Home

»

Latest News

Chiranjeevi: చిరంజీవితో ఇలాంటి సినిమానా? అది కామెడీ కాదంటున్న సీనియర్ రైటర్ 

Feb 26, 2026

 

-మన శంకర వరప్రసాద్ చేసిన హంగామా కళ్ళ ముందే ఉంది
-400 కోట్ల రూపాయిలు కూడా రాబట్టింది
-ఓటిటి లోను రెస్పాన్స్ అదుర్స్ 
-మరి ఆ సీనియర్ రైటర్ చెప్తున్న లాజిక్ ఏంటి! 


వింటే భారతం వినాలి.. తింటే గారేలే తినాలి అనే సామెత కాస్త మెగాస్టార్ మానియాతో  వింటే భారతం వినాలి.. చూస్తే మన శంకర వరప్రసాద్ గారు(Mana shankara Varaprasad Garu)చూడాలి అనే సామెతగా మారింది. ఆ విధంగా మారింది కాబట్టే మేకర్స్ కూడా అంచనా వేయని విధంగా 400 కోట్ల రూపాయలని మన శంకర వరప్రసాద్ కి తెలుగు ప్రేక్షకులు కట్టబెట్టారు. ఓన్లీ తెలుగు ప్రేక్షకులే సుమీ. ఆ 400 కోట్లలో ఇతర లాంగ్వేజెస్ వాళ్ళది రూపాయి కూడా లేదు.దీన్ని బట్టి పైన చెప్పుకున్న భారతం, గారెల సామెత నిజమే కదా! రీసెంట్ గా మన శంకర వరప్రసాద్ గారు గురించి లెజండ్రీ రైటర్ పరుచూరి గోపాల కృష్ణ గారు  కొన్ని విషయాలు చెప్పారు. దాంతో మన శంకర వరప్రసాద్ గారు ఘన విజయానికి గల కారణమేంటో అందరికి తెలిసొచ్చింది. మరి ఆ విషయాలేంటో చూద్దాం.

పరుచూరి గోపాల కృష్ణ(Paruchuri Gopala krishna)మాట్లాడుతు అనిల్ రావిపూడి(Anil Ravipudi)మొదటి నుంచి ఎంటర్ టైన్మెంట్ మూవీ అని చెబుతూ వచ్చాడు. చిరంజీవిని పెట్టుకుని ఇలాంటి సినిమా చేస్తున్నారు ఏంటని కొంత మంది ఆశ్చర్యపోయి ఉండొచ్చు.ఫుల్ లెంత్ కామెడీ సినిమాలు రాజేంద్ర ప్రసాద్, నరేష్ లాంటి వాళ్ళు చేశారు. కానీ చిరంజీవి ఇమేజ్ కి అలాంటి సినిమాలు చేయడం సాహసమే. కానీ సినిమా స్టార్ట్ అయిన మొదటి పది నిమిషాల తర్వాత అసలైన చిరంజీవి బయటకు వచ్చాడు. అప్పుడు అర్ధమైంది ఇది కామెడీ సినిమా కాదు అని. నా దృష్టిలో మన శంకర వరప్రసాద్ గారు ఎంటర్ టైన్మెంట్  అండ్ యాక్షన్ సబ్జెట్.  ఓటీటీలో వచ్చే వరకు ఎదురుచూడకుండా ప్రేక్షకులంతా థియేటర్స్ కి వెళ్లి శంకర వర ప్రసాద్ ని కలిశారు. అందుకే 400 కోట్లు వచ్చాయి. భార్య భర్తలు విడిపోయిన కథ అంటే వాళ్లిద్దరూ మళ్ళీ కలుస్తారని ఆడియన్స్ కి ముందే తెలుస్తుంది. ఆ కలిసే విధానాన్నిఅనిల్ రావిపూడి చాలా బాగా ప్రెజెంట్ చేసాడు.వెంకటేష్ క్యారక్టర్ చాలా బాగా ఉపయోగపడింది. నయనతార(Nayanthara),సచిన్ ఖేడ్కర్ లపెర్ఫార్మ్ కూడా అదనపు బలం. సుస్మిత(Susmitha konidela)మొదటి సినిమాతోనే తండ్రిని మళ్ళీ సింహాసనంపై ఇంద్రసేనుడిలా కూర్చోబెట్టింది.  మా చిరంజీవి (Chiranjeevi)ఎప్పటికి మా చిరంజీవి అనిపించుకున్నారని పరుచూరి గోపాల కృష్ణ  చెప్పుకొచ్చారు.

also read:  తిరుమల శ్రీవారి దర్శనంపై లిటిల్ హార్ట్స్ హీరోయిన్ కీలక వ్యాఖ్యలు 

పరుచూరి గోపాల కృష్ణ, చిరంజీవి కాంబో ఎప్పటికప్పుడు బూజు పట్టి ఉన్న తెలుగు సినిమా రికార్డులన్నిటిని చెరిపేసి సరికొత్త రికార్డ్స్ ఫ్రేమ్ ని ఉంచింది. ఖైధీ  ఘరానా మొగుడు, ఇంద్ర, ఠాగూర్,శంకర్ దాదా ఏంబిబి ఎస్ వంటి చిత్రాలే ఉదాహరణ.

 

 


 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com