English | Telugu

ఆ డైరెక్టర్ పెద్ద సైకో...నా మీద చెయ్యెత్తాడు...అమ్మనా బూతులు తిట్టాడు

ఎప్పుడూ ఎవరికీ చెప్పని విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నారు బుల్లితెర నటుడు శ్రీకర్ కృష్ణ. "కల్యాణ వైభోగం" సీరియల్ నుంచి తాను అసలు ఎందుకు బయటకు రావాల్సి వచ్చింది, రావటానికి కారణం ఏమిటి అనే విషయాన్నీ చెప్పారు. ఆ సీరియల్ డైరెక్టర్ రాంబాబు పెట్టిన టార్చెర్ ని కొన్ని నెలలు భరించి ఫైనల్ గా తట్టుకోలేక కంప్లైంట్ చేయడంతో డైరెక్టర్ ని మార్చలేరు కాబట్టి తన క్యారెక్టర్ ని చంపేసి అక్కడితో తన రోల్ కి మంగళం పాడేశారని చెప్పారు. ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఇండస్ట్రీలో ఆర్టిస్ట్ అవుదామని వచ్చేవాళ్ళు అన్ని రకాల మాటలు పడాల్సిందే...అన్ని అడ్డంకులను దాటాల్సిందే అన్నారు. డైరెక్టర్ రాంబాబు మాట్లాడితే చాలు బూతులు తప్ప మరేమీ వినిపించవు. కోవిడ్ తో బాధపడుతూనే షూటింగ్ చేసినా కనీసం మానవత్వం లేకుండా తిట్టారన్నారు. రీజన్ లేకుండా తన మీద చెయ్యెత్తసరికి భరించలేకపోయానంటూ బాధపడ్డారు. ఆయన ఒక సైకో టైపని, ఇంట్లో కూడా అలాగే ఉంటారని చెప్పారు.

"కల్యాణ వైభోగం సీరియల్ లో చేసిన ప్రతీ ఆర్టిస్ట్ ఆయనతో ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. కానీ ఆయన్ని ఎందుకు ఉంచారో మాకు ఎప్పుడూ అర్ధం కాని విషయం .విజె సన్నీ కూడా ఎన్నో సమస్యల్ని ఫేస్ చేసాడు. కానీ బయటకు వచ్చాక చెప్పలేదు ఎందుకో తెలీదు...తర్వాత బిగ్ బాస్ ఆఫర్ వచ్చేసరికి వెళ్ళిపోయాడు. అప్పటికి నేను స్టార్టింగ్ స్టేజి కాబట్టి ఎలాగైనా సరే పేరు తెచ్చుకోవాలని ఆయన్ని ఎన్ని బూతులు తిట్టినా పడి ఉన్నాను. ఆయన క్యాస్ట్ పిచ్చి, డబ్బు పిచ్చి..నాతో ఉన్న కోయాక్టర్ ని ఒక రకంగా సర్ అని ట్రీట్ చేస్తాడు. నను ఏరా ఒరేయ్ అంటాడు. నాకు ఒంట్లో బాగోక మా నాన్న నాతో షూటింగ్ కి వచ్చినప్పుడు కూడా డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో తిట్టేసాడు...అమ్మాయిలు ఉన్నా కూడా ఏం మాట్లాడతాడో అతనికే తెలీదు. ఏడు నెలలు మనసు చంపుకుని బతికాను.. సెట్ లో నాకు ఎవరూ వేల్యూ ఇచ్చేవారు కాదు. అసిస్టెంట్లు కూడా వేల్యూ ఇచ్చేవారు కాదు. డైరెక్టర్ అమ్మనా బూతులు తిడుతూ ఉంటే వాళ్లంతా నాకు వేల్యూ ఎందుకు ఇస్తారు. మనిషికి రెస్పెక్ట్ అనేది ఎక్కడుంటుంది. ఈ విషయంలో ఎన్నోసార్లు ఏడ్చాను. డైరెక్టర్ నే అడిగాను నా వల్ల ఏదన్న సమస్యా అని...లేదమ్మా బాగా చేస్తున్నావ్ చేసుకో అని చెప్పేవాడు అంతే" అంటూ డైరెక్టర్ రాంబాబు గురించి అతని మనస్తత్వం గురించి చెప్పారు.