English | Telugu

కల్కి పార్ట్ 2 నుంచి తొలగించడంపై దీపికా రియాక్షన్ ఇదే

ఎన్నో విభిన్నమైన క్యారెక్టర్స్ ని పోషించిన నటిగా, భారతీయ సినీ రంగంలో 'దీపికా పదుకునే'(Deepika Padukune)కి సుదీర్ఘమైన అనుభవం ఉంది. 2006 లో కన్నడ చిత్రం 'ఐశ్వర్య'తో తన సినీ జర్నీని ప్రారంభించి, ఎవరి అండదండలు లేకుండా స్వయంకృషితో 'నెంబర్ వన్ హీరోయిన్' టాగ్ లైన్ ని సైతం పొందింది. సినిమా విజయం తాలూకు రేంజ్ ని పెంచగల సమర్థురాలు కూడా. కారణాలు తెలియదు కానీ, కల్కి 2898 ad పార్ట్ 2 నుంచి దీపికాని తొలగిస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్నీ అధికారకంగా ధ్రువీకరిస్తూ  'జాగ్ర‌త్త‌గా ప‌రిశీలించాక మేం ఎవ‌రి దారిన వారు వెళ్లాల‌నుకున్నాం.