English | Telugu

అవతార్ 2 రీ రిలీజ్ డేట్ పై టెన్షన్.. కండిషన్స్ తెలిసి షాక్ 

అవతార్ 2 రీ రిలీజ్ డేట్ పై టెన్షన్.. కండిషన్స్ తెలిసి షాక్ 

Publish Date:May 23, 2025

ప్రపంచ సినీ పితామహుడిగా అభిమానుల చేత కీర్తించబడే దర్శకుడు జేమ్స్ కేమరూన్(James Cameron). ఆయన దర్శకత్వంలో ఇప్పటి వరకు వచ్చిన అన్ని సినిమాలు ప్రపంచ సినీ ప్రేమికులని ఎంతగానో అలరించడమే కాకుండా, విజువల్ గా కూడా ఒక సరికొత్త ప్రపంచాన్ని పరిచయం చేసాయి. అలాంటి వాటిల్లో 'అవతార్(Avatar)సిరీస్' కూడా ఒకటి. ఇప్పటి వరకు రెండు భాగాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఫైర్ అండ్ ఆష్ గా తెరకెక్కుతున్న అవతార్ పార్ట్ 3 (Avatar part 3)ప్రస్తుతం షూటింగ్ దశలో ఉండగా, డిసెంబర్ 19 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఇక మేకర్స్  ఈ లోపు  పార్ట్ 2(Avatar part 2)ని రీ రిలీజ్ చేస్తున్నారు. అక్టోబర్ 3 న రీ రిలీజ్ చేస్తున్నట్టు అధికార ప్రకటన కూడా వారి నుంచి వచ్చింది. కాకపోతే వరల్డ్ వైడ్ గా అన్ని భాషల్లో రిలీజ్ అవుతుందా, లేక కేవలం ఓవర్సీస్ మార్కెట్ లోనేనా అనేది వెల్లడి చెయ్యలేదు. పైగా ఒక్క వారం మాత్రమే లిమిటెడ్ ఎంగేజ్మెంట్ గా థియేటర్స్ లో ఉంటున్నట్టుగా కూడా ప్రకటించారు. మరి ఈ విషయంపై  మరికొన్ని రోజుల్లో  క్లారిటీ వచ్చే అవకాశముంటుందేమో చూడాలి.  ప్రస్తుతం చాలా చిత్రాలు  రీ రిలీజ్ లో మంచి కలెక్షన్స్ ని రాబడుతున్నాయి. ఈ నేపథ్యంలో 2022 లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అవతార్ పార్ట్ 2 రీ రిలీజ్ లో  రికార్డు కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉంటుందని సినీ ట్రేడ్ వర్గాల వారు అంటున్నారు. భార్య భర్తలైన జేక్ సల్లీ, నైతిరి తమ పిల్లలతో కలిసి ఓమాటికా తెగకు నాయకత్వం వహిస్తు, పండోరా గ్రహంపై ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించటానికి ప్రయత్నిస్తుంటారు. అయితే  భూమి నుండి వచ్చిన మానవులు పండోరా గ్రహంపైకి వచ్చి వారిని ఇబ్బందులకి గురి చేస్తారు. ఈ క్రమంలో జేక్ సల్లీ, నైతిరి కుటుంబంతో పాటు,తమ కొత్త ప్రపంచాన్ని ఏ విధంగా కాపాడుకున్నారనే కథాంశంతో పార్ట్ 2 తెరకెక్కింది.      
Ranbir Kapoor & Yash Won’t Share Much Screen Time in Ramayana

Ranbir Kapoor & Yash Won’t Share Much Screen Time in Ramayana

Publish Date:May 23, 2025

  Backed by producer Namit Malhotra, Ramayana is undoubtedly one of the most anticipated films in recent times. With some of the finest talents from the industry, a world-class VFX team, a stellar ensemble cast, and grand, immersive sets, Ramayana is shaping up to be a visual and emotional cinematic spectacle like never before. While the film stars two of the biggest superstars, Ranbir Kapoor as Lord Ram and Yash as Raavan, it is said that they will barely be seen sharing screen space together.   According to sources close to the production, "The makers have chosen to stay true to the original Valmiki text, where Lord Ram and Raavan do not encounter each other through most of the epic. Their worlds remain apart, their stories unfolding in parallel until destiny brings them face-to-face in the climactic battle. As per the original narrative, Ram learns of Raavan’s existence only after Sita’s abduction, and the two never meet until the battlefield confrontation in Lanka."   Nitesh Tiwari and team's creative choice to keep Ranbir Kapoor’s and Yash’s characters apart adds a compelling narrative depth to Ramayan. By charting their separate journeys, one embodying dharma and virtue, the other driven by ego and power, the film heightens the excitement for their ultimate face-off. This delayed confrontation allows their arcs to develop independently, making their eventual clash even more powerful. While Yash will share screen space with Sai Pallavi as Sita and Sunny Deol as Hanuman, scenes with Ranbir remain uncertain. Ranbir is currently committed to Sanjay Leela Bhansali’s Love & War alongside Vicky Kaushal and Alia Bhatt, and the specific look he maintains for that film limits his availability. Production delays have further complicated scheduling, making it unfeasible for him to switch appearances for Ramayan at this stage.   The production of the film is currently progressing on huge sets in the city. The film is being made in two installments, the first one releasing in Diwali 2026 and the second one during Diwali of 2027. While Ranbir Kapoor has already completed his portions, Yash began filming his portions after visiting the Mahakal Temple in Ujjain at the start of May.   The choice to minimize shared screen time between the lead characters reflects the makers' dedication to honoring the essence of the original epic while crafting a modern cinematic spectacle. In a time when star-studded films often force interactions between big names to amplify fan buzz, Ramayan takes a more restrained, narrative-driven path, one that prioritizes authenticity and promises a deeply immersive retelling of the legendary tale.   Ramayana is undoubtedly one of the biggest films that everyone is eagerly looking forward to. Produced by Namit Malhotra, the film will star Ranbir Kapoor, Sai Pallavi, and Yash. With its grand scale and mega star cast, the film promises to present India’s biggest and most divine mythological epic in the most enthralling way, creating a cinematic wonder like never before.  

50 ఏళ్ళ సినీ ప్రస్థానంలో 110 సినిమాలు.. దర్శకేంద్రుడు సాధించిన విజయాలివే!

