English | Telugu
మెగాస్టార్ బర్త్ డే సెలెబ్రేషన్స్ లో నేను మ్యాజిక్ షో చేసాను
Updated : Jun 24, 2023
శ్రీకర్ కృష్ణ ఒక మెజీషియన్ గా అందరికీ తెలుసు. బుల్లితెర మీద ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తూ ఎదుగుతున్నాడు. అలాంటి శ్రీకర్ కృష్ణ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో చాలా విషయాలు చెప్పుకొచ్చాడు. " ఈటీవీలో చేసే శతమానం భవతి సీరియల్ లో అందులో కార్తీక్ అనే క్యారెక్టర్ లో హీరోగా చేస్తున్నాను...అలాగే బ్రహ్మముడి సీరియల్ లో విలన్ రోల్ లో రాహుల్ అనే క్యారెక్టర్ లో చేస్తున్నాను. నేను హీరోగా సెకండ్ మూవీ "శృతి" అని చేసాను. అది ఒక రెండు మూడు నెలల్లో రిలీజ్ కావొచ్చు. 2007 లో నేను స్కూల్ లో చదువుకునేటప్పుడు మా స్కూల్ యాన్యువల్ డేకి ఒక మెజిషియన్ వచ్చి ఒక ట్రిక్ నేర్పించారు కానీ నాకు అది చేయడం రాలేదు.
ఆ తర్వాతే అది నేర్చుకోవాలనే పట్టుదల నాలో పెరిగింది. ఇప్పటి వరకు 4 వేల షోస్ చేసాను. స్టేజి మ్యాజిక్ లో ఆల్ ఇండియా ఫస్ట్ అవార్డు వచ్చింది అలాగే రెండు సార్లు స్టేజి మ్యాజిక్ లో స్టేట్ అవార్డ్స్ వచ్చాయి. మాది వైజాగ్. ఐతే ఇండస్ట్రీలోకి రావడానికి ట్రైల్స్ వేసా కానీ ఎవరిని ఎలా అప్రోచ్ కావాలో తెలిసేది కాదు. 2017 లో నేను అవంతి ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కాలేజీలో చదువుకునేటప్పుడు ఒకసారి యూత్ ఫస్ట్ జరిగింది. ఆ షోకి చీఫ్ గెస్ట్ గా రాంచరణ్ గారు వచ్చారు. అప్పుడు ఆ షో మొత్తాన్ని నేనే హోస్ట్ చేసాను. అలాగే మ్యాజిక్ షో కూడా చేసాను. రాంచరణ్ గారికి సంబంధించిన ఒక పర్సన్ నన్ను కాంటాక్ట్ చేశారు. మెగాస్టార్ గారి బర్త్ డే సెలెబ్రేట్ చేస్తున్నాం..ఇలా ఒక మ్యాజిక్ షో చేయాలి అని అడిగారు. అలా హైదరాబాద్ వచ్చి మూడేళ్ళ పాటు మ్యాజిక్ షో చేసాను. నాన్న వేదపండితుడు...అమ్మ తెలుగు టీచర్. ఇంట్లో చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు.
ఇక హైదరాబాద్ లో నా ట్రైల్స్ నేను చేసుకోవడం మొదలు పెట్టాను. అలా చాలా రోజుల తర్వాత చిరంజీవి గారి మూవీ "సైరా నరసింహారెడ్డి" మూవీలో ఒక రోల్ చేసాను. ఆ మూవీ షూటింగ్ టైంలో కిచ్చా సుదీప్ గారు, అమితాబ్ గారు, జగపతి బాబు గారు ఇలా నేను వాళ్లందరితో రోజూ ట్రావెల్ చేసేవాడిని. రీసెంట్ గా "సిరిమల్లెపువ్వా" అనే మూవీలో హీరోగా చేసాను. ఆ తర్వాత సీరియల్స్ చేయడం స్టార్ట్ చేసాను. నంబర్ వన్ కోడలు, కల్యాణ వైభోగంలో నటించాను..ఇక ఇప్పుడు శతమానం భవతి సీరియల్ చేస్తున్నాను" అని చెప్పాడు శ్రీకర్ కృష్ణ.
