English | Telugu

శైలేంద్ర ప్లాన్ ని తిప్పికొట్టిన జగతి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -798లో.. DBST కాలేజ్ బోర్డ్ మీటింగ్ జరుగుతుంటుంది. అందులో మిషన్ ఎడ్యుకేషన్ లో‌ పనులు‌ సక్రమంగా జరుగట్లేదని, దానిని మనం ఆపేద్దామమని శైలేంద్ర అంటాడు. అక్కడే ఉన్న మరో ముగ్గురు స్టాఫ్ కూడా శైలేంద్రకి అనుకూలంగా ఆపేద్దామని అంటారు. దాంతో అదంతా శైలేంద్ర ప్లాన్ అని తెలుసుకున్న జగతి వారిని ఇక చాలు.. ఆగండని చెప్తుంది. "మీలో ఎవరేం అన్నా.. నేను మిషన్ ఎడ్యుకేషన్ ని సక్రమంగా అమలు చేస్తాను. ఉండాలనుకునువాళ్ళు ఉండొచ్చు లేదంటే వెళ్ళిపోవచ్చు" అని జగతి చెప్పి వెళ్లిపోతుంది. 

మా బోనాల జాతరలో కీర్తి భట్ ఎంగేజ్మెంట్...సందడి చేసిన కార్తీదీపం జంట 

  ప్రతీ సంవత్సరం ఆషాఢ మాసం మొదలవడమే బోనాల జాతర స్టార్ట్ అవుతుంది. బోనాల జాతర అంటే చాలు అన్ని చోట్ల తీన్ మార్ డాన్సులు దుమ్మురేపుతూ ఉంటాయి . ఈ బోనాల జాతరను పురస్కరించుకుని చానెల్స్ కూడా షోస్ చేస్తూ వస్తున్నాయి. ఇప్పుడు స్టార్ట్ మా ఛానల్ లో "మా బోనాల జాతర" ఈవెంట్ త్వరలో ప్రసారం కాబోతోంది. దానికి సంబంధించిన ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇందులో బుల్లితెర ఆర్టిస్టులంతా పార్టిసిపేట్ చేసి ధూమ్ ధామ్ చేసేసారు. ఇక ఈ ప్రోమోలో కార్తీక దీపం దీప, డాక్టర్ బాబు, మోనిత హైలైట్ అయ్యారు. "ఊపులో ఉన్నారంటే తెలంగాణ జనాలు..మొదలయ్యాయి బోనాలు" అంటూ రవి మంచి జోష్ తో ఈ షో గురించిన ఇంట్రో చెప్పేసాడు. ఈ షోని రవి, వర్షిణి హోస్ట్ చేశారు. ప్రియదర్శి, కావ్య, బలగం వేణు కూడా డాన్సులు చేశారు. "సినిమా హిట్ ఐతే బాక్స్ ఆఫీస్ బద్దలైపోద్ది...లోకల్స్ వస్తే ఎంటర్టైన్మెంట్ దద్దరిల్లిపోద్ది" అంటూ నిరుపమ్ పరిటాల అలియాస్ డాక్టర్ బాబు మంచి ఎనెర్జీతో డైలాగ్ చెప్పాడు. ఇక ఈ షోలో కళ్ళకు గంతలు కట్టి కుండల్ని కొట్టే పోటీ పెట్టారు. సైకిల్ పోటీలు, బెలూన్స్ ని పగలగొట్టే పోటీలు ఇలా నిర్వహించారు.

శ్రీసత్య-ఫైమా పెళ్లి చేసుకోబోతున్నారట...నరకానికైనా వెళ్తుందట

పటాస్ ఫైమా-శ్రీ సత్య ఎంత బెస్ట్ ఫ్రెండ్సో ఆడియన్స్ అందరికీ  తెలుసు. బిగ్ బాస్ హౌస్ నుంచి వీళ్ళు చాలా చక్కటి రిలేషన్ ని మెయింటైన్ చేస్తూ వచ్చారు. అలాగే హౌస్ నుంచి బయటకు వచ్చాక కూడా తరచూ కలుస్తూనే ఉన్నారు. అలాంటి శ్రీసత్య హోమ్ టూర్ ని ఫైమా వీడియో తీసి తన యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేసింది. ఇంటికి వెళ్లి చూసాక అక్కడ గోడ మీద అన్నీ బిగ్ బాస్ మూమెంట్స్ తో ఉన్న ఫొటోస్ కనిపించాయి. "నన్ను మర్చిపోయావని అనుకున్నా కానీ బానే పెట్టుకున్నావు నా ఫొటోస్ నువ్వు..నేనంటే అంత ఇష్టమా నీకు" అంది ఫైమా. "నాకు హౌస్ లో చాలా తక్కువ మంది కనెక్ట్ అయ్యారు.

