English | Telugu
తాత పాత్రలో అల్లు అర్జున్!
Updated : Jul 12, 2025
2003లో వచ్చిన గంగోత్రి సినిమాతో హీరోగా పరిచయమైన అల్లు అర్జున్.. ఈ 22 ఏళ్లలో 21 సినిమాలు చేశాడు. అందులో ఒక్క సినిమాలో కూడా డ్యూయల్ రోల్ చేయలేదు. అలాంటిది తన నెక్స్ట్ మూవీలో ఏకంగా నాలుగు పాత్రలు చేయనున్నాడనే వార్త హాట్ టాపిక్ గా మారింది.
అల్లు అర్జున్ తన 22వ సినిమాని అట్లీ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ లో బన్నీ నాలుగు విభిన్న పాత్రలలో కనిపించనున్నాడని ప్రచారం జరుగుతోంది. తాత, తండ్రి, ఇద్దరు కుమారుల పాత్రలలో అల్లు అర్జున్ సందడి చేయనున్నాడని సమాచారం. ఇంతవరకు ద్విపాత్రాభినయమే చేయని బన్నీ.. ఇప్పుడు అట్లీ సినిమాలో ఏకంగా నాలుగు క్యారెక్టర్స్ చేస్తున్నాడనే న్యూస్ ఆసక్తికరంగా మారింది. మరి ఇందులో నిజమెంతో తెలియాల్సి ఉంది.
కాగా, ఈ సినిమాలో ఐదుగురు హీరోయిన్లు నటిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. దీపికా పదుకొనే, రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్, భాగ్యశ్రీ బోర్సే పేర్లు లాక్ అయినట్లు సమాచారం. అల్లు అర్జున్ నాలుగు పాత్రలు చేయనుండటం, ఐదుగురు హీరోయిన్లు ఉండటం చూస్తుంటే.. అట్లీ ఏం ప్లాన్ చేశాడా అనే ఆసక్తి కలుగుతోంది.
