English | Telugu

హీరో రవితేజ ఇంట తీవ్ర విషాదం

హీరో రవితేజ ఇంట తీవ్ర విషాదం

 

సినీ పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. కోట శ్రీనివాస రావు, బి. సరోజాదేవి మరణ వార్తలు మరువకముందే.. ప్రముఖ కథానాయకుడు రవితేజ ఇంట విషాదం చోటు చేసుకుంది. రవితేజ తండ్రి రాజగోపాల్ రాజు(90) కన్నుమూశారు. హైదరాబాద్ లోని రవితేజ నివాసంలో మంగళవారం రాత్రి ఆయన తుదిశ్వాస విడిచారు.

 

రాజగోపాల్ రాజుకు ముగ్గురు కుమారులు కాగా.. రవితేజ పెద్ద కుమారుడు. మరో ఇద్దరు కుమారులు రఘు, భరత్ కూడా నటులే. అయితే 2017 లో జరిగిన రోడ్డు ప్రమాదంలో భరత్ మరణించారు.