English | Telugu
తమ్ముడు మూవీ తొమ్మిదిసార్లు చూసా...కాలేజీ నుంచి ఫోన్ వస్తే నాన్నలా మాట్లాడేవాడిని
Updated : Jun 24, 2023
"సర్కార్ సీజన్ 3 " ఈ వారం షోకి "ఉస్తాద్" మూవీ టీం నుంచి కావ్య, సింహ, డైరెక్టర్ ఫణి దీప్, సాయి కిరణ్ ఎంట్రీ ఇచ్చారు. గేమ్ మధ్యలో కావ్యతో కలిసి ప్రదీప్ స్టేజి మీద డాన్స్ చేసాడు.."వల్లంకి పిట్టా" సాంగ్ ప్లే చేసేసరికి "కావ్య చిన్నప్పటి ఆ వాయిస్ నీదేనా.. ఆ పాడింది నువ్వేనా" అని డైరెక్టర్ ఫణి కావ్యని అడిగేసరికి "ఈ విషయం అడుగుతున్నందుకు నీకు టూమచ్ గా అనిపించట్లేదా" అంది కావ్య.."చిన్నప్పుడు పాడితే విన్నాం ఇప్పుడు పాడితే వినాలి కదా" అని కౌంటర్ వేసాడు ప్రదీప్. "వచ్చింది ఉస్తాద్ ప్రొమోషన్స్ కి ఐతే గంగోత్రి ప్రొమోషన్స్ చేయిస్తారేమిటి" అని ఫన్నీగా సీరియస్ అయ్యింది కావ్య.
తర్వాత "రియల్ మీ ఆస్క్ మీ ఎనీథింగ్ " అంటూ ప్రదీప్ ని ఒక ప్రశ్న అడిగారు. "మీరు అతి ఎక్కువసార్లు చూసిన సినిమా ఏది" అని అడగడంతో.."నేను తమ్ముడు సినిమా తొమ్మిది సార్లు చూసాను. నా ఫేవరేట్ హీరో పవన్ కళ్యాణ్ గారి కోసం వెళ్లి ఆ సినిమా చూసేవాడిని..చూస్తున్నంత సేపు ఆ సినిమా డైలాగ్స్ , సాంగ్స్ అన్ని చెప్పేసేవాడిని..నేను థియేటర్ ఓనర్ మంచి ఫ్రెండ్స్ ఐపోయాం. నేను మూవీకి చాలా రెగ్యులర్ గా వచ్చేవాడిని అని ఇంటర్వెల్ లో ఫ్రీగా రెండు సమోసాలు కూడా ఇచ్చేవారు. చాలా దూరం నుంచి బస్ లో వెళ్లి మరీ ఆ మూవీ చూసేవాళ్ళం. ఇంటికి వచ్చేసరికి కాలేజీ నుంచి ఫోన్లు వచ్చేవి...రోజూ కాలేజీ బంక్ కొడితే ఇంట్లో డౌట్ వస్తుంది అని తెలిసి రోజు రోజు విడిచి రోజు సినిమాకు వెళ్ళేవాడిని. ఐనా ఇంటికి ఫోన్లు వచ్చేవి. ఇక అప్పుడు ఇంటికి వచ్చేసరికి ఫోన్స్ వచ్చాయి అంటే నేనే మిమిక్రి చేసి మా నాన్నలా మాట్లాడేసేవాడిని. భలే సరదా టైం అది. మా ఫ్రెండ్స్ మొత్తం భయంభయంగా, ధైర్యంగా మా అంతటా మేము సినిమాలకు వెళ్లడం అప్పుడే స్టార్ట్ చేసాం" అని చెప్పాడు ప్రదీప్..