English | Telugu

మీరు ప్రధాని అవుతారా అని అడిగితే కంగనా రనౌత్ ఏం చెప్పిందో తెలుసా!

ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ 'కంగనారనౌత్'(Kangana Ranaut)ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ లోని 'మండి'(Mandi)లోక్ సభ స్థానం నుంచి 'భారతీయ జనతాపార్టీ' తరుపున ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కంగనా మీడియా అడిగిన పలు ప్రశ్నలకి స్పందిస్తు 'రాజకీయ జీవితం నా నేపధ్యం కాకపోవటం వలన ఈ రంగాన్ని ఆస్వాదించలేకపోతున్నాను. నేను 'ఎంపి' ని అయితే ప్రజలు నా వద్దకు రోడ్లు బాగోలేవని, పంచాయితీ స్థాయి సమస్యలు తీసుకొస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ స్థాయి సమస్య అని చెప్పినా వినకుండా, మీ సొంత డబ్బుతో మా సమస్యని పరిష్కరించండని అంటున్నారు.

నేను జీవించిన జీవితం దృష్ట్యా సామాజిక సేవ నా నేపధ్యం కాదు. పూర్తిగా ప్రజాసేవకి అంకితమయ్యే మనస్తత్వం కూడా కాదు. లగ్జరీ సదుపాయాలని అనుభవించాలనే స్వార్ధం ఉంది. దేవుడు నన్ను ఏ ఉదేశ్యంతో రాజకీయ రంగంలోకి పంపించాడో గాని, నా జీవితాన్ని మాత్రం త్యాగం చేసే ఉద్దేశ్యం లేదు. ఒకప్పుడు నాస్తికురాల్ని, ఆ తర్వాత కొన్ని సంఘటనల వల్ల ఆధ్యాత్మత వైపు ప్రయాణం చేస్తున్నాను. భారత ప్రధాని పని చేసే అంత సమర్థత నాకు లేదు. అవ్వాలనే కోరిక కూడా లేదు. దేవుడు నాకు ఆ అవకాశం ఇవ్వడని కంగనా చెప్పుకొచ్చింది.

సినిమాల పరంగా చూసుకుంటే ఈ ఏడాది జనవరిలో స్వీయ దర్శకత్వంలో 'ఇందిరాగాంధీ'(Indira Gandhi)ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సంభవించిన ఎమర్జెన్సీ పరిస్థితుల నేపథ్యంలో తెరకెక్కిన 'ఎమర్జెన్సీ'తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 2006 లో గ్యాంగ్ స్టర్ అనే రొమాంటిక్ థ్రిల్లర్ తో హిందీ చిత్ర రంగ ప్రవేశం చేసిన కంగనా ఇప్పటి వరకు సుమారు నలభై కి పైగా చిత్రాల్లో చేసింది. ప్రభాస్(Prabhas),పూరి జగన్నాధ్(Puri Jagannadh)కాంబినేషన్ లో 2009 లో వచ్చిన ఏక్ నిరంజన్ అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకులని పలకరించిన విషయం తెలిసిందే.