English | Telugu
శైలేంద్ర ప్లాన్ ని తిప్పికొట్టిన జగతి!
Updated : Jun 25, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -798లో.. DBST కాలేజ్ బోర్డ్ మీటింగ్ జరుగుతుంటుంది. అందులో మిషన్ ఎడ్యుకేషన్ లో పనులు సక్రమంగా జరుగట్లేదని, దానిని మనం ఆపేద్దామమని శైలేంద్ర అంటాడు. అక్కడే ఉన్న మరో ముగ్గురు స్టాఫ్ కూడా శైలేంద్రకి అనుకూలంగా ఆపేద్దామని అంటారు. దాంతో అదంతా శైలేంద్ర ప్లాన్ అని తెలుసుకున్న జగతి వారిని ఇక చాలు.. ఆగండని చెప్తుంది. "మీలో ఎవరేం అన్నా.. నేను మిషన్ ఎడ్యుకేషన్ ని సక్రమంగా అమలు చేస్తాను. ఉండాలనుకునువాళ్ళు ఉండొచ్చు లేదంటే వెళ్ళిపోవచ్చు" అని జగతి చెప్పి వెళ్లిపోతుంది.
ఆ తర్వాత అక్కడే ఉన్న ఫణీంద్ర.. జగతి నిర్ణయం సరైనదే.. తను స్టూడెంట్స్ భవిష్యత్తు కోసం ఆలోచించిందని వారికి చెప్పగా అప్పటిదాకా శైలేంద్ర మాటకి కట్టుబడి ఉన్నవాళ్ళు కూడా మేం ఈ ప్రాజెక్ట్ లో జగతి మేడంకి సపోర్ట్ గా ఉంటామని చెప్తారు. మహేంద్ర కూడా ఒకే అంటాడు. ఆ తర్వాత మినిస్టర్ దగ్గరికి జగతి వెళ్ళి ప్రాజెక్ట్ ని సక్రమంగా చూసుకుంటానని చెప్తుంది. అయితే రిషి కోసం వెతికిస్తున్నానని మినిస్టర్ గారితో జగతి అనగా.. అతని మనసుకు బలమైన గాయం కలిగినది. అతను రావాలంటే నిజం చెప్పాలని మినిస్టర్ అనగా.. టైం వచ్చినప్పుడు చెప్తానని జగతి అంటుంది. అప్పుడే అక్కడికి శైలేంద్ర వస్తాడు. స్టాఫ్ ఎవరూ ఆసక్తిగా లేరు. మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు వేరే కాలేజీకి ఇచ్చేయండి. కావాలంటే నాకు తెలిసిన కాలేజీలని చెప్తానని మినిస్టర్ తో శైలేంద్ర అనగా... ఏం మాట్లాడుతున్నారు మీరు, మీ పిన్ని గురించి మీకు తెలియదని శైలేంద్ర మీద మినిస్టర్ సీరియస్ అవుతాడు. ఏంటి ప్రాజెక్ట్ వదిలేస్తారా అని జగతిని మినిస్టర్ అడుగగా.. నేను చూసుకుంటానని జగతి చెప్తుంది.
ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన జగతి, శైలేంద్ర మాటల యుద్ధం మొదలెడతారు. నా జోలికి రావొద్దని, నాకు ధైర్యం చాలా ఎక్కువని, మిషన్ ఎడ్యుకేషన్ లో ఇన్వాల్వ్ అవ్వకని చెప్పి వెళ్ళిపోతుంది జగతి. మరొక వైపు విశ్వనాథ్ ఇంట్లో ఉన్న రిషి.. ఏంజెల్ దగ్గరికి వస్తాడు. ఏంటి రెస్ట్ తీసుకో అని ఏంజెల్ తో రిషి చెప్పగా.. పెయిన్ కిల్లర్స్ వేసుకున్న తగ్గిపోయిందని ఏంజెల్ అంటుంది. అప్పుడు రిషి తన మనసులో.. మనసుకి అయిన గాయానికి కూడా మందు ఉంటే బాగుండని అనుకుంటాడు. ఆ తర్వాత ఏంజెల్, రిషి కలిసి చపాతీలు చేస్తుండగా.. రిషి, వసుధారలు ఒకప్పుడు కలిసి చపాతీలు చేసిన జ్ఞాపకాలు గుర్తొస్తాయి. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.