English | Telugu

శ్రీసత్య-ఫైమా పెళ్లి చేసుకోబోతున్నారట...నరకానికైనా వెళ్తుందట

పటాస్ ఫైమా-శ్రీ సత్య ఎంత బెస్ట్ ఫ్రెండ్సో ఆడియన్స్ అందరికీ తెలుసు. బిగ్ బాస్ హౌస్ నుంచి వీళ్ళు చాలా చక్కటి రిలేషన్ ని మెయింటైన్ చేస్తూ వచ్చారు. అలాగే హౌస్ నుంచి బయటకు వచ్చాక కూడా తరచూ కలుస్తూనే ఉన్నారు. అలాంటి శ్రీసత్య హోమ్ టూర్ ని ఫైమా వీడియో తీసి తన యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేసింది. ఇంటికి వెళ్లి చూసాక అక్కడ గోడ మీద అన్నీ బిగ్ బాస్ మూమెంట్స్ తో ఉన్న ఫొటోస్ కనిపించాయి. "నన్ను మర్చిపోయావని అనుకున్నా కానీ బానే పెట్టుకున్నావు నా ఫొటోస్ నువ్వు..నేనంటే అంత ఇష్టమా నీకు" అంది ఫైమా. "నాకు హౌస్ లో చాలా తక్కువ మంది కనెక్ట్ అయ్యారు.

ఫైమా హౌస్ లో కంటే కూడా బయట ఎక్కువగా కనెక్ట్ అయ్యింది.." అని శ్రీసత్య చెప్పేసరికి "మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం" అంటూ బాంబు పేల్చింది ఫైమా. ఆ మాటకు శ్రీసత్య షాకయ్యింది. "నాకు అబ్బాయిలంటే ఇష్టం అమ్మాయిలు కాదు" అని ఆన్సర్ ఇచ్చింది శ్రీ సత్య. "బయట బాగా కలిసాం అన్నావ్ కదా అదే పెళ్లి చేసుకుంటే ఇంకా బాగా కలుస్తాం అని అలా అన్నా" అంది ఫైమా. తర్వాత శ్రీసత్య వాళ్ళ ఇంట్లో ఉన్న కిచెన్ ని చూపించాక ఇద్దరూ కలిసి బిగ్ బాస్ ఎపిసోడ్స్ చూసారు. "చెప్పాలంటే నాకు బయటకు వెళ్లడం అస్సలు ఇష్టం ఉండదు కానీ నా శ్రీసత్య పిలిచింది కాబట్టి కచ్చితంగా వెళ్తాను..శ్రీసత్య నువ్వు పిలిస్తే స్వర్గానికే కాదు నరకానికి కూడా వస్తాను" అని చెప్పింది ఫైమా. "నేను అక్కడికి వెళ్ళినప్పుడు పిలవలేను ఫైమా" అని శ్రీసత్య అనేసరికి "అమ్మా షాపింగులకు, పెళ్లిళ్లకు అన్నిటికి పిలుస్తావ్ కానీ నరకానికి పిలవ్వా..లేదు పిలువు వచ్చి వాలిపోతా" అని చెప్పింది ఫైమా.