English | Telugu

డ్రగ్స్ కేసులో అషురెడ్డి.. అందుకేనా ఈ పవర్ ఫుల్ వార్నింగ్

అష్షురెడ్డి ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో అంతే బోల్డ్ గా ఉంటుంది అలాగే ఆన్సర్స్ చేస్తుంది. ఇప్పుడు కూడా అలాంటి ఒక వార్నింగ్ ఇచ్చేసింది.. టిక్ టాక్ స్టార్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ ఆర్జీవీ అభిమాని...ఆమె గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఇన్స్టాగ్రామ్ లో సూపర్ హాట్ ఫొటోస్ తో యూత్ ని మెస్మోరైజ్ చేస్తూ ఉంటుంది. బిగ్ బాస్ షోతో బాగా పాపులర్ అయింది. సోషల్ మీడియాలో తన హవా ఎప్పుడూ కొనసాగిస్తూ ఉంటుంది.

అలాంటి అష్షు ఈ మధ్య ఫారెన్ వెళ్లి రకరకాల స్టేజి షోస్ అవీ చేస్తోంది. వాటికి సంబందించిన ఫొటోస్ ని, వీడియోస్ ని కూడా తన ఇన్స్టాగ్రామ్ పేజెస్ లో అప్ లోడ్ చేస్తూ వస్తోంది. ఐతే అష్షు రీసెంట్ గా తన ఇన్స్టా స్టేటస్ లో ఒక పోస్ట్ పెట్టింది. "ఇది ఎవరికీ సంబంధించింది అంటే...కొంతమందితో నాకున్న ఫ్రెండ్ షిప్ కి సంబంధించి కొన్ని మీడియా వర్గాలు రకరకాల అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయి.. దాన్నితీవ్రంగా ఖండిస్తున్నాను. ఆ విషయంలో సంబంధిత వ్యక్తులకు నిజానిజాలు తెలియజేస్తాను. నా ఫోన్ నంబర్ ని బహిరంగంగా పోస్ట్ చేస్తే మాత్రం సహించేది లేదు" అంటూ ఒక వార్నింగ్ ఇచ్చేసింది. అష్షు ఈ మధ్య బుల్లితెర మీద ఎక్కడా కనిపించడం లేదు..ఐతే ఇప్పుడు ఇలాంటి ఒక వార్నింగ్ ఎందుకు పాస్ చేసిందా అని చూస్తే గనక డ్రగ్స్ కేసులో అరెస్టైన సినీ నిర్మాత కేపీ చౌదరి విషయం అందరికీ తెలిసిందే. ఐతే ఈయన కాల్ లిస్ట్ ని డీకోడ్‌ చేసిన పోలీసులకు బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ అషురెడ్డి పేరుతో పాటు ఇంకొంతమంది పేర్లు బయటకు తీసి విచారణ చేస్తున్నట్టు తెలుస్తోంది.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.