English | Telugu

రెట్టింపు నవ్వులు సర్దార్ కే ప్రమాదం కలిగించవచ్చు

దర్శక ధీరుడు 'రాజమౌళి'(SS Rajamouli)దర్శకత్వంలో సునీల్, సలోని జంటగా తెరకెక్కిన యాక్షన్ కామెడీ చిత్రం 'మర్యాద రామన్'(Maryadaramanna). 2010 లో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని నమోదు చేసింది. ఈ మూవీ 2012 లో హిందీలో అజయ్ దేవగన్(Ajay devgn)సంజయ్ దత్, సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రల్లో 'సన్ ఆఫ్ సర్దార్' గా తెరకెక్కి అక్కడ కూడా ఘన విజయాన్ని అందుకుంది. మూవీలో జస్సి క్యారక్టర్ ని పోషించిన అజయ్ దేవగన్ తో పాటు మిగతా వాళ్ళందరు తమదైన కామెడీ టైమింగ్ తో నవ్వులు పూయించారు. మళ్ళీ పదమూడు సంవత్సరాల తర్వాత సన్ ఆఫ్ సర్దార్ కి సీక్వెల్ గా 'సన్ ఆఫ్ సర్దార్ 2 ' తెరకెక్కగా ఈ నెల 25 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

అజయ్ దేవగన్, మృణాల్ ఠాకూర్(Mrunalthakur)రవికిషన్, చుంకి పాండే, సంజయ్ మిశ్రా ప్రధాన పాత్రలు పోషించారు. రీసెంట్ గా ఈ మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ అయ్యింది. సదరు ట్రైలర్ లో' జస్సీ తిరిగి వచ్చాడు. ఈ సారి రెట్టింపు వినోదం ఖాయం. కానీ ఇందులోని నవ్వులు, గందరగోళం సర్దార్ కే ప్రమాదం కలిగించవచ్చు. సర్దార్ ఎవరికైనా అండగా నిలిస్తే వారి వైపు ఎవరు తొంగి కూడా చూడరు. సర్దార్ మనకి సన్నీడియోల్ నటించిన బోర్డర్ మూవీ కథ చెప్తున్నాడనే లాంటి సంభాషణలతో మూవీ ఎలా ఉండబోతుందో చెప్పింది. ఈ సందర్భంగా వచ్చిన సన్నివేశాలు కూడా నవ్వులు పూయించడంతో పాటు కథపై కూడా అందరిలో ఆసక్తిని కలగచేస్తుంది.

జియో స్టూడియోతో కలిసి అజయ్ దేవగన్ నిర్మించిన 'సన్ ఆఫ్ సర్దార్ 2 'కి విజయ్ కుమార్ అరోరా(Vijaykumar Arora)దర్శకత్వం వహించాడు. అజయ్ దేవగన్ ఇటీవల తెలంగాణ(Telangana)ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy)ని కలిసి హైదరాబాద్ లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన స్టూడియో నిర్మాణానికి అవకాశం ఇవ్వాలని కోరిన విషయం తెలిసిందే.