తమ్ముడు మూవీ తొమ్మిదిసార్లు చూసా...కాలేజీ నుంచి ఫోన్ వస్తే నాన్నలా మాట్లాడేవాడిని

"సర్కార్ సీజన్ 3 " ఈ వారం షోకి "ఉస్తాద్" మూవీ టీం నుంచి కావ్య, సింహ, డైరెక్టర్ ఫణి దీప్, సాయి కిరణ్ ఎంట్రీ ఇచ్చారు. గేమ్ మధ్యలో కావ్యతో కలిసి ప్రదీప్ స్టేజి మీద డాన్స్ చేసాడు.."వల్లంకి పిట్టా" సాంగ్ ప్లే చేసేసరికి "కావ్య చిన్నప్పటి ఆ వాయిస్ నీదేనా.. ఆ పాడింది నువ్వేనా" అని డైరెక్టర్ ఫణి కావ్యని అడిగేసరికి "ఈ విషయం అడుగుతున్నందుకు నీకు టూమచ్ గా అనిపించట్లేదా" అంది కావ్య.."చిన్నప్పుడు పాడితే విన్నాం ఇప్పుడు పాడితే వినాలి కదా" అని కౌంటర్ వేసాడు ప్రదీప్. "వచ్చింది ఉస్తాద్ ప్రొమోషన్స్ కి ఐతే గంగోత్రి ప్రొమోషన్స్ చేయిస్తారేమిటి" అని ఫన్నీగా సీరియస్ అయ్యింది కావ్య.

కష్టపడిన వాడు, స్లిప్ పెట్టి రాసిన వాడు ఒకటే ఐపోయినట్టు ఉంది నా ఫీలింగ్

గీతూ రాయల్ పేరు వింటే చాలు ముందుగా గుర్తొచ్చేది బిగ్ బాస్ సీజన్ 6 .. ఇందులో ఆమె ఏడ్చిన ఏడుపులు, అరిచిన అరుపులు ఆడియన్స్ ఎప్పటికీ మర్చిపోలేరు. అలాంటి గీతూ రెగ్యులర్ గా తన బిగ్ బాస్ సీజన్ కి సంబంధించిన ఫొటోస్ ని, వీడియోస్ ని తరచూ అప్ లోడ్ చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు కూడా అలాంటి ఒక వీడియో పోస్ట్ చేసి "ఈ ఎపిసోడ్ లో నా ఏడుపు చూసే నాకు ఏడుపొస్తోంది" అని ఫన్నీగా పెట్టుకుంది. తర్వాత చాలా రోజులయ్యింది మాట్లాడుకుని మాట్లాడుకుందామా" అని అడిగింది " ఏం చేస్తున్నావ్  ఈ మధ్య కాలంలో" అనేసరికి "బిగ్ బాస్ అన్ని సిరీస్ చూస్తున్నా..వెబ్ సిరీస్ చూస్తున్నా..హరీపాటర్ చూసా ఏం తీశాడులే సినిమా ..అందులో ఉన్నట్టు నాకు మంత్రాలు వచ్చి ఉండాలి అనుకుంటున్నా" అని చెప్పింది.

కాలికి బెల్టుతో..చేతిలో స్టిక్ తో వరుణ్ సందేశ్...

హ్యాపీ డేస్  హీరో వరుణ్ సందేశ్ మూవీ షూటింగ్ లో గాయపడ్డాడు. "ది కానిస్టేబుల్" అనే మూవీ షూటింగ్ జరుపుకుంటోంది. ఇందులో ఒక యాక్షన్ సీన్ చేస్తున్నప్పుడు ప్రమాదవశాత్తు తన కాలికి గాయమయ్యింది. కాలు కొంచెం బెటర్ అవ్వాలంటే త్రి వీక్స్ రెస్ట్ ఇవ్వాలని చెప్పడంతో ఇంట్లోనే కాలికి బెల్ట్ వేసుకుని స్టిక్ తో నడుస్తూ కనిపించాడు. ఈ విషయాన్నీ వితిక షేరు వీడియో తీసి తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసింది "వరుణ్ సందేశ్ బాగున్నారు. తన అప్ కమింగ్ మూవీ షూటింగ్ లో కాలికి గాయమయ్యింది. అతనికి మూడు వారాల రెస్ట్ అవసరమని డాక్టర్స్ చెప్పారు...మీరంతా ఆయన మీద చూపిస్తున్న ప్రేమకు.. కోలుకోవాలంటూ చెప్తున్న విషెస్ కి థాంక్యూ" అని చెప్పింది. వరుణ్ సందేశ్ ప్రస్తుతం ‘ఢీ’ షోలో ఒక టీమ్‌కు లీడర్ గా ఉన్నారు. 'హ్యాపీ డేస్' మూవీతో ఒక మంచి బబ్లీ బాయ్ గా ఆడియన్స్ లో ఒక మంచి క్రేజ్ ని సంపాదించుకున్నారు.  

ప్లాస్టిక్ వాడకండి...అవగాహన కల్పిస్తున్న ఆదిరెడ్డి

ప్లాస్టిక్ లేనిదే మనిషి జీవితం లేదు అనే పరిస్థితి నెలకొంది. ప్లాస్టిక్ మనల్ని కబళిస్తోందని తెలిసినా, కాలుష్యం పెరిగిపోవడానికి ముఖ్య కారణం అని తెలిసినా మనం చాలా లైట్ తీసుకుంటూ ఉన్నాం. దాని రిజల్ట్ ఎలా ఉంటుందో కూడా మనం లైవ్ లో చూసేస్తున్నాం...రుతువులు మారిపోయాయి. సంవత్సరం పొడవునా ఎండాకాలం తప్ప మరో కాలం కనిపించడం లేదు. దీనికి ప్రధాన కారణం ప్లాస్టిక్ అని చెప్పొచ్చు. అలాంటి ప్లాస్టిక్ నివారించడం కోసం చేయాల్సిన ప్రయత్నాలు అన్ని అందరూ చేస్తున్నారు. ఇప్పుడు ఆది రెడ్డి కూడా ప్లాస్టిక్ మీద అవగాహన కల్పించడానికి రెడీ అయ్యాడు. దానికి సంబంధించిన ఒక పోస్ట్ ని తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసాడు.