English | Telugu

పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన రిషి.. కేడీబ్యాచ్ లో మార్పు మొదలవుతుందా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -797 లో.. విశ్వనాథ్ కంగారుగా రిషి దగ్గరకి వస్తాడు. ఏమైంది సర్ అని రిషి అడుగుతాడు. మన కాలేజీ లోని కేడి బ్యాచ్ ఏదో తప్పు చేసి పోలీస్ లకి దొరికిపోయారట.. ఆ విషయం ఇప్పుడే ఎస్ఐ గారు చెప్పారు. మన స్టూడెంట్స్ పోలీస్ స్టేషన్ కి వెళ్లారంటే మన కాలేజీ పరువు పోతుందని విశ్వనాథ్ టెన్షన్ పడుతాడు.

ఆ తర్వాత మీరేం టెన్షన్ పడకండి సర్ నేను చూసుకుంటాను. మన కాలేజీ పరువు పోకుండా నేను చూసుకుంటానని విశ్వనాథ్ కి చెప్తాడు. ఆ తర్వాత రిషి పోలీస్ స్టేషన్ కి వెళ్తాడు. అదే సమయంలో వసుధార స్టేషన్ కి వస్తుంది. అక్కడ స్టేషన్ బయట ఉన్న వసుధారని చూసిన రిషి.. ఏంటి నువ్వు వచ్చావని అడుగుతాడు. మన స్టుడెంట్స్ ఇలా ఉంటే మన కాలేజీ పరువుపోతుందని, ఇలా వచ్చానని వసుధార అంటుంది. ఇద్దరు కలిసి లోపలికి వెళ్తారు. రిషి, వసుధారని చూసిన ఎస్ఐ.. DBST కాలేజీ చైర్మన్ అని గుర్తుపడుతాడు.

సర్ మీరు వచ్చారా అని గౌరవం ఇచ్చి మాట్లాడుతుంటే.. అక్కడే ఉన్న కేడి బ్యాచ్ కి టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఏంటి ఈ ఎస్ఐ కి రిషి సర్ తెలుసా ఇంకేముంది మా మీద ఉన్న కోపంతో ఇంకా మా గురించి ఎస్ఐ కి ఏం చెప్తాడో అని కేడి బ్యాచ్ అనుకుంటారు. రిషి, వసుధారలను ఎస్ఐ లోపలికి తీసుకొని వెళ్లి మాట్లాడుతాడు. "సర్ మీరేంటి ఇక్కడ అని" రిషిని ఎస్ఐ అడుగుతాడు. వాళ్ళు నా స్టూడెంట్స్.‌. వాళ్ళని వదిలి పెట్టండి అని రిషి చెప్తాడు. దానికి ఎస్ఐ ఒకే అంటాడు. రిషి సర్ చెప్పారు కాబట్టి మిమ్మల్ని వదిలి పెడుతున్నా అని కేడీబ్యాచ్ తో చెప్పి వదిలిపెడతాడు ఎస్ఐ. వసుధారని రిషి తన కార్ లో ఎక్కమంటాడు. కేడి బ్యాచ్ ని రిషి కార్ ఫాలో అయి రమ్మని చెప్పామంటాడు.. రిషి నైట్ కాలేజీ దగ్గరికి కేడి బ్యాచ్ ని తీసుకొని వస్తాడు. "చూడండి వీళ్లని.. టైం విలువ వీళ్ళకు తెలుసు కాబట్టి నైట్ చదువుకుంటున్నారు" అని కొందరిని చూపిస్తూ కేడి బ్యాచ్ లో మార్పు వచ్చేలా రిషి చెప్తాడు. ఇప్పటికైనా మారండి అని కేడి బ్యాచ్ కి రిషి చెప్తాడు. మీరు నిజంగా జెంటిల్ మెన్ సర్ అని వసుధార తనలో తాను అనుకుంటుంది.

మరొక వైపు జగతి మీటింగ్ లో మిషన్ ఎడ్యుకేషన్ పనులు గురించి లేట్ చెయ్యాద్దని జగతి అంటుంది. మీరు మిషన్ ఎడ్యుకేషన్ కి ఎక్కువ బడ్జెట్ ని వినియోగిస్తున్నారని శైలేంద్ర అంటాడు. దాని గురించి జగతి వాదిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi: రాహుల్ మనిషిని పట్టుకున్న రాజ్, కావ్య.. ఇక దేత్తడి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -905 లో....అప్పు పాప కేసు ఫైల్ చూస్తుంటే ఆఫీసర్ వస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను వద్దని అయినా అలాగే చేస్తున్నావని కోప్పడతాడు. లేదు సర్ పాప చనిపోలేదు.. చనిపోయిన పాప వేరు.. ఆ పాప DNA తో మ్యాచ్ అవ్వడం లేదని రిపోర్ట్స్ చూపించగానే అవునా కేసులో ఒక కొత్త మలుపు తీసుకొని వచ్చావ్ గుడ్ కేరియాన్ అని ఆఫీసర్ అంటాడు. కాసేపటికి రేపు పాప వాళ్ళ ఫాదర్ ని స్టేషన్ కి రప్పించండి అని కానిస్టేబుల్ తో అప్పు చెప్తుంది. మరొకవైపు రాహుల్ అవార్డు ఫంక్షన్ కి రాజ్, కావ్య వెళ్తారు. అక్కడ రాహుల్ డిజైన్స్ చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు.

Karthika Deepam2: జ్యోత్స్న చేసిన ఫ్రాడ్ చూసి కార్తీక్, శ్రీధర్ షాక్.. ఇంటి వారసురాలు కాదేమో!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -542 లో..... కార్తీక్, శ్రీధర్ జ్యోత్స్న రెస్టారెంట్ ఫుడ్ ట్రక్స్ బాగా పాపులర్ అయ్యాయని హ్యాపీగా ఉంటారు. ఇద్దరు బయట టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు. జ్యోత్స్న చాలా తప్పు డు లెక్కలు చూపించిందని శ్రీధర్ అనగానే ఎంత మొన్న కొన్న ల్యాండ్ గురించా అని  కార్తీక్ అడుగుతాడు. లేదు అది జస్ట్ శాంపిల్ మాత్రమే.... ఎంత అంటే అది చెప్తే శివన్నారాయణ గుండె పట్టుకొని పడిపోయేంత డబ్బులు ఫ్రాడ్ చేసిందని శ్రీధర్ అనగానే కార్తీక్ షాక్ అవుతాడు.