English | Telugu
కృష్ణ, మురారీలను దగ్గరుండి పంపించిన రేవతి!
Updated : Jun 24, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-191లో.. కృష్ణ, మురారి ఇద్దరు నిద్రపట్టక.. రేవతి అన్న మాటలు గుర్తు చేసుకుంటారు. ఎందుకు రేవతి అత్తయ్య ఇలా ప్రవర్తిస్తుందని కృష్ణ అనుకుంటుంది. మీ రేవతి అత్తయ్య మాటల కంటే నాకు నీ మాటలు బాగుంటాయని మురారి అంటాడు. అలా ఇద్దరు సరదాగా మాట్లాడుకొని పడుకుంటారు.
మరొకవైపు రేవతి దేవుడికి మొక్కుతుంటుంది. ఎలాగైనా కృష్ణ, మురారి ఇద్దరు దగ్గర కావాలి. అలాగే వాళ్ళ మధ్యలో ఎవరు రాకుండా చూడు దేవుడా.. ఆదర్శ్ రావాలి. తను ముకుందతో హ్యాపీగా ఉండాలని దేవుడికి రేవతి మొక్కుకుంటుంది. ఆ తర్వాత రోజు ఉదయం మురారి కంటే ముందుగా కృష్ణ లేచి ఫామ్ హౌస్ కి వెళ్ళడానికి అందంగా రెడీ అవుతుంది. ఆ తర్వాత మురారి నిద్ర లేచి రెడీ అయి ఉన్న కృష్ణని చూసి.. ఈ రోజేంటి ఇంత అందంగా ఉందని కృష్ణని అలాగే చూస్తుంటాడు. ఏసీపీ సర్.. ఏంటి అలా చూస్తున్నారు లేట్ అవుతుంది త్వరగా రెడీ అయి రండని మురారితో కృష్ణ అంటుంది.. ఆ తర్వాత మురారి రెడీ అయి డైరీ కోసం చూస్తాడు. కృష్ణ లగేజ్ పట్టుకొని కిందకి వెళ్తుంది. మురారి మాత్రం డైరీ కోసం వెతుకుతాడు. రేవతి పిలవడంతో మురారి కిందకి వెళ్తాడు. ఇద్దరు ఎప్పుడు కలిసి ఉండాలి. ఒకరిని విడిచి ఒకరు ఉండొద్దని నాకు మాట ఇవ్వండని రేవతి అంటుంది. కృష్ణ, మురారి ఇద్దరు ఒకరి మొహం ఒకరు చూసుకుంటారు. కాసేపటికి ముందైతే దేవుడికి మొక్కుకోండని రేవతి అంటుంది. ఆ తర్వాత అందరూ కలిసి కృష్ణ మురారీలను ఫామ్ హౌస్ కి పంపిస్తారు.
ఆ తర్వాత కృష్ణ, మురారి ఇద్దరు కలిసి కార్ లో వెళ్తుంటే.. మురారి గదిలో డైరీ ఏమైందని ఆలోచిస్తుంటాడు. ఏదో ఆలోచిన్నట్లు కనిపెట్టిన కృష్ణ.. ఏంటి ఏదో ఆలోచిస్తున్నారని మురారిని అడుగగా.. అలాంటిదేమీ లేదని మురారి అంటాడు. మరొక వైపు మురారి, కృష్ణ వెళ్ళబోయే ఫామ్ హౌస్ ని చూసుకునే ఆవిడ దగ్గరికి ముకుంద వెళ్తుంది. కొంత డబ్బిచ్చి నేను కొన్ని రోజులు ఇక్కడే ఉంటాను. నేను ఉన్నట్లు ఎవరికి తెలియద్దు ముఖ్యంగా రేవతి అత్తయ్యకు తెలియద్దని ముకుంద ఆవిడకి చెప్తుంది. దానికి ఆవిడ సరేనని అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.