Agnipariksha season2 : అగ్నిపరీక్ష2 హైలైట్స్.. కామనర్స్ నుంచి బిగ్ బాస్ 10 హౌస్ వరకు అసలు కథ!
బిగ్ బాస్ అగ్నిపరీక్ష సీజన్ 2 అనేది బిగ్ బాస్ తెలుగు-10 కి వెళ్లేందుకు ముందు జరిగే ప్రీ-షో. ఈసారి లక్షల అప్లికేషన్ల నుంచి 5 లెవెల్స్ లో ఫిల్టర్ చేసి ఫైనల్ గా 15 మంది కామనర్స్ ను సెలెక్ట్ చేశారు. JioHotstar మరియు Star Maa లో ఆగస్టు 15 నుంచి ప్రసారం అవుతున్న ఈ షోని గత సీజన్ లాగే శ్రీముఖి హోస్ట్ చేస్తుండగా.. జడ్జ్ లుగా అభిజిత్, బిందు మాధవి, నవదీప్ వ్యవహరిస్తున్నారు. ఈ సీజన్ సెలక్షన్ ప్రాసెస్ చాలా టఫ్ గా ఉంది. లెవల్-1 లో వీడియో బేస్డ్ స్క్రీనింగ్ తో 200 మందిని సెలక్టు చేశారు. లెవల్ 2 లో ఫోన్ ఇంటర్వ్యూ తో 150 మందిని సెలెక్ట్ చేయగా లెవల్ 3 లో గ్రూప్ డిస్కషన్ తో 70 మందిని సెలెక్ట్ చేశారు. లెవల్ 4 లో జడ్జ్ లు డైరెక్ట్ ఇన్-పర్సన్ ఇంటర్వ్యూ చేసి టాప్-15 ను ఫైనల్ చేశారు. ఈ పదిహేను మందే ఇప్పుడు అగ్నిపరీక్ష హౌస్ లో ఉన్నారు. ఫైనల్-15 లో యాంకర్ ప్రియా, సింగర్ ఝాన్సీ, షాలినీ, శ్రష్టి, భాగి, అపూర్వ, గాయత్రి, రోహిత్, అమన్, హేమంత్, మిథిలేష్, చరణ్, దీపక్, రామకృష్ణ వంటి వారు ఉన్నారు. వీరికి ప్రతిరోజూ స్ట్రెంత్, ఎండ్యూరెన్స్, మెంటల్ స్ట్రెంత్, టీమ్ వర్క్ వంటి టాస్కులు పెడుతున్నారు. ప్రతి టాస్క్ తర్వాత MVP, BEST, WORST, Yellow Card, Green Card లాంటి పవర్ కార్డులతో జడ్జ్ మెంట్ ఉంటుంది. ఈ పదిహేను మందిలో నుంచి చివరకు కేవలం అయిదుగురు మాత్రమే బిగ్ బాస్ తెలుగు సీజన్-10 మెయిన్ హౌస్ లోకి కామనర్స్ గా ఎంట్రీ ఇస్తారు. అక్కడ వారు సెలబ్రిటీలతో కలిసి టైటిల్ కోసం పోటీపడతారు. అందుకే అగ్నిపరీక్షను కేవలం ప్రీ-షో అని కాకుండా బిగ్ బాస్ కి ఫస్ట్ స్టెప్ అని చెబుతున్నారు. [Bigg Boss Agnipariksha 2 Overall, Agnipariksha Season 2 Concept, Sreemukhi Host Agnipariksha 2, Abhijeet Bindu Madhavi Navdeep Judges, Agnipariksha Top 15 Contestants List, JioHotstar Bigg Boss Telugu 10 Selection Process]
Aug 30, 2026 12:40PMAgnipariksha season 2: వీజే సన్నీ ఎంట్రీతో ఫుల్ ఫన్..బ్లైండ్ కార్డులు కొట్టేసిన రోహిత్, దీపక్!
అగ్నిపరీక్షలో నిన్నటి ఎపిసోడ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ గా సాగింది. అసలేం జరిగిందో ఓసారి చూసేద్దాం.. ఎల్లో కార్డ్ టాస్క్ తర్వాత హౌస్‌లోకి వీజే సన్నీ ఎంట్రీ ఇచ్చాడు. బిగ్ బాస్ ఇంట్లో ఉండే పరిస్థితులను తనదైన స్టైల్లో ఫన్నీగా చేసి చూపించాడు. కంటెస్టెంట్లను ఎంటర్టైన్ చేస్తూనే తనను ఇంప్రెస్ చేసిన వారికి మాత్రమే టాస్క్‌లో ఛాన్స్ ఇస్తానని చెప్పాడు. ఈ క్రమంలో రోహిత్, అపూర్వ కలిసి చేసిన డ్యాన్స్‌కు సన్నీ ఇంప్రెస్ అయ్యాడు. ఆ తర్వాత షాలినీ, శ్రష్టి కూడా డ్యాన్స్‌తో ఆకట్టుకున్నారు. అమన్, షాలినీతో సన్నీ కాస్త ఫన్ చేశాడు. చివరకు రోహిత్, షాలినీలను టాస్క్‌కు ఎంపిక చేశాడు. ఆ టాస్క్‌లో రోహిత్ విన్ అయ్యి బ్లైండ్ కార్డ్ గెలుచుకుని ఆ కార్డును అభిజిత్ కి ఇచ్చాడు. ఆ తర్వాత పార్ట్ టైమర్స్ సిరీస్ ప్రమోషన్ కోసం తనూజ, జ్ఞానేశ్వరి వచ్చి వెళ్లారు. ఆ తర్వాత ప్రియాంక జైన్ వచ్చి తనకు డిఫరెంట్‌గా ప్రపోజ్ చేసినవారికి అవకాశం ఇస్తానని చెప్తుంది. రోహిత్, హేమంత్, రామకృష్ణ ఫన్నీగా ప్రపోజ్ చేయగా దీపక్ కవిత్వంతో వెరైటీగా ప్రపోజ్ చేసి ఆకట్టుకున్నాడు. దీంతో ప్రియాంక జైన్ దీపక్‌ను సెలెక్ట్ చేసింది. దీపక్ తన అపోనెంట్‌గా భాగిని ఎంచుకోవడంపై జ్యూరీ ప్రశ్నించింది. చేయి బాగాలేదని తీసుకుంటున్నావా అని అడుగుతారు. ఇంకొకరి పేరు చెప్పమనగా శ్రష్టి పేరు చెప్పాడు. అయినా భాగి.. నేను ఆడతానని ముందుకు వచ్చింది. టాస్క్‌లో దీపక్ గెలిచి రెండో బ్లైండ్ కార్డ్ సొంతం చేసుకున్నాడు. [VJ Sunny Entry Agnipariksha 2, Rohit Blind Card Win, Deepak Blind Card, Priyanka Propose Task, Part Timers Web Series Promotion, Bigg Boss Telugu 10 Agnipariksha Tasks]
Aug 30, 2026 12:35PMAgnipariksha season2 : స్పిన్ ది గన్ టాస్క్‌లో ప్రియాంక స్పాంటేనిటి.. రామకృష్ణ ఔట్!