Publish Date:May 23, 2025

(మే 23 దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు పుట్టినరోజు సందర్భంగా..) చిత్ర పరిశ్రమలో ఎంతో మంది దర్శకులు ఉన్నా.. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు విజన్‌ వేరు, ఆయన చేసే సినిమాల తీరు తెన్నులు వేరు. కథ, కథనాల దగ్గర నుంచి పాటల చిత్రీకరణ వరకు ప్రతి విషయంలోనూ తన ప్రత్యేకతను చూపించడం ఆయన మొదటి సినిమా నుంచీ అలవరుచుకున్నారు. 1975లో బాబు చిత్రంతో ప్రారంభమైన ఆయన సినీ ప్రస్థానంలో 110 సినిమాలకు దర్శకత్వం వహించారు. ఎన్‌.టి.రామారావు వంటి లెజండరీ హీరో నుంచి చిన్న హీరోల వరకు అందరితోనూ సినిమాలు చేసిన ఘనత ఆయనకు దక్కుతుంది. ఒక దశలో ఎన్‌.టి.ఆర్‌. ఇమేజ్‌ పీక్స్‌కి వెళ్లిపోవడంలో ప్రధాన పాత్ర పోషించారు రాఘవేంద్రరావు. అప్పటి టాప్‌ హీరోలైన ఎన్టీఆర్‌, ఎఎన్నార్‌, కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజు వంటి హీరోలకు బ్లాక్‌ బస్టర్స్‌ అందించారు. ఆ తర్వాతి తరంలో చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, మోహన్‌బాబు వంటి హీరోలతో కూడా విజయవంతమైన సినిమాలు రూపొందించారు. అంతేకాదు, వెంకటేష్‌, మహేష్‌బాబు, అల్లు అర్జున్‌ వంటి హీరోలను పరిచయం చేసి వారికి శుభారంభాన్నిచ్చారు. కమర్షియల్‌ చిత్రాల్లోనే కాదు, భక్తి చిత్రాల్లోనూ తన ప్రత్యేకతను చూపించారు. మనం మాట్లాడడం కాదు, మనం చేసిన సినిమా మాట్లాడాలి అని బలంగా నమ్మే దర్శకుడు కె.రాఘవేంద్రరావు సినీ ప్రస్థానం ఎలా మొదలైంది? ఆయన సాధించిన విజయాలేమిటి? అనే విషయాల గురించి తెలుసుకుందాం.  1942 మే 23న కె.ఎస్‌.ప్రకాశరావు, కోటేశ్వరమ్మ దంపతులకు కృష్ణా జిల్లా కేసరపల్లిలో జన్మించారు రాఘవేంద్రరావు. అయితే ఆ తర్వాత ఆయన విద్యాభ్యాసం అంతా మద్రాస్‌లోనే జరిగింది. కె.ఎస్‌.ప్రకాశరావు దర్శకుడు అవ్వక ముందు హీరోగా కొన్ని సినిమాల్లో నటించారు. ఆ తర్వాత 1950లో మొదటి రాత్రి చిత్రంతో దర్శకుడిగా మారారు. రాఘవేంద్రరావుపై తండ్రి ప్రభావం బాగా ఉండేది. సినిమాలపై ఆసక్తి, దర్శకుడు కావాలన్న కోరిక ఆయనకు చిన్నతనంలోనే కలిగాయి. ఇంటర్‌ చదువుతున్న సమయంలోనే తన దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేరమని రాఘవేంద్రరావుకు చెప్పారు ప్రకాశరావు. అయితే తను డిగ్రీ పూర్తి చేసిన తర్వాతే సినిమా రంగంలోకి వస్తానని చెప్పారు. అలా బి.ఎ. పూర్తయిన తర్వాత దర్శకత్వ శాఖలో చేరారు. పాండవ వనవాసం చిత్రానికి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేరి మొదటి క్లాప్‌ ఎన్‌.టి.రామారావుపై కొట్టారు. ఈ సినిమాకి కమలాకర కామేశ్వరరావు దర్శకుడు. అలా రాఘవేంద్రరావు సినీ ప్రస్థానం ప్రారంభమైంది. అలాగే ఎన్టీఆర్‌ చివరి సినిమా మేజర్‌ చంద్రకాంత్‌ చిత్రానికి దర్శకత్వం వహించడం విశేషం. తండ్రి ప్రకాశరావు దగ్గర దాదాపు 10 ఏళ్లు దర్శకత్వ శాఖలో పనిచేశారు రాఘవేంద్రరావు.  1975లో నిర్మాత అడుసుమిల్లి లక్ష్మీకుమార్‌ నిర్మించిన ‘బాబు’ చిత్రం ద్వారా దర్శకుడుగా పరిచయమయ్యారు రాఘవేంద్రరావు. ఈ సినిమాకి ఓపెనింగ్స్‌ బాగానే వచ్చినా రెండు వారాల గ్యాప్‌లో ‘జీవనజ్యోతి’ చిత్రం విడుదల కావడంతో అది పెద్ద హిట్‌ అయింది. ‘బాబు’ ఏవరేజ్‌ మూవీ అయింది. ఆ తర్వాత మమతల కోవెల అనే నవల ఆధారంగా ‘జ్యోతి’ చిత్రాన్ని రూపొందించారు రాఘవేంద్రరావు. ఈ సినిమా మంచి విజయం సాధించి దర్శకుడుగా ఆయనకు పేరు తెచ్చింది. సత్యచిత్ర సంస్థ అధినేతలు సత్యనారాయణ, సూర్యనారాయణ.. ప్రకాశరావు దర్శకత్వంలో ‘తాసిల్దారుగారి అమ్మాయి’ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి రాఘవేంద్రరావు అసిస్టెంట్‌గా పనిచేశారు. ఆ సమయంలో అతనిలోని టాలెంట్‌ గుర్తించారు ఆ నిర్మాతలు. ‘జ్యోతి’ సినిమా జరుగుతున్న సమయంలోనే ఒక భారీ చిత్రం చేసే అవకాశం ఇచ్చారు సత్యనారాయణ, సూర్యనారాయణ. అదే ‘అడవిరాముడు’. అలా ఎన్టీఆర్‌ను తొలిసారి డైరెక్ట్‌ చేసే అవకాశం రాఘవేంద్రరావుకు లభించింది.  ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఎన్టీఆర్‌ను కొత్తగా చూపించాలని నిర్ణయించుకున్నారు. లుక్‌ పరంగా, కాస్ట్యూమ్‌ పరంగా అంతకుముందు ప్రేక్షకులు చూడని ఓ కొత్త ఎన్టీఆర్‌ను ఆవిష్కరించారు రాఘవేంద్రరావు. అడవిరాముడు చిత్రం 1977 ఏప్రిల్‌ 28న విడుదలై బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా మొదలు దాదాపు 5 సంవత్సరాలపాటు ఎన్టీఆర్‌ కెరీర్‌ దిగ్విజయంగా సాగింది. డ్రైవర్‌ రాముడు, యమగోల, కేడీ నెం.1, వేటగాడు, కొండవీటి సింహం, జస్టిస్‌చౌదరి వంటి సూపర్‌హిట్‌ సినిమాలతో కెరీర్‌ మంచి పీక్స్‌లో ఉన్న సమయంలోనే రాజకీయాల్లోకి ప్రవేశించారు ఎన్టీఆర్‌. ఎన్నికల్లో విజయఢంకా మోగించారు. ఎన్టీఆర్‌కు ఆ సమయంలో అంతటి క్రేజ్‌ రావడానికి ముఖ్య కారకుడు రాఘవేంద్రరావు అనే చెప్పాలి. ఇక కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజులకు కూడా బ్లాక్‌బస్టర్స్‌ ఇచ్చిన ఘనత ఆయనకే దక్కింది. ఆ తర్వాతి తరం హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌లతో సూపర్‌హిట్స్‌ చేశారు. ముఖ్యంగా చిరంజీవితో చేసిన జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం కలెక్షన్ల పరంగా కొత్త రికార్డులు సృష్టించింది. పాటల చిత్రీకరణలో అంతకుముందు ఏ దర్శకుడూ చేయని ప్రయోగాలు రాఘవేంద్రరావు చేశారు. ఒక సినిమాకి హీరో ఎంత ముఖ్యమో హీరోయిన్‌ కూడా అంతే ముఖ్యమని నమ్మి పాటల చిత్రీకరణలో పూలు, పండ్లు, నగలు వాడుతూ వారిని మరింత అందంగా చూపించే ప్రయత్నం చేశారు. అయితే 40 సినిమాల తర్వాతే తనకు ఆ ఆలోచన వచ్చిందని రాఘవేంద్రరావు చెబుతారు. ఆ తర్వాత చాలా మంది దర్శకులు పాటల విషయంలో ఆయన్ని అనుసరించారు. తెలుగులోనే కాదు, హిందీలోనూ సినిమాలు చేశారు రాఘవేంద్రరావు. ఆయన చేసిన 14 హిందీ సినిమాల్లో 12 సూపర్‌హిట్‌ అవ్వడం విశేషం. పక్కా కమర్షియల్‌ సినిమాలే కాదు, భక్తి రసాత్మక చిత్రాలు కూడా బాగా తియ్యగలనని అన్నమయ్య చిత్రంతో ప్రూవ్‌ చేసుకున్నారు రాఘవేంద్రరావు. కమర్షియల్‌ హీరోగా మంచి పీక్స్‌లో ఉన్న సమయంలో నాగార్జునతో అన్నమయ్య చిత్రం చెయ్యడం పెద్ద సాహసమనే చెప్పాలి. ఈ సినిమా ఘనవిజయం సాధించి నాగార్జున, రాఘవేంద్రరావు కెరీర్‌లో ఒక మైల్‌స్టోన్‌లా నిలిచిపోయింది. ఆ తర్వాత శ్రీరామదాసు, శిరిడీసాయి, ఓం నమో వెంకటేశాయ చిత్రాలు కూడా ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. ప్రేక్షకుల నుంచి లభించిన రివార్డులే కాదు, ఎన్నో అవార్డులు రాఘవేంద్రరావును వరించాయి. ఏడు నంది అవార్డులు, 5 ఫిలింఫేర్‌ అవార్డులు, సైమా, ఐఫా, సినీమా అవార్డులు.. ఇలా ఎన్నో ఆయనకు లభించాయి.  వ్యక్తిగత విషయాలకు వస్తే.. రాఘవేంద్రరావు సతీమణి పేరు సరళ. వీరికి ఇద్దరు సంతానం. వారిలో ప్రకాష్‌ కోవెలమూడి దర్శకుడుగా మంచి పేరు తెచ్చుకుంటున్నారు. ఆయన చేసిన మొదటి సినిమా బొమ్మలాటకు ఉత్తమ చిత్రంగా, ఆ సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన సాయికుమార్‌కి ఉత్తమ బాల నటుడిగా జాతీయ అవార్డులు లభించాయి. రాఘవేంద్రరావు సోదరుడు కృష్ణమోహనరావు. ఇద్దరూ కలిసి ఆర్‌.కె.ఫిలిం అసోసియేట్స్‌ బేనర్‌లో ఎన్నో సూపర్‌హిట్‌ చిత్రాలు నిర్మించారు. వెండితెరపైనే కాదు, బుల్లితెరపై కూడా కొన్ని సీరియల్స్‌ చేశారు. వాటిలో ప్రముఖంగా వినిపించే పేరు శాంతి నివాసం. గత పాతికేళ్లుగా 10 టీవీ సీరియల్స్‌ నిర్మించారు. అలాగే సౌందర్యలహరి అనే కార్యక్రమం ద్వారా ప్రేక్షకుల్ని పలకరిస్తున్నారు. అంతేకాదు, కెఆర్‌ఆర్‌ వర్క్స్‌ యూట్యూబ్‌ ఛానల్‌ ద్వారా కెఆర్‌ఆర్‌ క్లాస్‌ రూమ్‌ నిర్వహిస్తున్నారు. 

