ్చిబాబు కాంబినేషన్ నిజమైతే.. శ్రీకాంత్ ఓదెల ప్రాజెక్ట్ పరిస్థితి ఏంటనేది ఆసక్తికరంగా మారింది. బుచ్చిబాబు ఫిల్మ్ తర్వాత ఆ ప్రాజెక్ట్ ఉంటుందా? లేక హోల్డ్ లో పడిందా? అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇది కూడా చదవండి: నైజాంలో 50 కోట్లు.. ‘ప్యారడైజ్’తో నాని ఆల్ టైమ్ రికార్డ్.! [Chiranjeevi Next Movie, Chiranjeevi Buchi Babu Movie, Chiranjeevi Srikanth Odela Movie, Buchi Babu Sana, Srikanth Odela, The Paradise Movie, Megastar Chiranjeevi, Natural Star Nani, Telugu Film News]
Sep 29, 2026 12:35PM
మహేష్ - లోకేష్ కాంబో ఫిక్స్: అల్లు అర్జున్ సినిమా వెనక్కి వెళ్లిందా.?
సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కలసి ఒక భారీ పాన్-ఇండియా ప్రాజెక్ట్ చేయబోతున్నారా?.. ప్రస్తుతం సోషల్ మీడియాలో, టాలీవుడ్ ఫిల్మ్ వర్గాల్లో ఊపేస్తున్న క్రేజీ బజ్ ఇది. రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న భారీ ప్రాజెక్ట్ 'వారణాసి' షూటింగ్ ను ఇటీవలే మహేష్ బాబు పూర్తి చేశారు. అయితే ఈ సినిమా తర్వాత మహేష్ ఏ డైరెక్టర్ తో పని చేయబోతున్నారు అనే దానిపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు లోకేష్ కనగరాజ్ పేరు గట్టిగా వినబడుతోంది. ఇటీవల లోకేష్ కనగరాజ్ ఒక బిగ్ ఐడియాతో మహేష్‌ను కలిసి ఓ లైన్ వినిపించారని, దానికి మహేష్ కూడా సానుకూలంగా స్పందించారని ఫిల్మ్ నగర్లో టాక్ నడుస్తోంది. రాజమౌళి సినిమా పూర్తయిన వెంటనే ఈ కాంబో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఇక్కడో ట్విస్ట్ ఉంది. లోకేష్ ఇప్పటికే అల్లు అర్జున్ తో ఓ సినిమా కమిటై ఉన్నారు. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ చేస్తున్న 'రాకా' ఆలస్యమవుతుండటంతో.. ఈ గ్యాప్ లో మహేష్ ప్రాజెక్టును లోకేష్ పట్టాలెక్కిస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. ఇది కూడా చదవండి: అక్కడే నా ఇగో దెబ్బతింది: శ్రీకాంత్ ఓదెలపై మోహన్ బాబు కామెంట్స్.! [Mahesh Babu Lokesh Kanagaraj Movie, Mahesh Babu Next After Varanasi, Mahesh Babu Next Movie, Mahesh Babu Varanasi Movie, Mahesh Babu, Lokesh Kanagaraj, Allu Arjun, Telugu Film News, Telugu News]
Sep 26, 2026 7:08PM
‘ఫౌజీ’ కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్: స్పిరిట్ పరిస్థితి ఏంటి.?
ప్రభాస్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ‘ఫౌజీ’ కూడా ఒకటి. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా రిలీజ్ డేట్‌పై ఓ ఆసక్తికరమైన అప్డేట్ వినిపిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 3న విడుదల కావాల్సి ఉండగా.. వాయిదా పడినట్లు ఇటీవల నిర్మాత రవిశంకర్ ప్రకటించారు. దీంతో ఈ సినిమా వచ్చే ఏడాది మార్చికి షిఫ్ట్ కానుందని ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్టే తాజాగా మేకర్స్ డేట్ కూడా లాక్ చేసినట్లు తెలుస్తోంది. మార్చి 18ను ‘ఫౌజీ’ రిలీజ్ డేట్‌గా ఖరారు చేసినట్లు సమాచారం. అయితే దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు 2027 మార్చిలో విడుదల కావాల్సిన ప్రభాస్ మరో మూవీ 'స్పిరిట్' అక్టోబర్ కి పోస్ట్ పోయినట్లు వినికిడి. ఇంకా 50 రోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఉండగా, నవంబర్ నుంచి రీస్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నారట. [Fauzi Postponed, Fauzi New Release Date, Prabhas Fauzi Movie, Spirit Postponed, Spirit Release Date, Prabhas Spirit Movie, Hanu Raghavapudi, Sandeep Reddy Vanga, Telugu Film News]
Sep 25, 2026 11:32AM
డ్రాగన్‌లో లవ్ సాంగ్: ఎన్టీఆర్ కోసం రూట్ మార్చిన నీల్.. ఫ్లాష్‌బ్యాక్ ట్విస్ట్ లీక్.!
జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రూపొందుతోన్న మూవీ 'డ్రాగన్'. ప్రశాంత్ నీల్ సినిమా అనగానే డార్క్ థీమ్, భారీ ఎలివేషన్లు గుర్తుకొస్తున్నాయి. 'డ్రాగన్' కూడా అలాగే ఉండబోతుందని గ్లింప్స్ తో అర్థమైంది. అయితే ఇందులో ఒక ట్విస్ట్ ఉందట. ప్రశాంత్ నీల్ తన రెగ్యులర్ శైలికి భిన్నంగా.. ఎన్టీఆర్ కోసం ఒక లవ్ ట్రాక్ ని, ముఖ్యంగా ఒక బ్యూటిఫుల్ లవ్ సాంగ్ ని డిజైన్ చేశారట. 'డ్రాగన్' సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టర్ ప్రెజెంట్ టైమ్‌లైన్‌లో ఒక క్రూరమైన అస్సాసిన్గా సాగుతుంది. అంతర్జాతీయ ఓపియం మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో నడిచే ఈ పాత్ర పేరు 'లూగర్'. ఈ లూగర్ పాత్ర మొత్తం ప్రశాంత్ నీల్ మార్క్ డార్క్ అండ్ గ్రే షేడ్స్‌లోనే, రక్తం ఉడికిపోయే సీన్స్, వైలెంట్ ఎలివేషన్లతో నెవర్ బిఫోర్ రేంజ్లో ఉండబోతోంది. ఒక మామూలు మనిషి, ఇంత క్రూరమైన 'లూగర్' అనే అస్సాసిన్గా ఎందుకు మారాల్సి వచ్చింది? అసలు అతనికి ఎదురైన ఆ ఘోరమైన ట్రాజెడీ ఏంటి? అనేదే ఈ సినిమాలో మేజర్ హైలైట్ కాబోతోంది. ఈ గతాన్ని చూపించే ఫ్లాష్‌బ్యాక్ పోర్షన్స్ కోసం నీల్ ఒక సరికొత్త కలర్‌ఫుల్ వరల్డ్‌ని క్రియేట్ చేశారట. ఈ ఫ్లాష్‌బ్యాక్‌లో ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్ చాలా కూల్‌గా, క్లాస్‌గా, లవ్లీగా ఉండబోతోంది. హీరోయిన్ రుక్మిణి వసంతతో కలిసి ఒక వింటేజ్ అండ్ క్లాసిక్ లవ్ ట్రాక్ నడుస్తుందని టాక్. అంతేకాదు, ప్రశాంత్ నీల్ సినిమాల్లో మనం ఇప్పటివరకు చూడని విధంగా.. రిచ్ లొకేషన్స్, కలర్‌ఫుల్ కాస్ట్యూమ్స్‌తో ఒక మైండ్ బ్లోయింగ్ మెలోడీ లవ్ సాంగ్‌ని కూడా డిజైన్ చేశారట. కన్నులవిందు చేసే విజువల్స్‌తో ఈ సాంగ్ ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకోవడం ఖాయం అంటున్నారు. ఆ ప్రశాంతమైన, అందమైన రంగుల ప్రపంచం.. ఒక ఊహించని ఘోరమైన సంఘటన వల్ల ఒక్కసారిగా చీకటి మయంగా మారిపోతుంది. ఆ పగ, ప్రతీకారం వల్ల రూపుదిద్దుకున్న భయంకరమైన రూపమే ఈ 'లూగర్'... అదే మన 'డ్రాగన్'. ప్రశాంత్ నీల్ మార్క్ పీక్ ఎమోషన్స్, మాస్ గూస్బమ్స్ మూమెంట్స్, దానికి తోడు ఎన్టీఆర్ నటన... ఇవన్నీ థియేటర్లలో విజువల్ ఫీస్ట్‌ని అందించబోతున్నాయి. [Dragon Movie Love Song, Dragon Movie Flashback, NTR Luger Character, NTR Dragon Movie, Jr NTR, Prashanth Neel, Rukmini Vasanth, Telugu Film News, Telugu News]
Sep 18, 2026 4:58PM
మహేష్ బాబుతో భన్సాలీ భారీ ప్లాన్: ఆ క్రేజీ కాంబినేషన్ నిజంగానే సెట్ అవుతుందా.?
