English | Telugu
ఒక మనిషిని తయారుచేస్తున్నా.. సో వెయిట్ పెద్ద మ్యాటర్ కాదు
Updated : Jun 24, 2023
దేవదాస్ మూవీతో తెలుగు సినీ రంగంలో అడుగుపెట్టింది ఇలియానా. ఈ మూవీలో అచ్చమైన తెలుగింటి ఆడపిల్లల కనిపించింది. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టింది. ఆ తర్వాత కూడా సూపర్ డూపర్ హిట్టు చిత్రాల్లో మెరిసిన ఈ ముద్దుగుమ్మ చివరగా రవితేజతో అమర్ అక్బర్ ఆంటోని మూవీలో నటించింది. ఆ తర్వాత మూవీస్ లో పెద్దగా కనిపించలేదు. అలాంటి ఇలియానా ఇప్పుడు ఒక బిడ్డకు జన్మనివ్వబోతోంది.
ఆ విషయాలను తన ఫాన్స్ తో షేర్ చేసుకుంది. ఇప్పుడు వాళ్ళు అడిగిన ప్రశ్నలకు కూడా ఆన్సర్స్ ఇచ్చింది. " బేబీ హార్ట్ బీట్ ని ఫస్ట్ టైం విన్నప్పుడు మీ ఫీలింగ్ ఏమిటి" అని అడిగేసరికి "నేను ఎక్స్పీరియన్స్ చేసిన వాటిల్లోకెల్లా ఇది ఒక బెస్ట్ మూమెంట్. ఆ శబ్దం విన్నప్పుడు నాలో వచ్చిన సంతోషాన్ని నేను వివరించి చెప్పలేను. కొన్ని కన్నీళ్లు, కొంత సంతోషం, ఎంతో రిలీఫ్ గా ఎంతో హాయిగా అనిపించింది. ఉప్పెనంత ప్రేమకు గుర్తు ఈ చిన్న విత్తనం..
ఈ విత్తనమే త్వరలో పెద్దగా ఎదిగి బయటకు రాబోతోంది." అని చెప్పింది "మీకేమన్న బీచ్ హౌస్ ఉందా..ఎందుకంటే చాలా ఫొటోస్ వీడియోస్ అక్కడివే ఎక్కువగా కనిపిస్తాయి అందుకే అడుగుతున్నా" అనడంతో "లేదు మాకు బీచ్ హౌస్ అనేది లేదు...కానీ నాకు సముద్రపు ఒడ్డు అంటే చాలా ఇష్టం..నా ఆత్మను శాంత పరుస్తుంది..నా మనసును సంతోషంగా ఉంచుతుంది ఈ సముద్రపు ఒడ్డు" అని చెప్పింది. "బర్ఫీ 2 ఉంటే మీరు చేస్తారా..ఆ మూవీకి నేను పెద్ద ఫ్యాన్" అనేసరికి "వావ్..నేను ఎప్పుడూ దాని గురించి ఆలోచించలేదు. బర్ఫీ మూవీ నాకు ఎప్పుడూ చాలా స్పెషల్..ఎందుకు అంత స్పెషల్ అంటే బర్ఫీ ఒక్కటే ఉంటుంది." అని చెప్పింది. "వెయిట్ పెరిగిపోతున్నారనే బాధ ఉందా" "మొదట్లో కొంచెం అనిపించింది. కానీ తర్వాత తెలిసింది. నేను ఒక మనిషిని నా లోపల తయారు చేస్తున్నా కాబట్టి వెయిట్ అనేది పెద్ద మ్యాటర్ కాదు. మీ బాడీ, మనసు చెప్పినట్టు వినండి...సంతోషంగా ఉండండి..మీకు ఏది సరైనది అనిపిస్తుందో అదే చేయండి" అని చెప్పింది ఇలియానా.