సల్మాన్ ఖాన్ కేసులో జితేందర్ సింగ్ అరెస్ట్..విచారణలో ఏం చెప్పాడో తెలిస్తే షాక్ అవుతారు 

Publish Date:May 22, 2025

సల్మాన్ ఖాన్(Salman Khan)ముంబై(Mumbai)లో అత్యంత ఖరీదైన ప్రాంతంగా పిలవబడే 'బాంద్రా'(Bandra)లోని గెలాక్సీ అపార్ట్ మెంట్(Galaxy Apartments)లో ఎక్కువ భాగం నివాసం ఉంటాడు. ఎన్నో ఖరీదైన హౌసెస్ ఉన్నప్పటికీ బాల్యంలోని జ్ఞాపకాలు, మరియు కుటుంబ వాతావరణం కారణంగా గెలాక్సీ లో ఉండటానికి ఇష్టపడతాడు. ఈ నెల 20 న ఉదయం పది గంటల సమయంలో ఒక వ్యక్తి సల్మాన్ ఇంటి ముందు అనుమానాస్పదంగా తిరిగాడు. దీంతో పోలీసులు అతన్ని అక్కడ నుంచి వెళ్లిపొమ్మని చెప్పారు. ఆ వెంటనే  కోపంతో తన సెల్ ఫోన్ ని విసిరి కొట్టి అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. కానీ అదే రోజు సాయంత్రం మళ్ళీ గెలాక్సీ దగ్గరకొచ్చి, అదే అపార్ట్ మెంట్ లో ఉంటున్న ఒక వ్యకి కారు వెనక నుంచి గెలాక్సీ లోపలకి ప్రవేశించాడు. అదే సమయంలో లోపల విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ సిబ్బంది అతన్ని పట్టుకొని పోలీసులకి సమాచారం ఇచ్చింది. అనంతరం పోలీసుల  విచారణలో సదరు వ్యక్తి మాట్లాడుతు నా పేరు జితేందర్ కుమార్ సింగ్.చత్తిస్ గడ్ రాష్ట్రం నుంచి సల్మాన్ కలవడానికి వచ్చాను. గెలాక్సీ లోపలకి అనుమతించకపోవడంతో  దొంగచాటుగా వెళ్లానని చెప్పాడు. ప్రస్తుతానికి పోలీసులు జితేందర్ ని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసారు. సల్మాన్ ని చంపుతామని గత కొంత కాలం నుంచి గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి బెదిరింపులు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు జితేంద్ర కుమార్ సల్మాన్ ఇంట్లోకి ప్రవేశించడం సంచలనంగా మారింది.  