సూపర్‌స్టార్ మహేష్ బాబు క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఆయనతో ఒక్క సినిమానైనా తెరకెక్కించాలని ఇటు టాలీవుడ్ నుంచి అటు బాలీవుడ్ దాకా ఎందరో మేకర్స్ ప్రయత్నిస్తుంటారు. తాజాగా ఈ లిస్ట్‌లో బాజీరావ్ మస్తానీ, పద్మావత్ వంటి చిత్రాలను అందించిన ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ పేరు గట్టిగా వినిపిస్తోంది. టాలీవుడ్ కి చెందిన ఓ టాప్ హీరోతో పాన్ ఇండియా స్థాయిలో భారీ పీరియాడిక్ ప్రాజెక్ట్ చేయాలని భన్సాలీ చాలా కాలంగా ప్లాన్ చేస్తున్నారు. గతంలో అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలతో ఆయన చర్చలు జరిపినట్లు ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు లేటెస్ట్గా ఈ రేసులోకి మహేష్ బాబు పేరు వచ్చి చేరింది. ఫిల్మ్ సర్కిల్స్ లో జరుగుతున్న ప్రచారం ప్రకారం.. తాజాగా భన్సాలీ స్వయంగా మహేష్ బాబును కలిసి ఓ పవర్ ప్యాక్డ్ కథను వినిపించారట. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా త్వరలోనే పట్టాలెక్కనుందంటూ జోరుగా చర్చ నడుస్తోంది. ఫ్యాన్స్ అయితే ఈ కాంబో నిజమైతే బాక్సాఫీస్ రికార్డులు తిరగరాయడం పక్కా అని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. అయితే, ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే.. ప్రస్తుతం మహేష్ బాబు దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ ‘వారణాసి’తో ఫుల్ బిజీగా ఉన్నారు. జక్కన్న సినిమా అంటే ఏ స్థాయిలో ఉంటుందో తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే వరకు మహేష్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పై ఎలాంటి అధికారిక నిర్ణయం తీసుకునే అవకాశం లేదని తెలుస్తోంది. ‘వారణాసి’ పూర్తయిన తర్వాతే, భన్సాలీ ప్రాజెక్ట్ విషయంలో నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి భన్సాలీ చెప్పిన కథ మహేష్‌కు నచ్చిందా? రాజమౌళి సినిమా తర్వాత ఈ క్రేజీ కాంబినేషన్ నిజంగానే సెట్ అవుతుందా? లేదా ఇదంతా కేవలం రూమర్‌గానే మిగిలిపోతుందా? అన్న దానిపై రాబోయే రోజుల్లో పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. [Mahesh Babu Sanjay Leela Bhansali Movie, Mahesh Babu Next Movie, Superstar Mahesh Babu, Sanjay Leela Bhansali, Varanasi Movie, SS Rajamouli, Telugu Movie News, Telugu News, Tollywood]
Sep 16, 2026 2:26PM
ఫౌజీ కొత్త రిలీజ్ డేట్: ఊహించని డేట్ లాక్ చేసిన మేకర్స్.!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న మూవీ 'ఫౌజీ'. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని డిసెంబర్ 3, 2026న విడుదల చేయనున్నట్లు గతంలో ప్రకటించారు. షూటింగ్ ఇంకా పెండింగ్ ఉండటం, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కి ఎక్కువ సమయం కేటాయించాల్సి రావడం వంటి కారణాలతో 'ఫౌజీ' వాయిదా పడినట్లు కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. 'ఫౌజీ' వచ్చే ఏడాది జనవరిలో విడుదలవుతుందని, కాదు మార్చిలో అని రకరకాల న్యూస్ చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ రెండూ కాకుండా ఫిబ్రవరిలో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. జనవరిలో సంక్రాంతి సీజన్ పై ఇప్పటికే పలు సినిమాలు కర్చీఫ్ వేశాయి. మార్చి లోనేమో ప్రభాస్ మరో మూవీ 'స్పిరిట్' ఉంది. అందుకే ఫిబ్రవరి మంచి ఆప్షన్ అని భావిస్తున్నారట. 