English | Telugu

డ్యూడ్ కి షాక్ ఇచ్చిన ఇళయరాజా 

సంగీత ప్రపంచంలో 'ఇసైజ్ఞాని' గా పిలుచుకునే 'ఇళయరాజా'(Ilaiyaraaja)సంగీతానికి ఉన్నశక్తి గురించి ఇప్పుడు కొత్తగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఆయన స్వరపరిచిన పాట నిత్యం ఏదో ఒక చోట మారుమోగిపోతూనే ఉంటుంది. నేటికీ విడుదలవుతున్న చాలా కొత్త చిత్రాల్లో కూడా ఇళయరాజా పాటలని ఉపయోగించుకుంటున్నారు. కాకపోతే ఈ విషయంలో తన అనుమతి లేకుండా తన పాటలని ఉపయోగించుకుంటున్నారని ఇళయరాజా కోర్ట్ ద్వారా సదరు చిత్రాల మేకర్స్ కి నోటీసులు పంపిస్తునే ఉన్నాడు.


ఈ కోవలోనే ఇప్పుడు థియేటర్స్ లో రన్ అవుతున్న డ్యూడ్ మూవీలో తన అనుమతి లేకుండా పాటలని ఉపయోగించుకున్నారని, కాబట్టి మేకర్స్ పై, సోనీ మ్యూజిక్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోరుతు ఇళయరాజా చెన్నై(chennai)హైకోర్ట్ ని ఆశ్రయించాడు. ఈ విషయంపై కోర్టు స్పందిస్తు ఇళయరాజా న్యాయపరంగా ముందుకెళ్లడానికి అనుమతి ఇచ్చింది. ఈ తీర్పుతో నెక్స్ట్ ఏం జరగబోతుందనే ఆసక్తి అందరిలో ఏర్పడింది

'డ్యూడ్' లో ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan),మమిత బైజు(Mamitha Baiju)నటించగా ఈ నెల 17 న తమిళంతో పాటు తెలుగులోను భారీ థియేటర్స్ లో విడుదలైంది. తెలుగులో అగ్ర నిర్మాణ సంస్థగా ఉన్న మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం.ప్రదీప్‌ రంగనాథన్‌, మమితా బైజు పెళ్లికి సంబంధించిన సీన్ వచ్చినప్పుడు 'పుదు నెల్లు పుధు నాతు(Pudhu nellu Pudhu Naathu)అనే తమిళ చిత్రంలోని 'కరుతమచ్చన్'(Karutha Machan)అనే సాంగ్ ని ఉపయోగించడం జరిగింది. ఇళయరాజా సంగీత సారథ్యంలో తెరకెక్కిన ఈ పాటని ఎస్ జానకి ఆలపించగా హీరోయిన్ సుకన్య పై చిత్రీకరించారు. ఇళయరాజానే సాహిత్యాన్ని అందించడం కూడా విశేషం. భారతి రాజా(BharathiRaja)దర్శకుడు కాగా 1991 లో విడుదలైంది.

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.