బిగ్ బాస్ అగ్నిపరీక్ష సీజన్ 2 15వ ఎపిసోడ్లో ఎల్లో కార్డ్ వచ్చిన వారికి జ్యూరీ చివరి అవకాశం ఇచ్చారు. ఫైర్ కార్డ్ ఉన్న శ్రష్టి ముందే సేవ్ అవ్వడంతో మిగిలిన వారికి బతికేందుకు టాస్క్ పెట్టారు. గన్ తీసుకుని ఎదుటివారిని కాల్చి ఎందుకు కాల్చారో రీజన్ చెప్పాలనేది ఈ టాస్క్ రూల్. స్పిన్ ది గన్ అనే ఈ టాస్క్‌లో చివరికి రామకృష్ణ, ప్రియాంక మిగిలారు. బజర్ మోగిన వెంటనే ప్రియాంక చురుగ్గా గన్ అందుకుని రామకృష్ణపై షూట్ చేసింది. రామకృష్ణ మాత్రం అలాగే నిలబడిపోయాడు. ఇదే పాయింట్‌పై జడ్జ్‌లు ప్రశ్నించారు. నువ్వు ఎందుకు గన్ తీసుకోలేదని జడ్జ్‌లు అడుగుతారు. చెప్పలేదు కదా అని రామకృష్ణ సమాధానమిచ్చాడు. దీనిపై ప్రియాంక స్పందిస్తూ.. ఇందుకే నువ్వు అనర్హుడివి అని అంటుంది. జ్యూరీ కూడా ఇక్కడికి వచ్చాక కూడా ఒలిచినట్టు చెప్పరు.. అవకాశాన్ని క్షణాల్లో పట్టేయాలి, ప్రియాంకలా ఉండాలని అంటారు. దీంతో ప్రియాంక తన స్పాంటేనిటీతో సేవ్ అయిపోతుంది. చివరికి డేంజర్ జోన్లో రోహిత్, గాయత్రి, అపూర్వ, రామకృష్ణ నలుగురు మిగిలిపోయారు. ఈ నలుగురిలో నుంచే రేపు ఎలిమినేషన్ ఉండబోతుంది. Bigg Boss Agnipariksha 2 Episode 15, Yellow Card Task, Spin The Gun Task, Priyanka Spontaneity, Ramakrishna Eliminated, Danger Zone Contests
Aug 30, 2026 12:28PMJayam Serial:గంగను క్షమించని రుద్ర.. బాక్సింగ్ గ్లౌస్ పై ఇషిక కుట్ర!
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం' . ఈ సీరియల్ రోజురోజుకు ఆసక్తికరంగా మారుతోంది. శనివారం నాటి ఎపిసోడ్ -360 లో ఏం జరిగిందంటే...రుద్ర దగ్గరికి గంగ వెళ్లి.. నన్ను క్షమించండి అని అంటుంది. దీంతో రుద్ర ఆమెపై కోప్పడతాడు. ఏంటే చెల్లి, బావని విసిగించకు. అసలే బావ నీపై చాలా కోపంగా ఉన్నాడని రంగా అంటాడు. అదంతా ఇషిక, వీరు చూసి నవ్వుకుంటారు. ఆ తర్వాత .. చాలా థాంక్స్ గంగ, అగ్రిమెంట్ క్యాన్సిల్ అయ్యేలా చేసినందుకని ఇషిక, వీరుతో శకుంతల అంటుంది. విశ్వ క్షమిస్తే రుద్ర ఈజీగా క్షమిస్తాడని వీరు అంటాడు. అప్పుడే పెద్దసారు వస్తాడు, గంగ ఏదో చేసిందని తనని తప్పు పట్టడం సరికాదని చెప్తాడు.మరోవైపు జయ బాక్సింగ్ చేస్తూ గంగ ఫోటోని చూస్తూ కొడుతూ ఉంటుంది. అది లక్ష్మి చూసి సుధాను తీసుకొని వస్తుంది. ఏంటి జయ అలా చేస్తున్నావని అడుగుతుంది. మనం ఎవరిపైనైనా గెలవాలి అనుకుంటే ఇలా చేయాలి.. అప్పుడే మనకి కసి పెరుగుతుందని జయ అంటుంది. మరోవైపు బాక్సింగ్ గ్లౌస్ ని గంగ ఒక దగ్గర పెట్టి కిచెన్ లోకి వెళ్తుంది. అవి చూసి ఇషిక డస్ట్ బిన్ లో పడేద్దామని వెళ్తుంటే గంగ ఆపుతుంది. ఇషికను కొట్టబోతుంటే శకుంతల వచ్చి ఆపుతుంది. అప్పుడే పెద్దసారు వచ్చి ఈ గ్లోవ్స్ తీసుకొని వెళ్లి ప్రాక్టీస్ చెయ్ అని చెప్తాడు.ఆ తర్వాత రుద్ర దగ్గరికి గంగ వచ్చి సర్ మీరు నేను చేసింది తప్పు అనుకుంటున్నారా అని అడుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. [Jayam Serial Today Episode 360, Zee Telugu Jayam, Jayam Serial Update, Jayam Telugu Serial, Jayam Episode]
Aug 30, 2026 11:35AMIllu illalu pillalu : ప్రేమ, ధీరజ్ మధ్య మాటల యుద్ధం..తిరుపతి మెడలో చైన్ మాయం!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -565 లో....ప్రేమ, ధీరజ్ ని కలపాలని నర్మద వేసిన ప్లాన్ బెడిసికొట్టింది. ప్రేమ గదిపైకి రాయి విసిరి దాన్ని ధీరజ్ పైకి తోసింది నర్మద. దీంతో ఇద్దరూ రాళ్లు పట్టుకుని కొట్టుకోడానికి రెడీ అయ్యారు. వెంటనే నర్మద వచ్చి.. ఎన్నాళ్లు ఈ హింస, ఎన్నాళ్లు ఈ రక్తపాతం అంటూ డైలాగులు కొట్టి ఆపింది. మీలో ఇంకా ప్రేమ ఉంది కలిసిపోండి అని చెప్పినా ఇద్దరూ వినకుండా వెళ్లిపోవడంతో శత్రువులను కలపడం ఈజీ కానీ ప్రేమ ఉన్న మొగుడు పెళ్లాలను కలపడం కష్టమని నర్మద అనుకుంటుంది. తిరుపతి బర్త్ డే కోసం భాగ్యం ఇంటికి వెళ్లగా సుక్కూ, భాగ్యం, ఇడ్లీ చిన్న కేక్, నాలుగు బెలూన్లతో డెకరేషన్ చేశారు. దానికి తిరుపతి బిస్కెట్ ప్యాకెట్ పెట్టాల్సిందని కోప్పడతాడు. మేము పేదోళ్లం, ఇదే చివరి బర్త్ డే, సుక్కూకి తమిళ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ వచ్చింది, చెన్నై వెళ్తున్నామని వాళ్ళు ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తారు. ప్రతి యుగంలో ప్రేమకు పరీక్షలు తప్పవు, నీ కోసం ప్రపంచంతో యుద్ధం చేస్తానని తిరుపతి శపథం చేసి తమ వాళ్లను ఒప్పిస్తానని ఒకే ఒక్క ఛాన్స్ తీసుకుంటాడు. మరోవైపు కోచింగ్ సెంటర్ దగ్గర ప్రేమ ధీరజ్ కు కాల్ చేస్తే ధీరజ్ కట్ చేస్తూ అవాయిడ్ చేస్తాడు. దీంతో ప్రేమ ముగ్ధ ఫోన్ లాక్కుని వాయిస్ మార్చి ధీరజ్ కి కాల్ చేస్తుంది. ధీరజ్ ముందే గుర్తించి కావాలనే.. చెప్పు ముగ్ధ, ఈవినింగ్ లాంగ్ డ్రైవ్ వెళ్దామా" అని అంటూ ప్రేమని ఏడిపిస్తాడు. ఇప్పటివరకు మాట్లాడింది నేనే, నా