రథం ముగ్గేస్తే అది కాస్తా మణికొండ వరకు వెళ్లిందట...

Publish Date:May 23, 2025

  కిర్రాక్ బాయ్స్ అండ్ ఖిలాడీ గర్ల్స్ ఈ వారం ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో ముందుగా శ్రీముఖి ముంజెకాయల్ని ఇచ్చింది. కిర్రాక్ బాయ్స్ అంతా కూడా వాటిని తిన్నారు. "మీరందరూ తింటుంటే ఎంత అందంగా ఉంది ఒక్కడు తింటుంటే మాత్రం అచ్చం పండు కోతిలెక్క ఉన్నావ్రా " అంటూ శ్రీముఖి, రోహిణి కలిసి ఇమ్మానుయేల్ ని కామెంట్ చేశారు. ఈ ఎపిసోడ్ ని విలేజ్ థీమ్ తో డిజైన్ చేసారు. చిన్నప్పుడు పల్లెటూరిలో అందరూ చేసిన అల్లరిని సెట్ లో బుల్లితెర నటులంతా కలిసి చేశారన్నమాట. ఐతే అబ్బాయిలకు ఒక టాస్క్ ఇచ్చింది శ్రీముఖి. ఇక్కడ ఎవరికీ ముగ్గులు వేయడం వచ్చో జెన్యూన్ గా వచ్చో చేతులెత్తండి అనేసరికి అమరదీప్ చెయ్యెత్తాడు. "తేజు చెప్పింది నీ ముగ్గుల గురించి..మొన్న రథం ముగ్గు వేసావంట...అది కూడా మణికొండ వరకు వెళ్లిందట.." అనేసరికి అమరదీప్ తో పాటు అందరూ నవ్వేశారు. తర్వాత అమ్మాయిలకు అబ్బాయిలకు ముగ్గుల పోటీ పెట్టింది. బాయ్స్ అండ్ గర్ల్స్ వేసిన రెండు ముగ్గులు చూసిన జడ్జ్ అనసూయ ఐతే కళ్లద్దాలు పెట్టుకున్నాక ఈ ముగ్గులా ఉంది కళ్లద్దాలు తీసేసాక ఆ ముగ్గులా ఉంది అంటూ సెటైర్ వేసింది. తర్వాత ఒక టబ్ లో కొన్ని చేపల్ని తెప్పించింది శ్రీముఖి. "మీకు తెలిసిన కొన్ని చేపల రకాలు చెప్పండి" అంటూ ఖిలాడీ గర్ల్స్ ని అడిగింది. "పిత్తబరిగె, శీలావతి " అని డెబ్జానీ చెప్పింది. తర్వాత ఇంద్రావతి అని రోహిణి చెప్పేసరికి..అదేం చేప అంటూ శ్రీముఖి ఆశ్చర్యపోయింది. తర్వాత ఇమ్మానుయేల్ ఒక టబ్బులో నాట్లు వేసే టాస్క్ చేసాడు. అలాగే ప్రియాంక జైన్ - అమరదీప్ కలిసి ఏడు పెంకులాట టాస్క్ ఆడారు. ఐతే అందులో బాల్ తేవడానికి మెట్ల వంటి సెటప్ చేశారు. ఐతే అందులో అమరదీప్ కాలు ఇరుక్కుపోయింది. దాంతో అనసూయ అందరూ "ఓ మై గాడ్" అంటూ షాక్ అయ్యారు. మరి ఇంతకు ఏమయ్యిందో షోలో చూడాలి.