'ఫౌజీ' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకుంది. ప్రస్తుతం మేకర్స్, కొత్త రిలీజ్ గురించి నెట్ ఫ్లిక్స్ తో చర్చలు జరుపుతున్నారట. డేట్ ఫైనల్ అయితే, త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారని సమాచారం. [Prabhas Fauzi Movie, Fauzi New Release Date, Fauzi February Release, Fauzi Movie 2027, Fauzi vs Spirit, Prabhas, Hanu Raghavapudi, Telugu Film News, Telugu News]
Sep 15, 2026 3:32PM
అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కి షాక్: 2028కి వాయిదా పడిన 'రాకా'.!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ లో రాబోతున్న 'రాకా' సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే 'పుష్ప' లాంటి ఆల్-టైమ్ బ్లాక్ బస్టర్ తర్వాత అల్లు అర్జున్ చేస్తోన్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఇది. అసలు ముందు అనుకున్న ప్లాన్ ప్రకారం.. ఈ ఏడాది దసరా నాటికే ఈ సినిమా షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేసి, 2027 క్రిస్మస్ కానుకగా థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. షూటింగ్ షెడ్యూల్స్‌లో తీవ్రమైన జాప్యం జరగడంతో, 'రాకా' మూవీ రిలీజ్ ఏకంగా 2028కి వాయిదా పడిందని సమాచారం. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం... ఈ సినిమా చిత్రీకరణ ఇప్పుడు 2027 మార్చి లేదా ఏప్రిల్ వరకు కొనసాగే అవకాశం ఉంది. డైరెక్టర్ అట్లీ తన సినిమాల్లో విజువల్స్, యాక్షన్ సీక్వెన్సెస్ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ కాడు. 'రాకా'లో భారీ గ్రాఫిక్స్ వర్క్ ఉండటంతో, పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసం ఆయనకు చాలా ఎక్కువ సమయం కావాల్సి వస్తోంది. క్వాలిటీ విషయంలో ఎలాంటి లోటు ఉండకూడదనే ఉద్దేశంతోనే 2027 క్రిస్మస్ రేస్ నుంచి తప్పుకోవాలని టీమ్ నిర్ణయించుకుందని తెలుస్తోంది. ప్రస్తుతానికి 2028 రిపబ్లిక్ డే కానుకగా ఈ విజువల్ వండర్‌ను గ్రాండ్‌గా రిలీజ్ చేయాలని ఆలోచిస్తున్నారు. ఒకవేళ ఆ డెడ్‌లైన్ కూడా మిస్ అయితే, 2028 సమ్మర్ లో ఈ సినిమాను థియేటర్లలోకి దించడానికి ప్లాన్ చేస్తున్నారు. షూటింగ్ పూర్తిగా పూర్తయిన తర్వాతే అఫీషియల్ రిలీజ్ డేట్‌ను లాక్ చేసి అనౌన్స్ చేయనున్నారట. సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ పాన్-ఇండియా ప్రాజెక్ట్‌లో కాస్టింగ్ కూడా అదే స్థాయిలో ఉంది. ఈ చిత్రంలో దీపికా పడుకోణె, రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలలో కనిపించబోతున్నారు. వాయిదా పడిందన్న వార్త ఫ్యాన్స్‌కు కాస్త నిరాశ కలిగించినా.. అవుట్‌పుట్ మాత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసేలా ఉండబోతోందట. [Raaka Postponed, Allu Arjun, Raaka Movie, Raaka 2028 Release, Director Atlee, Allu Arjun, Telugu Film News, Tollywood News]
Sep 12, 2026 3:54PM
మహేష్ బాబు నెక్స్ట్ మూవీ ఫిక్స్: సమంత భర్తతో సూపర్‌స్టార్ బిగ్ ప్రాజెక్ట్.!