నంబర్ నుంచి కట్ చేసి దాని నంబర్ కి ఫస్ట్ రింగ్ కే ఎత్తుతావా, మీ అంతు చూస్తా అని ప్రేమ ఫైర్ అయి ఫోన్ కట్ చేసింది. ఇక మరోవైపు భాగ్యం తన ప్లాన్ ప్రకారం తిరుపతి మెడలోని 6 లక్షల గోల్డ్ చైన్ ను సుక్కూ మెడలో వేయిస్తుంది. ఆ వెంటనే వల్లి వంటగదిలో వేదవతి ముందు సుక్కూకి కాల్ చేసి.. తిరుపతి బాబాయ్ 6 లక్షల చైన్ గిఫ్ట్ ఇచ్చాడా అని స్పీకర్ లో పెద్దగా మాట్లాడుతుంది. వీడియో కాల్ లో చైన్ చూసిన వేదవతి షాక్ అయి సుక్కూపై కోప్పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. [Illu Illalu Pillalu Today Episode, Illu Illalu Pillalu August 29 Episode, Illu Illalu Pillalu Serial Update, Star Maa Serial, Tirupati Sukku Love Track, Prema Dheeraj Fight, Valli Conspiracy]
Aug 30, 2026 11:28AMKarthika Deepam2: కృష్ణమూర్తి చావుకు సుమిత్రే కారణం.. నిజాలు బయటపెట్టిన మాలిని!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2'(Karthika Deepam2).ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -764 లో ....గత రెండు రోజులుగా కార్తీకదీపం సీరియల్ ఊహించని ట్విస్ట్ లతో దూసుకుపోతోంది. జ్యోత్స్న పెళ్లి మరోసారి పీటలపైనే ఆగిపోగా.. పెళ్లి కొడుకు ఎవరో కాదు తన కన్నకొడుకు అంటూ మాలిని ఇచ్చిన షాక్ తో శివన్నారాయణ, దశరథ్, కార్తీక్, దీప ఫ్యామిలీ ఉలిక్కిపడింది. నా భర్తను చంపిన మిమ్మల్ని వదిలిపెట్టనంటూ మాలిని చేసిన హెచ్చరికలకు కొనసాగింపుగా ఈరోజు ఎపిసోడ్ లో అసలు పగకు మూలం ఎక్కడ మొదలైందో ఫ్లాష్ బ్యాక్ ద్వారా బయటపెట్టింది. మాలిని చెప్పిన ఫ్లాష్ బ్యాక్ లో పగ తన భర్త చావుతో కాదు.. సుమిత్ర, దశరథ్ ల పెళ్లితోనే మొదలైందని తేలింది. సుమిత్ర ఇష్టపడి దశరథ్ ను పెళ్లి చేసుకుని ఇంటికి రావడంతో దక్షిణామూర్తి ఆగ్రహంతో తాళి తెంపబోతే శివన్నారాయణ అడ్డుకుని దక్షిణామూర్తిని కొట్టడంతో రెండు కుటుంబాల మధ్య శత్రుత్వం మొదలైంది. స్నేహాన్ని అడ్డం పెట్టుకుని ఎదిగిపోవాలని చూస్తున్నారంటూ మాలిని భర్త కృష్ణమూర్తి దశరథ్ కుటుంబాన్ని అవమానించగా శివన్నారాయణ మాత్రం సుమిత్ర ఇక తన కోడలేనని తీసుకుని వెళ్లిపోతాడు. ఆ తర్వాత జరిగిన లారీ యాక్సిడెంట్ తో కథ మరింత మలుపు తిరిగింది. దశరథ్ ను లారీ గుద్దబోతుంటే అడ్డుగా వెళ్లిన కాంచనకు యాక్సిడెంట్ అయ్యి నడుము విరిగి చక్రాల కుర్చీకే పరిమితం అయింది. ఈ యాక్సిడెంట్ వెనుక కృష్ణమూర్తి హస్తం ఉందని అనుమానించిన సుమిత్ర పోలీసులతో మాలిని ఇంటికి వెళ్లి నిలదీస్తుంది. కడుపుతో ఉన్నానని తన బిడ్డపై ఒట్టేసి చెబుతున్నానని మాలిని ఎంత ప్రాధేయపడినా సుమిత్ర కేసు వెనక్కి తీసుకోకపోవడంతో అవమానం భరించలేక కృష్ణమూర్తి గదిలోనే షూట్ చేసుకుని ఆత్మహత్య చేసుకుంటాడు. తన భర్త చావుకు సుమిత్రే కారణమని కాంచనపై ప్రేమతో సొంత అన్నపైనే పగ తీర్చుకుందని మాలిని ఏడుస్తుంది. తన కడుపులో పెరుగుతున్న బిడ్డ సాక్షిగా శివన్నారాయణ కుటుంబంపై ప్రతీకారం తీర్చుకుంటానని శపథం చేసిన మాలిని.. ఇన్నేళ్ల తర్వాత తన కొడుకు ద్వారా ఆ ప్రతీకారాన్ని తీర్చుకుందని చెప్తుంది. దీంతో జ్యోత్స్న పెళ్లి ఆగిపోవడం వెనుక ఉన్నది ప్రేమ కాదు.. తన తల్లికి జరిగిన అన్యాయానికి కొడుకు తీర్చుకున్న ప్రతీకారమని తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. [Karthika Deepam serial, Karthika Deepam today episode August 29, Karthika Deepam 2 Telugu serial, Jyotsna marriage stopped, Malini flashback story, Sumitra Dasharath love marriage, Kanchan accident reason, Krishnamurthy suicide reason]
Aug 30, 2026 11:21AMBrahmamudi : బిగ్ సీక్రెట్ బయటపెట్టిన రాజు .. లక్కీ తల్లి రేఖ అని తెలిసి ఫ్యామిలీ షాక్!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -1124 లో...ఐశ్వర్య మళ్ళీ ఇంట్లో గొడవ మొదలుపెట్టింది. రాజు, ఇందుది దొంగ పెళ్లి అని ఫోన్ వచ్చిందని అబద్ధం చెప్పి అక్షింతలు వేయకుండా పారిపోయాడని అందరి ముందు అరుస్తుంది. అపర్ణ వాడిని వెనకేసుకొచ్చినా శేషు, భ్రమరం మాత్రం ఐశ్వర్య మాటల్లో నిజం ఉందేమోనని డౌట్ పడతారు. ఈరోజు ఎలాగైనా నిజం తేల్చాలని రేఖ కూడా గట్టిగా అంటుంది. అటు రాజు మాత్రం హాస్పిటల్ లో ఉన్నాడు. సిరి చేయి కదిపిందని.. కళ్ళు తెరిచి మూసిందని నర్స్ చెప్పగానే బాగా ఎమోషనల్ అయిపోతాడు. డాక్టర్ వచ్చి ఇది మంచి సైన్ అని ఇలాగే ట్రీట్మెంట్ చేస్తే తొందరలోనే కోలుకుంటుందని చెప్తాడు. సిరిని చూడాలని రాజు ఆరాటపడితే డాక్టర్ వద్దని ఆమెకు ఒత్తిడి పెరగకూడదని బయటకు పంపిస్తాడు. ఇంటికి రాగానే అందరు రాజు కోసమే వెయిట్ చేస్తుంటారు. ఐశ్వర్య నిలదీస్తుంది. అక్షింతలు వేయకుండా ఎక్కడికి వెళ్లావ్.. హాస్పిటల్ కా పోలీస్ స్టేషన్ కా అని రేఖ అంటుంది. నువ్వు డబ్బు కోసం ఇందుని కిడ్నాప్ చేసిన దొంగవి అని రెచ్చగొడుతుంది రేఖ. దాంతో కోపం ఆపుకోలేక పసికందుని విసిరేసిన నువ్వు కూడా మాట్లాడుతున్నావా అని రాజు అంటాడు. ఆ మాటతో ఇల్లంతా షాక్ అవుతుంది. రాజు చొక్కా పడతాడు మదన్. లక్కీ అడ్డు వచ్చి మదన్ ని కొడతాడు. అప్పుడే మామా నువ్వు చెప్పు ఈ రేఖ మేడమే మా అమ్మనా అని అడుగుతాడు లక్కీ. భ్రమరం లక్కీని కొట్టి నువ్వు నష్టజాతకుడివి అందుకే నీ అమ్మ నిన్ను వదిలేసింది అంటుంది. వెంటనే రాజు.. వదిలేసింది ఎవరో కాదు మన రేఖ పిన్నినే అని. దాంతో ఏం చేయాలో తెలియక రేఖ కంగారు పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. [Brahmamudi serial, Brahmamudi today episode, Brahmamudi serial latest episode, Brahmamudi Telugu serial, Star Maa Brahmamudi]
Aug 30, 2026 11:08AMYe Devi Varamo Neevu : అంజలికి ప్రపోజ్ చేసిన రాకీ..వరలక్ష్మీ వ్రతంలో అసలు ట్విస్ట్!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఏ దేవి వరమో నీవు' (Ye Devi Varamo Neevu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-50లో ఏం జరిగిందంటే...మనీష్ వాళ్ళు లగేజ్ తో గీత ఇంటికి వస్తారు. గీత కొడుకు గదిలోకి రాకీ వెళ్తాడు. ఒరేయ్ బామ్మర్దీ, అంజలి ఎక్కడరా.. అసలు తన కోసమే నేను ఇక్కడికి వచ్చానని రాకీ అంటాడు. బావా, నువ్వు ఇప్పుడు మా ఇంట్లో ఉన్నావ్.. అదంతా వదిలేయ్. అమ్మకి తెలిస్తే ఊరుకోదని అతను అంటాడు. అత్త ఉండగా అత్తకి తెలియకుండా నేను సిగరెట్ కాల్చాను.. ఇప్పుడు ఇదొక లెక్కా అని రాకీ అంటాడు. మరోవైపు మనీష్ ని భవిత తన గదిలోకి తీసుకెళ్లి.. బావా, నువ్వు ఈ రూమ్ లో ఉండు.. నేను కృష్ణ రూమ్ లో ఉంటానని చెప్తుంది. ఆ తర్వాత అంజలి మామిడి తోరణాలు కడుతుంటే, రాకీ వెనకాల నుంచి వచ్చి తన చున్నీ పట్టుకుంటాడు. ఒక్కసారిగా రాకీని చూసి అంజలి భయపడుతుంది. ఏం చేస్తున్నావని అంజలి అడుగుతుంది. నేను నిన్ను మిస్ అయ్యాను అంజలి.. నీకు బాగా అలవాటు అయిపోయాను. అంటే నువ్వు చేసే వంటకి. నువ్వు కావాలి అంజలి.. నిన్ను ప్రేమిస్తున్నాను. నీ సమాధానం రేపు చెప్పు అని రాకీ చెప్పేసి వెళ్ళిపోతాడు. అమ్మో, రాకేష్ తో జాగ్రత్తగా ఉండాలని అంజలి అనుకుంటుంది. ఆ తర్వాత భవిత, కృష్ణ, ప్రీతి ముగ్గురు హాఫ్ సారీ వేసుకొని రెడీ అవుతారు. బావా, మమ్మల్ని ఫోటో దింపమని భవిత అంటుంది. అంజలిని ప్రీతి చూసి మాట్లాడుతుంటే.. ఫోటోస్ దిగుదామంటూ భవిత లాక్కొని వెళ్తుంది. అంజలి, నువ్వు కూడా వాళ్ళలా హాఫ్ సారీ వేసుకొని రా అని మనీష్ చెప్తాడు. ఆ తర్వాత గీత వరలక్ష్మీ వ్రతం చేస్తుంది. అమ్మమ్మ, నేను అమ్మ ఆశీర్వాదం తీసుకోవాలి, నువ్వే ఏదో ఒకటి చెయ్ అమ్మమ్మ అని రత్నంకి అంజలి చెప్తుంది. ఆ తర్వాత లలితా సహస్రనామం పాడమని చెప్తే అందరూ రాదని అంటారు. మనీష్ చాటు నుండి అంజలి పాడుతుంది. ఎవరు పాడుతున్నారని అందరు అనుకుంటారు. తరువాయి భాగంలో పని మనుషులందరికి గీత బట్టలు పెడుతుంది. అంజలి కూడా లైన్ లో నిల్చుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. [Ye Devi Varamo Neevu, Ye Devi Varamo Neevu Today Episode, Ye Devi Varamo Neevu Serial Episode 50, Star Maa Serial, Star Maa Ye Devi Varamo Neevu, Telugu Serial News]
Aug 30, 2026 10:22AMGodhavari :సింహాద్రిని అరెస్ట్ చేయించిన జానూ.. షాక్ లో నిత్య ఫ్యామిలీ!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గోదావరి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-98 లో....జాను కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్ కి వెళ్తుంది. అక్కడికి కొత్తగా ఇన్స్పెక్టర్ అశ్విని వస్తుంది. తనకి స్టేషన్ లో అందరు వెల్ కమ్ చెప్తారు. జానూని చూసి అశ్విని ఎవరు అని కానిస్టేబుల్ ని అడుగుతుంది. కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చింది.. మీరు అవన్నీ పట్టించుకోకండి అని కానిస్టేబుల్ అంటుంటే వాళ్లపై అశ్విని కోప్పడుతుంది. జానూని పిలిచి మాట్లాడుతుంది. కంప్లైంట్ గురించి చెప్పమని అంటుంది. దాంతో జాను జరిగింది మొత్తం చెప్తుంది. మా నాన్నని సింహాద్రి మోసం చేశాడు.. అవన్నీ తట్టుకోలేక మా నాన్న చనిపోయాడని జాను చెప్తుంది. సింహాద్రికి శంకర్ పంపించిన డబ్బుకి సంబంధించిన స్టేట్ మెంట్స్ అన్నీ ఇస్తుంది. పదా జానూ వెళ్లి ఆ సింహాద్రిని అరెస్ట్ చేద్దామని అశ్విని అనగానే మేడం ఆ సింహాద్రి జోలికి పోవద్దు అని కానిస్టేబుల్ అంటాడు. ఎవరు ఎలా ఉన్నా నాకు అనవసరమని అశ్విని అంటుంది. మరోవైపు నిత్య, సూర్య పెళ్లికి ముందు తంతు జరుగుతుంది. అప్పుడే శారద, మురళి, నందు వస్తారు. వీళ్లెందుకు వస్తున్నారని భువన అంటుంది. వచ్చి భోజనం చేయండి.. జాను ఎక్కడ అని సింహాద్రి అడుగుతాడు. అప్పుడే జానూ పోలీసులను తీసుకొని ఎంట్రీ ఇస్తుంది. సింహాద్రి నిన్ను అరెస్ట్ చేస్తున్నామని అశ్విని అంటుంది. నేను పెళ్లి ఆపడానికి రాలేదు.. మా నాన్న చావుకి కారణమైన సింహాద్రిని అరెస్ట్ చేయించడానికి వచ్చానని జాను అంటుంది. ఇప్పుడు నేను కారణం అని సాక్ష్యం ఉందా అని సింహాద్రి అడుగుతాడు. అప్పుడే సింహాద్రి అసిస్టెంట్ ని జాను పిలిచి సాక్ష్యం చెప్పిస్తుంది. దాంతో అందరు షాక్ అవుతారు. అతను సాక్ష్యం చెప్తాడు.