English | Telugu
సజ్జనార్ తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ భేటీ.. చర్యలు తీసుకుంటామని హామీ
Updated : Oct 22, 2025
మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(Ntr)కి తన అభిమానులు అంటే ఎంతో ప్రాణం. ఈ విషయాన్నీ చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. అభిమానులు కూడా ఎన్టీఆర్ ని తమ ప్రాణానికి ప్రాణంగా భావిస్తారు. ఎన్టీఆర్ నుంచి కొత్త సినిమా రిలీజ్ అయినపుడు పేదలకి ఉపయోగపడే ఎన్నో సేవా కార్యక్రమాలతో పాటు రక్తదానం లాంటివి చేస్తుంటారు. అంతే కాకుండా ఎన్టీఆర్ గురించి ఎవరైనా ఒక్క మాట తప్పుగా మాట్లాడినా సోషల్ మీడియా వేదికగా తమదైన స్టయిల్లో సమాధానాలు ఇస్తుంటారు.
రీసెంట్ గా కొంత మంది సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ఫోటోలని పలు రీతుల్లో మార్ఫింగ్ చేసి అసభ్యకరమైన రీతిలో పోస్టులు చేస్తున్నారు. దీంతో ఎన్టీఆర్ వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతీసేలా ఉన్న ఆ పోస్టులను తక్షణమే తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని ఎన్టీఆర్ అభిమాన సంఘం అధ్యక్షుడు నందిపాటి మురళి హైదరాబాద్ సీపీ సజ్జనార్ (Sajjanar)ని కలిసి పిర్యాదు చేసాడు సజ్జనార్ కూడా అలాంటి వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది.
కెరీర్ పరంగా చూసుకుంటే ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్(Prashanth Neel)దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీలో చేస్తున్నాడు. ఎన్టీఆర్ కెరీర్ లోనే మోస్ట్ ప్రెస్టేజియస్ట్ ప్రాజెక్ట్ గా రూపొందనుండగా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది.