English | Telugu
హాస్పిటల్ లో ప్రముఖ నటుడు.. ఒక్క క్షణంలో అన్ని మారిపోవచ్చు
Updated : Jul 16, 2025
క్రైమ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన 'మీర్జాపూర్'(Mirzapur)వెబ్ సిరీస్ విశేష ప్రేక్షాదరణని సొంతం చేసుకుంది. అమెజాన్ ప్రైమ్(Amazon Prime)వేదికగా 2018 లో విడుదలైన ఈ సిరీస్ లో 'బాబర్' అనే క్యారక్టర్ ద్వారా మంచి గుర్తింపు పొందిన నటుడు 'ఆసిఫ్ ఖాన్'(Aasif Khan). గత ఏడాది 'మే' లో విడుదలైన 'పంచాయత్ సీజన్ 3'(Panchayat Season 3) వెబ్ సిరీస్ లో కూడా 'గణేష్ 'అనే క్యారక్టర్ ని పోషించి తనదైన నటనతో ప్రేక్షకులని అలరించాడు.
రీసెంట్ గా ఆసిఫ్ సోషల్ మీడియా వేదికగా ఒక హాస్పిటల్ కి చెందిన లొకేషన్ ని షేర్ చేసి 'అనారోగ్యంతో హాస్పిటల్ లో జాయిన్ అయ్యాను. నాపై అభిమానులు చూపించిన ప్రేమని జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. ముప్పై ఆరుగంటల నుంచి హాస్పిటల్ పై కప్పు ని చూస్తుంటే జీవితం చాలా చిన్నదని అర్ధమవుతుంది. దేనిని తేలిగ్గా తీసుకోకండి. ఒక్క క్షణంలో అన్ని మారిపోతాయి. మీకు మీరు కృతజ్ఞతతో ఉంటు, జీవితంలో ఎవరు ముఖ్యమో వారితో ఆనందంగా ఉండండి. జీవితం ఒక వరం. ప్రస్తుతం కోలుకుంటున్నాను. త్వరలోనే ఆరోగ్యంతో తిరిగి వస్తానని తెలిపాడు.
ఆసిఫ్ 2011 లో సల్మాన్ ఖాన్(Salman Khan),ఆసిన్ జంటగా వచ్చిన 'రెడీ' మూవీతో జూనియర్ ఆర్టిస్ట్ గా సినీ రంగ ప్రవేశం చేసాడు. ఆ తర్వాత 2017 లో' అక్షయ్ కుమార్'(Akshay kumar)నటించిన 'టాయిలెట్ ఏక్ ప్రేమ కథ' చిత్రంలో రిపోర్టర్ క్యారక్టర్ ని పోషించి మంచి గుర్తింపు పొందాడు. ఈ ఏడాది మే 1 న సంజయ్ దత్(Sanjay Dutt) నటించిన కామెడీ హర్రర్ ఫిలిం 'ది భూట్ని'లో 'నాసిర్' గా మెప్పించిన ఆసిఫ్, ప్రస్తుతం 'ఇష్క్ చాకలాస్', 'సెక్షన్ 108 ' 'నూరాని చెహ్రా' వంటి విభిన్న చిత్రాల్లో నటిస్తున్నాడు. హార్ట్ అటాక్ కి గురవ్వడంవలనే ఆసిఫ్ ముంబై(Mumbai)లోని ఒక ప్రవైట్ హాస్పిటల్ లో చేరినట్టుగా తెలుస్తుంది.