నాన్న నువ్వు అరెస్ట్ అయితే నేను పెళ్లి చేసుకోను.. నీకు వాళ్లు ఇచ్చాను అంటున్న నలభై లక్షలు ఇచ్చేయ్ అని నిత్య అంటుంది. ఆ తర్వాత జానూని నందు, శారద పక్కకి తీసుకెళ్లి మన డబ్బు మనకి ఇస్తానని అంటున్నారు కదా.. ఇక చాలు అరెస్ట్ వద్దు అని శారద అంటుంది. నాన్న చావుకి న్యాయం జరగాలి అమ్మా అని జాను అంటుంది. తరువాయి భాగంలో శారద వాళ్లకి సింహాద్రి అసిస్టెంట్ ఫోన్ చేసి మీరు ఊళ్లో నుంచి వెళ్లిపోండి.. ఆ సింహాద్రి వదిలిపెట్టడు అని చెప్తాడు. మరోవైపు త్వరగా పెళ్లి జరిపించండి అని పంతులుకి సింహాద్రి చెప్తాడు. మరోవైపు జాను వాళ్లు ఊరి నుంచి వెళ్లడానికి సిద్ధం అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. [Godhavari Serial, Godhavari Today Episode, Godhavari Episode 98, Star Maa Godhavari, Godhavari Serial Latest Update, Godhavari Telugu Serial, Janu vs Simhadri, Inspector Ashwini Entry, Nithya Surya Marriage]
Aug 30, 2026 10:16AMPodharillu : మాధవకు రెండో పెళ్లి ఫిక్స్.. చక్రిని చూసి రగిలిపోయిన మహా!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -195 లో....గోపికకి మా చక్రి ఎలా తెలుసని కేశవ అడుగుతుంది. దానికి చక్రి క్యాబ్ ఎక్కిన రోజు.. వాడు పులిహోర కలిపిన తీరు గుర్తుచేసుకుని సిగ్గుపడుతూ నవ్వింది గోపిక. చాలా రోజులు కనిపించలేదు, ఈ ఏరియాకి వచ్చాక మళ్ళీ కనిపించాడని చెప్తుంది. సత్య కూడా వాడు ఒకసారి కన్నాని కాలేజీకి తీసుకొచ్చాడు..అన్నయ్య అని పరిచయం చేశాడని చెప్తుంది. ఇదంతా విన్న కన్నా గాడికి మైండ్ బ్లాక్ అయింది. తను లవ్ చేసిన అమ్మాయి చక్రిని లవ్ చేస్తుందని తెలిసి తిక్కతిక్కగా ఉందని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకో పక్క మాధవ పెళ్లి చూపులు జరుగుతుంటాయి. జయంతి పాత్రలో మంజుల పరిటాల వస్తుంది. తను చాలా క్లియర్ గా చెప్పేసింది. నా పేరు జయంతి, BA చదివా, రెండేళ్ల క్రితం పెళ్లైంది. ఇప్పుడు విడిపోయాను. మళ్ళీ పెళ్లి తర్వాత జాబ్ చేస్తా అని చెప్పడంతో మాధవ కూడా తను మేస్త్రీ అని, తమ్ముళ్లతో కలిసే ఉంటానని పెళ్లయ్యాక కూడా అందరం కలిసే ఉంటామని చెప్తాడు. దానికి జయంతి కూడా ఓకే అంటుంది. కానీ సడన్ గా తన మాజీ భర్తను అక్కడికి పిలుస్తుంది. వాడు వచ్చి మాధవతో పొగరుగా, ఈమెను వారం కూడా భరించలేవు.. భరిస్తే లక్ష ఇస్తా అని ఛాలెంజ్ చేస్తాడు. దాంతో మాధవ కంగారు పడతాడు. ఆ తర్వాత కన్నా లవ్ ఫెయిల్ అయి డల్ గా కూర్చుంటే చక్రి మాత్రం గాల్లో తేలినట్టుందే అని పాట పాడుకుంటూ హుషారుగా తిరుగుతుంటాడు. ఇక మహా రూం లోంచి బయటకు రాగానే కావాలనే.. అమ్మాయి నన్ను ప్రేమిస్తుందట.. నా నంబర్ అడిగిందట.. నా మాటలకు ఎవరైనా పడిపోతారని చక్రి గట్టిగా చెప్తుంటాడు. అందంగా ఉంటే అమ్మాయిలు ఇలానే పడిపోతారని ఓవర్ చేస్తాడు. దాంతో మహాకి కోపం వచ్చి తన గదిలోకి వెళ్ళిపోతుంది. దానికి చక్రి, ఇది పొసెసివ్ నెస్ రా అని కేశవతో అంటాడు. రాత్రికి పెళ్లిళ్ల బ్రోకర్ ఫోన్ చేసి అమ్మాయి వాళ్లకు నువ్వు నచ్చావు.. రెండు రోజుల్లోనే మంచి ముహూర్తం ఉందని చెప్తాడు. దాంతో మాధవ షాక్ అవుతాడు. ఇంకా ఇంట్లో వాళ్లకి చెప్పలేదు కదా అని టెన్షన్ పడతాడు. అదే టైమ్ లో చక్రి, ఏంటన్నయ్య రెండు రోజుల్లో అంటున్నావని అడుగుతాడు. మాధవ ఏం చెప్పాలో తెలియక ఆలోచిస్తుండగానే గాయత్రి ఎంట్రీ ఇస్తుంది. కన్నాని చూసి నీ గురించి చెప్పేస్తా అని బెదిరించడంతో.. మహ ఏంటని అడుగతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. [Podarillu Serial Today Episode, Podarillu Telugu Serial, Podarillu 29 August Episode, Madhava Second Marriage, Chakri Maha Love Track, Kanna Love Failure, Star Maa Podarillu Serial Update]
Aug 30, 2026 9:51AM
Agnipariksha season 2 : అగ్నిపరీక్షలో గందరగోళం..నవదీప్ షాకింగ్ కామెంట్స్!