Nazeeruddin Shaik wins aha Telugu Indian Idol 3

Publish Date:Sep 23, 2024

In a thrilling grand finale streamed on aha OTT, 19-year-old Nazeeruddin Shaik from Andhra Pradesh emerged victorious as the winner of aha Telugu Indian Idol Season 3. His captivating performances throughout the competition earned him both the prestigious title and a cash prize of Rs. 10 lakh. Recently clearing his CA intermediate examinations, Nazeeruddin also received the exciting opportunity to lend his voice to the highly anticipated upcoming film starring Pawan Kalyan, OG. His remarkable journey to victory was characterised by consistent excellence, which endeared him to both the audience and the judges. Anirudh Suswaram secured second place, winning Rs. 3 lakh, while GV Shri Kerthi claimed third place with a prize of Rs. 2 lakh. The show, which concluded after nearly 26 weeks of fierce competition, was judged by the esteemed Thaman S, Geetha Madhuri, and Karthik, all of whom noted that this season showcased extraordinary talent. Judge Geetha Madhuri said, "aha Telugu Indian Idol Season 3 was an incredible experience filled with talented contestants. It truly felt like a celebration of music. Choosing the finalists was extremely challenging, and every elimination was painful." Nazeeruddin was born on November 2, 2004, in Tadepalligudem to Shaik Baji, a motor mechanic, and Madeena Beebi, who passed away a year ago. His sister, Vahida Rehman, has stepped in to support him after their mother's passing. He completed his schooling at Vignana Vikas E.M School and continued his education at GSR E.M School. He pursued his Junior College and CA Intermediate at Sri Medha Commerce College in Guntur, aspiring to become a Chartered Accountant while nurturing his passion for music. Nazeeruddin's musical journey has been profoundly shaped by his maternal grandparents, Kasim Saheb and Fatima Bee. His maternal grandmother, a Carnatic music guru, played a pivotal role in cultivating his talent. Growing up listening to the iconic songs of Ghantasala ignited his dedication to music. Reflecting on his victory, Nazeeruddin shared, "My journey with music began when I was just four years old. It was my grandfather, Kasim garu, and his sister whom I affectionately call Nani, who introduced me to this world. She enrolled me in Carnatic music lessons, while my grandfather taught me the nuances of cinematic music. Having sung for Ghantasala garu, his admiration for him has never wavered. For 47 years, he has honored Ghantasala's memory by observing his death anniversary in our village, Tadepalligudem. Thanks to my grandfather's efforts, a statue of Ghantasala garu stands in our village." "Winning the title of Telugu Indian Idol Season 3 is a key milestone for me. Performing in front of Thaman sir, Geetha Madhuri ma’am, and Karthik sir was an honor. Their feedback, along with lessons from my fellow contestants, has shaped my growth as a singer. Moving forward, I aim to be a leading musician in the industry while pursuing a career in finance, " he added. The competition began with over 15,000 aspiring singers, showcasing immense talent throughout the season. Initial auditions took place on May 4, 2024, in New Jersey and Hyderabad. The top 12 finalists included Bharat Raj, Keerthana, Keshav Ram, Hari Priya, GV Shri Kerthi, Nazeeruddin, Skanda, Duvvuri Sridhruthi, Rajani Sree, Sai Vallabha, Khushal Sharma, and Anirudh Suswaram. After rigorous eliminations and public voting across 28 episodes, the competition culminated in a final showdown featuring the top five contestants: Anirudh Suswaram, Skanda, Keerthana, Sri Keerthi, and Nazeeruddin. The finalists dazzled in vibrant attire during the blockbuster finale, which included special performances from the judges and contestants. Judge Geetha Madhuri, in a striking red outfit, captivated the audience with her exceptional performance. The Judges Thaman and Karthik also presented outstanding performances during the blockbuster finale episode. The blockbuster finale, streamed on September 20-21, 2024, celebrated the remarkable journeys of these talented singers. If you missed the thrilling finale episode, catch it now only on aha.

