English | Telugu

శ్రీరాముని క్యారక్టర్ కి సంబంధించిన సవాలు అర్ధం ఇదే.. భక్తులు,ప్రేక్షకుల రియాక్షన్ 

దర్శకుడు అనుకున్న కథ ప్రేక్షకుల మస్తిష్కాల్లోకి వెళ్లాలంటే 'మ్యూజిక్ అండ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సపోర్ట్ చాలా ముఖ్యం. అందులోను పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కే యాక్షన్, అడ్వెంచర్, ఫాంటసీ, థ్రిల్లర్ సబ్జెట్స్ అయితే, ఆ సంగీత దర్శకుడు ఇచ్చే మ్యూజిక్, బిజీఎం పైనే, చిత్ర విజయం స్థాయి ఆధారపడి ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు. ఆ మాట అక్షరాల నిజమని   మరోసారి నిరూపించిన సంగీత దర్శకుడు 'గౌరహరి'(Gowra Hari). అందుకు తగ్గట్టే  'మిరాయ్'(Mirai)కి 'గౌరహరి' ఎంతో ప్లస్ అయ్యాడనే మాటలు ప్రేక్షకుల నుంచి వస్తున్నాయి.