అగ్నిపరీక్షలో ఇప్పటివరకు సైలెంట్ గా, కెమెరాకు కనిపించకుండా దాక్కున్న నలుగురు కంటెస్టెంట్లకు నిన్నటి ఎపిసోడ్ లో దిమ్మతిరిగే షాక్ తగిలింది. హేమంత్, ప్రియాంక, చరణ్, భాగి .. వీళ్లు ఆటలో లేరు.. వీళ్ల ఎమోషన్ కనిపించడం లేదని జ్యూరీలు నేరుగా స్టేజ్ మీదకు పిలిచి నిలదీశారు. ఇది వాళ్లకు లాస్ట్ ఛాన్స్ లాంటిది. మీరు ఎందుకు ఉండాలి, మిగతా వాళ్లకంటే మీరు ఏ విషయంలో గొప్ప అని నిరూపించుకోవాల్సిన టాస్క్ ఇచ్చారు. కానీ ఈ ఛాన్స్ ని ఆ నలుగురు అస్సలు వాడుకోలేకపోయారు. చరణ్ ఏదో చెప్పబోయి బిందు మాధవి చేతిలో దొరికిపోయాడు. భాగి ఒక్క మాట కూడా గట్టిగా మాట్లాడలేకపోయింది. హేమంత్, అపూర్వ ముందు తడబడ్డాడు. ఇక ప్రియాంక అయితే టాస్క్ నే అర్థం చేసుకోలేదు. పాయింట్ చెప్పమంటే కథ చెప్పింది. దీంతో నవదీప్. మ్యాటర్ కి రా అని, బిందు.. కథథలు వద్దు అని అరిచారు. జ్యూరీ ఆపమన్నా ఆగకుండా గొడవపడటంతో శ్రీముఖి కోప్పడింది. మీకు ఇచ్చిన గోల్డెన్ ఛాన్స్ ని వేస్ట్ చేశారు, మా టైం వేస్ట్ చేశారని శ్రీముఖి ఫైర్ అయింది.ఆ తర్వాత వచ్చిన నంబర్ టాస్క్ అసలు అగ్నిపరీక్ష అంటే ఏంటో చూపించింది. ఇది కేవలం లెక్కల గేమ్ కాదు, మైండ్ గేమ్. గడ్డిలో నంబర్లు వెతకడం, కరెక్ట్ టోటల్ వచ్చేలా మనుషుల్ని కన్విన్స్ చేసుకోవడం .. ఇందులో ప్రియాంక మళ్లీ ఫెయిల్ అయింది. తన నంబర్ ని ఈజీగా దీపక్ కి ఇచ్చేసింది. ఝాన్సీ దగ్గర ఫైర్ కార్డ్ ఉందని తెలిసి కూడా ఆమె టీంలోకి వెళ్లే ప్రయత్నం చేయలేదు. ఈ ఒక్క తప్పుతోనే ఆమెకు ఎల్లో కార్డ్ పడేందుకు బేస్ రెడీ అయింది. ఆటలో తెలివి ఎంత ముఖ్యమో ఈ టాస్క్ ప్రూవ్ చేసింది. లీడర్ సెలక్షన్ లో కూడా కంటెస్టెంట్ల బలహీనత బయటపడింది. లీడర్ అంటే ఎవరో ఒకరిని పేరు చెప్పడం కాదు.. నిర్ణయం తీసుకునే ధైర్యం ఉండాలి. గ్రీన్ టీమ్, ఎల్లో టీమ్ రెండూ జ్యూరీ ఒక్క మాట అనగానే లీడర్ ని మార్చేశాయి. మీకంటూ ఒక స్టాండ్ లేదా? బ్యాడ్ పర్ఫామెన్స్ అంతా లీడర్లు అవుతున్నారని నవదీప్ క్లాస్ పీకాడు. ఒక్క చరణ్ టీం మాత్రమే హెల్దీగా డిస్కస్ చేసుకుని చరణ్ ని లీడర్ గా పెట్టింది దాన్నే నవదీప్ బెస్ట్ డిబేట్ అని మెచ్చుకున్నాడు. ఫైనల్ టాస్క్ లో ఝాన్సీ తెలివిగా తన హెడ్ స్టార్ట్ కార్డ్ ని వాడి తన టీమ్ ని గెలిపించింది. కానీ గెలిచాక కూడా క్రెడిట్ ఎవరికి ఇవ్వాలో తెలియక తికమక పడ్డారు. ఫైనల్ గా రామకృష్ణ, రోహిత్ లకు ఓట్ అప్పీల్ దక్కగా అన్ని చోట్ల ఫెయిల్ అయిన ప్రియాంకకు ఎల్లో కార్డ్ తో పాటు డేంజర్ జోన్ శిక్ష పడింది. ఫైనల్ గా ఎవరిలో ఏ ట్యాలెంట్ ఉందో వెతికితీసే పనిలో పడ్డారు జడ్జెస్.ఈ అగ్నిపరీక్ష ముగిసేలోపు ఎవరు స్ట్రాంగ్.. ఎవరు వీక్ కంటెస్టెంట్ తేలిపోతుంది. ఆయితే బయట ఫ్యాన్ బేస్ ఉన్నవాళ్ళని, సోషల్ మీడియాలో బజ్ ఉన్నవాళ్ళకి బిగ్ బాస్ టీమ్ సపోర్ట్ ఎప్పటికి ఉంటుందనేది అందరికి తెలిసిన విషయమే అయితే ఇప్పటివరకు జరిగిన అన్ని ఎపిసోడ్ లలో ఎవరు బిగ్ బాస్ సీజన్-10 లోకి వెళ్తారని అనుకుంటున్నారో కామెంట్ చేయండి.
Aug 29, 2026 9:05AM
Agnipariksha season2 : అగ్నిపరీక్షలో మోస్ట్ వాల్యుయేబుల్ ప్లేయర్ గా రోహిత్.. డేంజర్ జోన్ లోకి ప్రియాంక!
అగ్నిపరీక్ష సీజన్ 2 మరికొన్ని రోజుల్లో ముగియనుంది. ఇక ఇందులో నుండి ఎవరు బిగ్ బాస్ సీజన్ 10 లోకి వెళ్తారా అనే క్యూరియాసిటీ అందరిలో నెలకొంది. ఇక నిన్నటి ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఓసారి చూసేద్దాం.. స్టాప్ స్టిక్స్ తో విన్నర్ అని బ్లాక్స్ పెట్టే టాస్క్ లో ఝాన్సీ తన దగ్గరున్న హెడ్ స్టార్ట్ ఫైర్ కార్డ్ ని వాడేయడంతో రామకృష్ణ, ఝాన్సీ, దీపక్ ఉన్న గ్రీన్ టీం ఈ టాస్క్ లో విన్ అయింది. అయితే విన్నర్ అయ్యాక ఓట్ అప్పీల్ విషయంలో ఆ టీంలోనే గందరగోళం నడిచింది. ముందుగా దీపక్ కి ఓట్ అప్పీల్ ఇస్తామని ఆ టీమ్ చెప్పడంతో జ్యూరీలు ఫైర్ అయ్యారు.గెలిచింది ఝాన్సీ తన ఫైర్ కార్డ్ వాడడం వల్ల, ఆమెకే ఓట్ అప్పీల్ ఇవ్వాలి.. లేదంటే నువ్వు డేంజర్ జోన్ లో ఉన్నావ్ కాబట్టి నువ్వైనా తీసుకోవాలి కదా అని రామకృష్ణను నవదీప్, బిందు, శ్రీముఖి గట్టిగా తిట్టారు. దీంతో మాట మార్చుకుని చివరకు రామకృష్ణ తనే ఓట్ అప్పీల్ కి వెళ్లాడు. అతను డేంజర్ జోన్ నుంచి బయటపడేందుకు ఈ ఓట్ అప్పీల్ ఉపయోగపడింది. అదే టాస్క్ లో అద్భుతంగా ఆడిన రోహిత్ కి జ్యూరీలు మోస్ట్ వాల్యుయేబుల్ ప్లేయర్ ( Most Valuable Player) అవార్డు ఇచ్చారు. ఎల్లో టీమ్ నుంచి రోహిత్ చాలా కష్టపడ్డాడని.. టాస్క్ ని బాగా ఆడాడని చెప్పి అతనికి కూడా ఓట్ అప్పీల్ అవకాశం ఇచ్చారు. దీంతో ఈ రోజు రెండు ఓట్ అప్పీల్స్..ఒకటి విన్నర్ టీం అయిన రామకృష్ణకి, రెండోది మోస్ట్ వాల్యుయేబుల్ ప్లేయర్ అయిన రోహిత్ కి దక్కాయి. ఇక పెనాల్టీ విషయానికి వస్తే.. రోజంతా ఏ టాస్క్ లోనూ యాక్టివ్ గా లేక, నంబర్ టాస్క్ లో నంబర్ ని వదిలేసి వాదించలేక ఫెయిల్ అయిన ప్రియాంకను జ్యూరీలు డేంజర్ జోన్ లోకి వేశారు. ఆమె ఏం ఆడలేదని చెప్పి ఎల్లో కార్డ్ కూడా ఇచ్చారు. ఇకపై ఎల్లో కార్డులు లేవు.. డైరెక్ట్ గా రెడ్ కార్డులే ఉంటాయని అభిజిత్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. చివర్లో తనకు తగిలిన గాయం వల్లే ఎవరూ తనను టీంలోకి తీసుకోవడం లేదని భాగి ఎమోషనల్ అవ్వడంతో ఎపిసోడ్ ముగిసింది.
Aug 29, 2026 8:59AM
Agnipariksha season2 :అగ్నిపరీక్షలో నంబర్ గేమ్ టీం టాస్క్.. ఝాన్సీ ఫైర్ కార్డ్ తో రామకృష్ణ టీం విన్!
