English | Telugu
చాయ్ లో సర్ఫ్ వేసారా ఏమిటి భయ్యా..హెల్త్ ఈజ్ వెల్త్ అంటున్న సోహైల్
Updated : Jun 25, 2023
"కథ వేరే ఉంటుంది" అనే టాగ్ లైన్ తో బిగ్ బాస్ సీజన్ 4లో ఒక హిస్టరీ క్రియేట్ చేసాడు ఇస్మార్ట్ సొహైల్. బిగ్ బాస్ తరువాత కూడా మనోడి జోష్ కంటిన్యూ అవుతూనే ఉంది. సినిమాలు, వెబ్ సిరీస్, టీవీ షోలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. లక్కీ లక్ష్మణ్, ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు, బూట్ కట్ బాలరాజు, మిస్టర్ ప్రెగ్నెంట్ వంటి మూవీస్ లో నటించాడు.
ఇక ఇప్పుడు సోహైల్ జిమ్ కి వెళ్లడం మొదలు పెట్టాడు. కొన్ని రోజులు చేసాక ఆపేసి మళ్ళీ జిమ్ కి వెళ్లడం మొదలుపెట్టేసరికి చాలా స్ట్రైన్ ఐపోయి తన కార్ లో కూర్చుని ఒక వీడియో చేసాడు. దాన్ని తన స్టేటస్ లో పోస్ట్ చేసుకున్నాడు. "ఏంట్రా బాబు ఈ జీవితం..ఏం జిమ్ రా నాయనా...వర్కౌట్ చేసాక బాడీ మస్త్ జబర్దస్త్ మాదిరిగా ఉంటుంది. ఒకట్రెండు వారాలు బై మిస్టేక్ వదిలేస్తే ఇక ఐపోయినట్టే టైర్ లో గాలి పోయినట్టు పోతది...అవసరామారా మనకు జిమ్ము...కానీ చేయాలి..హెల్త్ ఈజ్ వెల్త్ అని నేర్చుకున్నా..తప్పదు చేయాల్సిందే" అని చెప్పాడు సోహైల్.
అంతేకాదు రెస్టారెంట్ కి చాయ్ తాగడానికి కూడా వెళ్ళాడు సోహైల్ . ఐతే కప్పులో ఉన్నది చాయ్ నా లేదా సర్ఫ్ నురగ అనిపించేలా ఉండేసరికి అదే డౌట్ తో సోహైల్ "భయ్యా చాయ్ లో సర్ఫ్ వేసారా ఏమిటి ? ఎందిది ? చాయ్ లా సర్ఫ్ వేసినట్టు ఉంది.." అంటూ కామెంట్ చేసాడు. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక రిలీజ్ ఐన ఫస్ట్ మూవీ లక్కీ లక్ష్మణ్.