సూపర్‌స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో 'వారణాసి' మూవీ చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు 90 శాతం షూటింగ్ పూర్తయింది. వారణాసి మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ ప్రాజెక్ట్ తర్వాత మహేష్ ఏ డైరెక్టర్ తో చేతులు కలుపుతారు అనేది ఆసక్తికరంగా మారింది. సందీప్ రెడ్డి వంగా సహా ఇప్పటికే పలువురు దర్శకుల పేర్లు వినిపించాయి. ఇప్పుడు అనూహ్యంగా దర్శక ద్వయం రాజ్-డీకే తెరపైకి వచ్చారు. వారణాసి మూవీ షూటింగ్ పనులు ముగింపు దశకు చేరుకోవడంతో.. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం మహేష్ ఇప్పటి నుంచే కథలను వినడం మొదలుపెట్టారని అంటున్నారు. ఈ క్రమంలోనే 'ఫ్యామిలీ మ్యాన్' సిరీస్ తో సంచలనం సృష్టించిన మేకర్స్ రాజ్ నిడిమోరు, కృష్ణ డీకే ఇటీవల మహేష్ బాబును కలసి ఒక సాలిడ్ స్టోరీ లైన్ నరేట్ చేశారట. ఈ దర్శక ద్వయంలో రాజ్ నిడిమోరు ఎవరో కాదు.. స్టార్ హీరోయిన్ సమంత భర్త కావడం విశేషం. రాజ్ అండ్ డీకే ప్రెజెంటేషన్ అనగానే.. స్టైలిష్ విజువల్స్, డార్క్ హ్యూమర్, రా యాక్షన్, సీటు అంచున కూర్చోబెట్టే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ గుర్తుకొస్తాయి. ఇప్పటివరకు తెలుగులో మహేష్ బాబు ఎన్నో మాస్, క్లాస్, యాక్షన్ రోల్స్ చేశారు. కానీ, రాజ్-డీకే మార్క్ రా అండ్ రియలిస్టిక్ డార్క్ హ్యూమర్ యాక్షన్ థ్రిల్లర్‌లో మహేష్ బాబును ఊహించుకుంటేనే ఫ్యాన్స్‌కి పూనకాలు వస్తున్నాయి. రాజ్-డీకే చెప్పిన డిఫరెంట్ అండ్ నోవెల్ కాన్సెప్ట్‌కి మహేష్ పాజిటివ్‌గా స్పందించారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన ప్రైమరీ డిస్కషన్స్ జరుగుతున్నాయట. ఒకవేళ ఈ కాంబినేషన్ అధికారికంగా పట్టాలెక్కితే.. ఇది మహేష్ బాబు కెరీర్లో 30వ సినిమాగా రాబోతోంది. గతంలో కూడా రాజ్-డీకే, మహేష్ బాబు కాంబో గురించి పలు వార్తలు వినిపించినా, ఈసారి మాత్రం స్టోరీ డిస్కషన్స్ నెక్స్ట్ లెవెల్‌కి వెళ్లడం విశేషం. రాజమౌళితో గ్లోబల్ ప్రాజెక్ట్ ముగిశాక, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న మేకర్స్‌తో మహేష్ జతకడితే ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులు బద్దలవుతాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. [Mahesh Babu, Varanasi Movie, SS Rajamouli, Raj and DK, SSMB30 Movie, Raj Nidimoru, Telugu Film News, Telugu Movie News, Telugu News]
Sep 10, 2026 11:08AM
ప్రభాస్ ఫ్యాన్స్‌కి బిగ్ షాక్: మూడు భారీ సినిమాలు వెనక్కి.!
ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లైనప్ మామూలుగా లేదు. హను రాఘవపూడితో తెరకెక్కుతున్న 'ఫౌజీ', సందీప్ రెడ్డి వంగాతో తీస్తున్న 'స్పిరిట్', నాగ్ అశ్విన్ డ్రీమ్ ప్రాజెక్ట్ 'కల్కి-2'.. ఇలా ఒకదానిని మించి మరొకటి ఉన్నాయి. అయితే, ఫిలిం సర్కిల్స్ నుంచి వస్తున్న తాజా సమాచారం ప్రకారం, 'ఫౌజీ' చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. నిజానికి 'ఫౌజీ' మూవీ ఈ ఏడాది డిసెంబర్ 3న విడుదల కావాల్సి ఉండగా, వచ్చే ఏడాది వేసవికి వాయిదా పడినట్లు వార్తలొస్తున్నాయి. ఒకవేళ ఫౌజీ సినిమా సమ్మర్ రేస్‌లోకి దిగితే.. ప్రభాస్ నెక్స్ట్ మూవీస్ పై ప్రభావం పడనుంది. ఎందుకంటే 'ఫౌజీ' వస్తే.. అదే సమ్మర్ స్లాట్‌పై కన్నేసిన సందీప్ రెడ్డి వంగా 'స్పిరిట్' సినిమా అక్కడ నుంచి తప్పుకోక తప్పదు. ఇప్పటికే సంచలనం సృష్టిస్తున్న 'స్పిరిట్' మూవీ షూటింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయి. కానీ, ఫౌజీ డేట్స్ అడ్జస్ట్మెంట్ వల్ల స్పిరిట్ వాయిదా పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఫౌజీ, స్పిరిట్ పోస్ట్‌పోన్ అయితే, ఆ ప్రభావం నేరుగా సైన్స్ ఫిక్షన్ వండర్ 'కల్కి-2' పై పడుతుంది. కల్కి పార్ట్-1 తెచ్చిపెట్టిన భారీ విజయం తర్వాత పార్ట్-2 కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ప్రస్తుత సమీకరణాల ప్రకారం చూస్తే.. 2028లో కల్కి-2 సినిమా వస్తే అదే గొప్ప విషయం అని ఇండస్ట్రీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. [Prabhas Lineup, Prabhas Movies, Fauzi Movie, Spirit Movie, Kalki 2 Movie, Hanu Raghavapudi, Sandeep Reddy Vanga, Nag Ashwin, Telugu Film News]
Sep 9, 2026 6:28PM
క్రేజీ కాంబో: ‘ఇరుముడి’ డైరెక్టర్ నెక్స్ట్ మూవీ.. హీరో ఎవరో తెలిస్తే షాకవుతారు.!