అగ్నిపరీక్ష సీజన్ 2 హోరాహోరీగా సాగుతోంది. స్టిక్ టాస్క్ తర్వాత శ్రీముఖి ఝాన్సీ దగ్గర ఉన్న హెడ్ స్టార్ట్ ఫైర్ కార్డ్ కి ఈరోజే లాస్ట్ వాలిడిటీ అని చెప్పి.. దాన్ని వాడేయాలని ఆదేశించింది. దీనికోసం ఒక నంబర్ టీం టాస్క్ పెట్టింది. గడ్డిలో దాచిన నంబర్లను వెతికి, ఆ నంబర్ల టోటల్ శ్రీముఖి చెప్పిన నంబర్ కి ఈక్వల్ అయ్యేలా నలుగురు కలిసి ఒక టీంగా ఫామ్ అవ్వాలి. ముందుగా 15 అని చెప్పడంతో ఝాన్సీ, శ్రష్టి, దీపక్, రామకృష్ణ ఒక టీంగా మారారు. అయితే ప్రియాంక తన నంబర్ ని ఫైట్ చేయకుండా దీపక్ కి ఇచ్చేయడంతో జ్యూరీలు ఫైర్ అయ్యారు. ఝాన్సీ దగ్గర ఫైర్ కార్డ్ ఉంది, ఎందుకు ఆమె టీంలోకి వెళ్లలేదు, ఎందుకు వాదించలేదని నవదీప్, బిందు తిట్టారు. ఆ తర్వాత శ్రీముఖి 21 నంబర్ చెప్పగా రాజకుమారి, అపూర్వ, గాయత్రి, చరణ్ లకు నంబర్ కలిసినా టీంగా మారకపోవడంతో.. ఇలా చేస్తే టీంలు రద్దు చేస్తామని జ్యూరీ వార్నింగ్ ఇస్తుంది. మళ్లీ 21 చెప్పినప్పుడు మిథిలేష్, రాజకుమారి, హేమంత్, చరణ్ ఒక టీం అయ్యారు. చివరగా 19 నంబర్ కి షాలిని, రోహిత్, గాయత్రి, అమన్ టీంగా మారారు. మిగిలిన ప్రియాంక, భాగి, అపూర్వలను బ్లూ టీం అని, వీళ్లకు లీడర్ కూడా ఉండరని జ్యూరీ చెప్పింది. నువ్వు ఎందుకు కన్విన్స్ చేయలేకపోయావ్, నంబర్ ఎందుకు ఎక్స్ఛేంజ్ చేశావని ప్రియాంకను మళ్లీ తిట్టారు. ఆ తర్వాత మూడు టీంలకు లీడర్లను సెలెక్ట్ చేసుకోమన్నారు. గ్రీన్ టీం నుంచి మొదట దీపక్ లీడర్ అని చెప్పి, వెంటనే మార్చి రామకృష్ణ అనడంతో.. మేం చెప్తే మార్చేస్తారా.. మీకంటూ నిర్ణయం లేదా అని జ్యూరీ కౌంటర్ వేసింది. ఎల్లో టీం నుంచి గాయత్రిని లీడర్ అని చెప్పినా షాలిని ఓటింగ్ లో తికమక పెట్టడంతో .. ఏం మాట్లాడుతున్నావ్ షాలిని, బ్యాడ్ పర్ఫామెన్స్ అంతా లీడర్స్ అవుతున్నారని బిందు, నవదీప్ ఫైర్ అయ్యారు. కానీ రాజకుమారి టీం మాత్రం లీడర్ విషయంలో బాగా డిబేట్ చేసింది, దీన్నే బెస్ట్ డిబేట్ అని నవదీప్ మెచ్చుకున్నాడు. ఆ టీం నుంచి చరణ్ లీడర్ అయ్యాడు. ఫైనల్ గా వచ్చిన స్టాప్ స్టిక్స్ టాస్క్ లో ముగ్గురు మాత్రమే ఆడాలని.. ఒకరిని తీసేయాలని నవదీప్ చెప్పడంతో గాయత్రి అమన్ ని, రామకృష్ణ శ్రష్టిని, చరణ్ హేమంత్ ని తీసేశారు. ఇద్దరు తాడు పట్టుకుంటే ఒకరు విన్నర్ అని బ్లాక్స్ పెట్టాలి. ఈ టాస్క్ లో ఝాన్సీ తన హెడ్ స్టార్ట్ ఫైర్ కార్డ్ వాడేయడంతో రామకృష్ణ టీం విన్ అయింది. విన్నర్ అయినా ఓట్ అప్పీల్ విషయంలో తేడా జరిగింది. ముందు దీపక్ కి ఇస్తామనడంతో.. గెలిచింది ఝాన్సీ వల్ల, ఆమెకి ఇవ్వాలి. లేదంటే డేంజర్ జోన్ లో ఉన్న నువ్వైనా తీసుకోవాలని రామకృష్ణను తిట్టారు. చివరకు రామకృష్ణ ఓట్ అప్పీల్ కి వెళ్లాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Aug 29, 2026 8:56AM(1).webp)
Agnipariksha season2 : అగ్నిపరీక్షలో శ్రీముఖి స్టిక్ టాస్క్.. చరణ్ కు బిందు కౌంటర్, సైలెంట్ అయిన భాగి!
అగ్నిపరీక్ష రెండో సీజన్ హోరాహోరీగా సాగుతోంది. నిన్నటి ఎపిసోడ్ లో అసలేం జరిగిందంటే.. ఆడియన్స్ కి కనిపించడం లేదు.. గేమ్ లో యాక్టివ్ గా లేరనే కారణంతో జ్యూరీలు హేమంత్, ప్రియాంక, చరణ్, భాగి నలుగురిని స్టేజ్ మీదకు పిలిచారు. వాళ్లకు శ్రీముఖి ఒక స్పెషల్ టాస్క్ ఇచ్చింది. మిగిలిన కంటెస్టెంట్ల కంటే మీరు ఎందుకు బెటర్ అనేది పాయింట్స్ తో ప్రూవ్ చేసుకోవాలి.. అందుకోసం ఒక స్టిక్ ని విరగ్గొట్టి ఎదుటి వ్యక్తి పేరు చెప్పి వాదించాలని టాస్క్ పెట్టింది. మొదటగా చరణ్ వచ్చి దీపక్ పేరు చెప్పాడు. నేను హానెస్ట్ గా ఉంటా, ఆటల్లో ముందుంటా, వెయిట్ టాస్క్ లో దీపక్ కంటే ఎక్కువ సేపు నిలబడ్డా అని చరణ్ అనడంతో బాల్స్ నేను ఎక్కువసార్లు పట్టుకున్నా, టాస్కులు ఆడా అని దీపక్ కౌంటర్ ఇచ్చాడు. వెంటనే బిందు మాధవి కల్పించుకుని.. ఇలా మాట్లాడితే జనాలు నిన్ను చూస్తారని, నీకు ఓట్లు వేస్తారని అనుకుంటున్నావా అని చరణ్ కి స్ట్రాంగ్ కౌంటర్ వేసింది. తర్వాత భాగి వచ్చి రోహిత్ కంటే తను బెటర్ అని వాదించబోయింది కానీ రోహిత్ తన పాయింట్స్ తో గట్టిగా డిఫెండ్ చేసుకోవడంతో భాగి సైలెంట్ అయిపోయింది. ఇక హేమంత్ వచ్చి అపూర్వ పేరు చెప్పాడు. తప్పులు ఒప్పుకోదు, ఎల్లో కార్డ్ వచ్చినా తట్టుకోలేదు, కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రాదు, ఆమె కంటే నేను బాగా పర్ఫామ్ చేశా అని అన్నాడు. నువ్వే కన్ఫ్యూజ్ అవుతుంటావు, క్లారిటీతో ఉండవు, నేను బాగానే ఆడా అందరూ చూశారని అపూర్వ గట్టిగా బదులిచ్చింది. చివరగా వచ్చిన ప్రియాంక టాస్క్ మొదలు పెట్టకుండా స్టోరీలు చెప్పడంతో జ్యూరీలకు కోపం వచ్చింది. మేటర్ కి రా, కథలు వద్దు పాయింట్లు చెప్పు, స్టిక్ విరగ్గొట్టు నీకు టాస్క్ అర్థం కాలేదా అని నవదీప్, బిందు తిట్టారు. అమన్ పేరు చెప్పి కూడా పాయింట్ చెప్పకుండా వాదించడంతో థాంక్యూ.. థాంక్యూ.. ఆపండి అని శ్రీముఖి అరిచినా వినలేదు. వీళ్ళని బయటకు పంపిస్తారా? నేను వెళ్లిపోవాలా? మీకు మంచి అవకాశం ఇస్తే టైం వేస్ట్ చేశారని శ్రీముఖి ఫైర్ అయింది. ఈ నలుగురు ఇచ్చిన అవకాశాన్ని వాడుకోలేకపోయారని నవదీప్ కూడా కామెంట్ చేశాడు.
Aug 29, 2026 8:48AM(2).webp)
Jayam serial :శకుంతల కుట్ర తో గంగకి షాక్.... గంగని కొట్టిన రుద్ర!