ఎన్టీఆర్ 'డ్రాగన్'లో విద్యాబాలన్!

Publish Date:May 21, 2025

  ఆగస్టులో బాలీవుడ్ ఫిల్మ్ 'వార్-2'తో ప్రేక్షకులను పలకరించనున్న జూనియర్ ఎన్టీఆర్.. తన తదుపరి సినిమాని ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీకి 'డ్రాగన్' టైటిల్ లాక్ చేసినట్లు సమాచారం. ఇందులో ఎన్టీఆర్ సరసన రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో ప్రముఖ బాలీవుడ్ నటి విద్యాబాలన్ నటిస్తున్నట్లు తెలుస్తోంది.   ప్రశాంత్ నీల్ సినిమాల్లో ఫిమేల్ రోల్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. నిడివితో సంబంధం లేకుండా మంచి ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తాయి. ఇప్పుడు డ్రాగన్ కోసం కూడా ఒక పవర్ ఫుల్ ఫిమేల్ రోల్ ని రాశాడట. ఆ రోల్ కి విద్యాబాలన్ అయితే బాగుంటుందని ఆమెని సంప్రదించినట్లు సమాచారం. ఈ పాత్ర చేయడానికి విద్యాబాలన్ సుముఖత వ్యక్తం చేసినట్లు వినికిడి.   కాగా, గతంలో ఎన్టీఆర్ బయోపిక్ లో బాలకృష్ణ సరసన నటించింది విద్యాబాలన్. అప్పుడు బాబాయ్ కి జోడిగా నటించిన బాలన్.. ఇప్పుడు అబ్బాయ్ సినిమాలో కీలక పాత్ర పోషిస్తుందని అనే వార్త ఆసక్తికరంగా మారింది.  

Sudha Kongara & Hombale project is going to be Biggest Multistarrer

Publish Date:Jul 12, 2022

Even though it came before 'KGF,' Hombale Films became well-known with that film. The films are being announced, completed, and ready for release as a result of the momentum created by that film. Production is currently working on 'Salaar' in Telugu and 'Tyson' in Malayalam. Other pan-India films have also just been announced.   However, a film directed by Sudha Kongara was recently announced. Except for the fact that they stated that it will be a big film, they did not mention the casting. There are some new rumours floating around about this. If those rumours are true, this combination will be spectacular. According to sources, Sudha Kongara project is going to be multi starrer.  Furthermore, the names of those heroes are currently being spread.   According to the latest rumours, this film would star Suriya and Dulquer Salman, who have established as star heroes in the South with a string of superhits. According to industry reports, Surya, who has become acquainted of Sudha Kongara's direction in 'Akaasham Nee Haddura,' responded OK without even hearing the story. It is stated that discussions about this film are ongoing, and that full details will be released soon. Pre-production work will begin soon.   Hombale is synonymous with big-budget films. This film is expected to be in the same budget range as the previous one. Suriya's film is also popular in Telugu. Dulquer films have a cult following in the South. This combination is surely going to be crazy.

Ranbir and Alia in love

Publish Date:May 10, 2018

శుభం

Publish Date:May 9, 2025

సింగిల్

Publish Date:May 9, 2025

హిట్ 3

Publish Date:May 1, 2025

రెట్రో

Publish Date:May 1, 2025

Subham

Publish Date:May 9, 2025

Single

Publish Date:May 9, 2025

Hit 3

Publish Date:May 1, 2025

Retro

Publish Date:May 1, 2025

Sarangapani Jathakam

Publish Date:Apr 25, 2025