Home

»

Gossips

నందమూరి ఫ్యాన్స్ కి బిగ్ న్యూస్.. మోక్షజ్ఞ డెబ్యూపై క్లారిటీ వచ్చేసింది!

Feb 25, 2026

నందమూరి అభిమానులకు శుభవార్త!
మోక్షజ్ఞ ఎంట్రీకి ముహూర్తం ఖరారు!

నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. నిజానికి 'హనుమాన్' ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అనౌన్స్ మెంట్ వచ్చింది. కానీ, ఏవో కారణాలతో అది పట్టాలెక్కలేదు. దీంతో మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడు? డైరెక్టర్ ఎవరు? అంటూ అప్పటినుంచి చర్చ జరుగుతూనే ఉంది. త్వరలోనే దీనికి ఫుల్ స్టాప్ పడనుంది. (Nandamuri Mokshagna)

క్లాసిక్ ఫిల్మ్ 'ఆదిత్య 369'కి సీక్వెల్ గా 'ఆదిత్య 999'ను బాలకృష్ణ తలపెట్టిన సంగతి తెలిసిందే. స్వయంగా బాలయ్యే కథ రాసుకోవడం విశేషం. ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తారని, ఈ క్రేజీ ప్రాజెక్ట్ తోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని ఆ మధ్య వార్తలు వినిపించాయి. కానీ, కొంతకాలంగా మళ్ళీ ఎటువంటి చప్పుడు లేదు. అయితే త్వరలోనే సాలిడ్ అప్డేట్ రాబోతున్నట్లు తెలుస్తోంది. (Aditya 999)

బాలకృష్ణ ఇచ్చిన స్టోరీ లైన్ ని తీసుకొని క్రిష్ తన టీమ్ తో కలిసి ఇప్పటికే పూర్తి స్క్రిప్ట్ ని సిద్ధం చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందట. ఉగాది కానుకగా మార్చిలో అధికారికంగా ప్రకటించి, త్వరలోనే సెట్స్ మీదకు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నారట.

కాగా, 'ఆదిత్య 999'లో మోక్షజ్ఞ హీరోగా నటించనుండగా, బాలకృష్ణ పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారని వినికిడి. మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. అలాంటిది మొదటి సినిమాలోనే తండ్రితో కలిసి నటిస్తుండటం ఫ్యాన్స్ కి బిగ్ ట్రీట్ అని చెప్పవచ్చు.

Also Read: 15 ఏళ్ళ ప్రేమ కావాలి.. ఇలాంటి డ్రీమ్ డెబ్యూకి అదృష్టం ఉండాలి!

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com