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ జయం Jayam. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ 359 లో ..గంగకి రుద్ర ఫోన్ చేస్తుంటే గంగ లిఫ్ట్ చేయదు. అప్పుడే అక్కడికి శకుంతల వస్తుంది. రుద్రతో మాట్లాడుతుంది. గంగ నిద్రపోతుంది. ఎంత పిలిచినా లేవడం లేదని శకుంతల అబద్ధం చెప్తుంది. మరోవైపు స్పాన్సర్లు కోపంగా.. ఇలాంటి డిసిప్లిన్ లేని వాళ్లతో ఎలా అగ్రిమెంట్ కుదుర్చుకుంటామని అక్కడి నుంచి వెళ్లిపోతారు. నేను ముందు నుంచే చెప్తున్నా, ఎంత టాలెంట్ ఉన్నా కూడా డిసిప్లిన్ ఉండాలి అని. కానీ నా మాట ఎప్పుడూ వినలేదు. ఇప్పుడు తన వల్ల నా పరువు పోయిందని విశ్వ కోప్పడతాడు. దీంతో రుద్ర కోపంగా ఇంటికి వెళ్లి గంగపై వాటర్ చల్లి నిద్ర లేపుతాడు. ఎందుకు ఇలా చేశావ్.. అగ్రిమెంట్ క్యాన్సిల్ అయిందని తన చెంపచెల్లుమనిపిస్తాడు. నీ వల్ల మావయ్య పరువుపోయింది. రేపటి నుంచి నీకు ట్రైనింగ్ ఇస్తాడో ఇవ్వడో. ఒక తప్పు వల్ల ఇన్ని రోజులు చేసింది మొత్తం పోయిందని గంగపై రుద్ర సీరియస్ అవుతాడు.మరోవైపు విశ్వ ఇంటికి వెళ్తాడు. గంగ స్పాన్సర్ అగ్రిమెంట్ అయిందా అని సుధా అడుగుతుంది.నేను ఢిల్లీ వెళ్లాలి అర్జెంట్ గా, బట్టలు సర్దమని విశ్వ అంటాడు. అదేంటి, నేను అగ్రిమెంట్ గురించి అడుగుతున్నానని సుధా అంటుంది. అగ్రిమెంట్ క్యాన్సిల్ అయిందని జరిగింది చెప్తాడు. దొరికింది ఛాన్స్, ఆ గంగకి చాలా పొగరు అని సుధా అంటుంది.నేను బాక్సింగ్ నేర్చుకుని మీ పరువు నిలబెడతానని జయ అనగానే దట్స్ మై డాటర్ అని విశ్వ అంటాడు. ఆ తర్వాత రుద్ర కోపంగా బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తాడు. తన దగ్గరికి వెళ్లి గంగ మాట్లాడుతుంటే రుద్ర కోప్పడతాడు. తరువాయి భాగంలో గంగ బాక్సింగ్ గ్లోవ్స్ ని ఇషిక తీసుకొని వెళ్లి డస్ట్ బిన్ లో పారేయాలని అనుకుంటుంది. అప్పుడే గంగ వచ్చి తనని కొట్టబోతుంటే శకుంతల వచ్చి ఆపుతుంది. ఇషిక చేస్తుంది తప్పు ఎలా అవుతుందని గంగపైనే సీరియస్ అవుతుంది శకుంతల. ఆ తర్వాత రుద్ర దగ్గరికి వెళ్లి.. మీరు ఎందుకు మాట్లాడడం లేదని గంగ అడుగుతుంది. తప్పు నీ వైపు ఉంది కాబట్టి అని రుద్ర అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Aug 29, 2026 8:38AM
Illu illalu pillalu :ఆరు లక్షల కోసం వల్లి పన్నిన కుట్ర..తిరుపతి బర్త్ డే రోజు ట్విస్ట్!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు Illu illalu pillalu. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ 564 లో.....రైస్ మిల్లులో పోయిన ఆరు లక్షల రూపాయల గురించి ఆలోచిస్తూ చందూ రాత్రంతా నిద్ర లేకుండా టెన్షన్ పడుతుంటాడు. అదే అదునుగా చూసుకున్న వల్లి, చందూ మనసులో తిరుపతి మీద అనుమానం కలిగేలా మాట్లాడుతుంది. బా.. నీ ఆరోగ్యం పాడు చేసుకోకు.. చెయ్యని తప్పుకు రేపు మీ నాన్న ముందు దోషిగా నిలబడితే నేను చూడలేనని వల్లి కేరింగ్ నటిస్తూనే.. లోపల డబ్బులు కొట్టేసింది మీ తిరుపతి మావయ్యే బా.. నిజంగా దొంగలు పడితే అంత డబ్బులో కేవలం ఆరు లక్షలు మాత్రమే ఎందుకు తీసుకెళ్తారని నూరిపోస్తుంది. ఇంకోసారి మా తిరుపతి మావయ్య గురించి మాట్లాడావంటే నీ చెంపలు వాయించేస్తానని వల్లిని తిడతాడు చందు. చందూ ఎంత కోప్పడినా వల్లి తగ్గదు. తన మాటలు చందూ మనసులో అనుమానపు బీజాన్ని నాటాయని గ్రహించి ప్రశాంతంగా నిద్రపోతుంది. తిట్టగా తిట్టగా ఒక తిట్టు, వేయగా వేయగా ఒక రాయి తగులుతాయి అంటారు. నా మాటలు చందూకి తగిలాయి. ఇక నేను అనుకున్న ప్లాన్ నడిస్తే ఆ డబ్బుల విషయంలో మేం సచ్చినా దొరకం అని తనలో తను మురిసిపోతుంది వల్లి. మరోవైపు ప్రేమ, ధీరజ్ ల మధ్య మరోసారి తీవ్రమైన మాటల యుద్ధం మొదలవుతుంది. ముందు రాయి విసిరింది నువ్వే, నాటకాలు ఆడవంటే పసుపు దంచినట్లు దంచుతానని ప్రేమ ఫైర్ అవ్వగానే ఏయ్ తింగరిదానా.. నేను రాయి విసరడం ఏంటని ధీరజ్ తన మీదకు వెళ్తాడు. ఇద్దరూ చేతిలో రాళ్లతో ఒకరినొకరు కొట్టుకోవడానికి సిద్ధపడటంతో మిగతా వాళ్లు భయపడి వాళ్లను ఆపడానికి పరుగెత్తుకుంటూ వస్తారు. మరుసటి రోజు ఉదయాన్నే .. చందూ, సాగర్, ధీరజ్ ముగ్గురు కలిసి నిద్రపోతున్న తిరుపతిని చాపతో సహా మోసుకెళ్లి కింద పడేస్తారు. తర్వాత నీళ్లు గుమ్మరించి.. హ్యాపీ బర్త్ డే తిరుపతి మావా అని అరుస్తారు. దానికి తిరుపతి కంగారుగా లేచి.. ఎవరైనా బర్త్ డే విషెస్ ని పూలు చల్లో, పన్నీరు చల్లో చెప్తారు గానీ ఇలా నీళ్లు పోసి చెప్తారా అని అంటాడు. మా మావ మీద ఎంత ప్రేమ ఉందో తెలియడానికే ఇలా చేశామని ధీరజ్ ఆటపట్టిస్తాడు. ఆ తర్వాత ఆ ముగ్గురు తిరుపతిని పెళ్లికొడుకులా ముస్తాబు చేస్తారు. మావా.. అచ్చం పెళ్లికొడుకులా ఉన్నావని చందూ అనగానే ఊరంతా కూడా ఇదే టాక్ రా మావా.. జీవితాంతం నీకు పెళ్లి కాదని అని సాగర్ కౌంటర్ వేయడంతో తిరుపతి వాళ్లను పట్టుకోవడానికి ఇల్లంతా పరుగులు తీస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Aug 29, 2026 8:34AM
INTERESTING NEWS
Customer Service
For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com