'ఇరుముడి' సినిమాతో బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ హిట్ కొట్టిన తర్వాత, ఇప్పుడు టాలీవుడ్లోనే కాదు, కోలీవుడ్‌లోనూ డైరెక్టర్ శివ నిర్వాణ పేరు గట్టిగా వినిపిస్తోంది. మాస్ మహారాజా రవితేజతో చేసిన 'ఇరుముడి' ప్రాజెక్ట్ తెచ్చిపెట్టిన సక్సెస్ జోరులో ఉన్న శివ నిర్వాణ, తన నెక్స్ట్ మూవీ విషయంలో ఎలాంటి ప్లాన్ వేస్తున్నారనేది ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చగా మారింది. తాజా సమాచారం ప్రకారం.. కోలీవుడ్ స్టార్ ధనుష్‌తో శివ నిర్వాణ ఒక హై-వోల్టేజ్ ఎమోషనల్ డ్రామా కథను ప్లాన్ చేస్తున్నారట. అసలు ఈ కాంబినేషన్ ఇప్పుడు సడన్‌గా అనుకున్నది కాదట. 'ఇరుముడి' సినిమా సెట్స్ మీదికి వెళ్లడానికంటే ముందే ధనుష్‌తో శివ నిర్వాణ కథా చర్చలు జరిపారట. శివ చెప్పిన విభిన్నమైన లైన్ ధనుష్‌కి బాగా నచ్చడంతో, ఈ ప్రాజెక్ట్‌పై ఇద్దరి మధ్య ప్రాథమికంగా డీల్ ఓకే అయిందనే వార్తలు సినీ సర్కిల్స్‌లో జోరుగా ప్రచారం అవుతున్నాయి. ఒకవైపు హ్యూమన్ ఎమోషన్స్, లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామాను ఎంతో హృద్యంగా తెరకెక్కించడంలో దిట్ట అయిన శివ నిర్వాణ, మరోవైపు ఏ పాత్ర ఇచ్చినా తన నటనతో ప్రాణం పోసే వర్సటైల్ యాక్టర్ ధనుష్. వీరిద్దరూ కలిస్తే స్క్రీన్ మీద ఎమోషన్స్ ఏ స్థాయిలో పండుతాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ధనుష్‌కు ఇప్పటికే 'సార్', 'రఘువరన్ B.Tech' వంటి సినిమాల ద్వారా తెలుగులోనూ చాలా బలమైన మార్కెట్ ఉంది. సరైన ఎమోషనల్ కథ పడితే తెలుగు, తమిళ్ రెండు భాషల్లోనూ బాక్సాఫీస్ దగ్గర రికార్డులు తిరగరాయడం ఖాయం. ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్‌పై ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాకపోయినప్పటికీ, త్వరలోనే ఒక బిగ్ సర్ ప్రైజ్ అనౌన్స్మెంట్ ఉండబోతోందని ఇండస్ట్రీ టాక్. 'ఇరుముడి' సక్సెస్ ఇచ్చిన బూస్ట్‌తో శివ నిర్వాణ ఈ స్క్రిప్ట్‌కు తుది మెరుగులు దిద్దుతున్నారట. [Ravi Teja, Irumudi Movie, Shiva Nirvana, Dhanush, Telugu Film News, Telugu News, Tollywood]
Sep 4, 2026 9:57AM
INTERESTING NEWS
Customer Service
For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com







