English | Telugu
ప్లాస్టిక్ వాడకండి...అవగాహన కల్పిస్తున్న ఆదిరెడ్డి
Updated : Jun 24, 2023
ప్లాస్టిక్ లేనిదే మనిషి జీవితం లేదు అనే పరిస్థితి నెలకొంది. ప్లాస్టిక్ మనల్ని కబళిస్తోందని తెలిసినా, కాలుష్యం పెరిగిపోవడానికి ముఖ్య కారణం అని తెలిసినా మనం చాలా లైట్ తీసుకుంటూ ఉన్నాం. దాని రిజల్ట్ ఎలా ఉంటుందో కూడా మనం లైవ్ లో చూసేస్తున్నాం...రుతువులు మారిపోయాయి. సంవత్సరం పొడవునా ఎండాకాలం తప్ప మరో కాలం కనిపించడం లేదు. దీనికి ప్రధాన కారణం ప్లాస్టిక్ అని చెప్పొచ్చు. అలాంటి ప్లాస్టిక్ నివారించడం కోసం చేయాల్సిన ప్రయత్నాలు అన్ని అందరూ చేస్తున్నారు. ఇప్పుడు ఆది రెడ్డి కూడా ప్లాస్టిక్ మీద అవగాహన కల్పించడానికి రెడీ అయ్యాడు. దానికి సంబంధించిన ఒక పోస్ట్ ని తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసాడు.
"హే ఫోక్స్ నేను ఆదిరెడ్డిని..నేను కొంత మంది ఫ్రెండ్స్ తో కలిసి ప్లాస్టిక్ కాలుష్యానికి కారణం అంటూ ఒక క్యాంపైన్ చేస్తున్నాను. ప్లాస్టిక్ సమస్య అసలు ఎక్కడ వస్తోంది అంటే మనం డ్రింక్స్ తాగేటప్పుడు ప్లాస్టిక్ స్ట్రాస్ వాడతాం, అలాగే కేక్స్ కోసేటప్పుడు ప్లాస్టిక్ చాకులను వాడతాం..వాటితో పని పూర్తయ్యాక తీసి విసిరి పారేస్తాం. ఐతే ఈ ప్లాస్టిక్ భూమిలో కలవకపోగా కాలుష్యానికి పెద్ద ముప్పులా పరిణమిస్తోంది. కాబట్టి ఎవరైనా కేక్స్ కొనేటప్పుడు ప్లాస్టిక్ చాకులు తీసుకోవద్దు. అలాగే ప్లాస్టిక్ స్ట్రాస్ బదులుగా పేపర్ స్ట్రాస్ ని వాడండి అంటూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. ఐతే ఈ విషయాల మీద ఎవరూ స్పందించడం లేదు.
మీరు ఈ పోస్ట్ ని చివరి వరకు చదివాక "క్లాప్స్" ఎమోజిని రిప్లైగా పంపించండి. నేను మీకు ఒక టెక్స్ట్ పంపిస్తాను..ఈ పోస్ట్ చదివిన అందరికీ ధన్యవాదాలు" అని చెప్పాడు ఆదిరెడ్డి. ఈ ప్లాస్టిక్ అనే పదం "ప్లాస్టికో" అనే గ్రీకుపదం నుంచి పుట్టింది. దీనిని మొదటిసారి అలెగ్జాండర్ పార్క్స్ అనే బ్రిటిష్ సైంటిస్ట్ తయారు చేశాడు. ఈ ప్లాస్టిక్ భూసారాన్ని నాశనం చేస్తోంది. వీటి కారణంగా జంతువులు కూడా అనారోగ్యాల బారిన పడుతున్నాయి. మరి ఆదిరెడ్డి తన వంతుగా ప్లాస్టిక్ గురించి అవగాహన కల్పిస్తున్నాడు.